సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ పాలనలో మళ్లీ దేవాలయాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. తాజాగా విశాఖపట్నంలో అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని అధికారులు కూల్చివేశారు. అయితే, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే దేవాలయాన్ని కూల్చివేయడంతో హిందూ ధార్మిక సంఘాలు కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వివరాల ప్రకారం.. చంద్రబాబు పాలనలో దేవాలయాలు కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. విశాఖలో సీతమ్మధారలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం ఉదయం అధికారులు కూల్చివేశారు. అయితే, కూల్చివేతలకు సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దేవాలయం కూల్చివేతపై హిందూ ధార్మిక సంఘాలు.. కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్బంగా హిందూ ధర్మిక సంఘం స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో హిందువులు బతకలేని పరిస్థితి నెలకొంది. రాజకీయ కుట్రతోనే హనుమాన్ దేవాలయం కూల్చివేశారు. శ్రీరామనవమిలోగా కూల్చిన దేవాలయాన్ని పున:ప్రతిష్ట చేయాలి. దేవాలయం కూల్చివేత వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. విశాఖలో రాజకీయ నాయకులు ఆక్రమణలను కూల్చివేసే దమ్ముందా? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. టీడీపీ పాలనలో మళ్లీ దేవాలయాలను కూల్చివేయడంపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాన్ని కూల్చివేయడం దారుణం. ఇన్ని రోజులు దేవాలయం ఇక్కడే ఉంది. ఇప్పుడే ఎందుకు కూల్చివేశారు. మా కళ్ల ముందే దేవాలయాన్ని కూల్చివేశారు. మాకు కన్నీళ్లు ఆగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిని కూల్చి వేస్తున్నప్పుడు మేము అడ్డుకునే ప్రయత్నం చేసినా మమ్మల్ని లాగిపడేశారు. కూటమి సర్కార్ నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment