temple demolished
-
పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా?
ఇస్లామాబాద్: శనివారం తెల్లవారు జామున సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి "మరి మాతా" హిందూ దేవాలయాన్ని కూల్చిన 24 గంటలు గడవక ముందే మరో ఆలయంపై పాకిస్తానీ దుండగులు రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. సింధ్ ప్రావిన్సులో కొందరు దుండగులు హిందువులు నివసించే కాష్మోర్ ప్రాంతంలో అక్కడి హిందూ సమాజం నిర్మించుకున్న దేవాలయం పైనా చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్ల మీదా రాకెట్ లాంఛర్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని కాష్మోర్-కందకోట్ ఎస్.ఎస్.పీ ఇర్ఫాన్ సమ్మో తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో స్థానిక హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తామని ఈ సందర్బంగా సమ్మో అభయమిచ్చారు. ఈ దేవాలయంలో బాగ్రి సమాజానికి చెందిన వారంతా ఏడాదికి ఒకసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటామని, ఆలయంపై ఈ విధంగా దాడి చేయడం పిరికి చర్య అని అన్నారు బాగ్రి సమాజానికి చెందిన డాక్టర్ సురేష్. దుండగులు ఫైర్ చేసిన చాలా రాకెట్ లాంచర్లు జనావాసాల వద్ద పడ్డాయని కానీ అవి పేలకపోవవడంతో ప్రాణనష్టం జరగలేదని లేకుంటే మరింత విధ్వంసం జరిగి ఉండేదని ఆయన తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన భారతీయ యువకుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినందుకు ప్రతీకారంగా కాష్మోర్-ఘోట్కీ నదీతీరాన ఉండే కొంతమంది ఆగంతకులు గతంలో హెచ్చరించారు. బహుశా ఇది వారి చర్యే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: బంపరాఫర్.. అద్దెకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లభ్యం.. -
800 ఏళ్ల ఆలయం.. పదేళ్ల క్రితం విప్పదీసి కుప్పపోశారు
సాక్షి, నల్లగొండ: ఫొటోలోని ఈ రాతి శిథిలాలు కాకతీయ గణపతిదేవ చక్రవర్తి హయాంలో 13వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ పచ్చల పార్వతీ సోమేశ్వర ఆలయానివి. నల్లగొండ జిల్లా సూర్యాపేట–నకిరేకల్ రోడ్డు వెడల్పులో భాగంగా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామంలోని ఈ ఆలయాన్ని మరోచోట పునర్నిర్మించేందుకు ఇలా విప్పదీసి కుప్పగా పోశారు. పదేళ్లుగా పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో రాళ్లపై వేసిన వరస సంఖ్యలు కూడా చెరిగిపోయాయి. ఇప్పుడు వాటి క్రమపద్ధతి తెలుసుకోవటం కూడా కష్టమే. శుక్రవారం వాటిని ప్రముఖ స్తపతి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి.. గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. వెంటనే ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరారు. -
తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం
తాతల ఆస్తి తనకే చెందుతుందంటూ ఓ వ్యక్తి దేవాలయ దుకాణ సముదాయాన్ని అర్ధరాత్రి తర్వాత జేసీబీలతో కూలి్చవేయించాడు. అడ్డుకోబోయిన వారిని బెదిరించడమే కాకుండా, వారించబోయిన పోలీసులనూ సెక్షన్ల పేరుతో బెదరగొట్టి.. తన చర్యను సమర్థించుకుంటూ ఫేస్బుక్ లేవ్ పెట్టి వీరంగం సృష్టించాడు. సాక్షి,ధర్మవరం: పట్టణ నడిబొడ్డున గల పాండురంగస్వామి దేవాలయ భూమిని తన తాతలు దానంగా ఇచ్చారని, అందులో భవన సముదాయానికి సంబంధించిన బాడుగలు తనకే చెల్లించాలని మేడా లోకేష్ అనే వ్యక్తి కొంతకాలంగా దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో గొడవపడుతూ వస్తున్నాడు. అయితే ఆ భూమికి, మేడా లోకేష్‌కు ఎటువంటి సంబంధం లేదని, అన్ని కోర్టులూ ఆ స్థలం పాండరంగ స్వామి దేవాలయానికే చెందుతుందని తీర్పులు ఇచ్చాయి. లోకేష్ మాత్రం తనకు పై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని కొంతకాలంగా ఎండోమెంట్ అధికారులతో అడ్డగోలుగా వాదనకు దిగుతూ, దుకాణదారులను ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం, భవన సముదాయం ఆస్తి తనకే చెందుతుందంటూ ఫ్లెక్సీలు కట్టడం చేస్తున్నాడు. దీనిపై గతంలోనే అతడిపై కేసులు నమోదయ్యాయి. కాగా రెండు మూడు రోజులుగా పాండురంగస్వామి గుడి స్థలం తమదేనని, తాను ఫిబ్రవరి 29 మధ్యాహ్నం 3.30 గంటలకు స్వాధీనం చేసుకుంటానని, ఎవరైనా అడ్డుకుంటే లాలోని సెక్షన్లతో కోర్టుకు లాగుతానని బెదిరిస్తూ ఫేస్బుక్లో పోస్టింగ్‌లు పెట్టాడు. దీంతో ఎండోమెంట్ అధికారులు సదరు మేడా లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నాడని, ఆ భూమి దేవదాయ శాఖకే చెందుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మేడా లోకేష్ ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో 15 మందితో కలిసి జేసీబీ తీసుకువచ్చి ఆ భవన సముదాయాన్ని కూలి్చవేయించాడు. ఏకంగా తన ఫేస్బుక్లో లైవ్‌పెట్టి తాను చేసిన ఘనకార్యాన్ని ప్రసారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అర్థరాత్రి ఏం పనయ్యా ఇది అని అడిగితే ‘తనకు కోర్టు తీర్పు ఇచ్చింది.. ఈ ఆస్తి నాది.. ఏమైనా చేసుకుంటా’నంటూ ఎదురుదాడికి దిగాడు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకోబోతే వారిని సైతం సెక్షన్లపేరుతో బెదిరింపులకు గురిచేశాడు. చివరకు పోలీసులు జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ధ్వంసరచనను ఆపివేయించారు. దాదాపు ఆరు దుకాణాలు ధ్వంసం కాగా, అందులో బాడుగకు ఉంటున్న వారికి రూ.25 లక్షల నష్టం వాటిల్లింది. దేవదాయ శాఖ అధికారులేమంటున్నారంటే... విషయం తెలుసుకున్న దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషర్ ఎం.రామాంజనేయులు, కార్యనిర్వాహక అధికారి బాబు, ఈఓలు సుబ్రమణ్యం, నాగేంద్రుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ దేవాలయానికి శేషగిరిరావు అనే వ్యక్తి 1947లో భూమిని దానం చేశారని తెలిపారు. ఆ భూమిలో మేడా లోకేష్ తాత గుర్రప్ప భక్తులు ఇచ్చిన చందాలతో సత్రం కట్టించాడన్నారు. అయితే ఆ సత్రం తనకే చెందుతుందని 1987లో లోకేష్ కోర్టులో కేసు వేయడంతో 1993లోనే ధర్మవరం కోర్టు దాన్ని కొట్టేసిందన్నారు. ఆ తరువాత మేడా లోకేష్ తల్లి క్రిష్ణవేణమ్మ 2011లో పెనుకొండ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేస్తే 2013లో ఆ కోర్టు కూడా కొట్టివేసిందన్నారు. తిరిగి 2016లో హిందూపురం కోర్టులో కేసు వేస్తే అక్కడ కూడా దేవదాయశాఖకే అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయితే మేడా క్రిష్ణవేణమ్మ కుమారుడైన మేడా లోకేష్ సదరు ఆస్తి తనకే చెందుతుందని, మార్చి ఒకటో తేదిలోపు స్వా«దీనం చేయాలని, దుకాణంలో బాడుగకు ఉంటున్న వారందరూ ఖాళీ చేయాలని పోస్టర్లు అతికించాడన్నారు. తాము ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, రాత్రికి రాత్రే ఇంత దారుణానికి పాల్పడటం దారుణమన్నారు. నిందితులు అరెస్ట్ పాండురంగస్వామి దేవాలయ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన మేడా లోకే‹Ùతోపాటు మరో ఇద్దరు నిందితులను ధర్మవరం పట్టణ పోలీసులు ఆరెస్ట్ చేశారు. అనంతరం పట్టణ సీఐ కరుణాకర్, ఎస్ఐ హర్ష విలేకర్లతో మాట్లాడుతూ సదరు మేడా లోకే‹Ùకు ఏ కోర్టులోనూ తీర్పు అనుకూలంగా రాలేదన్నారు. దీంతో అతను సంయమనం కోల్పోయి ఇంత దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. పాండురంగ స్వామి దేవాలయ ఈఓ సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు చెప్పారు. -
నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి : శివస్వామి
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ శైవక్షేత్రంపై దాడులు చేస్తున్నారు శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి విజయవాడ : ప్రభుత్వం నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. దేవాలయాల కూల్చివేతను నిరసిస్తూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యాన విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలేనిరాహారదీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పది రోజులుగా శైవక్షేత్రంపై దాడులుచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తాను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటూ శైవక్షేత్రానికి రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని చెప్పారు. అధికారం ఉందికదా అని ఏం చేసినా ఫర్వాలేదని ఎమ్మెల్యే విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన హిందూ ధర్మపరిరక్షణకు వెనుకడుగు వేసిది లేదని తేల్చిచెప్పారు. నెలరోజులు గడిచినా దేవాలయాల కూల్చివేతపై మఠాధిపతులు, పీఠాధిపతులకు మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వానికి మరో రెండు రోజులు గడువిస్తున్నామని, ఈలోగా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని శివస్వామి స్పష్టంచేశారు. శనివారం నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పుష్కరాలకు ఆధ్యాత్మిక సేవల సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. రిలేనిరాహారదీక్షలో ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు పి.వి.స్వామి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
'ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయింది'
కాకినాడ : కృష్ణ పుష్కరాల పనులు చివరి దశలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో ఈ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గురువారం కాకినాడలో పి.మాణిక్యాలరావు మాట్లాడుతూ... విజయవాడ నగరంలో ఆలయాల కూల్చివేతలో అధికారుల అత్యుత్సాహంతో పోరపాటు జరిగిన మాట వాస్తవమే అని ఆయన ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని సవరించుకుని కమిటీ వేసిన విషయాన్ని మాణిక్యాలరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఘటనపై మరోసారి మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని చెప్పారు. ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయిందని మాణిక్యాలరావు తెలిపారు. -
'కసి’నేని
ఎంపీ కేశినేని శ్రీనివాస్ అత్యుత్సాహం అడ్డగోలుగా దేవాలయాలు కూల్చివేత ప్రశ్నించే వారిపై ఎదురుదాడి, బెదిరింపులు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ పుష్కర పనులను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచిస్తే.. యాక్షన్‌లోకి దిగాల్సిన ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఓవరాక్షన్ చేశారు. అంతా సవ్యంగా నిర్వహిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. భక్తుల మనోభావాలను కాలరాస్తూ అభివృద్ధి ముసుగులో ఆలయాల కూల్చివేతతో ఆయన చెలరేగిపోయారు. అడ్డుకున్న వారిని కేసుల పేరిట బెదిరించారు. అరే ఎవర్రా... ఒరేయ్ సీఐ వీళందర్నీ లాగేయండి.. మీ ఓట్లు మాకు అక్కర్లేదు.. నేను ఇలాగే చేస్తాను.. ఎవరు అడ్డువస్తారో చూస్తాను... ఎక్కువ మాట్లాడితే జైలులో పెట్టిస్తాను... గోశాలను అడ్డు పెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటారా...! లల్లూ ప్రసాద్ యాదవ్‌లాగా గడ్డి తినాలనుకుంటుంటే కుదరదు... గోశాలను తొలగించి తీరతాం.... సాక్షి, విజయవాడ : ఆలయాలను కూల్చివేయొద్దని కోరడానికి వెళ్లిన నగర ప్రముఖులు, గోశాల ప్రతినిధులను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ హుందా మరిచి మాట్లాడిన మాటలు ఇవీ... గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో పుష్కరాల పేరుతో 40 ఆలయాలను కూల్చివేసి, మరో 10 ఆలయాలను విజయవాడ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం వెనుక ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బాబు.ఎ చూపిన అత్యుత్సాహంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ఆలయాలను అర్ధరాత్రి వేళ పడగొట్టించమే కాకుండా.. కూల్చవద్దని కోరడానికి వెళ్లిన వారిని చులకన చేస్తూ గడ్డి తినడానికి ప్రయత్నిస్తున్నారంటూ కేశినేని నాని ఎద్దేవా చేయడంపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పెత్తనం ఇచ్చారని... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంద్రకీలాద్రిని సందర్శించిన సమయంలో దుర్గగుడి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాలని ఎంపీ కేశినేనికి సూచించారు. దీంతో ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించే బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్లు, రోడ్లు విస్తరణకు అడ్డుగా ఉన్నాయంటూ ఎంపీ కేశినేని సూచనలతో కలెక్టర్ బాబు.ఎ దగ్గరుండి ఆలయాలను కూల్చివేయించారు. ముఖ్యంగా నదీతీరంలోని సీతమ్మవారిపాదాలు, శనీశ్వరాలయం, భూగర్భ వినాయకుడి గుడి, ఆంజనేయస్వామి ఆలయం, సాయిబాబా గుడిని ధ్వంసం చేయించారు. అర్ధరాత్రి వేళ గోశాల్లోకి పొక్లెయిన్లను పంపించి అక్కడి కృష్ణమందిరాన్ని, గోశాల భవనాలను ధ్వంసం చేయించారు. తొలుత ఒకటి రెండు చిన్నచిన్న ఆలయాలను కూల్చివేసినప్పుడు ప్రజల నుంచి అంతగా ప్రతిఘటన ఎదురవకపోవడంతో ఎంపీ కేశినేని మరింత రెచ్చిపోయి ముఖ్య ఆలయాలను కూల్చివేయించారని టీడీడీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గోశాలను కూల్చిన తరువాత వినాయకుడు గుడి కూల్చివేద్దామని భావించేసమయంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తంకావడంతో వెనక్కు తగ్గారు. చివరికి వినాయకుడి గుడిని కూల్చబోమంటూ కలెక్టర్ చేత వివరణ ఇప్పించారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తొలి నుంచీ వివాదాస్పదుడే! ఎంపీ కేశినేని నానిది తొలి నుంచి దుందుడుకు స్వభావమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. తన కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని, ఖాళీ చేయమని కోరిన దాని యజమానితో విభేదించి పోలీసుల సహాయంతో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. చివరకు ఇది వివాదాస్పదం కావడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఏకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆలయాలను కూల్చివేయడం... అడిగిన వారిపై కేసులు పెట్టిస్తామని బెదిరించడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పర్యవసానంగా ఇప్పుడు ఎంపీ కేశినేని, కలెక్టర్ బాబు.ఎ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నగర వాసులు ముక్త కంఠంతో కోరుతున్నారు. వీరి తీరును గర్హిస్తూ ముద్రించిన కరపత్రాలను నగరంలో జోరుగా పంపిణీచేస్తున్నారు. రాబోయే రోజల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలని పలు హిందూ సంఘాలు నిర్ణయించుకున్నాయని సమాచారం. మార్వాడీలపైన అసహనం దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత విషయమై మాట్లాడటానికి ఎంపీ కార్యాలయానికి వెళ్లిన మార్వాడీ వ్యాపారులకు కేశినేని నాని నుంచి చేదు అనుభవమే ఎదురైంది. ‘ఎంపీ గోకరాజు గంగరాజు వద్దకు వెళ్తున్నారు.. ఆయన మీకు న్యాయం చేస్తారా?’ అంటూ నాని ఎదురు దాడి చేయడంతో ఏమి చేయాలో తెలియక మార్వాడీ ముఖ్యులంతా మౌనంగా వెనుదిరిగారు. కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా ఎంపీ అసహనం ప్రదర్శించడం మార్వాడీ ల్లో చర్చనీయాశమైంది. -
కూల్చివేతల వెనుక కుట్ర
వ్యాపార కేంద్రంగా నదీతీరం! రివర్‌ఫ్రంట్ కోసం విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసే యోచన నేతల వ్యూహంతోనే ఆలయాల ధ్వంసం ! పుష్కరాలను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా తొలగింపు విజయవాడ : విజయవాడ నగరంలో ఆలయాల అడ్డగోలు కూల్చివేత వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు తెలుస్తోంది. విదేశీ కంపెనీలకు నదీతీర ప్రాంతాన్ని ధారాదత్తం చేసి వ్యాపార కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. విలాసవంతమైన రివర్ ఫ్రంట్‌గా ఈ ప్రాంతాన్ని మార్చాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. నిత్యం వందలాదిమంది భక్తులు దర్శించుకునే ఆలయాలను రివర్‌ఫ్రంట్ కోసం కూల్చివేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని భావించిన నాయకులు ముందస్తు వ్యూహంగా పుష్కరాల కోసం అభివృద్ధి పేరుతో తొలగించే కార్యక్రమం చేపట్టారని ప్రచారం జరుగుతోంది. సీఎం ఇంటి వైపు సాధ్యంకాక వాస్తవంగా కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన గుంటూరు జిల్లా వైపు నదీతీరం అద్భుతంగా ఉంటుంది. అక్కడి ఆక్రమణలన్నింటినీ తొలగించి చక్కటి రివర్‌ఫ్రంట్‌గా మార్చుతామని గతంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అదే ప్రదేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని ఏర్పరుచుకోవటం, అక్కడి తీరప్రాంతమంతా బడాబాబుల గుప్పెట్లో ఉండటంతో ప్రస్తుతం అటువైపు రివర్ ఫ్రంట్ ఆలోచనకు స్వస్తి పలికినట్లు సమాచారం. తాజాగా ప్రకాశం బ్యారేజీ దిగువన రివర్‌ఫ్రంట్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిసింది. బ్యారేజీ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వద్ద రైల్వే బ్రిడ్జి వరకు సుమారు 800 మీటర్లు ఉంటుందని, 35 నుంచి 40 అడుగుల వెడల్పు స్థలం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానదిలో ఏడాదంతా నీరు ఉండేందుకు ఒక చెక్‌డ్యామ్‌ను నిర్మించి, అందులో సుమారు ఆరేడు అడుగుల నీరు సంవత్సరమంతా ఉండే విధంగా మార్చితే అక్కడ రివర్ ఫ్రంట్, నదిలో బోటింగ్ ఏర్పాటుకు అనేక విదేశీ సంస్థలు ముందుకు వస్తాయని నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే పుష్కరాలను అడ్డుపెట్టుకుని సాయిబాబా గుడి, శనైశ్చర ఆలయం, భూగర్భ వినాయకుడు తదితర దేవాలయాల ధ్వంసానికి సిద్ధమయ్యారు.