'ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయింది' | krishna pushkaralu work completed within four to five days | Sakshi
Sakshi News home page

'ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయింది'

Published Thu, Jul 14 2016 8:37 PM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM

krishna pushkaralu work completed within four to five days

కాకినాడ : కృష్ణ పుష్కరాల పనులు చివరి దశలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో ఈ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గురువారం కాకినాడలో పి.మాణిక్యాలరావు మాట్లాడుతూ... విజయవాడ నగరంలో ఆలయాల కూల్చివేతలో అధికారుల అత్యుత్సాహంతో పోరపాటు జరిగిన మాట వాస్తవమే అని ఆయన ఒప్పుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దీనిని సవరించుకుని కమిటీ వేసిన విషయాన్ని మాణిక్యాలరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఘటనపై మరోసారి మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని చెప్పారు. ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయిందని మాణిక్యాలరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement