Krishna pushkaralu
-
‘పుష్కర’ విధులతో గొప్ప అనుభూతి
సమష్టి కృషితో కృష్ణాపుష్కరాలు విజయవంతం కలెక్టర్ టీకే శ్రీదేవి మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల విధులు నిర్వహించడం గొప్ప అనుభూతి అని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. పుష్కరాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా మంగళవారం స్థానిక అన్నపూర్ణ గార్డెన్స్‌లో ఆర్డబ్ల్యూఎస్ శాఖ అభినందనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను స్వయంగా ఏర్పాట్లు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసిందని, మన జిల్లాలోనే సీఎం కేసీఆర్ పుణ్యస్నానం చేయడం సంతోషకరమన్నారు. సమష్టి కృషి వల్ల పుష్కరాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కరఘాట్లలో తాగునీటి వసతి, పారిశుద్ధ్య పనుల్లో భాగంగా మరుగుదొడ్ల ఏర్పాట్లు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారని అభినందించారు. ఎక్కడ అపశృతి జరగకుండా పుష్కరాలను నిర్వహించినట్లు చెప్పారు. గ్రామస్థాయి అధికారి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారని కొనియాడారు. పుష్కరాల విధులు తన సర్వీస్‌లో గొప్పగా నిలిచిపోతాయని చెప్పారు. జిల్లాలో కోటి 86 లక్షల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. జిల్లాలోని ప్రతిఘాట్‌ను అందంగా తీర్చిదిద్దామని, ఎక్కడ ఎలాంటి చిన్న తప్పు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు. అనంతరం పుష్కరవిధుల్లో పాల్గొన్న అధికారులకు ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పద్మనాభరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పొగడ్తల రాజసూయం
అక్షర తూణీరం అడవి రాముడు సినిమా విజయవంతమైందంటే అర్థం ఉంది. ‘‘పుష్కరాలు విజయవంతం’’ అవడమంటే ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. అసుర సంధ్యవేళ మహా సంకల్ప దీక్ష చెప్పించడం ఒక ఫార్సు! ఆనాడు ధర్మరాజు రాజ సూయం చేశాడు. అది మహా భారతంలో ఒక సువర్ణ అధ్యాయం. ఆ యజ్ఞం చేయ డానికి గొప్ప శక్తి సామర్థ్యాలు కావాలి. పుష్కలంగా నిధులు కావాలి. అర్జునుడు లోకం మీదపడి, రాజుల్ని గెలిచి ధనం దండుకువచ్చాడు. అప్పట్నించీ ‘ధనంజయుడు’ అనే కీర్తినామం ధరించాడు. ఆ సందర్భంలోనే మయుడు ఒక మహత్తరమైన సభా మండపాన్ని నిర్మించి పాండవులకు కానుకగా సమర్పించాడు. రాజ సూయానికి సుయోధనుడు కూడా మంచిమనసుతోనే వచ్చాడు. ఆయనను ఖజానావద్ద కూర్చోబెట్టారు. రారాజు చేతిలో పరుసవేది ఉంది. అంటే ఆ చేతులతో ధనధాన్యాలను తీస్తుంటే, ఎన్నితీసినా అవి అడు గంటవు. గల్లాపెట్టె అక్షయపాత్రగా నిలుస్తుంది. రాజ సూయం వెనకాల సచివుడు సారథి శ్రీకృష్ణుడున్నాడు కనుక కిటుకులు చెప్పి ముందుకు నడిపించాడు. అత్యంత శోభాయమానమైన మయసభను సుయో ధనునికి విడిదిగా ఇచ్చారు. మయసభ రారాజుకి ‘అయోమయ సభ’ అయింది. ఆపైన పాంచాలి పరిహ సించుటయా! మయసభలోనే కురుక్షేత్ర మహా సంగ్రా మానికి బీజం పడింది. శ్రీకృష్ణుడిని అగ్రపూజకు ఎంపిక చేశారు. కొందరు హర్షించి ఊరుకున్నారు. శిశుపాలుడు మాత్రం సభాముఖంగా రెచ్చిపోయాడు. కృష్ణునిలో పర మాత్ముని పక్కనపెట్టి, ఉతికి ఆరేశాడు. నిండుసభలో సుదర్శనానికి శిశుపాలుడు బలైపోయాడు. నలుగురు సోదరులు నాలుగు వేదాలై నిలవగా, ధర్మజుడు యజ్ఞ కుండమై భాసిల్లాడని వ్యాసమహర్షి అభివర్ణించాడు. రాజసూయంలో పాండవులపై కురిసిన పొగడ్తలు అన్నీ ఇన్నీ కావు. శేష జీవితానికి సరిపడా, పళ్లు పులిసేలా పొగిడేశారు సామంతులు. ఇక్కడ ఇది చాలా అసందర్భమే కానీ, ఎందుకో కృష్ణా పుష్కరాలని ఆరంభం నించి చివరి ఆస్ట్రేలియా బాణసంచా దాకా చూశాక రాజసూయ ఘట్టం గుర్తుకు వచ్చింది. ‘‘పుష్కరాలు విజయవంతం’’ అవడమంటే ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. అడవి రాముడు సినిమా విజయవంతమైందంటే అర్థం ఉంది. అదేదో సంగమం దగ్గర కృష్ణానదిని ఆవహించినంతగా ఉంది. దాదాపు నెల రోజులపాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు డుమ్మా కొట్టాయి. కలెక్టర్ల నుంచి దిగువ దాకా అందరూ ‘‘ఆన్ డ్యూటీ’’గా పుష్కర ఘాట్లలో మునిగి తేలారు. అసుర సంధ్యవేళ మహా సంకల్ప దీక్ష చెప్పించడం ఒక ఫార్సు! ‘‘అటుపోతే బ్యారికేడ్లు, ఇటు చూస్తే నీటి ప్రవాహం – ఈ మధ్యలో త్రిశంకు స్వర్గంలో నిలబడిపోయాం. ఏ దారీ లేక గోదారి అన్నట్టు, అక్కడ దొరికిపోయాం. పైగా పోలీసులు’’ అని ఒక భక్తుడు తడిబట్టలతో బాధపడ్డాడు. ‘‘మొత్తానికి బాబు మాస్ హిస్టీరియా క్రియేట్ చేశాడు’’ అని ఓ హేతువాది నిర్భ యంగా వ్యాఖ్యానించాడు. ‘‘ప్రజాధనం గంగలో పోశారు’’ అంటూ బెజవాడ పాత కమ్యూనిస్టు కష్ట పడ్డాడు. ‘‘ఒక రోజు పెళ్లికి మొహమంతా కాటుక’’ అన్నట్టు ఈ మాత్రం దానికి ఇంత హంగామా అవ సరమా అని చాలామంది అనుకున్నారు. కిలోమీటర్ల పొడవున ఎంతో ఉదారంగా నిర్మించిన స్నానఘట్టాల మెట్లన్నీ తోలు తీసిన ఆవుదూడల్లా కనిపిస్తున్నాయి. పైన పరిచిన టైల్స్‌ని పీక్కుపోవడం ప్రారంభమైంది. ఎంతైనా మన జాతి అసామాన్యమైన జాతి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కృష్ణా పుష్కరాల్లో తెనాలి మువ్వల సవ్వడి
తెనాలి (గుంటూరు): కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తజన కోటిని తన అక్కున చేర్చుకుని ఆశీస్సులిచ్చిన కృష్ణవేణి, తన సామీప్యంలో మువ్వల సవ్వడులకు పులకరించింది. చిన్నారుల్నుంచి, ప్రఖ్యాత నర్తకీమణుల వరకు భక్తి తన్మయత్వంలో చేసిన నృత్య ప్రదర్శనలను కనులారా వీక్షించి, మురిసింది. కృష్ణమ్మ్మ సన్నిధిలో భక్త జనం ఎదుట తమ నాట్యకళాప్రతిభను చాటడాన్ని పలువురు ఔత్సాహిక, వర్ధమాన కళాకారులు తమకది ఒక అద్భుత అవకాశంగా భావిస్తున్నారు. రాష్ట్ర భాషా, సాంస్కతికశాఖ నిర్వహించిన సాంస్కృక ప్రదర్శనల్లో తెనాలికి చెందిన బాల, యువ నర్తకిలు వందమందికి పైగా పాల్గొన్నారంటే అతిశయోక్తి కాదు. ఇదొక అనిర్వచనీయమైన జ్ఞాపకంగా తమ జీవితంలో మిగిలిపోతుందని వారు సంబరపడుతున్నారు. శ్రీలక్ష్మీ నృత్యకళా కేంద్రం నుంచే 50 మంది... కళల కాణాచి తెనాలిలో శ్రీలక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం విద్యార్థులు యాభై మంది వరకు పుష్కరాల సందర్భంగా ప్రదర్శనలివ్వడం విశేషం. కళాకేంద్రం నృత్యగురువు ఎ.వెంకటలక్ష్మి నేతృత్వంలో అష్టలక్ష్మి వైభవం, శంకరశ్రీగిరి, శివాష్టకం, మహిళాసుర మర్ధిని నృత్యరూపకాలను వీరు ప్రదర్శించారు. మరొక ప్రముఖ నత్యకారిణి, నృత్యశిక్షకురాలు బి.రంగనాయకి మంగళగిరి ఎయిమ్స్, పుష్కరనగర్–సీతానగరంలో తన శిష్యులు బి గ్రేడ్ కూచిపూడి నర్తకి బి.కమలాశ్రుతి, మాధవి, సాయిస్వరూప్, సాయిమోహన్లతో కలిసి వినాయక కౌతం, మరకత, శ్రీరంగశబ్దం, దశావతార శబ్దం అంశాలను ప్రదర్శించారు. మళ్లీ మెరిసిన తేజస్వి బాల్యం నుంచి నాట్యంలో విశేష ప్రతిభ ప్రదర్శిస్తున్న ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య, ఈ పర్యాయం ఎం.సురేంద్ర (హైదరాబాద్) శిక్షణలో ప్రత్యేకంగా సాధన చేసిన ‘అర్ధనారీశ్వరం’ అంశాన్ని ప్రదర్శించారు. శ్రీశైలంలోని భ్రమరి కళామందిరం, మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. వర్ధమాన నత్యకారిణి ఆలపాటి ప్రజ్ఞ, కొత్త లక్ష్మీసాయి జిష్ణవి గురువు ఎండీ గిరి నేతృత్వంలో అవనిగడ్డ, పెనుమూడి ఘాట్లు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మంగళగిరి ఆలయం, ఉద్దండరాయునిపాలెం, తాళాయపాలెంలో తరంగం, మహిళాసుర మర్దిని, రామాయణ శబ్దం, బ్రహ్మంజలి ప్రదర్శనలిచ్చారు. శ్రీలాస్య కూచిపూడి నాట్యాలయం గురువు జంధ్యాల వెంకట శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జంధ్యాల శ్రీలాస్య, శ్రీలేఖ సోదరీమణులు దాచేపల్లి మండలం పొందుగల ఘాట్ వద్ద నాట్యప్రదర్శన చేశారు. మరొక చిన్నారి మన్నె టీనాచౌదరి గురువు వేదాంతం దుర్గాభవాని ఆధ్వర్యంలో గోరంట్ల, ఎయిమ్స్, శైవక్షేత్రంలో మంజునాధ, పౌర్ణమి, రామాయణ శబ్దం అంశాల్లో నర్తించింది. వర్ధమాన నర్తకిలు ఎన్.అక్షయ, దివ్యలక్ష్మి, వసంత, నత్యగురువు నిర్మలా రమేష్ శిష్యురాళ్లు మరికొందరు పుష్కర సాంస్కృతిక సంరంభాల్లో తమ నర్తనంతో పాలుపంచుకున్నారు. -
పుష్కర వేతనాల కోసం కార్మికుల నిరసన
విజయవాడ: బెజవాడలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. పుష్కరాల పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వలేదంటూ మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం కార్మికులు నిరసన బాట పట్టారు. కృష్ణా పుష్కరాల్లో రోజుకు 8 గంటలు పని చేయాలని చెప్పి... తర్వాత 16 గంటలు పనిచేయించారని కార్మికులు వాపోయారు. డబ్బులు ఇస్తానని చెప్పిన కాంట్రాక్టర్ కనిపించకుండా పోయాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటలకు రూ.400 ఇస్తామని చెప్పి...16 గంటలు వెట్టిచాకిరీ చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్నారు. వెంటనే తమకు డబ్బులు చెల్లించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కరాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించామని చెబుతున్న బాబు సర్కార్.... కార్మికులకు డబ్బులు చెల్లింపులో జాప్యంపై విపక్షాలు తీరు స్థాయిలో మండిపడుతున్నాయి. -
పుష్కలంగా పుష్కర ఆదాయం..
రైల్వేకు రూ.47 కోట్లు..ఆర్టీసీకి రూ.7 కోట్లు సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు ఆర్టీసీ, రైల్వేలకు కాసులు కురిపించాయి. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పుష్కరాలకు తరలి వెళ్లారు. పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 12 నుంచి 23 వరకు మొత్తం 691 స్పెషల్ సర్వీసులు నడపగా.. రద్దీ దృష్ట్యా 4,871 అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. సుమారు 41 లక్షల మంది రైళ్లలో రాకపోకలు సాగించారు. దీంతో రూ.47 కోట్ల వరకు ఆదాయం లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఇక హైదరాబాద్ నుంచి వివిధ పుష్కరఘాట్లకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ 1,500కుపైగా అదనపు బస్సులు నడిపింది. సుమారు 8 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించినట్లు అధికారుల అంచనా. అదనపు బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రూ.7 కోట్లకుపైగా ఆదాయం లభించినట్లు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ వేణు తెలిపారు. -
పుష్కర స్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలు చివరి రోజు పుష్కరస్నానం కోసం బీచుపల్లికి వెళ్లి, 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. షాద్‌నగర్ మండలం బుర్గుల పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన మూడవత్తు దస్రు (55) మంగళవారం బీచుపల్లిలో పుష్కరస్నానం చేశాడు. సాయంత్రం స్వగ్రామానికి వచ్చేందుకు జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సూచనమేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య దస్తి, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. కుమారుడు రామ్‌జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటిక్యాల ఏఎస్ఐ జిక్కిబాబు పేర్కొన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో వృద్ధుడు.. కొడంగల్ రూరల్(కోస్గి): కోస్గి మండలకేంద్రానికి చెందిన జలంధర్‌రెడ్డి(71)మంగళవారం ఇంటి నుంచి పుష్కరాలకు వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఎర్రవల్లి చౌరస్తాలో దిగి మరో బస్సును ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అక్కడి పోలీసులు కోస్గిలోని జలంధర్‌రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు బుధవారం ఉదయం అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆర్టీసీకి ‘పుష్కర'౦గా ఆదాయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్టీసీ రీజియన్‌కు పుష్కరాల ఆఖరు రోజుల్లో ఆదాయం బాగా సమకూరింది. తొలి వారం రోజుల పాటు ప్రయాణికుల ఆదరణ లేకుండా పోయింది. కృష్ణా పుష్కరాల కోసం ఈ నెల 12 నుంచి విజయవాడకు 924 సర్వీసులను నడిపింది. ఈ బస్సులు మొత్తం 7.30 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి 76 వేల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చాయి. అయితే ఆరంభంలో ప్రయాణికులు అంతగా బస్సుల్లో ప్రయాణించలేదు. దీంతో రోజుకు 80 బస్సుల చొప్పున నడపాలనుకున్న అధికారులు బాగా కుదించారు. బస్సులు పూర్తిగా నిండాకే వాటిని విజయవాడకు పంపేవారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో క్రమేపీ ఈ నెల 19 నుంచి భక్తుల రద్దీ ఎక్కువైంది. దీంతో 19 నుంచి 22 వరకు పెద్ద సంఖ్యలో వీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా ఈ 12 రోజులూ విశాఖ రీజియన్‌కు రూ.2.38 కోట్ల పుష్కర ఆదాయం సమకూరింది. గతంలో కృష్ణా పుష్కరాలకు ఈ రీజియన్ నుంచి 360 బస్సులను నడిపారు. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఘాట్ల వద్దకు ప్రయాణికులను తీసుకెళ్లడం కోసం 220 బస్సులను ఈ రీజియన్ నుంచి పంపారు. సుమారు వెయ్యి మంది కండక్టర్లు, డ్రైవర్లు అక్కడ విధులకు వెళ్లారు. మరో 400 మంది ఇతర సిబ్బంది కూడా పుష్కర సేవల్లో పాల్గొన్నారు. ఈ పుష్కరాల 12 రోజుల పాటు విశాఖ ద్వారకా బస్‌స్టేషన్‌లో 24 గంటలూ సిబ్బంది విధులు సేవలందించారు. పుష్కరాలకు ఆర్టీసీ సేవా దృక్పథంతోనే తప్ప లాభార్జనతో బస్సులను నడపలేదని రీజనల్ మేనేజర్ జి.సుధేష్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. పుష్కర ఆదాయం సంతృప్తికరంగానే ఉందన్నారు. పుష్కరాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. డిపోల వారీగా వారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. -
ఆర్టీసీకి ‘పుష్కర’ంగా ఆదాయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్టీసీ రీజియన్‌కు పుష్కరాల ఆఖరు రోజుల్లో ఆదాయం బాగా సమకూరింది. తొలి వారం రోజుల పాటు ప్రయాణికుల ఆదరణ లేకుండా పోయింది. కృష్ణా పుష్కరాల కోసం ఈ నెల 12 నుంచి విజయవాడకు 924 సర్వీసులను నడిపింది. ఈ బస్సులు మొత్తం 7.30 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి 76 వేల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చాయి. అయితే ఆరంభంలో ప్రయాణికులు అంతగా బస్సుల్లో ప్రయాణించలేదు. దీంతో రోజుకు 80 బస్సుల చొప్పున నడపాలనుకున్న అధికారులు బాగా కుదించారు. బస్సులు పూర్తిగా నిండాకే వాటిని విజయవాడకు పంపేవారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో క్రమేపీ ఈ నెల 19 నుంచి భక్తుల రద్దీ ఎక్కువైంది. దీంతో 19 నుంచి 22 వరకు పెద్ద సంఖ్యలో వీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా ఈ 12 రోజులూ విశాఖ రీజియన్‌కు రూ.2.38 కోట్ల పుష్కర ఆదాయం సమకూరింది. గతంలో కృష్ణా పుష్కరాలకు ఈ రీజియన్ నుంచి 360 బస్సులను నడిపారు. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఘాట్ల వద్దకు ప్రయాణికులను తీసుకెళ్లడం కోసం 220 బస్సులను ఈ రీజియన్ నుంచి పంపారు. సుమారు వెయ్యి మంది కండక్టర్లు, డ్రై వర్లు అక్కడ విధులకు వెళ్లారు. మరో 400 మంది ఇతర సిబ్బంది కూడా పుష్కర సేవల్లో పాల్గొన్నారు. ఈ పుష్కరాల 12 రోజుల పాటు విశాఖ ద్వారకా బస్‌స్టేషన్‌లో 24 గంటలూ సిబ్బంది విధులు సేవలందించారు. పుష్కరాలకు ఆర్టీసీ సేవా దృక్పథంతోనే తప్ప లాభార్జనతో బస్సులను నడపలేదని రీజనల్ మేనేజర్ జి.సుధేష్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. పుష్కర ఆదాయం సంతృప్తికరంగానే ఉందన్నారు. పుష్కరాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. డిపోల వారీగా వారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. -
'పుష్కరాల పేరుతో ఇంతటి నీచమా?'
-
'పుష్కరాల పేరుతో ఇంతటి నీచమా?'
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉద్యోగుల విభజన సమస్యను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వారి సమస్యను పట్టించుకునే తీరికే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా పుష్కరాలు నిర్వహించిన తీరుపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ అపవిత్రం చేశారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలు జరిగినన్ని రోజులు ప్రజలను చంద్రబాబు పట్టి పీడించారని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. 12 రోజులపాటు పుష్కరాలు జరిగాయని, కృష్ణా పరివాహక ప్రాంతం అంతటా పుష్కరాలు జరిగితే ఒక్క విజయవాడలోనే పుష్కరాలు జరిగినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే పుష్కరాలు జరుగుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పుష్కరాలకు 18వందల కోట్లు కేటాయించి నామినేషన్ పద్దతిలో సొంత పార్టీ వారికే పనులు కేటాయించి సగానికిపైగా నిధులు స్వాహా అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల డబ్బుతో పార్టీ ప్రచారం చేసుకున్నారని ఏ ఘాట్ కు వెళ్లినా పచ్చరంగు వేశారని, ఇంత నీచానికి దిగజారుతారా అని అంబటి మండిపడ్డారు. పుష్కరాలకు ముందు శతాబ్దాలు, దశాబ్దాలుగా ఉన్న ఉన్న పవిత్ర దేవాలయాలను ధ్వంసం చేసి మున్సిపాలిటి చెత్తలో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నది గర్భాన్ని చీల్చి ఇసుక మాఫియా సృష్టించింది కూడా చంద్రబాబే అని అన్నారు. కృష్ణా నదిని సర్వనాశనం చేసి పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగాయని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. నిజంగా హైందవ సాంప్రదాయంపై నమ్మకం ఉంటే ఉత్తరీయం వేసుకొని మూడుసార్లు మునిగి పుష్కర స్నానం చేస్తారని, చంద్రబాబు మాత్రం ఏం చక్కా ప్యాంటు, షర్ట్ తో స్నానం చేశారని, ఆయనకు నచ్చితే షూ వేసుకొనే స్నానం చేస్తారు కూడా అని ఎద్దేవా చేశారు. పవిత్ర పుష్కరాలకోసం ప్రజలు వస్తే వారిని వెళ్లనీయకుండా గేట్లు వేసి చంద్రబాబు అనవసర ప్రసంగాలు చేసి వారిని పీడించారని, గేట్లు వేసి మరి ఉపన్యాసం చేశారని అంబటి మండిపడ్డారు. పుష్కరాలకు వచ్చినవారికి ఎవరైనా జీడీపీ రేటు 15శాతం పెంచాలని ప్రమాణం చేయిస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పుష్కరాలు జరిపించకూడదని, పుష్కర ఏర్పాట్లు చూసుకోవాలని హితవు పలికారు. -
'పుష్కరాలు విజయవంతంగా ముగిశాయి'
విశాఖపట్నం: క్రీడలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన పివి సింధు, ఆమె కోచ్ పి.గోపిచంద్‌ను సముచితంగా సత్కరించామని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి 25 వరకు విశాఖపట్నంలో జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. మంగళవారం ముగిసిన కృష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని చెప్పారు. సాంకేతిక అనుసంధానంతో పుష్కరాలు ఘనం నిర్వహించామని గంటా వెల్లడించారు. -
పుష్కర ఘాట్‌లో వింత!
తెలకపల్లి: కృష్ణా పుష్కరాలు చివరిరోజైన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పుష్కరఘాట్‌లో వింత చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన చిన్నారికి పుణ్యస్నానం చేయిస్తుండగా.. ఆమెకు మూడు చేతులు ఉన్నట్లు కనిపించాయి. దీనిని భక్తులు కృష్ణమ్మ మహత్యమేనని చర్చించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు రెడ్డెపాకుల కృష్ణయ్య తన కుటుంబ సభ్యులతో మంగళవారం సోమశిల పుష్కర ఘాట్‌లోకి వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. కృష్ణయ్య తన కూతురు ప్రయాగకు (11నెలలు) ఘాట్‌లో స్నానం చేయిస్తుండగా బయట ఉన్న బంధువులు ఫొటోలు తీశారు. అయితే ఫొటోల్లో పాపకు రెండు చేతుల బదులు మూడు చేతులు కనిపించాయి. ఈ వింతను చూసేందుకు భక్తులు ఆసక్తిచూపారు. -
ఏడాదంతా పుష్కర స్నానం చేయవచ్చు
ముక్త్యాల(జగ్గయ్యపేట):భక్తులు పుష్కర స్నానాలు ఏడాదంతా చేయవచ్చని మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రం పుష్కర ఘాట్‌లో మంగళవారం తెల్లవారు జామున పుష్కర స్నానమాచరించి భక్తులకు హితోపదేశం చేశారు. పుష్కరాలు 12 రోజులు జరుగుతాయని, అయితే భక్తులు స్నానాలు 12 రోజుల్లోనే చేయాలని లేదని, ఏడాదిలోపు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. మూడు కోట్ల మంది దేవతలు నదిలో ఉంటారని అందుకే నది శక్తివంతంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతమంతా కొద్ది రోజుల్లో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్, ఈవో దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలకు వీడ్కోలు
-
ముగిసిన కృష్ణా పుష్కరాలు
-
ముగిసిన కృష్ణా పుష్కరాలు
బీచుపల్లి : తెలంగాణలో కృష్ణా పుష్కరాలు వైభవంగా ముగిశాయి. బీచుపల్లి ఘాట్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు లు కృష్ణమ్మకు ముగింపు హారతినిచ్చారు. ఈ హారతి కార్యక్రమంతో కృష్ణా పుష్కరాలు ముగిశాయి. పన్నెండు రోజుల పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 50 లక్షల మంది పుష్కర స్నానమాచరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కోటి 80 లక్షలు, నల్లగొండ జిల్లాలో 70 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాల్లో భక్తులకు విశిష్ట సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందిని మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ ఛైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు
విజయవాడ : కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కర స్నానం ఆచరించేందుకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప, మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో పుష్కరస్నానం ఆచరించేందుకు వీఐపీకి ఘాట్‌కు కేంద్రమంత్రి సురేష్ ప్రభు... మంత్రులతో కలసి పయనమయ్యారు. ఆ తర్వాత సురేష్ ప్రభు... నగరంలోని డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నంద్యాల - ఎర్రగంట్ల రైల్వే లైన్, నంద్యాల - కడప పాసింజర్ రైలును రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సురేష్ ప్రభు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యాక్రమంలో సురేష్ ప్రభు పాల్గొంటారు. -
బెంజ్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
విజయవాడ: నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించారు. కృష్ణా పుష్కరాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నుంచి తిరిగి వెళ్లే యాత్రికులు వాహనాలు నడపడంలో జాగ్రతగా ఉండాలని చంద్రబాబు సూచించారు. -
పద్మావతి ఘాట్‌లో చక్రస్నానం
విజయవాడ: కృష్ణ పుష్కరాల ముగింపు సందర్భంగా విజయవాడ పద్మావతి ఘాట్‌లో టీటీడీ ఆధ్వర్యంలో చక్రస్నానం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. -
రాష్ట్రంలోనే కర్నూలు భేష్
కృష్ణా పుష్కర ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మెచ్చుకోలు – శ్రీశైలాన్ని మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని వెల్లడి – హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ సర్వీసు ప్రారంభం – పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల విషయంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబునిచ్చారు. పుష్కర భక్తుల నుంచి తీసుకున్న అభిప్రాయ సేకరణతో పాటు నేరుగా ఫోన్లో మాట్లాడి కూడా అభిప్రాయాలను సేకరించామన్నారు. మొత్తం 93 శాతం మార్కులతో కర్నూలు జిల్లా మొదటిస్థానంలో నిలిచిందన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా సేవా కార్యక్రమాలతో ఏకంగా 95 శాతం మార్కులతో అగ్రభాగాన నిలిచిందని కొనియాడారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా సున్నిపెంటకు చేరుకుని అక్కడి నుంచి లింగాలగట్టు ఘాట్‌ను సందర్శించారు. అక్కడ నదిలో నీటిని నెత్తిపై చల్లుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. చక్కటి వాతావరణంలో ఉన్న శ్రీశైలాన్ని మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నేరుగా హెలికాప్టర్ సర్వీసును కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మల్లన్న పవర్ఫుల్ గాడ్ ఒక పక్క నీళ్లు.. ఇంకో పక్క బ్రహ్మాండమైన పచ్చదనం ఉన్న శ్రీశైలంలోని మల్లన్న పవర్ఫుల్ గాడ్ అని సీఎం అన్నారు. అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్.. మరోవైపు నూతన రాజధాని అమరావతికి మధ్యలో శ్రీశైలం కేంద్ర బిందువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో చాలా మంది ఇక్కడకు వస్తున్నారన్నారు. ఒక మంచి పుణ్యక్షేత్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా తయారుచేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీడియోలు సోషల్ మీడియాలో పెట్టండి ప్రస్తుతం ప్రతి యువత చేతిలో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం తన ప్రసంగాన్ని కూడా కొద్ది మంది స్మార్ట్ఫోన్లలో రికార్డు చేస్తున్నారని.. వీటిని సోషల్ మీడియాలో పెట్టాలని కోరారు. తద్వారా కృష్ణా పుష్కరాలను మరింత మందికి చేరవేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నీరు ఉంటే ఎలాంటి సమస్యలు రావని.. అందుకే అందరూ వచ్చి కరువు సమస్య లేకుండా చూడాలని పుష్కర స్నానం చేస్తూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఇటువంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని.. అందుకే పంట కుంటలను తవ్వుకోమన్నామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని.. ఎక్కువ సమస్యలు, ఎక్కువ బాధలు ఉంటే ఇంకా ఎక్కువ కష్టపడతానన్నారు. ఈ సమస్యలు తీరేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని కోరారు. జిల్లా పోలీసులు భేష్ కృష్ణా పుష్కరాలను జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా సమర్థవంతంగా నిర్వహించారని సీఎం కితాబునిచ్చారు. ప్రధానంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కేవలం పోలీసులు అంటే ఖాకీ డ్రస్ వేసుకోవడం కాదని.. సేవ కూడా చేయడమని నిరూపించారన్నారు. నూటికి 95 శాతం మంది ప్రజలు పోలీసు యంత్రాంగాన్ని మెచ్చుకున్నారన్నారు. ముసలివాళ్లు వస్తే సహాయం చేయడం, కాళ్లు లేనివాళ్లను ఘాట్ల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించడం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని కొనియాడారు. ఇది నిజమైన మానవత్వమని కొనియాడారు. మనిషిని చూస్తేనే కాదు.. అతని వాయిస్‌ను విని కూడా దొంగలను పట్టుకునే టెక్నాలజీ వచ్చిందన్నారు. శ్రీశైలం నుంచి మొత్తం సమాచారం తనకు వస్తుందని.. అక్కడి నుంచి ఇక్కడ పుష్కరాల తీరును గమనిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
27 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
విజయవాడ: విజయవాడ నగరంలో 27 మంది అంతర్రాష్ట్ర దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 7 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చిన భక్తుల నుంచి దొంగలు ఈ సొత్తును కాజేశారు. పట్టుబడిన దొంగల్లో ఒడిస్సాకు చెందిన14 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు, యూపీకి చెందిన ఇద్దరు ఉన్నారు. వీరిలో 16 మంది మహిళలు ఉండటం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కర స్నానం చేసిన హీరో వెంకటేష్
-
కృష్ణమ్మ తీరం ... భక్తజన సంద్రం
సాక్షి, అమరావతి : కృష్ణాతీరానికి పుష్కరాల పదోరోజు భక్తజనం పోటెత్తింది. ఆదివారం కావడం, మరో రెండురోజుల్లో పుష్కరాలు ముగియనుండటంతో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన పుష్కర ఘాట్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ఎండ తీవ్రత, ట్రాఫిక్ జామ్‌లు, ఇతర ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు పుష్కర స్నానాలాచరించి పులకించిపోయారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రంలో 29,91,750 మంది స్నానాలు చేయడం విశేషం. ఈ పుష్కరాల్లో ఇదే రికార్డు కావడం గమనార్హం. మొత్తం మీద ఈ పది రోజుల్లో పుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 1,53,66,036కు చేరింది.విజయవాడ కనకదుర్గమ్మ ఆల యంతో పాటు కృష్ణాతీరంలోని ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. 23న ఆది పుష్కరాల ముగింపు కృష్ణా పుష్కరాల్లో తొలి 12 రోజుల ఆది పుష్కరాలను మంగళవారం వేడుకగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 23వ తేదీ రాత్రి 7 గంటలకు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదికిచ్చే హారతితో ఆది పుష్కరాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా కృష్ణా హారతి ప్రాంతంలో ప్రభుత్వం భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఆది పుష్కరాల ముగింపు సంద ర్భంగా వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహిస్తారు. -
పుష్కరాల్లో రైల్వే సేవలపై అధికారుల సంతృప్తి
సాక్షి, విజయవాడ: పుష్కరాలకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామని, ఘాట్లలోనే రైల్వే టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (క్యాటరింగ్ అండ్ ప్యాసింజర్ సర్వీసెస్) విజయభాస్కర్ పేర్కొన్నారు. పుష్కరాల తొలి రోజు నుంచి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రైలులో సీటు కోసం ఎంతటి ప్రయాసనైనా ప్రయాణికులు లెక్కచేయడం లేదు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రయాణికులను తిరిగి వారి స్వస్థలాలకు సురక్షితంగా పంపేందుకు రైల్వే అధికారులు అహర్నిశలూ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పుష్కరాల్లో రైల్వే సేవలపై ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. సాక్షి: పుష్కర రద్దీ బాగా ఉంది. రైల్వేశాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? విజయభాస్కర్: ఇతర ప్రయాణ సాధారణల చార్జీలతో పోల్చితే రైల్వే టిక్కెట్చార్జీలు చాలా తక్కువ. అందువల్ల పుష్కర ప్రయాణికులంతా రైల్వేలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. రోజు మూడు లక్షల మంది ప్రయాణికులు రైల్వే సేవలను ఉపయోగించుకుంటారని భావించి ఐదు లక్షలు మంది వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశాం.షెడ్యుల్డ్ ైరె ళ్లు కాకుండా అదనంగా 650 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాం. ఇవికాకుండా రద్దీని బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు వే సి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. సాక్షిః ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? విజయభాస్కర్: దక్షిణభారత దేశంలోనే మొదటిసారిగా పున్నమి, పవిత్రసంగమం, బస్టాండ్లలో రైల్వే టిక్కెట్ మిషన్లు పెట్టి ప్రయాణికులకు టిక్కెట్లు అందచేస్తున్నాం. ఇవికాకుండా రెగ్యులర్ కౌంటర్లు కాకుండా 79 అదనపు టిక్కెట్ కౌంటర్లు ఏర్పాట్లు చేశాం. ఇవి 24 గంటలు పనిచేస్తున్నాయి. 520 మంది కమర్షియల్ సిబ్బంది రైల్వే ప్రయాణికుల సేవలో ఉన్నారు. ఆదివారం బాగా రద్దీ పెరిగినా పది నిముషాల్లో టిక్కెట్ తీసుకునే ఏర్పాటు చేశాం. చివర రోజు వరకు ఇంతే రద్దీ ఉంటుందని భావిస్తున్నాం. సాక్షిః క్యాటరింగ్ సౌకర్యం ఎలా ఉంది? భక్తులకు నాణ్యమైన భోజనం అందుతోందా? ధరలు మాటేమిటీ? విజయభాస్కర్: ప్రతి ప్లాట్‌ఫాం పైనా 5 అదనంగా క్యాటరింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి మూడు గంటలకు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, ఆఫీసర్లుతో ఆహారం శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయిస్తున్నాం. హడావుడిగా రైలు ఎక్కే వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా రైలు వద్దనే విక్రయాలు జరిగేటట్లు చూస్తున్నాం. పాలు, ప్రూట్ జ్యూస్, వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటున్నాయి. నిర్ణయించిన ధర కంటే ఏ మాత్రం ఎక్కువ రేటు అమ్మినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించాం. నాణ్యత, ధరల విషయంలో ప్రయాణీకుల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు లేదు. సాక్షిః శాటిలైట్ స్టేషన్లలో సౌకర్యాలు మాటేమిటీ? విజయభాస్కర్: హైదరాబాద్ నుంచి హెచ్ఓడీలతో పాటు నేను ఇక్కడే ఉంటున్నాం. మధురానగర్, గుణదల, కృష్ణాకెనాల్, రాయనపాడు స్టేషన్లు తరుచుగా తనిఖీలు చేస్తున్నాం. అక్కడ ప్రయాణీకుల రద్దీని బట్టి టిక్కెట్‌కౌంటర్లు పెంచుతున్నాం. అక్కడ కూడా పదినిముషాల్లో టిక్కెట్ తీసుకుని రైలు ఎక్కవచ్చు. 24 గంటలు క్యాటరింగ్ సౌకర్యం ఉంది. శాటిలైట్ స్టేషన్లతో పాటు తారాపేట, పార్శిల్ ఆఫీసు, స్టేడియంలలో షెల్టర్స్(పుష్కరనగర్)లు ఏర్పాటు చేశాం. ప్రయాణికులు వీటిని బాగా ఉపయోగించుకుంటున్నారు. సాక్షిః రైల్వేకి ఆదాయం ఎలా ఉంది? విజయభాస్కర్: శనివారం వరకు సుమారు 11లక్షల మంది ప్రయాణికులు రైల్వే సేవలు వినియోగించుకున్నారు. సుమారు రూ.14.50 కోట్లు ఆదాయం వచ్చిందని అంచనా. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 75వేల మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. రాత్రికి ఇది రెట్టింపు అవ్వవచ్చు. పుష్కరాలు పూర్తయి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయే వరకు ప్రత్యేక ఏర్పాట్లన్ని యధావిధిగా కొనసాగిస్తాం. భక్తులు క్షేమంగా ఇంటికి వెళ్లడమే మా ఉద్దేశం. -
గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల రద్దీ
గన్నవరం : కృష్ణా పుష్కరాల సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి ఎక్కువైంది. సాధారణ ప్రయాణికులతో పాటు పుష్కర స్నానమచరించేందుకు దేశ, విదేశాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. దీనితో గత పది రోజులుగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఎయిర్‌పోర్టు అధికారులు ఏర్పాటు చేసిన ఆత్మీయ స్వాగత ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రయాణికులను, పుష్కర యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. పుష్కర ప్రారంభానికి రోజువారి విమాన సర్వీసుల సంఖ్య 24 నుంచి 28 వరకు ఉండగా ప్రస్తుతం 34 నుంచి 36 సర్వీసులకు చేరుకున్నాయి. ఇక్కడికి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా గతంలో రోజుకు 1,500 నుంచి 1,800 వరకు ఉండేది. పుష్కరాల ప్రారంభంతో ఈ సంఖ్య రెట్టింపు అయి మూడు వేల నుంచి 3,500 మంది ప్రయాణికులకు చేరుకుంది. ముఖ్యంగా న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. అయా నగరాలకు నడిచే విమానాల్లో ప్రయాణికుల అక్యుపెన్సీ రేషియో కూడా 90 నుండి 95 శాతం వరకు ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలుపుతున్నాయి. దిగిరాని విమాన టిక్కెట్ల ధరలు పెరిగిన ప్రయాణికుల రద్దీతో విమాన టిక్కెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ. 1,200 నుంచి రూ. 5 వేలలోపు ఉండే టిక్కెట్ ధరలు గత పది రోజులుగా రూ. 10 నుంచి రూ. 15 వేలు వరకు పలుకుతున్నాయి. పుష్కరాల సందర్భంగా ప్రయాణికులు అప్పటికప్పుడు టిక్లెట్లు బుక్ చేస్తుండడం విమానయాన సంస్థలకు లాభసాటిగా మారింది. గత మూడు రోజులుగా ట్రూజెట్ విజయవాడ నుంచి చెన్నైకు టిక్కెట్ ధర రూ. 13,329 చేరుకుంది. స్పైస్‌జెట్ విజయవాడ-బెంగళూరు మధ్య తిరిగే విమాన సర్వీసుల టిక్కెట్ ధర రూ. 12,400 నుంచి రూ. 14,500కు చేరింది. విజయవాడ నుంచి చెన్నై సర్వీస్ టిక్కెట్ ధర రూ. 11,299 ఉండగా, తిరుపతి, వైజాగ్ సర్వీసుల టిక్కెట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఎయిరిండియా విమాన టిక్కెట్ ధర 14,405కు చేరుకుంది -
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నానం ఆచరించేందుకు భక్తులు తెల్లవారే పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. విజయవాడలోని సంగమం, పద్మావతి, జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు భారీ గా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిని శ్రీదుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో దేవాలయ ప్రాంతం జనసంద్రంగా మారింది. దీంతో భక్తులను అదుపు చేయలేక పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం 9.00 గంటల వరకు 75 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. తాగేందుకు మంచి నీరు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్ ఘాట్లలో భక్తుల రద్దీ భారీగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా పుష్కరోత్సవం ఆదివారం 10వ రోజుకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలోని భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు పయనమవుతున్నారు. -
తొమ్మిది రోజుల్లో 300 టన్నుల చెత్త ఏరివేత
బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం : జిల్లాలోని పుష్కరఘాట్లలో ఎప్పటికప్పుడు క్లీన్అండ్ గ్రీన్ చేస్తున్నారు. పుష్కారాలు ప్రారంభమై తొమ్మిది రోజుల్లో 300 టన్నుల చెత్తను ఏరివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెల్లారుజామునుంచి ఘాట్లకు భక్తుల వస్తుండడంతో వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తున్నారు. ప్రతి ఘాట్ వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేసి చెత్తను అందులో వేయాలని అధికారులు మైక్‌ల ద్వారా చెబుతుండడంతో నేరుగా భక్తులు వాటిలోనే వేస్తున్నారు. రోజూ ఘాట్లలో నీటిస్థాయితోపాటు శుద్ధిని పరీక్షిస్తున్నారు. పుష్కరాల్లో లక్షాలాది మంది స్నానం చేసే ఘాట్లలో భక్తులకు ఎలాంటి చర్మవ్యాధులు ప్రబలకుండా పటిక(అలం)ను ఎప్పటికప్పుడు వేస్తూ నీటిని శుభ్రం చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో 700 మంది పంచాయతీకార్యదర్శులు, 60 మంది ఈఓఆర్డీలు, 500 మంది గ్రామపంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతకు ప్రభుత్వం రూ.4కోట్లు కేటాయించినట్లు డీపీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. కృష్ణపుష్కారాలకు వచ్చే లక్షాలాది మంది భక్తుల సౌకర్యార్థం ఎక్కడ కూడా ఘాట్లలలో చెత్తచెదారం ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
9వ రోజు 27,58,638
కృష్ణమ్మ ఒడిలో తనివీతీరా పుష్కరస్నానాలు గొందిమళ్లలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ పుష్కర స్నానం పలు ఘాట్లకు పెరిగిన వీఐపీల తాకిడి నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం సోమశిల ఘాట్‌లో తగ్గిన నీటిమట్టం..షవర్లకింద స్నానాలు జాతీయ రహదారి, సోమశిల రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణానదీ తీరం..జనతీరమైంది. నదీమతల్లి ఒడిలో తనివితీరా సేదదీరారు. పుష్కరుడి సేవలో భక్తులు తరించిపోయారు. జిల్లాలోని పుష్కరఘాట్లకు శనివారం పోటెత్తారు. పుష్కరాల ముగింపు సమయం సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 27,58,638 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు ప్రారంభమైనప్పటినుంచి ఇదే రికార్డు. మరోవైపు పుష్కరఘాట్లలో నీటిమట్టం క్రమేణా తగ్గడంతో వరుసగా నాలుగోరోజు జూరాల ఘాట్‌ను మూసివేశారు. అత్యధిక భక్తులతో కిటకిటలాడుతున్న సోమశిలలో సైతం శనివారం పుష్కరఘాట్‌లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో ఘాట్‌లో పూర్తిగా మునిగి సాన్నం చేయడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఘాట్ పైనున్న షవర్ల ద్వారా పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడినుంచి చాలామంది మంచాలకట్టకు వెళ్లారు. బీచుపల్లి, సోమశిల, రంగాపూర్, గొందిమళ్ల, క్యాతూర్, గుమ్మడం, కొండపాడు, మంచాలకట్ట, నది అగ్రహారం, పస్పుల, కృష్ణ, పంచదేవ్పాడు, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కరస్నానం ఆచరించారు. శనివారం ఒక్కరోజే దాదాపు 27,58,638 మంది పుణ్యస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఉదయం వేళలో భక్తుల రద్దీ వీఐపీల తాకిడి వల్ల అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. జిల్లాలోని ప్రధాన ఘాట్లలో పుష్కరస్నానాలు కృష్ణ 1,01,578 పస్పుల 60,500 గొందిమళ్ల 1,58,000 నదీఅగ్రహారం 1,44,125 బీచుపల్లి 4,40,000 రంగాపూర్ 6,40,000 సోమశిల 7,30,000 పాతాళగంగ 23,860 (మిగతా వారు ఇతర ఘాట్లలో స్నానమాచరించారు) వీఐపీలు ఇలా.. రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ ఆయన సతీమణి విమల నరసింహన్ దంపతులు శనివారం జిల్లాలోని గొందిమళ్ల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లను సందర్శించారు. గొందిమళ్ల వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించి జోగుళాంబను దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి మాదాల జానకిరాం, ఆదోల్ ఎమ్మెల్యే, సినీనటుడు బాబుమోహన్ జోగుళాంబ ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించి జోగుళాంబ దర్శనం చేసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మంచాలకట్టలో పుణ్యస్నానమాచరించగా, ఐజీపీ మల్లారెడ్డి, వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు సోమశిల పుష్కరఘాట్‌లో స్నానమాచరించారు. రంగాపూర్ పుష్కరఘాట్‌లో మాజీ మంత్రి ముత్యంరెడ్డి, కోరుట్ల శాసనసభ్యుడు విద్యాసాగర్‌రావులు పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ రంగాపూర్ ఘాట్‌లోని ఆర్యవైశ్య అన్నదాన శిబిరాన్ని సందర్శించారు. ట్రాఫిక్ జామ్.. శనివారం అన్ని పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ కర్నూల్ జాతీయ రహదారిలోని భూత్పూర్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సోమశిలకు భక్తులు క్యూ కట్టడంతో కర్నూల్ సోమశిల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అడ్డాకుల టోల్గేట్ వద్ద కూడా వాహనాలు నిలిచిపోయాయి. కోటి దాటింది.. కృష్ణా పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య కోటి దాటింది. ఇప్పటి వరకు మొత్తం 1,07,88,575మంది పుష్కరస్నానం చే శారు. తొలి ఎనిమిది రోజుల వరకు 80,19,937 మంది భక్తులు పుష్కరస్నానాలు చేయగా, ఒక్క శనివారమే 27,58,638మంది పుణ్యస్నానాన్ని ఆచరించారు. -
పుష్కరాల కలెక్షన్లు భేష్!
అక్షర తూణీరం వీవీఐపీలు అందరూ ‘‘ఏర్పాట్లు మహాద్భుతం’’ అన్నారు. వాళ్ల ఏర్పాట్ల కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుందని వారికీ తెలుసు. ‘‘...మరి ఈ ఒక్క సింధుయే కాదు, మన నవ్యాంధ్ర నుంచి ఇంటికో సింధు రావాలని కోరు కుంటున్నా. క్రీడా రంగంలో మన రాష్ట్రం ప్రపంచం లోనే నంబర్‌వన్‌గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే, వచ్చే ఒలింపిక్స్ మన నవ్యాం ధ్రప్రదేశ్‌లో జరిపించేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్టేడియంని నిర్మిస్తాం. అవసరమైతే దానికోసం లక్ష ఎకరాలను మన రైతుల నుంచి సేకరిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం...’’ అంటూ మంచం దిగి చీకట్లో వెళ్లిపోతుంటే ఇంట్లోవాళ్లు ఆపారు. ఏమిటో! ఈమధ్య నాకివే కలవరింతలు! పూర్తిగా మేల్కొన్నాను. పది రోజులుగా పుష్కర విశేషాలు వినీ వినీ – అవే కలలు. అవే కలవరింతలు. ఏవిటో కలల్లో పుష్కర స్నానా నికి రానివారు వచ్చినట్టు, వచ్చినవారు రానట్టు కని పిస్తున్నారు. ప్రత్యేకంగా వెళ్లి సగౌరవంగా ఆహ్వానించినా మోదీ రానేలేదు. తీరా ఆయన వచ్చాక పుష్కర ఘాట్‌లో నిలబెట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా సంక ల్పం చేయించి, నిండా మునకలు వేయిస్తారని భయం కావచ్చునని కొందరు వేరే ఘాట్‌లో అనుకుంటుంటే వినిపించింది. శాస్త్రోక్తమైన పవిత్ర పుష్కర సందర్భాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చని మొదటిసారి అర్థమైందని – ఓ తలపండిన నేత నివ్వెరపోయాడు. దేన్నైనా ఒక వేలంవెర్రి కింద మార్చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. పుష్కర వేళ కోట్లాది రూపా యలతో నడిపిస్తున్న సాంస్కతిక కార్యక్రమాలు నీరుకారుతున్నాయని ఓ విలేకరి వ్యాఖ్యానించాడు. పుష్కరాలు పవిత్రమైనవే కావచ్చు. నమ్మకాలున్నవారు గతించిన తమ పెద్దలకు తర్పణలు వదిలే ఒకానొక సందర్భం. అందుకు తగిన అదనపు ఏర్పాట్లు చేయడం పాలకుల బాధ్యత. అంతకుమించి ఏం చేసినా అది ఎక్స్ట్రా. ప్రతిరోజూ భక్తుల కలెక్షన్లు చెప్పడం, అంతేగాక రేపు ఎల్లుండిలో పికప్ అయ్యే అవకాశం ఉందని మంత్రులు బాకాలూదటం సినిమా విడుద లని తలపిస్తున్నాయ్. ముందునుంచే ఇన్ని కోట్లమంది వస్తారు, అన్ని కోట్లమంది వస్తారని అవసరమైన ఊహాగానాలను వదలడం చాలా అవసరం. విజయవాడలో పుష్కరాల సందర్భంగా ఎట్నించి ఎటు వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అందులో ఎక్కుతున్నవారు పెద్దగా లేరు. ఒక సామాన్యుడేమన్నాడంటే – ఇదంతా వేస్టు. రేపు నష్టాలొచ్చాయంటూ టిక్కెట్లు పెంచడానికి ఇదంతా’’. ఏర్పాట్లకి జనం సంతప్తిపడాలిగానీ చిరాకు పడకూడదు. వీవీఐపీలు అందరూ ‘‘ఏర్పాట్లు మహాద్భుతం’’ అన్నారు. వాళ్ల ఏర్పాట్ల కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుందని వారికీ తెలుసు. అయినా అదొక మర్యాద. అదొక సంప్రదాయం. కష్ణా డెల్టాలో నాట్లు పడలేదు. సాగర్ కింకా చిరునవ్వైనా రాలేదు. ముఖ్యమంత్రి పుష్కర తీర్థంలో తలదాచుకుంటున్నారు. ఇవికాగానే వినాయక చవితి, దాని తర్వాత నిమజ్జనోత్సవం వస్తాయి. ఈలోగా కొత్త కాపిటల్‌లో మంత్రుల చాంబర్స్‌ని తిరిగి కట్టడం పూర్తవుతుంది. అప్పుడు మళ్లీ మొదట్నుంచీ పరిపాలన ప్రారంభం అవుతుంది. - శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు శ్రీరమణ -
గొందిమళ్లలో గవర్నర్ పుష్కర స్నానం
మహబూబ్‌నగర్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు శనివారం కృష్ణా పుష్కర స్నానం ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గొందిమళ్లలో గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఆధికారులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు అలంపూర్ చేరుకుని.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. గురువారం విజయవాడలో పున్నమి ఘాట్‌లో గవర్నర్ దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు దర్శించుకున్న సంగతి తెలిసిందే. -
జనజాతర
పుష్కరాలకు 8వ రోజు 20 లక్షల మంది * పాలమూరులో 14 లక్షలు, నల్లగొండలో 6 లక్షలు * తెలంగాణ అమరులకు కోదండరాం పిండ ప్రదానం * అమర జవాన్లకు, సాగర్ డ్యామ్ నిర్మాణ కూలీలకు పిండ ప్రదానాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాలకు 8వ రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. పుష్కరాలు మరో 4 రోజుల్లో ముగియనుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది తరలివచ్చారు. మహబూబ్‌నగర్‌లో 14 లక్షలు, నల్లగొండ జిల్లాలో 6 లక్షల మంది యాత్రికులతో ఘాట్లు కళకళలాడాయి. ఉదయం ఐదింటి నుంచే భక్తులతో కిటకిటలాడాయి. పాలమూరులో రంగాపూర్ ఘాట్‌కు ఏకంగా నాలుగున్నర లక్షల మంది పోటెత్తారు. బీచుపల్లి, సోమశిల ఘాట్లు మూడేసి లక్షల మందితో కళకళలాడాయి. పలు ఘాట్లకు కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా వచ్చి పుణ్యస్నానమాచరించారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద నీరు భారీగా తగ్గడంతో జూరాల ఘాట్‌ను వరుసగా నాలుగో రోజూ మూసేశారు. సోమశిల పుష్కరఘాట్‌లో జేఏసీ చైర్మన్ కోదండరాం, జేఏసీ నేతలు పుష్కర స్నానం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరులో అమరులైన వారికి కోదండరాం పిండ ప్రదానం చేశారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం 6 లక్షల మంది స్నానాలు చేశారు. ఒక్క నాగార్జునసాగర్‌లోనే ఏకంగా 1.8 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అంచనా. ఇక్కడి శివాలయం ఘాట్‌లో 1.3 లక్షల మంది స్నానాలు చేయడంతో భక్తులను అక్కడికి వెళ్లకుండా 2 గంటల సేపు నిలిపేసి సురికి వీరాంజనేయస్వామి ఘాట్‌కు తరలించారు. వాడపల్లి ఘాట్ వద్ద 1.3 లక్షలు, మట్టపల్లిలో లక్ష మంది, కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్‌లో 70 వేల మంది స్నానాలు చేశారు. కృష్ణా పుష్కరఘాట్‌లో విధులు నిర్వహిస్తున్న బ్రహ్మన్న అనే గజ ఈతగాణ్ని పాము కరవడంతో అతన్ని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమర జవాన్లకు, సాగర్ డ్యామ్ నిర్మాణంలో అసువులు బాసిన కూలీలకు పిండ ప్రదానాలు చేశారు. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ఒలింపిక్స్ ఫైనల్లో గెలవాలని కోరుతూ నదిలో దీపాలు వెలిగించారు. వీఐపీల తాకిడి మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్‌లో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుణ్యస్నానాలు ఆచరించారు. జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు స్నానాలాచరించారు. రంగాపూర్ ఘాట్‌లో ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి సతీసమేతంగా పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువు వేలేటి మృత్యుంజయశర్మ మట్టపల్లి ప్రహ్లాద ఘాట్‌లో, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని సాగర్‌లో పుణ్యస్నానాలు చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన పాతులోతు వెంకటేశ్వర్లు, సుశీల దంపతులు తమ 30 రోజుల చిన్నారికి పుష్కర స్నానం చేయించారు. -
ప్రయాణికులు పెరిగితేనే అంతర్జాతీయ హోదా..!
గన్నవరం : అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. గురువారం గన్నవరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు హోదా రావాలంటే ముందు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరగాలన్నారు. కేంద్రమంత్రికి చేదు అనుభవం భవానీపురం : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం సాయంత్రం ఆయన పున్నమిఘాట్లో పుష్కర స్నానమాచరించారు. అయితే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులెవరు అక్కడ లేకపోవడం గమనార్హం. హడావుడిగా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. భూసేకరణపై చర్చలు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుతో గన్నవరం విమానాశ్రయ విస్తరణ భూసేకరణపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పలువురు రైతులు చర్చించారు. రైతులకు నష్టం లేకుండా భూసేకరణ చేపట్టేందుకు వీలుగా ఏలూరు కాలువ మళ్లింపు డిజైన్‌ను మార్పు చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, డిజైన్ మార్పు విషయమై సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ పంపుతామని తెలిపారు. రాష్ట్రాభివృద్దికి సీఎం కృషి రావిచర్ల: రాష్ట్రవిభజన జరిగి రాష్ట్రం అష్టకష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. నూజివీడు మండలంలోని రావిచర్ల క్రాస్‌రోడ్డు వద్ద మామిడి తోటలో పుష్కరయాత్రికుల సౌకర్యార్థం రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో కలిసి గురువారం కేంద్రమంత్రి సందర్శించారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ రాజకీయ విలువల కోసం ప్రభుత్వం, పార్టీ కలిసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పుష్కర యాత్రికుల కోసం రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని విజయవాడలో పద్మావతి, వేదాద్రిలోని ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం, పాతాళగంగ ఘాట్‌లో భక్తులు పోటెత్తారు. అలాగే తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్‌లోని ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు సంఖ్య భారీగా పెరిగింది. -
చికిత్స పొందుతూ హోంగార్డు మృతి
విజయవాడ: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఓ హోంగార్డు నిండు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ జిల్లా కంచరపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు అనే హోంగార్డు పుష్కర విధుల నిమిత్తం ఈ నెల 7వ తేదీన విజయవాడకు వచ్చాడు. 11 వ తేదీ అర్థరాత్రి ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో తోటి హోంగార్డులు ఆయన్ను సమీప ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అనంతరం వెంకటేశ్వరరావును విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. హోంగార్డు కుటుంబానికి తోటి ఉద్యోగులు రూ.25 వేలు సాయం అందించారు. దీనిపై కనీసం ఉన్నతాధికారులు, ప్రభుత్వం కానీ స్పందించడంలేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే వెంకటేశ్వరరావు బ్రతికుండేవారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. -
శిశుపాలుడిలా వంద తప్పులు చేస్తున్నారు
-
పుణ్యానికొస్తే.. జేబుకు చిల్లు
పవిత్ర సంగమం ఘాట్ లో పూజ సామాగ్రి విక్రయిస్తున్న పద్మావతి వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. టెంకాయ కావాలని రూ.500 నోటు ఇచ్చాడు, చిల్లర కోసం అటు తిరగ్గానే ఆమె హ్యాండ్ బ్యాగ్‌తో మాయమయ్యాడు. అందులో నాలుగు రోజులు వ్యాపారం చేసిన రూ.40 వేల నగదు, బంగారు రింగులు ఉన్నాయి. ఇటువంటి చేదు అనుభవం మరెందరిదో. పుష్కరాల్లో దొంగలు భక్తులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోలీసులు ఇప్పటికి వంద మందిని పైగా చోరులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ నిత్యం పదుల సంఖ్యలో యాత్రికులు సొమ్ము పోగొట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణల నుంచే కాకుండా నేపాల్, బిహార్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రకరకాల ముఠాలు పుష్కరాలకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క పద్మావతి ఘాట్‌లో రూ.10 నోట్లు పడేసి యాత్రికుల దృష్టిని మరల్చి బ్యాగులను తస్కరించిన కేసులు 31 నమోదయ్యాయి. మంగళవారం ఒక్క రోజే 11 మంది నేరగాళ్లను పోలీసులు పట్టుకుని రూ.5.5 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 23 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టెక్నాలజీ ఏమైనట్లు పుష్కరాల్లో నేరాల నివారణకు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామనీ, 15 వేల మంది పోలీసులను మోహరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. భక్తులకు మాత్రం దొంగల బెడద తప్పడం లేదు. పుణ్యానికి వచ్చి లూటీ అవుతున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. -
శిశుపాలుడిలా వంద తప్పులు చేస్తున్నారు: వైఎస్ జగన్
శిశుపాలుడు చేస్తున్నట్లుగా చంద్రబాబు వంద తప్పులు చేస్తున్నారని.. ఆయన పాపాలను దేవుడు క్షమించడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పుష్కర స్నానం చేస్తూ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, గోదావరి పుష్కరాల సందర్భంగా మృతుల కుటుంబాలకు చెల్లించినట్లే ఇక్కడ కూడా రూ. 20 లక్షలు చెల్లించాలని ఆయన అన్నారు. తాను వస్తున్నాననే విషయం తెలిసి హడావుడిగా రూ. 3 లక్షల పోస్ట్ డేటెడ్ చెక్కులను ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని.. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని చెప్పారు. అందుకోసం తాను ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. విద్యార్థుల మరణాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పుష్కరఘాట్‌లో స్నానాలకు వారు వెళ్తే ఈతకు వెళ్లారంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఏటూరు పుష్కరఘాట్‌కు ఇదే దారి అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, ప్రతిరోజూ అక్కడ ఆహార పొట్లాలు కూడా అందిస్తున్నారని, అలాంటప్పుడు ఘాట్ వద్ద ప్రమాదకర ప్రాంతాలలో ఎందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయలేదని జగన్ ప్రశ్నించారు. పుష్కరాల్లో స్నానాలు చేయకపోతే పాపాత్ములన్న రీతిలో చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, పుష్కర ఏర్పాట్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని, ఈ మరణాలకు చంద్రబాబు సర్కారు ఏం సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు. ఇసుక మాఫియాను ప్రోత్సహించిన చంద్రబాబు వల్లే ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారని, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. -
వైఎస్ జగన్ పుష్కరస్నానం
-
పున్నమిఘాట్లో వైఎస్ జగన్ పుష్కరస్నానం
విజయవాడ: వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, రక్షణనిధి, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి నేరుగా పున్నమిఘాట్లో ఉన్న వీఐపీ ఘాట్‌కు వైఎస్ జగన్ చేరుకుని పుష్కర స్నానమాచరించి, పిండ ప్రదానం చేశారు. పుష్కర స్నానానికి ముందు జగన్.. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత లబ్బిపేటలోని షిరిడీసాయిని దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర స్నానం అనంతరం కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుష్కర స్నానాలకెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
పుష్కరాల్లో విద్యార్థుల మృతిపై విచారణ
-
భక్తజనం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాల్లో వివిధ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వరుసగా 6వరోజు భక్తులు పోటేత్తారు. పుష్కరఘాట్లకు ఉదయం 5 గంటలకే భక్తుల తాకిడి మొదలైంది. సెలవు దినాలు కాకపోయినప్పటికీ పుష్కరాలు మరికొన్ని రోజులే ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివస్తున్నారు. గురువారం అత్యధికంగా రంగాపూర్ పుష్కరఘాట్‌లో దాదాపు 2.80లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానమాచరించారు. ఈ ఘాట్‌కు అనూహ్యంగా భక్తుల తాకిడి పెరిగింది. సోమశిల, బీచుపల్లి, గొందిమళ్ల, క్యాతూర్, పస్పుల, నది అగ్రహారం, కష్ణ, పంచదేవులపాడు, పాతాళగంగ వంటి ఘాట్లు సైతం పుష్కర భక్తులతో కళకళలాడాయి. జూరాల పుష్కరఘాట్‌లో నీళ్లు పూర్తిస్థాయిలో అడుగంటడంతో వరుసగా రెండో రోజు మూసివేశారు. జూరాల ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు తగ్గడంతో దిగువ ప్రాంతానికి నీటి విడుదలను అధికారులు నియంత్రించారు. దీంతో అనేక పుష్కరఘాట్లలో నీటి మట్టం గురువారం మరింత తగ్గింది. గొందిమళ్ల, సోమశిల, పాతాళగంగ పుష్కరఘాట్లకు శ్రీశైలం వరద జలాలు వస్తుండడంతో ఆ ఘాట్లు మాత్రం జలకళ సంతరించుకున్నాయి. గొందిమళ్ల ఘాట్ పరిశీలన గొందిమళ్లలోని పుష్కరఘాట్ల ఏర్పాటును హైదరాబాద్ జోన్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ రెమారాజేశ్వరి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు తదితరులు పరిశీలించారు. బుధవారం కడా బీచుపల్లి, రంగాపూర్, సోమశిల ఘాట్లలో ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించారు. వీఐపీలు ఇలా.. రంగాపూర్ పుష్కరఘాట్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 102 సంవత్సరాల వయసు గల నిరంజన్‌రెడ్డి తల్లి సైతం పుష్కరస్నానం ఆచరించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో పుణ్యస్నానమాచరించారు. సాయంత్రం కృష్ణమ్మ తల్లికి నది హారతి ఇచ్చారు. అలంపూర్ కలెక్టర్ టీకే శ్రీదేవి నదీమా తల్లికి హారతి ఇచ్చారు. నది అగ్రహారం పుష్కరఘాట్‌లో సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్, రైల్వే జనరల్ మేనేజర్ జ్ఞానేశ్వర్, గద్వాల వెంకట్రాంరెడ్డి తదితరులు పుణ్యస్నానాలు ఆచరించారు. గొందిమళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు కుటుంబసభ్యులతో వచ్చి పుణ్యస్నానం ఆచరించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పాతాళగంగలో పుణ్యస్నానమాచరించారు. సోమశిల పుష్కరఘాట్‌లో ఎమ్మెల్సీ ప్రభాకర్ పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. నాంపల్లి ఫ్యామిలి కోర్టు జడ్జి లక్ష్మి కామేశ్వరి, రంగారెడ్డి జిల్లా జడ్జి సుజన తదితరులు సోమశిలలోని వీఐపీ ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్‌కు పిండప్రదానం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ మండలం మంచాలకట్ట పుష్కరఘాట్‌లో వైఎస్సార్సీపీ నాయకులు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి వాజిద్ తదితరులు పాల్గొన్నారు. -
లోకకల్యాణం కోసం..
అలంపూర్ రూరల్: అష్టాదశశక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో కృష్ణాపుష్కరాల్లో భాగంగా గురువారం పౌర్ణమి నుంచి రాష్ట్ర ప్రభుత్వం శతచండీ యాగాన్ని నిర్వహించనుంది. ఈ మేరు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలయంలోని కుంకుమార్చన మండపాన్ని ఇందుకు వేదికగా అధికారులు పరిశీలించారు. యాగం నిర్వహించేందుకు 40మంది రుత్వికులను పిలిపిస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారి కృష్ణ తెలిపారు. అందుకు అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు అనువైన ప్రదేశాన్ని కలెక్టర్ టీకే శ్రీదేవి, ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఘాట్ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్‌రెడ్డి,జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకష్ణ, సహాయక కమిషనర్ కష్ణ, ఈఓ గురురాజ పరిశీలించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వాములు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ యాగం ఇక్కడ తలపెట్టాలని తలంచామని, ఈ యాగం విజయవంతమైన తరువాత మళ్లీ మహావిద్యాయాగం నిర్వహిస్తామని చెబుతున్నారు. ఐదురోజుల పాటు జరిగే ఈ యాగం ఆయుత చండీయాగం ఫలితం ఇస్తుందని పేర్కొన్నారు. శ్రేయస్సు కోసమే.. రాష్ట్ర దేశ ప్రజల శ్రేయస్సు, సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ పుష్కర సమయంలో ఈ శత చండీయాగాన్ని నిర్వహిస్తున్నాం. పుష్కరాల్లో చేసే యజ్ఞయాగాదులకు విశేష ఫలితం ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఈ యాగం నిర్వహించాలని తలంచాం. –శ్యాంకుమార్ శర్మ, యజుర్వేద పండితులు మా కాంక్ష నెరవేరింది.. జోగుళాంబ ఆలయంలో ఈ శతచండీయాగం జరిపించాలని ఆలయ అర్చకులుగా సీఎం దృష్టికి తీసుకెళ్లాం. అందుకు వారు స్పందించి లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రజల యోగ క్షేమాల కోసం యాగాలకు ఎప్పటికీ సహకారం ఉంటుందని తెలిపారు. దీంతో మా ఆకాంక్ష నెరవేరింది. –వెంకటకృష్ణ, శాస్త్ర పండితులు అనేక శక్తులు సిద్ధిస్తాయి ఈ శతచండీయాగం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ జనాకర్షణ, ధనాకర్షణ, రూపాకర్షణ శక్తులు సిద్ధిస్తాయి. ఇలాంటి యాగాలు అందరి శ్రేయస్సు కోసం తలపెట్టింది. ఈ యాగం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివద్ధికి వస్తుంది. – వేముల విక్రాంత్‌శర్మ, పండితులు ప్రముఖులు రానున్నారు.. పుష్కరాల్లో భాగంగా శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయంలో జరిగే శతచండీయాగానికి ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఆగమసంప్రదాయబద్ధంగా జరిగే ఈ యాగం ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుంది. – ఆనంద్‌శర్మ, జోగుళాంబ ఆలయ ముఖ్యఅర్చకులు -
రామ్మా.. సమంత..!
రామ్మ చిలకమ్మా... ఐశ్యర్యారాయ్.. ప్రీతీజింటా.. సమంతా.. కాజల్.. ప్రియాంకచోప్రా... బయటకి రావమ్మా... అయ్యగారు వచ్చారు... నీకు కానుకలు తెచ్చారు.. దీంతో నువ్వు పండ్లు కొనుక్కోవచ్చు... నేను మందు కొనుక్కోవచ్చు.. అయ్యగారి అదృష్టాన్ని.. కీర్తిని.. హోదాని బయటకి తీయవమ్మ.. లక్ష్మీతల్లి వరించాలా.. సరస్వతమ్మ కరుణించాలా.. బెజవాడ కనకదుర్గా.. శ్రీశైలం మల్లన్న.. తిరుపతి వెంకన్నా.. నిన్ను కరుణించుగాక.. చిరంజీవి.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ప్రభాస్.. అందరూ రండి.. అందరూ కలిసొచ్చి అయ్యగారి కార్డు తీయడానికి మా సమంత(చిలక)కు సహకరించండి.. అయ్యగారూ.. యాభై రూపాయలు అక్కడ పెట్టండి.. సమంత రావమ్మ.. నీకు కానుకలు వచ్చాయి.. అయ్యగారు చక్కగా.. బలంగా ఉన్నారు.. అయ్యగారికి తగ్గట్టు మంచి కార్డు తీయమ్మ... అయ్యగారికి ఈసారి దశ తిరిగిపోవాలి.. ఇలా చిలకజోస్యులు పుష్కరాల్లో సందడి చేస్తున్నారు. పుష్కరఘాట్ల వద్ద చిలకజోస్యం చేప్పించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు పుణ్యస్నానాలను ఆచరించి అమ్మవారిని దర్శించుకుని వస్తున్న వారిని చిలక జ్యోతిస్యులు ‘ఒక్క చిన్నమాట..’ అని పిలిచి కూర్చోబెడుతున్నారు. ‘మా సమంత చెప్పింది జరగాల.. జరిగాక అయ్యగారు, అమ్మగారు మెచ్చాలా..’ అంటూ భక్తులను ఆకర్షిస్తున్నారు. చిలకలకు సినీతారల పేరు పెట్టుకుని తమ మాటలతో భక్తులను అలరిస్తున్నారు. మారిన చిత్రాలు కాలంతోపాటు చిలకజోస్యంలో కూడా మార్పులు వచ్చాయి. గతంలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు ఉన్న ఫొటోలను చిలుకలతో తీయించి జోస్యం చెప్పేవారు. మారిన ట్రెండ్ ప్రకారం దేవతల స్థానంలో సినీనటుల ఫొటోలు వచ్చి చేరుతున్నాయి. చిలక తీసిన ఫొటోలను బట్టి వచ్చినవారి హావభావాలకు అనుగుణంగా జోస్యం చెబుతున్నారు. - విజయవాడ(గుణదల) -
పుష్కరాల్లో విద్యార్థుల మృతిపై విచారణ: డీజీపీ
కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న విషాదంపై పోలీసు కేసు నమోదైంది. పుష్కర స్నానాల కోసం వెళ్లి.. కృష్ణానదిలో మునిగి ఐదుగురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. విద్యార్థుల మృతిపై విచారణ జరుగుతోందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్థుల మృతి దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనధికార పుష్కర ఘాట్లను పూర్తిగా నియంత్రిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆరు రోజుల్లో మొత్తం 74 లక్షల మంది పుష్కర స్నానం చేశారని, శుక్రవారం నాడు పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. -
గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
-
గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
విజయవాడ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు. సతీ సమేతంగా బుధవారం విజయవాడలోని పున్నమి ఘాట్‌కు చేరుకున్న గవర్నర్ పుష్కర స్నానం ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ దంపతులు దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి స్వాగతం పలికిన ఈవో సూర్యకుమారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనక దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరికి తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. రెండు సంవత్సరాల్లో వరుసగా గోదావరి, కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానం చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. -
పుష్కర స్నానం ఆచరించిన ఏపీ స్పీకర్ కోడెల
గుంటూరు : కృష్ణా పుష్కరాలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పుష్కర స్నానం ఆచరించారు. అమరావతి, దైద, సత్రశాల శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కర ఘాట్ల వద్ద నీటి ప్రవాహం అధికమైంది. జిల్లాలోని 72 పుష్కర ఘాట్ల వద్ద భక్తులు పోటెత్తారు. -
ఐదో రోజూ భక్తుల హోరు
దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు * పుష్కర ఘాట్లలో తగ్గుతున్న నీటిమట్టం * జూరాల ఘాట్‌కు భక్తులను అనుమతించని పోలీసులు * నల్లగొండలో ఇంద్రకరణ్, జగదీశ్‌రెడ్డి విహంగ వీక్షణం * వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సతీమణి, * పార్టీ ఎంపీ రేణుక పుణ్యస్నానాలు సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఐదో రోజు మంగళవారం కూడా జనప్రవాహం కొనసాగింది. అయితే పుష్కర ఘాట్లలో నీటిమట్టం తగ్గుతుండటంతో భక్తుల సంఖ్య కూడా కాస్త తగ్గింది. వీటితోపాటు పలు పుష్కరఘాట్లలో నీటిమట్టం సైతం తగ్గింది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 7,80,415, నల్లగొండ ఘాట్లలో 2 లక్షల పై చిలుకు స్నానాలు చేశారన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద నీరు తగ్గడంతో ప్రాజెక్టునుంచి నీటి విడుదలను కట్టడి చేశారు. జూరాల ఘాట్‌కు వచ్చిన భక్తులను మరో ప్రాంతానికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పోలీసు అమర వీరులకు వారి కుటుంబాల సమక్షంలో ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలో పిండ ప్రదానం చేశారు. మంత్రులు మహేందర్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో, లక్ష్మారెడ్డి గొందిమళ్లలో పుష్కర స్నానం చేశారు. గొందిమళ్ల ఘాట్‌లో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించారు. పార్టీ ఎంపీ బుట్టా రేణుక కూడా పుష్కర స్నానం చేశారు. ఇక వరుస సెలవులు ముగియడంతో నల్లగొండ జిల్లాలో ఐదో రోజు భక్తులు తగ్గారు. మూడు ప్రధాన ఘాట్లు మినహా మిగతావన్నీ వెలవెలబోయాయి. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పలు ఘాట్లను రోడ్డు, ఆకాశమార్గాన పరిశీలించారు. 20న గవర్నర్ నరసింహన్ మట్టపల్లిలో పుష్కర స్నానం చేస్తారని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో ఆది, సోమవారాల్లో నిబంధనలు సడలించిన పోలీసులు మంగళవారం మళ్లీ కఠినతరం చేయడంతో కిలోమీటర్ల కొద్దీ నడవలేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలకపోవడంతో వారు సాగర్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నేడు వైఎస్‌కు పిండ ప్రదానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ నియోజకవర్గం మంచాలకట్ట పుష్కరఘాట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు బుధవారం పిండ ప్రదానం చేయనున్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు రాం భూపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు. -
భక్త కృష్ణవేణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాల్లో ఐదో రోజు జనప్రవాహం కొంత తగ్గింది. మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు పనిదినం కావడంతో పుష్కర భక్తులసంఖ్య కొద్ది తగ్గడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. గద్వాల సమీపంలోని జూరాల పుష్కరఘాట్‌లో నీళ్లు లేకపోవడంతో ఘాట్‌ను మూసివేశారు. జూరాల ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు వచ్చే వరదనీరు భారీగా తగ్గడంతోపాటు అదే క్రమంలో ప్రాజెక్టునుంచి దిగువ ప్రాంతాలకు నీటి విడుదలను నియంత్రించడంతో పలు ఘాట్లలో నీటిమట్టం భారీస్థాయిలో తగ్గింది. జూరాల పుష్కరఘాట్‌లో మినహా ఎక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లుచేశారు. మరో వారం రోజుల పాటు పుష్కరాలు ఉండడంతో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా ఘాట్లలో నీటిమట్టం ఉండే లా చూడాలని నీటి పారుదల శాఖాధికారులు ఆదేశాలు జారీచేశారు. మంగళవారం సైతం బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్, పస్పుల, నదీ అగ్రహారం, కృష్ణ, పంచదేవులపాడ్, పెద్దచింతరేవుల ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరం..ప్రముఖం ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్‌జె.దొర బీచుపల్లి పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించగా, రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసమేతంగా వచ్చి గొందిమళ్ల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరించి అనంతరం జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తొలుత జూరాలలో పుణ్యస్నానమాచరించాలని పర్యటన ఖరారు చేసుకున్నప్పటికీ ఆ ఘాట్ నీళ్లు లేవన్న సమాచారంతో రంగాపూర్ ఘాట్ వద్ద పుణ్యస్నానమాచరించారు. గొంది మళ్లలో మంత్రి లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా స్నానమాచరించారు. కర్నూల్ వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక గొందిమళ్ల వీఐపీ ఘాట్‌లో స్నానమాచరించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నది అగ్రహారంలో సంధ్యా హారతిఇచ్చారు. మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి పలు ఘాట్లను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కలెక్టర్ శ్రీదేవి బీచుపల్లి, రంగాపూర్ ఘాట్లను పరిశీలించారు. బీచుపల్లిలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను పరిశీలించడంతోపాటు అక్షయ పాత్ర ఫౌండేషన్ పుష్కర డ్యూటీలో ఉన్న స్వచ్ఛంద సేవకులకు, ఉద్యోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్వచ్ఛంద సేవకులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. అన్ని ప్రాంతాల్లో నది హారతి విధిగా ఇవ్వాలని, హారతి ప్రాధాన్యతను ఆధ్యాత్మిక ప్రశస్తిని ప్రజలకు వివరించాలని ఆమె అధికారులకు సూచించారు. ఇటు సోమశిలలోనూ మంగళవారం భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో పుష్కరస్నానం చేసే భక్తుల రద్దీ కొంత తగ్గడంతో హైవేపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కొంతమేర సడలించారు. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. నేడు మంచాలకట్టలో వైఎస్‌కు పిండ ప్రదానం కొల్లాపూర్ సమీపంలోని మంచాలకట్ట ఘాట్ వద్ద బుధవా రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదా నం చేయనున్నారు. ఉదయం 11 గంట లకు శాస్త్రోకంగా పిండప్రదానం చేయనున్నారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి కోరారు. -
కృష్ణా పుష్కరాల భక్తులకు అల్పాహారం
రాయికల్(షాద్‌నగర్ రూరల్): ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ టోల్‌ప్లాజా వద్ద ఆర్యవైశ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఉచిత అల్పాహారం అందజేశారు. అల్పాహార కార్యక్రమం మంగళవారం 5వ రోజుకు చేరుకుంది. వనితా, వాసవీక్లబ్ ఆర్థిక సహకారంతో అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. పుష్కరాలు ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సంఘం సభ్యులు తెలిపా రు. పుష్కరాలకు వెళ్లే భక్తులకు దారిలో అల్పాహారాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆకారపునాగరాజు, వసుందర, సురేష్, శశిధర్, సూర్యప్రకాష్, విజయ్‌కుమార్, శారద, సుగుణ, బాల్‌రాజ్, కృష్ణయ్య, సంతోష్, ప్రభాకర్, లక్ష్మయ్య, నరేందర్. సింహ్మయ్య, సుభాష్, నరేష్, భారతి, వెంకటేష్, నర్సింలు, నందీశ్వర్, చంద్రయ్య, భారతి, విజయరాణి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
* పుష్కర నగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత ప్రయాణం * 150 బస్సులను తిప్పుతున్న అధికారులు * ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఆర్ఎం * దూరప్రాంతాలకు సర్వీసుల పెంపు అమరావతి (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భక్తులు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలకు 905 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు, మరో 500 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచుకున్నారు. పుష్కరనగర్ల ఏర్పాటుతో బస్సులన్నీ సుమారు 2 లేదా 3కిలో మీటర్లు దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పుష్కరనగర్ల నుంచి ప్రయాణికులు, భక్తులను ఘాట్ల వద్దకు ఉచితంగా దింపేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలోని పుష్కర నగర్ల నుంచి ఘాట్‌కు 60 బస్సులు, మంగళగిరి నుంచి ఎయిమ్స్, తాడేపల్లికి 30 బస్సులు, ఎయిమ్స్ నుంచి ఉండవల్లికి 15, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి 15, కేసీ కెనాల్ రైల్వేస్టేషన్ నుంచి తాడేపల్లి, ఉండవల్లికి 30 బస్సులను తిప్పుతున్నారు. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు... నిత్యం తిరిగే సర్వీసులతో పాటు బెంగళూరుకు 7, చెన్నైకి 9, హైదరాబాద్‌కు 25, తిరుపతికి 2 సర్వీసులతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు. విశాఖపట్నంలకు అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా పుష్కర స్పెషల్ టికెట్ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటుగా ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృతి
⇒ కృష్ణానదిలో ఇసుక గుంతల్లో పడడంతో ఘటన ⇒ డ్రెడ్జర్‌తో తీసిన ఇసుక గుంతలే ⇒ ఐదుగురు యువకుల ప్రాణాలను బలికొన్న వైనం ⇒ లోతు ఎక్కువగా ఉండటంతో కాపాడలేకపోయాం.. గజ ఈతగాళ్లు అమరావతి: పుష్కర స్నానాలకు వెళ్లిన ఐదురుగు యువకులను అనధికారికంగా తీసిన ఇసుక గోతులు పొట్టన పెట్టుకొన్నాయి. కృష్ణాజిల్లా నందిగామ చైతన్య డిగ్రీ కాలేజిలో బికాం ఫైనల్ఇయర్ చదువుతున్న 11 మంది విద్యార్థులు పుష్కర స్నానాలకని చందర్లపాడు మండలం ఏటూరు రేవు ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు ఇసుక ర్యాంపు ప్రాంతాల్లో స్నానం చేద్దామని మంగళవారం ఉదయం 11గంటలకు వెళ్లారు. నదిలో నీళ్లు మాములుగా ఉన్నాయనుకుని ఒక విద్యార్థి దిగగా...డ్రెడ్జర్‌తో తోడిన సుమారు 30నుంచి 35 అడుగుల లోతులో ఉన్న నీటి గుంటలో జారి పడిపోయాడు. స్నేహితున్ని కాపాడేందుకు నలుగురు యువకులు ప్రయత్నించారు. పాశం గోపిరెడ్డి, నందిగామ నగేష్, కంచిచర్ల లోకేష్ సాయి హరగోపాల్, కుమ్మవరపు హరిగోపి, ములకపల్లె హరీష్ ఐదుగురూ ఒకరినొకరు పట్టుకొని ఒడ్డుకు చేరుకొనే ప్రయత్నం చేశారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో అంతా నదిలో మునిగి చనిపోయారు. చేతులు ఊపుతూ కాపాడండి అంటూ వారు చేసిన అర్తనాదాలు విని పరుగెత్తుకుంటూ వచ్చిన స్నేహితుడు వంశీ రక్షించే ప్రయత్నం చేయగా..అతని కాళ్లను ఇద్దరు పట్టుకోవడంతో ఎలాగోలా వారిని వదిలివేసి ఒడ్డుకు చేరాడు. అక్కడే ఉన్న గజ ఈతగాళ్లకు చెప్పి, స్నేహితుల ప్రాణాలు కాపాడాలని వేడుకొన్నాడు. 15 మందిగల గజ ఈతగాళ్ల బృందం యువకులు గల్లంతు అయిన ప్రదేశానికి వెళ్లి రక్షించే ప్రయత్నం చేసింది. ఇసుకను భారీ వాహనాలతో తీయడంతో అక్కడ 30 అడుగులమేర నీటి లోతు ఉండటంతో వారు చెతులెత్తేసి కాపాడలేమంటూ వెనుదిరిగారు. ఒడ్డున ఉన్న స్నేహితులు ఫోన్లు చేయడంతో తర్వాత మరికొందరు గజ ఈతగాళ్లు వచ్చి గాలించి ఐదుగురు యువకుల శవాలను వెలికితీశారు. సంఘటన స్థలానికి పోలీసులు హూటా హుటిన చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ నుంచి ఇలా వెళ్లారు 11 మంది విద్యార్థులు నాలుగు బైకుల్లో కాలేజీ నుంచి ఇంటర్ వెల్ మధ్యలో పుష్కర స్నానాలకు వచ్చినట్లు తెలిపారు. ఏటూరు రేవులో నీళ్లు శుభ్రంగా ఉన్నాయని, అక్కడ అన్నదానం చేస్తున్నారని తెలియడంతో స్నానం చేసి సరదాగా గడిపి వెళ్లామని వచ్చామని స్నేహితులు తెలిపారు. అయితే కంచికర్ల లోకేష్ తండ్రి పులి శ్రీను వాసులు అన్నదానం వద్ద ఉండటంతో నాన్న అరుస్తాడు, వద్దు అని లోకేష్ వారించడంతో చనిపోయిన ఐదుగురు అన్నదానం వద్దకు పోకుండా అక్కడే అగిపోయారు. పులిహోర కోసం వెళ్లిన గువ్వల కార్తీక్, నాదెండ్ల మనోజ్‌కుమార్‌రెడ్డి, రెడ్డి దేవి వరప్రాపాద్, బొడేపూడి వంశి, కూసుగోపి, గద్దె వంశీలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నాయనా...ఎంత జరిగింది: లోకేష్ తండ్రి పులి శ్రీనివాసులు గజ ఈతగాళ్లు వెలికి తీస్తున్న మృత దేహాన్ని తీసుకొస్తున్న సమయంలో చూసి అబ్బా... నా కొడుకే అంటూ లోకేష్ తండ్రి పులి శ్రీనివాసులు విలపిస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. ఎంతపని జరిగింది నాయనా...కష్టపడి చదివించామని, చేతికొచ్చిన ఆధారం పోతే ఎలా బతకాలని బోరున విలపించారు. ఈయన కారుడ్రైవర్‌గా పని చేస్తున్నారు. పుష్కరాలకు ప్రచారం ఎందుకు : వాణి, హరిగోపి తల్లి ‘పిల్లలందరూ పదింటికి నందిగామలో మా ఇంటి దగ్గర నుంచే బయలుదేరి పుష్కరస్నానాలకు వచ్చారు. కళాశాల వారు సైతం యూనిఫాం వేసుకుని రమ్మన్నారని చెప్పటంతో ఇంటికి వచ్చామన్నారు. పిల్లలను కాపాడలేని పోలీసులు ఉంటే ఏమి లేకపోతే ఏమిటి’ అంటూ మృతుడు హరిగోపి తల్లి వాణి గుండెలవిసేలా రోదించారు. శవాలను వెలికితీస్తుంటే బయట పడ్డ శవం ఎవరిదని అంటూ ఆతల్లి అటువైపుగా పరుగుతీయటాన్ని చూసి పలువరు చలించారు. పుష్కరాలకు ప్రచారం ఎందుకు..తగలబడ్డ పుష్కరాలు ప్రాణాలు తీయటానికా అంటూ శాపనార్ధాలు పెట్టారు. నాకు ఒక్కడే కొడుకు..మేము ఎవరి కోసం బతకాలి....వాడులేని జీవితం మాకెందుకు వాడిని చూడకుండా ఉండలేనయ్యా అంటూ ఆతల్లి విలవిలాడింది. మమ్మల్ని తీసుకుని వెళ్తే పోయేది అంటూ బోరున విలపిచింది. బాధతో సీఎంను శాపనార్థాలు పెడుతున్న ఆమెను పక్కనే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మీ పిల్లలను బాబు ఏమన్నా ఈతకు వెళ్ళామన్నాడా అంటూ గొడవకు దిగారు. అయితే రెట్టించిన బాధతో ఆమె‘ నీ తలకాయ నెరిసింది..బుధ్ధి ఉందా’మమ్మల్సి చంపడయ్యా అంటూ ఆమె రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కలచి వేసింది. మమ్మల్ని ఆన్యాయం చేశావే... గోపిరెడ్డి తల్లి మమ్మల్ని అన్యాయం చేయటానికి ఇక్కడకు వచ్చావా నాయనా గోపిరెడ్డి తల్లి కొడుకు శవంపై పడి బోరున విలపించింది. తండ్రి వెంకటేశ్వరెడ్డికి నోట మాట రాక శవంపై పడి అలాగే ఉండిపోయారు. వారిని ఓదార్చటం ఏవరి తరం కాలేదు. వీరికి ఒక్కడే కుమారుడు. మరో సంతానం శ్రావణి డిగ్రీ చదువుతోంది. మేమంతా ప్రాణ స్నేహితులం...విజయకుమార్ (స్నానం కోసం వచ్చిన తోటి విద్యార్ధి) ఒక్కొక్క శవాన్ని ఒడ్డుకు వెలికి తీస్తుంటే...వారిని చూసి వారితో పాటు వచ్చిన తోటివిద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. అటు వద్దన్నాం...వద్దన్నా వెళుతుంటే ఆపుదామని చూశాం...ఆ లోపే లోపలికి వెళ్ళారు. ఐదుగురు నడుచుకుంటూ వెళ్లారు. ఒకరు కింద పడగానే. మిగిలిన అందరు చేతులు పట్లుకొని వాడిని లాగే ప్రయత్నంలో అందరు పెద్ద నీటి గుంత కావడంతో బయటకు రాలేక నీట మునిగిపోయారు. రక్షించేందుకు ప్రయత్నించాను : వంశీ నాకు కొంత మేర ఈత రావటంతో స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించాను. నీటిలో పడిపోయిన ఇద్దరు రెండు కాళ్లు పట్టుకోవటంతో ఎలాగోలగా నేను నీటి నుండి బయటపడ్డా..వారిని రక్షించలేకపోయా..గజ ఈతగాళ్ళకు సమాచారాన్ని అందించా. మనోజ్‌కుమార్ , గోపి, దేవివరప్రసాద్లందరూ మేమంతా ఒకే బెంచి కూర్చునే వారం. ఎక్కడకి వెళ్ళినా..అంత కలిసే వెళ్ళావాళ్ళమని, ఇక్కడ స్నానం చేస్తామని వచ్చాం. అక్కడికి వెళ్లొద్దన్నాం : ప్రత్యక్ష సాక్షి ఎస్. సత్యన్నారాయణ పదకొండు మంది యువకులు బైకులపై ఇక్కడకు వచ్చారు. యువకులు అక్కడ ఉంటే తూర్పు వైపు వెళ్ళాలని, పడమర వైపు వద్దని చెప్పాం. వాళ్ళు అటు ఇటు ఆడుకుంటూ....పడమరవైపుకు వెళ్ళారు. వారు మునిగిపోతూ వేసిన కేకలు వినిపించాయి. ఆ లోపే పడవ వేసుకుని 15 మంది గజఈతగాళ్ళం వెళ్ళాం. అక్కడ చూసినా కనిపించలేదు. అప్పటికే నీట మునిగిపోయారు. -
మహానేతను మరవలేము
అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో సోమవారం కొందరు యువకులు పిండప్రదానం చేసి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పుష్కరాల్లో పవిత్రస్నానం చేయటానికి వచ్చేవారిలో అధికశాతం పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన 45 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కొందరు యువకులు వైఎస్సార్ చిత్రపటంతో తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్‌కు చేరుకున్నారు. ముందుగా చిత్రపటంతో ఘాట్‌లో స్నానం చేశారు. అనంతరం పిండప్రదానం షెడ్ వద్ద చిత్రటానికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. తిరిగి ఘాట్ వద్దకెళ్లి కృష్ణా నదిలో పిండాలను విడిచిపెట్టారు. వైఎస్సార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరినీ వైఎస్ ఆదుకున్నారన్నారు. ఆయన మరణం తరువాత రాష్ట్రం అవస్థల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన సభ్యులు మూర్తాల ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఓర్సు కాశయ్య, తిరుపతిరెడ్డి, గుండా కిషోర్, సర్పంచ్ గుర్రాల రాజు, ఉప సర్పంచ్ ఏలూరు సత్యనారాయణ, ఎంపీటీసీలు ఉమ్మా రామాంజనేయరెడ్డి, జి.పద్మజానాథ్రెడ్డి, బీసీ సెల్ మండల కన్వీనర్ తిరుపతిరావు, చెవిరెడ్డి ఏరువ, పమ్మి సీతారామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
పుష్కర ఘాట్లకు పోటెత్తున్న భక్తులు
-
విమాన ప్రయాణ చార్జీలకు రెక్కలు
పుష్కరాల ప్రభావంతో పెరిగిన వైనం విమానాశ్రయం(గన్నవరం): కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే యాత్రికుల కోసం ఆర్టీసీ ఉచిత, అదనపు బస్సులు, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుంటే.... విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. పుష్కరాలకు ఎయిర్కోస్టా హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీస్ మినహా మిగిలిన విమాన సంస్థలేవీ అదనపు సర్వీసులు నడిపేందుకు ముందుకురాలేదు. దీంతో ప్రస్తుతం విమాన సర్వీసులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సాధారణ రోజుల్లో రూ.1,500 నుంచి రూ.4,500 వరకు ఉండే విమాన టికెట్ వెల పుష్కరాల ప్రారంభంతో మూడు నుంచి ఆరు రెట్లు పెరిగాయి. విజయవాడ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు విమాన సర్వీసుల చార్జీలు ఆకాశన్నంటుతున్నాయి. పుష్కరాల ముందు వరకు రూ.5 వేలు వరకు పలికిన ఎయిరిండియా విజయవాడ-న్యూఢిల్లీ సర్వీసుల చార్జీ ఆదివారం రూ. 14,111కు చేరుకుంది. ఇదే సర్వీసుకు 15న ఢిల్లీ-విజయవాడకు రూ.16,076గా ఉంది. రూ.3 వేలలోపు టికెట్ ఉండే స్పైస్‌జెట్ విజయవాడ-బెంగళూరు సర్వీసుకు రూ.12,400, విజయవాడ-చెన్నైకు రూ.10,400, విజయవాడ-హైదరాబాద్‌కు రూ.9,199, బెంగళూరు- విజయవాడకు రూ.8,499 వరకు పెరిగింది. ఎయిర్ కోస్టా విజయవాడ-బెంగళూరు సర్వీసులో రూ.5వేల లోపు చార్జీ ఉండే టికెట్ ప్రస్తుతం రూ.10,120 పలుకుతోంది. ఒక్కసారిగా విమాన చార్జీలకు రెక్కలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. -
కృష్ణా పుష్కరాల్లో మరో అపశ్రుతి
విజయవాడ: కృష్ణా పుష్కరాలలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి పవిత్ర సంఘం ఘాట్ వద్ద ఫిట్స్ వచ్చి ఓ యవకుడు నీళ్లలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని దగ్గరోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కాసేపటికే మృతి చెందాడు. మృతుడు ఏ కొండూరు మండలం కంబంపాడు గ్రామానికి చెందిన పి. యశ్వంత్గా గుర్తించారు. మరోవైపు విజయవాడ దుర్గా ఘాట్ వద్ద పాము కలకలం రేపింది. పుష్కర స్నానం చేస్తుండగా సుమంత్ అనే బాలుడిని పాము కాటు వేసింది. ఈ విషయాన్ని గమనించిన అతడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గజ ఈతగాళ్లు పామును పట్టుకున్నారు. అలాగే గుంటూరు జిల్లా అమరావతిలో విషాదం నెలకొంది. పుష్కర స్నానానికి వచ్చిన రమేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కారు పార్క్ చేస్తుండగా అస్వస్థతకు గురైన అతడు...అక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో ఘటనలో పుణ్య స్నానం ఆచరించడానికి వచ్చిన మహిళ గుండెపోటుకు గురై మృతిచెందింది. కృష్ణాజిల్లా తమిడిముక్కల మండలం ఐనపూరు ఘాట్‌లో సోమవారం శకుంతల(65) అనే మహిళ స్నానం చేయడానికి వచ్చింది. పుష్కర స్నానం చేస్తున్న సమయంలో గుండె పోటు వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలింది. -
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ పుష్కరాల సందడి
-
జనసంద్రంగా కృష్ణమ్మ
-
పుష్కరాలకు వచ్చే రైతులకు లఘుచిత్రాల ప్రదర్శన
రాయవరం : కృష్ణా పుష్కరాల్లో పశు సంవర్ధక శాఖకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించేందుకు రిసోర్స్ పర్సన్‌గా తనను ప్రభుత్వం నియమించినట్లు రాయవరం పశువైద్యశాల ఏడీ డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు తెలిపారు. రాయవరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈమేరకు పశు సంవర్ధక శాఖ సంచాలకుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆయన తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 16, 17 తేదీల్లో పశు సంవర్ధకశాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పశుయాజమాన్యంపై రూపొందించిన లఘుచిత్రాలను అక్కడ తాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ టీమ్‌లో జిల్లా నుంచి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె.గాబ్రియేల్, పామర్రు, ఆలమూరు, రాజమండ్రి వెటర్నరీ డాక్టర్లు‡ జాన్‌పాల్, ఓ.రామకృష్ణ, కె.సత్యనారాయణ, అమలాపురం ఏడీ డాక్టర్ ఎల్.అనితలు ఉన్నట్టు తెలిపారు. -
పుష్కరాలకు విచ్చేయనున్న సూపర్ స్టార్
కృష్ణా పుష్కరాలలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ గుంటూరు విచ్చేయనున్నారు. పుష్కరాలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. త్వరలో రజనీకాంత్ గుంటూరులోని చింతపల్లిలో ఉన్న విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానం ఆచరించనున్నారు. గతేడాది గోదావరి పుష్కరాలకే ప్రభుత్వం రజనీకి ఆహ్వానం పంపినప్పటికీ.. ఆ సమయంలో ఆయన రాలేకపోయారు. కృష్ణా పుష్కరాలకు రజనీ హాజరవుతారని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అనంతరం రజనీ ఓ నెల రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' రెండవ దశ షూటింగ్లో పాల్గొంటారు. రోబో 2.0లో బాలీవుడ్ రుస్తుం అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
'పుష్కరాలను ప్రచారం కోసం వాడుకుంటున్న బాబు'
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా ఆదివారం చిత్తూరులో నిప్పులు చెరిగారు. కృష్ణా పుష్కరాలను చంద్రబాబు తన ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. పుష్కర ఘాట్ల వద్ద కనీస వసతులు లేవని విమర్శించారు. చాలా ఘాట్లలో నీరు లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పురాతన ఆలయాలను కూల్చి మరుగుదొడ్లు నిర్మించడం దారుణమన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబుతోపాటు ఆయన అనుయాయులు వేల కోట్లు దోపిడీ చేశారని రోజా విమర్శించారు. -
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
కర్నూలు: వరుస సెలవులు రావడంతో శ్రీశైలంలోని భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలోని పుష్కర ఘాట్లులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ ప్రాంగణం అంతా జనసంద్రంగా మరింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఓ గంట సమయం పడుతోంది. -
తల్లిదండ్రులు, అత్తమామలకు చంద్రబాబు పిండప్రదానం
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ తల్లిదండ్రులు, అత్తమామలకు శనివారం పిండ ప్రదానాలు చేశారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడులకు పిండప్రదానాల కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా తన అత్త, మామ బసవతారకం, ఎన్టీ రామారావులకు కూడా పిండ ప్రదానాలు చేశారు. -
రెండో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ
-
మత్స్యశాఖ ఆధ్వర్యంలో పుష్కర పర్యవేక్షణ
-
సందట్లో సడేమియాలు
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పొటెత్తుతుండటంతో.. సందట్లో సడేమియాలాగా జేబు దొంగలు తమ పని చక్కబెడుతున్నారు. పద్మావతి ఘాట్‌లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని భక్తులు ఘాట్‌కు వచ్చిన డీజీపీ, ఎమ్మెల్యే గద్దెలకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పిక్ పాకెటర్లపై దృష్టి సారించి 10 మంది చోర శిఖామణులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారంతా 14 ఏళ్లలోపు వారు కావడంతో.. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. వాళ్ల ఫోటోలు తీసుకొని పుష్కరాలు జరిగే రోజుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించొద్దని హెచ్చరించి వదిలేశారు. -
సాగర్ ఘాట్‌లో భక్తుల ఇక్కట్లు
నాగార్జున సాగర్: వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానమాచారించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయక పోవడంతో భక్తులతో పాటు బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేలాది మంది భక్తులు పిండ ప్రధానం కార్యక్రమం చేపట్టడానికి యత్నిస్తుండగా.. వసతుల లేమి వెక్కిరిస్తోంది. ఈ రోజు భానుడి భగభగలు ఎక్కువగా ఉండటంతో.. ఎండలోనే పిండ ప్రధానం చేస్తున్న పలువురు భక్తులు సొమ్మసిల్లారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు'
విజయవాడ : దుర్గ గుడి వద్ద పోలీసులు శనివారం అత్యుత్సహం ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రి కొండపైకి అనుమతి లేదంటూ దేవాలయ ఈవో సూర్యకుమారి, ప్రధాన అర్చకులు శివప్రసాద్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కొండపైకి నడిచి వెళ్లాలని వారికి పోలీసులు సూచించారు. తాను దేవాలయం ఈవోనని సూర్యకుమారి పోలీసులకు చెప్పింది. అయినా ఆమె మాటలను వారు పట్టించుకోలేదు. అయితే దేవాలయం ఆధికారుల సమక్షంలోనే వీఐపీల వాహనాలకు కొండపైకి అనుమతించారు. పోలీసుల తీరుపై ఆలయ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈవో సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సమయత్తమయ్యారు. -
పద్మావతి ఘాట్‌లో దొంగలు హల్చల్
విజయవాడ : కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో పద్మావతి ఘాట్‌లో శనివారం దొంగలు హల్చల్ చేశారు. నదిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తుల దృష్టి మరల్చి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అలా వచ్చిన భక్తులకు చెందిన రూ. 4500, మూడు తులాల బంగారంతోపాటు సెల్ ఫోన్ అపహరించుకుని పోయారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
పుష్కర ఘాట్లలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
హైదరాబాద్ : కృష్ణా పుష్కరోత్సవాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. అదికాక నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు పలు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసింది. -
ప్రారంభం.. పలుచగా
ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు.. పీఠాధిపతులదే తొలిపుష్కర స్నానం * వీఐపీ ఘాట్‌లో జయేంద్ర సరస్వతి, విజయేంద్ర స్వామి పుణ్యస్నానం * అనంతరం స్నానం ఆచరించిన సీఎం దంపతులు సాక్షి, అమరావతి/ ఇంద్రకీలాద్రి: పవిత్ర కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పన్నెండేళ్లకు ఒకసారి బృహస్పతి కన్యారాశిలో ప్రవేశంతో ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శుక్రవారం తెల్లవారుజామున 5.40గంటలకు వీఐపీ ఘాట్‌లో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత కలశస్థాపన, కృష్ణవేణి స్థాపన, ఆవాహన, పూజా కార్యక్రమాలతో కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు. జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర స్వాములు తొలి పుష్కర స్నానం ఆచరించగా.. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర కుటుంబీకులు పుష్కర సాన్నం చేశారు. ప్రభుత్వం ప్రచారార్భాటంతో ఊదరగొట్టినప్పటికీ కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తులు చాలా తక్కువ గా పుణ్యస్నానాలు ఆచరించారు. గత ఏడాది గోదావరి పుష్కరాల తొలిరోజు దుర్ఘటన భక్తులను వెన్నాడుతుండటం... శ్రావణ శుక్రవారం కావడం... ప్రభుత్వం మితిమీరిన ఆంక్షలతో కట్టడి... వెరసి కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 4,51,569 మంది భక్తులు స్నానం చేశారు. వాస్తవానికి అందులో సగంమంది కూడా రాలేదని అధికారవర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం. పుష్కరాలకోసం కృష్ణా జిల్లాలో 74, గుంటూరు జిల్లాలో 79, కర్నూలు జిల్లాలో 5 ఘాట్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు దాదాపు అన్ని ఘాట్లలో భక్తులు చాలా పలుచగా కనిపించారు. పుష్కర స్నానం పవిత్రం: జయేంద్ర సరస్వతి ఎనిమిది తీర్థాలు కలిసిన కృష్ణా పుష్కర స్నానం ఎంతో పవిత్రమైనదని, పుష్కర స్నానం ఆచరించిన భక్తులందరూ సుఖ సంతోషాలను కలిగి ఉంటారని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి చెప్పారు. కృష్ణా పుష్కర సంకల్ప కార్యక్రమాన్ని జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర స్వామిలతో పాటు పలువురు పీఠాధిపతులు శాస్త్రోక్తంగా నిర్వహించగా, పూజా కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ర్టంలోని 13 జిల్లాలోని పలు ఆలయాల నుంచి సేకరించిన పసుపు, కుంకుమ, పూలతోపాటు టీటీడీ తరఫున పట్టుచీర, పూజా ద్రవ్యాలను డాలర్ శేషాద్రి, ఇతర తిరుమల అర్చకులు సీఎం చంద్రబాబుకు అందచేశారు. సీఎం చంద్రబాబు దంపతులు కృష్ణమ్మకు సారెను సమర్పించారు పుష్కరాల తీరును పరిశీలించిన సీఎం సీసీ కెమెరా విజువల్స్‌లో వీక్షణ విజయవాడ (లబ్బీపేట)/ఇంద్రకీలాద్రి: కృష్ణా పుష్కరాలు జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎంజీ రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించారు. వివిధ స్నాన ఘట్టాలు, నగరంలోని ముఖ్యమైన రహదారులు, కూడళ్లలోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల రాకపోకలు వంటి అంశాలను సీసీ కెమెరా విజువల్స్‌లో పరిశీలించారు. వివిధ శాఖల నుంచి అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు భక్తుల స్పందనను తెలుసుకుని, మరింత మెరుగైన రీతిలో సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇలా ఉండగా గన్నవరం వద్ద విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన కడప జిల్లా రాజంపేట మండలం ఊతుకూరు గ్రామానికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట భయం వల్లే భక్తుల సంఖ్య తగ్గింది: పల్లె విజయవాడ సెంట్రల్: గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట భయం కారణంగా కృష్ణా పుష్కరాల్లో తొలి రోజు భక్తుల సంఖ్య తగ్గిందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా పుష్కరాల తొలిరోజు 4,51,561 మంది భక్తులు స్నానమాచరించినట్లు తెలి పారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరి గే అవకాశం ఉందని, ప్రభుత్వ అంచనా ప్రకారం 3.50 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేశామన్నారు. పోలీస్ ఆంక్షలు శృతిమించాయని మంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. పోలీసుల అతి జాగ్రత్త అవసరం లేదని, భక్తులతో పాటు వివిధ శా ఖల అధికారులను ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసులు తీరుమార్చుకోవాలని హోంమంత్రి చినరాజప్ప సూచించినట్లు చెప్పారు. -
అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌పై టీఆర్‌ఎస్‌నజర్!
* పుష్కర పర్యటన పొడవునా ఆయనకు ప్రాధాన్యమిచ్చిన సీఎం * అలంపూర్‌కు వరాలు... సంపత్ విజ్ఞప్తి వల్లేనంటూ వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు పర్యటన ఆసాంతం అధిక ప్రాధాన్యమివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం బస చేసిన స్థానిక పర్యాటక శాఖ అతిథి గృహానికి వెళ్లిన సంపత్‌కు ఊహించని ఆదరణ లభించింది. సీఎంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గ సమస్యలను నివేదించారు. మంత్రులు, అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరితోనూ పర్యటనలో సీఎం ఇలా ప్రత్యేకంగా భేటీ కాలేదు. సంపత్‌కు ఆయన ఇంత ప్రాధాన్యం ఇవ్వడంపై పలు ఊహాగాలు వెలువడుతున్నాయి. సంపత్ తన అలంపూర్ నియోజకవర్గ సమస్యలపై పలు వినతిపత్రాలను సీఎంకు అందజేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. సీఎం స్థాయి నాయకుడు పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యలు తదితరులు ఇలా వినతిపత్రాలివ్వడం పరిపాటే అయినా, సంపత్ వినతుల్లో చాలావాటిని అక్కడికక్కడే పరిష్కరించడానికి కేసీఆర్ మొగ్గుచూపారు! అంతేగాక అక్కడికక్కడ విలేకరుల సమావేశంలోనే అలంపూర్‌పై వరాల జల్లు కురిపించడం మరింత ఆసక్తి రేపుతోంది. అంతేకాదు... అలంపూర్‌కు 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తున్నట్లు సమావేశంలో ప్రకటించిన సీఎం, ఈ విషయాన్ని సంపత్ తన దృష్టికి తెచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు! అలాగే, ‘‘సంపత్ కోరినట్టుగా ఆర్టీసీ డిపో మంజూరు చేయలేం. కాకపోతే ఆయన కోరినట్టుగా ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ నుంచి సాగునీరు అందజేస్తాం’’ అంటూ విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన సంపత్ పేరును సీఎం పదేపదే ఉటంకించారు. అంతేగాక మీడియా సమావేశం ప్రారంభమవగానే సంపత్‌ను సీఎం తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇది కూడా సీఎం ఆయనకిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమేనని అంటున్నారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ సమస్యలను సీఎం ప్రస్తావిస్తూ వీలైనప్పుడల్లా సంపత్ పేరును ఉటంకించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేత అని, పలు అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని కూడా అన్నారు. ఇదంతా భావి రాజకీయ పరిణామాలకు సూచికేనని టీఆర్ఎస్ శ్రేణులే అంటుండటం విశేషం! అయితే సంపత్ మాత్రం తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాననని, పేదల సమస్యలను విన్నవించడం తప్ప తమ భేటీకి మరో ప్రాధాన్యమేమీ లేదని కొందరు పాత్రికేయులతో అనడం విశేషం. -
సైకతస్నానం
అక్షర తూణీరం ఇప్పటికి నెల రోజుల నుంచి పుష్కరాల కబుర్లు తప్ప వేరేమీ లేవు. అన్ని ఆఫీసులు పుష్కరం ముసుగులే సుకు కూర్చున్నా ఏర్పాట్లేమో అరకొరగానే ఉన్నాయి. పుష్కరాలు కృష్ణానదికి కాదు! నవ్యాంధ్రప్రదేశ్‌కి. ఆ రాష్ట్ర నాయకులకి. వారి పంట పండింది. ఇట్లాంటి సహజ సందర్భాలకు చంద్రబాబు రెచ్చి పోతారు. మహా శివరాత్రి, తిరుపతి బ్రహ్మోత్సవం, సూర్య గ్రహణం, రథ సప్తమి - ఇలాంటి అవ కాశాలు ఏవి వచ్చినా వదలరు. అవన్నీ తన ప్రమేయంతో వచ్చాయన్న స్పృహ కల్పించి, అశేష ప్రజానీకానికి తనదైన శైలిలో ఒక సందేశం ఇస్తారు. మరి పుష్కరం అంటే మామూలా? ముఖ్యమంత్రి హస్తినకు ప్రత్యేక విమానంలో వెళ్లి, చేటలంత పుష్కర శుభలేఖల్ని స్వయంగా పంచి వచ్చారు. కాని వాటికేమంత గొప్ప ప్రతిస్పందనలు కనిపించడం లేదు. ఇక వెంకయ్య మనవాడు కాబట్టి, అందరి తరఫునా అన్ని కృష్ణా రేవు ల్లోనూ మునిగి తేలుతాడని అనుకుంటున్నారు. నమ్మకాలున్న వారికి పుష్కరం పెద్ద పర్వమే కావచ్చు. వేదిక ధర్మపరాయ ణులు ఆచరించే పవిత్ర క్రతువే కావచ్చు. కాని, ఇప్పుడు జరుగుతున్న ఆర్భా టాలను ప్రజలు గమనిస్తు న్నారు. అయోమయంలో మునకలు వేస్తున్నారు. ఈ వైదిక సంధ్యలో అత్యాధునిక లేజర్ షోలు ఎంత అసందర్భమో అనుకుంటున్నారు. జన సామాన్యాన్ని దారి మళ్లించే ప్రయత్నంలో ఈ పుష్కరాల పడవని మహా నౌకగా చిత్రించి చుక్కానిని పెడమార్గం పట్టించే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికి నెల రోజుల నుంచి పుష్కరాల కబుర్లు తప్ప వేరేమీ లేవు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి దాకా పుష్కరం ముసుగులేసుకు కూర్చున్నాయి. ఇక పోలీసు శాఖ అయితే చెప్పనే అక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ‘మీరో పని చేయండి. చూస్తున్నారుగా... ఈ హడావుడి అయ్యాక రండి’ అని సెలవిస్తున్నారు. నిజానికి పైవారు ఏ పనిలోనూ మునిగి ఉండరు. ఇంతాచేసి ఏర్పాట్లు అరకొరగానే పూర్తయ్యాయి. చేసిన పనుల న్నింటినీ, ఈ పుష్కర పర్వం పూర్తయ్యాక చూసి, బేరీజు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఒక అనుభవజ్ఞుడి సూచన. అయితే, అప్పటికి సగం దార్లు, వంతెనలు, ఘాట్లు మిగిలి ఉండకపోవచ్చు. ‘అప్ప ఆర్భాటమేగాని నూర్పిట్లో యిత్తు లేదని’ సామెత. కృష్ణమ్మ అంత దయగా ఏమీ ప్రవహించడం లేదు. బెజవాడకి దిగువన మూరెడు ఎత్తు నీరు మాత్రమే ఉంది. కొందరు మేము ఈ పుష్కర వేళ కృష్ణా ఇసుకతో స్నానం చేయవచ్చునా? సైకత స్నానం మీద బ్రహ్మశ్రీ విడమరచి చెప్పాలని భక్తులు కోరుతున్నారు. ‘మన అమరావతిని నిర్మించనున్నది జపాన్, చైనా, సింగపూర్ కంపెనీల వారే కదా. వారు పుష్కర స్నానాలకు వచ్చారా?’ అని ఓ కాపిటలిస్ట్ వాకబు చేశాడు. అక్కడ భూమి పోగొట్టుకున్న వారిని ‘కాపిటలిస్ట్’లనే బిరుదు నామంతో వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఉన్నా, పుష్కరాల పుణ్యమా అని కృష్ణా తీరం మహ నీయులను స్మరించుకునే సదవకాశం వచ్చింది. కొత్త కాపిటల్‌లో, మందుల మాంత్రికుడు యల్లాప్రగడ సుబ్బారావుకి, జాతీయ జెండా శిల్పి పింగళి వెంకయ్యకి సముచిత స్థానం కల్పించాలి. (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
పుష్కరాలకు లోటు లేకుండా బస్సులు
తిరుపతి అర్బన్: కృష్ణ పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తని విధంగా బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. పుష్కరాల స్పెషల్ బస్సును శుక్రవారం ఉదయం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి డిపో గ్యారేజీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత గోదావరి పుష్కరాలకు 12 రోజుల పాటు 420 బస్సులను నడిపితే, ఈసారి కృష్ణ పుష్కరాలకు 500కు పైగా బస్సులను నడపాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా పుష్కర యాత్రికులకు సేవ చేయడమే ప్రధాన ధ్యేయంగా బస్సులను నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి రోజుకు 40 నుంచి 50 బస్సుల వరకు పుష్కరాలకు నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా యాత్రికులు గ్రూప్‌గా వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ చంద్రశేఖర్, డిపో మేనేజర్ విశ్వనాథ్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ భాస్కర్‌రెడ్డి, ఆర్టీసీ పీఆర్వో కృష్ణారెడ్డి, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ దేవాలయాలకు అన్యాయం
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు: సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని దేవాలయాలు, వాటి విశిష్టతను అప్పటి పాలకులు కనుమరుగు చేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పుష్కరాలకు సైతం ప్రాధాన్యం లేకుండా చేశారని, అప్పుడు జరిగిన అన్యాయాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సరిదిద్దుతోందని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్లలో కృష్ణా పుష్కరాలను సీఎం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అలంపూర్‌లోని హరిత అతిథి భవనంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైన జోగుళాంబ దేవాలయాన్ని తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. జోగుళాంబ దేవాలయ విస్తరణకు కొన్ని ఆటంకాలు ఉన్నాయని, వాటిపై కేంద్రంతో మాట్లాడి ఆలయాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. జోగుళాంబ తల్లి చల్లని ఆశీస్సులతో ప్రత్యేక తెలంగాణ సుసాధ్యమైందన్నారు. ఏటా 5 వేల నుంచి 10 వేల మంది దేవి ఉపాసకులు ఈ ప్రాంతానికి వస్తారని, అందుకు తగినట్లు వసతి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ్నుంచే పాదయాత్ర ప్రారంభించానని, ఈ ప్రాంత రైతులకు గతంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేందుకు ఆర్డీఎస్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. కాగా అలంపూర్‌లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సీఎంను కలసి వినతిపత్రం సమర్పించారు. అలంపూర్‌పై వరాల జల్లు అలంపూర్‌కు తక్షణం 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రెండ్రోజుల్లో దీనిపై విధి విధానాలు ఖరారు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కోరగా.. ఆర్టీసీ ఇప్పటికే రూ.200 కోట్ల నష్టంలో ఉందని, కొత్త డిపోపై హామీ ఇవ్వలేనన్నారు. కంట్రోలింగ్ పాయింట్ లేదా మినీ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్‌లో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, బాల్‌రాజు, మాజీ ఎంపీ మందా జగన్నాథం, టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ రాములు ఉన్నారు. -
నగరం నుంచి పుష్కర ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా పుష్కరాలకు సిటీవాసులు భారీగా తరలి వెళ్తున్నారు. వరుస సెలవులతో శుక్రవారం బస్సులు, రైళ్లు కిక్కిరిసాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. విజయవాడకు వెళ్లే బస్సులు సైతం కిటకిటలాడాయి. ప్రతి రోజు నగరం నుంచి బయలుదేరే 93 రెగ్యులర్ బస్సులతో పాటు మరో 130 బస్సులను అదనంగా నడిపారు. మరోవైపు బీచుపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఘాట్లకు సైతం భక్తులు తరలి వెళ్లారు. జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 40 రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ, గద్వాల్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ మీదుగా వెళ్లే అన్ని రైళ్లలోనూ శుక్రవారం భారీ రద్దీ కనిపించింది. సికింద్రాబాద్ స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు రైళ్ల కోసం పడిగాపులు కాశారు. రిజర్వుడ్ బోగీల్లో బెర్తులు లభించని వాళ్లు జనరల్ బోగీల్లో బయలుదేరారు. దీంతో సాధారణ బోగీలు సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో నిండిపోయాయి. పుష్కర స్పెషల్ రైళ్లకు మల్కాజిగిరి రైల్వేస్టేషన్లో సబర్బన్ ట్రైన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ వారు స్వాగతం పలికారు. అనంతరం భక్తులు సంతోషంగా పుష్కర స్నానాలు ఆచరించి రావాలని కోరుతూ వీడ్కోలు చెప్పారు. 250 ప్రత్యేక బస్సులు ... రైళ్లతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లోనూ జనం తరలి వెళ్లారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 130 ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. శ్రీశైలం,నాగార్జునసాగర్, బీచుపల్లి, వాడపల్లి, తదితర ప్రాంతాలకు మరో 120 బస్సులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే 1500 ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ , ఏసీ బస్సులకు ఇవి అదనం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు తాము ఆశించిన స్థాయి రద్దీ కనిపించలేదని, విజయవాడ వైపు వెళ్లిన ప్రయాణికుల్లో ఎక్కువ శాతం వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని వెళ్లిన వాళ్లేనని, పుష్కరాల రద్దీ మొదటి రోజు సాధారణంగానే ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ‘పుష్కర’ యాప్స్... గాజులరామారం: పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గూగూల్ ప్లే స్టోర్‌లో కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్‌లో పుష్కర్ ఘాట్స్‌కు ఎలా వెళ్లాలో తెలిపే రూట్ మ్యాప్స్ చక్కగా రూపొందించారు. ఆయా ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాల వివరాలు, అత్యవసర సమయాలలో చేయాల్సిన నంబర్లకు ఒన్టచ్ బటన్ల సదుపాయం తదితరాలు వివరంగా ఉన్నాయి. టీఎస్ కృష్ణ పుష్కరాలు 2016 ఈ యాప్‌ను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రూపొందిం చారు. దీన్ని గూగూల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొవచ్చు. అనంతరం స్క్రీన్‌పై ‘చెక్ వాటర్ క్వాలిటీ ఆఫ్ పుష్కర్ ఘాట్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పుష్కర ఘాట్ల లొకేషన్లు మ్యాప్‌లో కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎక్కడ సెలక్ట్ చేస్తే అక్కడ స్క్రీన్‌పై అదేరోజుకు సంబంధించిన వాటర్ రిపోర్ట్ ప్రత్యక్షమవుతుంది. ఎంబీఎన్ఆర్ కృష్ణ పుష్కరాలు 2016 మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న పుష్కర ఘాట్ల పూర్తి వివరాలు ఈ యాప్‌లో పొందుపర్చారు. ఘాట్ ఆప్షన్స్‌కు వెళ్లి మనకు కావాల్సిన ఘాట్ బటన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే ఘాట్ లొకేషన్ రూట్, అక్కడ దర్శనీయ స్థలాలు, సౌకర్యాలు, హోటల్స్, వాతావరణం వివరాలు తెలుస్తాయి. అదేవిదంగా ఈ యాప్‌లో ఎస్ఓఎస్ ఆప్షన్ ఉన్నది. ప్రమాదకర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్లో పోలీస్, మెడికల్, మహబూబ్‌నగర్ కంట్రోల్ రూం నంబర్ బటన్లు ఉంటాయి. అనౌన్స్మెంట్ ఆప్షన్లో ఘాట్ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. ‘కృష్ణా’ బాటిళ్లకు భలే డిమాండ్ సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ‘కృష్ణా పుష్కర జలం‘ బాటిళ్లకు డిమాండ్ పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నుంచి సైతం అనూహ్య స్పందన లభించింది. మొత్తం మీద పోస్టల్ శాఖ నిర్దేశించిన లక్ష్యానికి మించి బాటిల్స్ కోసం ఆర్డర్లు బుక్ అయ్యాయి. గోదావరి పుష్కరాల్లో ‘గాడ్ జల్’ పేరిట కోటి రూపాయల మేర ఆదాయాన్ని గడించిన స్ఫూర్తితో కృష్ణా పుష్కర జలాలను కూడా పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్నారు. తెలంగాణ, ఏపీ సర్కిల్స్‌లో కలిపి సుమారు మూడున్నర లక్షల బాటిళ్లు విక్రయించేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్కో బాటిల్ (అర లీటర్) ధర రూ.30 గా నిర్ణయించి, దీని కోసం జూలై మొదటి వారం నుంచి ఈ నెల 5 వ తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ ద్వారా ఆర్డర్లు స్వీకరించింది. 3.91 లక్షల బాటిల్స్‌కు డిమాండ్ పోస్టల్ శాఖకు కృష్ణా పుష్కర జలం సరఫరా కోసం లక్ష్యాన్ని మించి 3.91 లక్షలకు పైగా బాటిల్స్‌కు ఆర్డర్లు వచ్చాయి. విజయవాడ రీజియన్‌లో 1.72 లక్షల బాటిల్స్, విశాఖపట్నం రీజియన్‌లో 92 వేల బాటిల్స్, కర్నూల్లో 6,300, హైదరాబాద్ రీజియన్‌లో 32,786, హైదరాబాద్ సిటీలో మూడు వేల బాటిల్స్ సరఫరా కోసం ఆన్లైన్లో ఆర్డర్లు వచ్చాయి. -
కోట్లు ఖర్చు చేసి మురికి నీటిలో స్నానాలు: ఆర్కే
గుంటూరు : పుష్కరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భక్తులను మురికి నీటిలో స్నానాలు చేయిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం సీతానగరంలోని పుష్కరఘాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకొరగా వచ్చిన కొద్దిమంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. లీడింగ్ చానల్ ఏర్పాటుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, భక్తులు స్నానాలు చేసే ఘాట్‌లో మురికి నీరు తోడిపోస్తున్నారని విమర్శించారు. నీటిని తోడేందుకు ఏర్పాటుచేసిన మోటార్లు పనిచేస్తున్నాయో లేదో కూడా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్నానం చేసిన అనంతరం శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయని పలువురు భక్తులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పుష్కరాల తొలి రోజే ఇలా ఉంటే, మిగిలిన 11 రోజుల్లో భక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేసి ఘాట్లు నిర్మించినా.. నీళ్లు వదలడంలో అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. పుష్కరాల పేరుతో చేయించిన పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకా? లేక భక్తుల కోసం చేసినవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఆర్కే వెంట వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు ఈదురుమూడి డేవిడ్‌రాజు, పట్టణాధ్యక్షుడు వేణుగోపాలస్వామిరెడ్డి తదితరులున్నారు. -
18న వైఎస్ జగన్ పుష్కర స్నానం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న పుష్కర స్నానం ఆచరించనున్నారు. వాస్తవానికి ఆయన శనివారం (13వ తేదీ) విజయవాడలో పుష్కర స్నానం చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల రేపటి కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పుష్కరాల బస్సులు ఇక్కడి వరకే
కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను నిలిపి ఉంచే ప్రాంతాలపై అధికారులు వివరంగా ప్రకటన జారీ చేశారు. ఆగస్టు 12 నుంచి నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు తెలిపారు. బస్సులు ఆపే ప్రాంతాలు హైదరాబాద్ రూటు నుంచి వచ్చే బస్సులను ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు అనుమతిస్తారు ఏసీ బస్సులకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు అనుమతినిచ్చారు తిరువూరు, మైలవరం నుంచి వచ్చే బస్సులకు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఎ- కాలనీలో స్టాప్ ఏర్పాటు చేశారు విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులను వైవీ రావ్ ఎస్టేట్ వద్ద నిలిపివేస్తారు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిలిపివేస్తారు మచిలీపట్నం, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే బస్సులను కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఆపేస్తారు తిరుపతి నుంచి ఆ మార్గంలో వచ్చే బస్సులను గుంటూరు బస్ స్టేషన్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి గుంటూరు-విజయవాడ పుష్కర స్పెషల్ షటిల్ సర్వీసులుంటాయి రైళ్లు నిలిపే ప్రాంతాలు హైదరాబాద్ నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను రాయనపాడు వరకు అనుమతిస్తారు విశాఖపట్నం నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను రామవరప్పాడు, గుణదల స్టేషన్లలో ఆపేయాలి గుంటూరు వైపు నుంచి, తెనాలి వైపు నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వరకూ అనుమతిస్తారు. అక్కడ నుంచి పుష్కర్ స్పెషల్ బస్సుల్లో విజయవాడ చేరుకోవచ్చు -
'ప్రభుత్వ ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయి'
గుంటూరు : నదిని కాలుష్యం చేయకుండా స్నానాలు చేయాలని భక్తులకు చిన్నజియర్ స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లి సమీపంలోని కృష్ణానదిలో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం చిన్నజియర్‌స్వామి మాట్లాడుతూ... ఇప్పటికే మన చర్యల వల్ల నదికీ తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని చిన్నజియర్ స్వామి తెలిపారు. తాడేపల్లిలోని ఘాట్‌లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పుణ్యస్నానం ఆచరించారు. -
వైఎస్ జగన్ పుష్కర స్నానం రేపు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న విజయవాడలో స్నానమాచరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వాస్తవానికి శుక్రవారం పుష్కర స్నానం చేయాలని జగన్ భావించారని, అయితే తొలిరోజు కావడంతో ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో శనివారానికి మార్చుకున్నార ని వివరించారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా జరగాలని, వీటి ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతా శుభం జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
ముహూర్తం మంచిదేనా?
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పుష్కర స్నానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర స్నాన ముహూర్తంపై చినజీయర్ స్వామిని అడిగితెలుసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని చినజీయర్ ఆశ్రమాన్ని గురువారం సీఎం సందర్శించారు. దుర్గాఘాట్‌లో ఉదయం 5.45గంటలకు బాబు పుష్కర స్నానం చేయనున్నారు. ఆ సమయం మంచిదా? కాదా? అని చినజీయర్‌ను అడిగినట్లు తెలిసింది. ఆశ్రమంలో చినజీయర్‌తో పది నిమిషాలు ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం తాడేపల్లిలోని ఆశ్రమాన్ని, వేదవిశ్వవిద్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి సీఎంను సత్కరించి ఆశీర్వదించి మంగళశాసనాలు అందించారు. 19న లక్షల మందితో సమతాస్నానం.. ఈ నెల 19న చిన జీయర్‌స్వామి లక్ష మంది తో సమతాస్నానం నిర్వహించనున్నారు. దీనికి సీఎం ను ఆహ్వానించినట్లు తెలిసింది. కాగా కృష్ణా జిల్లాలోని అన్ని ఘాట్ల సమాచారం ‘కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్’కు అందుతుందని, అక్కడి నుంచే పుష్కరాలను సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. దుర్గాఘాట్‌లోని మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. -
పుష్కరాగమనం
* కృష్ణా పుష్కరాల సంబరం.. భక్తి పారవశ్యంలో తీరప్రాంతాలు.. * నదీ తీరంలో 81 ఘాట్ల వద్ద పుష్కర ఏర్పాట్లు * గొందిమళ్లలో ఉదయం 5.58కి సీఎం కేసీఆర్ దంపతుల పుష్కర స్నానం సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పుష్కర శోభను సంతరించుకుంది. అటు వేద ఘోష, ఇటు భక్తజనుల జయజయధ్వానాలతో కృష్ణా నదీ తీర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి తొలి పుష్కరాలు శుక్రవారం మొదలయ్యాయి. వేకువజాము నుంచే నదిలో భక్తుల పవిత్ర స్నానాలు ప్రారంభమయ్యాయి. తీరం వెంబడి దేవాలయాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. చాలా ఘాట్ల వద్దకు గురువారం రాత్రి నుంచే భక్తుల రాకమొదలైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 5.58 నిమిషాలకు అలంపూర్ మండలం గొందిమళ్లలో కృష్ణా పుష్కరాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. పుణ్యస్నానమాచరించేందుకు గురువారం సాయంత్రమే ఆయన సతీసమేతంగా అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. రాత్రి స్థానిక పర్యాటక శాఖ హ రిత అతిథి గృహంలో బస చేశారు. సీఎం వెంట దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, నేతలు వెళ్లారు. గోదావరి పుష్కరాల తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం తెలిసిందే. శుక్రవారం కృష్ణా పుష్కరాల తొలి రోజు అంతకంటే ఎక్కువ మందే స్నానాలు చేస్తారని అంచనా. నేటినుంచి నాలుగు రోజులు సెలవులే... శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభుత్వం ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. తర్వాత వరుసగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం పంద్రాగస్టు నేపథ్యంలో ఆ నాలుగు రోజులూ భక్తులు పుష్కరాలకు భారీగా పోటెత్తే అవకాశముంది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. మరోవైపు అటు శ్రీశైలం, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు వరద ఎక్కువగా ఉండటంతో నదిలోకి క్రమేపీ నీటి ప్రవాహం పెరుగుతోంది. దాంతో ఘాట్ల వద్ద భక్తులకు ప్రమాదాలు జరగకుండా యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 81 పుష్కర ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసన కంచె దాటి భక్తులు ముందుకు వెళ్లొద్దని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే 655 ట్రిప్పుల ప్రత్యేక రైలు సర్వీసులు, ఆర్టీసీ 1,365 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు పుష్కర భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగేలా పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఘాట్లయిన బీచ్పల్లి, రంగాపూర్, సోమశిల, కృష్ణా, పసుపుల, అలంపూర్, వాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్ వద్ద ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి భక్తి రసాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 12 వేల మంది కళాకారులకు బాధ్యతలు అప్పగించినట్టు మంత్రి చందూలాల్ వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలోనూ అన్ని ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిందు యక్షగానం, ఒగ్గు కథ, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, పద్య పౌరాణిక నాటకాలు, హరికథలు, భజనలు, ధార్మిక ప్రవచనాలుంటాయని అధికారులు పేర్కొన్నారు. కొనసా...గుతున్న పనులు చాలా ఘాట్ల వద్ద గురువారం రాత్రి వరకు పుష్కర పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో రాత్రి దాకా హడావుడిగా పనులు కొనసాగించారు. మహిళలు వస్త్రాలు మార్చుకునే తాత్కాలిక గదులు, మరుగుదొడ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. రెండు జిల్లాల పరిధిలో మంత్రులు పర్యటించి ప్రత్యేకంగా ఆదేశించినా సగం ఘాట్ల వద్ద పనులు పూర్తి కాలేదు. ఇవీ ఏర్పాట్లు... వైద్య ఆరోగ్య శాఖ అన్ని పుష్కర ఘాట్ల వ ద్ద అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. 277 మంది వైద్యులు, 1,193 మంది పారా మెడికల్ సిబ్బంది, 139 వాహనాలు, 89 ప్రత్యేక క్యాంపులను సిద్ధం చేసింది. వాటిల్లో మూడు షిఫ్టుల్లో సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక చికిత్స కిట్లను పోలీసు వాహనాల్లోనూ అందుబాటులో ఉంచారు. సీఎం మూడు స్నానాలు శుక్రవారం ఉదయం సీఎం కేసీఆర్ మూడు పుష్కర స్నానాలు చేస్తారు. పీఠాధిపతులతో కలసి ఆయన గొందిమళ్ల ఘాట్ చేరుకుంటారు. వారికి మంగళవాయిద్యాలు, పూర్ణకుంభ స్వాగతం ఉంటాయి. కేసీఆర్ ముందుగా కుటుంబ సభ్యులతో కల సి కృష్ణా నదిలో దేవతామూర్తులతో మొదటి స్నానం, పీఠాధిపతులతో రెండో స్నానం, మంత్రులతో మూడో స్నానం చేయించనున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నదీ హారతి తీసుకుని వేద పండితుల ఆశీర్వాదం అందుకుంటారు. అలా గొందిమళ్లలో పుష్కరాలను ప్రారంభించిన అనంతరం అలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని సీఎం కుటుంబసమేతంగా దర్శిస్తారు. -
ఇబ్రహీంపట్నంలో పోలీసుల అత్యుత్సాహం
-
కృష్ణాలో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా
-
ఇబ్రహీంపట్నంలో పోలీసుల అత్యుత్సాహం
విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సొంత భవనాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసుకున్న కృష్ణా పుష్కరాల ఫ్లెక్సీలను తొలంగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు తప్ప ఎవరికీ అనుమతి లేదని హెచ్చరించారు. బలవంతంగా ఫ్లెక్సీలు తొలగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలీసులు తీరుపై వైఎస్ఆర్ సీపీ నేతలు జోగి రమేష్, నాగిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఫ్లెక్సీల తొలగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడంపై వారు నిరసన తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నామని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. -
పాలమూరు జిల్లాకు బయల్దేరిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాకు బయల్దేరారు. రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలను ఆయన ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా అలంపూర్‌కు చేరుకుంటారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి అలంపూర్‌లోని టూరిజం అతిథిగృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం గొందిమళ్లలో ఏర్పాటు చేసిన వీఐపీ పుష్కర ఘాట్‌లో స్నానమాచరించి వేదపండితులు ఏర్పాటు చేసి ప్రత్యేక హారతిలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం వేదపండితుల ఆశ్వీరచనం తీసుకుంటారు. అనంతరం జోగులాంబ దేవాలయాన్ని సందర్శించనున్నారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
కృష్ణాలో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా
► చర్మ రోగాలు వచ్చే ప్రమాదం ► తాగితే డయేరియా, విరోచనాలు,టైఫాయిడ్, కామెర్ల ముప్పు ► హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు ► కృష్ణాలో కలుస్తున్న మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు ► ప్రభుత్వం తక్షణం చర్యలు చేపడితేనే పుష్కర భక్తులకు భరోసా సాక్షి, హైదరాబాద్/గుంటూరు: పవిత్ర కృష్ణా పుష్కరాలు మరో 24 గంటల్లో ప్రారంభం కానున్నాయి. పిల్లాపాపలతో సహా తరలివచ్చేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 లక్షల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఈ లెక్కన 12 రోజుల్లో 1.20 కోట్ల మందికి పైగా జనం పుష్కర స్నానాలు చేయనున్నారు. కృష్ణా నది ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే... పుష్కర స్నానం తో ప్రాణాంతక రోగాలు పక్కా అని చెప్పక తప్పదు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు నేరుగా కలుస్తుండటంతో జీవనది కృష్ణమ్మ కాలుష్య కాసారంగా మారింది. కృష్ణా నీటిలో అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా స్థావరం ఏర్పరచుకున్నట్లు తేలింది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నీటిని తాగితే డయేరియా, రక్తపు విరోచనాలు, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు, రకరకాల ఉదరకోశ జబ్బులతోపాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బ్యాక్టీరియా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. మోగుతున్న ప్రమాద ఘంటికలు పుష్కర ఏర్పాట్లలో నిమగ్నమైన ప్రభుత్వ అధికారులకు అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా నిద్ర లేకుండా చేస్తోంది. గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో ఈబ్యాక్టీరియా తీవ్రస్థాయిలో ఉన్నట్లు గత నెల 30న వైద్య నిపుణులు గుర్తించారు. కృష్ణా నదిలో నీరు ఎప్పటి నుంచో నిల్వ ఉండడం, ఘాట్ నిర్మాణ పనుల్లో భాగంగా వ్యర్థాలను నీటిలో పడేయడంతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు భావిస్తున్నారు. కర్నూలులోని మురుగు నీరు, అక్కడి పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయనాలతో కూడిన నీరు తుంగభద్ర నది గుండా కృష్ణాలోకి ప్రవేశిస్తోంది. విజయవాడ ఎగువన కాగిత పరిశ్రమల నుంచి రసాయనాలు కృష్ణాలో కలుస్తున్నాయి. గొల్లపూడి ప్రాంతంలోని కాలనీల నుంచి మురుగు నీరంతా నదిలోకి చేరుతోంది. విష రసాయనాలు, డ్రైనేజీ నీరు కలవడం వల్ల కృష్ణా నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా మోతాదుకు మించి ఉంది. 14 ఐపీఎం బృందాల పర్యవేక్షణ గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా నదిలో ఈ-కోలి బ్యాక్టీరియాని గుర్తించడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఘాట్ల వద్ద నీటి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించేందుకు ఐపీఎం సిబ్బంది 14 బృందాలుగా ఏర్పడ్డారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడలోని దుర్గ గుడి పక్కన ఉన్న వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో వాటర్ మానిటరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లో అన్ని పుష్కర ఘాట్ల వద్ద నీటి నమూనాలు సేకరించి, పరీక్షలు జరపనున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? ♦ ఈ-కోలి బ్యాక్టీరియా తీవ్రత తక్కువగా ఉన్న ఘాట్లను గుర్తించి, జనం అక్కడ స్నానాలు ఆచరించేలా ప్రోత్సహించాలి. ♦ పుష్కరాలు ముగిసేలోగా మురుగు నీరు కృష్ణాలో కలవకుండా చూడాలి. ♦ బ్యాక్టీరియా బారిన పడి అస్వస్థతకు గుర య్యే వారికి వెంటనే వైద్య సేవలందించేం దుకు సిబ్బందిని సర్వసన్నద్ధంగా ఉంచాలి. ♦ పుష్కర స్నానాల్లో శాంపూలు, సబ్బుల వాడకంపై నిషేధం ఉంది. అయినా ఇది ఎక్కడా అమలు కాకపోవడం గమనార్హం. కృష్ణా పుష్కరాల్లో శాంపూలు, సబ్సులున పకడ్బందీగా నియంత్రించాలి. ♦ పుష్కర ఘాట్ల వద్ద పోగయ్యే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ♦ ఘాట్ల వద్ద గంటగంటకూ క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలి. ♦ ఏపీలో 50 మైక్రాన్ల లోపు పాలిథిన్ కవర్లపై నిషేధం ఉన్నా ఇది కాగితాలకే పరిమితమైంది. కనీసం పుష్కరాల సమయంలో అయినా పాలిథిన్ కవర్లు, ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులను నిషేధించాలి. కాలుష్యం ప్రమాదకర స్థాయిలో లేదు ‘‘ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు కృష్ణా నది నీటిని పరీక్షించి ల్యాబ్ రిపోర్టులను కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు, మున్సిపాలిటీలకు అందజేస్తున్నాం. నీరు కొంత మేరకు కలుషితమైన విషయం వాస్తవమే గానీ, అదేమీ ప్రమాదకర స్థాయిలో లేదు. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు క్లోరినేషన్ పెంచాలని సూచించాం. పుష్కరాల రోజు నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి నీటి పరీక్షలు నిర్వహించి, తదగుణంగా క్లోరినేషన్ ప్రక్రియ చేయాలని ఆదేశించాం’’ అని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
పుష్కరాలకు 1,460 మంది వైద్య సిబ్బంది
రూ. 1.75 కోట్లు విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే జనానికి అవసరమైన వైద్యసేవలు అందించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అన్ని ఘాట్లలోనూ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. రెండు జిల్లాల్లో 1,460 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని వైద్యసేవలకు నియమించినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 52 ఘాట్లకు గాను 52 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 122 మంది వైద్య అధికారులు, 518 పారామెడికల్ సిబ్బందిని నియమించారు. అలాగే 38 వాహనాలను అందుబాటులో ఉంచుతారు. అందులో 104 సర్వీసు వాహనాలు 26 సిద్ధంగా ఉంటాయి. ఇక నల్లగొండ జిల్లాలో 29 ఘాట్లకు గాను మొత్తం 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్కడ వైద్య సేవలు అందించేందుకు 145 మంది వైద్య అధికారులు, 675 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారు. 63 వాహనాలను సిద్ధంగా ఉంచుతారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏమైనా వైద్య సాయం అవసరమైతే ప్రాథమిక వైద్య సేవలు ఈ శిబిరాల్లో అందజేస్తారు. ఎమర్జెన్సీ అయితే సిద్ధంగా ఉంచిన వాహనాల్లో వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తారు. పుష్కరాల్లో వైద్య ఏర్పాట్ల కోసం రూ. 1.75 కోట్లు ఆయా జిల్లాలకు అందజేశామని ఆయన తెలిపారు. మరో రూ. 2 కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాలు నడుస్తాయని తివారీ వివరించారు. -
పుష్కరాలకు 1,365 బస్సులు
నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని ఘాట్లకు బస్సులు సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం ప్రత్యేకంగా 1,365 బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, ఎండీ రమణారావు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తకుండా ఆర్టీసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 55 పుష్కర ఘాట్లు ఉన్నాయని, వాటిల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో 27, నల్లగొండలో 28 ఉన్నాయని చెప్పారు. కృష్ణానది ప్రవహించే ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా అక్కడికి బస్సులను నడిపిస్తామని పేర్కొన్నారు. బీచుపల్లికి 248, నాగార్జునసాగర్ 160, శ్రీశైలం 150, విజయవాడ 50, సోమశిల 60, మఠంపల్లి 60, వాడపల్లి 32, నెట్టెంపాడు, గండిమల, మక్తల్, కైపూర్, పెబ్బేరు ప్రాంతాలకు 165 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఖమ్మం నుంచి విజయవాడకు 235 బస్సులు నడుపుతామని, 400 మంది ఆర్టీసీ సిబ్బంది వీటిని సమన్వయం చేస్తారని అన్నారు. పుష్కరాల కోసం ఈసారి 300 ఏసీ బస్సులు నడుపుతున్నామని చెప్పారు. పుష్కరఘాట్ల నుంచి బస్టాండ్లకు 210 ఉచిత బస్సులు నడుపుతున్నామని చెప్పారు. పుష్కర బస్సుల వివరాలు రంగాపూర్, బీచుపల్లి ఘాట్లకు వెళ్లే బస్సులను పెబ్బేరు వద్ద నిలిపివేస్తారు. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాట్లకు రాకపోకలు సాగించేందుకు 60 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వైపు వెళ్లే బస్సులను సాగర్ ఘాట్‌కు 13 కిలోమీటర్ల దూరంలోని పొట్టిచెలమ వద్ద నిలిపివేస్తారు. అక్కడి నుంచి ఘాట్ వరకు 60 బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం క ల్పిస్తారు. మట్టపల్లికి వెళ్లే బస్సులను 6 కిలోమీటర్ల దూరంలో నిలిపివేస్తారు. అక్కడి నుంచి ఘాట్‌కు 25 ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. వాడపల్లికి మాత్రం నేరుగా ఘాట్ వరకు బస్సులు వెళ్తాయి. ఒక్క ఆర్టీసీ ప్రయాణికులే కాకుండా సొంత, ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవాళ్లు సైతం ఘాట్ల వరకు ఆర్టీసీ ఉచిత బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులను మినహా ఇతర వాహనాలను ఘాట్ల వరకు అనుమతించరు. మరోవైపు బస్సుల నిర్వహణ కోసం 5 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు, 10 మంది రీజి నల్ మేనేజర్ స్థాయి అధికారులు, 20 మం ది సీనియర్ స్కేల్ అధికారులు, 60 మంది డిపో మేనేజర్లు, అన్ని ప్రధాన ప్రాంతాల్లో మెకానిక్ బృందాలను మోహరించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ) వేణు తెలిపారు. ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని, 24 గంటలపాటు బస్సులు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. -
కృష్ణమ్మకు పుష్కర శోభ
► రేపటి నుంచి పుష్కరాలు... సర్వం సిద్ధం ► ఉదయం గం.5.58కు ముహూర్తం ఖరారు ► 23వ తేదీ దాకా కొనసాగనున్న వేడుక ► భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ► పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో 81 ఘాట్లు ► మూడున్నర కోట్ల మంది స్నానం చేస్తారని అంచనా ► భారీగా ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సులు సిద్ధం ► గొందిమళ్ల ఘాట్‌లో రేపు ఉదయం 5.58 గంటలకు సీఎం దంపతుల పుష్కర స్నానం ► గవర్నర్ కూడా అక్కడే స్నానమాచరించే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మకు పుష్కర శోభ వచ్చింది. కృష్ణా పుష్కరాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 5.58 గంటల నుంచి పుష్కరాలు మొదలవుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 23వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో దాదాపు మూడున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. పుష్కర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ ఆలయ సమీపంలో గొందిమల్ల ఘాట్‌లో శుక్రవారం ప్రాతఃకాలంలో సతీసమేతంగా పుణ్య స్నానమాచరిస్తారు. సీఎం దంపతులు గురువారం సాయంత్రం ఆలంపూర్ చేరుకుని హరిత గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఉదయం 5.58 గంటలకు పుష్కర స్నానానంతరం జోగులాంబను దర్శించుకుంటారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్ కూడా వస్తారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండలో 29 చొప్పున రూ.212 కోట్లతో 81 ఘాట్లు ఏర్పాటు చేశారు. పాలమూరులో బీచుపల్లి, ఆలంపూర్, రంగాపూర్, కృష్ణా, గొందిమల్ల; నల్లగొండ జిల్లాలో మఠంపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్, చాయసముద్రం తదితర ఘాట్లకు భక్తులు పోటెత్తేలా ఉండటంతో గజ ఈతగాళ్లను, మరబోట్లను సిద్ధం చేశారు. మొసళ్లు కొట్టుకొచ్చే ప్రమాదమున్నందున ఘాట్ల వద్ద నదిలో కంచెలు ఏర్పాటు చేశారు 15 వేల మంది బందోబస్తు 15 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూములు, కాల్ సెంటర్లు పెట్టి సీసీ కెమెరాలు అమర్చారు దేవాదాయ శాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. పుష్కర సమాచారంతో పాటు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-24750102, 24750020, 24752825, 2475 3850, 24757325; సెల్ నంబర్లు: 7995232 762, 7995231953, 7995232903, 7995 231963, 7995232781. వృద్ధులు, వికలాంగులు, పిల్లల కోసం ఘాట్ల వద్ద షవర్లు ఏర్పాటు చేశారు పూర్తి కాని పనులు శుక్రవారం పుష్కరాలు మొదలవుతున్నా చాలాప్రాంతాల్లో బుధవారం నాటికి కూడా పనులు పూర్తవలేదు రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల వల్ల నెల రోజులుగా పనులు సాగక పలుచోట్ల పనులు సగం కూడా పూర్తవలేదు సీఎం సమీక్ష పుష్కర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎగువన భారీ వర్షాలతో వరద ఉధృతంగానే ఉన్నందున పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. -
కృష్ణా పుష్కరాలకు డబుల్ డెక్కర్ రైలు
కృష్ణా పుష్కరాలకు డబుల్ డెక్కర్ రైలు డబుల్ డెక్కర్ రైలు, కృష్ణా పుష్కరాలు, స్పెషల్, విశాఖ double decker trains, special trains, krishna pushkaralu, visakha తాటిచెట్లపాలెం: విశాఖ వాసుల చిరకాల స్వప్నమైన డబుల్ డెక్కర్ ఆశలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో విశాఖ–తిరుపతి, విశాఖ–విజయవాడ ప్రాంతాలకు డబుల్ డెక్కర్రైలు నడపనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైలు సికింద్రాబాద్‌లో 12న బయలుదేరి 13న విశాఖ చేరుకోనుంది. ఈనెల 12న 07759 నంబరుతో సికింద్రాబాద్‌లో రాత్రి 09.20 గంటలకు బయలుదేరి, ఆ మర్నాడు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఆ తరువాత విశాఖ నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ ప్రాంతా ల మీదుగా ఈ రైలును నడపనున్నారు. 07761 నంబరుతో విశాఖ నుంచి తిరుపతికి ఈనెల 13,17,21 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ నుంచి దీన్ని నడిపేయోచనలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో 07762 నంబరుతో తిరుపతి నుంచి 14,18 తేదీల్లో సాయంత్రం బయలుదేరి ఆ మర్నాడు ఉదయం విశాఖ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ–విజయవాడ–విశాఖ రైలును 07763/07764 నంబర్లతో నడపనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. విశాఖ నుంచి 07764 నంబరుతో ఈనెల 15,19 తేదీల్లో మధ్యాహ్న సమయంలో బయలుదేరే విధంగా రైల్వే ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో 07763 నంబరుతో విజయవాడ నుంచి ఈనెల 16,20 తేదీల్లో ఉదయం 10 గంటల సమయంలో బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు ఆగాల్సిన స్టేషన్లు, సమయం వ్యవధి, టికెట్ ఛార్జీలు తదితర విషయాలను రైల్వే శాఖ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
కృష్ణా పుష్కరాలకు డబుల్ డెక్కర్ రైలు
తాటిచెట్లపాలెం: విశాఖ వాసుల చిరకాల స్వప్నమైన డబుల్ డెక్కర్ ఆశలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో విశాఖ–తిరుపతి, విశాఖ–విజయవాడ ప్రాంతాలకు డబుల్ డెక్కర్రైలు నడపనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైలు సికింద్రాబాద్‌లో 12న బయలుదేరి 13న విశాఖ చేరుకోనుంది. ఈనెల 12న 07759 నంబరుతో సికింద్రాబాద్‌లో రాత్రి 09.20 గంటలకు బయలుదేరి, ఆ మర్నాడు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఆ తరువాత విశాఖ నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ ప్రాంతా ల మీదుగా ఈ రైలును నడపనున్నారు. 07761 నంబరుతో విశాఖ నుంచి తిరుపతికి ఈనెల 13,17,21 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ నుంచి దీన్ని నడిపేయోచనలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో 07762 నంబరుతో తిరుపతి నుంచి 14,18 తేదీల్లో సాయంత్రం బయలుదేరి ఆ మర్నాడు ఉదయం విశాఖ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ–విజయవాడ–విశాఖ రైలును 07763/07764 నంబర్లతో నడపనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. విశాఖ నుంచి 07764 నంబరుతో ఈనెల 15,19 తేదీల్లో మధ్యాహ్న సమయంలో బయలుదేరే విధంగా రైల్వే ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో 07763 నంబరుతో విజయవాడ నుంచి ఈనెల 16,20 తేదీల్లో ఉదయం 10 గంటల సమయంలో బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు ఆగాల్సిన స్టేషన్లు, సమయం వ్యవధి, టికెట్ ఛార్జీలు తదితర విషయాలను రైల్వే శాఖ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
కృష్ణమ్మకు ప్రత్యేక హారతి : మంత్రి పల్లె
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు ప్రారంభ ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం సాయంత్రం 4 గంటలకు కృష్ణా, గోదావరి సంగమం వద్ద పుష్కరాలు ప్రారంభమవుతాయని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో కృష్ణమ్మ ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పల్లె చెప్పారు. కృష్ణా పుష్కరాలకు ఘనంగా స్వాగతం పలుకుతామని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకు సినీ రంగ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో పుష్కర స్నానం చేస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానంతో కృష్ణా పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే. -
కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు
హైదరాబాద్ : తెలంగాణలో కృష్ణా పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ(శుక్రవారం) ఉదయం 5.58 గంటలకు కృష్ణా పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కృష్ణా పుష్కరాలకు సీఎం కేసీఆర్‌ను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్‌లో బుధవారం ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖాధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గొందిమల్లలో సీఎం కేసీఆర్ పుణ్యస్నానంతో పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే. -
ఇస్తారా? ఇవ్వరా?
పుష్కర యాత్రికుల పేరిట వసూళ్లు ఒక్కో రేషన్‌షాపు నుంచి రూ.5 వేలు.. మద్యం దుకాణమైతే రూ.20 వేలు .. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల నుంచి పెద్దమొత్తంలో.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతల దందా పుష్కరాల పేరుతో అధికారపార్టీ నేతలు వసూళ్ల దందాకు తెరతీశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వ్యాపారులు, రేషన్, మద్యం దుకాణాల యజమానులను లక్ష్యంగా చేసుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పరిస్థితి బాగోలేదన్నా వదలడం లేదు. ఇవ్వా ల్సిందేనంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి : కృష్ణాజిల్లాలో 2,160, గుంటూరు జిల్లాల్లో 2,732 రేషన్ దుకాణాలుండగా, ఒక్కొక్కరి నుంచి అధికారపార్టీ నేతలు రూ.5వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. అదే విధంగా కృష్ణాలో 320, గుంటూరులో 350 మద్యం షాపులు, బార్ల నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు వసూలుకు తెగబడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పుష్కరాలకు వస్తున్నారని, వారికి భోజన వసతి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇలా 65 శాతం దుకాణాల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. మిగిలిన వారికి ఒకటి రెండు రోజులు గడువు విధించినట్లు బాధితులు తెలిపారు. ఇవ్వకపోతే షాపు ఉండదు... డబ్బు ఇవ్వకపోతే షాపు లెసైన్స్ రద్దుచేయిస్తామని అధికారపార్టీ నేతలు బెదిరించినట్లు విజయవాడ నగరంలోని ఓ మహిళా రేషన్ డీలర్ కన్నీరుపెట్టారు. విజయవాడ- గుంటూరు మధ్య ఉన్న ఓ బార్ యజమాని నుంచి రూ.30వేలు తీసుకున్నట్లు తెలిసింది. ఆ పక్కనే రోడ్డుకు అటువైపు ఉన్న మరో మద్యం దుకాణం యజమాని వద్దకెళ్లి రూ.20వేలు ఇవ్వాలంటూ దబాయించినట్లు తెలిసింది. ‘రేపటిలోగా ఏర్పాటు చేయకపోతే ఇక్కడ నీ వైన్ షాపు ఉండదు’ అంటూ హెచ్చరించినట్లు సమాచారం. రేషన్, మద్యం దుకాణాలు, బార్ల నుంచి మొత్తం రూ.5 కోట్ల వరకు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. రేషన్ షాపుల నుంచి రూ.2.45 కోట్లు, మద్యం దుకాణాల నుంచి రూ.1.34 కోట్లు వసూలు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని బార్ల యజమానుల నుంచి వ్యాపారాన్ని బట్టి దండుకోవాలని సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో బారుకు ఒక్కో ధర నిర్ణయించినట్లు సమాచారం. వ్యాపారుల నుంచి రూ.కోటికి పైగా... రెండు జిల్లాలోని వివిధ రకాల వ్యాపారుల నుంచి రూ.కోటికిపైగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. చిన్న, పెద్ద, మధ్య తరగతి వ్యాపారులు ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించినట్లు సమాచారం. అందులో హోటళ్లు, వస్త్ర, బంగారు, షోరూంలతో పాటు వివిధ రకాల వ్యాపారుల నుంచి భారీ మొత్తంలోనే దండుకోవాలని ప్లాన్ వేశారు. అన్ని రకాల వ్యాపారులు, కొందరు పారిశ్రామికవేత్తల నుంచి మరో రూ.5 కోట్ల వరకు వసూలు చేసే విధంగా ప్లాన్ వేశారు. అందులో భాగంగా ఇప్పటికే 50శాతం వ్యాపారుల నుంచి వసూలు చేసినట్లు తెలిసింది. మిగిలిన వారి నుంచి ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇలా వసూలు చేసుకున్న మొత్తాన్ని పుష్కర భక్తుల కోసం వెచ్చిస్తారా? లేదా? అని కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య రెండు రోజుల క్రితం చర్చ సాగింది. ఆ చర్చలో ఓ ముఖ్య నాయకుడు ‘ముందు వసూలు చేయండి. తరువాత భక్తులకు పెట్టాలా? వద్దా ? అనేది చెబుతాం’ అని అన్నట్టు టీడీపీ నాయకుడు ఒకరు వెల్లడించడం గమనార్హం. -
దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం
శుక్రవారం ఉదయం 5.45 గంటలకు స్నానం సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానమాచరిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడని.. అయితే సూర్యాస్తమయం తర్వాత పుష్కర స్నానం చేయకూడదనే నియమం ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభిస్తారని, అదే సమయంలో సీఎం స్నానం చేస్తారని వెల్లడించారు. 1,120 ప్రాంతాల్లో మొత్తం 62 వేల మంది ఉద్యోగులు పుష్కరాల సేవలందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలకోసం విజయవాడలో ఏడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. -
కోరితే... ఊరికే బస్సు
ఒక ఊర్లో 30 మంది ఉంటే ఆదే గ్రామానికే బస్సు పుష్కరాల కోసం మెదక్ రీజియన్ నుంచి 424 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. భక్తులకు శుభప్రదం ప్రతి భక్తుడు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్నే ఎంచుకోవాలి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రఘునాథ్‌రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కృష్ణా పుష్కరాల కోసం ఒక గ్రామం నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే వాళ్ల సొంత గ్రామానికే బస్సు పంపుతామని, భక్తులు కోరిన పుష్కర ఘాట్‌కు తీసుకువెళ్లి.. భక్తులు స్నానమాచరించిన తరువాత మళ్లీ ఇళ్ల వద్ద వదులుతామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రఘునాథరావు చెప్పారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జిల్లా నుంచి పుణ్య స్నానాలకు భక్తులు తరలివెళ్లనున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రత్యేక బస్సుకు ప్రయాణికుల వద్ద నిర్ణీత టికెట్ ధర మాత్రమే తీసుకుంటామని, మిగిలిన సీట్లను ఆయా గ్రామాల మధ్య నింపుకొంటామని చెప్పారు. తెలంగాణ కృష్ణా పుష్కరాలలో ఆర్టీసీ భక్తులకు సురక్షిత, శుభప్రదమైన ప్రయాణాన్ని అందిస్తోందని ఆయన చెప్పారు. ప్రతి భక్తులు ఆర్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సాక్షి: జిల్లా నుంచి ఎన్నిబస్సులు నడుపుతారు? ఎప్పటి వరకు నడుపుతారు? ఆర్ఎం: పుష్కరాల కోసం మెదక్ రీజియన్ నుంచి 424 డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను సిద్దం చేశాం. అవసరమైతేæ బస్సుల సంఖ్యను ఇంకా పెంచుతాం. ఆగస్టు 12 నుంచి ప్రారంభించి కృష్ణా పుష్కరాలు ముగిసే వరకు అంటే ఆగస్టు 23 వరకు బస్సు సర్వీసులు ఉంటాయి. సాక్షి: ఎక్కడెక్కడి నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి? ఆర్ఎం: జిల్లాలో ప్రస్తుతం 7 డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలోని అన్ని ప్రధాన బస్స్టేషన్ల వద్ద నుంచి 260 బస్సులు నడుస్తాయి. ఇవికాక పటాన్చెరు, లింగంపల్లి, బీహెచ్ఈఎల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట ప్రాంతాల నుంచి మరో 164 బస్సులను ప్రత్యేకంగా నడుపుతాం. బీచ్పల్లి, వాడపల్లి, మట్టపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్, కొల్లాపూర్, అమరగిరి ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేశాం. రద్దీని బట్టి ప్రయాణికుల కోరక మేరకు పుష్కర ఘాట్లకు తీసుకువెళ్తాం. సాక్షి: టికెట్ ధరలు ఎలా నిర్ణయించారు? ఆర్ఎం: టికెట్ ధర ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం.. స్టార్టింగ్ పాయింట్ నుంచి పుష్కర ఘాట్ మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకొని టికెట్ ధర నిర్ణయిస్తాం. మొత్తానికి సామాన్య భక్తులకు భారం కాకుండా టికెట్ ధర ఉంటుంది. సాక్షి: టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? రిజర్వేషన్ లేకుంటే ప్రయాణం ఉండదా? ఆర్ఎం: టికెట్ బుకింగ్ కోసం ప్రధాన బస్ స్టేషన్లలో బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి టికెట్ రిజర్వేషన్లు లేకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చిన భక్తుల కోసం సమీప బస్టాండ్ ఆవరణలో పుష్కర ప్రత్యేక బస్సులు సిద్దంగా ఉంటాయి. -
కృష్ణాపుష్కరాల కోసం ఏర్పాట్లు పూర్తిచేశాం
-
కృష్ణా పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. కృష్ణ పుష్కరాలకు రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ను ఆహ్వానించారు. ఇప్పటికే చంద్రబాబు...ప్రధానమంత్రి, రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా గవర్నర్‌తో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం బయల్దేరి వెళ్లారు. -
కృష్ణా పుష్కరాలకు పోలీసు సిబ్బంది
జాతీయ రహదారిపై రూటు మళ్లింపు రాజమహేంద్రవరం క్రైం : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి జాతీయ రహదారి మీద వాహనాల దారి మళ్లింపు చేస్తున్నట్టు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు దివాన్ చెరువు వద్ద నుంచి గామన్ బ్రిడ్జి(వైఎస్సార్ వారధి) మీదుగా కొవ్వూరు, అశ్వారరావు పేట, ఖమ్మం మీదుగా హైదారాబాద్‌కు దారి మళ్లిస్తున్నామని తెలిపారు. అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు రాజమహేంద్రవరం మీదుగా వేమగిరి, రావుల పాలెం, సిద్ధాంతం, ఓగొలు మీదుగా చెన్నైకు తరలిస్తామని తెలిపారు. ఈ నెల 12న కృష్ణ పుష్కరాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ట్రాఫిక్ దారి మళ్లింపు 12 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు విషయాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన లారీ ఓనర్లకు, డ్రైవర్లకు, ట్రాన్స్‌పోర్టు యజమానులకు, లారీ యజమానులకు స్థానికలారీ యూనియన్ నాయకులు తెలియజేయాలని సూచించారు. 750 మంది సిబ్బంది : కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నుంచి 750 మంది పోలీస్‌లను పంపించినట్టు ఎస్పీ రాజ కుమారి తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్, ట్రాన్స్‌పోర్టు యజమానులు, లారీ యజమానులు పాల్గొన్నారు. -
అమరావతిలో భక్తులకు జల్లు స్నానాలే..!
-
పుష్కరాల పేరుతో కుట్ర: సీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా పుష్కరాల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్ జరగకుండా కుట్రపన్నారని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ జరగకుండా బాబు కుట్రపన్నారు. హోదాపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధిలేదు. బిల్లు ద్రవ్య బిల్లా? కాదా?అని తేల్చడానికి బిల్లును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.. లోక్‌సభ స్పీకర్‌కు పంపాలని నిర్ణయించినప్పుడు బీజేపీ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి చప్పట్లు కొట్టడమే అందుకు నిదర్శనమ’న్నారు. పుష్కరాలను చంద్రబాబు సొంత ఇంటి కార్యక్రమంగా భావించి అందరినీ ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. -
ఇంట్లో ఫంక్షన్‌లా చంద్రబాబు హడావుడి
-
ఇంట్లో ఫంక్షన్‌లా చంద్రబాబు హడావుడి: సీఆర్
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుట్ర పన్ని కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును లోక్‌సభకు పంపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. తన ఇంట్లో శుభకార్యంలా చంద్రబాబు పుష్కరాలకు హడావుడి చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు జరుగుతున్నా ఎవరూ అలా చేయడం లేదని అన్నారు. ఓవైపు దేవాలయాలు కూలగొట్టి మరోవైపు పుష్కరాల పేరుతో చంద్రబాబు షో చేస్తున్నారని సి.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. -
పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3300 మంది
విజయవాడ : పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3,300 మంది సిబ్బందిని నియమించినట్లు డీఐజీ శ్రీకాంత్ వెల్లడించారు. శనివారం విజయవాడలో డీఐజీ శ్రీకాంత్ మాట్లాడుతూ... విజయవాడ నగరాన్ని 19 జోన్లు, 70 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. 276 ఎకరాల్లో 122 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అటు నెహ్రు బస్టాండ్ నుంచి కుమ్మరపాలెం వరకు.... ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి వన్‌టౌన్‌లోని అప్పారావు కూల్ డ్రింక్ షాప్ వరకు నో వెహికిల్ జోన్‌గా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజీపైనా వాహనాలతోపాటు భక్తులకు కూడా అనుమతి లేదని డీఐజీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. -
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: సవాంగ్
విజయవాడ : కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో గౌతం సవాంగ్ విలేకర్లతో మాట్లాడుతూ.... పుష్కరాలు నేపథ్యంలో 5 శాటిలైట్ రైల్వేస్టేషన్లు, 6 శాటిలైట్ బస్టాప్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పుష్కరాల్లో 17500 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారన్నారు. 18 డ్రోన్ కెమెరాలు, 1400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 19 మంది ఐపీఎస్‌లతోపాటు 14 మంది ఎస్పీ స్థాయి అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. 7 వేల మంది వాలంటీర్లను కూడా నియమించినట్లు గౌతం సవాంగ్ వివరించారు. -
పుష్కరాలను బాబే తెచ్చారా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి, కృష్ణా పుష్కరాలను తానే తీసుకొస్తున్నట్లు అందరినీ ఆహ్వానిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దీన్నిబట్టి చంద్రబాబుకు ప్రచార యావ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతోందని విమర్శించారు. శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాలలో 30 మందిని పొట్టనపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కృష్ణా పుష్కరాలలో కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారని దుయ్యబట్టారు. గుడుల కూల్చివేత, పుష్కరాలలో దోపిడీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 23 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో చెప్పాలని అన్నారు. మరిగిన రక్తాన్ని ఏం చేశారు? ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును చూసి తన రక్తం మరిగిపోతోందంటూ ప్రెస్మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి తన మరిగిన రక్తాన్ని ఏం చేశారో చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తీరును చూసి కేంద్రం ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ట్విస్ట్ చేసి చెప్పడంలో బాబు ఘనాపాఠి పుష్కరాలకు ఆహ్వానించేందుకు వెళ్లిన తనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారంటూ చంద్రబాబు పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్సీఏఈఆర్ సర్వేలో అవినీతిలో ఏపీ నంబర్ 1గా నిలిచిందేంటని బాబును ప్రణబ్ ప్రశ్నించి ఉంటారని చెప్పారు. దేన్నయినా ట్విస్ట్ చేసి చెప్పడం, ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు అంతటి ఘనాపాఠి ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు. -
పుష్కరాలను చంద్రబాబే తీసుకొస్తున్నారా?
-
పుష్కరాలను చంద్రబాబే తీసుకొస్తున్నారా?
హైదరాబాద్: 'నదుల్లో 12 ఏళ్లకు ఒకసారి సహజంగానే వచ్చే పుష్కరాలను స్వయంగా తానే తీసుకొస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. నదిలోకి పుష్కరుణ్ని సైతం ఆయనే ఆహ్వానిస్తారేమో!' అని ఏపీ ముఖ్యమంత్రి తీరును ఎద్దేవా చేశారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. పుష్కరాల పిలుపు పేరుతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేశారని ఆయన విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. 'రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనను పొగిడినట్లు చంద్రబాబు నాయుడు పలు పత్రికల్లో వార్తలు వేయించుకున్నారు. నిజంగా అంత పలుకుబడే ఉంటే రాష్ట్రప్రయోజనాల కోసం ఎందుకు గట్టిగా అడగరు?' అని నిలదీశారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్ల 30 మంది బలైపోయారని, నాటి ఘటనపై ఏర్పాటయిన సోమయాజులు కమిటీ ఇంతవరకు ముఖ్యమంత్రిని విచారించలేదని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాల విషయంలోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఆ పిచ్చి మానుకొని, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. -
ఢిల్లీలో చంద్రబాబు 'పుష్కర' హడావిడి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వైఎస్సార్ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశంపై నినాదాలు, నిరసనలు తెలుపుతున్నవేళ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. శుక్రవారం ఉదయం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసిన చంద్రబాబు.. ఆమెను కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కాసేపటి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానిని కూడా పుష్కరాలకు ఆహ్వానించిన బాబు.. 12 అంశాలతో కూడిన వినపత్రాన్ని అందించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులను కూడా ఏపీ సీఎం పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీలు మధ్యాహ్నం 12.20 కి ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ ఎంపీలు ప్రధానితో చర్చించనున్నట్లు తెలిసింది. తన ఢిల్లీ పర్యటనపై సీఎం చంద్రబాబు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశంఉంది. -
వెలుగులు
నిరంతరం అందిస్తాం – 220మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ – విద్యుత్ అంతరాయం తెలుసుకునేందుకు వైర్లెస్ సెట్ల వినియోగం – ‘సాక్షి’ ఇంటర్వ్యూలో విద్యుత్ శాఖ ఎస్ఈ కె.రాముడు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాలలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్‌శాఖ సర్వం సమాయత్తమైందని, ఇప్పటికే 52 పుష్కరఘాట్లలో విద్యుద్దీకరణ పనులను ప్రారంభించి పూర్తిచేసే దశలో ఉన్నట్లు జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.రాముడు పేర్కొన్నారు. పుష్కరఘాట్లలో విద్యుత్ సరఫరా కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆయన ‘సాక్షి’ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో... రూ.12.73కోట్లతోఏర్పాట్లు జిల్లాలో 52పుష్కరఘాట్లలో ఏడు ఘాట్లను వీఐపీ, అత్యధిక రద్దీగల ఘాట్లుగా భావించి, అందుకనుగుణంగా విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తున్నాం. గొందిమళ్ల, సోమశిలలో విద్యుత్ సరఫరా పనులను ఇప్పటికే పూర్తిచేశాం. బీచుపల్లి, రంగాపూర్, పాతాళగంగ, సోమశిల సాధారణ ఘాట్లలో విద్యుత్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పుష్కరాల్లో విద్యుత్ అవసరాలు తీర్చడానికి తమ శాఖ రూ.12.73కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే 208ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో బిగించాం. అత్యధిక విద్యుత్ సామర్థ్యం కలిగిన 315 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను 12చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. వీటిని బీచుపల్లిలో 4, రంగాపూర్‌లో 5, గొందిమళ్లలో 3 ఇప్పటికే ఇప్పటికే బిగించాం. 24గంటల విద్యుత్ పుష్కరఘాట్లున్న గ్రామాల్లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. పుష్కరాల్లో విద్యుత్ సేవలు అందించడానికి 220మంది ఉద్యోగులను ప్రత్యేకంగా వినియోగిస్తున్నాం. చీఫ్ ఇంజనీర్స్ సైతం పుష్కరాల్లో పాల్గొని విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తారు. నిరంతరం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఎక్కడైనా బ్రేక్‌డౌన్ కలిగిస్తే తక్షణం సమాచారం అందేలా ఉండేందుకు వైర్లెస్ సెట్లను ఉపయోగించనున్నాం. ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి కోరాం. విద్యుత్ సరఫరా అనుకోకుండా నిలిచిపోయినా భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టాం. ఆయా ప్రాంతాల్లో 77జనరేటర్లు ఏర్పాటు చేశాం. 5లోగా పనులు పూర్తి పుష్కర యాత్రికులకు సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అయితే పార్కింగ్‌స్థలాల నిర్మాణం, నిర్ధారణ పూర్తికాని ప్రాంతాల్లోనే విద్యుత్ సౌకర్యం కొంత ఆలస్యమైంది. ఈ నెల 5వతేదీ వరకు మా శాఖాపరంగా చేయాల్సిన అన్ని పనులను పూర్తిచేసి ట్రయల్‌రన్ చేస్తాం. విద్యుత్ వెలుగులు అన్ని ఘాట్లలో పెద్ద ఎత్తున ఉండేలా శక్తివంతమైన లైట్లను వాడుతున్నాం. ప్రతి చోటా 2, 4, 6 స్తంభాల లైన్లను ఏర్పాటు చేసి, ఒక్కొ స్తంభానికి 10 నుంచి 20, 20 నుంచి 40వరకు 400 నుంచి 1000వాట్స్ సామర్థ్యం గల లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. పుష్కరాల్లో తాత్కాలికంగా వ్యాపారాలు నిర్వహించుకునే చిరు వ్యాపారులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నాం. ఇందుకోసం ప్రత్యేక టారీఫ్‌ను రూపొందించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే గొందిమళ్ల వీఐపీ ఘాట్‌లో నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. జోగుళాంబ దేవత, తెలంగాణ తల్లి వంటి చిత్రపటాలను ఏర్పాటుచేసి ఆకర్షణీయంగా రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరిస్తాం. ‘‘ఎక్కడ విద్యుత్ అంతరాయం కలిగినా తక్షణమే తెలుసుకునేందుకు ప్రతి పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. పుష్కరఘాట్లున్న ప్రాంతాల్లో 24 గంటలూ విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.’’ – కె.రాముడు, విద్యుత్ ఎస్ఈ -
పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
విజయవాడ: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమర్ధంగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు, అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వుంటుందని చంద్రబాబు సమీక్ష సమావేశంలో హెచ్చరించారు. బుధవారం నుంచి ప్రతిరోజూ పుష్కర ఘాట్ల పనులను పరిశీలించనున్నట్లు ఆయన వెల్లడించారు. పుష్కరాల సమయంలో విజయవాడ నగరంలో అపరిశుభ్రతకు ఎక్కడా తావు వుండకూడదని అధికారులకు ఆదేశించారు. అలాగే పుష్కరాలకు వచ్చే వీఐపీలు, భక్తుల ఆహ్లాదం కోసం హెలికాప్టర్, బోట్లను సిద్ధం చేయాలని సూచించారు. అధికారులు ఈ సందర్భంగా పుష్కరాలపై తుది దశకు చేరుకున్న పనులను ముఖ్యమంత్రికి వివరించారు. కాగా కృష్ణా పుష్కరాలపై ఈ నెల 6న మరోసారి చంద్రబాబు అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. మరోవైపు ఈనెల 11న రాజమహేంద్రవరంలో జరిగే గోదావరి అంత్య పుష్కరాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. గోదావరికి హారతి ఇవ్వడం పూర్తి కాగానే, నేరుగా విజయవాడలో కృష్ణా పుష్కరాల కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరవుతారు. -
బెజవాడలో శ్రీవారి నమూనా ఆలయం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య భవన్లో చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో శ్రీవారి నమునా ఆలయం, రోజుకు లక్షమంది భక్తులు దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేయనుంది. అలాగే బుధవారం నుంచి పుష్కర యాత్ర తిరుమల నుంచి ప్రారంభమై 7వ తేదీకి విజయవాడకు చేరనుంది. పాలకమండలి నిర్ణయాలు... తిరుపతిలో దక్షిణం వైపు రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 74 సెంట్లు స్థలం కేటాయింపు. ఏడాదిలో స్టేషన్ పనులు పూర్తి చేయాలని నిర్ణయం. 3 లక్షల 50 ఏవల కేజీల కందిపప్పు, 36వేల కేజీల యాలుకలు, లక్ష కిలోల ఉద్దిపప్పు కొనుగోళ్లుకు ఆమోదం. చిత్తూరు జిల్లా రాయలచెర్వు వద్ద 32 లక్షలతో 46 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు ఆమెదం. ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి ఆలయాలను నిర్మాణం. ద్వారకా తిరుమలలో వికలాంగుల ఆస్పత్రి నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయింపు. విజయనగరం కొత్తవలసలోని విశ్వేశ్వర ఆయల మరమ్మతులకు నిధుల కేటాయింపు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ చెన్నకేశవ ఆలయానికి, గుంటూరు జిల్లా తాడికొండ ఆలయానికి మహారథాలు ఏర్పాటు. -
పుష్కర రైళ్లలో ‘ప్రత్యేక’ దోపిడీ
* ప్రత్యేక రైళ్లలో వెళ్లేందుకు ప్రయాణికుల విముఖత * రెగ్యులర్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ‘స్పెషల్’ దోపిడీకి తెరలేపింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరుగనున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ సాధారణ చార్జీలపై అదనపు వసూళ్లకు దిగింది. దీంతో ఈ రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకొనేందుకు ప్రయాణికులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు రెగ్యులర్ రైళ్లకు మాత్రం డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. అదనపు చార్జీల కారణంగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల నిరాదరణకు గురవుతుండగా, రెగ్యులర్ రైళ్లకు మాత్రం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. వీటిలో ఇప్పటివరకు 100 బస్సులు బుక్ అయినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్ఎం గంగాధర్ తెలిపారు. స్పెషల్ రైళ్లు-తత్కాల్ చార్జీలు హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి భక్తులు విజయవాడకు చేరుకొనేవిధంగా, పుష్కరఘాట్లకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లకు రాకపోకలు సాగించే విధంగా సుమారు 220 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అన్ని రైళ్లలోనూ సాధారణ చార్జీల స్థానంలో తత్కాల్ చార్జీలు విధించారు. స్లీపర్ క్లాస్‌పైన సగటున రూ.100 నుంచి రూ.150 వరకు, థర్డ్ ఏసీ బెర్తులపైన రూ.250 నుంచి రూ.350 వరకు, సెకెండ్ ఏసీ పైన రూ.400 నుంచి రూ.500 వరకు అదనపు చార్జీలు విధించారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో, వేసవి సెలవుల్లో ప్రతి సంవత్సరం సాధారణ చార్జీలపైనే ప్రత్యేక రైళ్లు నడుపుతుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారి కృష్ణా పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు దోపిడీకి దిగింది. పుష్కరాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, శ్రీశైలం, బీచుపల్లి, నాగార్జునసాగర్‌లకు 400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఆగస్టు 12 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. -
భక్తుల కోసం 400బస్సులు
అచ్చంపేట రూరల్ : కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని ఆర్టీసీ ఆర్ఎం వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం అచ్చంపేట ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పుష్కర ఘాట్లకు 400బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన ఘాట్ల వద్దకు ప్రత్యేక బస్సులను నడిపిస్తామన్నారు. దోమలపెంట నుంచి పాతాళగంగ వరకు ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను చేరవేస్తామన్నారు. అచ్చంపేటకు రెండు మినీ బస్సులు మంజూరయ్యాయని, నిత్యం ఉమామహేశ్వరానికి నడిపిస్తామన్నారు. సంస్థ తరఫున పుష్కరాలను ఇద్దరు ఆర్ఎంలు, ఆరుగురు డివిజన్‌స్థాయి అధికారులు, 12మంది డీఎంలు, 18మంది సీఎస్‌లు, 25మంది టీఐలు, 50మంది కంట్రోలర్లు పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం నారాయణ, సిబ్బంది సురేందర్, జోగమ్మ, వీసీమౌళి, టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌లాల్, కార్మిక సంఘం నాయకుడు రాములు తదితరులు పాల్గొన్నారు. -
బందీగా దేవతామూర్తులు..
విజయవాడ: నూతన రాజధానిలో వందల సంవత్సరాల నాటి దేవాలయాలు, మఠాలు విజయవాడలో కూల్చివేతకు గురయ్యాయి. అందులోని విగ్రహాలు ప్రస్తుతం విలపిస్తున్నాయి. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకునే దేవతామూర్తుల విగ్రహాలు కొన్ని ప్రస్తుతం ఏ పూజకూ నోచుకోకుండా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని గదుల్లో బందీలయ్యాయి. కృష్ణా నది ఒడ్డున నిత్యపూజలతో ఆధ్యాత్మికత విలసిల్లే వాతావరణం నేడు కనుమరుగవుతోంది. భక్తులతో కిటకటలాడాల్సిన ఆలయాలు నేలమట్టమై, దేవతామూర్తులు కనిపించకుండాపోవడంపై భక్తజనం ఆక్రోశిస్తున్నారు. విగ్రహాలు ఎక్కడికి తరలించారో అధికారులు చెప్పకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలనాపాలన, పూజా కార్యక్రమాల నిర్వహణకు విగ్రహాలు నోచుకోక ఎక్కడో ఓ మూలలో, చీకటి గదుల్లో ఉంచేశారు. తొలగించిన దేవాలయాలను పునర్మిస్తామని, విగ్రహాలకు నిత్య పూజలు జరిగేలా చూస్తామని చెప్పిన దేవాదాయశాఖ మంత్రి ఆ విషయం మరిచిపోయారు. చెల్లా చెదురైన విగ్రహాలు గుళ్లు తొలగించిన వారు ఇష్టమొచ్చిన చోట విగ్రహాలు పడేశారు. కొన్నింటిని మునిసిపాలిటీలో ఉంచారు. రథం సెంటర్లో ఉన్న పురాతన ద్వారపాలకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శనీశ్వరాలయానికి ఎదురుగా ఇంద్రకీలాద్రికి దిగువ భాగంలో ఉండే సీతమ్మవారి పాదాలు తీసివేశారు. పురాతనమైన ఆంజనేయస్వామి దేవాలయాన్నీ కూల్చివేశారు. అర్జునవీధిలోని మహామండపం దిగువన గుడి ఉంది. అమ్మవారి గుడికి నాలుగు వైపుల ఆంజనేయస్వామి గుడులు ఉన్నాయి. అందులో తూర్పువైపున ఉన్న ఆంజనేయుడి దేవస్థానాన్ని కూల్చాక విగ్రహాన్ని ట్రాలీలో వేసి తాళ్లతో కట్టి మునిసిపల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ ఆరుబయట ట్రాలీని ఉంచడంతో ‘సాక్షి’లో ఆ ఫొటో ప్రచురితమైంది. దీంతో తేరుకున్న అధికారులు అందులోని విగ్రహాలను వేరే ప్రాంతాలకు తరలించారు. పుష్కరాల సమయంలో దర్శనానికి దిక్కేది? పుష్కరాల సమయంలో భక్తులు దేవుడి దర్శనం చేసుకుందామంటే దేవాలయం కనిపించడం లేదు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుందామంటే ఘాట్ రోడ్డును మూసేశారు. అక్కడ ఉండే దుకాణాలు, విచారణ కేంద్రాలు, కార్యనిర్వహణాధికారి, పరిపాలనా భవనాలు, ఇతర దీక్ష మండపాలు, భవనాలు కూల్చి వేశారు. ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే ఈ ప్రాంతాన్ని గ్రీనరీగా మారుస్తామని చెబుతున్నారు. మరోవైపు ఆలయాల కూల్చివేతపై వేసిన మంత్రుల కమిటీ మాటలకే పరిమితమైంది. సీతమ్మవారి పాదాలు, దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు పునర్మిస్తామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ ఊసేలేదు. -
'దొంగ'భక్తులు వస్తున్నారు..
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల హడావుడి అంతా ఇంతా కాదు. భక్తులు, వ్యాపారులు, పూజారులు, అధికారులు ఇలా అన్ని వర్గాల వారూ పుష్కరాల్లో ఊపిరిసలపనంత బిజీ అవుతారు. వీరే కాదు.. ఇంకో బ్యాచ్ కూడా చాలా బిజీగా ఉంటుంది పుష్కరాల సీజన్లో. అదే దొంగల బ్యాచ్. వీరికి కూడా పుష్కరాల్లో చేతి నిండా పనే. వీరి కళ్లన్నీ జనం జేబుల్లోని పర్సులు, నగదు, మహిళల మెడపై ఉండే బంగారు ఆభరణాల చుట్టూనే తిరుగుతుంటాయి. సందట్లో సడేమియా అన్నట్టు దొరికినంత దోచుకునేందుకు వీరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు : విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగల బ్యాచ్ స్థావరాలకు పెట్టింది పేరు. దీన్ని ఆసరాగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు 12 రోజులపాటు జరిగే పుష్కరాల పని కోసం స్థావరాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో తమతో సత్సంబంధాలు ఉండేవారి ద్వారా తమకు ఆశ్రయం కల్పించే వారి తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తమకు షెల్టర్ ఇచ్చినవారికి అద్దె రూపంలో డబ్బు చెల్లించేలా కాదండోయ్.. వారు కాజేసిన సొమ్ములో కొంత వాటా ఇచ్చేలా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. మొత్తానికి ఈ విషయం ఆనోటా, ఈనోటా పోలీసు బాస్‌ల చెవికి చేరింది. వీరిని ఎలా అరికట్టాలనే దానిపై వారు ప్రణాళికలు రచించే పనిలో పడ్డారు. షెల్టర్లు సిద్ధం! ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలు కానున్న విషయం తెలిసిందే. దీని కోసం వ్యాపారులు, పూజారులు, అధికారులు ఏవిధంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారో దొంగలు సైతం ఈ 12 రోజుల్లో తమ చేతివాటం చూపేందుకు కావాల్సిన ఏర్పాట్లన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం, మహానాడు, సుందరయ్యనగర్, కేఎల్‌రావు కాలనీతో పాటు, విజయవాడలోని కేదారేశ్వరపేట, రాజారాజేశ్వరిపేట, కొండపల్లి, నందిగామలతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ఉండే దొంగల బ్యాచ్ ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చే దొంగల ముఠాకు షెల్టర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కొప్పరాల తిప్ప, నెల్లూరు జిల్లా పిట్రగుంట, తమిళనాడులోని కాంచీపురం, చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంతో పాటు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అనేక గ్రామాల నుంచి దొంగల ముఠాలు పుష్కరాల్లో తమ ‘పనితనం’ చూపించేం దుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని తమ పాతమిత్రుల ద్వారా స్థానిక దొంగలను ఆశ్రయించి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. 12 రోజుల పాటు ఇక్కడే ఉండేందుకు వసతి సౌకర్యంతో పాటు, భోజన సదుపాయాలు సైతం అందించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అందుకు ప్రతిగా వారు దోచుకున్న సొత్తులో కొంత వాటాను వీరికి పంచేలా, వీరి మధ్య సయోధ్య కుదిరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే తాడేపల్లి మండలం పట్టాభిరామయ్య కాలనీలోని ఓ హిజ్రా ఇంట్లో బయటి నుంచి వచ్చే దొంగలకు షెల్టర్ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. పుష్కరాల ప్రాంతంలో నిరంతర నిఘా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాం. గత పుష్కరాల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తతతో వ్యవహరించేలా పోలీసు సిబ్బందికి సూచనలు చేశాం. కృష్ణా పుష్కరాల్లో ఎటువంటి సంఘటనలూ జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. - సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు అర్బన్ ఎస్పీ అసలే ముదుర్లు.. వీరికి ఇతరులూ తోడు.. గత కృష్ణా పుష్కరాల్లో సైతం ఈ ప్రాంతంలో దొంగలు తమ చేతికి పనిచెప్పి పుష్కరాలకు వచ్చే భక్తుల సొమ్మును భారీ ఎత్తున దోచుకున్నట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. దీనికి తోడు తాడేపల్లి మండలంలోని అనేక ప్రాంతాలకు చెందిన దొంగలు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలతో పాటు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో సైతం దొంగతనాలు చేసిన సంఘటనలు అందరికీ తెలిసిందే. గత ఏడాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ యోగ సెంటర్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు చెందిన డబ్బు, నగలు, సెల్ఫోన్లను తాడేపల్లి దొంగలు ఎత్తుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంతా అత్యున్నత స్థాయి అధికారులు కావడంతో దొంగలను పట్టి సొత్తు రికవరీ చేసిన పోలీసులు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో దొంగతనాలకు పాల్పడే దొంగలకు, బయట నుంచి వచ్చే ముఠాలు తోడైతే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించటం కష్టమే. పుష్కర ఏర్పాట్లు, ట్రాఫిక్‌పై దృష్టి పెడుతున్న పోలీసులు వీరిపై ఇప్పటినుంచే పూర్తిస్థాయి నిఘా ఉంచకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనేది అందరూ ఒప్పుకోవాల్సిందే. -
బాబూ.. అక్కడ షూటింగ్ వద్దు
సీఎంకు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హితవు సాక్షి, విజయవాడ బ్యూరో: గోదావరి పుష్కరాల్లో షూటింగ్ కార్యక్రమాలు పెట్టుకొని 29 మంది మృతికి కారణమైన సీఎం చంద్రబాబు.. కృష్ణా పుష్కరాల్లో అలాంటివేవీ చేయొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే దుర్గాఘాట్‌లో సినిమా షూటింగ్ వద్దని సీఎంకు బోయపాటి శ్రీను డెరైక్షన్ ఇవ్వాలని సూచించారు. విజయవాడలో జరుగుతున్న పుష్కర పనులను సీపీఐ బృందంతో కలసి రామకృష్ణ గురువారం పరిశీలించారు. పుష్కర పనుల పురోగతి, నాణ్యత వంటి విషయాలను జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వైఎస్ సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పనులకు సంబంధించి లోకేశ్ కనుసన్నల్లో రూ. వందల కోట్లు నామినేషన్ పద్ధతిపై ఇచ్చి అవినీతికి ఆస్కారం ఇచ్చారని విమర్శించారు. అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా ఆగస్టు 7న గుంటూరులో జరిగే సదస్సులో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని వెల్లడించారు. పుష్కర పనులు పరిశీలించిన వారిలో రామకృష్ణతోపాటు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ఉన్నారు. విజయవాడలో అతి ముఖ్యమైన దుర్గాఘాట్ పనులు ఇంకా సాగుతూనే ఉండగా, డిప్పింగ్ చానల్ అయితే ఇసుక సంచులు వేసి హడావుడిగా పనులు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో చేపట్టే ఈ పనులన్నీ శాశ్వతంగా ఉండాలని కాకుండా ఏదో 12 రోజులు ఉంటే చాలన్నట్టుగా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా చట్టాలను ఉల్లంఘించి ఇలా పనులు నాణ్యత లేకుండా చేస్తున్నారని తప్పుబట్టారు. -
పుష్కరాలకు ఎయిర్కోస్టా ప్రత్యేక సర్వీసులు..
విమానాశ్రయం (గన్నవరం): కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడకు మరో 4 విమానాలు నడపనున్నట్లు ఎయిర్కోస్టా తెలిపింది. వచ్చే నెల 10 నుంచి 25 వరకు హైదరాబాద్, బెంగళూరు నుంచి ఈ అదనపు సర్వీసులను నడిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేసింది. వివరాలివీ.. -
కృష్ణా పుష్కరాలకు 175 ఘాట్లు
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : కృష్ణాపుష్కరాలకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పుష్కర భక్తుల కోసం 175 ఘాట్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.150 కోట్ల పనులు చేపట్టి రోడ్లను అనుసంధానం చేశామని చెప్పారు. పుష్కరాల్లో రోజూ 15లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు పలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థల సాయంతో కార్యాచరణ రూపొందించామన్నారు. ఐదు కోట్ల రూపాయలతో తిరుపతి నమూనా దేవాలయం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పిండప్రదానాలకు రెయిన్‌ప్రూఫ్ టెంట్లను అందుబాటులో ఉంచామని, పురోహితులకు గుర్తింపు కార్డులు జారీ చేశామని వివరించారు. పుష్కరాల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని చెప్పారు. దీని ద్వారా ఏ ఘాట్‌లో ఎంతమంది జనం ఉన్నారు.. ఘాట్లకు ఎలా వెళ్లాలనే వివరాలు తెలుస్తాయన్నారు. పుష్కర భక్తుల కోసం విజయవాడ నగరం వెలుపల 35 పుష్కర్ నగర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క నగర్లో ఐదువేల మంది ఉండవచ్చని చెప్పారు. ఆ 12 రోజులూ వాహనాలను విజయవాడ నగరంలోకి అనుమతించబోమని, భక్తులను ఉచితంగా బస్సుల్లో ఘాట్ల వద్దకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
చంద్రబాబుతో బోయపాటి శ్రీను భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను బుధవారం భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. కాగా గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా బోయపాటి...తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై షార్ట్ ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ జరిగిన తొక్కిసలాటలో 30మంది మృత్యువాత పడ్డారు. తాజాగా కృష్ణా పుష్కరాల హారతికి సంబంధించి బోయపాటే డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. నటుడు సాయికుమార్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టెండర్లు లేకుండానే పుష్కరాల పనులు
-
పుష్కర పనులపై సీఎం అసంతృప్తి
విజయవాడ: కృష్ణా పుష్కరాల పనులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆగష్టు లో జరిగే కృష్ణా పుష్కరాలు, వనం-మనం కార్యక్రమాలపై చర్చ జరిగింది. రూ. 80 కోట్ల విలువైన పుష్కర పనులకు మంత్రి వర్గం ఆమోదించింది. కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ను రాష్ట్ర అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రేషన్ డీలర్లకు కమీషన్ క్వింటాకు రూ.70 పెంచేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. ఆగస్టు నెలలో ప్రభుత్వం ప్రారంభించనున్న వనం - మనం కార్యక్రమం, కృష్ణా పుష్కరాలతోపాటు పాలనలో సాంకేతిక అనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో కృష్ణా పుష్కరాల్లో టెండర్లు లేకుండా కేటాయించిన పనులకు కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. అనంతరం వివిధ శాఖాధిపతులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. అయితే అనుమతులు లేకుండా ఇరిగేషన్ శాఖలో దాదాపు రూ. 86 కోట్ల విలువైన పనుల బిల్లుల చెల్లింపునకు ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. కాగా ఈ బిల్లుల చెల్లింపుపై కేబినేట్ ఆమోదం తెలపనుందని తెలిసింది. -
30లోగా పనులు పూర్తి చేయాలి
- పుష్కరాలకు వచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బందులు రానివ్వొద్దు –ఏర్పాట్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు –ముఖ్యమంత్రి డేగ కన్ను పెట్టారు.. అధికారులు జాగ్రత్తగా ఉండాలి –కృష్ణా పుష్కర పనులపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కృష్ణా పుష్కరాల పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వచ్చే నెల 12నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో జరుగుతున్న వివిధ పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, దాదాపు కోటిన్నర మంది భక్తులు వస్తారన్న అంచనాతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పుష్కర స్నానం కోసం వచ్చే ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా తిరిగి వెళ్లాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అయితే, పుష్కరాల ఏర్పాట్ల విషయంలో కొంత జాప్యం జరుగుతోందని, అధికారులు అలసత్వంగా ఉంటే సహించేది లేదని, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. పుష్కరాలు పూర్తయ్యేంతవరకు అధికారులకు సెలవులు ఇచ్చేది లేదని తాను కూడా ఇక్కడే ఉండి పనులు చూసుకుంటానని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఏమాత్రం అలతస్వం వహించినా అధికారులకు పనిష్మెంట్ తప్పదని హెచ్చరించారు. దేవరకొండ డివిజన్లో జరుగుతున్న పనులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్కింగ్ స్థాలు, హోల్డింగ్ పాయింట్ల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పుష్కర ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని, ముఖ్యమంత్రి ఈ పనులపై డేగకన్ను పెట్టారన్న విషయాన్ని అధికారులంతా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ, అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అటవీశాఖ అదనపు చీఫ్ కన్జర్వేటర్ పర్గేన్, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కరరావుతో పాటు పలువురు జిల్లా అధికారులు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు : మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2004 పుష్కరాల సందర్భంగా కేవలం 11 ఘాట్లలో మాత్రమే భక్తుల స్నానాలకు ఏర్పాట్లు చేశారని, ఈసారి జిల్లా వ్యాప్తంగా 28 పుష్కర ఘాట్లు అందుబాటులోకి తెస్తున్నట్ల చెప్పారు. పుష్కర పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయని, రహదారుల నిర్మాణం 65 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రత్యేక పార్కింగ్ కోసం నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లిలో 544 ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు మంత్రి వివరించారు. ఇకపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను తానే పర్యవేక్షిస్తానని, పుష్కరాలు పూర్తయ్యేవరకు అధికారులతో పాటు తాను కూడా ఉంటానని చెప్పారు. -
కృష్ణా పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా పుష్కరాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఘాట్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌ను పిలిచి ఆయన ఇవాళ మందలించారు. కాంట్రాక్టర్లపై ఆధారపడకుండా పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కాగా ముఖ్యమంత్రి నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానది పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై సంజాయిషీ చెప్పాలని హుకుం జారీ చేశారు. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. -
కృష్ణా పుష్కరాలకు మరో 358 సర్వీసులు
మూడో విడత ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే సాక్షి, హైదరాబాద్: కృష్ణా కెనాల్ పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో దక్షిణ మధ్య రైల్వే 238 ప్రత్యేక సర్వీసులను ప్రకటించగా, మూడో విడతగా మరో 358 సర్వీసులను గురువారం ప్రకటించింది. గతేడాది గోదావరి పుష్కరాల సమయం లో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలకు రావటంతో రైళ్లు సరిపోక ఇబ్బందులు పడ్డారు. మూడో విడతతో కలిపి 596 సర్వీసులను ప్రకటించింది. * గుంతకల్-కృష్ణా కెనాల్ మార్గంలో ఆగస్టు 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో 12 సర్వీసులు నడుస్తాయి. గుంతకల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, కృష్ణా కెనాల్లో సాయంత్రం 5 గంటలకు ఇవి బయల్దేరుతాయి * గుంతకల్-కృష్ణా కెనాల్ మధ్య అవే తేదీల్లో మరో 12 సర్వీసులు నడుస్తాయి. గుంతకల్‌లో రాత్రి 9.30కి బయల్దేరుతాయి. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 14, 16, 18, 20, 22, 24 తేదీల్లో కృష్ణా కెనాల్ స్టేషన్ నుంచి ఉదయం 11.30కి బయల్దేరుతాయి * తిరుపతి-కృష్ణా కెనాల్ మధ్య ఆగస్టు 11 నుంచి 23 వరకు (16, 21 తేదీలు మినహా) 22 సర్వీసులు నడుస్తాయి. రాత్రి 11 గంటలకు తిరుపతిలో బయల్దేరుతాయి. తిరుగు ప్రయాణంలో 12, 13, 14, 15, 17, 18, 19, 20, 22, 23, 24 తేదీల్లో ఉదయం 10 గంటలకు కృష్ణా కెనాల్లో బయల్దేరుతాయి. * నర్సాపూర్- కృష్ణా కెనాల్ మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు 24 సర్వీసులు తిరుగుతాయి. నర్సాపూర్‌లో మధ్యాహ్నం 12.25కు, కృష్ణా కెనాల్లో రాత్రి 9.30కి బయల్దేరుతాయి. * సికింద్రాబాద్-విజయవాడ మధ్య 14 నుంచి 21వ తేదీ వరకు నాలుగు సర్వీసులు తిరుగుతాయి. సికింద్రాబాద్‌లో ఉదయం 9.30కి, విజయవాడలో సాయంత్రం 5.30కి బయల్దేరుతాయి. * సికింద్రాబాద్-కృష్ణా కెనాల్ మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు 24 సర్వీసులు తిరుగుతాయి. సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.15కు, కృష్ణా కెనాల్లో 2.20కి బయల్దేరుతాయి. * విజయవాడ-నర్సాపూర్ మధ్య 11 నుంచి 26వ తేదీ వరకు 26 సర్వీసులు అందుబాటులో ఉంటా యి. విజయవాడలో రాత్రి 10, నర్సాపూర్‌లో ఉద యం 4 గంటలకు బయల్దేరుతాయి. ఇదే దారిలో 12 నుంచి 23వ తేదీ వరకు మరో 26 సర్వీసులు తిరుగుతాయి. విజయవాడలో మధ్యాహ్నం 1.45కు, నర్సాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతాయి. * విజయవాడ-మచిలీపట్నం మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు 24 సర్వీసులు అందుబాటులో ఉంటా యి. విజయవాడలో ఉదయం 10.10కి, మచిలీపట్నంలో ఉదయం 10.45కు బయల్దేరుతాయి. * విజయవాడ-భద్రాచలం రోడ్డు మధ్య 11 నుంచి 24వ తేదీ వరకు 50 సర్వీసులు తిరుగుతాయి. విజయవాడలో ఉదయం 10.45, రాత్రి 11.20కి, భద్రాచలం రోడ్డు స్టేషన్లో ఉదయం 5.30, సాయంత్రం 4.30కి బయల్దేరుతాయి. * బొల్లారం-గద్వాల మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు 24 సర్వీసులు ఉంటా యి. బొల్లారంలో ఉదయం 7 గంటలకు, గద్వాలలో మధ్యాహ్నం 2.30కి బయల్దేరుతాయి. * గద్వాల-కర్నూలు మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు (15, 22 తేదీల్లో మినహా) 20 సర్వీసులు తిరుగుతాయి. గద్వాలలో మధ్యాహ్నం 3 గంటలకు, కర్నూలులో మధ్యాహ్నం 12.30కి బయల్దేరుతాయి. * రాజమండ్రి-రాయనపాడు మధ్య 12 నుంచి 17వ తేదీ, 19 నుంచి 23వ తేదీ మధ్య 44 సర్వీసులు తిరుగుతాయి. రాజమండ్రిలో ఉదయం 4.10, మధ్యాహ్నం 2.30కి, రాయనపాడులో ఉదయం 9.30కి, రాత్రి 7.30కి బయల్దేరుతాయి. * ఒంగోలు-కృష్ణా కెనాల్ మధ్య 12 నుంచి 18వ తేదీ, 20 నుంచి 23వ తేదీ మధ్య 44 సర్వీసులు తిరుగుతాయి. కృష్ణా కెనాల్ స్టేషన్లో ఉదయం 5.45కు మధ్యాహ్నం 2.30కి, ఒంగోలులో ఉదయం 11, సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. -
నీళ్లొచ్చేనా?
ఘాట్ నిర్మాణం కోసం రూ.1.37కోట్ల నిధులు నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటేనే ఉపయోగం నాసిరకంగా జరుగుతున్న పనులు పట్టించుకోని నీటి పారుదలశాఖ అధికారులు అచ్చంపేట: బక్కలింగాయిపల్లి...ఓ ఏజన్సీ గ్రామం. జిల్లాకు దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. మండలకేంద్రం అచ్చంపేటకు 60కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం పుష్కరఘాట్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది. 20/140మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్ కోసం రూ.1.37కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇది వరకు బాగానే ఉంది.. కానీ ఇక్కడ పుష్కరాలు సమయానికి ఈ ఘాట్ భక్తులకు ఉపయోగపడేది అనుమానంగానే ఉంది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండి నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్లి, ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటేనే ఈ పుష్కరఘాట్‌కు నీళ్లు వస్తాయి. సాగర్‌కు నీళ్లు రాకపోతే ఈఘాట్ ఎందుకు ఉపయోగపడే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ ఘాట్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో సాగర్ బ్యాక్‌వాటర్ ఉంది. పుష్కరాలకు మరో 22రోజులు మాత్రమే ఉన్నాయి. ఈలోగా కర్ణాటకలో భారీ వర్షాలు పడి, కృష్ణమ్మ కనికరిస్తేనే గానీ ఈ ఘాట్‌కు నీళ్లొచ్చే అవకాశం లేదు. అధికారులు ముందు చూపులేకుండా బక్కలింగాయిపల్లి వద్ద పుష్కరఘాట్ నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యతకు తిలోదకాలు బక్కలింగాయిపల్లి వద్ద చేపడుతున్న పుష్కరఘాట్ నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కంకర, ఇసుక బాగానే ఉన్నా సిమెంటు నిబంధనల ప్రకారం వాడటం లేదన్న ఆరోపణలున్నాయి. నాణ్యతగా పనులు లేకపోవడంతో వేసిన కంకర బెడ్లు, వాల్స్ ఇప్పుడే రాలిపోతున్నాయి. నిబంధనల ప్రకారం వైబ్రేషన్ మిషన్ వాడాల్సిన ఉన్నా, దాన్ని ఉపయోగించడం లేదు. క్యూరింగ్ కూడా నామమాత్రంగా చేస్తున్నారు. నిర్మించిన ప్లాట్‌ఫాంలు లేవల్‌గా లేకపోవడంతో అక్కడక్కడ గోతులు ఏర్పడి నీళ్లు నిలుస్తున్నాయి. పుష్కరఘాట్ వద్ద మూడు బోర్లు వేశారు. మోటార్లు బిగించి పైపులైన్ ఏర్పాటు చేసి మూడు మినీ ట్యాంకుల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఘాట్ వద్ద మరుగుదొడ్లతో 20 డ్రస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంత వరకు మొదలు పెట్టలేదు. పనులు వద్ద కాంట్రాక్టర్ కానీ, సూపర్వైజర్లు ఎవరూ లేకపోవడంతో పనివాళ్లు మాత్రమే అక్కడ పనులు చూసుకుంటున్నారు. నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఘాట్ వద్ద మట్టి లేవలింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. వాల్స్ నిర్మాణం జరుగుతోందని, డ్రసింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని, కోర్ టెస్టు చేసి ల్యాబ్‌కు పంపించి క్వాలిటీ వస్తేనే బిల్లులు ఇస్తామని ఇరిగేషన్ డీఈ అశోక్‌కుమార్ తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారులు స్తంభాలే వేసి, లైన్ ఏర్పాటు చేశారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ బిగించే పనిలో ఉన్నారు. మద్దిమడుగుకు 8కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది వద్ద కూడా పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలని నల్లమల ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇక్కడి రోడ్డుతో పాటు ఘాట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. తొలుత జిల్లాలో అన్ని పుష్కరఘాట్లతో పాటు మద్దిమడుగు వద్ద ఘాట్ కోసం ప్రతిపాదనలు పంపిన అధికారులు, ఆ తర్వాత దీన్ని పక్కకు పెట్టారు. -
సగం.. సగం..
ముంచుకొస్తున్న పుష్కరాలు నత్తకే నడకనేర్పుతున్న పనులు ఘాట్లలో పూర్తికాని నిర్మాణాలు ఆత్మకూర్: ఈ నెలాఖరులోగా పుష్కరపనులు పూర్తి చేస్తామంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. మక్తల్ నియోజకవర్గంలో మాత్రం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మాగనూరు మండలంలో కృష్ణా పుష్కరఘాట్‌కు రూ.70లక్షలు నిధులు కేటాయించగా, 70శాతం పనులు పూర్తయ్యాయి. కానీ మరుగుదొడ్లు, తాగునీటి అభివృద్ధి పనుల ఊసేలేదు. అలాగే రూ.90లక్షలతో చేపట్టిన తంగిడిఘాట్ పనులు 75శాతం, రూ.1.40కోట్లతో చేపట్టిన గుడెబల్లూర్ ఘాట్ 80శాతం పనులు జరిగాయి. మక్తల్ మండలంలోని పస్పుల ఘాట్‌కు రూ. 52లక్షలు మంజూరు కాగా 40శాతం పనులు, పంచదేవ్‌పహాడ్‌కు రూ.58లక్షలు పనులకు 40శాతం, అనుగొండకు రూ.1.60కోట్ల పనులకు 50శాతం, ముస్లాయిపల్లికి రూ.79లక్షలు పనులకు 40శాతం, గడ్డంపల్లిలో రూ. 80లక్షలు పనులకు 40శాతం, పారేవులకు రూ. 57లక్షలు పనులకు 45శాతం జరిగాయి. ఆత్మకూర్ మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందిమల్ల రూ.1.52కోట్లతో చేపట్టిన పనులు 75శాతం పూర్తయ్యాయి. మూలమల్లలో రూ. 64లక్షల పనులకు 40శాతం, జూరాలలో రూ.1.20కోట్లకు 80శాతం, ఆరేపల్లి రూ.64లక్షలు పనులు 50శాతం, కత్తేపల్లి రూ. 64లక్షలు పనులు 40శాతం మాత్రమే జరిగాయి. పనులు పూర్తి చేసేందుకు ఇంకా వారంరోజుల సమయమే ఉన్నా దాదాపు 50శాతం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానఘాట్లోనూ అదే పరిస్థితి.. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద 55/60మీటర్ల పుష్కరఘాట్ నిర్మిస్తున్నారు. 12ఏళ్ల క్రితం నిర్మించిన ఇక్కడి పుష్కరఘాట్ వీఐపీ ఘాట్ కోసం కేటాయించారు. మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. ఘాట్ పరిసరాల్లో వేర్వేరు చోట్ల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉండగా పనులు ప్రారంభం కాలేదు. అలాగే తాగునీటి సౌకర్యం కోసం బోర్లు వేశారు గానీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పుష్కరఘాట్లను సందర్శిస్తున్నా.. పనులు పురోగతి, నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తలలేని కృష్ణమ్మ 12ఏళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా నందిమల్ల పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణవేణి విగ్రహాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రతిష్ఠించి, ప్రారంభించారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో కృష్ణవేణమ్మ విగ్రహం తల లేకుండా మొండెంతోనే ఉంది. అక్కడ కట్టిన గుడి కూలిపోయి, విగ్రహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. గుడిని పునరుద్ధర ణ చేయించాలని భక్తులు కోరుతున్నారు. -
బీచుపల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్లు
ఇటిక్యాల: గతేడాది నుంచి నీటి ప్రవాహం లేక బోసిపోయిన కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు వదలడంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు కింద ఉన్న శ్రీశైలంకు చేరుతుంది. బీచుపల్లి వద్ద నూతనంగా నిర్మించే పుష్కరఘాట్లను ఆనుకుని నదిలో నీటì ప్రవాహం ఉండటంతో గురువారం సందర్శకులు కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వస్తున్నారు. వచ్చేనెల 12నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బీచుపల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్లు
ఇటిక్యాల: గతేడాది నుంచి నీటి ప్రవాహం లేక బోసిపోయిన కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు వదలడంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు కింద ఉన్న శ్రీశైలంకు చేరుతుంది. బీచుపల్లి వద్ద నూతనంగా నిర్మించే పుష్కరఘాట్లను ఆనుకుని నదిలో నీటì æప్రవాహం ఉండటంతో గురువారం సందర్శకులు కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వస్తున్నారు. వచ్చేనెల 12నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానది పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. ఆయన దుర్గగుడి, కృష్ణవేణి పుష్కర ఘాట్లను సందర్శించి పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానదిలో బ్యారేజ్ దగ్గర నీటిమట్టం స్థాయిలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి అంతకు ముందు గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై సంజాయిషీ చెప్పాలని హుకుం జారీ చేశారు. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా అరెస్ట్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కృష్ణా పుష్కరాలు చరిత్రాత్మకమైనవి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి నిర్వహిస్తోంది. ఎంతో విశ్వాసంతో పనులు అప్పగిస్తే చేసిన పనులు ఇవేనా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన గుంటూరు కృష్ణా జిల్లాలలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను రెండుగంటలకు పైగా కలియదిరిగి ఆసాంతం పరిశీలించారు. ‘నేనెంతో కష్టపడి నిమిష నిమిషం ఎక్కడ ఉన్నా పుష్కరాల పనులను సమీక్షిస్తున్నాను’ అని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని వివరణ ఇవ్వటంతో ఇవ్వటంతో ముఖ్యమంత్రి శాంతించారు. పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలించారు. పుష్కరాల నాటికి ఫ్లయ్ ఓవర్ కింద రహదారి రెండులైన్లయినా అందుబాటులోకి రావాలన్నారు.కృష్ణవేణి ఘాట్‌లో మెట్లపై నీరు నిలిచి వుండటాన్ని గమనించి అధికారులను వివరణ అడిగారు. నెలాఖరుకల్లా పనులు పూర్తిచేయటానికి పనుల వేగం పెంచాలని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్, డిజి గౌతం సవాంగ్ లు ఉన్నారు. -
30లోగా పుష్కర పనులు పూర్తి
– వీఐపీ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్ టీకే శ్రీదేవి – ప్రత్యేక టీంలతో పుష్కర పనుల పర్యవేక్షణ – వాటర్ లెవల్స్‌కు తగ్గట్టుగా ఏ, బీ ప్రణాళికలు అలంపూర్: కృష్ణా పుష్కర పనులు ఈ నెల 30లోగా పూర్తవుతాయని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. అలంపూర్ మండలపరిధిలోని గొందిమల్లలో కృష్ణానది తీరంలో నిర్మిస్తున్న వీఐపీ పుష్కరఘాట్‌ను ఆమె బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ నిర్మిస్తున్న లోలెవల్, హైలెవల్స్ పుష్కర పనుల పురోగతి, నాణ్యత, పిండ ప్రదానాల స్థలం, పార్కింగ్, బట్టలు మార్చుకునే గదులు, పారిశుద్ధ్యం వంటి అంశాలను అధికారులతో చర్చించారు. ముందుగా నదితీరంలో నిర్మించిన లోలెవల్ ఘాట్‌ను సందర్శించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 30మీ.వెడల్పు, 90మీ.పొడవుతో నిర్మించిఘాట్లో 10మీ. వెడల్పులో బారీకేడ్ ఏర్పాటు చేసి వీఐపీలకు కేటాయించాలని, మిగిలిన 20మీటర్ల వెడల్పులో సాధారణ భక్తులు పుష్కరస్నానాలు చేసే విధంగా చేయాలన్నారు. వీఐపీలకు, సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహాలను బట్టి ముందస్తుగా ప్లాన్ ‘ఏ’ ప్లాన్ ‘బీ’లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. నదిలో నీళ్లు అధికంగా వస్తే లోలెవల్ ప్లాట్‌ఫామ్ మునిగితే ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న హైలెవల్ ఘాట్లలోనూ ఇవే ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్ సైతం రెండు ఘాట్లకు అనుగుణంగా ఒకటి మాత్రమే నిర్మించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గొందిమల్ల ఘాట్‌కు జోగుళాంబ పేరు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి పుష్కరాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఐదో శక్తిపీఠం జోగుళాంబ ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి గొందిమల్ల కృష్ణానది తీరంలో ఘాట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఘాట్‌కు జోగుళాంబఘాట్గా పిలువనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక టీంలతో పుష్కరపనులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి దాదాపు అన్నీ పనులు పూర్తి కావస్తాయని.. మిగిలిన ఒకటి రెండు పనులు పుష్కర సమయానికి పూర్తి చేస్తామన్నారు. నది హారతి హరిద్వారలో గంగానదికి తరహాలోనే కృష్ణానదికి పుష్కరాలకు హారతి ఇచ్చేందుకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఘాట్లను అందంగా తీర్చిదిద్దడం, విగ్రహాల ఏర్పాటుతో పాటు ఘాట్ల వద్ద, అలంపూర్ ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పుష్కర సమయం తెల్లవారుజామున 3.40గంటలకు వస్తున్నట్లు దేవాదాయ శాఖ ఏసీ కృష్ణ కలెక్టర్‌కు వివరించారు. షాద్‌నగర్ నుంచి ట్రాఫిక్ నియంత్రణ జిల్లాలో 179 కి.మీ.కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కృష్ణానది పరివాహకం ఉన్న ప్రతి మండలంలో పుష్కరస్నానాలు ఆచరించడానికి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మనరాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా 27పెద్ద ఘాట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఘాట్ల వద్ద ఉన్న రద్దీ ఆధారంగా షాద్‌నగర్ నుంచే ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఘాట్ల వద్ద రద్దీ సమాచారం ఎఫ్ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఘాట్ల వివరాలు తెలిసే విధంగా హోర్డింగ్‌లు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. రోడ్డు పనులపై ఆగ్రహం పుష్కరాలకు కేవలం 21రోజులే ఉన్నా అలంపూర్–అలంపూర్ చౌరస్తా మధ్య కొనసాగుతున్న డబుల్‌రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై ఎస్ఈలతో చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలంపూర్, గొందిమల్ల గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే స్వచ్ఛభారత్‌తో గ్రామాలను శుభ్రం చేసుకోవాలని సూచించినా, ఎందుకు చేయలేదని డీపీఓను ప్రశ్నించారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడం సర్పంచ్ల బాధ్యత అని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యపనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు ఏజేసీ బాలాజి రంజిత్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రఘు, ఆర్అండ్బీ ఎస్ఈ విజయ్ కుమార్, డీఆర్డీఏ పీడీ మధుసుదన్‌నాయక్, ఎస్ఈ రఘునాథ్, డీపీఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అబ్దుల్ హామిద్, డీఎస్పీ బాలకోటి, తహసీల్దార్ మంజుల, ఎస్ఐ పర్వతాలు, జెడ్పీటీసీ సూర్యబాబు గౌడు, సర్పంచ్ సుజాత నాయుడు తదితరులున్నారు. జోగుళాంబ పేరు మార్మోగాలి అలంపూర్‌రూరల్: కృష్ణా పుష్కరాలలో ఐదో శక్తిపీఠం జోగుళాంబ ఆలయం పేరు నలుమూలల మార్మోగాలని కలెక్టర్ టీకే శ్రీదేవి పేర్కొన్నారు. బుధవారం ఆమె అలంపూర్ ఆలయాలను సందర్శించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించిన వసతులు, చేస్తున్న ఏర్పాట్లపై దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ బి.కృష్ణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి గురురాజను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ధ్వజస్తంభాలకు మెరుగులు దిద్దడం, రాజగోపురాలకు రంగులు, పరిసరాల్లో గ్రీనరీ, పరిశుభ్రత, తాత్కాలిక ఆర్చిగేట్లు వంటి పనులు చేపట్టినట్లు వారు కలెక్టర్‌కు వివరించారు. 12రోజుల పాటు భక్తులకు దర్శనం సందర్భంగా అసౌకర్యం కలగకుండా మాస్టర్‌ప్లాన్‌తో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రచారం బాగా చేయాలి.. పుష్కరాలకు సమయం చాలా తక్కువగా ఉందని, వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. లడ్డూ, ప్రసాదాలు రుచిగా, శుచిగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గొందిమల్ల ఘాట్‌లో పుష్కరస్నానం చేసేందుకు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా దేవస్థానం నుంచి చేపడుతున్న పూజా కార్యక్రమాల ప్రణాళికను దేవాదాయ శాఖ ఏసీ కృష్ణ కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, స్థానిక సర్పంచ్ జయరాముడు, ఎంపీడీఓ మల్లికార్జున్, తహసీల్దార్ మంజుల, డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పర్వతాలు, స్థానిక నాయకులు ఉన్నారు. -
పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
– హైదరాబాద్ నుంచి గద్వాలకు 28 సర్వీస్‌లు స్టేషన్ మహబూబ్‌నగర్: ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణాపుష్కరాలను పురస్కరించ్జుజీని భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. పుష్కరాల కోసం 238 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జిల్లా పరిధిలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి గద్వాల వరకు 28సర్వీస్‌లను నడపడానికి రైల్వేశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైలు నంబర్ 07950: హైదరాబాద్–గద్వాల–హైదరాబాద్‌కు నాలుగు సర్వీస్‌లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు వచ్చేనెల 11, 18 తేదీల్లో నడుస్తాయి. ఉదయం 5.15 హైదరాబాద్ నుంచి బయలుదేరి గద్వాలకు ఉదయం 10.20 గంటలకు చేరుకుంది. ఆయా తేదీల్లో రిట(07951) రైలు (రిటర్న్ డైరెక్షన్) తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.40 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తి రోడ్‌తో పాటు శ్రీరాంనగర్ స్టేషన్ల మీదుగా నడుస్తుంది. ఈ రైలులో ఏసీ–2 టైర్, ఏసీ–3టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రైలు నంబర్ 07948: సికింద్రాబాద్–గద్వాల–సికింద్రాబాద్‌కు 24 సర్వీస్‌లు తిరుగనున్నాయి. వచ్చేనెల 12 నుంచి 23వ తేదీ వరకు సికింద్రాlబాద్ నుంచి ఉదయం 11.45గంటలకు బయలుదేరి గద్వాలకు మధ్యాహ్నం 3.30 గంటలకు గద్వాలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు(07949) ఆయా రోజుల్లో సాయంత్రం 4.30 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తిరోడ్, శ్రీరాంనగర్ స్టేషన్లలో ఆగుతుంది. -
పుష్కరాలకు భారీ బందోబస్తు
8,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గ్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు పుష్కరఘాట్ల నిర్మాణ పనుల పరిశీలన మట్టపల్లి (మఠంపల్లి): వచ్చే నెల 12 నుంచి 23వ తేదీ వరకు నల్లగొండ జిల్లాలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. 8,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భద్రతకు ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు. మట్టపల్లి వద్ద కృష్ణా నది తీరంలో నిర్మిస్తున్న ప్రహ్లాద, బాలాజీ, హైలెవల్ వంతెన పక్కన గల పుష్కర ఘాట్లను ఆయన శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యల్లో భాగంగా రెండు రోజులుగా పనులు జరిగే ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తామని చెప్పా రు. స్నానఘాట్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు పూర్తి కాగానే భద్రతా చర్యలను ప్రారంభిస్తామని తెలిపా రు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఒక్క మట్టపల్లిలో 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తుకు ప్రణాళి కలు సిద్ధం చేశామన్నారు. అంతకుముందు ఐజీ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకవర్గం, అర్చకులు ఐజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వజినేపల్లిలో... వజినేపల్లి(మేళ్లచెర్వు) : మండలంలోని వజినేపల్లి, బుగ్గమాధవరం గ్రామాల వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను శుక్రవారం ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు. ఘాట్లు, పార్కింగ్ స్థలాల వద్ద భద్రతాపరమైన చర్యలపై డీఎస్పీ సునీత, సీఐ మధుసూదన్‌రెడ్డితో చర్చించారు. మండంలోని మూడు ఘాట్లకు 972 మంది పోలీసు సిబ్బంది ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మేళ్లచెర్వు ఎస్ఐ రవికుమార్, సర్పంచ్ ఆవుల నాగలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు ఫణికుమార్ తదితరులు ఉన్నారు. పుష్కరఘాట్‌ను పరిశీలించిన ఐజీ మహాంకాళీగూడెం (నేరేడుచర్ల) : మండలంలోని మహంకాళీగూడెం పుష్కరఘాట్ పనులను మంగళవారం ఐజీ వై.నాగిరెడ్డి పరిశీలించా రు. ఘాట్ వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, మిర్యాలగూడ డీ ఎస్పీ రాంమోహన్‌రావు, నేరేడుచర్ల ఎస్ఐ గోపి తదితరులు ఉన్నారు. దర్శేశిపురంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ.. కనగల్ : మండల కేంద్రంలోని వాగులో, దర్వేశిపు రం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలో నిర్మిస్తు న్న పుష్కరఘాట్లు, మరుగుదొడ్ల పనులను శుక్రవా రం ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు పరిశీలించా రు. పనులను సకాలంలో పూర్తి చేయూలని సూచిం చారు. ఆయన వెంట కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మోజీబ్, ఏఈ షఫి, నాయకులు ఉమారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
లీటర్లు లీటర్లుగా...!
అక్షర తూణీరం పుష్కర కృష్ణాతీర్థమే కాదు.. ముందు ముందు ఢిల్లీలో కొత్త ఆలోచనలు మొలకలెత్తితే పోస్టాఫీసులు మల్టీపర్పస్ మాల్స్ కావచ్చు. ఎన్నికల సంరంభమంత ఆర్భాటంగా పుష్కర కోలాహలం మొదలైంది. ఇట్లాంటి సందర్భాన్ని చంద్రబాబు పేటెంట్ చేసేశారు. మూడు పుష్కరాల నుంచీ ఈ తర్పణ సంప్రదాయానికి యమ ప్రచారం కల్పిస్తూ వస్తున్నారు. ‘‘రేవుల్లోకి మునగండి! మునగండి!’’ అనే నినాదంతో పెద్ద సైజు ఇమేజీతో హోర్డిం గులు దిగిపోతాయి. అవి పుష్కర స్నానాలాచరించవు. కానీ, లక్ష లాది మందిని ముంచి స్నానాలు చేయిస్తాయి. ఇప్పటికే వాటికి టెండర్లు పూర్తయి, కళాకారుల కుంచెలు కదుల్తున్నాయి. లక్షల సంఖ్యలో రకరకాల కరపత్రాలు మూడు నాలుగు భాషల్లో పచ్చ రంగులో అచ్చవుతున్నాయి. వీటిలో రెండువైపుల మన అభివృద్ధి పథకాల గురించి, మూడోవైపు పుష్కరాల్లో జాగ్రత్తల గురించీ వివ రించడం జరుగుతుంది. మరోపక్క ఢిల్లీ సర్కారు పుష్కర తీర్థం ద్వారా పుణ్యాన్ని లీటర్ల లెక్కన అమ్మ డానికి కంకణం కట్టుకుంది. గతంలో గంగాజలం, గోదా వరి నీళ్లు పోస్టాఫీసుల ద్వారా అమ్మిన ఘనచరిత్ర మోదీకి ఉంది. ఇప్పుడు ‘పుష్కర కృష్ణా తీర్థం’ అమ్మకానికి వస్తోంది. అసలు ఆగస్టు మొదటి వారం లోనే అన్ని పోస్టాఫీసులకు పుష్కర తీర్థం సీసాలు పంపేసి, ముందస్తుగానే గ్రామీణ ప్రజలను పునీతుల్ని చేయ్యాలను కున్నారు. ఉన్నట్లుండి ఒకాయన పుష్కరుడు ప్రవేశించకుండా పుణ్య జలమెలా అవుతుంది? ఆగస్టు 12 తర్వాత వచ్చేట్టు చూడాలి అని గుర్తు చేశాట్ట. అప్పుడందరూ నాలికలు కరుచుకుని, ఆ విధంగా వాయిదా వేశారు. మనలో కూడా ఇంతటి మేధావులున్నారని మురిసిపోయారట! ఎంకిపెళ్లి సుబ్బిచావుకని మాకేంటి ఈ దండగ అంటూ చిన్న పోస్టుమాస్టర్లు గొడవ పెడుతున్నారు. కృష్ణాతీరంలో ఉండేవారెవ్వ రైనా ఇవి కొంటారా? ఏలిన వారికి తెలియదేమో గాని కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఊరూరికీ కృష్ణా కాలువలుంటాయి. కృష్ణా డెల్టాలో సాగునీరు అవే. వాటిని సీసాల్లో పోసి ఆ ఊళ్లోనే అమ్మిం చడం - హిమాలయాల్లో ఐస్ అమ్మడం, ఎడారిలో ఇసుక అమ్మడం లాంటివి. పాపం ఆ గ్రామీణ పోస్టు మాస్టర్లకు ప్రత్యక్షంగా పుష్కర పన్ను పడింది. పై వారి కోటా ప్రకారం తీర్థజలం వస్తుంది. అమ్మినా, వారే సేవించినా, స్నానమాడినా పై వారికి అనవసరం. డబ్బు మాత్రం జమ చేసెయ్యాలి. లేదంటే జీతంలో కోత పడు తుంది. పాపం, వాళ్లు గతంలో భద్రాచలం రామ కల్యాణం అక్షిం తలు విక్రయించారు. అన్నవరం సత్యనారాయణ దేవుని ప్రసాదాలు అంటగట్టారు. ఇంకా భవిష్యత్తులో ఏమేమి అమ్మిస్తారో భయపడి పోతున్నారు. మరీ అంతకు ముందు చలిజ్వరం టాబ్లెట్లు క్వినైన్ అమ్మేశారు. ఇందిరమ్మ హయాంలో సరసమైన ధరకు నిరోధ్‌లు అమ్మించారు. ముందు ముందు ఢిల్లీలో కొత్త ఆలోచనలు మొల కలెత్తితే పోస్టాఫీసులు మల్టీపర్పస్ మాళ్లు అయిపోవడం ఖాయం. కమిషన్ మీద సినిమా టిక్కెట్లు అమ్మించవచ్చు. మన దేశానికి కల్పతరువు, కామధేనువు అయిన మద్యాన్ని వీటి ద్వారా అందిం చవచ్చు. మన సంప్రదాయసిద్ధమైన రుద్రాక్షలు, గంధపు చెక్కలు, విభూది, మహత్తు గల తావీదులు అమ్మకానికి పెట్టచ్చు. ఇంకా బోలెడు ఆలోచనలు నాకే వస్తుంటే, వారికి కొదవా?! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రూ.680 కోట్లతో పుష్కరాల పనులు
నెలాఖరు కల్లా పూర్తికావాలి: సీఎస్ రాజీవ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల్లో సౌకర్యాల కల్పనకు రూ.680 కోట్లతో 668 పనులు మంజూరు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. మంజూరైన పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ నెలాఖరు లోగా పనులు పూర్తి చేయాలని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన ఇతర ఉన్నతాధికారులతో కలిసి పుష్కర పనులపై రెండు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారులు, భవనాల శాఖకు సంబంధించి రూ. 366 కోట్లతో 63 పనులు చేపట్టగా వాటిలో 37, పంచాయితీరాజ్ శాఖకు సంబంధించి రూ.134 కోట్లతో చేపట్టిన 131లో 42 పనులు పూర్తయినట్లు సీఎస్ చెప్పారు. రూ.137 కోట్లతో 81 పుష్కర ఘాట్లలో చేపట్టిన పనుల్లో 63 శాతం పూర్తయ్యాయన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా భక్తులకు అన్నదానం జరిగేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సూచించారు. సమాచార శాఖ క మిషనర్ నవీన్ మిట్టల్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, సునీల్‌శర్మ, కార్యదర్శులు బి.వెంకటేశం, శివశంకర్, వికాస్‌రాజ్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. -
'ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయింది'
కాకినాడ : కృష్ణ పుష్కరాల పనులు చివరి దశలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో ఈ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గురువారం కాకినాడలో పి.మాణిక్యాలరావు మాట్లాడుతూ... విజయవాడ నగరంలో ఆలయాల కూల్చివేతలో అధికారుల అత్యుత్సాహంతో పోరపాటు జరిగిన మాట వాస్తవమే అని ఆయన ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని సవరించుకుని కమిటీ వేసిన విషయాన్ని మాణిక్యాలరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఘటనపై మరోసారి మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని చెప్పారు. ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయిందని మాణిక్యాలరావు తెలిపారు. -
అక్కడలా..ఇక్కడిలా..
రాజమహేంద్రవరం క్రైం : వివిధ రాష్ట్రాలలో జరిగిన తొక్కిసలాటలూ ... తీసుకున్న చర్యలు... 2004 సెప్టెంబర్‌లో జరిగిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా రెయిలింగ్ కూలిపోయిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన పై స్పందించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్. రాజ శేఖరరెడ్డి ఎస్.ఇ, ఈఈలతోపాటు ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ లెసైన్స్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. 2008 ఆగస్టు 3న హిమాచల్ ప్రదేశ్‌లోని, బిలాస్పూర్ జిల్లా కొండ ప్రాంతంలో ఉన్న నయనా దేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 142 మంది మృతి చెందారు. ఈ సంఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దూమల్ వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తొక్కిసలాటకు సంబంధించిన అధికారులను సస్పెండ్ చేశారు. 2013 జులై 11న మద్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దటియా జిల్లాలోని రతన్ ఘాట్ ఆలయం వద్ద వంతెన దాటే సమయంలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మహిళలు, 17 మంది చిన్నారులతోపాటు మొత్తం 115 మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ జస్టిస్ ఎస్.కె. పాండే నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి బాధ్యులైన జిల్లా కలెక్టర్ ఎస్.గీతా, పోలీస్ సూపరిటెండెట్ ప్రమోద్ వర్మ, సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ మహిస్ తేజస్వీ, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బి.ఎన్. బసవిలను సస్పెండ్ చేశారు. 2014 అక్టోబర్ 3న పాట్నలో దసరా సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 33 మంది మహిళలు, 30 మంది చిన్నపిల్లలు మృత్యువాత పడ్డారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ అమీర్ సుభాని రిపోర్టు సబ్మిట్ చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులు, సూపరెంటెండెంట్ ఆప్ పోలీస్, ట్రాఫిక్ పోలీసులను, రెవెన్యూ సిబ్బందిని, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. 2015 జూలై 14న పుష్కరాలు సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందగా, 51 మంది గాయాలు పాలయ్యూరు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రెండు గంటలు ఘాట్‌లోనే ఉండిపోవడంతోనే తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం బహిరంగ రహస్యం. దీనికి స్వయంగా బాధ్యుడైన చంద్రబాబు కిమ్మనకుండా కమిషన్ పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. గత ఏడాది పుష్కరాలు సందర్భంగా పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందగా 52 మంది గాయాలు పాలైనా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్టైనా లేదు. నేను నిప్పును ... క్రమశిక్షణలో నా తరువాతే ఎవరైనా అంటూ తరచుగా గొప్పలకు పోతున్న ఇతర రాష్ట్రాల్ల ఈ విధంగా తొక్కిసలాటలు జరిగిన సందర్భాల్లో ఎలా స్పందించాయో ఓ సారి గమనిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
కృష్ణా పుష్కరాలపై వివాదం
-
కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున పీఠాధిపతులను ఆహ్వానించాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు. పీఠాధిపతులు, వేద పండితుల ద్వారా పుష్కరాల నిర్వహణ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. -
పుష్కర నిధులు ‘తమ్ముళ్ల’ జేబుకే
సర్కారుపై బెరైడ్డి ధ్వజం ఆగష్టు 12 నుంచి రాయలసీమ పుష్కరాలు నందికొట్కూరు: ‘సీఎం చంద్రబాబు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తెచ్చి కృష్ణా పుష్కర స్నానాలు చేయమంటున్నారు.. ఆయనకేమైనా మతి ఉంది మాట్లాడుతున్నారా?. ఆ నీటిలో పుష్కర స్నానం చేస్తే పాపాలు పోకపోగా మరిన్ని అంటుకుంటాయి’ అంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పిచ్చోడి చేతి రాయి అనే చందంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.1277 కోట్లు మంజూరు చేసిందని, అయితే ఇందులో 75శాతం నిధులను టీడీపీ నాయకులు, కార్యకర్తలే కొల్లగొట్టారని ఆరోపించారు. కృష్ణ పురష్కరాల నిధులు తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకేనని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. ఆగస్టు 12న రాయలసీమ పుష్కరాలు ఆగష్టు 12 సాయంత్రం 4 గంటలకు రాయలసీమ పురష్కరాలు ప్రారంభిస్తునట్లు బెరైడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి మంది మత్తయిదువులతో కృష్ణమ్మకు మంగళహారతులిచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. 13న హోమాలు నిర్వహిస్తునట్లు చెప్పారు. -
16న సీఎం శ్రీశైలం రాక
కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 16వ తేదీన శ్రీశైలంలో పర్యటించనున్నారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఎస్పీ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఇన్స్పెక్టర్ జానకిరామ్ ఆధ్వర్యంలో నాల్గవ బ్యాచ్ పోలీసులకు పుష్కరాల బందోబస్తు శిక్షణ తరగతులు నిర్వహించారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో ఎస్పీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందినుద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంకు రానుండటంతో పూర్తిస్థాయిలో భద్రత చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ రంగమునితో పాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, బీడీ టీమ్ పాల్గొన్నారు. -
నెల రోజులే గడువు
*కృష్ణా పుష్కరాల పనులకు డెడ్‌లైన్ *ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు *అట్టహాసంగా ముగింపు ఉత్సవాలు *అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం *ఈనెల 16న శ్రీశైలంలో మరోసారి సమీక్ష విజయవాడ, జులై 2 : కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు, భక్తుల కోసం తలపెట్టిన ఏర్పాట్లు ఈనెలాఖరులోగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, గడువులోగా పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఆరు నెలలు ముందే పనులు ప్రారంభించినా పనులు ఇంకా కొలిక్కిరాకపోవడం అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వర్షాలతో ఆటంకం రాకముందే పనులు పూర్తి చేయాల్సిందిగా సూచించారు. శనివారం విజయవాడలోని తన కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి...నాణ్యత దెబ్బతినకుండా రహదారుల నిర్మాణం చేపట్టాలని, అవసరం లేని చోట రోడ్ల నిర్మాణాన్ని పుష్కరాల తరువాత పూర్తి చేయాలని సూచించారు. రహదారుల విస్తరణ కోసం ఆలయాలను తొలిగించాల్సి వస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. శాస్త్రోక్తంగా మరో చోటుకి విగ్రహాలను తరలించాలన్నారు. విద్యుత్ స్తంభాల నిర్మాణం రోడ్డు నిర్మాణ పనులతో సమాంతరంగా సాగాలన్నారు. ప్రతి రోజూ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును, నాణ్యతను అధికారులు పరిశీలించాల్సిందిగా చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అన్నారు. పుష్కరాలను పురస్కరించుకుని విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. భక్తుల పుష్కర స్నానాలకు వీలుగా సాధ్యమైనంత వరకు ఘాట్ల దగ్గర నీరు స్వచ్ఛంగా వుండేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ముందే కార్యాచరణ పథకం సిద్ధం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఇందుకోసం వారంలోగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. భక్తులు నడిచేందుకు, పుష్కరఘాట్లను చేరేందుకు రహదారులకు ఓవైపు బారికేడ్లను నిర్మించి సౌకర్యవంతంగా వుండేలా చూడాలని అన్నారు. బారికేడ్ల కోసం ప్రతిసారి రోడ్లను తవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై యోచించాలని చెప్పారు. అంబులెన్స్‌లు అందుబాటులో వుంచడంతో పాటు ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై, సౌకర్యాల కల్పనపై 95 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని, అదే స్ఫూర్తితో మరింత మెరుగ్గా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. దేవాలయాలను త్వరితగతిన అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు, వసతి కల్పించడం కోసం సత్యసాయి ట్రస్ట్, టీటీడీ, రోటరీ క్లబ్‌లు, స్వచ్ఛంద సంస్థలు, అక్షయపాత్ర, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహా స్థానికులను ప్రోత్సహించాలన్నారు. విజయవాడ, గుంటూరులో వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్ట్ 1 నాటికి పుష్కర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ శోభ తీసుకు రావాలన్నారు. పుష్కరాలను ముందు తరాలు గుర్తుంచుకునేలా ‘కృష్ణాతీరం’ పేరుతో సావనీర్ ప్రచురిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. పుష్కరాలకు వచ్చే ప్రతి ఒక్కరూ దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం వున్నందున రోజుకు కనీసం లక్ష మంది అయినా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా పవిత్ర సంగమం దగ్గర దుర్గగుడి నమూనా ఆలయం సైతం ఏర్పాటు చేయాలని అన్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రముఖులను, పీఠాధిపతులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఆదేశించారు. పుష్కరాలు జరిగే ప్రతి రోజూ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. పుష్కరాల 12 రోజులు ఒక్కోరోజూ ఒక్కో సాంస్కృతిక కార్యక్రమంతో భక్తులకు ఆహ్లాదం పంచాలని చెప్పారు. పుష్కరాల చివరి రోజు ముగింపు ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ ముగింపు ఉత్సవాలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదిక కానుంది. కృష్ణా పుష్కరాల కోసం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రూ. 216.42 కోట్లతో 379 పనులు పంచాయతీరాజ్ శాఖ చేపడుతుండగా, రూ. 239.63 కోట్లతో 314 పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పూర్తి చేస్తోంది. రూ. 139.65 కోట్లతో 583 పనులను దేవాదాయ శాఖ, రూ. 334 కోట్ల విలువైన 188 పనులను జలవనరుల శాఖ చేపట్టింది. మొత్తంమీద అన్ని శాఖలు కలిసి రూ. 1,277.87 కోట్ల అంచనా వ్యయంతో 1,602 అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నాయి. ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకోని పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈనెల 16న శ్రీశైలంలో కృష్ణా పుష్కరాలపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా పుష్కరాలు నిర్వహించే ప్రాంతంలో మొత్తం మూడు చోట్ల ఫుడ్ ఫెస్టివల్, రెండు చోట్ల లేజర్ షో ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే భారీఎత్తున తరలివచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు 139 ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్‌లను గుర్తించినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమమహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, శిద్ధా రాఘవరావు, పైడికొండల మాణిక్యాలరావు, నారాయణ, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పుష్కర పనులపై చీఫ్ ఇంజనీర్ ఆగ్రహం
దామరచర్ల(నల్లగొండ): కృష్ణాపుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తికాకపోవడంపై ఎన్ఎస్పీ చీఫ్ ఇంజనీర్ సునిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల కృష్ణానది పుష్కర స్నానఘట్ట పనులను పరిశీలించిన ఆయన పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 12 నుంచి 23 వరకు కృష్ణ పుష్కరాలు జరగనుండటంతో.. జూలై నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. -
కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లు
- దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్ కుమార్ రాజమహేంద్రవరం రూరల్ : ఆగస్టు నెలలో జరుగనున్న కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటు, 2000 అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లోని మొదటి ఫ్లాట్‌ఫారమ్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో అశోక్ కుమార్‌తోపాటు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌లు సోమవారం సాయంత్రం రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే అన్నిశాఖల అధికారుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. నలుమూలలు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేవిధంగా నాలుగు ప్రధాన హాల్ట్‌ల సౌకర్యం కల్పిస్తామన్నారు. జూలై 31నుంచి గోదావరి అంత్యపుష్కరాలు: ఎంపీ మాగంటి గోదావరి అంత్య పుష్కరాలు జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్ పేర్కొన్నారు. అంత్య పుష్కరాల సమయంలో గోదావరి సంబరాలు కూడా నిర్వహిస్తామన్నారు. అంత్యపుష్కరాల విషయంపై కొంత గందరగోళం ఉంది, అయితే దీనిపై టీటీడీ వేదపండితులు, రాజమహేంద్రవరంలోని వేదపండితులతో మాట్లాడామని, గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలున్నాయని, మిగిలిన నదులుకు లేవని చెప్పారన్నారు. ఆగస్టు 11వ తేదీ రాత్రి అన్ని ఘాట్ల వద్ద హారతి ఇచ్చి గోదావరి అంత్య పుష్కరాలకు ముగింపు పలికి, ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలకు స్వాగతం పలుకుతామన్నారు. -
సాయం కోరుతూ మోదీకి కేసీఆర్ లేఖ
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఆర్థిక సాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. రూ. 601 కోట్ల ఆర్థిక సాయం కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. -
ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలు
- రూ.180 కోట్లతో 587 ఆలయాల్లో ఏర్పాట్లు - తిరుపతిలో అంతర్జాతీయ హిందూ సమ్మేళనం - విలేకరుల సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) : ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం తరఫున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని 587 ఆలయాల్లో కృష్ణా పుష్కరాలను శోభాయమానంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే టీటీడీ సారథ్యంలో త్వరలో తిరుపతిలో అంతర్జాతీయ హిందూసమ్మేళనం నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింజేసే రీతిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దశ దిశలా వ్యాంపించే విధంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న వైష్ణవాలయాల్లో జరిగే ఉత్సవాలకు టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, శైవాలయాలకు శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవస్థానాలనుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆలయాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి తీర్థ ప్రసాదాలను అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఇక గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న అపశృతులను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన చర్యలు ముందస్తుగానే చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
అన్ని కోట్లు ఖర్చు... ఏం ఉపయోగం?
► గోదావరి పుష్కరాల్లో రూ.2వేల కోట్లు వ్యయం చేస్తే ఏమీ కన్పించలేదు ► కృష్ణా పుష్కరాలకు ఇష్టానుసారం ప్రతిపాదించొద్దు: సీఎస్ టక్కర్ హైదరాబాద్: ‘గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా ఏకంగా రూ.2వేల కోట్లు వ్యయం చేశారు. తీరా అక్కడ చూస్తే ఏమీ కనిపించలేదు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల పేరుతో ఇష్టానుసారం పనులను ప్రతిపాదించవద్దు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ టక్కర్ అధికారులను హెచ్చరించారు. సోమవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధి కారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాది గోదావరి పుష్కరాల మాదిరి ఈసారి జరగకూడదని చెప్పారు. ఇప్పటికే కృష్ణా పుష్కరాల పేరుతో రూ.1000 కోట్లకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసిందన్నారు. అన్ని పనులకు అనుమతులు ఇవ్వరాదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు వందల సంఖ్యలో సమాధానాలు పెండింగ్‌లో ఉన్నాయని, జీరో అవర్‌లో లేవనెత్తిన అంశాలకు జవాబులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. అన్ని శాఖలూ వెంటనే సమాధానాలను పంపించాలన్నారు.