- ఈనెల 12న 07759 నంబరుతో సికింద్రాబాద్‌లో రాత్రి 09.20 గంటలకు బయలుదేరి, ఆ మర్నాడు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఆ తరువాత విశాఖ నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ ప్రాంతా ల మీదుగా ఈ రైలును నడపనున్నారు.
- 07761 నంబరుతో విశాఖ నుంచి తిరుపతికి ఈనెల 13,17,21 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ నుంచి దీన్ని నడిపేయోచనలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో 07762 నంబరుతో తిరుపతి నుంచి 14,18 తేదీల్లో సాయంత్రం బయలుదేరి ఆ మర్నాడు ఉదయం విశాఖ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- విశాఖ–విజయవాడ–విశాఖ రైలును 07763/07764 నంబర్లతో నడపనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. విశాఖ నుంచి 07764 నంబరుతో ఈనెల 15,19 తేదీల్లో మధ్యాహ్న సమయంలో బయలుదేరే విధంగా రైల్వే ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- తిరుగు ప్రయాణంలో 07763 నంబరుతో విజయవాడ నుంచి ఈనెల 16,20 తేదీల్లో ఉదయం 10 గంటల సమయంలో బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు ఆగాల్సిన స్టేషన్లు, సమయం వ్యవధి, టికెట్ ఛార్జీలు తదితర విషయాలను రైల్వే శాఖ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
కృష్ణా పుష్కరాలకు డబుల్ డెక్కర్ రైలు
Published Thu, Aug 11 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
కృష్ణా పుష్కరాలకు డబుల్ డెక్కర్ రైలు
డబుల్ డెక్కర్ రైలు, కృష్ణా పుష్కరాలు, స్పెషల్, విశాఖ
double decker trains, special trains, krishna pushkaralu, visakha
తాటిచెట్లపాలెం: విశాఖ వాసుల చిరకాల స్వప్నమైన డబుల్ డెక్కర్ ఆశలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో విశాఖ–తిరుపతి, విశాఖ–విజయవాడ ప్రాంతాలకు డబుల్ డెక్కర్‌రైలు నడపనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైలు సికింద్రాబాద్‌లో 12న బయలుదేరి 13న విశాఖ చేరుకోనుంది.
Advertisement
Advertisement