16న సీఎం శ్రీశైలం రాక | chandrababu naidu tour in srisailam on 16th july | Sakshi
Sakshi News home page

16న సీఎం శ్రీశైలం రాక

Published Tue, Jul 5 2016 8:59 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

chandrababu naidu tour in srisailam on 16th july

కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 16వ తేదీన శ్రీశైలంలో పర్యటించనున్నారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఎస్పీ కార్యాలయానికి  ఉత్తర్వులు అందాయి. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఇన్‌స్పెక్టర్ జానకిరామ్ ఆధ్వర్యంలో నాల్గవ బ్యాచ్ పోలీసులకు పుష్కరాల బందోబస్తు శిక్షణ తరగతులు నిర్వహించారు.

సోమవారం ముగింపు కార్యక్రమంలో ఎస్పీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందినుద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంకు రానుండటంతో పూర్తిస్థాయిలో భద్రత చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రంగమునితో పాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, బీడీ టీమ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement