
పుష్కరాల పేరుతో కుట్ర: సీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా పుష్కరాల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్ జరగకుండా కుట్రపన్నారని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ జరగకుండా బాబు కుట్రపన్నారు.
హోదాపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధిలేదు. బిల్లు ద్రవ్య బిల్లా? కాదా?అని తేల్చడానికి బిల్లును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.. లోక్‌సభ స్పీకర్‌కు పంపాలని నిర్ణయించినప్పుడు బీజేపీ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి చప్పట్లు కొట్టడమే అందుకు నిదర్శనమ’న్నారు. పుష్కరాలను చంద్రబాబు సొంత ఇంటి కార్యక్రమంగా భావించి అందరినీ ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు.