c. ramachandraiah
-
ఇది మాత్రమే అభివృద్ధి కాదు!
76 ఏళ్ల స్వతంత్ర భారతదేశం సాధించిన ఘనతల పరంపరలో తాజాగా ‘చంద్రయాన్–3’ వచ్చి చేరడం కేంద్రంలోని పాలక పార్టీ బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఇస్రో శాస్త్రవేత్తలు సల్పిన నిర్వరామ కృషి ఎన్డీఏ ప్రభుత్వ విజయంగా మారింది. కొన్ని దశాబ్దాల క్రితం రాకెట్లను ఎడ్ల బండ్లపై తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా... తమ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు వారు నిస్వార్థంగా కృషి చేస్తూనే ఉన్నారు. చంద్రయాన్–3 విజయం భారత్ ప్రతిష్ఠను అమాంతం ఆకాశం అంత ఎత్తుకు పెంచేసింది. చంద్రయాన్–3 తర్వాత సూర్యయాన్ వైపు ఇస్రో శాస్త్రవేత్తలు తమ కృషిని సాగించడమూ భారతీయులందరికీ గర్వకారణమే. అయితే, దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన ఈ ఘనత, అభివృద్ధి అన్ని రంగాలలో ప్రతిఫలిస్తు న్నాయా? అనివార్యంగా వేసుకోవలసిన ప్రశ్న ఇది. అభివృద్ధిని నిర్ధారించడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు కొలమానంగా మానవాభివృద్ధి సూచిక, శిశు మర ణాల రేటు, పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ అంశాల ఆధారంగా భారత్‌తోపాటు ఇంచుమించుగా అదే సమయంలో స్వాతంత్య్రం పొందిన దేశాలు, ఇతర అభివృద్ధి చెందిన దేశాల ప్రగతిని బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు వెల్లడించిన అభివృద్ధి నివేదికలలో పలు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు; జీ7 కంట్రీస్‌గా పిలవబడే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డవ్‌ు, యునైటెడ్ స్టేట్స్‌లు; ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలైన అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈజిప్ట్, హంగరీ, ఇండోనేషియా, ఇరాన్, మలేసియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలెండ్, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తోపాటు భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సాధించిన ర్యాంకింగ్‌ల ఆధారంగా అక్కడి స్థితిగతులు అర్థమవు తాయి. పైన పేర్కొన్న దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)ని పరిశీలిస్తే, 1960 నుంచి 2022 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో భారత్‌ది అడుగు నుంచి మూడవ స్థానం. కేవలం పాకిస్తాన్, నేపాల్ మాత్రమే భారత్ కంటే దిగువన ఉన్నాయి. 1950 నుంచి 2021 మధ్య కాలంలో 31 దేశాల మానాభివృద్ధి సూచికలను పరిశీలించినప్పుడు భారత్ 1950లో 26వ స్థానంలో ఉండగా, 2021 నాటికి 29వ స్థానానికి పడిపోయింది. 32 దేశాల్లో శిశు మరణాలకు సంబంధించి 1960–1975 మధ్య కాలంలో, ఆ తర్వాత 2021 వరకు నమోదైన గణాంకాలను పరి శీలిస్తే... 1960–1975 మధ్య అత్యధిక శిశు మరణాలు నమోదైన దేశాలలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 2021 నాటికి ఆ స్థానం మరింత దిగజారి కింది నుంచి 3వ స్థానానికి చేరుకొంది. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం అంశంలో 31 దేశాలలో 1997 నుంచి 2022 మధ్యకాలంలో భారత్‌ది 21వ స్థానం. 1997–98లో భారత్ పార్లమెంట్లో మహి ళల ప్రాతినిధ్యం 7 శాతం ఉండగా, 2022 నాటికి అది 14.9 శాతంకు పెరిగింది. 140 దేశాల కంటే భారత్ పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఎక్కడైతే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందో, ఆ దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నా యని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక.. విద్యుత్, ఇంటర్నెట్ సేవల రంగాలలో మాత్రం భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. 1993–2000 మధ్య కాలంలో దేశంలో 50 శాతం జనాభాకు మాత్రమే విద్యుత్ సౌకర్యం అందు బాటులో ఉండగా, ప్రçస్తుతం దేశంలో 99 శాతం మందికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక, ఇంటర్నెట్ సేవల రంగాన్ని పరిశీ లిస్తే, 2020 నాటికి భారత్‌లో 43 శాతం జనాభాకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుపడిన భారత్ పౌరహక్కులు, లింగ సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాలలో ఎంతో వెనుకబడింది. మానవా భివృద్ధి సూచికల్లో ప్రధానమైన అంశంగా పౌరహక్కులను పరిగణిస్తారు. పౌరహక్కులలో భారత్ స్థానం 92గా ఉంది. అంటే, భారత్ కంటే 91 దేశాలు మెరుగైన పరిస్థి తుల్లో ఉన్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడకు పలు రాజ్యాంగ వ్యవస్థలు దోహదం చేస్తాయి. అయితే, గత కొంతకాలంగా దేశంలోని పలు రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరిచే ప్రయత్నాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అతి ముఖ్యమైన అంశం. ఆ బాధ్యతను నిర్వహించే స్వతంత్ర సంస్థ ‘భారత ఎన్నికల కమిషన్’నే పూర్తిగా తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలను కేంద్రంలో అధికా రంలో ఉన్నవారు చేయడం ఆశ్చర్యకరం. భారత ఎన్నికల కమిషన్ తరఫున చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు బాధ్యతలు నిర్వహిస్తారు. వారి నియామ కాలను చేపట్టే విధానాన్ని సమూలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఆ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తి బదులుగా ఒక కేంద్ర మంత్రి నియమితులవుతారు. ఆ కేంద్రమంత్రిని ప్రధాన మంత్రే సభ్యుడిగా నియమిస్తారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు పూర్తిగా మారి పోతాయి. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం అన్నది ఇకపై ఉండకపోవచ్చు. ఇది దేశ ప్రజా స్వామ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే చట్టం. శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని, ఐటీని, సేవల రంగంలోని అభివృద్ధినీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా అందుబాటులోకి వచ్చిన అభివృద్ధినీ చూపి ఇదే దేశాభివృద్ధిగా చాటుకుంటే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. అభివృద్ధికి నిర్వచనం మార్చేసి మేడిపండు లాంటి అభివృద్ధి చూపి అదే అభివృద్ధి అని ప్రచారం చేస్తే ఎలా? ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నమని వేరే చెప్ప వలసిన అవసరం లేదు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
బడ్జెట్లో సంక్షేమ మార్గం పడతారా? భారత్‌కు ఈ ఘనత ఎలా సాధ్యపడింది?
కేంద్రం ప్రతియేటా ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ కారణంగా ప్రభావితం అయ్యే వర్గాల ప్రజలలో బడ్జెట్ ముందు సహజంగానే కొంత ఉత్కంఠ నెలకొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో పెద్ద ఎత్తున సంక్షేమ పథ కాలు ఉండొచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత 8 ఏళ్లుగా వల్లె వేస్తున్నారు. అంటే – దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలగజేయడం, వారి జీవన ప్రమాణాలు పెంచడం తమ లక్ష్యం అని చెప్పుకొంటూ వస్తున్నారు. పేదలకు గృహనిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదల, పేద కుటుంబాలన్నింటికీ గ్యాస్ సిలిండర్ల సరఫరా, నగదు బదిలీ పథకాలు, రైతాంగానికి పెట్టుబడి సాయం (పీఎం కిసాన్), వృద్ధాప్య పెన్షన్లు, ఆయుష్మాన్ భారత్, పేదలకు ఉచిత రేషన్ తదితర పథకాలన్నీ తమ సంక్షేమ విధానానికి చిహ్నంగా బీజేపీ అభివర్ణించుకొంటున్నది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని అంది స్తున్నప్పుడు ‘సబ్ కా వికాస్’ ఆచరణలోకి రావాలి కదా! దేశ జనాభాలో 1 శాతం మంది ధనికుల చేతుల్లో 40 శాతం దేశ సంపద చిక్కుకుని ఉందనీ; 50 శాతం జనాభా అంటే... 65 నుంచి 70 కోట్ల మంది ప్రజల చేతుల్లో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉన్నదనీ తాజా గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క ఈ 8 ఏళ్లల్లో బ్యాంకుల 14.38 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను రద్దు చేశారు. అయినప్పటికీ ఇంకా బ్యాంకుల నిరర్థక ఆస్తుల గ్రాస్ రేటు 6.5 శాతంగా ఉంది. పెట్రో ధరల పెరుగుదల చరిత్రలో లేనంతగా ఈ 8 ఏళ్లల్లో పెరిగింది. డీజిల్‌పై 512 శాతం, పెట్రోల్‌పై 194 శాతం, గ్యాస్ సిలిండర్లపై 185 శాతం భారం మోపారు. అన్ని వస్తువులపై గరిష్ఠంగా వేస్తున్న జీఎస్టీ, గృహనిర్మాణ వస్తువుల ధరల పెరుగుదల... తదితర భారాలతో పోల్చితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ఎందుకూ కొరగాకుండా ఉంది. ఉద్యోగాల సృష్టి చేయలేని ఆర్థికాభివృద్ధి వల్ల ఎటువంటి లాభం లేదని గత కొన్నేళ్ల అనుభవాలు తెలియ జేస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత సంఖ్య 21.8 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తు న్నాయి. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలకు రైలు రవాణా విస్తరించాల్సి ఉండగా, దేశంలోని ఎగువ మధ్యతరగతి వారి కోసం ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టారు. రైల్వే ట్రాక్‌ల సామర్థ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో పటిష్ఠపర్చకుండా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లను ఒక్కొక్కటి రూ. 120 కోట్ల వ్యయంతో దశల వారీగా మొత్తం 475 ప్రారంభించాలని సంకల్పించడం ఆశ్చర్యం కలిగించకమానదు. 2014లో అధికారంలోనికి వచ్చిన బీజేపీ ఈ 8 ఏళ్లలో సంక్షేమబాట నుంచి క్రమంగా వైదొలుగుతూ వస్తోంది. 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొన్న రెండు ప్రధాన నిర్ణయాలు దేశ ఆర్థికరంగాన్ని అతలా కుతలం చేశాయి. మొదటిది పెద్లనోట్ల రద్దు; రెండోది జీఎస్టీ అమలు. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చి వేస్తామని చెప్పి కార్యాచరణ చేపట్టకపోవడంతో రైతులు రెట్టింపు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. దానివల్ల ఆహార ధాన్యాల నిల్వలు పడిపోతు న్నాయి. గోదాముల్లో ఇప్పుడు కేవలం 4.92 కోట్ల మెట్రిక్ టన్నుల గోధుమలు, బియ్యం మాత్రమే నిల్వ ఉన్నట్లు భారత ఆహార సంస్థ తెలియజేసింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యరంగంపై కొంతమేర అనివార్యంగా వ్యయాన్ని పెంచింది. టీకాల కొనుగోలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పెంపుదల వంటి మౌలిక సదుపాయాలపై గణనీయంగా ఖర్చు చేసింది. అయినప్పటికీ, ఆ మొత్తం.. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 2 శాతానికి మించలేదు. ఇక, విద్యారంగాన్ని పరిశీలిస్తే, 2012–13లో యూపీఏ ప్రభుత్వం జీడీపీలో 3.36 శాతం నిధుల్ని కేటాయించగా, ఎన్డీఏ వచ్చిన ఈ 8 ఏళ్లల్లో విద్యారంగంపై చేస్తున్న వ్యయంలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. నూతన విద్యా విధానాన్ని ఘనంగా ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా కేటాయింపులు పెంచలేదు. మధ్యాహ్న భోజన పథకానికి (ప్రధాన మంత్రి పోషణ్) వెచ్చిస్తున్న నిధుల్లో గత 7 ఏళ్లుగా ఎలాంటి పెరుగుదలా లేదు. కీలకమైన విద్యారంగంలో కేటాయింపులు పెంచకుండా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లగలరు? ఎంతో కీలకమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) రంగంలో ఇతర దేశాలు 3 శాతం మేర కేటాయింపులు చేస్తుంటే భారత్ కేటాయింపులు గత దశాబ్ద కాలంగా 1 శాతం మించడం లేదు. 2008, 2009 సంవత్సరాలలో భారత్ అత్యధిక స్థాయిలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్ని, 2.5 శాతం జీడీపీ మేర ఆకర్షించింది. కానీ, ఆ మొత్తం క్రమంగా తగ్గిపోతూ 2021 నాటికి 1.4 శాతానికి చేరింది. నిరుద్యోగిత పెరుగుదల వల్ల ప్రజల పొదుపు గణనీయంగా పడిపోయింది. క్యాపిటల్ ఫార్మేషన్లో కీలకమైన పొదుపు మొత్తాలు సన్నగిల్లడంతో... కేంద్ర ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకొంటోంది. ఈ 8 ఏళ్లల్లో కేంద్రం కొత్తగా చేసిన అప్పులు రూ. 91 లక్షల కోట్లు దాటాయి. అయితే, బ్రిటన్ను పక్కకు తోసి భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదెలా సాధ్యపడింది? ఇందులో కేంద్ర ప్రభుత్వం చొరవను సమీక్షించినట్లయితే, గత 20 సంవత్సరాలలో, ఇతర దేశాలకంటే భారత్ ఐటీ రంగంలో వడివడిగా ముందుకుసాగింది. ఐటీ ఆధారిత సేవలు, ఉత్పత్తుల రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. ఈ రంగం అభివృద్ధికి కేంద్రం చేసింది నామ మాత్రమే. సేవల రంగంలో కూడా మిగతా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ అగ్రస్థానంలో ఉంది. (క్లిక్ చేయండి: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి) క్లుప్తంగా చెప్పాలంటే, దేశ ఆర్థికాభివృద్ధికి ఐటీ, సేవల రంగాలు మాత్రమే గణనీయంగా దోహదం చేస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు ఎక్కువగా ఐటీ, సేవల రంగాల్లోనే వస్తున్నాయి. ఇతర కీలక రంగాలలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తిరంగంలో వృద్ధి ఆశాజనకంగా లేదు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం పట్ల ఇంతకు ముందు మాదిరిగానే చిన్నచూపు చూస్తున్నారు. ‘మేకిన్ ఇండియా’ ఎందుకు చతికిల పడిందో ఆత్మావలోకనం చేసుకోవాలి. దేశంలో 15 కోట్ల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఇ) ఊతం కల్పించాలి. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం ఇంకా పెరగాలి. ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించి దేశీయ రైతాంగాన్ని మరింత ప్రోత్సహించాలి. నూతన వార్షిక బడ్జెట్లోనైనా ప్రధాని దేశంలో 60 కోట్లు పైబడి ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలపై కనికరం చూపిస్తారా? - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్. -
‘గడప గడపకు ప్రభుత్వం’ ఫలితాలు షురూ
‘గడప గడపకు ప్రభుత్వం’ అన్నది ఓ విశిష్ట కార్యక్రమం. దీనిని నిరంత రాయంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం ఆహ్వానించదగినది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు అందుతాయి. ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పని తీరుతోపాటు పార్టీ నేతల భాగ స్వామ్యం, అప్పగించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వారు చూపుతున్న శ్రద్ధ తదితర అంశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించడమేకాక, తన అభి ప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. పనితీరు సరిగాలేని పార్టీ నేతల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోకుంటే తప్పిస్తానని నిష్కర్షగా చెబు తున్నారు. ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో సరి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలలో 97 శాతం మేర నెరవేరు స్తున్నందున ప్రజలలో సంతృప్తి స్థాయిలు ఎక్కువగా ఉంటా యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనా. అయితే, ప్రజల సంతృప్తి అన్నది మొత్తంగా ప్రభుత్వంపైనా, తాము ఎన్ను కొన్న ప్రజాప్రతినిధి పనితీరు పైనా, అధికార యంత్రాంగం స్పందనపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల తానొక్కణ్ణే కష్టపడితే సరిపోదనీ, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న దాంట్లో అబద్ధం ఏముంది? ఎన్ని పనులు చేసినా ఇంకా చేయాల్సి నవి ఉంటూనే ఉంటాయి. అలాగే సమన్వయ లోపంతో కొన్ని పనులు జరగడం ఆలస్యం అవుతుంది. ‘గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం’లో అక్కడక్కడ ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న మాట నిజమే. అయితే, దాని గురించి బెంబేలు పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ పాలకుడి వద్ద రాత్రికిరాత్రే అద్భుతాలు సృష్టించే మంత్ర దండం ఉండదు. కష్టపడాల్సిందే. అందరి సహకారం స్వీకరించాల్సిందే. అప్పుడే ఫలితాలు అందుతాయి. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ‘నవరత్నాల’ను ఒక్క ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగించలేరని కొందరు జోస్యం చెప్పారు. కానీ, కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ రథ చక్రాలు ఆగలేదు. ఏ ఒక్క పథకమూ కుంటు పడలేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 97 శాతం పైగా అమలు చేయడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు. ఒకట్రెండు హామీల విష యంలో వాటిని యుధాతథంగా అమలు చేయ డానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే స్థితిలో లేనందువల్ల వాటిని మెరుగైన విధానంలో అమలు చేస్తామని ధైర్యంగా, నిజాయితీగా చెప్పగలగడం కూడా గతంలో లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దాడి చేస్తున్న వారి ప్రధాన ఆరోపణల్లో ఒకటి రాష్ట్రంలో సంపద సృష్టి జరగడం లేదన్నది. ఆంధ్రప్రదేశ్‌లో 2 ఎకరాల భూమి విలువకు ప్రస్తుతం తెలంగాణలో 1 ఎకరం భూమి మాత్రమే వస్తుందట. ఈ ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర ప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి, ఇదొక డొల్ల వాదన. వీరి దృష్టిలో సంపద అంటే కేవలం రియల్ ఎస్టేట్. తెలం గాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్థిరపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి ప్రాంతంలో కోట్లు కుమ్మ రించి భూములు కొన్నారు. వాస్తవిక అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్ వాల్యూ) లేకుండా కేవలం ప్రచారార్భాటంతో విలువను పెంచి అదే సంపద సృష్టిగా చెప్పుకొన్నారు. నిజానికి అసలైన అభివృద్ధి ఏమిటన్నది ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపర్చడమే సంపద సృష్టి అని నిరూపించారు. పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తాయి. లాభాలు కోసం వెంపర్లాడతాయి. అదికూడా తమ ప్రయోజనాలు కాపాడే వర్గాల కోసం. కానీ, జగన్ విధానం వ్యక్తిగతమైన లాభాలు అందించే వ్యవస్థను ప్రోత్సహించడం కాదు. అన్ని వర్గాలను, ప్రత్యేకించి దశాబ్దాలుగా అణగారి ఉన్న వర్గాలను బాగు చేయడం. వారిని ఆర్థికంగా, సామా జికంగా, రాజకీయంగా సాధికా రుల్ని చేయడం. నిజమైన అభివృద్ధి, నిజమైన సంపద సృష్టి అంటే అదే. కానీ, ఈ అభివృద్ధి నమూనాను కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమను తాము ఎలీట్ వర్గాలుగా భావిస్తూ సమాజంలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు అనుభవించడం తమ జన్మహక్కుగా, అన్ని రంగాలలో పైచేయి తమదే ఉండాలన్న ఫ్యూడల్ మనస్తత్వంతో... పేదలు, బడుగు బలహీన వర్గాలవారు సామాజిక, ఆర్థిక నిచ్చెనమెట్ల ద్వారా పైకి చేరుకొంటుంటే చూచి సహించ లేకపోతున్నారు. ఎలీటెస్ట్ థియరీ (శ్రేష్టవర్గ సిద్ధాంతం) ప్రకారం వారు తమకు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదించు కొంటారు. వారు ఇతర వర్గాల ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. కానీ, ఆ వర్గాల ఓట్లతోనే అధికారం సంపాదిం చాలని చూస్తారు. ఉదాహరణకు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ఎలీట్ వర్గాలు నిరాకరించాయి. రాజ ధాని ప్రాంతాన్ని కూడా ఓ గేటెడ్ కమ్యూనిటిలా తయారు చేయాలనుకొన్నారు. అందువల్లనే... అమరావతిలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ‘సామాజిక సమతుల్యత’ దెబ్బతింటుందని పేదలను, బలహీన వర్గా లను అవమానపర్చే విధంగా చెప్పారు. అంటే ప్రభుత్వం అన్నది కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పని చేయాలా? లేక జగన్ విధానంలో లాగా పేదల కోసం పని చేయాలా? రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి అన్నది కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు పరిమితం చేయాలా? లేక అన్ని వర్గాల ప్రజలకూ అందించాలా? గత 3 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ విజయాలు చెప్పు కోవడానికి చాలానే ఉన్నా... అన్నింటిలోకెల్లా భూమిలేని నిరుపేదలకు 36 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నది ఓ చారిత్రాత్మక విజయం. స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వ లేదు. ఇపుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజాకేంద్రక అభివృద్ధి నమూనాకు మద్దతు పలకడం. సామాన్యులు, పేదలూ 2024లో కూడా వైసీపీనే గెలిపించాలి. పెట్టుబడిదారీ వర్గా లకు మరోసారి కోలుకోలేని గుణపాఠం నేర్పాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
కరిమింగిన వెలగపండులా దేశ ఆర్థిక వ్యవస్థ
దేశంలో ఈ 8 ఏళ్లల్లో బిలియనీర్ల సంఖ్య అనూహ్యంగా పెరగడం, వారి కారణంగా దేశ స్థూల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ 5వ స్థానాన్ని ఆక్రమించడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఘనతగా చెప్పు కొంటోంది. ఓ దశాబ్దం క్రితం వరకు భారత్ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడది 5వ స్థానా నికి ఎగబాకింది. అది కూడా కోవిడ్ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి, అప్పటివరకు ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్ను వెనక్కు నెట్టి ఆ స్థానంలో నిలబడింది కనుక అది విజయంగా ఎన్డీఏ భావిస్తోంది. దేశంలో అదుపు తప్పిన ధరలు, నిరుద్యోగం, దిగుమతులలో వృద్ధి, ఎగుమతులలో క్షీణత, రూపాయి పతనం, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు... ఇన్ని సమస్యల నేపథ్యంలో దేశం ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న విషయం విస్మరించరానిది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటడం అన్నది నిజానికి ప్రస్తుత యూరప్ సంక్షోభ పరిస్థితులలో గొప్ప విజయమేమీ కాదు. బ్రిటన్‌లో చాలాకాలంగా ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. బ్రిటన్‌లోని అన్ని వర్గాల ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే కార్మికులు, రేవు కార్మికులు, పోస్టల్ కార్మికులు అధిక వేతనాలను డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. తమ కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిన దృష్ట్యా వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు. ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, చివరకు వైట్ కాలర్ ఉద్యోగులుగా పేర్కొనదగ్గ ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో ఇది వరకు ఎన్నడూలేని రీతిలో బ్రిటన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క బ్రిటన్ లోనే కాదు.. స్పెయిన్, జర్మనీ, బెల్జియం తదితర సంపన్న యూరోపియన్ దేశాలలో పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. జర్మనీలో ఇటీవల పైలెట్లు సమ్మె చేయడంతో వంద లాది విమానాల రాకపోకలు నిలిచిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగింది. భారతదేశంలో చాలాకాలం క్రితమే పలు కార్మిక చట్టాలను రద్దు చేశారు. లాభాలలో నడుస్తున్న పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి కార్మికులు, రాజకీయ పార్టీలవారు ఏమీ చేయలేని నిస్సహా యస్థితిలో ఉన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అనూహ్యంగా పెరిగినా ప్రజలు మౌనంగానే భారాన్ని మోస్తున్నారు. నిర్మాణరంగంలో ఇసుక, స్టీలు, సిమెంటు ధరలు 40 శాతం కంటే మించి పెరిగాయి. ఇక జీఎస్టీని అత్యధికంగా దాదాపు అన్ని వస్తువులపై విధించడంతో పేద ప్రజలు సైతం ధరాఘాతానికి గురవుతున్నారు. కొన్ని రకాలైన ఎరువుల ధరలు 40 నుంచి 80 శాతం మేర పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది. దేశ ఆర్థికాభివృద్థి రేటును, స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను బ్రిటన్‌తో పోలుస్తున్న కేంద్ర ప్రభుత్వం... మానవాభివృద్ధి సూచికలలో మనం ఏ స్థానంలో ఉన్నామో ఎందుకు వెల్లడించడం లేదు? ఐక్యరాజ్యసమితి తాజాగా వెలువరించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో భారత్ స్థానం 132 కాగా, బ్రిటన్‌ది 18వ స్థానం. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం మన దేశంలో 22 శాతం ప్రజల సగటు ఆదాయం రోజుకు రూ. 160 మాత్రమే. దేశ జనాభాలో 27.9 శాతం మంది ఇంకా పేదరికంతో విలవిల లాడుతున్నారని తాజా సర్వే వెల్లడించింది. కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దేశంలోని 21.7 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న బిలియనీర్ల చేతుల్లో ఉండగా, 19.8 శాతం సంపద మాత్రమే 40 శాతం మంది దేశ ప్రజల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. అసమానతలు అన్నవి ఆర్థికంగానే కాక ఇంకా లింగ (జెండర్) అసమానతలు, సామాజిక (సోషల్) అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ నాణేనికి రెండో వైపు ఉన్న పార్శ్వం. ఇక డాలర్‌తో రూపాయి విలువ క్షీణత ఇంత సుదీర్ఘంగా సాగడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇందుకు కారణం వాణిజ్యలోటు భారీగా పెరగడమే. గత సెప్టెంబర్‌లో 2020– 21 వాణిజ్యలోటు 11.7 బిలియన్ల డాలర్లు ఉండగా, ఈ ఆగస్ట్ 2022 నాటికి 28.7 బిలియన్ల డాలర్లకు చేరింది. అంటే లోటు వృద్ధిరేటు దాదాపు 250 శాతం. దిగుమతుల్లో వృద్ధి నానాటికీ పెరిగిపోతుండగా ఎగుమతుల వృద్ధిరేటులో క్షీణత నమోదవుతోంది. తాజా రాజకీయ కారణాలతో దేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతియేతర, నాన్ పారాబాయిల్డ్ బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించడం ద్వారా బియ్యం ఎగుమతిని కేంద్రం నియంత్రించింది. మరోపక్క, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రపంచంలోని పలు దేశాలు భారత్ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటో మొబైల్ విడిభాగాలు మొదలైన వాటిని దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. దీంతో ఎగుమతుల ద్వారా లభించే విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న దుష్ఫలితాలేమిటన్నది నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘ఆర్థిక సర్వే 2022’లోనే వెల్లడైంది. అధిక ధరల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజల పొదుపు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క ఏడాది కాలంలో, అంటే గత ఏడాదిలో ధనవంతులు 13 లక్షల కోట్ల సంపద ఆర్జించగా, 15 కోట్లమంది పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం 53 శాతం తగ్గిపోయినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఆర్ధికాభివృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో 39 శాతం పెట్టుబడులు కీలక రంగాలలో పెట్టాలి. కానీ, ఈ రంగాలలో వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు చేకూర్చే ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’కు కేటాయించే నిధులలో ప్రతి ఏటా కోత విధిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న వివిధ పథకాలలో కోత పడుతోంది. ఇదికాక, పేదలకు అందిస్తున్న గృహ నిర్మాణ పథకం మందగించింది. ఈ పరిణామాలన్నీ దేశంలోని పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల, రైతుల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పైకి నిగనిగలాడుతున్నట్లు కనిపిస్తున్నా లోపల డొల్లమాదిరిగా ఉంది. మరోరకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ‘కరి మింగిన వెలగపండు’లా ఉంది. - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
నినాదాలు కాదు, విధానాలు కావాలి
దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి మాటలలో వివరించలేనంత ఆందోళనకర స్థాయిలో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 80కి చేరింది. రూపాయి పతనాన్ని ఆపడానికి 1.5 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని కుమ్మరించినా పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా లేదు. ముడిచమురు, బొగ్గు, ఆహార ధాన్యాలు వంటివాటి దిగుమతులు గణనీయంగా పెరిగి దేశం నుండి జరిగే ఎగుమతులు తగ్గాయి. దాంతో, విదేశీ మారక ద్రవ్యం వేగంగా హరించుకు పోతోంది. విదేశీ రుణం రికార్డు స్థాయికి చేరింది. ఫలితంగా విదేశీ చెల్లింపుల సమతౌల్యం దెబ్బతిని కరెంట్ ఖాతా లోటును నిర్వహించడంలో ఆర్థిక శాఖ సతమతం అవుతోంది. దేశంలో చిల్లర విపణి ధరలు, వంట గ్యాస్, కిరోసిన్, బొగ్గు ధరలు అదుపు తప్పాయి. అన్ని సరుకుల టోకు ధరల సూచీ 15 శాతం పైకి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించే మాట్లాడుతున్నారుగానీ... కుటుంబాలు చేస్తున్న అప్పుల గురించి మాట్లాడ్డం లేదు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి గత్యంతరం లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు అప్పుల ఊబిలో దిగిపోయారు. దేశం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక దుస్థితి హఠాత్తుగా వచ్చి పడింది కాదు. అలాగని కరోనా దెబ్బతోనూ, రష్యా ఉక్రెయిన్ల యుద్ధంతోనూ పూర్తిగా ఈ స్థితి దాపురించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరమైన ఆర్థిక విధానం లోపించడమే దీనికి ప్రధాన కారణం. ప్రధాని నరేంద్రమోదీ 2014లో అధికారం చేపట్టేనాటికి దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 7.4 శాతం వృద్ధిరేటుతో ఆరోగ్యకరంగానే ఉంది. పైగా, 2014 తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు అంటే 2018 వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా... కేంద్ర ఖజానాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. కానీ, ఈ అనుకూలతను ఆర్థిక రంగ పటిష్టతకు విని యోగించుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అయింది. 2016 నవంబర్‌లో నల్లధనం అరికట్టడం లక్ష్యంగా హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఓ విఫల కార్యక్రమంగా మిగిలి పోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని అసంఘటిత రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. నిరు ద్యోగం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత సన్నగిల్లడంతో అనేక మంది డిపాజిట్‌దారులు తమ డబ్బును బ్యాంకుల నుండి ఉపసంహరించుకొని డాలర్ల రూపంలో విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. అంటే, భారత బ్యాంకుల్లో ఉండాల్సిన డిపాజిట్లు విదేశాలకు తరలడం వల్ల ‘రూపాయి’పై భారం పెరగడమే కాక.. దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. కోట్లాదిమందికి ఉపాధి కల్పించే దేశీయ అసంఘటిత రంగాలను దెబ్బతీయడమే పెద్దనోట్ల రద్దు విజయంగా మిగిలి పోయింది. స్థిరమైన పెట్టుబడులు మాత్రమే ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేస్తాయి. కానీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే తాపత్రయంతో నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేశారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులను 50 శాతం నుంచి 90 శాతం వరకు అనుమతి ఇస్తున్నారు. మరో పక్క స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులను (ఎఫ్ఐఐలు) ప్రోత్సహి స్తున్నారు. అయితే ఎప్పుడైతే రూపాయి విలువ క్షీణిస్తుందో... అప్పుడు స్టాక్ మార్కెట్ల నుండి ఎఫ్ఐఐల ఉపసంహరణ ఊపందుకుంటుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప గూలడం అనేకసార్లు చూశాం. డాలర్‌తో రూపాయి మారకం విలువ వేగంగా పతనం కావడంతో అనేక రంగాలలో ఈ దుష్ఫలితాలు కనపడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కు వగా అమెరికన్ డాలర్ చుట్టూ పరిభ్రమించడం వల్లనే ఈ దుస్థితికి ప్రధాన కారణం. అమెరికన్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బంగారం, ఇతర విలాస వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది. ఇక, దేశాన్ని పన్ను ఉగ్రవాదం నుండి విముక్తం చేయడమే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లక్ష్యం అని చెప్పుకున్న ఎన్డీఏ ప్రభుత్వం హేతుబద్ధత లోపించిన ఆచరణతో ప్రజలపై పెనుభారం మోపింది. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు కొండలా పెరిగిపోయాయి. 2014 జూన్ నాటికి దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ప్రస్తుతం 10 లక్షల కోట్లకు చేరాయన్న నివేదికలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడతాయి. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటే అర్థం.. ఆర్బీఐ తన బాధ్య తను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నదనే. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలను వెనక్కి రప్పించి వారి ఆస్తులను జప్తు చేయించడంలో కూడా కేంద్రం విఫలం అయింది. కాగా, నష్టాల్ని తగ్గించు కోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టడం అనేక విమర్శలకు గురైంది. తాజాగా, ఎస్బీఐ మినహా దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే కలిగే అనర్థాలు అనేకం. ఉద్యోగ భద్రత లోపించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తించవు. ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజన్ గ్రోత్’ వంటి పసలేని నినాదాలకు తాత్కాలికంగానైనా స్వస్తి పలికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. జీఎస్టీని సరళతరం చేయాలి. రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. నల్లధనాన్ని వెనక్కు రప్పించాలి. అధిక వ్యయంతో కూడిన దిగుమతులను నిలుపుదల చేసి వైవిధ్యభరితమైన ఎగుమతులపై దృష్టి పెట్టాలి. దేశంలోని మానవ వనరులను సద్వినియోగ పర్చుకొని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంపైనే దృష్టి పెట్టాలి. రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడిగా దేశం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి స్థిరమైన ఆర్థిక విధానాలతో తగిన కార్యాచరణ రూపొందించాలి. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
పడిలేచిన కెరటం... ‘పోలవరం’
‘పోలవరం’ ప్రాజెక్టు తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం. 2005లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో 1941 నుంచి కాగితాలకు, శంకుస్థాపన లకు పరిమితం అయిన పోల వరంకు చలనం కలిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేంద్రంలో తనకున్న పరపతిని ఉపయోగించి... వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొని... వారు వెలిబుచ్చిన అన్ని అభ్యంతరాలకు సమాధానాలు అందించి 14 అనుమతులు సాధించి... పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టించింది వైఎస్సారే. 2009 సెప్టెంబర్‌లో డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమా దవశాత్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో... పోలవరంకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో... పోలవరం మళ్లీ తెరపైకి వచ్చింది. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా... మొత్తం ఖర్చును కేంద్రమే భరించేటట్లు ఒప్పందం కుదిరింది. కానీ, 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దాదాపు ఏడాదిన్నర వరకు పోలవరంను పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతలు చేపట్టారు. అంతేకాదు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ చాలునని ఒప్పుకొన్న చంద్రబాబు... కేంద్రం కట్టాల్సిన పోలవరంను తన భుజాలకెత్తుకొని తప్పు చేశారు. కేంద్రం ఏదయితే 2014 నాటి అంచనాల ప్రకారం రూ. 16,000 కోట్లు మాత్రమే ఇస్తానన్నదో దానికి తలూపి ఒప్పుకొన్నారు. అందుకే ప్రస్తుతం కేంద్రం పోలవరంకు రూ. 29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటోంది. కానీ, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017–18కి సంబంధించిన ధరల ప్రకారం మొత్తం రూ. 55,656 కోట్లు ఇవ్వాలని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. తానొక విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు పోలవరం నిర్మాణంలో చేసిన తప్పులు పోలవరంకు ప్రతికూలంగా మారాయి. ఆయన కాలంలో ఒకవైపు స్పిల్‌వే పని పూర్తి చేయకుండానే మరోవైపు కాఫర్ డ్యామ్‌లను కట్టడం ప్రారంభించారు. దాంతో, వరదనీళ్లు దిగువకు పోవడానికి అవకాశమే లేకుండా పోయింది. మధ్యలో కొచ్చేసరికి ముంపు గ్రామాలు మునిగిపోతాయని అర్థం కావడంతో ఆ పనుల్ని మధ్యలో ఆపేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవకతవకల వల్ల వర్షాలు, వరదలు వచ్చిన ప్రతి సారీ నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోంది. అంతే కాదు... ఎగువ కాఫర్ డ్యామ్‌ను 2,340 మీటర్ల వెడల్పుతో కట్టాలి. కానీ, ఒకచోట 480 మీటర్లు, రెండోచోట 400 మీటర్ల గ్యాప్ మేర కట్టకుండా వదిలేశారు. దీనివల్ల ఆర్థికంగా నష్టంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రణాళికబద్దంగా పనులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలవరం పనులు గాడిలో పడ్డాయి. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు అతి తక్కువ కాలంలోనే పూర్తి అయ్యాయి. గత యేడాది (2021) జూన్ 11న గోదావరిని విజయవంతంగా స్పిల్‌వే మీదుగా మళ్లించారు. దాంతో, మెయిన్ డ్యామ్ పనులు చాలా వేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమం అయింది. డిజైన్స్‌కు అనుమతి రావడమే తరువాయి... పనులు మొదలవుతాయి. వరద కారణంగా మెయిన్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో పడ్డ భారీ గుంతలను ఎలా పూడ్చాలన్న దానిపై ఈ నెలాఖరులోగా డిజైన్లు ఖరారు అవుతాయని కేంద్రం చెప్పడం ఒక శుభవార్త! తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ప్రాధాన్యతా క్రమంలో నిర్వాసితులకు పునరా వాసం కల్పిస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 373 జనావాస ప్రాంతాలు ముంపునకు గురవుతుంటే, ఇప్పటికి 27 జనావాస ప్రాంతాలను పునరావాస కాలనీలకు తరలించడం జరి గింది. ప్రస్తుతం, ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయిన నేపథ్యంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది కనుక... తొలుత 20,496 కుటుంబాలను తరలించాలని అధికారులు లెక్క వేశారు. అందులో ఇప్పటికే 7,962 కుటుంబాలను తరలిం చడం జరిగింది. వన్‌టైం సెటిల్మెంట్ క్రింద 3,228 కుటుం బాలకు పునరావాసం కల్పించారు. మరో 17,268 కుటుం బాలకు పునరావాసం కల్పించేందుకు ఇళ్లను వేగంగా కట్టిస్తున్నారు. కేంద్రం నిర్వాసిత కుటుంబాలకు రూ. 6.50 లక్షల పరిహారం ఇస్తుంటే, దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 3.50 లక్షలు చేర్చి మొత్తం రూ. 10 లక్షలు అందిస్తోంది. ఇక పనుల్లో ప్రగతిని చూసినట్లయితే... చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా వదిలేసిన స్పిల్‌వేను, స్పిల్‌వే చానెల్‌ను జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. అప్రోచ్ చానెల్‌ను సేఫ్ లెవల్‌కు పూర్తి చేశారు. స్పిల్ చానెల్లో 48 గేట్లు అమర్చారు. ప్రధాన డ్యామ్ లో గ్యాప్ 3ను పూర్తి చేశారు. అన్నిటికీ మించి కీలకమైన ఎగువ కాఫర్ డ్యావ్ును పూర్తి చేశారు. నదిని స్పిల్‌వే మీదుగా మళ్లించడం పూర్తయింది. దిగువ కాఫర్ డ్యామ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదేవిధంగా, హైడల్ పవర్ (జల విద్యుత్) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. కీలక టన్నెల్ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఎడమ, కుడి కాలువకు కనెక్టివిటీ పనులు కొనసాగుతున్నాయి. (చదవండి: పోలవరం తొలిదశకు లైన్ క్లియర్) కేంద్ర ప్రభుత్వ సహకారం లభిస్తే వచ్చే ఖరీఫ్ నాటికి ‘పోలవరం’ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ఖాయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన తండ్రి డా. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేయడం ఆయనకు లభించిన గొప్ప అవకాశం. ‘పోలవరం’ నిర్మాతలుగా వారిద్దరూ చరిత్రలో, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. పడిలేచిన కెరటంలా పోలవరం పరుగులు తీయడం అన్నివిధాలుగా శుభ పరిణామం! (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
మేనేజ్మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా, అమానవీయంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర క్రియాశీలకంగా ఉండాలి. కానీ అది విశృంఖలంగా మారిన పుడు సమస్యలు జటిలం అవు తాయి. అధికారంలో ఉన్నవారు తీసుకొనే నిర్ణయాలను ప్రతిపక్షం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించాలి కూడా! కానీ, ప్రతిపక్షం అదేపనిగా ప్రభుత్వం తీసుకొనే ప్రతి చర్య ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందంటూ ఏకపక్షంగా తీర్పులివ్వడం, వాటిపై శ్రుతి మించిన ఆందోళనలు చేయడం; ప్రజలను కుల, మత, ప్రాంత ప్రాతిపదికన రెచ్చగొట్టడం ఏ విధంగా సమంజసం? జరగని తప్పులు జరిగాయని, అడ్డగోలుగా దోచు కొంటున్నారని, రాష్ట్రం దివాళా తీసిందని... ఇలా రకరకా లుగా దుష్ప్రచారం సాగిస్తూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం చేస్తున్న యాగీ వల్ల... ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు అధికారకాంక్షను అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షం బాధ్యత ఏమిటంటే, ఏదైనా ఒక అంశాన్ని తీసుకొంటే.. దానిని ఒకస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలలో చర్చ జరిగేందుకు ఆస్కారం ఇవ్వాలి. దానిపై మంచి చెడుల్ని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, నేడు రాష్ట్రంలో జరుగు తున్నదేమిటి? ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడమే! ప్రతి పథకంలో అవినీతి ఉందని దుష్ప్రచారం చేయడమే! చంద్రబాబు ఒక్కడికే పాలన చేతనవుతుందని, ఆయనొ క్కడే రాజకీయ వ్యవస్థలో ‘సుద్దపూస’ అనే ప్రచారాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా అదేపనిగా సాగిస్తోంది. బాబు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఎవరికి తెలియదు? (చదవండి: రంధ్రాన్వేషణే... ప్రతిపక్షం పనా?) చంద్రబాబు తన జీవితంలో మేనేజ్మెంట్ పాలిటిక్స్ నడిపారే తప్ప కేసీఆర్ మాదిరిగా, మమతా బెనర్జీ లాగా పోరాటాలు చేశారా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా ప్రజల్ని మెప్పించి అధికారంలోకి వచ్చారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మీద యుద్ధం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏం చేశారు? తనకున్న పలుకుడిని ఉపయోగించి ఢిల్లీలోని ఆంధ్రభవన్‌కు కొంతమంది జాతీయ పార్టీల నేతలను పిలిపించుకొని ఓ సభ పెట్టి, వారితో మోదీపై విమర్శలు చేయించారు. నల్ల బెలూన్లు ఎగరేశారు. దానిని పోరాటం అనగలమా? ఈవీఎంలను మోదీ హ్యాక్ చేయించి అడ్డదారుల్లో విజయం సాధిస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేయడమే కాక... దానిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని బాబు సవాళ్లు విసరడం ఎవరు మర్చి పోగలరు? ఏమయిందా న్యాయ పోరాటం? మోదీ తిరిగి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చారు కనుక భయ పడ్డారా? కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో కలిసి మోదీ నియంతృత్వం మీద పోరాటం చేస్తానని రాహుల్‌గాంధీ నివాసం ‘10 జన్‌పథ్’ ముందు నిలబడి జాతీయ మీడియా సాక్షిగా శపథం చేశారు కదా? ఏమైంది? 2019 ఎన్నికల తర్వాత తటస్థవైఖరి అని ఎందుకు వెనక్కి తగ్గినట్లు? తను దేశంలో లేని సమయంలో తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు... బీజేపీలో విలీనం అయిన పుడు చంద్రబాబు ఏమని ప్రకటించారు? న్యాయ పోరాటం చేస్తానన్నారు కదా! సుప్రీం కోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? తెలుగుదేశం రాజ్యసభాపక్షం మొత్తం బీజేపీ రాజ్యసభాపక్షంలో విలీనం అయినట్లు రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రకటించిన తర్వాత... తెలుగుదేశం తరఫున సభ్యుడిగా కనక మేడల రవీంద్రకుమార్ ఎలా కొనసాగుతున్నట్లు? ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారు? (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) చంద్రబాబు చేసే పోరాటాలన్నీ చాటుమాటు వ్యవహారాలే. సొంత మీడియాను అడ్డుపెట్టుకొని, ఇతర పార్టీలలో తన ప్రయోజనాలను కాపాడే వ్యక్తులతో కలిసి ఆడే డ్రామాలే ఆయన సాగించే పోరాటాలు. చంద్రబాబు అనుసరించే ‘మోడస్ ఆపరేండీ’ ఎలా ఉంటుందంటే... సీఎం వైఎస్ జగన్ మీదనో లేక ప్రభుత్వం తీసుకున్న ఏదైనా ఒక నిర్ణయానికి వ్యతిరేకంగానో... తన సొంత మీడియాలో ముందుగా వార్తలు రాయిస్తారు. ఆ వార్తలను ఆధారంగా చేసుకొని ముందుగా ఇతర పార్టీలవారితో విమర్శలు, ఆరోపణలు చేయిస్తారు. ఆ పార్టీల వారి విమర్శలకు బలం ఎక్కువని, వాటిని ప్రజలు తేలిగ్గా నమ్ముతారన్నది బాబు దురాలోచన. ఆ తర్వాతనే తన పార్టీ వారిని రంగంలోకి దించుతారు. అలాగే తన మీడియాను, సామాజిక మాధ్యమాలను వారికి వెన్నుదన్నుగా మోహరిస్తారు. రాష్ట్రంలో ఏదో జరగరానిది జరిగిపోయినట్లు కలరింగ్ ఇస్తారు. అదే సమయంలో చంద్రబాబును దూరం చేసుకొని ప్రజలు ఘోరమైన తప్పిదం చేశారంటూ ఇంకోవైపు నుండి మరోరకమైన ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం కోసం ఫ్లెక్సీలు ఇతరత్రా ప్రచార సామగ్రిని రాష్ట్ర కార్యాలయం నుండే పంపుతారు. ఈ కార్యక్రమాల నిర్వహణ సామాన్య పార్టీ నేతల వల్ల సాధ్యం కాదు కనుక... భూతద్దం వేసి ఎవరు డబ్బు బాగా ఖర్చు పెడతారో కనిపెడతారు. వారిని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. సదరు నాయకులు పార్టీ టిక్కెట్లు తమకే వస్తాయన్న ఆశతో... కోట్లు తగలేసుకొంటారు. చివరికొచ్చే సరికి ఇంకా బిగ్ ఫిష్‌ల కోసం చంద్రబాబు ఎదురు చూస్తుంటారు. చంద్రబాబు దైనందిన రాజకీయ జీవితంలో ఇదంతా ఓ భాగం. ఆయనకు వ్యక్తుల పట్ల మమకారం ఉండదు. వ్యవస్థల పట్ల గౌరవం ఉండదు. ప్రతిదీ రాజకీయమే! అధికారపక్షంలో బలంగా గొంతుక విన్పించే కొడాలి నాని వంటి వారిని టార్గెట్ చేయడానికి కారణం ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బ తీయాలన్న కుటిల వ్యూహమే. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ తేల్చిందట. పార్టీ పరంగా... ప్రత్యర్థి పార్టీ మీద కమిటీ వేయడం ఏమిటి? ఆ కమిటీ ఏమి తేలుస్తుందో ప్రజలు అర్థం చేసుకోరా? ఆయన చేసే ప్రతి పనీ ఇలాగే ఉంటుంది. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో తగిన విధంగా ఆయనకు గుణపాఠం చెబుతారు. - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా
నిరంతర ప్రక్రియగా కొనసాగే ప్రజాచైతన్యం తోడైతే తప్ప కేవలం చట్టాలతో వ్యవస్థలను సమూలంగా మార్చడం సాధ్యం కాదన్న పరమసత్యం ఆలస్యంగానైనా ప్రధాని మోదీకి బోధపడినట్లుంది. పార్లమెంట్ ఆమోదిం చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరిం చుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఏడాదికి ముందు హడావుడిగా కేంద్రం తెచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని ఇప్పటికీ ప్రధాని భావించడం చూస్తే, కిందపడినా పైచేయి తమదేనని చెప్పుకోవడంగా కనిపిస్తుంది. వ్యవసాయ చట్టాల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒంటెత్తుపోకడ పోయింది. ‘వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం కనుక.. ఈ రంగంలో కీలక చట్టాలు చేసేముందు ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించి ఉండాలి. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆ చొరవ చూపలేదు. రైతులతో, రైతు ప్రతినిధులతో ముసాయిదా బిల్లుల్లోని అంశాలకు సంబంధించిన మంచి చెడులపై సమగ్రంగా మాట్లాడలేదు. పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెట్టినపుడు వాటిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ఈ అంశంపై ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు రాజ్యసభలో డిమాండ్ చేస్తున్నప్పటికీ.. మూజువాణి ఓటుతో ప్రభుత్వం బిల్లుల్ని ఆమోదింపజేసుకొంది. (చదవండి: అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు) ఈ చట్టాల లక్ష్యం కర్షకులకు మేలు చేయడానికి, వారి ఆదాయం పెంచడం కోసమేనని చెబుతూ వచ్చారు. మరి వాటిపై చర్చ జరగడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటన్నది ప్రశ్న. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగితే.. బడా కార్పొరేట్ల నుంచి, దళారుల నుంచి రైతులకు రక్షణ ఎలా లభిస్తుందనే అంశంపై బీజేపీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ సమంజసమైన వివరణ ఇవ్వలేకపోయాయి. అందుకే ఈ చట్టాల ఉపసంహరణ కోసం ఉత్తరాది ప్రాంత రైతులు రోడ్డెక్కి చారిత్రాత్మక పోరాటం చేశారు. 700 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో ఆశువులు బాసారు. ఉద్యమాన్ని అణచివేసేం దుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఉద్యమ సెగ చల్లారలేదు సరికదా.. మరింత ఉవ్వెత్తున సాగింది. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో.. దేశ రైతాంగానికి కొత్త శక్తి వచ్చినట్లయింది. తాజాగా వారు 23 ప్రధాన పంటలకు చట్టబద్ధతతో కూడిన కనీస మద్దతు ధర కోసం పట్టుబడుతున్నారు. పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర పొందడం అన్నది తమకు చట్టబద్ధ హక్కుగా సంక్రమించాలనేది రైతాంగం కోరిక. ఎప్పట్నుంచో రైతాంగం కోరుతున్నది, ఆశిస్తున్నదే. పస్తుతం కేంద్ర ప్రభుత్వం 14 పంట లకు కనీస మద్ధతు ధర ప్రకటిస్తోంది. ఈ పంటల ధరలు కనీస మద్దతు ధర కంటే తగ్గినపుడు ప్రభుత్వ ఏజన్సీలు జోక్యం చేసుకొని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. అయితే.. రైతులు 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరుతున్నారు. దేశ ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. సంప్రదాయకంగా విస్తృతంగా పండిస్తున్న వరి, గోధుమలకు డిమాండ్ తగ్గుతోది. సిరి ధాన్యాలుగా పిలుస్తున్న మిల్లెట్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని, పౌష్టికతను పెంచే పంటల పెంపకాన్ని ప్రోత్సహించవలసిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అలాగే, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలను దిగుమతులు చేసుకోవడం తగ్గించి వాటి ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. అందుకు రైతులు సిద్ధం కావాలంటే వారు డిమాండ్ చేస్తున్నట్లు 23 ప్రధాన పంటలకు చట్టబద్ధంగా కనీస మద్ధతు ధరలను ప్రకటించాలి. రానున్న కాలంలో రైతాంగ సమస్యల పరిష్కారమే రాజకీయ పార్టీలకు ప్రధాన ఎజెండా కానున్నది. ఇదొక శుభపరిణామం కూడా. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి ఎదురుగాలి వీస్తుందనే భయంతోనే భారతీయ జనతాపార్టీ 3 వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవడం ఇందుకు ఓ ప్రధాన సంకేతం. 2004లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతాంగ సమస్యల్నే ప్రధాన ఎన్నికల ఎజెండాగా తీసుకొన్నారు. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాల మాఫీ.. ఈ రెండు వాగ్దానాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాయి. అంతేకాదు.. వ్యవసాయం దండగమారి అని, ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికలలో బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చినందునే చంద్రబాబు స్వల్ప వ్యత్యాసంతో అధికారంలోకి రాగలిగారు. ఆ హామీని నిలబెట్టుకోనందుకే 2019లో తగిన మూల్యం చెల్లించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా నేడు రైతాం గంలో ఎనలేని చైతన్యం వెల్లివిరిస్తోంది. వ్యవసాయ రంగాన్ని విస్మరించే, దెబ్బతీసే రాజకీయ పార్టీలకు రైతాంగం శాశ్వతంగా దూరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంస్కరణలపేరుతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేసేవారిని, లాండ్ పూలింగ్ పేరుతో వ్యవసాయ భూముల్ని సేకరించి వాటితో రియల్ వ్యాపారం చేయాలనుకొన్న చంద్రబాబునాయుడు లాంటి రాజకీయ నాయకులకు ఇకపై చీకటి రోజులే. రైతాంగానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని వారు.. ఇకపై జరిగే ఎన్నికలలో రైతుల ఓట్లు పొందడం దుర్లభం. వ్యవసాయరంగ ప్రగతి మీదనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని నమ్మి.. అందుకు అనుగుణంగా వ్యవసాయరంగం మెరుగుదలకు పటిష్టమైన కార్యాచరణ చేపడతారో.. వారినే రైతులు ఆదరిస్తారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగానికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. రైతు సంక్షేమమే ప్రాధాన్యాంశంగా చేసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి రైతుల ఎజెండాయే ప్రధానాంశం అవుతుంది. రైతు వ్యతిరేకులకు రాజకీయ మనుగడ శూన్యం. ఉత్తరాది రైతులు సాగించిన ఉద్యమం తెలియబర్చిన వాస్తవం ఇదే. - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు -
బడుగులపై ఈ బండలేమిటి ‘బాబూ’
మాట మీద నిలబడే నిబద్ధత, నిజాలు పలికే నిజాయితీ రెండూ లేని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల తన ‘మనసులోని మాట’ను దాచుకోలేక ‘అమరావతి 2 లక్షల కోట్ల రూపాయల సంపదకు కేంద్రంగా మారేది’ అని అసలు నిజాన్ని బయటకు వెళ్లగక్కారు. తను పక్కా వ్యూహంతో.. రాజధాని ప్రకటనకంటే ముందే తన అనుయాయులు, బినామీలతో వందల ఎకరాలు కొనుగోలు చేయించిన భూములకు రెక్కలొచ్చే విధంగా వేసిన ప్రణాళిక దెబ్బతినడంతో రూ. 2 లక్షల కోట్లు దక్కకుండా పోయిందని చంద్రబాబు బాధ పడుతున్నారు. అమాయక రైతులను ఆశల పల్లకీలో ఊరేగించి ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని తెచ్చి సేకరించిన 32,000 ఎకరాలతో వ్యాపారం చేయాలని చంద్రబాబు తలపోశారు. అందులో భాగంగానే అమరావతిని విపరీతంగా పైకెత్తారు. హైప్ క్రియేట్ చేశారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్లను తలదన్నేవిధంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు ప్రత్యేక విమానాలలో ప్రపంచ దేశాలను చుట్టి రావడం ప్రజలు గమనించారు. అలా ఐదేళ్లూ వృథాగా కాలక్షేపం చేసిన చంద్రబాబుపై అమరావతి రైతులు పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యమే! (చదవండి: మీరు చేస్తే అప్పు! వీరు చేస్తే తప్పా?) అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన సొంత మనుషులకు ప్రయోజనం కల్పించడం అన్నది హైదరాబాద్ విషయంలో కూడా జరిగింది. 9 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు వేసిన పాచికలు పారాయి. ఆ సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో అత్యధికంగా సంపన్నులు నివాసం ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాలలో ముందుగానే తన బినామీలతో పెద్ద ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కొనిపించారు. ఆ తర్వాత ఐటీ పేరుతో అనేక సంస్థలకు భారీ రాయితీలు కల్పించి ఒకేచోట ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయించారు. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) చంద్రబాబు తొలిసారిగా సీఎం కాగానే ఆయన బినామీలు కొందరు రియల్టర్లుగా మారారు. ఓ సినీ నటుడు స్వతహాగా రియల్టర్ కానప్పటికీ.. చంద్రబాబుకు బినామీగా అప్పటికప్పుడు రియల్టర్‌గా మారి కొన్ని వందల ఎకరాలను హైటెక్ సిటీ, మరికొన్ని ఐటీ కంపెనీలు రాకముందే కొనుగోలు చేశారు. ఆ సినీ నటుడు కొనుగోలు చేసిన స్థలాలకు సమీపంలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. దాంతో ఒక్కసారిగా ఆ సినీనటుడి భూముల విలువ వేల కోట్లకు చేరింది. ఆశ్చర్యం ఏమంటే.. ఆ సినీనటుడు రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు కనపడదు. మామూలుగా అయితే.. వందల కోట్ల నిధులు ఒక్క ప్రాంతంలోనే ఖర్చు చేస్తే.. సమాధానం చెప్పడం కష్టం కనుక తెలివిగా గచ్చిబౌలి స్టేడియంలో ఏడాది వ్యవధిలో రెండు ప్రధాన క్రీడోత్సవాలు.. 1) జాతీయ క్రీడలు, 2) ఆఫ్రోఏసియన్ క్రీడలు నిర్వహించి అందులో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు, ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించే సాకుతో విశాలమైన రోడ్లు, లైటింగ్, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున ఏర్పరిచారు. క్రీడల నిర్వహణ పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా ఖర్చుపెట్టేశారు. అదే ప్రాంతంలో ‘ఫార్ములావన్ రేసు’ను కూడా నిర్వహించాలని విఫల ప్రయత్నాలు చేశారు. నిజానికి, చంద్రబాబు కంటే ముందు పరిపాలించిన ఏ సీఎం కూడా తమ భూముల విలువను పెంచుకోవడం కోసం తమతమ ప్రాంతాలలో కంపెనీలు, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఏర్పాటైన అనేక అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలను నగరం నాలుగు దిక్కులా అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణకు దోహదం చేశారు. కానీ, చంద్రబాబు ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించాలను కోవడానికి కారణం తన, తన అనుయాయుల భూములు, ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే. సైబరాబాద్‌లో అమలు చేసిన విధానాన్నే అమరావతిలో కూడా అమలు చేయాలని చూశారు. ముందుగా ఆ ప్రాంతంలో భూముల్ని కారుచౌకగా కొనిపించారు. ప్రపంచస్థాయి రాజధాని పేరుతో అన్ని సంస్థలు, కార్యాలయాలు అక్కడే వచ్చేవిధంగా ప్రణాళిక అమలు చేశారు. ఒకపక్క ప్రజల రాజధాని అమరావతి అని పైకి చెబుతూ.. దానిని సంపన్నుల స్థావరంగా మార్చాలనుకొన్నారు. అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయగలగాలి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఆ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం ఉపాధి తదితర మౌలిక సదుపాయాలను విస్తృతంగా లభించేటట్లు చర్యలు తీసుకుంటేనే సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయి. కానీ, చంద్రబాబుకు ఆ సామాజిక దృష్టి కోణం లేదు. ఎంతవరకూ.. ఒక ప్రాంతం, ఒక వర్గం అభివృద్ధి చెందాలన్న తపన, ఆరాటమే ఆయనలో కన్పిస్తుంది. ప్రజలు ఛీకొట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా.. కొన్ని మీడియా సంస్థల దన్నుతో అమరావతిలోనే రాజధాని కట్టాలని, అభివృద్ధి మొత్తం అక్కడే జరగాలని ఒత్తిడి చేస్తూ కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారు. ప్రతి రోజూ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ.. ఇంకా మిగతా ప్రాంతాలలో ఉన్న మెట్టప్రాంతాలు.. వీటి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. అధికార వికేంద్రీకరణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న కృత్రిమ ఉద్యమం సంపన్న వర్గాల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి.. వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారులను చేసేందుకు కృషిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లభించని అవకాశం పేద బడుగు బలహీన వర్గాలకు వైఎస్ జగన్ రూపంలో లభించింది. నిజానికి చంద్రబాబు సాగిస్తున్న అధర్మపోరాటం సీఎం జగన్‌పై కాదు.. పేద బడుగు బలహీన వర్గాలపైనే! రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. డబ్బులు పంచిపెడుతున్నారంటూ.. బడుగుల పట్ల అక్కసు చూపుతున్నారు. వారి నోటికి అందే లబ్ధిని లాగేయాలని చూస్తున్నారు. న్యాయస్థానాలలో కేసులు వేయిస్తున్నారు. అప్పులు పెరుగుతున్నాయని దుష్ప్రచారం సాగిస్తున్నారు. కానీ చరిత్రలో అధర్మపోరాటం విజయం సాధించిన ఉదంతాలు ఎక్కడా లేవు. బడుగులపై బండలు వేయడం చంద్రబాబు మానుకోవాలి. నేడు కాకుంటే రేపైనా అమరావతి రైతులు తమకు ద్రోహం చేసింది చంద్రబాబేనన్న వాస్తవాన్ని గ్రహిస్తారు, తనపై తిరుగుబాటు చేస్తారు. ఇది తథ్యం. - సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
చట్టం కంటే ప్రజాచైతన్యం ముఖ్యం
ప్రభుత్వాలు చేసే చట్టాల వల్ల తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావించాలి. అప్పుడే ఆశించే ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ వాస్తవం ఏడు దశా బ్దాల స్వతంత్ర భారతంలో పదేపదే రుజువైనప్పటికీ, ఆయా వర్గాలను సంతృప్తి పర్చడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పలు సందర్భాలలో మొక్కుబడి చట్టాలు తెచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల గొప్ప మేలు కలుగుతుం దని కేంద్రం పేర్కొంటున్నప్పటికీ, రైతులు సాను కూలంగా స్పందించడం లేదు. ఎన్డీఏ తెచ్చిన పలు చట్టాలపై ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘జనాభా నియంత్రణ’పై చట్టం తేవడానికి అధికార బీజేపీ అడుగులు వేయడం మరో వివాదానికి తెరలేపింది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియం త్రణ బిల్లులను తమ శాసనసభల్లో ప్రవేశపెట్టాయి. ‘ఉత్తర ప్రదేశ్ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు 2021’ ముసాయిదాను యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజానీకం ముందుంచి, వారి సలహాలు, సూచనలను ఆహ్వా నించింది. కాగా, యూపీ తరహాలోనే జనాభా నియంత్రణ బిల్లును తెచ్చి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనాభా నియంత్రణకు సంబంధించి 2020 డిసెంబర్లో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాజ్యంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో చైనా తరహాలో బలవంతంగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తెచ్చే ఉద్దేశమేదీ తమకు లేదనీ, వివిధ స్వచ్ఛంద విధానాల ద్వారా కుటుంబ నియంత్రణ చర్యలతోనే దేశంలో సంతానోత్పత్తి వృద్ధిరేటును కనిష్టంగా 2.1 శాతం సాధించే క్రమంలో ఉన్నామనీ తెలిపింది. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ విధానం ఇంత విస్పష్టంగా ఉన్నదని తెలిసినప్పటికీ, పార్లమెం టులో కొందరు అధికార బీజేపీ నేతలు ప్రైవేటు మెంబర్స్ బిల్ రూపంలో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని పట్టుబడటం వెనుక పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుత భారత్ జనాభా ప్రపంచ జనాభాలో 6వ వంతు. దేశంలో ప్రతి 20 రోజులకు లక్ష చొప్పున జనాభా పెరుగుతోంది. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, 142 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న చైనాను దాటడా నికి ఎక్కువ సమయం పట్టదు. స్వాత్రంత్యం లభించిన తొలినాళ్లల్లోనే దేశంలో తీవ్ర ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అప్పుడున్న 30 కోట్ల జనాభాకు తిండిగింజలను విదేశాల నుండి దిగు మతి చేసుకొన్నది. అటువంటి నేపథ్యంలోనే, నెహ్రూ ప్రభుత్వం 1951లో కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రారంభించింది. అయితే, దీన్ని బల వంతంగా అమలు చేయలేదు. తర్వాతి ప్రభు త్వాలు కూడా ప్రజలపై నిర్బంధంగా రుద్ద లేదు. ఒక్క ఎమర్జెన్సీ సమయంలోనే చెదురుమదురుగా బలవంతపు ఆపరేషన్లకు పాల్పడిన అమానుష సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ‘మేమిద్దరం– మాకిద్దరు’ అనే నినాదంతో సాగిన కుటుంబ నియంత్రణ కార్య క్రమాలు సత్ఫలితాలు అందించాయి. ఫలితంగానే, 1950–55 మధ్యకాలంలో సంతానోత్పత్తి వృద్ధి రేటు 5.9 శాతం ఉండగా, అది క్రమంగా 4 శాతా నికి, తదుపరి 3 శాతానికి తగ్గుతూ 2.2 శాతం వద్ద స్థిరపడింది. 2025 నాటికి 1.93 శాతంకు తగ్గిం చేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘అన్ని సమస్యలకు మూలం అధిక జనా భాయే’ అనే భావన ఒకప్పుడు ఉండేది. తర్వాత ‘అన్ని సమస్యలను పరిష్కరించగలిగేది జనాభాయే’ అనే సిద్ధాంతం ఊపిరి పోసుకుంది. మానవ వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించు కొనే దిశగా సమర్థమైన కార్యాచరణ అమలు చేసిన తర్వాతనే చైనా ఆర్థిక వ్యవస్థ బలీయమైన శక్తిగా రూపొందింది. అంతకుముందు ‘ఒకే బిడ్డ’ విధా నాన్ని నిర్బంధంగా అమలు చేయడంతో చైనాలో యువత సంఖ్య గణనీయంగా తగ్గి, వైద్య ఆరోగ్య సౌకర్యాలు అవసరమైన వృద్ధుల సంఖ్య పెరగ డంతో తన విధానాన్ని సవరించుకొంది. ఇద్దరు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదు పాయాల కల్పన, ప్రతి ఒక్కరికి అర్హతలను అను సరించి నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించడం, అభి వృద్ధి కార్య కలాపాలను వికేంద్రీకరించడం, తది తర చర్యలను తీసుకొన్నట్లయితే పెరుగుతున్న జనాభా విలువైన వనరుగా రూపొందుతుంది. యూపీ, అస్సాం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కుటుంబ నియంత్రణ చట్టాలు రూపొందించి, కొన్ని వర్గాల జనాభాను నియం త్రించాలనుకోవడం వెనుక రాజకీయ కోణం ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువుల జనాభా సంఖ్యను దాటుకొని ముస్లింల జనాభా పెరిగి పోతోందని కొంతకాలంగా చాంధసవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూపీలో ముస్లిం జనాభా పెరుగుతోందన్న కారణంగానే ఆ రాష్ట్రం చట్టం ద్వారా జనాభాను నియంత్రించా లనుకొం టోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. యూపీ మోడల్‌ను జాతీయ స్థాయిలో అనుసరించి నట్లయితే, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఇద్దరు బిడ్డల విధానం వల్ల, ఆడపిల్లలను పిండ దశలోనే తొలగించి వేసే అవకాశం ఉంది. ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ‘జనాభా నియంత్రణ బిల్లు’పై విçస్తృతమైన చర్చ జరగాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం చేయాలి. ‘చట్టం కంటే ప్రజా చైతన్యం’ ముఖ్యం. సి. రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
‘చంద్రబాబు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య విమర్శించారు. సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని దుయ్యబట్టారు. అధికార పార్టీపై బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు చేరిగారు. చంద్రబాబు గాలి మాటలు చెబుతూ జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని, మోదీని విమర్శించాలంటే చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు. -
పెట్రోలు ధరలు తగ్గాలంటే...
పెట్రో ధరలు ఎవరి నియంత్రణలో లేనట్టు పెరిగిపోవడం దేశ ప్రజల్ని అసహ నానికి గురి చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలియం ధరల పెరుగుదలను ఓ ధర్మ సంకటంగా అభివర్ణించారు. పెట్రోధరల నియం త్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వ యంతో పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఈలోపు పెట్రోల్, డీజిల్ ధరలు రెండూ సెంచరీ మార్కు దాటేశాయి. ఇటీవల కోవిడ్ ఔషధాలను తక్కువ శ్లాబ్‌లోకి చేర్చడానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గింపు అంశాన్ని ఎవ్వరూ చర్చించలేదు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రస్తావన ఇరువైపుల నుండి రాలేదు. పెట్రో ధరల దూకుడుకు కళ్లెం వేయడానికి కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేనట్లు అర్థమవుతున్నది. కరోనా దెబ్బతో రాబడులు తగ్గి ఆర్థికంగా సతమతమవుతూ వైద్య ఆరోగ్యరంగంలో, సంక్షేమ రంగంలో అదనంగా నిధులు ఖర్చుపెట్టాల్సిన నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై తమవంతు భారం వేశాయి. కేంద్రం ఏకపక్షంగా పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాల సెస్సులు విధిస్తూ తద్వారా సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు దామాషా ప్రకారం వాటా ఇవ్వకుండా మొత్తాన్ని తమ ఖజానాలో జమ చేసుకొంటున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మరో ప్రత్యామ్నాయం ఏముంది? పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించకుండా కారణాలు ఏమి చెప్పినా అవి ప్రజలను సంతృప్తి పర్చలేవు. భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేస్తున్న కొన్ని దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించి డిమాండ్‌ను పెంచుకున్న మాట వాస్తవమే. కరోనా నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యరంగంలో అధిక నిధులు ఖర్చు పెట్టాల్సిరావడం కూడా నిజమే. అందుకు పెట్రో ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు విధించి సామాన్యులను దొంగ దెబ్బ తీయడం సహేతుకం కాదు. కరోనా బెడద ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. భారత్‌తో పోల్చితే సాపేక్షంగా ఆర్థికంగా బలహీనమైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఒకవైపు కరోనాతో యుద్ధం చేస్తూనే తమ ప్రజలపై అదనపు భారం మోపకుండా పెట్రో ధరల్ని నియం త్రణలో ఉంచాయి. భారత్‌లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటిన దశలో నేపాల్‌లో లీటర్ రూ.51, శ్రీలంకలో రూ.55 మాత్రమే. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్’ నివేదిక ప్రకారం వివిధ దేశాలలో పెట్రోల్ స్థూల ధరపై జర్మనీలో 65%, ఇటలీలో 62%, జపా¯Œ లో 45%, అమెరికాలో 20% పన్నులు ఉండగా భారత్‌లో 260% మేర ఉన్నాయి. దీనిని ఎవరు సమర్థించగలరు? స్థూలంగా చూస్తే లీటర్ పెట్రోల్ రూ.100 ఉంటే అందులో రూ.59 పన్నుల రూపంలో పోతోంది. ప్రతియేటా దేశంలో అవసరమయ్యే పెట్రో ఉత్పత్తులు సగటున 211.6 మిలియన్ల టన్నులు కాగా, ఏటా 3.9% మేర ముడిచమురు వాడకం పెరుగుతోంది. దేశ అవసరాలలో 83% ముడిచమురును దిగుమతి చేసుకొంటున్న భారత్ అందుకు తన జీడీపీలో 4% నిధుల్ని ఖర్చు చేస్తోంది. ముడిచమురుకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిం చాలన్న లక్ష్యాలు నెరవేరకపోవడం వల్లనే ముడిచమురు అవసరాలు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్, ఇథనాల్, మిథనాల్, విద్యుత్, సౌర విద్యుత్, బయోడీజిల్ మొదలైన వాటిని ఉపయోగించు కోలేకపోతున్నాం. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరే. ఉదాహరణకు ఇథనాల్, మిథనాల్‌లను పెట్రోల్‌లో 10% మేర కలిపి వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడమేకాక, దిగుమతుల బిల్లులో దాదాపు రూ. 50,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. కానీ, దశాబ్దకాలంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 8% మించలేదు. తాజాగా 2025 నాటికి ఇథనాల్ మిశ్రమం 20%కు పెంచాలని, తద్వారా ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. చెరకు, మొక్కజొన్న, ఇతర రకాల వ్యవసాయ వ్యర్థాల నుండి ఇథనాల్, మిథనాల్‌లను తయారు చేస్తారు. కనుక చెరకు, మొక్కజొన్న పండించే రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని, వీటి ఉత్పత్తుల కోసం అదనపు భూమిని సాగులోకి తేవాలన్న సూచనలు గతంలోనే అందాయి. సాగునీటి సదుపాయాలను పెంచడం కోసం దేశంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అందుకు అవసరమయ్యే నిధులను పబ్లిక్, ప్రైవేటు సంయుక్త రంగం నుండి సేకరించాలని నిపుణులు సూచించారు. దీనిపై పార్లమెంట్లో కూడా అనేక సందర్భాలలో చర్చలు జరిగాయి. కానీ, ఆ దిశగా తగిన చొరవ కనపడలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టస్థాయికి పడిపోయినప్పుడు కూడా ఆ అనువైన పరిస్థితుల్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. కారణం దేశంలో ముడిచ మురును నిల్వ చేసుకొనే మౌలిక సదుపాయాలు అరకొరగా ఉండటమే. దేశంలో ప్రస్తుతం 23 ముడిచమురు శుద్ధి ప్లాంట్లు, ముడిచమురును దిగుమతి చేసుకోవడానికి 12 పోర్టులు, ముడి చమురు తెచ్చుకోవడానికి 10,406 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే దేశ అవసరాలకు 14 రోజులపాటు సరిపోయే ముడిచమురును మాత్రమే నిల్వ చేసుకోవడం సాధ్యపడుతుంది. ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు విఫలం చెందాయి. ఇంధన విధానంపై అనుసరించాల్సిన మార్గసూచీని 2020లో నీతి ఆయోగ్ అందిం చింది. నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదు. ముడిచమురు చౌకగా దిగుమతి చేసుకోవడానికి కొత్త మార్కెట్లను అన్వేషించాలి. భారత్‌కు ముడిచమురు ఎగుమతి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి కృత్రిమ డిమాండ్‌ను సృష్టించడం ద్వారా అనుచిత లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ హయాంలో విధించిన ఆంక్షల కారణంగా చౌకగా ముడిచమురు సరఫరా చేసే ఇరాన్, వెనిజులా దేశాల్ని భారత్ దూరం చేసుకొంది. ఇపుడు, అమెరికాలో అధికారం ట్రంప్ నుండి జో బైడెన్‌కు దక్కిన నేపథ్యంలో తిరిగి ఇరాన్, వెనిజులాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించు కోవచ్చు. ఆ దిశగా కేంద్రం చొరవ చూపాలి. దేశంలో ‘ఆయిల్ సప్లయ్ ఎమర్జెన్సీ’ విధానం లేకపోవడాన్ని ఇంధన రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. పెట్రో ఉత్పత్తులపై విధించే సర్‌చార్జీ నిధులను కేంద్రం ఆ రంగంపైనే ఖర్చు చేయాల్సి ఉండగా వాటిని దారి మళ్లిస్తున్నారు. ఫలితంగా, ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులపై సెస్సులు విధించడం ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. దేశవ్యాప్తంగా కరోనా రెండోవేవ్ తగ్గుముఖం పడుతూ, ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన ధరల్ని నియంత్రించగలిగితేనే ఆర్థికరంగం గాడిన పడుతుంది. ముఖ్యంగా ఒకవైపు ఉపాధి, ఆదాయాలు కోల్పోయి ఇంకోవైపు వైద్య ఖర్చులు పెరిగిన ఈ కీలక దశలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కోలుకోవాలంటే పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాలి. ఆ ధరలు తగ్గితేనే ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర కార్యాచరణ ప్రకటించాలి. దేశ ప్రజలపై పెట్రో భారాన్ని వదిలించాలి. సి. రామచంద్రయ్య – వ్యాసకర్త శాసన మండలి సభ్యులు – ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
సందేహం లేదు... ముమ్మాటికీ ఇది కుట్రే!
ప్రపంచ దేశాలు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ఏడాదికి పైబడి అలుపెరగకుండా పోరాడు తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత 15 నెలలుగా కరోనా వైరస్తోను, రెండేళ్లుగా కరోనా భూతాన్ని మించిన శక్తులతో, వ్యక్తులతో ఒకలాంటి యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ఇందులో కొన్ని ప్రత్యక్షంగానే దాడికి పూనుకోగా, మరికొన్ని స్లీపర్‌సెల్స్ తరహాలో ముసుగులు ధరించి ఆపరేట్ చేస్తున్నాయి. ఈ శక్తులన్నింటి వెనుక ఉండి మార్గదర్శనం చేసేది మరెవరోకాదు, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడే. ఆయన కుటిల వ్యూహాలను అమలుపరుస్తున్న వారిలో ఇతర పార్టీలలో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, ఓ వర్గం మీడియా, కొందరు పారిశ్రామిక వేత్తలు, పలువురు ఎన్నారైలు, విశ్లేషకుల ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మేధావులు కనిపిస్తారు. వీరందరి ఉమ్మడి లక్ష్యం ఒక్కటే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని అప్రజాస్వామిక విధానాలలో కూలదోయడం, వీలైనంత త్వరగా చంద్రబాబునాయుణ్ణి గద్దెనెక్కించడం. ఈ క్రమంలోనే చంద్రబాబు విసిరిన పాచికలలో ‘రఘురామ కృష్ణంరాజు’ ఒకరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికలపై వాటిని ప్రస్తావించవచ్చు. అయితే, పార్టీ అంతిమంగా తీసుకునే నిర్ణయాలకు పార్టీలోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. వ్యతిరేకంగా మాట్లాడటం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లే అవుతుంది. అధికార పార్టీలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు ప్రభుత్వ విధానాలను విభేదించాల్సి వస్తే వారు పార్టీని వీడి బయటకు పోవడం మినహా రెండో మార్గం లేదు. కానీ, రఘురామ కృష్ణంరాజు ఏం చేశారు? అధికారపార్టీలో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే ప్రభుత్వ నిర్ణయాలను అనుచితంగా విమర్శించడం, చివరకు సీఎంని వ్యక్తిగతంగా దూషించడం వరకు వెళ్లారు. కులాలు, మతాలకు అతీతంగా పరిపాలన అందిస్తున్న జగన్‌కి కులాన్ని, మతాన్ని అంటగట్టి దుర్భాషలాడటం ఆయనకు రివాజుగా మారింది. ప్రధాన స్రవంతి ఛానెళ్లు ఏవీ ఇప్పటివరకూ ఏ నాయకుడి బూతుల్ని, తిట్లను ప్రసారం చేయలేదు. కానీ రెండు ఛానెళ్లు రఘురామకృష్ణంరాజు అన్ పార్లమెంటరీ భాషను, చేష్టలను యధాతథంగా ప్రసారం చేయడం, అదే అంశాలపై డిబేట్లు నిర్వహించడం ఓ నిరంతర కార్యక్రమంగా మారిపోయింది. పత్రికా స్వేచ్ఛ, విలువల గురించి పేజీల కొద్దీ వ్యాసాలు రాసేవారు ఆయన ఏ విమర్శలు చేసినా అందుకు సంబంధించిన వివరణ తీసుకోకుండానే ప్రచురించడం ప్రజలందరూ గమనిస్తూవచ్చారు. ఓ లోక్‌సభ సభ్యుడికి సాధారణంగానైతే అంత ‘స్పేస్’ ఇవ్వరు. కానీ, ఆయన చేసే విమర్శలు వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవి కనుక అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. నిజానికి, ఈ వ్యవహారమంతా కుట్రపూరితంగా, లోపాయికారి ఒప్పందాల ప్రకారమే సాగిందన్నది బహిరంగ రహస్యమే. రోజు వారీ తిట్ల పురాణాన్ని యధాతథంగా ప్రసారం చేయడం ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, సోషల్ మీడియాకు తేడా లేకుండా చేసి మీడియా ప్రమాణాల్ని దిగజార్చేంత వరకు వెళ్లడంలో తమ ఇంట్రెస్ట్ ఏమిటో ఈ మీడియా యాజమాన్యాలు ప్రజలకు వివరించగలవా? కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తుంటే ఈ మీడియా సంస్థలు అందుకు ప్రాచుర్యం కల్పించడం వెనుక ఉన్నది కుట్రకోణంకాక మరేమిటి? ప్రత్యేకించి ఓ కులాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదంటూ నిరాధార ఆరోపణలు చేసి ఆ కులంపై మిగతా కులాలను ఎగదోసేందుకు ప్రయత్నించడం కుట్రకాక మరేమిటి? ఓ మతాన్ని, ఆ మతస్థుల ఆచార వ్యవహారాలను, కించపరిచేటట్లు వెక్కిరించడం ఎంత అనాగరికం, అమానవీయం? అతని దిగజారుడు ప్రవర్తనను యధాతథంగా మీడియా ఛానెళ్లు ప్రసారం చేయడం అభ్యంతరకరం, చట్టవ్యతిరేకం. సమాజంలో కులాల మధ్య చిచ్చురేపడానికి ప్రమాద కరమైన రాజకీయ క్రీడకు తెర లేపారు. దీనిని రాజద్రోహం గానే పరిగణించాలి. ‘కావాలని ఎవరు పుడతారు ఎస్సీల్లో’ అంటూ వ్యాఖ్యానించడమేకాక బీసీలు న్యాయమూర్తుల పదవులకు పనికిరారు అంటూ రాతపూర్వకంగా తెలియ జేసిన వ్యక్తి నేడు రాష్ట్రంలో కులాల కుంపట్లను రాజేస్తు న్నారు. కులాల కళ్లద్దాల నుంచే ప్రతి అంశాన్ని దర్శించే వ్యక్తి నేడు సీఎంకి కులం రంగు పులమడానికి, మతం ముసుగు తొడగడానికి తన మీడియా ద్వారా, రఘురామకృష్ణంరాజు వంటి వ్యక్తుల ద్వారా కుట్ర పన్నడం సుస్పష్టం. మీడియాకు స్వేచ్ఛ ఉంది. సద్విమర్శ చేసే హక్కు ఉంది. కానీ, ప్రజా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రపన్నే వెసులుబాటు భారత రాజ్యాంగం మీడియాకు కల్పించ లేదు. ప్రభుత్వాల తప్పొప్పులను ఎత్తి చూపడం మీడియా బాధ్యతే. కానీ, ఆ బాధ్యతను చంద్రబాబు అధికారంలో ఉండగా ఈ మీడియా ఎందుకు చేయలేదు? పార్టీ ఫిరాయిం పులకు పాల్పడి 29 మంది నాటి ప్రతిపక్ష వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని తమలో కలిపేసుకొని, అందులో నలుగుర్ని మంత్రులుగా చేసినప్పుడు ఇదే మీడియా ఓ చిన్న విమర్శ కూడా చేయలేకపోయింది. పాలనలో దారితప్పిన చంద్రబాబును, మెజారిటీ మీడియా ఏ సందర్భంలోనూ విమర్శించకపోవడం వల్లనే ఆ ఐదేళ్లూ ప్రజాస్వామిక వ్యవస్థలు, విలువలు కొడిగట్టాయి. ‘యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్’ అన్నది మీడియా రంగానికి కూడా వర్తిస్తుంది. జగన్‌పై గత 9 ఏళ్లుగా అనేక కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కరోనాను మించిన ఈ ఉపద్రవం నుండి ఆయన్ని కాపాడి అధికారం అప్పజెప్పింది ప్రజలే. ఇప్పుడు రక్షణ కవచంగా నిలిచేది కూడా ప్రజలే. – సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
కరోనాను మించిన వైరస్ చంద్రబాబు
గాంధీ టోపీలు ధరించిన వారందరూ గాంధీలు ఎలా కాలేరో.. మానవత్వం ముసుగులు ధరించి.. సోషలిజం పలుకులు పలికినంతమాత్రాన వారు పేదల పక్షపాతి కాలేరు. అవకాశం వచ్చినప్పుడు వారు మానవత్వం చూపించగలిగారా? పేదలకు న్యాయం చేయగలిగారా? అన్నదే కొలమానం. అవును మనం ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించే మాట్లాడుకుంటున్నాం. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఈ అనిశ్చిత పరిస్థితిలో కూడా బాబు తన చౌకబారు రాజకీయాలకు స్వస్తిపలకడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు పట్టలేదు. సామాన్యుల వెతలు విన్పించలేదు. సబ్సిడీలన్నా, సంక్షేమమన్నా రుచించలేదు. అలాంటి బాబు ఈ ప్రభుత్వానికి సంక్షేమ పాఠాలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన బాబు ఆ ఐదేళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చినప్పటికీ.. రైతాంగానికి మాఫీ చేస్తానన్న రుణాలలో (రైతుల రుణాల మొత్తం రూ. 1 లక్షా 25 వేల కోట్లు కాగా.. అనేక షరతులు పెట్టి చివరకు తేల్చిన మొత్తం రూ. 24,000 కోట్లు మాత్రమే) రూ. 11,000 కోట్ల మేర ఎగనామం పెట్టారు. రైతులతోపాటు డ్వాక్రా మహిళలకు చేస్తామన్న రుణమాఫీ చేయనేలేదు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఇవ్వనేలేదు. దశలవారీగా చేస్తామన్న మద్యపాన నిషేధం హామీని అటకెక్కించారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ప్రతిపక్షంలోకి రాగానే ఆయన మానవతామూర్తి అవతారం ఎత్తారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ‘‘రైతులకు ప్యాకేజీ ప్రకటించండి, గీత కార్మికుల్ని ఆదుకోండి, పేదకుటుంబాలకు నెలకు రూ. 10,000 ఇవ్వండి’’.. అంటూ ఆయా వర్గాల పట్ల తనకేదో సానుభూతి ఉన్నదన్నట్లు బాబు ఎడాపెడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు సంధిస్తున్నారు. కరోనాను సాకుగా చేసుకొని ప్రతిరోజూ ప్రెస్మీట్లు పెట్టి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం, తమ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి.. ఆ సమాచారాన్నంతా మీడియాకు అందించడం చేస్తున్నారు. పైగా, అదే సమాచారాన్ని అటూ, ఇటూ మార్చి తమ పార్టీ నేతలతో తిరిగి మాట్లాడించడం, పత్రికా ప్రకటనలు విడుదల చేయించడం రివాజుగా చేసుకున్నారు. వీరి ప్రకటనలలో నిర్మాణాత్మక సూచనలేమైనా ఉన్నాయా? అంటే కాగడాపెట్టి వెతికినా ఒక్కటీ కనపడదు. తను ఏమి చెప్పినా ఎదురు ప్రశ్నించకుండా చూపించడానికి కొన్ని టీవీ చానెళ్లు; ప్రచురించడానికి కొన్ని దినపత్రికలు ఉన్నాయి కనుక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. పేదవాడి సంక్షేమం గురించి, రైతుల ప్రయోజనాల గురించి చంద్రబాబు ఈ రోజు కొత్తగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పాఠాలు చెప్పడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రకటించిన ‘నవరత్నాలు’ చంద్రబాబు చెబితే చేసినవా? ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే అమలు చేస్తున్న ఈ వినూత్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ చంద్రబాబు చెబితే చేస్తున్నవా? గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తే దానిని అవహేళన చేసిన బాబు.. నేడు కరోనా వ్యాప్తి నిరోధానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగిం చుకోండంటూ చెప్పడం ఎంత హాస్యాస్పదం? మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన కాలంలో.. బాబు తనదైన ముద్రగలిగిన ఒక్క సంక్షేమ పథకాన్నైనా అమలు చేయగలిగారా? ఏపీలో పేదల కోసం అమలు చేసిన సబ్సిడీ బియ్యం పథకం ఎవరిది? ఎన్టీఆర్ ప్రవేశపెట్టింది కాదా? బాబుతోసహా ఎంతోమంది సాధ్యం కాదని చెప్పినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్‌ను విజయవంతంగా అందించిన ఘనత డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డిది కాదా? చంద్రబాబు రైతులు, పేదల సంక్షేమానికి చేసిందేమిటి? అధికారంలో ఉన్నప్పుడు పేదలకు అందించే సబ్సిడీల్లో భారీ కోతలు పెట్టడం నిజం కాదా? పాతిక కేజీల సబ్సిడీ బియ్యాన్ని 20 కేజీలకు తగ్గించింది బాబు కాదా? రూ. 2 ల బియ్యాన్ని అధికారంలోకి రాగానే రూ. 5.50కి పెంచిన విషయం బాబు మరిచారా? సంస్కరణల పేరుతో గృహ విద్యుత్ చార్జీలను అమాంతం పెంచడమే కాకుండా చార్జీలను తగ్గించమని ఆందోళన చేసిన ఉద్యమకారులపై కాల్పులు జరిపించి వారి ఉసురు తీసిందెవరు? కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాసి వారికి భారీ రాయితీలు అందించి పేదవాడిని హీనంగా చూసిన బాబు.. నేడు ప్రతిపక్షంలో కూర్చొని తానేదో గొప్ప మానవతామూర్తి మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఇది చేయండి.. అది చేయండి’అంటూ ఉచిత సలహాలతో ఆడుతున్న డ్రామా వెనుక అసలు పరమార్థం గ్రహించలేని వెర్రివాళ్లా ప్రజలు? అదేనిజమైతే.. తాను ఎందుకు చిత్తుగా ఓడిపోవాల్సివచ్చిందో ఆలోచించుకోవాలి. నిజానికి, ప్రపంచ మానవాళికి ముప్పుగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. తెలుగు ప్రజలు ముందుగా గుర్తు చేసుకోవల్సిన వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎన్టీఆర్, రెండు వైఎస్సార్. సబ్సిడీ బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు పోషకాహారాన్ని అందించిన వారు ఎన్టీఆర్ కాగా; పేదలు ప్రాణాంతక జబ్బుల బారినపడి వారు ఆర్థికంగా, భౌతి కంగా చితికిపోయే పరిస్థితుల నుంచి తప్పిస్తూ ‘ఆరోగ్యశ్రీ’ వంటి గొప్ప పథకాన్ని, ఫీజుల రీయింబర్స్మెంట్ పథకంతో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకొనే అవకాశాన్ని కల్పించి.. వీటితోపాటు అందరికీ అన్నం పెట్టే రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకొని ఆత్మహత్యలు చేసుకోకుండా.. వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్, రుణాలమాఫీ కల్పించిన మానవతామూర్తి వైఎస్సార్. మన దేశ, రాష్ట్ర కాలమాన పరిస్థితులకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రెండూ కీలకం అని నమ్మిన వైఎస్సార్ అధికారంలోకి రాగానే వాటి అభివృద్ధికై అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన హయాం లోనే చిన్న, మధ్య, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికై ‘జలయజ్ఞం’ మొదలైన కారణంగానే నేడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో.. సాగునీటి ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండుతున్నాయి. గత తొమ్మిది నెలలుగా బాబు ప్రతిపక్షనేతగా కూడా విఫలమయ్యారు. కరోనా మహమ్మారిని మించిన వైరస్ నేడు ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉంది. దీనికి ఏకైక ఔషధం ప్రజల విజ్ఞతే. ప్రజలు బాబు ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజా సమస్యలపట్ల పూర్తి అవగాహన ఉంది. వాటిని పరిష్కరించే చిత్తశుద్ధి ఉంది. ప్రజల సహకారంతో తాత్కాలికంగా ఏర్పడిన ఈ ఇబ్బందులను విజయవంతంగా అధిగమించే ఆత్మవిశ్వాసం నిండుగా ఉంది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
ఇంత ఆక్రోశం ఎందుకు బాబూ?
ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు. అమరావతిలో కొల్లగొట్టిన బినామీల భూములకు విలువ పెరగాలన్నదే చంద్రబాబు పంతం. విజన్ 2020 నుంచి రాజధాని వరకు ప్రతి దశలోనూ ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడమే లక్ష్యంగా బాబు పనిచేస్తూవచ్చారు. అమరావతిలో కూడా హైదరాబాద్ ఫార్ములా అమలు చేయడానికి ప్లాన్ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కారు చౌకగా సుమారు నాలుగున్నర వేల ఎకరాల భూములను కొనుగోలు చేయించారు. దాన్ని కాపాడుకోవడానికి రాజధాని రైతులను అడ్డంపెట్టుకుని కృత్రిమ ఉద్యమానికి గొడుగుపడుతున్నారు. విజ్ఞులైన ప్రజలు అన్నీ గ్రహిస్తారు! తెలుగునాట ‘సాక్షి’ మీడియా, సోషల్ మీడియా సామాన్యులకు అందుబాటులోకి రాని రోజుల్లో చంద్రబాబు అనుకూల మీడియా వ్యూహాత్మకంగా వ్యాప్తి చేసిన అనేక మిథ్యలలో ‘చంద్రబాబు గొప్ప పరిపాలనాదక్షుడు’ అనేది ఒకటి. ఈ భుజకీర్తిని తగి లించుకొనే 2014లో చంద్రబాబు స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో అధికారంలోకి రాగలిగారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 5 ఏళ్ల చంద్రబాబు పాలన ప్రజలకు ఓ పీడకలగా మారి ఆయన పరిపాలన దక్షతలోని డొల్లతనం ప్రజలకు తెలిసొచ్చింది, అనేక వర్గాల ప్రజలకు చేదు అనుభవాలను అందించింది. ఇందులో.. రాజధానికి భూములిచ్చిన రైతులూ ఉండటం విషాదం. కానీ ప్రజలు చిత్తుగా ఓడించినా చంద్రబాబుకు అహంకారం తగ్గలేదు. జ్ఞానోదయం కాలేదు. ప్రజలను వంచించానన్న పశ్చాత్తాపం ఏ కోశానా కనపడటం లేదు. ఇంకా తన ‘విజన్’ గొప్పదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చడం తనకొక్కడికే సాధ్యం అంటూ.. ఇటీవల ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి గంటలకొద్దీ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు. పరిపాలనాదక్షత అంటే పేద, సామాన్య, బడుగు బలహీన వర్గాలు, రైతాంగానికి ప్రయోజనం చేకూర్చడం. అంతేతప్ప.. స్వప్రయోజనాలు, స్వపక్ష ప్రయోజనాలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కాదు. జిమ్మిక్కులతో ‘కృత్రిమ ఇమేజ్’ 1995 ఆగస్ట్‌లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గద్దెదింపి అడ్డదారిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబుకు అత్యవసరంగా తాను ఎన్టీఆర్ కంటే మించిన నేతగా ప్రజలముందుకు వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆ క్రమంలో పబ్లిసిటీతో ఇమేజ్ పెంచుకోవడానికి రోజుకో జిమ్మిక్కు చేయడం.. దానికి అనుకూల మీడియా గొడుగుపట్టడం రివాజుగా ఉండేది. ఏ కార్యక్రమం నిర్వహించినా తనకొక్కడికే పేరు రావాలన్న తాపత్రయం చంద్రబాబుది. అధికారాన్ని పూర్తిగా కేంద్రీకృతం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. వీడియో కాన్ఫరెన్స్‌లంటూ కలెక్టర్లు మొదలుకొని హెచ్ఓడి స్థాయి అధికారులతో నేరుగా తానే గంటల తరబడి మాట్లాడేవారు. జిల్లా ఎస్పీలు, డీఎస్పీలకు కూడా తానే ఆదేశాలిచ్చేవారు. క్యాబినెట్ మంత్రులు నిమిత్తమాత్రులుగా, ప్రేక్షకుల్లా మిగిలిపోయేవారు. మంత్రులెవరైనా కలెక్టర్‌కో, ఎస్పీకో ఫోన్ చేస్తే.. ‘‘ముఖ్యమంత్రిగారు మాతో మాట్లాడారు’’ అనే సమాధానం వారికి లభించేది. చంద్రబాబు తమకు ఎటువంటి గౌరవం లేకుండా చేస్తున్నారంటూ మంత్రులు లోలోపల వాపోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు వెళ్లకపోతే.. ఏ కార్యాలయంలో కూడా దుమ్ము దులపడం లేదనేటట్లుగా ప్రచారం సాగింది. ‘జన్మభూమి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఒక్కడే కష్టపడుతున్నట్లు మిగతా క్యాబినెట్ మంత్రులు, అధికార యంత్రాంగానికి పాత్ర ఏమీలేనట్లు కొన్ని పత్రికలు రాసేవి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు ఏకపాత్రాభినయం నిరాఘాటంగా సాగిపోయేది. అది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం కావచ్చు.. బడ్జెట్‌పై చర్చ కావచ్చు.. ద్రవ్యవినిమయబిల్లుపై ముగింపు ఉపన్యాసం కావచ్చు.. చివరకు మంత్రులకు సభ్యులు వేసిన ప్రశ్నకు సైతం.. జవాబును సంబంధిత మంత్రితో మొదలుపెట్టించడం.. 5 నిమిషాలు గడవకముందే చంద్రబాబు జోక్యం చేసుకొని.. గంటల తరబడి మాట్లాడటం షరామామూలుగా ఉండేది. రాజకీయం మొత్తం అంతా తన చుట్టూనే తిరగాలన్న బాబు యావ వల్ల.. ప్రభుత్వంలో ఎవ్వరూ తమ శాఖలపై మనసుపెట్టి పనిచేయని పరిస్థితి. రాష్ట్రంలో తుపాన్లు, వరదలు వస్తే బాబు తక్షణం అక్కడకు వెళ్లిపోయేవారు. తుపాను ప్రాంతంలో కూర్చొని అధికార యంత్రాంగంతో పునరావాస పనులను తానొక్కడే కష్టపడి పనిచేయిస్తున్నట్లు వార్తలు రాయించుకునేవారు. 2015లో సంభవించిన ‘హుద్‌హుద్’ తుపాను వల్ల విశాఖ దెబ్బతింటే.. అక్కడే తను ఉండి.. విశాఖను బాగుచేశానని, అది తన ఘనతేనని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఎవరికీ పేరు రాకూడదు. తానొక్కడే హైలైట్ కావాలి. ఇదీ బాబు ఆలోచనా విధానం. విజన్‌లేని చంద్రబాబు చంద్రబాబు గొప్ప ‘విజన్’ ఉన్న నాయకుడన్న ప్రచారం కూడా అనుకూల మీడియా సృష్టే. చంద్రబాబు 1999లో ‘విజన్ 2020’ అనే ఓ దార్శనిక పత్రాన్ని మెకిన్సే అనే విదేశీ సంస్థతో తయారు చేయిం చారు. 20 ఏళ్లల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వర్ణగ్రామాలు (బంగారు గ్రామాలు)గా, అన్ని పట్టణాలను స్వర్ణపట్టణాలు చేసి.. అంతి మంగా రాష్ట్రాన్ని స్వర్ణమయం చేస్తానని అందుకు కొన్ని లక్ష్యాలను ఏర్పర్చుకున్నానంటూ గొప్ప కలను ఆవిష్కరించారు. దీంతో 20 ఏళ్లూ తనకే ప్రజలు అధికారాన్ని అప్పజెబుతారన్నది చంద్రబాబు లాజిక్. కానీ కొన్ని రోజుల్లోనే చంద్రబాబు విజన్ అంతరార్థం బయట పడింది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంతోనూ, విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచడంతోనూ పెద్దఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధి కోసం పేదలు, కూలీలు వలస బాటపట్టడంతో వేలాది గ్రామాలు వల్లకాడుగా మారాయి. ఆ సందర్భం లోనే ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ ప్రజల కడగండ్లను పాట రూపంలో కళ్లకు కట్టి.. ప్రజల కళ్లు తెరిపించారు. కరవుకాలంలో వేల కోట్లతో క్రీడల నిర్వహణ చంద్రబాబు విజన్ ఎంత గొప్పదంటే.. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే.. హైదరాబాద్ గచ్చిబౌలిలో తన అనుయాయులు ముందుగానే కారుచౌకగా కొన్న భూములకు విలువ పెంచడం కోసం.. జీఎంసీ బాలయోగి స్టేడియంను నిర్మించి.. దానిలో జాతీయ క్రీడలు, ఇండోఆఫ్రికన్ క్రీడల్ని నిర్వహించారు. ఆ వంకతో గచ్చిబౌలి, పరిసర ప్రాంతాలలో వందల కోట్లు ఖర్చు చేసి భారీగా మౌలిక వసతులు తీర్చిదిద్దారు. క్రీడోత్సవాలు నిర్వహించాక క్రీడాకారుల కోసం కట్టిన అపార్ట్మెంట్లను వేలం వేశారు. ఆ తర్వాత కొన్ని ఐటీ కంపెనీలను అక్కడే నెలకొల్పారు. ఫలితంగానే.. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి ఎగసి.. తర్వాతి కాలంలో మురళీమోహన్‌కు చెందిన జయభేరిలాంటి సంస్థలకు,బాబు బినామీలకు లాభాలపంట పండించాయి. బాబు ‘విజన్’ కేవలం, తను, తన సన్నిహితులు బాగుపడడానికి రూపొందించినదే. విజన్ ఉన్నది వైఎస్సార్‌కే రాష్ట్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల గురించి తపిం చిన ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, పేద బడుగుబలహీన వర్గాల విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్, సాగునీటి రంగానికి ప్రాధాన్యం కల్పించడం, పేద వృద్ధాప్య, వితంతు పెన్షన్ల మొత్తాన్ని పెంచడం.. సబ్సిడీ బియ్యం ధర తగ్గింపు.. ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించి దార్శనికత కలిగిన నాయకుడిగా ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకోగలిగారు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేస్తున్నాయి. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్నైనా.. దేశంలో ఏ ప్రభుత్వమైనా అమలు చేస్తున్నదా? చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అధికారాన్ని పూర్తిగా దుర్విని యోగం చేశారు. హైదరాబాద్‌లో లాగే అమరావతిలో కూడా అదే ఫార్ములా అమలు చేయడానికి ప్లాన్ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కారు చౌకగా సుమారు నాలుగున్నర వేల ఎకరాల భూములను కొనుగోలు చేయించారు. కానీ తన పాలనలో జరగని అభివృద్ధిని కొత్త ప్రభుత్వం లక్షాపాతిక కోట్ల నిధులను కుమ్మరించి చేయాలని డిమాండ్ చేయడంలో హేతుబద్ధత లేదు. ప్రభుత్వం ఒక్క పైసా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని, రైతులిచ్చిన భూముల్లో 5,000 ఎకరాలను అమ్మితే.. 2.25 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని చంద్రబాబు లెక్కలు చెబుతున్నారు. అంటే, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తను, తన అనుయాయులు కారుచౌకగా అమరావతి చుట్టుపక్కల కొనుక్కున్న సుమారు 4,500 ఎకరాలకు 2 లక్షల కోట్లు వస్తుం దని చంద్రబాబు ఒప్పుకున్నట్లయింది. కనుకనే, అమరావతిలోనే.. రాజధాని నిర్మాణం చేయాలని చంద్రబాబు మొండిగా వాదిస్తున్నారు. ఈ ప్రభుత్వంపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మిగతా ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు. అమరావతిలో తమ భూములకు విలువ పెరగాలన్నదే చంద్రబాబు పంతం. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబును పాలనాదక్షుడిగా చిత్రీకరించిన అనుకూల మీడియా.. ప్రస్తుతం చంద్రబాబు సాగిస్తున్న కృత్రిమ ఉద్యమానికి కూడా గొడుగుపడుతున్నది. విజ్ఞులైన ప్రజలు అన్నీ గ్రహిస్తారు! సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి -
ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు
-
సీఎం జగన్ చేతికి ఎముక ఉందా?
సాక్షి, రాయచోటి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి నాయకుల వల్లే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. అడగకుండానే సీఎం జగన్ అన్నీ చేసేస్తున్నారని, ఆయన చేతికి ఎముక ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోందని అన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ... అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. తాను రెండుసార్లు మంత్రిగా పనిచేసినా రాయచోటిలో ఇంత అభివృద్ధి చేయలేకపోయానని, ఇందుకు సిగ్గు పడుతున్నానని ఆయన అన్నారు. ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా మొదటి ఆరు నెలల్లోనే వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. (చదవండి: రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం) -
‘బాబు వల్ల ఏపీకి విభజన కంటే ఎక్కువ నష్టం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి అంతా అబద్దమని తేల్చి చెప్పారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు మదిలో రాజధాని ఆలోచన వచ్చిందని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాల కంపు అని... ఆయన అవినీతి హిమాలయాలంత అని ఘాటుగా విమర్శించారు. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు ‘నాడు మోదీని తిట్టి నేడు ఆయన కాళ్లు పట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి కాళ్లబేరానికి దిగాడు. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. చంద్రబాబు, పవన్‌లు బీజేపీని ఎందుకు విమర్శించరు? అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేన మా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి. ఎంత మంది అడ్డుపడినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తార’ని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. -
'సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదు'
సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు అవివేకమని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి పలుమార్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోలేదా అంటూ గుర్తుచేశారు. జగన్ నేరస్తుడు కాదని, ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వైఎస్ జగన్‌కు ఉండడంతో కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకున్నారు. సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదని , పైకోర్టులు ఇచ్చే తీర్పే అసలు నిర్ణయం అని వెల్లడించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్న చింత లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెయిడ్ ఆర్టిస్ట్‌లను ఏర్పాటు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అనేకసార్లు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనకు చిల్లర పార్టీల మద్దతు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక అక్రమంగా తవ్వించినందుకు రూ.100 కోట్ల ఫెనాల్టీ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తప్పు చేస్తే అడిగే హక్కు ఎవరికైనా ఉందని, కానీ తప్పు చేయకుండానే తప్పుడు వార్తలు రాసే పత్రికలపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన ఘనత దేశ చరిత్రలో పవన్‌కల్యాణ్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు తలపెట్టే కార్యక్రమాలను భుజానికెత్తుకునే పవన్‌కు జగన్ నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. -
‘టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య ప్రశంసించారు. పెట్టుబడి సహాయంగా రైతు భరోసా డబ్బులను నేరుగా ఖాతాల్లోకి వేయడంతో రైతులంతా ఆనందంగా ఉన్నారని చెప్పారు. నిన్ననే ప్రారంభమైన రైతు భరోసా పథకంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను నిలువునా ముంచిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చి రైతులు అల్లాడుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను చంద్రబాబు వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. గడువు కంటే ముందే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం జగన్‌ను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నవరత్నాలను నవగ్రహాలు అని చంద్రబాబు అనడం సిగ్గు చేటన్నారు. గతంలో చేసిన అవినీతి, కుంభకోణం బయటపడుతుందనే మోదీ అంటే ద్వేషం లేదంటూ చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందితే జుట్టు.. అదకపోతే కాళ్లు పట్టుకునేవాడిలా చంద్రబాబు తయారయ్యాడని ఎద్దేవా చేశారు. మధ్యవర్తిత్వం కోసమే బ్రోకర్లను, బినామీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపించారు. దీనికంటే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుందని సూచించారు. చంద్రబాబును బీజేపీ దగ్గరకు తీసే అబాసుపాలు కావడం తప్పదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. -
క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా?
సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిని ప్రజలు శిక్షించి 23 సీట్లకు పరిమితం చేసినా ఆత్మపరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధానకార్యదర్శి సి. రామచంద్రయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ఐదేళ్లలో చేసిన దరిద్రపాలన గురించి మరిచిపోయారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తిరుపతికి వెళ్ళినప్పుడు సీఎం సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు. సంతకం అనేది జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత విషయం. మనిషికి భక్తి ఉందా లేదా అనేది ముఖ్యం. జగన్మోహన్రెడ్డి ఒక్క తిరుపతినే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై సంతకం చేయకపోతేనే తప్పుపట్టాలి. మరి మీరు చేసిన సంతకాల పరిస్థితి ఏమిటి? రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపుల రద్దు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చేశారు. కానీ ఏ ఒక్క సంతకాన్ని అమలు చేయలేదు. నీచ సంస్కృతికి చంద్రబాబు విషవృక్షం లాంటివాడు. ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో మాట్లాడింది చంద్రబాబు కాదా? టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జగన్మోహన్రెడ్డి, ఆయన కుటంబసభ్యులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయించలేదా? ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. లోకకల్యాణం కోసం జగన్మోహన్రెడ్డి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్లు చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇందుకు ఎల్లో మీడియా సహకరిస్తోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్యనిషేధానికి చర్యలు తీసుకుంటుంటే అభినందించకపోగా ఇష్టారాజ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం జగన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ప్రస్తుతం టీడీపీ అనేది ముగిసిన అధ్యాయం. మోదీని జగన్ కలిస్తే కేసుల కోసమని మాట్లాడతారా? కేంద్రంలో మోదీ రెండోసారి గెలిచి అధికారంలోకి రావడంతో తనకు ముప్పు రాకుండా చంద్రబాబు తన కోవర్ట్‌లను బీజేపీలోకి పంపింది వాస్తవం కాదా? పోలవరాన్ని ఏటీఎంలా చంద్రబాబు మార్చుకున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పడం మర్చిపోయారా? మోదీని కూడా దిగజార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మోదీపై చేసిన విమర్శలపై బీజేపీ నాయకులు స్పందించాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కాదా? దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా? కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా?’ అని రామచంద్రయ్య ప్రశ్నించారు. -
‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఎగ్జిట్ పోల్ ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీర్ణియించుకోలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారమని ఆరోపించారు. ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు. జాతీయ నేతలు పిలవకున్నా పక్క రాష్ట్రాలకు వెళ్తూ చంద్రబాబు మన రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబుకు ప్రతికూలంగా రావడంతోనే వాటిపై నమ్మకం లేదంటున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం సిగ్గు చేటన్నారు. విపక్షాల సమావేశానికి చంద్రబాబును పూర్తిగా పక్కకు పెట్టారన్నారు. చంద్రబాబుకు దేశంలో ఎక్కడ విలువలేదని, ఎంత తిరిగిన ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాతనాన్ని కోల్పోయి.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పవన్.. కేసీఆర్ ఇంటికి ఎందుకు వెళ్లారు?
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అవినీతిని ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని ఎందుకు ప్రశ్నించడంలేదని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య నిలదీశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ వైఫల్యాలను చెప్పకుండా ప్రతిపక్ష పార్టీని విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వైఫల్యంపై అధికార పార్టీని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల చీకటి ఒప్పందం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్‌ల మధ్యవర్తిగా లింగమనేని రమేష్ పనిచేస్తున్నారన్నారు. తన వరకు మాట్లాడుకొని 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదని, ఈ సారి రహస్య ఒప్పందాలతో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందంటున్న పవన్.. కేసీఆర్ ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు, అవినీతి అన్ని పవన్‌కు తెలుసనని, అయినప్పటికీ అతను ప్రశ్నించడం లేదని విమర్శించారు. మరోసారి మోసం చంద్రబాబు, పవన్‌లు కుట్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. (జనసేన కోసం టీడీపీ అభ్యర్థుల మార్పులు!) -
‘మహానాడులో అవినీతిపై తీర్మానం చేయాల్సింది’
సాక్షి, కడప : అత్యాచారాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం వాటిని అరికట్టలేకపోతుందని విమర్శించారు. అయినా మహిళా ఎమ్మార్వోపై టీడీపీ నేతలు దాడి చేసినపుడు వారిని వెనకేసుకొచ్చిన చంద్రబాబు నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు.. జాబు లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చారని అయితే ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రామచంద్రయ్య మండిపడ్డారు. ఒకపక్క కరువు రహిత రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటూనే మరో పక్క కరువు మండలాలు ప్రకటించడం చంద్రబాబుకే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. మహానాడుకు ప్రజల సొమ్మును వాడుతున్నారు.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలకు తేడా లేకుండా పోయిందని రామచంద్రయ్య విమర్శించారు. మహానాడుకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపై నిలదీస్తే ప్రతిపక్షాలు అభివృద్దికి అడ్డుపడుతున్నాయంటూ ఎదురుదాడి చేస్తారని విమర్శించారు. రాజధాని పేరిట రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాక్కుని వారికి ఇంతవరకు న్యాయం చేయలేదని రామచంద్రయ్య ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. మహానాడులో అవినీతిపై కూడా ఒక తీర్మానం చేసి ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. -
బాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడింది