
'దొంగ విధానం పాటిస్తున్న చంద్రబాబు'
బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దొంగ విధానం పాటిస్తుందని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు.
హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దొంగ విధానం పాటిస్తుందని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో సి.రామచంద్రయ్య మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.
అయితే ఇప్పుడు ఎందుకు అనుమతిస్తున్నారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. సొంత ఆదాయం, బినామీల ఆదాయం పెంపు అజెండాగానే... బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం అయిందని.. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నేతలే ఆరోపిస్తున్నారని సి.రామచంద్రయ్య చెప్పారు.