ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన సమక్షంలోనే మంత్రి రామచంద్రయ్య చురకలు వేశారు.
రాయచోటి : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన సమక్షంలోనే మంత్రి రామచంద్రయ్య చురకలు వేశారు. ముఖ్యమంత్రి మంచి ఆటగాడే కానీ మంచి మంచి కెప్టెన్ కావాలని ఆయన అన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సీ రామచంద్రయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం రాయచోటిలో జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ, సీమాంధ్రలోని రెండు ప్రాంతాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. వాటికి రాష్ట్ర విభజన పరిష్కారం కాదన్నారు. వ్యక్తలు శాశ్వతం కాదని.... రాష్ట్రమే శాశ్వతమని.... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కిరణ్ వ్యాఖ్యానించారు.