విభజనకు మూలకారకుడు చంద్రబాబే: కిరణ్
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురంలో మాజీ సీఎం కిరణ్ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర విభజనకు మూలకారకుడు చంద్రబాబే అని ఆరోపించారు. చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలని ఆయన విమర్శించారు.
రాష్ట్ర విభజన విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు లేఖ ఇవ్వడమే అని కిరణ్ అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీలకు ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు. అనంతపురంలో నిర్వహించిన రోడ్ షోకు పెద్దగా ప్రజల నుంచి స్పందన కనిపించకపోవడంతో కిరణ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.