rachabanda
-
నంద్యాల అభివృద్ధి ఎలా జరిగిందో వివరించిన ప్రజలు..
-
పల్లె గుండెల్లో విజయ వీచిక
పల్లె జనాలను కుటుంబ సభ్యుల్లా వరసలు పెట్టి ఆప్యాయంగా పిలవడం, అక్కడి ఆడపడుచులతో తోబుట్టువులా కలిసిపోవడం, ఊరి కష్టసుఖాలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచించడం, రాత్రి అదే పల్లెలో నిద్రపోవడం, ఉదయం లేచి మళ్లీ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీయడం.. క్షేత్రస్థాయిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ చేసి చూపిస్తున్న కార్యక్రమాలివి. అధినేత ఆదేశాల మేరకు గ్రామగ్రామాన తిరుగుతూ పార్టీ పతాకాన్ని జనం గుండెల్లో ప్రతిష్టిస్తున్నారామె. సంక్షేమ సమాచారం చేరవేస్తూనే.. సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. పల్లె నిద్ర, రచ్చబండ పేరుతో ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆమెలోని నిఖార్సయిన రాజకీయ నాయకురాలికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బాబాయ్ బాగున్నావా..? అవ్వా ఆరోగ్యం ఎలా ఉంది..? పిల్లలూ బడికెళ్లి చదువుకుంటున్నారా..? అమ్మా.. పింఛన్ అందుతోందా..? జిల్లా ప్రథమ పౌరురాలు సాధారణ పల్లెవాసులతో మాట కలుపుతున్న పద్ధతి ఇది. జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ చేపడుతున్న పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమంలో ఇలాంటి ఆప్యాయమైన పలకరింపులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇంతవరకు ఏ మహిళా నేత చేపట్టని ఈ వినూత్న కార్యక్రమం ప్రజల మన్ననలను అందుకుంటోంది. పేరు ఒకలా తీరు మరోలా కాకుండా పల్లె నిద్ర అంటే అచ్చంగా అదే పల్లెలో నిద్రిస్తూ.. రచ్చబండపై ముఖాముఖి మాట్లాడుతూ ఆమె ఆదర్శప్రాయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రథమ పౌరురాలు పిరియా విజయ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన హోదాని పక్కన పెట్టి ఒక సాధారణ మహిళగా గ్రామస్తులతో కలిసిపోతున్నారు. సొంత మనిషిగా మెలిగి లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. గ్రామస్తులతో ముఖాముఖీ తర్వాత రాత్రి బస చేసి గ్రామాల పరిస్థితులను చూస్తున్నారు. రోజంతా గ్రామంలోనే ఉండి అక్కడి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమస్యలు తెలుసుకుని, సంక్షేమాలను వివరించి వారితో మమేకమవుతున్నారు. కార్యక్రమం జరుగుతోందిలా.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్ 30వ తేదీ నుంచి సోంపేట మండలం ఉప్పలాం సచివాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అమలు చేయడం ప్రారంభించారు. ►సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సంబంధిత గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించినవి తెలియజేస్తూ, వారికి ఇంకేం కావాలో తెలుసుకొనే ప్రయత్నం చేసి, వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపిస్తున్నారు. ►రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామస్తులు, మహిళలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకొని, వాటిని అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ►తర్వాత ఆ గ్రామస్తులతోనే రాత్రి భోజనం చేసి, అక్కడే పల్లెనిద్ర చేస్తున్నారు. ►మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచి, మహిళలతో టీ తాగుతూ వారితో రచ్చబండపై సమావేశమవుతున్నారు. ►గ్రామంలో అందుబాటులో ఉన్న టిఫిన్ చేసి మళ్లీ ఉదయం 7 గంటలకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, మిగతా ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్, గ్రామస్తులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముందురోజు మిగిలిపోయిన గడపలను తిరిగేలా మరుసటి రోజు ఉదయం 11గంటల వరకు నిర్వహిస్తున్నారు. 9 గ్రామాల్లో పల్లెనిద్ర, రచ్చబండ.. ► ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్ 30వ తేదీన సోంపేట మండలం ఉప్పలాం గ్రామంలో ప్రారంభించిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను ఇప్పటి వరకు 9 చోట్ల నిర్వహించారు. ►నియోజకవర్గంలోని ఉప్పలాం, బట్టిగళ్లూరు, గొల్లవూరు, శాసనాం, మామిడిపల్లి–1, మామిడిపల్లి–2, ఇచ్ఛాపురం మండలం డొంకూరు, అరకభద్ర గ్రామాలు, కవిటి మండలం భైరిపురం గ్రామాల్లో చేపట్టారు. వేలాది గడపలను సందర్శించారు. వందలాది సమస్యలను స్వీకరించారు. ► సోంపేట మండలం ఉప్పలాంలో 110, గొల్లవూరులో 20, టి.శాసనం పంచాయతీలో 10, మామిడిపల్లి పంచాయతీలో 30, కవిటి మండలం బైరీపురంలో 20, ఇచ్ఛాపురం మండలం టి.బరంపురంలో 10, అరకభద్రలో 10, డొంకూరులో 10 వినతులను స్వీకరించారు. ►వచ్చిన అర్జీల్లో చాలా వరకు హౌసింగ్, రేషన్‌కార్డు, డ్రైనేజీ తాగునీటి, రోడ్లు తదితరమైనవి ఉన్నాయి. ఇవన్నీ వెంటనే పరిష్కరించదగ్గ వినతులే కావడంతో అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతున్నారు. పరిష్కారాలను చూపుతూ ప్రజలతో మమేకమవుతున్నారు పిరియా విజయ. -
రచ్చబండ లో గంగుల బ్రిజేంద్ర రెడ్డి
-
రచ్చబండ: ఇదే స్ఫూర్తి.. ప్రజల పక్షాన సాక్షి..
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. ప్రజాతీర్పే అంతిమం.. ప్రభుత్వాలైనా.. రాజకీయ పార్టీలైనా ప్రజాభిప్రాయానికి తలవంచాల్సిందే.. ప్రజల అభిమతం తెలుసుకొని మసులుకోవాల్సిందే.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ఎజెండా కావాలి.. ప్రజాభివృద్ధే రాజకీయ పార్టీల జెండాగా ఎగరాలి.. ఇదే స్ఫూర్తితో సాక్షి ప్రజల పక్షాన నిలబడింది. ప్రజా గొంతుకై సాక్షి పోరాడుతోంది.. ప్రజాకోర్టులో నాయకులను నిలబెడుతుంది.. ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది.. రచ్చబండ వేదికగా ప్రజాభిప్రాయాన్ని వినిపిస్తుంది రచ్చబండ… ప్రతి శనివారం రాత్రి 7.30గంటలకు తిరిగి ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు -
వేమగిరిలో రాజన్న రచ్చబండ :ఎంపీ మార్గని భరత్
-
చంద్రబాబుకు షాకిచ్చిన ఒంగోలు మహిళ
సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడుకు ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తరుపున వచ్చిన రిలీఫ్ ఫండ్‌ను వెనక్కి ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాల పర్యటనలో భాగం సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని బడేటివారిపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానికురాలు వరమ్మ అనే మహిళ ఆ కార్యక్రమానికి హాజరైంది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి తనకు వచ్చిన చెక్కు బౌన్స్ అయిందంటూ చంద్రబాబుకు వెనక్కి ఇచ్చేసింది. దీంతో సీఎంకు అందరి మందు షాక్ కొట్టినంత పనైంది. -
అనంతలో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమం
-
రచ్చకెక్కిన ‘రచ్చబండ’
జీవన కాలమ్ చీఫ్ జస్టిస్ స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించలేదని అనుకున్నప్పటికీ... దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజారు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. బీచిలో ఓ అమ్మాయి ఎప్పుడూ కనిపిస్తూంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి లక్ష్యం చక్కగా పెళ్లి చేసుకుని భర్తకి వండిపెడుతూ సుఖంగా గడపాలని. తర్వాత ఆ అమ్మాయికి పెళ్లయింది. లక్షణంగా తాళిబొట్టుతో, పసుపుతాడుతో, భర్తతో కనిపించింది. ఆమె కల సాకా రమౌతున్నందుకు ఆనందం కలిగింది. కొన్ని నెలలు గడిచాయి. భార్యాభర్తల మధ్య పొర పొచ్చాలు ప్రారంభమయ్యాయి. భర్తమీద కారాలూ, మిరియాలూ నూరింది. నేను ఆమె పాత కలని గుర్తు చేసి, కాస్త సంయమనాన్ని పాటించమని హితవు చెప్ప బోయాను. భర్త అనుచిత ప్రవర్తనను ఏకరువుపెట్టి– హితవు చెప్పిన నామీదే కోపం తెచ్చుకుని వెళ్లి పోయింది. దరిమిలాను భార్యాభర్తల మధ్య ‘వార’ పెరి గింది. ఇప్పుడు పోలీసు డిపా ర్టుమెంటులో పనిచేస్తున్న ఆమె తండ్రి అల్లుడిని రెండు రోజులు జైల్లో పెట్టించాడు. ముందు ముందు సామరస్యం కుదిరే అవకాశాన్ని ఆ విధంగా శాశ్వ తంగా మూసేశాడు. ఆమె కలలు గన్న వ్యవస్థ– ఆమె తండ్రి సహాయంతో పూర్తిగా కూలి పోయింది. కాళ్లు కడిగి కన్యా దానం చేసిన మామ తన అల్లు డిని జైలుకి పంపితే ఆ అల్లుడు ఇక ఏ విధంగానూ జైలు శిక్షని మరిచిపోయి– ఆమెని జీవితంలోకి ఆహ్వానిస్తాడనుకోను. వ్యవస్థను గౌరవించే గాంభీర్యం, పెద్ద రికాన్ని పెద్దలే వదులుకున్నప్పుడు– ఆ వ్యవస్థ ‘పెద్ద రికానికి’ మాలిన్యం అంటుతుంది. ఈ కథకీ మొన్న నలుగురు మేధావులయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు– పత్రికల ముందుకు రావడానికీ పోలికలున్నాయని నాకనిపిస్తుంది. ఈ దేశంలో గత 70 సంవత్సరాలుగా అత్యున్నత న్యాయ వ్యవస్థగా నిలిచిన ప్రధాన న్యాయస్థానంలోని ‘అభి ప్రాయ భేదాలు’ ఒక్కసారి ప్రజల మధ్యకి రావడం దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దేశంలో న్యాయాధిపతులే అరిగించుకోలేకపోతున్నారు. ‘‘సుప్రీంకోర్టు పరిపాలనా సరళిని ఏ విధంగా పత్రికా సమావేశం సంస్కరిస్తుంది? ప్రజాభిప్రాయ సేకరణ చేసి– సుప్రీంకోర్టు నిర్వహణ సరిౖయెనదో కాదో ప్రజలు నిర్ణయించాలని ఈ సమావేశం ఉద్దేశమా?’’ అని జస్టిస్ శోధీ అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే ‘‘ఈ నలుగురి పెద్దల ఉద్దేశం ఏమిటి? ప్రజల్ని ఈ అవ్య వస్థలో జోక్యం చేసుకుని తీర్పు చెప్పాలనా? సవరణ జరపాలనా? సలహాలివ్వాలనా? ప్రధాన న్యాయ మూర్తిని బోనులో నిలబెట్టాలనా?’’ సోలీ సొరాబ్జీ, కె.టి.ఎస్. తులసి, జస్టిస్ ముకుల్ ముద్గల్ వంటివారు షాక్ అవడమే కాకుండా చాలా బాధపడ్డారు. ఒక ప్రముఖ పత్రిక– ఈ పత్రికా సమావేశం భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని పేర్కొంది. విచిత్రం ఏమిటంటే గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలోని అత్యంత ప్రముఖమైన కేసులన్నీ యాదృ చ్ఛికంగానో, కాకతాళీయంగానో జూనియర్ బెంచిలకే వెళ్లాయని ఇదే పత్రిక పతాక శీర్షికలో మరునాడు పూర్తి వివరాలతో పేర్కొంది. మరి ఇన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో తమ విధులను నిర్వహిస్తున్న ఈ గౌరవ న్యాయమూర్తులకు పత్రికలకు తెలిసేపాటి నిజానిజాలు తెలియవా? తెలిస్తే రచ్చకెక్కడానికి ఇప్పు డెందుకు ముహూర్తం పెట్టినట్టు? ఇందులో వృత్తిప రమైన, రాజకీయ పరమైన కోణాలేమైనా ఉన్నాయా? ఒకానొక రాజకీయ నాయకుడు ఒకానొక న్యాయ మూర్తి తలుపు తట్టడం వెనుక ఈ ఛాయలు తెలు స్తున్నాయా? ఇవీ ప్రశ్నలు. లేని తీగెని లాగి ఓ గొప్ప వ్యవస్థని ‘డొంక’గా రూప కల్పన చేసిన దయనీయమైన పరిస్థితిగా దీనిని భావించాలా? అని మేధావి వర్గాలు బుగ్గలు నొక్కుకుంటు న్నాయి. అయితే– ప్రధాన న్యాయ మూర్తి స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించనప్పుడు, జరుగుతు న్నది సబబు కాదని మేధావులైన న్యాయమూర్తులు భావిస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసినా చేయ లేకపోయినా దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, నిర్ణయాలకు భేషరతుగా తలవొంచే, మార్గదర్శకత్వా నికి ఎదురుచూసే– ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజా రు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. ఇలా రచ్చకెక్కడంవల్ల దేశంలో అడ్డమైనవారూ (వారిలో నేనూ ఉన్నాను)– రాజకీయ పార్టీలు సరేసరి – నోరు పారేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు అవు తుందని సంతోష్ హెగ్డే అన్నారు. ప్రతీ దిన పత్రికలోనూ సంపాదకునికి లేఖలు కోకొల్లలు. ఈ సంక్షోభాన్ని ఎవరి అవసరాలకు వారు అన్వయించు కుంటున్నారు. సంయమనం, మేధస్సు, విచక్షణ, అపూర్వమైన గాంభీర్యమూ చూపే వ్యవస్థ– అలక, కించిత్తు అస హనమూ, కోపమూ– చూపనక్కరలేని, చూపినా ఉప యోగం లేని, చూపకూడని స్థితిలో రచ్చకెక్కడం– తొందరపాటుతో ఒకటి రెండు మెట్లు దిగి వచ్చిందని, ఆ మేరకు ‘వ్యవస్థ’ పరపతి– దిగజారిందని భావిం చడంలో ఆశ్చర్యం లేదు. -గొల్లపూడి మారుతీరావు -
జన్మభూమి అట్టర్ ఫ్లాప్: శిల్పా
సాక్షి, కర్నూలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పాదయాత్ర సూపర్ హిట్.. జన్మభూమి అట్టర్ ఫ్లాప్ అని వ్యాఖ్యానించారు. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం సూదేపల్లి గ్రామంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ప్రజల పాలిట కర్మభూమిగా మారిందని అన్నారు. జన్మభూమి సభల్లో జనాలు లేరన్న విషయాన్ని టీడీపీ గుర్తించాలన్నారు. అధికార పార్టీ నాయకులు జన్మభూమికి వెళ్లలేని పరిస్థితి ఉందని, వాస్తవాలు ఒప్పుకోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని పేర్కొన్నారు. క్షేత్రస్ధాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నామని, సమన్వయంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అరెస్టులు దారుణం నాలుగేళ్ళ టీడీపీ పాలనలో చేసింది శూన్యమని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య అన్నారు. అభివృద్ధిపై బహిరంగ సవాల్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదని, బహిరంగ చర్చకు టీడీపీ నాయకులు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలకు మాత్రమే జన్మభూమి కార్యక్రమం వల్ల ఉపయోగమన్నారు. ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్టు చేయడం దారుణమన్నారు. మరోసారి మోసం జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రజలను మరోసారి ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ఆయన ప్రశ్నించారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో రచ్చబండ, పల్లెనిద్ర
-
చంద్రగిరిని పట్టించుకోడు.. సింగపూర్ కడతాడట!
సాక్షి, దామలచెరువు : జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రమంతటా మాఫియా ముఠాలను ఏర్పాటుచేసి ప్రజాధనాన్ని దోచుకుంటోన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జన్మభూమి అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, చంద్రగిరిని పట్టించుకోని ఆయనే.. ఇప్పుడు సింగపూర్ కడతానని ప్రజల్ని మభ్యపెడుతుండటం దారుణమన్నారు. 55వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం చంద్రగిరి నియోజకవర్గంలోని దామలచెరువులో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏర్పాటుచేసిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్.. జనం సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. జన్మభూమికి ఏం చేశారాయన? : ‘‘సొంత ఊరిని మనందరం కన్నతల్లిలా భావిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లె, ఆయన చదువుకున్న శేషాపురం.. చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉన్నాయి. బాబుగారు చదువుకున్న స్కూలు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. గతంలో 9ఏళ్లు, ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన.. చదువుకున్న బడినే పట్టించుకోలేదు.. ఇక రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంటుదో ఊహిచవచ్చు. 70 శాతం పల్లెలకు సాగునీరేకాదు.. తాగునీరు కూడా అందని పరిస్థితి. దామలచెరువు మార్కెట్ ద్వారా ఏటా రూ.100 కోట్ల లావాదేవీలు జరుగుతాయి కానీ మార్కెట్‌కు వెళ్లేందుకు సరైన రహదారి ఉండదు. చంద్రగిరిలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం మహానేత వైఎస్సార్ ఇచ్చిన జీవోను చంద్రబాబు పక్కనపెట్టేశారు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు ఏ దేశానికి పోతే ఆ దేశంలా ఏపీని మార్చేస్తానని ప్రకటిస్తారు. ఇంకానయం.. చిత్తూరుకు సముద్రం తెస్తానని ప్రకటించలేదు!!’ అని వైఎస్ జగన్ అన్నారు. కన్నతల్లిలాంటి ఊరికి.. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు : ‘ ఇదే చంద్రబాబు 1979లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరఫున 2500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాతికాలంలో వైఎస్సార్ పుణ్యాన మంత్రి కూడా అయ్యారు. చంద్రగిరికి ఆయన చేసిన ఘనకార్యాలకు ప్రతిగా1983లో ప్రజలను ఆయనను 17,429 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశంలో చేరారు. ఓడిపోయి చచ్చినపాములా ఉన్న బాబును ఎన్టీఆర్ ఆదరించి, పదవి ఇచ్చారు. కానీ బాబు.. చివరికి ఎన్టీఆర్కే ద్రోహం తలపెట్టాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఎవరినైనాసరే వెన్నుపోటుపొడవటం చంద్రబాబు నైజం. కన్నతల్లిలాంటి ఊరిని, పిల్లనిచ్చిన మామను, సొంత తమ్ముడిని, ఓట్లు వేసిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది’’ అని జగన్ గుర్తుచేశారు. వ్యవస్థలో మార్పు ఒక్క జగన్‌తోనే సాధ్యంకాదు : రైతులు, పొదుపు సంఘాల మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, పిల్లలు.. వారువీరనే తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోన్న చంద్రబాబు నాయుడు.. అన్ని వ్యవస్థలను అవినీతిమయం చేశారని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘రుణమాఫీ చేస్తామని రైతులను, పొదుపు సంఘాల మహిళలను వంచన చేశారు. రుణాలు మాఫీ చేయకపోగా, ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ డబ్బు చెల్లించకపోవడంతో ఆ భారం జనం మోయాల్సివస్తోంది. ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగభృతి ఇస్తామని యువతను మోసం చేశారు. రాష్ట్రంలో మట్టితవ్వకాలు మొదలు ఇసుక, కరెంటు కొనుగోళ్లు, బొగ్గు, మద్యం, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములు.. అన్ని చోట్లా అవినీతి రాజ్యమేలుతోంది. ఈ దుర్మార్గ వ్యవస్థ మారాలి. మాట తప్పిన నాయకుడు రాజీనామాచేసే పరిస్థితి రావాలి. మార్పు ఒక్క జగన్‌తోనే సాధ్యంకాదు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని చంద్రబాబు తన కార్యకర్తలకు చెబుతున్నారు. మున్ముందు రాష్ట్రాన్ని నడిపించాల్సిన నాయకుడు ఎలాంటివాడైతే బాగుంటుందో మీరే ఆలోచించండి. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు ముఖ్యమంత్రి కాకూడదు. ప్రజల కోసం పనిచేసేవారికే పట్టం కట్టండి..’’ అని జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
‘కూలిపోవడానికి సిద్ధంగా చంద్రబాబు స్కూలు’
సాక్షి, దామలచెరువు: రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని, దీన్ని అంతమొందించాల్సిన అవసరముందని వైఎస్సార్సీపీ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలోనూ అవినీతి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పవిత్ర దేవాలయాల్లో క్షుద్రపూజలు చేస్తున్నారు, గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు చదువుకున్న స్కూలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను అన్ని రకాలుగా చంద్రబాబు వంచించారని అన్నారు. మళ్లీ రాజన్న పాలన రావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు వినడానికి రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన జగన్‌కు జనహారతి పలికారని, రాజన్న తనయుడిపై జనంకున్న అభిమానం, మక్కువ, ఆప్యాయతలకు ఇదే నిదర్శనమన్నారు. రాజన్న పాలన వచ్చే వరకు జగన్ వెంటే నడుస్తామని చెవిరెడ్డి అన్నారు. -
జెండా పీకితేనే... పింఛన్లు
పుత్తూరు: అధికార పార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తే చాలు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. గత నెలలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తొరూరు పంచాయతీలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆనంబట్టులో ఇంటింటికీ వైఎస్సార్ కుటుంబం నిర్వహించి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామం మొత్తం ఆమెకు బ్రహ్మరథం పట్టడాన్ని స్థానిక టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను పీకేయడంతో పాటు, ఇంటింటికీ అతికించిన వైఎస్సార్సీపీ స్టిక్కర్లను తొలగించాల్సిందేనని..లేదంటే అంతవరకు పింఛన్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే ఆర్కే రోజా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారనే అక్కసుతో ఇద్దరు సంఘమిత్రలను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తొలగించారు. ఎంపీడీఓపె రోజా సీరియస్.. దీనిపై ఎమ్మెల్యే రోజా మంగళవారం ఎంపీడీఓ నిర్మలాదేవికి ఫోన్‌చేసి విషయాన్ని ప్రస్తావించారు. ఎంపీడీఓ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారిని ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోనని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ నేరుగా వచ్చి ఎమ్మెల్యేకు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. అందుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాని ఫిర్యాదులు ఇప్పుడు ఎలా వచ్చాయని నిలదీశారు. విచారణకు తొరూరుకు వచ్చేందుకు సిద్ధమేనా ? అని నిలదీయగా ఎంపీడీఓ నీళ్లు నమిలారు. తొలగించిన సంఘమిత్రలను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఎంపీడీఓగా మీపై వచ్చిన ఆరోపణలపై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. -
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ రచ్చబండ-పల్లెనిద్ర
-
పశ్చిమ గోదావరి జిల్లాలో రచ్చబండ, పల్లెనిద్ర
-
మేమున్నామని
చిత్తూరు, సాక్షి: ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యం లో గురువారం రచ్చబండ, పల్లెనిద్ర కా ర్యక్రమాలు జరిగాయి. టీడీపీ చేస్తున్న అ రాచకాలను ప్రజలకు వివరించారు. రచ్చబండ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మండలం సంక్రాంతిపల్లెలో ఎమ్మె ల్యే సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో రచ్చబం డ పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. రేషన్‌కార్డులు, అర్హులకు పింఛన్ మంజూరు కా లేదని, గ్రామాల్లో మౌలికవసతులు క ల్పించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుం చి రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో ఎమ్మెల్యే నారా యణస్వామి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. ఎస్టీ రు ణాలకు దరఖాస్తు చేసుకోగా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదని, సరైన రోడ్డు సౌకర్యం లేదు, పాఠశాలకు మూడు కిలోమీటర్ల వరకు విద్యార్థులు నడిచి వెళ్తున్నారని ప్రజలు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకో వడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీ మోసపూరిత హామీ లను ప్రకటించి ప్రజలను మభ్య పెట్టిం దని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. వెదురుకుప్పం ఎస్టీకాలనీ, తంగేలిమిట్టలో రచ్చబం డ నిర్వహించి, చిన్నరెడ్డికండ్రిగ దళితవా డలో పల్లెనిద్రలో పాల్గొన్నారు. పావలావడ్డీ అమలు కావడం లేదు సదుం: తాము తీసుకున్న రుణాలకు పావలావడ్డీ అమలు కావడం లేదని బూరగమంద మహిళా స్వయం సహాయ సంఘ సభ్యులు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొరపెట్టుకున్నారు. మండలంలోని బూరగమందలో మహిళలతో గురువారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహిం చారు. తమ గ్రామంలో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని మహిళలు కోరారు. పక్కాగృహాలు, మరుగుదొడ్ల బిల్లుల కోసం వేచి చూడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయడం లేదని తెలిపారు. గ్రామంలో మార్చిలోగా సీసీ రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వెంకటరెడ్డిని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆదేశించారు. మార్చిలోగా నిర్మించకపోతే తన నిధులతో నిర్మిస్తానని, రేషన్, పింఛన్ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పర్యటనలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, పరిష్కరించడంలో ఎందుకు అలక్ష్యం చూపుతున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీ సభ్యులు చేయడంతో అర్హులను ఎంపిక చేయడంలో వారు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం రేషన్కార్డుతోనే పలు ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని వాటి మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం తగదని తెలిపారు. జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ హనుమంతనాయక్, సూపరింటెండెంట్ నాగరాజు, ఏఓ మాధవి, ఎంపీటీసీ సభ్యుడు విజయభాస్కర్, ఏపీఎం సురేష్ పాల్గొన్నారు. -
సత్యవరంలో రచ్చబండ పల్లెనిద్ర
-
ప్రజలకు బాసటగా పల్లెనిద్ర
చిత్తూరు, సాక్షి: ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ నాయకులు చేపట్టిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు రెండో రోజైన ఆదివారమూ జిల్లావ్యాప్తంగా సాగాయి. ప్రజలకు బాసటగా పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి, తిరుపతి, పూతలపట్టు, పలమనేరు, సత్యవేడు, మదనపల్లె నియోజకవర్గాల్లో ప్రజలతో నాయకులు మమేకమయ్యారు. ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. ⇒ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తిరుపతి ఎస్టీవీ నగర్ మాతమ్మగుడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. బెల్ట్ షాపుల వల్ల కాలనీలో మద్యం ఏరులై పారుతోందని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. 2019 వరకు పెన్షన్లు, రేషన్ రాక అవస్థలు పడుతున్న ఆరుగురు నిరుపేదలకు వెయ్యి రూపాయలు, 25 కేజీల బియ్యం ఇవ్వడానికి పార్టీ నేతలు ఎస్కే బాబు, ఆంజనేయులు ముందుకు వచ్చారు. ⇒ మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సప్పిరెడ్డిగారిపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జన్మభూమి కమిటీల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్లు, రేషన్ సరుకులు అనర్హులకు దక్కుతున్నాయని వాపోయారు. సర్పంచ్ శరత్‌రెడ్డి పాల్గొన్నారు. ⇒ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి రేణిగుంటలోని తారకరామనగర్‌లో పల్లె నిద్ర చేశారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్నారు. ⇒ పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం పంచాయతీ జోగివారిపల్లిలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, పక్కా గృహాలు, రేషన్ కార్డులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. సర్పంచ్ మయూరి జగన్నా«థ్‌రెడ్డి పాల్గొన్నారు. ⇒ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్తలు సీవీకుమార్, రెడ్డెమ్మ, రాకేశ్‌రెడ్డి వీకోట మండలం గోనుమాకులపల్లె దళితవాడలో పల్లెనిద్ర చేశారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా జన్మభూమి కమిటీ సభ్యులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు వివరించారు. ⇒ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం బుచ్చినాయుడుకండ్రిగ మండలం నీర్పాకోటలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. తాగునీరు, పింఛన్లు రావడం లేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి విద్యానాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల మధ్యలో..
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి అమోఘ స్పందన లభిం చింది. పార్టీ నేతలు ఆయా గ్రామాలకు వెళ్లి వారు పడుతున్న బాధలు, సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు. దీంతో నాయకుల వద్దకు ప్రజలంతా చేరుకుని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. టీడీపీ అరాచకాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చరమగీతం పాడుతారని, ఆయన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సమస్యలు ప రిష్కారం అవుతాయని నాయకులు ప్రజల కు చెబుతున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం సోమిదలవలస గ్రామ నుంచి పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో పాదయా త్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి మశానపుట్టి, జంగాలపాడు, బొడ్డపాడు గ్రామం వరకు పాదయాత్ర జరిగింది. మశానపుట్టి, జంగాలపాడు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నవరత్నాల పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం లేకుండానే నిర్వహించడం బాబుకే చెల్లిందన్నారు. ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, యువజన విభాగం అధ్యక్షుడు గుమ్మడి రాంబా బు, జిల్లా పార్టీ కార్యదర్శులు వావిలపల్లి గోవిందరావు, మామిడి శ్రీనివాసరావు, నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. ♦ సీతంపేట మండలం సోమగండి గ్రామంలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన సమస్యలను పాలక పార్టీ నేతలు గాలికొదిలేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్.లక్ష్మి, సర్పంచ్ ఎస్. గోపాల్, పార్టీ మండల కన్వీనర్లు జి. సుమిత్రరావు, ఆరిక కళావతి తదితరులు పాల్గొన్నారు. ♦ రాజాం నగరపంచాయతీ పరిధి శిమ్మయ్యపేట గ్రామంలో ఆదివారం ఎమ్మె ల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారం కోసం ఎమ్మెల్యే సంబంధిత శాఖాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. హంగులూ, ఆర్భాటాలు, ప్రచారాలకే ప్రభుత్వం పరిమితమవుతోందని, ప్రజా సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ♦ నరసన్నపేట పోలాకి మండలం ఉర్జాం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు గ్రామంలోని సమస్యలను కృçష్ణదాస్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తున్న పథకాల ఎంపికపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పోలాకి మండలానికి చెందిన పార్టీ నాయకులు కరిమి రాజేశ్వరరావు, కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ♦ కవిటి మండలం డి.గొనపపుట్టుగ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిం చారు. ఎస్సీలకు వడ్డీలేని రుణాలు గాని, రాయితీ వడ్డీ రుణాలు గానీ లేకపోవడంతో బ్యాంకుల్లో చేసిన అప్పులకు అసలు కన్నా వడ్డీ ఎక్కువై బకాయిలు భారీగా పేరుకుపోయాయని ఎస్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో ఎస్సీ వీధికి చెందిన ఎవరైనా చనిపోతే శ్మశాన వాటిక కూడా సరైన సదుపాయాలతో లేదని, ఆధునిక హుంగులతో కూడిన శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని పలువురు మహిళలు కోరారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పీఎం తిలక్, నర్తు చామంతి, శ్యామ్‌కురియా, బి. జయప్రకాశ్, కడియాల ప్రకాశ్, తడక జోగారావు, పిట్టా ఆనంద్‌కుమార్, మడ్డు రాజారావు, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
అయ్యా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క పనీ కాలేదు. సమస్యలు చెబుదామన్నా అధికారపార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు’ అంటూ తమ సమస్యలను వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల దృష్టికి ఆయా గ్రామాల ప్రజలు తీసుకొస్తున్నారు. క్షేత్ర స్థాయికెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు రచ్చబండ, పల్లెనిద్ర పేరుతో రెండో రోజు ఆదివారం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలతో మమేకం అవుతూ సమస్యలు తెలుసుకున్నారు. నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆదివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో జిల్లాలోని ఆయా గ్రామాల్లోని దళితవాడల్లో పరిస్థితి ఏమిటి? ఏ విధంగా వారి జీవన విధానం ఉందనే విషయంపై దృష్టి పెట్టారు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, పక్కాగృహాల మంజూరు తదితర సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రజలు నాయకులు దృష్టికి తీసుకొస్తున్నారు. దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి రాగానే మీ సమస్యలు పూర్తిగా పరిష్కరించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం కారూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తాగునీటి సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాడులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ప్రసన్నకుమార్‌రెడ్డి దృష్టికి స్థానిక ప్రజలు తీసుకొచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ ముస్లింపాళెంలో స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్‌పేట మండలం అక్బరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. తాగునీటి సమస్యతో పాటు అంతర్గత రోడ్లు సమస్యను తీర్చాలని స్థానికులు కోరారు. ఉదయగరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. తాగునీటి కష్టాలతో పాటు జన్మభూమి కమిటీలతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఏమీ అందడం లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం తెగచెర్లలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిర్వహించారు. తాగు, సాగునీటికి ప్రజలు కష్టాలు పడుతున్నట్లు బొమ్మిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గూడూరు నియోజకవర్గంలోని కోట మండలం కొక్కుపాడులో స్థానిక సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సమస్యతో పాటు, పింఛన్లు అందడం లేదని స్థానికులు తెలిపారు. -
రచ్చబండ, పల్లెనిద్రతోప్రజల మధ్యకు..
ఒంగోలు అర్బన్: వైఎస్సార్ సీపీ అన్నీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటామని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శని, ఆదివారాల్లో జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పగలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో పల్లెనిద్ర చేసి ఆయా కాలనీల ప్రజల ఇక్కట్లను గుర్తించి రచ్చబండ, పల్లెనిద్రతో ప్రజల మధ్యకు.. భరోసా కల్పిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి, ప్రజలకు వచ్చే లాభాలను ప్రజలకు వివరిస్తామన్నారు. హోదాతో రాయితీలు వస్తాయని, తద్వారా పరిశ్రమలు భారీగా రాష్ట్రంలో నెలకొల్పవచ్చన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. నేడు బాలినేని ఒంగోలు రాక: వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు మండలంలోని అల్లూరు గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర చేస్తారు. -
నేరుగా ప్రజల వద్దకే..
శ్రీకాకుళం అర్బన్: ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కారానికి కృషి చేయడంలో ఎప్పుడూ ముందుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నాయకులు సన్నద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 11, 12 తేదీల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రజల సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులు రచ్చబండ కార్యక్రమం ద్వారా నేరుగా తెలుసుకుంటారు. అనంతరం నాయకులు ఆ గ్రామంలోనే రాత్రికి పల్లె నిద్ర చేస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న బాధలను, పరిస్థితులను స్వయంగా పరిశీలించిన అంశాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదించనున్నారు. తద్వారా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం పథకాలను ప్రవేశ పెట్టనున్నారు. పార్టీ నాయకురాలు రెడ్డి శాంతి తల్లికి శస్త్రచికిత్స కారణంగా పాతపట్నం నియోజకవర్గంలో 11వ తేదీన కార్యక్రమం నిర్వహించడం లేదు. అలాగే పలాస నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు అకాల మరణం కారణంగా 11 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో నాయకులు పల్లె నిద్ర చేయనున్నారు. ♦ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి గార మండలం వాడాడ, కొత్తూరు గ్రామాల్లో ధర్మాన ప్రసాదరావు శనివారం పర్యటించి పల్లెనిద్ర చేయనున్నారు. ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి సరుబుజ్జిలి మండలం కొండ్రగూడెం గ్రామంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, నరసన్నపేట మండలం నడగాం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పల్లెనిద్ర చేస్తారు. ♦ టెక్కలి నియోజకవర్గం పరిధి నందిగాం మండలం అరసబాడ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట మండలం కడగండి గ్రామంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ♦ రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఎమ్మెల్యే కంబాల జోగులు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి పల్లెనిద్ర చేస్తారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధి రణస్థలం మండలం బంటుపల్లిలో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో పల్లెనిద్ర చేస్తారు. -
నేటి నుంచి వైఎస్సార్ సీపీ రచ్చబండ, పల్లెనిద్ర
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నవంబర్ 11 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని గుంటూరు పార్లమెంట్ అ«ధ్యక్షుడు రావి వెంకటరమణ నేతృత్వంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వకర్త శ్రీకృష్ణదేవరాయలు, తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, తెనాలి, తాడికొండ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, హెనీ క్రిస్టినా, ప్రత్తిపాడు నియోజకవర్గ నేత అనీల్‌తో శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 30 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాల్సింది ఉంటుందన్నారు. తొలుత గ్రామాల్లోకి వెళ్లి అక్కడ పార్టీ జెండా అవిష్కరించి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తారని తెలిపారు. తరువాత రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చిస్తారన్నారు. ప్రత్యేక హోదా అవశ్యకతను వివరించి స్లిప్‌లలో వారితో సంతకాలు సేకరిస్తారు. అనంతరం బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. గ్రామంలో ప్రభావితం చేసే ఉద్యోగులు, కుల సంఘాల నేతలను కలుస్తారని తెలిపారు. అనంతరం గ్రామంలోనే పల్లె నిద్ర చేస్తారన్నారని వివరించారు. మధ్యలో నియోజకవర్గ స్థాయిలోని విద్యాసంస్థ విద్యార్దులతో సమావేశమవుతారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మట్లాడుతూ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. టీడీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజలను గ్రామాల్లోకి వెళ్లి పల్లెనిద్ర, రచ్చబండ ద్వారా కలుసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు సమస్యలపై బ్లూప్రింట్ తయారు చేసుకోవాలని సూచించారు. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాన్నారు. నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులతో సమావేశమై ప్రత్యేక కార్యచరణ రూపొందిచారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త కార్యక్రమాన్ని వినూత్ననంగా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. నరసరావుపేటలో... నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి రాంబాబు నరసరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చిలకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అంబటి రాంబాబునియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అ«ధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ సైతం తమ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జులతో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలపై ఇప్పటికే చర్చించారు. -
ఈ నెల 11,12న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పల్లెనిద్ర..
-
11,12 తేదీల్లో రచ్చబండ, పల్లెనిద్ర..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఈ నెల 11,12 తేదీల్లో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ శాసనసభ్యులకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు రోజుల్లో, నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమస్యలను తెలుసుకుంటూ శాసనసభ్యులు, నియోజవకర్గ సమన్వయకర్తలు ఆయా కాలనీల్లోనే నిద్ర చేస్తారు. ఆయాన నియోజవర్గాల్లో సమస్యలను, మొత్తంగా సామాజికవర్గాల వారి సమస్యలను తెలుసుకుని ఆ అంశాలను పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు వస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. -
‘రెండే రెండు పేజీలు..చెప్పినవన్నీ చేస్తాం’
-
వేంపల్లిలో ప్రజలతో వైఎస్ జగన్ రచ్చబండ
-
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చంద్రబాబులా ఉండదు
-
ఇందిరమ్మ బిల్లు బకాయిలకు లైన్‌క్లీయర్
కర్నూలు(అర్బన్): ఇందిరమ్మ గహ నిర్మాణ పథకం మూడు విడతలు, రచ్చబండ, జీఓ నెంబర్ 171 కింద నిలిచి పోయిన గహ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని గహ నిర్మాణ సంస్థ పీడీ ఎన్ రాజశేఖర్ తెలిపారు. వివిధ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలకు రూ.5.09 కోట్లు పెండింగ్‌లో ఉండగా ఆగష్టులో రూ.4.71 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు. మిగతా మొత్తాన్ని కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. బీఎల్, బీబీఎల్ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలకు కూడా బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఈ జాబితాలో 27,473 నిర్మాణాలున్నాయని, వీటికి దాదాపు రూ.14.96 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి 10రోజుల్లోగా అర్హుల జాబితా రూపొందించి పంపితే బిల్లు మంజూరవుతుందని పీడీ తెలిపారు. -
అన్నిమండలాల్లోనూ...బోగస్ రచ్చ !
ఆధార్ అనుసంధానంతో బోగస్ కార్డులు వెలుగుచూస్తున్నాయి. రచ్చబండ సభల్లో పంపిణీ చేసిన సుమారు 48 వేల కార్డుల్లో 8,493 కార్డులను బోగస్ కార్డులుగా అధికారులు గుర్తించారు. ఈ బోగస్ ‘రచ్చ’ అన్ని మండలాల్లోనూ వెలుగు చూసింది. ఆధార్ అ నుసంధానం పూర్తయిన తరువాత తెల్లరేషన్ కార్డుల్లో ఎన్ని బోగస్ కార్డులున్నాయో బయటపడనుంది. విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో అన్ని మండలాల్లోనూ బోగస్ కార్డులున్నట్టు తేలింది. అయితే ప్రస్తుతానికి రచ్చబండలో మంజూరు చేసిన కార్డుల వ్యవహరం బయటపడింది. ఇక పెద్ద సంఖ్యలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల బాగోతం కూడా త్వరలో తేటతెల్లంకానుంది. ప్రస్తుతానికి రచ్చబండ వేదికగా మంజూరు చేసిన రేషన్ కార్డుల్లో బోగస్ వివరాలు బయటపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 8,493 బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు తేలింది. 34 మండలాల్లోనూ బోగస్ కార్డులుండడం విశేషం. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పట్లో ఇబ్బడిముబ్బడిగా కార్డులు మంజూరు చేశారు. జిల్లాలో ఉన్నవారు,లేనివారు అన్న తేడా లేకుండా కార్డులు మంజూరుచేశారు. జిల్లాలో శాశ్వత నివాసం ఉండీ ఇతర ప్రాంతాల్లో రేషన్ కార్డులు పొందడంతో ఈ కార్డులు బోగస్విగా గుర్తించారు. ప్రస్తుతం ఈ నెల నుంచి ఈ కార్డులకు రేషన్ నిలిపివేశారు. ఇంత వరకూ ఈ కార్డులకు మంజూరయిన రేషన్ ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. నెల్లిమర్ల,గుర్ల, భోగాపురం మండలాల్లో రచ్చబండ బోగస్‌కార్డులు అధికంగా ఉన్నట్టు బయటపడింది. నెల్లిమర్లలో 687, గుర్లలో 645, భోగాపురంలో 610 కార్డులుండగా, తక్కువగా పాచిపెంట మండలంలో 20 మాత్రమే బోగస్ కార్డులున్నట్టు తేలింది. ఇవి కేవలం రచ్చబండ రేషన్ కార్డుల లెక్క మాత్రమే. ఇక తెలుపు రేషన్ కార్డుల్లో ఎన్ని బోగస్‌వి ఉన్నాయో గుర్తించాలంటే మరికొద్ది రోజులాగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం జిల్లాలో ఆధార్ సీడింగ్ ప్రక్రియ 80.90 శాతం జరిగింది. గతంలో ప్రతీ రోజూ 30 నుంచి 35 వేల దాకా యూనిట్ల ఆధార్ సీడింగ్ ప్రక్రియ జరుగుతుండేది. తరువాత అది పది నుంచి 15 వేలకు పడిపోయింది. నిత్యం అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఇప్పుడది 5 నుంచి ఆరు వేలకు మాత్రమే జరుగుతోంది. మరి కొద్దిరోజుల్లో సీడింగ్ప్రక్రియ నిలిచిపోనుంది. ఎందుకంటే మిగిలినవి బోగస్ కార్డులే అయ్యి ఉంటాయని, అందుకే సీడింగ్‌కు తీసుకురావడం లేదన్న అనుమానాలు అధికారులకు కలుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 85 శాతమే ఆధార్ సీడింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో మిగతా 15 శాతం రేషన్ కార్డులు బోగస్‌వేనని తెలుస్తోంది. జిల్లాలో ఉన్న 5,40,849 తెల్ల కార్డుల్లో 81,127 రేషన్ కార్డులు బోగస్ వేనని భావిస్తున్నారు. -
పింఛన్‌దారులు కనబడుటలేదు!
నీలగిరి : పింఛన్ కావాలని గగ్గోలుపెడుతున్న బాధితులు ఓవైపు ఉంటే...పెన్షన్లు మంజూరై కూడా లబ్ధిదారులు కనిపించని పరిస్థితి మరోవైపు నెలకొంది. జిల్లావ్యాప్తంగా 6,200 మంది పెన్షనర్లు గల్లంతయ్యారు. 2012లో రచ్చబండ-2 కార్యక్రమంలో పెన్షన్ల కోసం 70వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2013 అక్టోబర్‌లో నిర్వహించిన రచ్చబండ-3 కార్యక్రమంలో 55 వేల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. వీరిలో 6,200మంది పెన్షన్‌దారులు గ్రామాల్లో కనిపించడం లేదు. మంజూరైన మొదటి మూడు నెలలపాటు లబ్ధిదారుల ఖాతాలకు పెన్షన్ చెల్లించారు. కానీ గ్రామస్థాయిలో సదరు పెన్షన్‌దారులు లేకపోవడం, అడ్రస్‌లు మారడం వంటివి జరిగాయి. దీంతో గల్లంతైన లబ్ధిదారుల కోసం పంచాయతీ కార్యదర్శులు, పోస్టాఫీసు సిబ్బంది గ్రామాల్లో విచారణ చేసినప్పటికీ వారి జాడ కనిపించలేదు. అప్పటినుంచి వారి ఖాతాలకు పెన్షన్ పంపడం బంద్‌చేశారు. కానీ పెన్షన్‌దారుల జాబితా నుంచి వారి పేర్లను ఇంకా తొలగించలేదు. ఇప్పటికైనా సదరు లబ్ధిదారులు అందుబాటులో ఉన్న పంచాయతీ కార్యదర్శులను లేదా పోస్టాఫీసు సిబ్బందిని సంప్రదించాలని డీఆర్డీఏ పీడీ చిర్రా సుధాకర్ తెలిపారు. కొత్తమార్గదర్శకాలు జారీ డీఆర్డీఏ, ఐకేపీ ద్వారా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల నుంచి వాటిని అమలుచేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. వేలిముద్రలు నమోదు కాని వారి కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పెన్షన్లు పంపిణీ చేయాలని పేర్కొంది. వేలిముద్రలు నమోదు కాకుంటే.. 80 ఏళ్లు ఆపైబడిన వృద్ధుల విషయంలో వేలిముద్రలు సరిగా నమోదుకాకపోవడంతో బయెమెట్రిక్ మిషన్లు వీరిని లబ్ధిదారులకు గుర్తించడం లేదు. దీంతో సీఎస్పీలు, పోస్టోఫీసుల్లో వందల సంఖ్యలో వృద్ధాప్య పెన్షన్లు నిలిచిపోయాయి. ఈ విషయంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా అధికారులకు వాస్తవాలు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. కాగా ప్రస్తుతం జారీచేసిన కొత్త నిబంధనల్లో వీరికి పాత బకాయిలు మొత్తం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఇవీ... ప్రతి నెలా 1వ తేదీన ప్రారంభించి 8వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలి. వీటి వివరాలు 15వ తేదీలోగా ఎంపీడీఓలు, కమిషనర్ల ద్వారా అధికారులకు చేరాలి. బ్యాంకులు, పోస్టోఫీసులు ద్వారా పెన్షన్ తీసుకోని వారి వివరాలు 10వ తేదీన అధికారులకు తెలియజేయాలి. ఇదే క్రమంలో ఇప్పటివరకు వేలిముద్రలు సేకరించని లబ్ధిదారులు వేలిముద్రల నమోదు పరికరాలు సమకూర్చుకుని వార్డులు, డివిజన్ల వారీగా తేదీలు ఖరారు చేయాలి. సేకరించిన వేలిముద్రలను ఎంపీడీఓ కార్యాలయాల్లోని మండల కోఆర్డినేటర్లకు అందజేయాలి. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు.. వేలిముద్రలు సరిగా నమోదుకానీ వారు, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి ఇకపై ప్రత్యేక దూత ద్వారా ఇంటి వద్దనే ప్రతి నెలా 10 తేదీన పెన్షన్ ఇస్తారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వీఓలు, కౌన్సిలర్ సభ్యులుగా ఉంటారు. కమిటీలోని ఇద్దరు సభ్యులు ధ్రువీకరిస్తే పెన్షన్ ఇస్తారు. -
1,32,000 ఇళ్లు రద్దు!
హన్మకొండ : వివిధ పథకాల్లో ఇళ్లు మంజూరైనా... ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించని ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. గృహ నిర్మాణ సంస్థ వెబ్సైట్లో ఉన్న లబ్ధిదారుల జాబితాను తొలగించింది. ఫలితంగా 1,32,000 మంది లబ్ధిదారులు ఇళ్లనుకోల్పోతున్నారు. నిర్మాణాలు మధ్యలో నిలిపివేసిన 1,23,000 మంది లబ్ధిదారుల బిల్లులను విడుదల చేయాలా... ఇప్పటివరకు చెల్లించిన వరకే పరిమితం చేయాలా... అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ముందు నుంచీ అనుకున్నట్లుగానే.. ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వం అందించే సాయం సరిపోక ఇంటి నిర్మాణాలను ప్రారంభించకుండా ఉన్న సామాన్యుల ఇళ్లు రద్దయ్యూరుు. సదరు లబ్ధిదారులకు తాజా జాబితాలో అవకాశం కల్పిస్తారా... అనే అంశం ప్రశ్నార్థకంగానే మిగిలింది. గృహ నిర్మాణ సంస్థ అధికారులు సైతం ఎ టూ చెప్పలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ పథకంలో మూడు విడతలు, రచ్చబండ సభల్లో 4,30,000 ఇళ్లు మంజూరయ్యూరుు. ఇప్పటివరకూ 1,32,000 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదు. వీటిలో ఎక్కువగా రచ్చబండ సభల్లో మంజూరైనవే. రదైన వాటిలో ఇందిరమ్మ మూడు విడతల్లో మంజూరైన 62,000, రచ్చబండ సభల్లో మంజూరైన 70,000 ఇళ్లు ఉన్నారుు. గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సాయం సరిపోవడం లేదనే కారణాలతో సదరు లబ్ధిదారులు నిర్మాణాలు మొదలుపెట్టలేదు. ఫిబ్రవరి 24 నుంచి ‘ఆన్లైన్’కు తాళం ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సంస్థ ఆన్‌లైన్‌కు తా ళం పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఇంటి బిల్లు కూడా మంజూరుకు నోచుకోలేదు. ఫిబ్రవరి 24కు ముందే బేస్మెంట్, స్లాబ్ లెవల్ వరకు బిల్లులు చెల్లించేందుకు దాదాపు 31,000 ఇళ్ల రికార్డులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించిన బిల్లులు సైతం విడుదల కాలేదు. తాజాగా ప్రభుత్వం జిలాలో పెండింగ్‌లో ఉన్న 1,32,000 ఇళ్లను ఆన్లైన్ జాబితా నుంచి తొలగించింది. ఇవెట్లా..? మరో 1,23,000 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నారుు. బేస్మెంట్ నుంచి ఆర్ఎల్, స్లాబ్ లెవల్ వరకు నిర్మించి మధ్యలో నిలిచిపోరుున ఇళ్లున్నాయి. వీటిని యధావిధిగా కొనసాగిస్తారా... లేక ఇప్పటివరకు బిల్లులు చెల్లించి వదిలేస్తారా... అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏ దశలోనైతే నిర్మాణం ఆగిపోరుుందో అక్కడివరకు మాత్రమే బిల్లులు చెల్లిస్తారని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 1.23 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయినట్లే. కొత్తవి ఎప్పుడో.. రచ్చబండ సభలతోపాటు గ్రీవెన్స్‌సెల్, వివిధ కార్యక్రమా ల్లో కొత్త ఇళ్ల కోసం 1,43,000 దరఖాస్తులు వచ్చాయి. వాటి ని గ్రామస్థాయిలో పరిశీలించిన అధికారులు 1,21,000 మం దిని అర్హులుగా తేల్చారు. వాటికి అప్పుడో,ఇప్పుడో ఇళ్ల ను మంజూరు చేస్తారని దరఖాస్తుదారులు ఆశతో ఉన్నారు. ఈ జాబితాను తొలగించి, కొత్తగా దరఖాస్తులు తీసుకుని... ప్ర భుత్వ నిబంధనలకనుగుణంగా పరిశీలన చేసిన అనంతర మే కొత్త ఇళ్లుమంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
వచ్చే నెల వెచ్చాలు వచ్చేనా?
మండపేట : మూడో విడత రచ్చబండ రేషన్ కూపన్ల కాలపరిమితి ముగిసింది. కొత్త కూపన్ల జారీ లేదా శాశ్వత రేషన్ కార్డుల మంజూరుపై ప్ర భుత్వం ఇంకా నోరు మె దపడం లేదు. ఫలితంగా రానున్న నెలకు రేషన్ సరుకులు వస్తాయో, లేదోనని బడుగుజనం కలవరపడుతున్నారు. కొత్త కార్డులు ఇస్తారో లేక కూపన్లతోనే సరిపెడతారోనన్న శంకా వారిని పీడిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో రచ్చబండ ద్వారా రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. గత నవంబరులో నిర్వహించిన మూడో విడత రచ్చబండలో తెల్లకార్డులకు మరో 87,477 మందిని ఎంపిక చేశారు. అంతకు ముందు రచ్చబండ రెండు విడతల్లో టీఏపీ, ఆర్ఏపీ కోడ్ నంబర్లతో కార్డులు జారీ చేశారు. ఆ కోడ్ నంబర్లతో తొలుత కూపన్లు, తర్వాత శాశ్వత కార్డులు మంజూరు చేశారు. ఫలితంగా లబ్ధిదారులకు రేషన్ సరుకులతో పాటు ఇతర సౌకర్యాలు పొందే వీలు కలిగింది. మూడో విడతలో 87,477 మంది లబ్ధిదారులకు డిసెంబరు నుంచి నెలకు ఒకటి చొప్పున ఏడు కూపన్లు అందజేశారు. కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే ఈ కూపన్లు ఉపయోగపడ్డాయి. ప్రతి నెలా ఒక కూపన్ తీసుకువెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వారు. శాశ్వత కార్డులు మంజూరు చేయకపోవడంతో ఈ విడత లబ్ధిదారులకు మిగిలిన సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. మళ్లీ కూపన్లయినా ఇస్తారా? గత డిసెంబరు నుంచి ఏడు నెలలకు పంపిణీ చేసిన కూపన్ల గడువు జూన్‌తో ముగుస్తోంది. రానున్న నెల నుంచి సరుకులు తెచ్చుకోవాలంటే కొత్తగా కూపన్లు ఉండాలి. అందుకోసం ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు కూపన్లు లేదా శాశ్వత కార్డులు మంజూరు చేయాలి. ఇప్పటి వరకు కూపన్లా లేక శాశ్వత కార్డులా అన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయమై ఉన్నతస్థాయి నుంచి ఇంకా స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడో విడత రచ్చబండ లబ్ధిదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జూలై నుంచి సరుకులు అందుతాయే లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు యథావిధిగా సరుకులు అందించాలని, ఇతర పథకాలు పొందేందుకు వీలుగా శాశ్వత కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. -
ఏంచేసుకోవాలె..!
పాలకులు హడావిడిగా చేపట్టే పనులు ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండలో మంజూరు చేసిన తెల్లరేషన్ కార్డులు గొప్పలు చెప్పుకోవడానికే తప్ప.. దేనికీ పనికిరాకుండా అలంకారప్రాయంగా మారాయి. సరుకులకు తప్ప.. మరే అవసరానికి ఉపయోగపడడం లేదు. సంక్షేమ పథకాలకు వర్తించకపోవడంతో అర్హులు అయోమయంలో ఉన్నారు. రేషన్‌కార్డులను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. - న్యూస్‌లైన్, చిలుకూరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో అర్హులైన వారిని గుర్తించి తెల్లరేషన్ కార్డులు, కూపన్లు మంజూరు చేశారు. అయితే ఆ రేషన్‌కార్డులు సంక్షేమ పథకాలకు వర్తించడం లేదు. దీంతో అర్హులైన ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికంటే ముందు మంజూరు చేసిన పీఏపీ(పింక్ కార్డు) కూపన్ల పరిస్థితీ అంతే ఉంది. ఆరోగ్యశ్రీ, వివిధ రకాల పెన్షన్లు, బంగారుతల్లి, ఇందిరమ్మ ఇళ్లు మరే ఇతర పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా తెల్లరేషన్ కార్డు అవసరం ఉంది. రేషన్‌కార్డులను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 75వేల కార్డుల జారీ రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి వారికి మూడో విడత రచ్చబండలో ర్యాప్ (రచ్చబండ కూపన్లు)కార్డులు పంపిణీ చేశారు. ఆ కార్డుల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సంబంధింత శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోలతో డిసెంబర్ 2013 నుంచి 2014 జూన్ వరకు ఏడు నెలలపాటు వీటిని పంపిణీ చేశారు. ర్యాప్ పేరుతో మంజూరైన ఈ కూపన్లు రేషన్‌సరుకులకు మినహా ఇతర సంక్షేమ పథకాలకు ఉపయోగపడకుండా పోయాయి. అ కార్డుల కాలపరిమితి ఈ నెలతో పూర్తవుతుంది. అప్పుడు జిల్లావ్యాప్తంగా 75వేలకు పైగా ర్యాప్ పేరుతో రచ్చబండ-3లో మంజూరు చేశారు. అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డులు వర్తించేలా చూస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో మాత్రమే అమలుచేయలేదు. ఫలితంగా అన్ని అర్హతలు ఉండీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నామని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ ప్రభుత్వంలోనైనా.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పింది. ముందుగా ఇలాంటి ఇబ్బందులు ఉన్న ర్యాప్, పీఏపీ కూపన్లు పరిస్థితిని పరిశీలించి వాటి స్థానం కొత్తవి ఇవ్వడమా లేదా వాటినే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వర్తించేలా చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. అయితే రచ్చబండ కార్డులలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోలు ఉన్నాయి కాబట్టి వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని కోరుతున్నారు. -
వాతాపి జీర్ణం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో రేషన్ అదనపుకోటా గుట్టుగా మా యమవుతోంది. ఈ తతంగం మూడునెలలుగా జరుగుతున్నా పట్టించునేనాధుడే లేడు. మూడోవిడత రచ్చబండ కార్యక్రమంలో జిల్లాకు 1,32,515కూపన్లు మంజూరు కాగా, వీటిలో 1,16,187 కూపన్లను మాత్రమే పంపిణీ చేసి, 16,328 కూపన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు ధ్రు వీకరిస్తున్నారు. వెనక్కి తీసుకున్నవాటిలో ఒకరు ఉన్నవి 1582, ఇద్దరు గలవి 4216, ముగ్గురికి సంబంధించి 3856, నలుగురు 4081, ఐదుగురు ఆ పైగా కుటుంబసభ్యులు ఉ న్న కూపన్లు 2593 ఉన్నాయి. వీటికి సంబంధించి నెలకు రెం డువేల క్వింటాళ్ల బియ్యాన్ని యథాతదంగా పంపిణీ చేస్తున్నారు. ఇలా ప్రతినెలకు 18వేల మెట్రిక్‌టన్నుల చొప్పున జి ల్లాకు కేటాయిస్తున్నారు. అయితే పంపిణీ చేయని రేషన్కూపన్లపై వస్తున్న బియ్యంకోటాను డీలర్లతో కుమ్మకై పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈమూడునెలల పాటు బియ్యం అక్రమవ్యాపారం గుట్టుగా సాగుతోం ది. ఇదిలాఉండగా, ప్రతినెలా రేషన్‌షాపులపై దాడులుచేసి, నిల్వ, విక్రయస్టాక్ తేడాలు ఉన్న వారిపై కేసులు నమోదుచే సే అధికారులకు ఈ కోటా కనిపించడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. అధికారులు కావాలనే ఈ కోటాను పట్టించుకోవడం లేదనే సందేహం అందరిలోనూ నెలకొంది. కానీ ఈ దీన్ని అరికట్టాల్సిన రెండుశాఖలు మాత్రం ఈకోటాపై అశ్చర్యాన్ని కలిగిందే రీతిలో సమాధా నం చెబుతున్నారు. జిల్లాకు వచ్చే కోటాను డీడీల ప్రకారమే అందిస్తామని సివిల్ సఫ్లై కార్పొరేషన్ చెబుతుండగా, సకాలంలో డీడీలను కట్టించడమే తమ బాధ్యత అని సివిల్సఫ్లై శాఖ చెబుతోంది. ఈరెండు శాఖలు ఇలా చెబితే అడ్డుకట్టవేసేదెవరు? అక్రమార్కులపై చర్యలు తీసుకునేదెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. కూపన్ల డబ్బులు పెండింగే! ప్రతికూపన్ పంపిణీ చేసేటప్పుడు సంబంధిత లబ్ధిదారుల నుంచి ఐదు రూపాయలు వసూలు చేస్తారు. ఇలా వసూలు చేసిన డబ్బును కూడా పెండింగ్‌లోనే ఉంచారు. మంజూరైన కూపన్లకు సంబంధించి రూ.5,80,935 రావాల్సి ఉండగా, ఇంతవరకు రూ.3,01,860 చెల్లించారు. ఇక పంపిణీ చేయని కూపన్లకు సంబంధించి రూ.81,640 మినహా, రూ.1,97,435ను పెండింగ్‌లో పెట్టారు. వీటిని ఎవరు చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారో అధికారులకే తెలియాలి. -
రచ్చబండ కార్డులకు కిరోసిన్ ఏదీ ?
గుడివాడ, న్యూస్‌లైన్ : రచ్చబండలో రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు రెండు నెలలైనా నీలి కిరోసిన్ అందడం లేదు. తెల్ల కార్డులు ఇచ్చి తమను గాలికొదిలేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేయకపోవడంతో వంట చేసుకోవడానికి, ఇంట్లో దీపాలు వెలగించుకునేందుకు సైతం వారు ఇబ్బందులు పడుతున్నారు. 59,920 మంది లబ్ధిదారులు... గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండేళ్ల క్రితం తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డులు అందజేశారు. జిల్లాలో 59 వేల 920 మందికి ఈ కార్డులు అందాయి. వీరందరికీ గత నెలలోనే రేషన్ సరకులు అందాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, డీలర్ల అలసత్వం ఫలితంగా అనేకచోట్ల కొత్త కార్డులు పొందినవారికి డిసెంబర్ రేషన్ సరకులు అందలేదు. మరికొన్నిచోట్ల లబ్ధిదారులకు కార్డులు కూడా చేరలేదని సమాచారం. జనవరిలో అన్ని రేషన్ సరకులు ఇచ్చినా డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన నీలి కిరోసిన్ ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఈ కార్డులకు జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష లీటర్లకు పైగా కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కిరోసిన్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉం దని, ఎక్కడా ఇంతవరకు సరఫరా కాలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త కార్డులకు కిరోసిన్ సబ్సిడీ విడుదలైతేనే కోటా కేటాయింపులు జరుగుతాయని అధికారులు సమాధానం ఇస్తున్నారు. నిరుపేదల అవస్థలు... సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేయకపోవడంతో నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారు. అసలే కరెంటు కోత తో దీపాలు వెలిగించటానికి, ఇంట్లో వంట చేసుకునేందుకు కావాల్సిన కిరోసిన్‌ను బహిరంగ మార్కెట్లో లీటరు రూ.40తో కొంటున్నామని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి కొత్త కార్డుదారులకు నీలి కిరోసిన్ అందేలా చూడాలని కోరుతున్నారు. -
రచ్చబండ కార్డులకు ఉత్తచేయి!
సాక్షి, రాజమండ్రి : రచ్చబండలో మంజూరు చేసిన కొత్త రేషన్‌కార్డులకు సర్కారు మళ్లీ మొండిచేయి చూపించింది. పాతవారికి ఆలస్యంగా రేషన్ ఇచ్చి కొత్తవారికి ఇంకా పంపిణీ చేయలేదు. దీంతో పండుగకు ఏం తినాలని పేదలు ప్రశ్నిస్తున్నారు. కాగా పాత కార్డులకు కూడా బియ్యం తప్ప మిగిలిన సరుకులు అరకొరగా పంపిణీ చేయడంతో పండుగను ఎలా జరుపుకోవాలని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2561 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు14.50 లక్షల తెలుపురేషన్ కార్డులున్నాయి. గత రచ్చబండలో మరో లక్షకు పైగా కార్డులు మంజూరు చేశారు. వీరిలో పాత కార్డుదారులకు ఈ నెల ఆరవ తేదీ వరకూ బియ్యం, పంచదార పంపిణీ చేశారు. కానీ కొత్త కార్డులకు మాత్రం ఇప్పటి వరకూ డిపోలకు సరుకులు చేరలేదు. దీంతో పండుగ సరుకు ఇంకెప్పుడిస్తారని కార్డుదారులు అడుగుతున్నారు. పండుగ సెలవుల నేపథ్యంలో కొత్త కార్డులకు సరుకు ఇవ్వాలంటే ఒక్క సోమవారం మాత్రమే మిగిలి ఉంది. కానీ సుమారు 80 శాతం రేషన్‌డిపోలకు ఇంకా సరుకులు చేరలేదు. ఒక్క సోమవారం సరుకులు డిపోలకు పంపడం, కార్డుదారులకు అందచేయడం సాధ్యంకాని పరిస్థితి అని డీలర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పండుగలోపు కొత్త కార్డులకు జనవరి రేషన్ అందే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఇతర సరుకులదీ అదే దారి బియ్యం, పంచదార, కిరసనాయిల్ తప్ప డిపోలకు కందిపప్పు, పామాయిల్ తదితర మిగిలిన ఆరు వస్తువుల పంపిణీ అరకొరగా సాగుతోంది. దీంతో తాము కార్డుదారులకు సమాధానం చెప్పలేక పోతున్నామని డీలర్లు అంటున్నారు. ప్రతినెలా కందిపప్పు సాధారణ రేషన్ సమయం దాటిపోయాక పంపిణీ చేస్తున్నారు. దీంతో అది ఎప్పుడు వస్తుందో తెలియని కార్డుదారులు కేవలం ఇతర వస్తువులకు డిపోల వెంట పదే పదే తిరగలేక సరుకు తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో కొన్ని డిపోల్లో సరుకులు నిల్వ ఉండిపోయి పాడైపోతున్నాయి. దీనిని ఆసరాగా తీసుకుని తాము పంపిణీ చేసినా అమ్మహస్తం ఇతర సరుకులు జనం తీసుకోవడం లేదని అధికారులు చెప్పుకొస్తున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై పంపిణీ అధికారులను ప్రశ్నించగా ఇప్పటికే కొన్ని డిపోలకు సరుకులు తరలించామని పండుగ లోపే మిగిలిన డిపోలకు వెచ్చాలు తరలించి సరుకు ఇస్తామని చెబుతున్నారు. పండుగ తర్వాతైనా సరుకులు తీసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. డీలర్లు మాత్రం ‘ప్రతి నెలా 15వ తేదీలోగా సరుకులు పంపిణీ చేసి ఆ తర్వాత నివేదికలు అధికారులకు సమర్పించి మరుసటి నెలకు వెచ్చాలకు సొమ్ములు చెల్లించవలసి ఉందని, నెలాఖరు వరకూ డిపోలకు సరుకులు తరలిస్తూనే ఉంటే ఎలా పంపిణీ చేసేద’ని అడుగుతున్నారు. కాగా కొందరు డీలర్లు సకాలంలో సరుకులకు డీడీలు తీయకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంటోందని జిల్లా పంపిణీ అధికారులు చెబుతున్నారు. ఇలా ఎవరి వాదనలను వారు బలపరుచుకుంటున్నారు త ప్ప మాకు మాత్రం సకాలంలో సరుకులు ఇవ్వడంలేదని జనం ఆవేదన వ్యక్త చేస్తున్నారు. -
అన్నీ ఒట్టిమాటలే!
సాక్షి, కడప: ఇటీవల నిర్వహించిన రచ్చబండలో 50 యూనిట్లలోపు కరెంటు వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు, పాతబకాయిల మాఫీ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎస్సీ, ఎస్టీల పాత బకాయిలు మాఫీ చేసేసినట్లుగా ప్రకటించారు. 50 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు సరఫరా కూడా అమల్లోకి వచ్చిందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క పాతబకాయి కూడా మాఫీ కాలేదు. 50 యూనిట్ల లబ్ధి కూడా దరిచేరలేదు. పేరుకే రాయితీ పరిమితమైంది. ప్రభుత్వం ప్రకటించినా... సబ్‌ప్లాన్(ఉప ప్రణాళిక) నిధులతో ఎస్సీ, ఎస్టీలకు గత మార్చి వరకు ఉన్న పాతబకాయిలన్నింటినీ మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా జూన్ నుంచి 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకానికి పైసా చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. జిల్లాలో 6.45 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారనే లెక్కను ఇప్పటి వరకూ ఎస్పీడీసీఎల్ అధికారులు తేల్చలేదు. విద్యుత్‌శాఖ, సాంఘిక సంక్షేమశాఖల నడుమ సమన్వయం కొరవడటంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలుస్తోంది. సాంఘిక సంక్షేమశాఖ నుంచి ఒక్క రూపాయి నిధులు విడుదల కాలేదని కరెంటోళ్లు చెబుతుంటే.. ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల వివరాలు తమకు ఎస్పీడీసీఎల్ అధికారులు అందజేయలేదని సాంఘిక సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. రూ. 97లక్షలు నిధులు మంజూరైనా ఈ ఏడాది మార్చి వరకూ ఎస్సీ, ఎస్టీల పాత బకాయిలు మాఫీ చేసేందుకు సబ్‌ప్లాన్ కింద 97లక్షల రూపాయల నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. వీటిని విద్యుత్‌శాఖకు సర్దుబాటు చేయకుండా సాంఘిక సంక్షేమశాఖలకు విడుదల చేశారు. నేరుగా పాతబకాయిలు మాఫీ చేయకుండా కుల ధ్రువీకరణ పత్రం మెలిక పెట్టారు. సర్వీస్‌కు సంబంధించిన వివరాలు, కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తేనే పాత బకాయిలు మాఫీ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ సర్వీసులు, కులధ్రువీకరణ పత్రాలు తీసుకుని వాటిని ఆన్లైన్ చేసిన తర్వాత ఉచిత విద్యుత్ అమలు జాబితాలోకి వినియోగదారులు వస్తారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి ఎంతకాలం పడుతుందో తెలీని పరిస్థితి. దీంతో బకాయిలు మాఫీ అయిపోయాయయని సంతోషపడిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నెత్తిన బకాయిల కత్తి వేలాడుతూనే ఉంది. 50 యూనిట్లకు రాయితీ ఏది? ఈ ఏడాది జూన్ నుంచి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకం ఉచితమని ప్రకటించినా ఇప్పటి వరకూ ఒక్కరికీ రాయితీ సర్దుబాటు కాలేదు. జూన్ నుంచి నవంబర్ వరకూ 50 యూనిట్లలోపు విద్యుత్ వాడిన వారి వివరాలు కూడా లేవు. తాజా బకాయిల వారి నుంచి 50 యూనిట్ల రాయితీని మినహాయిస్తామని చెప్పినా ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. 50 యూనిట్లకు ఒక్కటి మించినా ఉచిత విద్యుత్తు పథకానికి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అర్హత కోల్పోతాయి. ఒక బల్బు, టీవీ, ఫ్యాన్ ఉన్న కుటుంబం పొదుపుగా కరెంటు వాడితే 50 యూనిట్లు ఖర్చవుతుంది. ఇవి కాకుండా మరో బల్బు పెరిగినా 50 యూనిట్ల అంకె దాటుతుంది. అందుకే 50 యూనిట్లకు మించకుండా బడుగులు కరెంటును వాడుకోవాల్సిన పరిస్థితి. ఒక్కో ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి నెలకు 50 యూనిట్ల చొప్పున ఏడాదికి 600 యూనిట్ల విద్యుత్తు వాడకానికి రాయితీ అందిస్తే ఎక్కువ కుటుంబాలకు మేలు జరుగుతుందని కొందరు ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మాకు సరైన గణాంకాలు ఇవ్వలేదు: పీఎస్ఏ ప్రసాద్, జేడీ, సోషియల్ వెల్ఫేర్. జిల్లాలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉన్నారనే వివరాలను ఎస్పీడీసీఎల్ అధికారులు కచ్చితమైన వివరాలను అందజేయలేదు. కొన్ని అందజేసినా అవి తప్పులుగా ఉన్నాయి. దీంతో మేం నిధులు విడుదల చేయలేకపోయాం. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సంబంధించి సరైన గణాంకలను అందిస్తే మేం నిధులు విడుదల చేస్తాం: కచ్చితమైన వివరాలు అందలేదు: గంగయ్య, ఎస్ఈ, ఎస్పీడీసీఎల్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఎంతమంది ఉన్నారనే వివరాలను పూర్తిస్థాయిలో సేకరించలేకపోయాం. దీంతోనే ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఇప్పటి వరకూ మాకు ఒక్క రూపాయి నిధులు అందలేదు. మళ్లీ సర్వే చేయించి పూర్తిస్థాయి వివరాలు తెప్పిస్తాం. ఎస్సీ, ఎస్టీలంతా మీటర్లు అమర్చుకుంటే ఉచిత విద్యుత్‌ను అందిస్తాం. అందరూ చైతన్యంతో మీటర్లు అమర్చుకోవాలి. -
రేషన్ రాలె!
సాక్షి, మంచిర్యాల: జిల్లా వ్యాప్తంగా 6,54,782 రేషన్‌కార్డులు ఉన్నాయి. గత నెల 11న నిర్వహించిన రచ్చబండలో రేషన్‌కార్డులు లేని నిరుపేదలకు అధికారులు కూపన్లు అందజేశారు. ఈ కూపన్లపై బియ్యం, నూనె, చక్కెర, చింతపండు, ఉప్పు ఇవ్వాలి. రచ్చబండ కూపన్లు ఇచ్చిన తర్వాత జిల్లాకు బియ్యం, చ క్కెర కోటా పెరిగింది. పెరిగిన రచ్చబండ కార్డుదారులకు అనుగుణంగా సరిపడా కోటా మండల లెవల్ స్టాకిస్ట్(ఎంఎల్ఎస్) పాయింట్లకు చేరిందని పౌరసరఫరాల అధికారులు చెప్తున్నారు. కానీ, ఎంఎల్ఎస్ పాయింట్లలో కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఉండడంతో రేషన్‌డీలర్లు ఆ సరుకులు మాత్రమే తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. దీంతో రెండు సరుకులు ఇస్తుండడంతో పామాయిల్, పప్పు మిగతా సరుకుల కోసం లబ్ధిదారులు రేషన్డీలర్లను నిలదీస్తున్నారు. డీడీలు తీసేందుకు మొండికేస్తున్న డీలర్లు సాధారణంగా రేషన్‌డీలర్లు తమకు కేటాయించిన నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ప్రతి నెల 25వ తేదీలోగా డీడీలు తీసి అధికారులకు సమర్పిస్తారు. ఒకటో తేదీలోపు వారి రేషన్ కోట ఆయా షాపులకు చేరుతుంది. ఒకటో తేదీ నుంచి 15వ తేది వరకు డీలర్లు సరుకులు పంపిణీ చేస్తారు. అయితే.. చాలా ప్రాంతాల్లో రేషన్ డీలర్లు ఈ నెల పెరిగిన కోటా గురించి తెలియక పాత కోటా ప్రకారమే డీడీలు చెల్లించి సరుకులు తీసుకున్నారు. ఇంకొందరు పెరిగిన కోటా తీసుకునేందుకు నిరాసక్తత ప్రదర్శించారు. పాత కోటాకే సరిపడా డీడీ చెల్లించారు. మందమర్రి పట్టణంలో 1,134, మండలంలో 375 మందికి రచ్చబండలో కూపన్లు ఇచ్చారు. వీరిలో 16 మంది డీలర్లకు నాలుగైదు కార్డులలోపు కేటాయించారు. మిగిలిన వారికి 20 పైనే ఉన్నాయి. తక్కువ కార్డులున్న డీలర్లు గత నెలలో కూపన్ల సరుకులకు సంబంధించిన డబ్బులకు డీడీలు చెల్లించకుండా పాత కోటా ప్రకార మే డీడీ తీసి నిత్యావసర వస్తువులు పొందారు. దీంతో 60కిపైగా కూపన్‌దారులకు రేషన్ అందలేదు. నార్నూర్ మండలంలో 411 మందికి కూపన్లు జారీ చేస్తే.. ఒక్కరికి కూడా సరుకులు రాలేదు. కోటా విడుదల చేశాం.. - వసంత్‌రావు దేశ్‌పాండే, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మూడో విడత రచ్చబండలో జారీ చేసిన కూపన్లకు సంబంధించిన సరుకులు విడుదల చేశాం. అయినా డీలర్లు సరుకులు ఎందుకు ఇవ్వడం లేదో మాకు తెలియదు. ఇప్పటి వరకు మాకు ఫిర్యాదులేవీ రాలేదు. కోటా మంజూరు చేయించుకున్న డీలర్లు లబ్ధిదారులకు వెంటనే సరుకులు ఇవ్వాలి. -
‘సర్వే’శా నీవే దిక్కు!
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాక్కున్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దరఖాస్తు చేసిన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తోంది. అనర్హుల పేరిట చాలా ఇళ్లు రద్దు చేయాలన్న యోచనతోనే మళ్లీ సర్వే చేస్తున్నారని మూడో విడత రచ్చబండలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక సర్వే అధికారులపై భారం వేసి బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. మొదటి, రెండో విడతల రచ్చబండ సందర్భంగా సర్వే నిర్వహించి, అర్హులను తొలగించి ఇళ్లు మంజూరు చేశారు. ఆ రెండు విడతల్లో లక్షా 80 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 50 వేల మందిని అనర్హులుగా ప్రకటించారు. తరువాత నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున తొమ్మిది నియోజకవర్గాల్లో 18 వేల మందికి, తరువాత మరో ఎనిమిది వేల మందికి కలిపి మొత్తం 26 వేల మందికి ఇళ్లు మంజూరు చేసి చేతులు దులిపేసుకున్నారు. మిగిలిన లక్షకు పైబడిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. అయితే ఏ ప్రయోజనం ఆశించో.. ఏమో.. మూడో విడతలో జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 62 వేల మందికీ ఎటువంటి సర్వే లేకుండానే ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొదట, రెండో విడత కలిపి కేవలం 26వేల ఇళ్లు మంజూరుచేయగా మూడో విడతలో పెద్ద ఎత్తున 62 వేల మందికి ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఇల్లులేని నిరుపేదలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే వారి సొంత ఇంటి కల నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. అంత భారాన్ని మోయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా లేదు. ఆ సంఖ్యను తగ్గించేందుకు యత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నారు. రద్దుకు యత్నాలు 62 వేల ఇళ్లకు బిల్లులు చెల్లించవలసి వస్తే సుమారు రూ.450 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని భరించేందుకు సర్కార్ పెద్దలు ఇష్ట పడటం లేదని తెలిసింది. భారం తగ్గించుకోవడానికి వీలుగా అనర్హుల పేరుతో జాబితాను తగ్గించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ముగ్గురు అధికారులతో సర్వే: తహశీల్దార్, ఎంపీడీఓ, మండల గృహనిర్మాణశాఖ ఏఈలతో కూడిన బృందం సర్వే ప్రారంభించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతకు ముందు ఇల్లు మంజూరు అయిందా, అయితే ఏ పథకంలో మంజూరయింది వంటి వివరాలతో కూడిన సర్వేను చేపడుతున్నారు. సర్వే సభ్యులు అనర్హులుగా తేల్చితే వారి ఇంటిని రద్దుచేస్తారు. గతంలోనూ ఇంతే సకాలంలో నిర్మించలేదన్న కారణంతో ఇందిరమ్మ, ఫేజ్-1, 2, 3 లలో మంజూరయిన వాటిలో జిల్లా వ్యాప్తంగా 25 వేలు ఇళ్లను 2012లో రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్త వారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు ఒక్కరి కూడా మంజూరు చేయలేదు. సర్వే విషయాన్ని గృహనిర్మాణశాఖ పీడీ యు.కె.కుమార్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మేరకే సర్వే చేపడుతున్నామని చెప్పారు. సర్వేలో అనర్హులుగా తేలితే జాబితా నుంచి తొలిగిస్తామని తెలిపారు. -
కరుణ చూపలేరా..?
నెల్లిమర్ల/ విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలోని 34 మండలాలతో పాటు నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబరు వరకూ మొత్తం 2.60 లక్షల సంక్షేమ పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. వీటిలో 1.26 లక్షలు వృద్ధాప్య, 72 వేలు వితంతు, 35 వేలు వికలాంగ, 24 వేల వైఎస్సార్ అభయహస్తం పింఛన్లున్నాయి. అయితే గత ఏడాది కాలంగా వివిధరకాల పింఛన్లకోసం అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో పింఛన్లు మంజూరు చేయకపోతే రచ్చబండ కార్యక్రమంలో ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి వస్తుందని తెలిసి ప్రభుత్వం అక్టోబరు నెలలో 28, 194 పింఛన్లు మంజూరుచేసింది. వీటిలో 10,485 వృద్ధాప్య, 14,972 వితంతు, 2445 వికలాంగ పింఛన్లున్నాయి. మంజూరైన పింఛన్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల చేతులమీదుగా పంపిణీ చేస్తే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి లాభిస్తుందని తలచిన ప్రభుత్వం పంపిణీని నవంబరు నెలలో నిర్వహించే రచ్చబండ వరకూ వాయిదావేసింది. ఇటీవల జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రచ్చబండ సభల్లో లబ్ధిదారులందరికీ పింఛన్లకు సంబంధించిన మంజూరు ప్రతాలను అందజేసింది. ఇదే కార్యక్రమంలో రెండునెలలకు సంబంధించిన పింఛన్ల మొత్తాన్ని డిసెంబరు ఒకటిన అందజేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు సభల్లో ప్రకటించారు. దీంతో ఈ నెల ఒకటి నుంచి లబ్ధిదారులంతా పింఛన్ల కోసం ఎదరుచూస్తున్నారు. కొంతమంది ఆయా గ్రామాల్లోని పోస్టాఫీసులకు వెళ్లి పింఛను గురించి అడిగితే తమకేమీ తెలియదనే సమాధానం వస్తుండడంతో తెల్లబోతున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు సైతం తమ వద్ద సమాచారం లేదంటున్నారు. దీంతో అసలు తమకు పింఛన్లు మంజూరయ్యాయా..లేదా అని పలువురు అందోళన చెందుతున్నారు. అలాగే ప్రస్తుతం పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తుండడంతో తమకు పింఛన్లు ఎవరు అందజేస్తారో తెలియక అయోమయం చెందుతున్నారు. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యమైందని..ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పింఛన్లు అందజేయాలు కోరుతున్నారు. ఈ విషయాన్ని డీఆర్డీఏ పీడీ టి.జ్యోతివద్ద న్యూస్‌లైన్ ప్రస్తావించగా పాత పింఛన్లకు సంబంధించిన మొత్తం ఇంకా విడుదల కాలేదన్నారు. ఆ మొత్తంతోనే కొత్త పింఛన్లకు సంబంధించి నగదు విడుదలయ్యే అవకాశముందన్నారు. విడుదలైన వెంటనే పంపిణీ చేస్తామని చెప్పారు. వృద్ధురాలి పేరు జీనపాటి రాజమ్మ. నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన ఈమె ఏడాది క్రితం పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా అక్టోబరులో వితంతు పింఛను మంజూరు చేశారు. వెంటనే పింఛన్ సొమ్ము ఇవ్వకుండా గతనెలలో నిర్వహించిన రచ్చబండ సభలో రాజమ్మకు మంజూరు పత్రాలు అందజేశారు. అక్టోబరు, నవంబరు నెల లకు సంబంధించిన పింఛను మొత్తాన్ని డిసెంబరులో అందజేస్తామని అధికారు లు చెప్పారు. దీంతో ఆమె ఈ నెల రెండో తేదీన పో స్టాఫీసుకు వెళ్లారు. అయితే పింఛను గురించి తెలియదని అక్కడ చెప్పడంతో తెల్లమొహం వేసుకుని వచ్చేశారు. వృద్ధులుని పేరు అలమండ వెంకటస్వామి. కొత్తపేట గ్రామానికి చెందిన ఈయనకు కూడా ఈ ఏడాది అక్టోబరులో వృద్ధాప్య పింఛను మంజూరైంది. ఇటీవల గ్రామం లో నిర్వహించిన రచ్చబండలో అధికారులు పింఛను మంజూరు ఉత్తర్వులు అందజేశారు. అయితే పింఛను మాత్రం ఇప్పటిదాకా అందలేదు. దీంతో తనకు ఎవరు, ఎక్కడ పింఛను అందజేస్తారో తెలియక వెంకటస్వామి ఆందోళన చెందుతున్నారు. పోస్టాఫీసుకు వెళితే కొత్తపింఛన్ల గురించి తమ వద్ద సమాచారం లేదనే సమాధానం ఇచ్చారని ఆయన చెబుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ నెలకొంది. -
జనాదరణ పొందేదెలా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఇచ్చిన లేఖ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ జిల్లా నేతలు ఎంత మొత్తుకుంటున్నా ప్రజల నుంచి సానుభూతి వ్యక్తం కావడం లేదు. ఇంకోవైపు రచ్చబండ పేరుతో అధికార పార్టీ నేతలు జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానమే ఇస్తోందని చెప్పుకుంటున్నారు. ఇంకో పక్క తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు శిక్షణ శిబిరాల పేరిట మండల స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ శిబిరాలకు రాష్ట్ర స్థాయి నాయకులు హాజరై టీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తమవంతు పాత్రను పోషిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తుతుండడంతో టీడీపీ అదే బాటను ఎంచుకుంది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు బాన్సువాడ, బోధన్, నిజామాబాద్‌అర్బన్, ఎల్లారెడ్డి, ఆర్మూర్, జుక్కల్ నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం డిసెంబర్ 3న నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ అమృతాగార్డెన్లో జి ల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు కారణం ఇది దీనికి ప్రధాన కారణం అధినేత చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోవడమేనని పార్టీ శ్రేణులే నిరాశను వ్యక్తం చేస్తున్నాయి. పట్టుకోసం తమ్ముళ్లు పడరానిపాట్లు పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొంత మేరకు సంస్థాగతంగా బలపడాలని టీడీపీ జిల్లా నాయకత్వం కృషి చేసినప్పటికీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే పట్టును కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తగిన కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా నేతలు యోచిస్తున్నారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ పేరుతో ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా వారి మద్దతును కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్మూర్, జుక్క ల్ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆశించిన మేర ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. దీనికంటే ముందు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి మదన్‌మోహన్‌రావ్ 19 మండలాలలో 36 రోజులపాటు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు. అందుకే సమావేశం ఈ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈనెల మూడున జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని టీడీపీ నిర్వహించనున్నది. ఇంటింటికి తెలుగుదే శం కార్యక్రమంతో పాటు రైతు సమస్యలు, విద్యుత్ , బస్సుచార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సమావేశంలో తగిన ఉ ద్యమ కార్యక్రమాన్ని రూపొందించాలని భావిస్తోంది. ఓటరు నమోదు కార్యక్రమంపై దృష్టిసారించడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు , ప్రజావ్యతిరేక విధానాలు , అవినీతి అక్రమాలను ప్రజల్లో ఎండగట్టడం ద్వారా వారి మద్దతును పొందాలని యోచిస్తోంది. ఈ ఉద్యమాలు, పోరాటాలతో ప్రజల వద్దకు వెళ్లినప్పటికీ సరైన మద్దతు లభించని పక్షంలో రాజకీయ భవిష్యత్తు కోసం వెతుకులాట తప్పదనే భావనలో జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు. -
నవ్విపోదురుగాక..
కామారెడ్డి, న్యూస్‌లైన్ : జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య కుటుంబాల సంఖ్యను ఎప్పుడో దాటిపోయింది. తాజాగా రచ్చబండ లో జారీ చేసిన కార్డులతో కలిపి 7.74 లక్షలకు చేరిం ది. అయినా రేషన్ కార్డులు లేని కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కార్డుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న కుటుంబాలెన్నో.. రచ్చబండలో రేషన్‌కార్డుకోసం 49,746 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో రచ్చబండకు ముందు 7.01 లక్షల రేషన్‌కార్డులు ఉండేవి. మూడో విడత రచ్చబండలో 73,454 మందికి తెలుపు రంగు రేషన్‌కార్డులు మంజూరు చేస్తూ కూపన్లు పంపిణీ చేశారు. బోగస్ కార్డులతో బొక్క.. జిల్లా జనాభా 25 లక్షలు దాటింది. 5,93,234 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యకన్నా ఎక్కువగా రేషన్‌కార్డులను జారీ చేయడం గమనార్హం. తెలుపురంగు కార్డులపై ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యంతో పాటు, 9 రకాల సరుకులను సబ్సిడీపై అందిస్తోంది. కందిపప్పు, గోధుమపిండి, గోధుమలు, చక్కెర, ఉప్పు, కారంపొడి, చింతపండు, పసుపు, పామాయిల్ వంటి 292 రూపాయల విలువైన వస్తువులను 185 రూపాయలకే సరఫరా చేస్తోంది. బోగస్ రేషన్‌కార్డుల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా బొక్కపడుతోంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. చాలా చోట్ల రేషన్ డీలర్ల వద్ద బోగస్ కార్డులున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే బోగస్ కార్డులు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోం దన్న ఆరోపణలున్నాయి. ఇటీవల మాచారెడ్డిలో జరిగిన రచ్చబండ సభలో రేషన్‌కార్డు, బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఓ పేద కుటుంబం వచ్చింది. దరఖాస్తులు స్వీకరించే చోట రద్దీ ఎక్కువగా ఉండడం తో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఊపిరాడక వారి ‘బంగారుతల్లి’ మరణించింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం బోగస్ రేషన్ కార్డులను ఏరివేసి, అర్హులకు కార్డులు అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
నేటితో ముగియనున్న ‘రచ్చ’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిరసనలు, ఉద్రిక్తతల నడుమ జిల్లాలో రచ్చబండ మూడో విడత ముగింపు దశకు చేరుకుంది. తొలుత ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు రచ్చబండ నిర్వహించేలా షెడ్యూలు రూపొందించారు. మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించేలా మార్గదర్శకాలు ఖారారు చేశారు. లెహెర్ తుపాను ద ృష్టిలో పెట్టుకుని 30వ తేదీ వరకు రచ్చబండ గడువు పొడిగించారు. అయితే దుబ్బాక, గజ్వేల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు సొంత షెడ్యూలును అనుసరించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కాకుండా గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ‘రచ్చబండ’కు దూరంగా ఉన్నారు. తొలి, రెండో విడత రచ్చబండలో జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మూడో విడతలో సొంత పార్టీ నేతలే మొండిచేయి చూపారు. తొలి విడతలో వర్గల్, రెండో విడతలో మనూరు మండలం బోరంచలో జరిగిన రచ్చబండ సమావేశంలో సీఎం కిరణ్ పాల్గొన్నారు. మూడో విడత రచ్చబండలో భాగంగా సదాశివపేట మండలం వెల్టూరులో నవంబర్ 13న సీఎం కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి మినహా మిగతా కాంగ్రెస్ నేతలందరూ సీఎం కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై సీఎం కిరణ్ వైఖరికి నిరసనగా సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. పలు చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే రచ్చబండ సమావేశాలను అడ్డుకున్నారు. ఫ్లెక్సీలపై సీఎం ఫొటోలను తొలగించి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఫొటోలను అతికించారు. సీఎం సందేశాలను చదవకుండా అడ్డుకున్నారు. నామమాత్ర స్పందన మూడో విడత రచ్చబండకు ప్రజల నుంచి నామమాత్ర స్పందన కనిపించింది. రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్‌కార్డులు, పింఛన్లు తదితరాలు మంజూరులో ప్రభుత్వం తాత్సారం చేసింది. దీంతో మూడో విడత రచ్చబండ సమావేశాలపై లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక్కరు కూడా గ ృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు కోరుతూ దరఖాస్తు చేసుకోలేదు. పటాన్చెరులో 40, సంగారెడ్డిలో 131 మంది మాత్రమే ఇళ్లు మంజూరు కోరుతూ దరఖాస్తులు సమర్పించడం రచ్చబండ నిర్వహణ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. రచ్చబండలో జిల్లా వ్యాప్తంగా అందిన దరఖాస్తుల సంఖ్య, వివరాలను అధికారులు కంప్యూటరీకరిస్తున్నారు. మండల పరిషత్ అభివ ృద్ధి అధికారుల నుంచి నివేదికలు ఇంకా అందాల్సి ఉందని జిల్లా ప్రణాళిక విభాగం కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. -
రేషన్ ‘రచ్చ’
సాక్షి, కర్నూలు: మూడో విడత రచ్చబండలో కొత్త రేషన్ కార్డుల పేరిట ప్రభుత్వం హడావుడి చేసింది. కూపన్లు అందించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. వీటిని చూసి లబ్ధిదారులు ఒకింత సంతోషపడినా.. ఆ ఆనందం మూడు రోజులు కూడా నిలవలేదు. డిసెంబర్ నెలలో వీరికి బియ్యం పంపిణీపై సందిగ్ధం నెలకొనడమే ఇందుకు కారణం. రచ్చబండ సభల్లో డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ నెల వరకు చెల్లుబాటు అయ్యేలా కూపన్లను పంపిణీ చేశారు. అయితే ఈ కూపన్లకు సంబంధించి బియ్యం కోటా విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ జిల్లా అధికారులు స్పష్టమైన ఆదేశాలు అందకపోవడం గమనార్హం. సాధారణంగా రేషన్ బియ్యాన్ని డీలర్లు ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోపు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సరుకు నిమిత్తం డీలర్లు అంతకు ముందు నెలలోనే డీడీలు చెల్లించాల్సి ఉంది. అధికారులు చెప్పిన రోజుల్లోనే చౌకదుకాణాల డీలర్లు డీడీలు తీసి వారికి అందజేస్తారు. ఈ ప్రక్రియ 22వ తేదీలోపు పూర్తవుతుంది. నెలాఖరులోపు సరుకు రేషన్ దుకాణాలకు చేరుతుంది. కానీ ఈనెల 27వ తేదీ సాయంత్రం వరకు డీడీల కోసం అధికారుల నుంచి డీలర్లకు ఆదేశాలు వెళ్లలేదు. కేవలం పాత రేషన్‌కార్డులకే డీడీలు తీసి 19వ తేదీ నాటికి అందజేయాలని పౌరసరఫరాల అధికారులు డీలర్లకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొత్తగా రేషన్ కార్డు కూపన్లు పొందిన 86వేల మందికి బియ్యం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలేవీ లేకపోవడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సైతం చేతులెత్తేశారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరగా కొత్త కూపన్లకు బియ్యం కేటాయింపుపై ప్రభుత్వం మండలాల వారీగా వివరాలను కోరిందన్నారు. ఆ మేరకు నివేదిక పంపినా ప్రభుత్వం నుంచి తమకు తదుపరి ఆదేశాలు అందలేదన్నారు. అందువల్ల పాత కార్డులకు మాత్రమే డీడీలు తీయాలని డీలర్లకు సూచించామన్నారు. -
పారని ‘పథకం’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అనూహ్య పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో తనదైన ముద్రను కనబర్చలేకపోయారు. మూడేళ్లు పూర్తి చేసుకున్నారనే మాటే తప్పిస్తే.. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు చేరువ కాలేకపోయింది. కొత్త పథకాలకు రూపకల్పన చేయడంతో పని అయిపోయినట్లుగా భావించడం.. లబ్ధిదారుల్లో అధికార పార్టీ అనుయాయులకే పెద్దపీట వేస్తున్నారనే అపవాదు.. పారదర్శకత లోపించడం ఇతరత్రా కారణాలతో మెరుగైన పాలనను అందించలేకపోయారనేది విశ్లేషకులు అభిప్రాయం. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి పదిసార్లు జిల్లాలో పర్యటించినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోయారు. అమ్మహస్తం.. బంగారుతల్లి.. రాజీవ్ యువకిరణాలు.. ఇందిర జలప్రభ.. అమృతహస్తం.. రైతులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు.. తదితర పథకాలను సీఎం ఆర్భాటంగా ప్రవేశపెట్టినా ప్రచారానికే పరిమితమయ్యాయి. అమలు అస్తవ్యస్తంగా మారడంతో వినియోగదారులు, లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. 2011 సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు 36 హామీలు గుప్పించారు. ఇందులో ఐదారు మినహా మిగిలినవేవీ పరిష్కారానికి నోచుకున్న దాఖలాల్లేవు. శ్రీశైలం ముంపు బాధితుల్లో కొందరికి ఉద్యోగావకాశాలు కల్పించినా మిగిలిన వారికి ఆరు నెలల్లో ఉద్యోగాలిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా ఇప్పటికీ అతీగతీ లేకపోయింది. కొన్ని హామీలకు పరిష్కారం లభించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇందిరమ్మ బాటలో వివిధ వర్గాల ప్రజలు సీఎంకు పలు సమస్యలపై వినతులు అందజేశారు. దాదాపు 360 దరఖాస్తులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపడంతో చేతులు దులిపేసుకున్నారు. వీటిలో ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితులు ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక నీటి పారుదల రంగం కూడా అస్తవ్యస్తంగా మారింది. హంద్రీనీవా ప్రాజెక్టును రెండేళ్ల క్రితం ఆడంబరంగా ప్రారంభించినా జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు అందకపోవడం గమనార్హం. హంద్రీనీవా పరిధిలోని చెరువుల్లో నీటిని నింపి ఆయా ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చాలని ప్రజలు కోరుతున్నా చెవికెక్కించుకునే నాథుడే కరువయ్యాడు. -
ఎన్నిసార్లు మభ్యపెడతారు
గూడూరు టౌన్, న్యూస్‌లైన్: గూడూరులోని నరసింగరావు పేటలో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. మహానేత వైఎస్సార్ హయాంలో ఇళ్ల పట్టాలు అందజేస్తే, ఇప్పటికీ స్థలాలు చూపకపోవడంపై వారు నిలదీశారు. ఎన్నిసార్లు రచ్చబండ నిర్వహించి మభ్యపెడతారని ప్రశ్నించారు. మరోవైపు రచ్చబండకు మంత్రి ఆనం రావడం ఆలస్యం కావడంతో ప్రజల్లో ఓపిక నశించింది. మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన మంత్రి సాయంత్రం 4.45 గంటలకు వచ్చారు. ఆయన రాక ఆలస్యం కావడంతో ఎక్కువ మంది ప్రజలు అర్జీలను అధికారులకు ఇచ్చి వెళ్లిపోయారు. రామనారాయణరెడ్డి మాట్లాడుతున్న సమయంలోనూ ఎక్కువ మంది వెళ్లిపోతుండటంతో నాయకులు వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. 47,972 మందికి ఇందిరమ్మ ఇళ్లు మూడో విడత రచ్చబండ పథకం ద్వారా జిల్లాలో 47,972 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గూడూరు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రితో చర్చించి గూడూరులో పీజీ కళాశాల ఏర్పాటుకు అనుమతి తెస్తామని హామీ ఇచ్చారు. 2009లో ఇళ్ల పట్టాలు మంజూరైన వారికి సాంకేతిక కారణాలతో భూమి చూపలేదని చెప్పారు. త్వరలోనే డీటీపీ అప్రూవల్ తీసుకుని లబ్ధిదారులకు స్థలాలు చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ దుగ్గరాజపట్నంలో ఏర్పాటైతే వందలాది పరిశ్రమలు వచ్చి, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ గూడూరులో రూ.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ మధుసూదన్‌రావు, తహశీల్దార్ మైత్రేయ, ఎంపీడీఓ నిర్మలదేవి, మున్సిపల్ కమిషనర్ సుశీలమ్మ, పీడీ కమలకుమారి, నాయకులు జగన్మోహన్రెడ్డి, శ్యామ్‌సుందరరెడ్డి పాల్గొన్నారు. చింతా వ్యాఖ్యలతో కలకలం తిరుపతి ఎంపీ చింతా మోహన్ మాటలు సభలో ఒక్కసారిగా కలకలం రేపాయి. గిరిజనులు గతంలో గోచీలు పెట్టుకుని తిరుగుతూ, ఎలుకలు తింటూ జీవనం సాగించేవారని, కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంటూ ఇప్పుడు అన్నం తింటున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న పలువురు గిరిజనులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాను 20 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటే, ఒక్కటీ సవ్యంగా సాగలేదని చింతా వ్యాఖ్యానించడం సైతం చర్చనీయాంశమైంది. -
నిరాశే మిగిలింది
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రచ్చబండ ముగిసింది. మొదటి, రెండో విడతలతో పోలిస్తే ఈసారి వినతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అధికారులు వీటికి ప్రాధాన్యమివ్వకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఈనెల 11న ప్రారంభమైన మూడో విడత రచ్చబండ మంగళవారంతో ముగియగా.. అర్బర్, రూరల్ ప్రాంతాల్లో నిరాశే మిగిలింది మొత్తం 69 సమావేశాలు నిర్వహించారు. రచ్చబండ అనగానే ప్రజల్లో ఎన్నో ఆశలు. ప్రధానంగా రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు తదితరాలు మంజూరు చేస్తారనే నమ్మకం ఉండేది. అయితే అధికారులు వారి ఆశలను నీరుగారుస్తూ కార్యక్రమాన్ని ప్రచారానికే పరిమితం చేయడం విమర్శలకు తావిస్తోంది. మొదటి రెండు రోజులు దరఖాస్తులు తీసుకోకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఆ తర్వాత దరఖాస్తులను తీసుకున్నా వాటిని పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. కల్లూరు అర్బన్ కాలనీల్లో నిర్వహించిన రచ్చబండలో స్వీకరించిన వినతులను గోనెసంచిలో కట్టి అక్కడే పడేసి వెళ్లడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఇక ఈ విడతలో అధికార పార్టీ మద్దతుదారులకే అధికంగా ప్రయోజనం చేకూర్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయంలో పలు గ్రామ సభల్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. రేషన్ కార్డులకు 1.15 లక్షల దరఖాస్తులు అందగా.. అత్యధికంగా ఆదోని అర్బన్‌లో 9,647, నంద్యాల అర్బన్‌లో 9వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కర్నూలులో ఈ సంఖ్య 5 వేలకు మించలేదు. రచ్చబండలో వినతులు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణమైంది. పింఛన్లకు 43,104.. పక్కా ఇళ్లకు 89,166 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రెండో విడత రచ్చబండతో పోలిస్తే 50 శాతం పైగా వినతులు తగ్గిపోయాయి. 86వేల రేషన్ కార్డులను రచ్చబండలో పంపిణీ చేయాల్సి ఉండగా 58వేలు, పింఛన్లు 27,381 పంపిణీ చేయాల్సి ఉండగా 22,185, పక్కా ఇళ్లు 70,810 పంపిణీ చేయాల్సి ఉండగా 52వేలు మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం. చివరిరోజు మంగళవారం ఆత్మకూరు అర్బన్, రూరల్‌లో రచ్చబండ సభలు ఏర్పాటయ్యాయి. మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి సూచన మేరకు ఆత్మకూరు అర్బన్‌కు 90, రూరల్ మండలానికి 200 అంత్యోదయ అన్నయోజన కార్డులను కలెక్టర్ మంజూరు చేశారు. -
రచ్చరచ్చగా మారిన అనంతపురం రచ్చబండ
-
రచ్చబండలో మహిళలపై పోలీసుల జులుం
కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా కడప రచ్చబండ కార్యక్రమంలో మంగళవారం పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రచ్చబండకు వచ్చిన మహిళలపై వారు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. -
రచ్చబండకు వచ్చిన మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్
కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారుతోంది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా కడప రచ్చబండ కార్యక్రమంలో మంగళవారం పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రచ్చబండకు వచ్చిన మహిళలపై వారు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రెచ్చిపోయి దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. మరోవైపు అనంతపురంలో రచ్చబండ రసాభాసగా మారింది. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీశారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
కడప రచ్చబండలో పోలీసుల ఓవర్యక్షన్
-
రాష్ట్రవ్యాప్తంగా రసాభాసగా మారిన రచ్చబండ
-
రచ్చబండలో రగడ
వీపనగండ్ల, న్యూస్‌లైన్: రచ్చబండలో రగడ రాజుకుంది. కార్యక్రమం బ్యానర్‌పై సీఎం ఫొటో తొలగింపుపై వివాదం నెలకొంది. కొల్లాపూర్ ఎమ్మె ల్యే జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డిల ఆధిపత్యపోరు అధికారులకు తలనొప్పుల ను తెచ్చిపెట్టింది. పరిస్థితి చేయిదాటి ఓ అధికారిపై చేయిచేసుకు నే స్థాయికి వెళ్లింది. సోమవారం వీపనగండ్ల మండలకేంద్రంలో మండల ప్రత్యేకాధికారి గోపాల్ అధ్యక్షతన రచ్చబండ కార్యక్ర మం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యుడు జూ పల్లి కృష్ణారావును వేదికపైకి ఆహ్వానించిన అనంతరం ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులను ఆహ్వానించారు. రచ్చబండ కమిటీ సభ్యులను వేదికపైకి పిలవకపోవడంతో పాటు రచ్చబండ బ్యానర్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో లేకపోవడం పట్ల మామిళ్లపల్లి వర్గీయులు గందరగోళం సృష్టించారు. ఎవరూ పిలవకుండానే మామిళ్లపల్లి వేదికపైకి ఎక్కారు. ఏ హోదాలో విష్ణువర్ధన్‌రెడ్డిని వేదికపైకి ఆహ్వానించారని అక్కడే ఉన్న ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అధికారులను నిలదీశారు. ప్రొటోకాల్ ప్రకా రం రచ్చబండ ఫ్లెక్సీలో సీఎం ఫొటో ఉండాలని, ఎందుకు ప్రొటోకాల్ పాటించలేదని విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం ఫొ టోకు లేని ప్రొటోకాల్ వేదికపైకి వచ్చిన తనను ఉందా? అని వాగ్వాదానికి దిగారు. మొదటి పేజీ తరువాయి ఇంతలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి పూనుకున్నారు. మామిళ్లపల్లి స్టేజీ దిగాలని లేకపోతే ర చ్చబండను రద్దుచేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుబట్టారు. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకున్నారు. అధికారులను ఎమ్మెల్యే ఎంపీడీఓ చాంబర్లోకి పిలిపించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బయటికి వచ్చి పంపిణీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకాధికారిపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు రచ్చబండ నిర్వహించకుండా ముగించాలని జూపల్లి ప్రత్యేకాధికారిని ఆదేశించడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటికి కార్యాలయ ఆవరణలో మామిళ్లపల్లి దగ్గర ప్రత్యేకాధికారి కూర్చొవడాన్ని గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తదనంతరం ప్రత్యేకకౌంటర్ల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సాయంత్రం ఎంపీడీఓ గదిలో మండల ప్రత్యేకాధికారి గోపాల్‌ను నిర్బంధించారు. ఇరువర్గాల పెనుగులాటలో ఆయన చొక్కా చిరిగింది. పోలీసుల రక్షణతో జూపల్లి ప్రత్యేకాధికారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రచ్చబండ నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎం శ్రేణులు ధర్నా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై కుట్రతోనే.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రక్షణ లేకపోవడంతో పాటు నిత్యం ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే తనపై జరిగిందని మండల ప్రత్యేకాధికారి గోపాల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో పేర్కొన్నారు. జూపల్లి చేయి చేసుకున్నాడన్న ప్రచారం జరగడంతో ఈ విషయాన్ని ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్లగా జూపల్లి తనపై చేయి చేసుకోలేదని తనను రక్షించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఎవరో కార్యకర్తలు తనపై దాడిచేసి అవమానపరిచారని వాపోయారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణయ్య, తహశీల్దార్ శాంతకుమారి, ఏఓ పూర్ణచంద్రారెడ్డి, ఏఈలు రవికృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, గఫార్, ఏపీఎం పార్వతి, ఏపీఓ శేఖర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
'సీఎం మంచి ప్లేయరే.. కాని మంచి కెప్టెన్ కావాలి'
రాయచోటి : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన సమక్షంలోనే మంత్రి రామచంద్రయ్య చురకలు వేశారు. ముఖ్యమంత్రి మంచి ఆటగాడే కానీ మంచి మంచి కెప్టెన్ కావాలని ఆయన అన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సీ రామచంద్రయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాయచోటిలో జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ, సీమాంధ్రలోని రెండు ప్రాంతాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. వాటికి రాష్ట్ర విభజన పరిష్కారం కాదన్నారు. వ్యక్తలు శాశ్వతం కాదని.... రాష్ట్రమే శాశ్వతమని.... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కిరణ్ వ్యాఖ్యానించారు. -
మొత్తానికి అనుకున్నది సాధించావ్!
అనంతపురం : కొంతకాలంగా ఎడమొహం, పెడ మొహంగా ఉన్న జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. సొంత పార్టీలోని తమ ప్రత్యర్థి జేసీ దివాకర్ రెడ్డిపై పైచేయి సాధించినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు. మాజీమంత్రి జేసీ ప్రతిపాదన మేరకు మూడో విడత రచ్చబండలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించాలని సీఎం తొలుత భావించారు. నవంబర్ 24న సీఎం తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తారని, ఆ సమయానికి చాగల్లు రిజర్వాయర్‌ను నీటితో నింపుతామంటూ అక్టోబర్ 30న జేసీ దివాకర్ రెడ్డి జీడిపల్లి రిజర్వాయర్, ఎంపీఆర్ డ్యామ్ వద్ద హడావుడి చేశారు. సీఎం చేతుల మీదుగా చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేస్తామంటూ ప్రకటించారు. అయితే దీన్ని పసిగట్టిన మంత్రులు శైలజానాథ్, రఘువీరా సీఎం వద్దకు వెళ్లి తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తే, తాము బహిష్కరిస్తామని తెగేసి చెప్పారు. తాడిపత్రి మినహా ఎక్కడైనా పర్యటించాలంటూ రఘువీరా షరతు విధించారు. మంత్రి శైలజానాథ్ మాత్రం తన నియోజకవర్గంలోని నార్పలలో పర్యటించాలని పట్టుబట్టారు. చివరకు కిరణ్ శైలజానాథ్ ప్రతిపాదన వైపే మొగ్గు చూపి.... ఆదివారం నార్పలలో పర్యటించారు. ఈ సందర్భంగా నార్పలకు వచ్చిన రఘువీరా హెలీప్యాడ్ వద్ద మంత్రి శైలజానాథ్‌ను ఆలింగనం చేసుకున్నారు. 'మొత్తానికి అనుకున్నది సాధించావ్, సీఎంను నీ ఇలాకాకు రప్పించుకున్నావ్. కంగ్రాట్స్' అంటూ అభినందించారు. ఇందుకు 'అంతా మీ సహకారం' అంటూ శైలజానాథ్ ప్రతిస్పందించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోవటం గమనార్హం. -
రాష్ట్ర విభజన పరిణామాలతో ప్రశ్నార్థకమైన కాంగ్రెస్ అస్థిత్వం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సీఎం కిరణ్ అభివర్ణిస్తోన్న రచ్చబండ కార్యక్రమం... ‘అధికార’ దుర్వినియోగానికి పరాకాష్టగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటిచెప్పడానికి మంత్రులు నార్పల ‘రచ్చబండ’ సాక్షిగా అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్టీఏ అధికారులను ప్రయోగించి, బెదిరించి... వాహనాలను సమీకరింపజేశారు. వాటిని ఐకేపీ సిబ్బందికి అప్పగించి.. పది మంది సభ్యులున్న ప్రతి మహిళా సంఘానికి రూ.1,500 చొప్పున ఐకేపీ నిధులు పంపిణీ చేసి... సభకు తరలింపజేశారు. సభకు వస్తేనే రేషన్‌కార్డు, పెన్షన్, ఇళ్లు వంటి మంజూరు చేయిస్తామని బెదిరించి మరి కొందరిని రప్పించారు. అధికార దుర్వినియోగం చేసి జనసమీకరణలో ఒకింత బయటపడిన కాంగ్రెస్ నేతలు.. సభలో ప్రజాస్పందన కరువవడంతో అవాక్కయ్యారు. ‘కనీసం చప్పట్లయినా కొట్టండి’ అని సాక్షాత్తూ సీఎం కిరణ్ ప్రాధేయపడినా ప్రజలు స్పందించకపోవడమే అందుకు తార్కాణం. రచ్చబండలో భాగంగా సీఎం కిరణ్ ఆదివారం నార్పలలో పర్యటించారు. ఉదయం 11.30 గంటలకు బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో నార్పలకు చేరుకున్న సీఎం.. రెండే రెండు గంటలు గడిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చిత్తూరు జిల్లాకు బయలుదేరి వెళ్లారు. నార్పల పర్యటనలో రూ.32.91 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహించకుండా... నేరుగా బహిరంగ సభకు చేరుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక అభివృద్ధిపథంలో దూసుకెళ్లేలా చేశానంటూ గొప్పలు చెప్పుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కడదాకా పోరాడతానని చెబుతూ.. తనను మాత్రమే సమైక్య చాంపియన్‌గా గుర్తించాలని ప్రజలను పరోక్షంగా కోరారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌లైతే సీఎం కిరణ్‌కు ఏకంగా ‘సమైక్య సింహం’ అంటూ బిరుదే ఇచ్చేశారు. ఇదొక పార్శ్వమైతే.. మరొక పార్శ్వం మంత్రి శైలజానాథ్ అధికార దుర్వినియోగం. ప్రైవేటు విద్యా సంస్థల వాహనాలను సమీకరించాలంటూ ఆర్టీఏ అధికారులను ఉసిగొల్పారు. అన్ని అనుమతులూ ఉన్నా ప్రైవేటు విద్యాసంస్థల వారిని ఆర్టీఏ అధికారులు బెదిరించి.. శనివారం రాత్రే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఐకేపీ అధికారులకు అప్పగించారు. శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల పరిధిలోని ఐకేపీ సిబ్బందికి ఆ వాహనాలను డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి అప్పగించారు. పది మంది సభ్యులున్న మహిళా సంఘానికి రూ.1500 చొప్పున ముట్టజెప్పి.. వాహనాల్లో మహిళలను నార్పలకు తరలించారు. ఇక శింగనమల చెరువుకు హెచ్చెల్సీ నీటిని ఇప్పిస్తామంటూ ఆయకట్టు రైతులను రచ్చబండ సభకు తీసుకొచ్చారు. బెదిరించి.. భయపెట్టి తీసుకొచ్చిన జనం నుంచి ఏమాత్రమూ స్పందన కన్పించకపోవడంతో మంత్రులు డీలాపడ్డారు. తన ప్రసంగానికి ఏమాత్రం స్పందన రాకపోవడంతో సీఎం కిరణ్ ‘కనీసం చప్పట్లయినా కొట్టండి’ అంటూ పదే పదే బతిమాలుకోవడం గమనార్హం. -
పట్టాలు తప్పిన ఆగ్రహం
బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో కనుమరుగైన అధికార పార్టీ నాయకులు ప్రజల మధ్యకు రావడానికి ఏర్పాటు చేసిన రచ్చబండ అదే అధికార పార్టీ నాయకులను ఊపిరి తీసుకోనీ యకుండా చేస్తోంది. సీమాంధ్ర జిల్లాల్లో ఎక్కడికక్కడ ప్రజల నుంచి ఆగ్రహావేశాలను అధి కార పార్టీ నాయకులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హుల పేర్లు తొలగించ డంతో ఆదివారం బొబ్బిలిలో జరిగిన రచ్చబండ ఆసాంతం నిరసనలు, తోపులాటల మధ్య సాగింది. విజయనగరం ఎంపీ ఝాన్సీ రచబండ సభకు వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లినంతవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సీపీఎం, రైతు సంఘం, బీజేపీ నేతలు అధికారపార్టీ వైఖరిని ఎండగడుతూ నిరసనలు హోరెత్తించారు. రచ్చబండ సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌నే గుర్తించని ఈ రచ్చబండ ఎందుకు? మాకు ఇళ్ల పట్టాలిస్తామని తయారు చేసిన లిస్టుల్లో పేర్లు ఉన్నాయి. ఇప్పుడెందుకు లేవు? రచ్చబండ కార్యక్రమం మీ ఇష్టారాజ్యమా? అధికారికంగా ప్రభుత్వం నియమించిన రచ్చబండ కమిటీ సభ్యులు కాకుండా అధికారపార్టీకి చెందిన నాయకులు రచ్చబండ వేదిక మీదకు ఎందుకు? అన్న ప్రశ్నలు రచ్చబండ కార్యక్రమంలో అధికార పార్టీ ఎంపీ,ఇతర నాయకులను ఊపిరి సలపనీయకుండా చేశాయి. ప్రభుత్వ పథకాల్లో అర్హులకు తప్పించి అనర్హులకు పెద్ద పీట వేయడంతో వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలతో పాటు మహిళలు, లబ్ధిదారులు, బాధితులు పెద్దఎత్తున రచ్చబండలో అధికార పార్టీ నాయకులను నిలదీశారు. బొబ్బిలిలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం రచ్చబండను ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమవ్వాల్సిన కార్యక్రమం ఎంపీ ఝాన్సీ రాక ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. అప్పటికే భారీగా లబ్ధిదారులతో పాటు వైఎస్ఆర్సీపీ, సీపీఎం, తెలుగుదేశం, రైతు సంఘ నాయకులు సభాస్థలి వద్ద ఉన్నారు. ఎంపీ రాగానే సభలో తొలుత సమైక్య నినాదాలు మిన్నంటాయి. న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ చందాన సూర్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాన్న రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు సమైక్య నినాదాలు చేస్తూ వేదికపైకి వెళ్లి ఎంపీకీ వినతిపత్రాన్ని అందించారు. దీనికి స్పందించిన ఎంపీ మాట్లాడుతూ తాను రాష్ట్ర సమైక్యతకే కట్టుబడి ఉన్నానన్నారు. తరువాత ఇటీవల బొబ్బిలిలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీలో అనర్హులకు స్థానం కల్పించి అర్హులను తొలగించడంతో వారంతా లిస్టులు పట్టుకుని వచ్చి ఎంపీ, అధికారపార్టీ నాయకులను చూస్తూ దూషించడం మొదలు పెట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరువాత సభలో సీఎం సందేశాన్ని ఎంపీ చదువుతుండగా, వేదిక మీద రచ్చబండ కమిటీ అధికార సభ్యులు కాకుండా మిగిలిన వారిని ఖాళీ చేయించాలని, లేకపోతే మిగిలిన రాజకీయపార్టీలనూ వేదిక మీదకు ఆహ్వానించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు చెలికాని మురళీకృష్ణ, గంగుల మదన్ మోహన్, గునాన వెంకటరావు తదితరులు నినాదాలు చేశారు. దాంతో వేదిక మీద ఉన్న కమిటీ సభ్యుడు కాని రామభద్రపురం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పికొండ శ్రీరాములు నాయుడు కిందకు దిగిపోయారు. ఆ తరువాత స్థానిక నాయకుల ప్రోద్బలంతో వేదిక మీదకు శ్రీరాములునాయుడు మళ్లీ ఎక్కడంతో ప్రతిపక్షాల నినాదాలు మిన్నంటాయి. దీంతో రాజకీయం చేయడానికి వచ్చారా? అని అధికార పార్టీ నాయకులు ఎదురు దాడి చేస్తూ నినాదాలు చేసిన వారిని తోసుకుంటూ రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో అందోళనకారులను అదుపు చేయలేకపోయారు. చవకబారు రాజకీయాలు వద్దు ఈ ఆందోళనలు మరింత అధికం అవుతుండడంతో ఎంపీ ఝాన్సీ మాట్లాడుతూ ఈ బొబ్బిలికి ఎమ్మెల్యేగా ఉన్న వారు ప్రజలను పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చిందనడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత ముందుకు తోసుకువచ్చారు. మీ పార్టీ నాయకులు చేసిన తప్పిదాలు, స్వార్థాలకు బొబ్బిలి రాజులను విమర్శించడం తగదని, ఎంపీ స్థానంలో ఉండి చవకబారు రాజకీయాలను మానుకోవాలని నినాదాలు చేసి నేరుగా ఎంపీతోనే మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతున్నంత సేపు పట్టాల పంపిణీలో అర్హుల పేర్లు తొలగించిన లబ్ధిదారులు కాగితాలు చూపిస్తూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. అలాగే రచ్చబండ కమిటీ సభ్యుడు,మాజీ విప్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతున్నంత సేపు కూడా నినాదాలు కొనసాగాయి. అనర్హులకు రాత్రికి రాత్రే ఇళ్ల పట్టాల పంపిణీలో స్థానం కల్పించి అర్హులను తొలగించారంటూ టీడీపీ నాయకులు పువ్వల శ్రీనివాస్, చోడిగంజి రమేష్‌నాయుడు, వెన్నెల వెంకటరమణ, తూమురోతు వెంకట్ తదితరులు ఎంపీని కలిసి ఫిర్యాదు చేశారు. సీపీఎం నాయకులు రెడ్డివేణు, పొట్నూరు శంకరరావులను వేదిక మీదకు రాకుండా పోలీసులు అడ్డుకున్నా రు. ఆందోళనకారులను సీఐ రఘుశ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని, అనర్హుల జాబితాను అధికారులకు అందిస్తే వాటిని తొలగిస్తామని ఎంపీ ఝాన్సీ ప్రకటించారు. ఇంటింటికీ వచ్చి అన్ని వార్డుల్లో అర్హులైన వారికి ఇళ్లు, పింఛన్లు అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చి సభ ను ముగించారు. -
‘మోక్ష’ ఊపిరాడక మరణించలేదట!
కామారెడ్డి, న్యూస్‌లైన్ : రచ్చబండ సభలో జరిగిన తోపులాటలో ఊపిరాడక క న్నుమూసిన పసిగుడ్డు ‘మోక్ష’ మరణంపై అధికారులు కట్టుకథలు అల్లుతున్నారు. రచ్చబండకు వచ్చే ప్రజలకు కావలసిన వసతులు కల్పించే విషయంలో విఫలమైన వారు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల ప్రచారాలను తెరపైకి తెస్తున్నారు. మోక్ష ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతోనే చనిపోయిందని, మోక్ష చనిపోయిన తరువాతనే తల్లి రేణుక రచ్చబండకు తీసుకువచ్చిందని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. మారుమూల ప్రాంతం జిల్లా సరిహద్దులో ఉన్న మాచారెడ్డి మండలంలో మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు, ఒడ్డెర గూడాలు ఎక్కువగా ఉన్నా యి. మండలంలో 50 వేల పైచిలుకు జనాభా ఉంది. ఇక్కడ పేదరికం ఎక్కువగా ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు, రైతుకూలీల ఆకలిచావుల రికార్డులు ఉన్నాయి. సరైన సాగునీటి వసతులు లేకపోవడం, కేవలం భూగర్భజలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులలో ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు వలసలు వెళ్తుంటారు. ఇక్కడి ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తుంటారు. రెక్కాడితే డొక్కాడని ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలతో తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని, తద్వారా తమ జీవితాలు బాగుపడు తాయన్న ఆశతో రచ్చబండకు వస్తారు. గ్రామాలను కాదని గతంలో గ్రామాలలో నిర్వహించే రచ్చబండ సభలను ప్రస్తుత ప్రభుత్వం మండల కేంద్రాలకు పరిమితం చేసింది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఒకేచోటుకి రావలసి ఉంటుంది. వచ్చే ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. ప్రజలు తమకు కావలసిన పథకాల గురించి దరఖాస్తులు చేసుకోవడానికి సరైన కౌంటర్లు లేక పోవడం, వేలాది మంది తరలి వస్తే, తక్కువ కౌంటర్లు ఏ ర్పాటు చేయడంతో తోపులాడుకునే పరిస్థితులు ఎదురయ్యాయి. తోపులాటలో ఊపిరాడకుండా పోవడంతో మోక్ష అనే మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. గతంలోనూ ఇదే కథ గతంలో ఇదే మండలంలో మలేరియా మహమ్మారి సోకి వంద మందికి పైగా మృత్యువాత పడినపుడు అధికారులు తప్పించుకునేందుకు రోగం మలేరియా నేనని, మరణాలు మాత్రం కావని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మోక్ష విషయంలో అధికారులు ప్రభుత్వానికి తమ తప్పి దం లేదనే విధంగా రిపోర్టులు పంపినట్టు తెలుస్తోంది. రచ్చబం డ సభలో పాప చనిపోయిన విషయంలో అధికారులు కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పాపను ఆస్పత్రికి చేర్చడం, పోస్టుమార్టం వరకు తరలించి తరువాత అక్కడి నుంచి పత్తా లేకుండా పోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించినవారు లేరు. మోక్ష మరణంపై తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకుని, మానవతా దృక్పథంతోనైనా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత ం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను అధికారులు గుర్తుంచుకోవాలని అంటున్నారు. -
సీఎంకు దెయ్యం పట్టింది
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనకు దెయ్యం పట్టిందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎల్లారెడ్డిపేటలో శనివారం జరిగిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ.. సీఎం తన ఉనికిని కాపాడుకోవడం కోసమే తెలంగాణకు అడ్డంకులు సృష్టించేం దుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలిసిన ప్పటికీ ప్రజలను పక్కదారి పట్టించడం కోసం సీఎం రచ్చబండ సభలను వేదికలుగా ఉపయోగించుకుంటున్నాడని దుయ్యబట్టారు. అమరుల త్యాగాల ఫలితంగా ఆంక్షలు లేని రాష్ట్రం జనవరి నాటికి ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రెట్టింపుగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
మహిళను ఈడ్చిపడేసిన SI సూర్యచంద్ర మౌళి
-
సర్కారుకు బుద్ధి ‘వైకల్యం’!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన వెంకట్‌కు ఒక కన్ను పూర్తిగా పోయింది. ఆయనకు పోయింది ఒక్కటే కదా.. ఇంకో కన్నుతో చూస్తున్నాడు అని అప్పటివరకు ఇస్తున్న వికలాంగ పింఛన్‌ను తొలగించారు. విశాఖపట్టణం జిల్లాకు చెందిన సూర్యారావుకు పుట్టుకతో పోలియో కారణంగా ఒక కాలు చచ్చుబడిపోయింది. ఇంకో కాలుండగా ఏం రోగం? అంటూ నెలవారీ ఇచ్చే రూ.500 పింఛన్ నిలిపివేశారు. అనంతపురానికి చెందిన ఆంజనేయులుది కూడా ఇదే దుస్థితి. ఆయనకు చెవుడున్నా సరిగా రికార్డు కాలేదని నిర్దాక్షిణ్యంగా పింఛన్‌కు కోత పెట్టారు. ఈ పరిస్థితి ఈ ముగ్గురిదే కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.3 లక్షల మంది పింఛన్లకు కోత విధించారు. ఖజానాపై భారం తగ్గించుకునేందుకు వికలాంగులకు ఇచ్చే రూ.500 పింఛన్‌ను కూడా వైకల్య శాతం తక్కువ ఉందన్న నెపంతో మానవత్వం లేకుండా నిలిపివేసింది. ప్రభుత్వం సాక్షాత్తూ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు ఇచ్చిన రాతపూర్వక హామీని కూడా నిలబెట్టుకోలేదు. పింఛన్ కట్ చేసినా వైకల్యశాతాన్ని పరిశీలించి అర్హులుగా నిర్ధారణ అయితే బకాయిలతో సహా రచ్చబండ లాంటి కార్యక్రమాల్లో చెల్లిస్తామని హెచ్ఆర్సీకి చెప్పిన సర్కారు ఆ మాటే మరిచింది. బకాయిలూ ఇస్తామన్నారు... తమ పింఛన్‌ను అన్యాయంగా కోసేశారని, జీవనభృతిగా ప్రభుత్వం చెల్లించే రూ.500 ఇవ్వకుండా హక్కులను కాలరాస్తున్నారని వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన వికలాంగులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాలో నిలిపివేసిన వికలాంగ పింఛన్‌ను పునరుద్ధరించాలని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వికలాంగులకు పింఛన్ ఇప్పించాలని వీహెచ్పీఎస్ అధ్యక్షుడు అందె రాంబాబు ఈ ఏడాది ఆగస్టు 19న కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కమిషన్ జారీ చేసిన నోటీసులపై గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈవో రాజశేఖర్ సెప్టెంబర్ 7న సమాధానమిచ్చారు. సదారం క్యాంపుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.3 లక్షల మంది విక లాంగుల పింఛన్ తొలగిం చటం వాస్తవమేనని, వీరందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించి అర్హులకు బకాయిలతో సహా పింఛన్ చెల్లిస్తామని రాతపూర్వకంగా తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం చివరిసారిగా నిర్వహిస్తున్న రచ్చబండలో కూడా ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఈ విషయమై వీహెచ్పీఎస్ నేతలు సెర్ప్ అధికారులను కలిసినా ఫలితం లేదు. అసలేం జరిగింది....? వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ‘సాఫ్ట్వేర్ ఫర్ ఎసెస్మెంట్ ఆఫ్ డిజెబిలిటీ ఫర్ యాక్సెస్, రీహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్(సదారం) క్యాంపుల పేరుతో వికలాంగ పింఛన్లను ఈ ప్రభుత్వం కోసేసే పనిలో పడింది. ఈ క్యాంపుల్లో వికలాంగులు వైకల్య శాతాన్ని నిర్ధారించుకోవాలని, అక్కడ ఇచ్చే సర్టిఫికెట్ల ప్రకారం 40 శాతానికి మించి వైకల్యం ఉంటేనే పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ క్యాంపుల శాస్త్రీయతపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలున్నా పట్టించుకోకుండా ఆదరాబాదరాగా లెక్కలు కట్టి దాదాపు 2 లక్షల మంది వికలాంగుల పింఛన్లను తొలగించింది. 2009 డిసెంబర్లో ప్రారంభమైన పింఛన్ల కోత దాదాపు ఏడాది పాటు సాగింది. అప్పటి నుంచి వికలాంగుల పింఛన్లను సర్కారు నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది. -
రచ్చబండలో రసాభాస
పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందులలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన రచ్చబండ రసాభాసగా మారింది. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డం తగలడం వంటి కారణాలతో సభ గందరగోళంగా మారింది. కాంగ్రెస్ నాయకులు పదేపదే మైకులు లాక్కోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. అంతలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కుర్చీలను గాల్లోకి విసిరారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ ప్రారంభం కాగానే మున్సిపల్ కమిషనర్ జయరాములు, తహశీల్దార్ మహమ్మద్ గౌస్ లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సమస్యలపై చర్చించకుండానే పత్రాలు పంపిణీ చేస్తే ఎలాగంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు వరప్రసాద్, ట్రేడ్ యూనియన్ నాయకులు చిన్నప్ప, సేవాదళ్ కన్వీనర్ కోడి రమణ, యూత్ కన్వీనర్ సుధీకర్‌రెడ్డి, నాయకులు గౌస్, అబ్దుల్ షుకూర్, బ్రాహ్మణపల్లె మహేశ్వరరెడ్డి, చెన్నారెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు కోళ్ల భాస్కర్, సూరి, వీరభద్రారెడ్డి అధికారులను నిలదీశారు. రచ్చబండ బ్యానర్లో స్థానిక ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఫొటో లేకపోవడం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించకపోవడం ఆ పార్టీ కార్యకర్తలను ఆగ్రహానికి గురి చేసింది. ప్రోటోకాల్ పాటించకపోతే ఎలాగంటూ వారు మండిపడ్డారు. అంతలోనే కాంగ్రెస్ నాయకులు మైకు తీసుకొని రచ్చబండ యథావిధిగా సాగుతుందని, అందరూ కూర్చోవాల్సిందిగా పదేపదే ప్రకటించడం వివాదానికి ఆజ్యం పోసింది. సరిగ్గా అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కుర్చీలను విసరడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు వెంటనే కాంగ్రెస్ నాయకుల చేతిలోని మైకును లాగేసుకున్నారు. అర్బన్ సీఐ భాస్కర్ జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. విలేకరుల నిరసన పులివెందుల సీఎస్ఐ మైదానంలో నిర్వహించిన రచ్చబండ సభలో తమకు ప్రత్యేక కౌంటరుల ఏర్పాటు చేయకపోవ డంపై విలేకరులు నిరసన తెలిపారు. కొందరు అధికారులు, సిబ్బంది స్థానికులకు కుర్చీల్లో కూర్చోబెట్టి, కవరేజీకి వచ్చిన విలేకరులను మాత్రం విస్మరించడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అర్జీదారుల పాట్లు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని ఆశించిన వివిధ వర్గాల ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు రచ్చబండ సభల్లో ఎగబడుతున్నారు. ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో వాటి పరిష్కారం కోసం జనం అనేక ఆశలతో సభలకు తరలివస్తున్నారు. ఎంతో కష్టపడి అర్జీలు రాయించుకుని వస్తే వాటిని అధికారులకు అందజేసేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. -
మూడు నెలల చిన్నారి ప్రాణాలు తీసిన రచ్చబండ
-
రచ్చబండ కార్యక్రమంలో తోపులాట
-
మూడు నెలల చిన్నారి ప్రాణాలు తీసిన రచ్చబండ
రచ్చబండ కార్యక్రమం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. బంగారుతల్లి పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసేందుకు తల్లిదండ్రులు తీసుకొచ్చిన మూడు నెలల మోక్ష అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి చర్చబండ కార్యక్రమంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలకేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తీవ్రంగా తోపులాట జరగడంతో మూడు నెలల మోక్ష తీవ్ర అస్వస్థతకు గురైంది. రచ్చబండ నిర్వహిస్తుండగా అకస్మికంగా తోపులాట జరగడంతో ఊపిరాడక చిన్నారి మోక్ష తీవ్ర అనారోగ్యానికి లోనైంది. ఆ చిన్నారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. బంగారుతల్లి పథకం ద్వారా చెక్కు తీసుకోడానికి మాచారెడ్డి మండలంలోని భవానీపేట తండాకు చెందిన చిన్నారి మోక్షను వారి తల్లిదండ్రులు మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి తీసుకువచ్చారు. రచ్చబండలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఆ చిన్నారి చివరకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇలాంటి విషాదకర సంఘటన చోటుచేసుకోవడం పట్ల కార్యక్రమానికి వచ్చిన పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలుత అందరూ చిన్నారి మోక్షను బంగారుతల్లి లబ్ధిదారుగా భావించారు. అయితే, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాత్రం ఆమె లబ్ధిదారు కాదని, పథకానికి దరఖాస్తు చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చి ఉంటారని ఆయన చెప్పారు. అలాగే మాచారెడ్డిలో ఏర్పాట్లు కూడా పూర్తిగానే చేశామని కలెక్టర్ తెలిపారు. అయితే, దరఖాస్తు తీసుకోడానికే తాము అక్కడకు వచ్చినట్లు చిన్నారి మోక్ష తల్లి రేణుక 'సాక్షి'కి తెలిపారు. -
కిరణ్‌కు 'రంగు' పడింది
నిజామాబాద్ : ముఖ్యంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి 'రంగు' పడింది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఫెక్సీ మీద సీఎం బొమ్మ ఉండటంపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. సభలో ఏర్పాటు చేసిన ఫెక్సీపై ఉన్న ముఖ్యమంత్రి బొమ్మకు నల్లరంగు వేశారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు ఆ ఫెక్సీని తొలగించారు. ఇక సిరికొండలో జరిగిన సభలో తెలంగాణవాదులు, సర్పంచులు నినాదాలు చేశారు. తెలంగాణ ద్రోహుల బొమ్మలు పెట్టడం ఏంటని అడ్డుకునేందుకు యత్నించారు. మున్సిపల్ కార్పోరేషన్ ఆవరణ ఉన్న రచ్చబండ శకటాన్ని జేఏసీ నాయకులు చిన్నాభిన్నం చేశారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి నల్లరంగు చల్లిన విషయం తెలిసిందే. -
తిరుపతిలో రచ్చబండ రచ్చరచ్చ
సాక్షి, తిరుపతి : తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అధికారులు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. కార్యక్రమం ప్రారంభం కాగానే కార్పొరేషన్ కమిషనర్ గత రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలిపి, ఎంపీ చింతామోహన్ మాట్లాడతారని ప్రకటించారు. ముందుగా తమ సమస్యలు విని, తరువాత ఎంపీ మాట్లాడాలని వైఎస్ఆర్ సీపీ నాయకులు కోరారు. దీనికి ఆయన అంగీకరించకుండా మాట్లాడే ప్రయత్నం చేయడంతో ‘చింతా మోహన్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నగర నాయకురాలు శ్రీదేవి, వేదికపై ఉన్న టేబుల్పెకైక్కి ఎంపీని ప్రశ్నిస్తున్న వారితో వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకునే యత్నం చేశారు. ఈ నేపథ్యంలో చింతా మోహన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ‘సమైక్య ఉద్యమంలో కనిపించని చింతా’ అంటూ నినాదాలు చేస్తూ, గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై వాటర్ బాటిల్ విసిరాడు. ఈలోపు అధికారులు కూడా నిష్ర్కమించడంతో రచ్చబండ నిలిచిపోయింది. ఎమ్మెల్యే అరెస్టు : మరోవైపు అధికారులు రచ్చబండను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు రాకపోవడంతో అక్కడినుంచి వెళ్లి ఎదురుగా రోడ్డుపై పడుకుని గంటపాటు ఆందోళన చేశారు. పోలీసులు ఎమ్మెల్యేని, కార్యకర్తలను అరెస్టు చేశారు. సొంత పూచీకత్తుపై భూమనను విడుదల చేయగా, కార్యకర్తలపై కేసు నమోదుచేశారు. -
తిరుపతిలో రచ్చబండ రసాభాస
తిరుపతి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యాక్రమం ముఖ్యమంత్రి కిరణ్ సొంత జిల్లాలో రచ్చ రచ్చ అయ్యింది. అధికార పార్టీ ఎంపీ చింతా మోహన్‌కు రచ్చబండలో చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో గురువారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీని సమస్యలు పరిష్కరించాలంటూ నిలదీశారు. సమస్యలపై సరైన సమాధానం రాకపోవటంతో ఆగ్రహించిన మహిళలు.... ఎంపీపై బాటిళ్లు విసిరి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో చింతా మోహన్ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇదే రచ్చబండ కార్యక్రమంలోనే సీపీఎం కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఎంపీ చింతా మోహన్ సమైక్యవాదుల నుంచి నిరసనలు ఎదుర్కొన్నారు. కాగా సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
రోడ్డుపై రచ్చబండ దరఖాస్తులు
-
చిత్తుకాగితాలైన రచ్చబండ దరఖాస్తులు
-
సీఎం ఫ్లెక్సీని చించేసిన తెలంగాణవాదులు
నంగునూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూసేందుకు ఏర్పాటు చేసిన రచ్చబండ రాజకీయ నాయకుల ఆధిపత్యానికి వేదికైంది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సమైక్యవాది సీఎం కిరణ్ బొమ్మ ఉండకూడదంటూ కొందరు చించేశారు. దీంతో ప్రారంభమైన గొడవ దూషణలు, నినాదాలతో హోరెత్తింది. ఓ దశలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగే వరకూ వెళ్లింది. అయితే సభలో ఉన్న మహిళలు నేతలపై ఎదురు తిరగడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. దీంతో అధికారులు సంక్షేమ పథకాలపై అవగాహన, ప్రసంగాలు లేకుండానే దరఖాస్తుల స్వీకరణతో కార్యక్రమాన్ని ముగించారు. మూడవ విడత రచ్చబండ కార్యక్రమం బుధవారం మండల కేంద్రం నంగునూరులో నిర్వహించారు. కార్యక్రమానికి సిద్దిపేట ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నియోజకవర్గ ఇన్చార్జి, జేడీలక్ష్మారెడ్డి, మండల స్పెషలాఫీసర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే సమైక్యవాదం వినిపిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బొమ్మను తొలగించాలని టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తూ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపివేశారు. దీంతో అక్కడే ఉన్న ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి సమైక్యవాదే అయినప్పటికీ ఆయన ఫొటోను చింపడం సరికాదన్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ నినాదాలు చేస్తూ సభ వద్దకు దూసుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి కలుగజేసుకుంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బొమ్మ ఉన్న ఫ్లెక్సీని మళ్లీ వేదికపై ఉంచేంతవరకూ రచ్చబండ జరగబోనివ్వమన్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు మరోసారి వేదిక వద్దకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఓ దశలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి జిందాబాద్’’ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేయగా, ‘‘హరీష్‌రావు జిందాబాద్...డిప్యూటీ సీఎం జిందాబాద్ ’’ అంటూ టీఆర్ఎస్ నేతలు నినాదాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని శాంతిపజేసేందుకు ఇబ్బందులు పడ్డారు. తిరుగబడ్డ మహిళలు ఎంతకూ గొడవ సద్దుమనగక పోవడంతో సహనం కోల్పోయిన మహిళలు నేతలను, అధికారులను దూషిస్తూ వేదికపైకి దూసుకురావడంతో టెంటు కుప్పకూలింది. నాయకులందరూ వెళ్లిపోతే మేమే రచ్చబండను జరుపుకుంటామని ప్రజలు నినాదాలు చేయడంతో సర్పంచులు, అధికారులు సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ కాంగ్రెస్ నేతలు సీఎం ఫ్లెక్సీ పెట్టాలంటూ గొడవకు దిగగా, ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ కలుగజేసుకుని సభ సజావుగా జరిగేలా చూడాలని వారిని కోరారు. అయినప్పటికీ వినిపించుకోని సర్పంచ్ యాదగిరి సీఎం ఫ్లెక్సీ పెట్టాల్సిందేనని పట్టుబట్టగా, వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే జేడీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సభను ముగిస్తున్నామనీ, ప్రజలు దరఖాస్తులను కౌంటర్ల వద్ద ఇవ్వాలని, పథకాలు మంజూరైన లభ్ధిదారులు ధ్రువీకరణ పత్రాలను తీసుకు వెళ్లాలని చెప్పి సభను ముగించారు. -
నా విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు?
-
నా విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు?
విశాఖ : గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న గిరిజన మంత్రి బాలరాజు తన కోపాన్ని ఈసారి సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుపై చూపారు. తన విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రచ్చబండ విషయంలో తనకు సమాచారం లేదని బాలరాజు తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చాకే తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నారు. రాజకీయ నేతలు రాజకీయం చేయకపోతే వ్యాపారాలు చేస్తారా అని అన్నారు. వ్యక్తులకు విధేయత చూపటం తన పద్ధతి కాదని బాలరాజు వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అన్నీ తొందర్లోనే సర్దుకుంటాయని మంత్రి బాలరాజు పేర్కొనటం విశేషం. కిరణ్‌కుమార్‌రెడ్డి చోడవరం సభకు వచ్చినప్పుడు గిరిజన శాఖ పథకాన్ని తాను లేకుండా ప్రారంభించడం సమంజసం కాదన్నారు. మరోవైపు బాలరాజు ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. -
నిరసన వేదికలుగా మారిన రచ్చబండ
-
సొంత జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం కిరణ్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో పర్యటన కోసం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరారు. చెన్నై నుంచి హెలికాఫ్టర్‌లో సత్యవేడు సమీపంలోని శ్రీసిటీకి చేరుకుంటారు. అక్కడ అధికార, అనధికార ప్రముఖలతో సమావేశం అవుతురు. ఆ తర్వాత శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌కు చేరుకుని వివిధ యూనిట్లకు భూమిపూజ నిర్వహిస్తారు.అనంతరం హెలికాప్టర్లో తిరుపతి చేరుకుని నగరంలో నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థానం చేస్తారు. అలాగే స్విమ్స్‌లోని పద్మావతి మహిళా వైద్య కళాశాల, చిత్తూరుకు నీటి సరఫరా పథకాలను శంకుస్థాపన చేస్తారు. జిల్లేళ్లమందలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో సీఎం కిరణ్ పాల్గొంటారు. -
రచ్చబండలో ఎమ్మెల్యేని అడ్డుకున్న సమైక్యవాదులు
-
రచ్చబండలో సీఎం,మంత్రులకు సమైక్య సెగలు
-
పితానికి సీఎం క్లాస్
ఏలూరు, న్యూస్‌లైన్ :సభలు, సమావేశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ శనివారం క్లాస్ తీసుకున్నారు. పెనుగొండ మండలం జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించినరచ్చబండ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ‘మరో ముఖ్యమంత్రి’ అని మంత్రి పితాని సంబోధించిన నేపథ్యంలో ఆయనపై సీఎం కిరణ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పితాని చేసిన వ్యాఖ్యను సభావేదికపై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తేలికగానే తీసుకున్నారు. సభ ముగిశాక పెనుగొండలోని మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకున్న సీఎం శుక్రవారం రాత్రి అక్కడే బస చేసిన విషయం విదితమే. పితాని చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో మంత్రి పితానిని ఉద్దేశించి ‘మరో ముఖ్యమంత్రి అనడం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులొస్తాయ్’ అంటూ శనివారం ముఖ్యమంత్రి చిరుకోపం ప్రదర్శించారని సమాచారం. -
రచ్చబండలో సమైక్య హోరు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కార్యక్రమం అడుగడుగునా సమైక్య నిరసనల మధ్య కొనసాగింది. కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్న రచ్చబండకు పోలీసులు పలు ‘ముందు జాగ్రత్త’ చర్యలు చేపట్టారు. కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే భయంతో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలను ముందే అదుపులోకి తీసుకోవడమో, గృహనిర్బంధంలో ఉంచడమో చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను కోసం శుక్రవారం నుంచే వెతుకుతున్న పోలీసులు చివరకు ఆయన సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా చిల్లకల్లులో అరెస్ట్ చేశారు. అయినప్పటికీ రచ్చబండలో సీఎంకు సమైక్య సెగ తప్పలేదు. కిరణ్ ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై సంక్షేమపథకాల రూపశిల్పి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో లేకపోవడం పట్ల మహిళలు నిరసన తెలిపారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఇంతమంది పాల్గొన్న సభలో ఎవరో ఒకరు హడావిడి చేస్తూనే ఉంటారు, పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు. పోలీసులు అడ్డుకున్నా.. మహిళలు తమ ఆందోళన ఆపలేదు. ‘రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర ఎడారి’ అనే ఫ్లెక్సీలతో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు బెమ్మవరపు కృష్ణకుమారి, కఠారి సుజాత, అమీర్‌బీ, బుజ్జి నిరసన తెలిపారు. ‘ముఖ్యమంత్రి గారూ.. సీమాంధ్ర ప్రజల మొర ఆలకించండ’ంటూ నినదాలు చేశారు. సమైక్యానికి మద్దతు ఇచ్చేవారు చేతులు ఎత్తాలని ముఖ్యమంత్రి కోరినప్పుడు కూడా కొందరు లేచి జై జగన్ నినాదాలు చేశారు. మరోవైపు ఇందిరమ్మ మోడల్ కాలనీ వాసులు తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ముఖ్యమంత్రి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిత్తూరులో: తిరుపతి రూరల్ మండలంలో రచ్చబండకు హాజరయ్యేందుకు వస్తున్న మంత్రి గల్లా అరుణకుమారిని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు అడ్డుకునే యత్నం చేశారు. పోలీసులు చెవిరెడ్డి సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేశారు. చంద్రగిరిలోనూ మంత్రి గల్లాను అడ్డుకునేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో: అనంతపురం జిల్లా కుందుర్పిలో ‘రచ్చబండ’లో పాల్గొన్న మంత్రి రఘువీరారెడ్డికి ‘సమైక్య’సెగ తగలకుండా శనివారం ఉదయాన్నే వైఎస్సార్సీపీ నాయకులను, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కార్యక్రమం ముగించుకుని వెళ్లిన తరువాత వారిని వదిలిపెట్టారు. పోలీసు చర్యలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పశ్చిమగోదావరిలో: పాలకొల్లులో రచ్చబండకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణలు హాజరయ్యారని తెలుసుకున్న ఉద్యోగ జేఏసీ నాయకులు అక్కడికి వచ్చి పెద్దపెట్టున సమైక్య నినాదాలు చేశారు. అనంతరం నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, కన్వీనర్ డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ తదితరులను కావూరి పిలిపించుకుని మాట్లాడారు. మంత్రి పదవి రాగానే సమైక్యవాదాన్ని ఎందుకు దాటవేశారని ఉద్యోగులు ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణాలోనూ రచ్చ.. తెలంగాణ జిల్లాల్లో శనివారం జరిగిన మూడోవిడత రచ్చబండ సభలు రచ్చ..రచ్చగా మారాయి. తెలంగాణను అడ్డుకుంటున్నాడంటూ.. పలుచోట్ల సీఎం కిరణ్ ఫ్లెక్సీలను, హోర్డింగులను తెలంగాణవాదులు తొలగించారు. నల్లగొండలో కిరణ్ ఫొటోతో రచ్చబండ సభలు జరపొద్దంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే సీఎం కిరణ్ ఫ్లెక్సీని చించి దహనం చేశారు. ఆలేరులో టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ సమక్షంలోనే సీఎం ఫొటో ఉన్న వాల్‌పోస్టర్లను చించివేశారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో సభా వేదికపై ఫ్లెక్సీలో కిరణ్ ఫొటో పెట్టడంపై జేఏసీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఆయన ఫొటో కనబడకుండా తెల్లకాగితం అతికించారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో రచ్చబండ సభావేదికపై కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కించడాన్ని టీడీపీ, సీపీఎం నాయకులు తప్పుబట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ ఆందోళన దిగిన 13 మంది సీపీఎం నేతలను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్ జిల్లా రామగుండంలో అధికారులు సీఎం ప్రసంగ పాఠాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అడ్డుకున్నారు. బోయిన్పల్లిలోనూ సీఎం ప్రసంగాన్ని వివిధ పార్టీల నాయకులు అడ్డుకొని, పోస్టర్‌పై ఉన్న ఆయన ముఖం కనిపించకుండా రంగుపూశారు. వీణవంకలో వేదికపై ఫ్లెక్సీలో కిరణ్ ముఖం కనిపించకుండా పేపర్లు అతికించారు. సీఎం సన్నిహితుడైన హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్న సైదాపూర్ రచ్చబండ సభలోనూ ప్రసంగ పాఠాన్ని బహిష్కరించారు. ముస్తాబాద్‌లో వేదికపై ఫ్లెక్సీలో ఫొటో ముద్రించలేదు. ఆదిలాబాద్ రచ్చబండలో కిరణ్ ఫొటో ఫ్లెక్సీని పెట్టడంతో తెలంగాణవాదులు, టీఆర్ఎస్ నేతలు చింపివేశారు. అనంతరం సీఎం ఫొటోస్థానంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా ఫొటోను అతికించారు. సీఎం చర్యలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో టీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం ఫొటోకు చెప్పుల దండ వేశారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీఎం కిరణ్ వైఖరిని నిరసిస్తూ ఈనెల 18,19 తేదీల్లో కామారెడ్డి నియోజకవర్గంలో జరిగే రచ్చబండను బహిష్కరించనున్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ తెలిపారు. -
రచ్చబండలో కాంగ్రెస్ నేతలను తిట్టిపోసిన మహిళలు
-
'ఎర్రబెల్లి స్థాయి సీఎం రమేష్‌కు లేదు'
తెలంగాణ ప్రాంతానికి సీఎం ఎవరూ లేరని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ శనివారం న్యూఢిల్లీలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో కిరణ్ ఫోటోలు పెట్టవద్దని ఆయన తెలంగాణ ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రాంతంలోని టీడీపీ నేతలు ఇప్పటికైనా ఆ పార్టీ వీడాలని ఆయన హితవు పలికారు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత దయాకరరావుని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించడం పట్ల ఎంపీ రాజయ్య శనివారం న్యూఢిల్లీలో మండిపడ్డారు. దయాకరరావు గురించి మాట్లాడే స్థాయి సీఎంకు లేదని రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సీఎం రమేష్‌కు రాజయ్య ఈ సందర్బంగా హితవు పలికారు. తెలుగుదేశం పార్టీలో అర్హత లేని వ్యక్తులకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారంటూ సీఎం రమేష్‌పై ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్ట్‌లను అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలను సీఎం రమేష్ ఖండించారు. ఎర్రబెల్లికి చదువు సంస్కారం లేవని సీఎం రమేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
వీర్లపాడు రచ్చబండ కార్యక్రమం రసాభాస
కృష్ణా: రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకు, రాజకీయనాయకుల వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన జిల్లాలోని వీర్లపాడులో శుక్రవారం చోటు చేసుకుంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రచ్చబండకు ఆలస్యంగా రావడంతో కోపోద్రోక్తులైన ప్రజలు ఆయన తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలను ఎంపీ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రచ్చబండలో తమ సమస్యలను వివరించాలని వచ్చిన ప్రజలకు ఈ ఘటన మరింత ఆవేశం తెప్పించింది. ఈ క్రమంలోనే ప్రజలకు, పోలీసులకు తోపులాట జరిగింది. అనంతరం మాట్లాడిన రాజగోపాల్ ప్రజా సమస్యలను మరిచి మాట్లాడారు.ఈయన పోకడ ప్రజలకు నచ్చకపోవడంతో రచ్చబండ కార్యక్రమంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. -
విభజనతో అభివృద్ధి ఆగిపోతుంది-సిరణ్
-
పదవి నాకు లెక్కలోది కాదు: సీఎం కిరణ్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య గళం వినిపించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సమైక్యం కోసం చేసే పోరాటంలో తన పదవిని సైతం లెక్క చేయనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతామన్నారు. ఆ క్రమంలోనే నాగార్జున, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టగలిగామని కిరణ్ ఉదాహరించారు. విభజన నిర్ణయాన్నితనతోపాటు సీమాంధ్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. విభజనతో రెండు ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రాంతానికే మరింత నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఓ వేళ విభజిస్తే హైదరాబాద్ విషయాన్ని ఏం చేస్తారని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట విభజనను పునఃపరిశీలించాలని సీఎం కిరణ్ ఈ సందర్భంగా కేంద్రానికి సూచించారు. -
విశాఖ చేరుకున్న కిరణ్.. పోలీసుల ఓవరాక్షన్
-
విశాఖ చేరుకున్న కిరణ్.. పోలీసుల ఓవరాక్షన్
రచ్చబండ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం బయల్దేరి ఆయన విశాఖపట్నం వెళ్లారు. శంషాబాద్ ప్రాంతంలో తీవ్రంగా పొగమంచు కమ్ముకోవడంతో ఆయన ప్రయాణం కొంత ఆలస్యమైంది. అయితే.. ముఖ్యమంత్రి పర్యటన పేరు చెప్పి చోడవరంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. రచ్చబండ కార్యక్రమం ఉందంటూ పలు దుకాణాలను బలవంతంగా మూయించారు. దీంతో పోలీసుల తీరు పట్ల వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
తాడిపత్రిలో రచ్చబండ రచ్చ రచ్చ
-
రచ్చబండలో నిరసనల హోరు
ఉండి, న్యూస్‌లైన్ : ఉండి మార్కెట్‌యార్డులో గురువారం జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిరసనలతో హోరెత్తింది. ఇళ్లస్థలాలు మంజూరు చేయాలంటూ సీపీఎం కార్యకర్తలు ఎంపీ బాపిరాజు, ఎమ్మెల్యే శివరామరాజు, ఆప్కాబ్ వైస్ చైర్మన్ ముత్యాల రత్నంను నిలదీశారు. ఈనేపథ్యంలో అక్కడ ఘర్షణ ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సీపీఎం కార్యకర్తలను, నాయకులను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనకారులు ఉండి ప్రధాన సెంటర్ వద్ద రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఇదిలా ఉండగా సభలో వైసీపీ మండల కన్వీనర్, గ్రామ ఉపసర్పంచ్ ఏడిది వెంకటేశ్వరరావు ప్రజాప్రతినిధుల తీరుపై మండిపడ్డారు. నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని ధ్వజమెత్తారు. ఉండి అక్విడెక్టు నిర్మించేందుకు 2009లో శంకుస్థాపన చేయగా నేటికి అక్విడెక్టు నిర్మించలేదన్నారు. దీనివల్ల మండలంలోని సుమారు 7 గ్రామాల్లో పొలాలు ముంపునకు గురై సార్వా పంటను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పంట ఖర్చులకు అనుగుణంగా రుణాలు పంపిణీ చేయడం లేదని, రైతులనుంచి పెద్ద మొత్తంలో బీమా సొమ్ము చెల్లించుకొని ఆ స్థాయిలో నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. అన్ని వర్గాల వారికి విద్యుత్ చార్జీలు మోయలేని భారంగా మారాయన్నారు. ఉండిలో కళాశాల, కల్యాణ మండపం నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాప్రతినిధుల చెవులకు ఎక్కడం లేదని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలు ఎల్లకాలం ఉండేవి : ఎంపీ బాపిరాజు ప్రజా సమస్యలు ఎల్లకాలం ఉంటాయని నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాల సమస్య చాలా జఠిలమైందని, వాటిని పరిష్కరించడం కష్టదాయకమన్నారు. ఆందోళన నిర్వహించి ప్రజాప్రతినిధులను నిలదీసినా చేసేదేమిలేదన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించి తమకు లేదా అధికార బృందానికి తెలియజేస్తే వెంటనే ఆ స్థలాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలనేవి నిత్యం పునరావృతం అవుతాయన్నారు. తాను సమైక్యవాదినే అని ఈ సభలో కూడా తెలియజేశారు. ఆప్కాబ్ ఉపాధ్యక్షుడు ముత్యాల రత్నం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే శివ మాట్లాడుతూ అక్విడెక్టు నిర్మాణం, జూనియర్ కళాశాల కళాశాల స్థాపన వంటి సమస్యలు పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నామన్నారు. ఉండి ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణకు కాలువపై రెండో వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. రచ్చబండ కమిటీ సభ్యులు చిక్కాల జగదీష్, రుద్రరాజు రంగరాజు, ముదునూరి రమాదేవి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముదునూరి కొండ్రాజు, వైసీపీ టౌన్ అధ్యక్షుడు గుల్లిపల్లి అచ్చారావు, కొత్తపల్లి రమేష్‌రాజు, పొత్తూరి వెంకటేశ్వరరాజు, బీసీ సెల్ మండల కన్వీనర్ కె.శివనాగరాజు, మహిళా విభాగం కన్వీనర్ గడి జయలక్ష్మి, కమతం బెనర్జీ, శేషాద్రి శ్రీను, కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి గాదిరాజు లచ్చిరాజు, ఏఎంసీ వైస్‌ఛైర్మన్ కరిమెరక రామచంద్రరావు, సర్పంచ్ ముదునూరి విజయ, ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీడీవో రమాదేవి, ఎంఈవో బీఐఐ న్యూటన్, తహసిల్దార్ వై.దుర్గాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఖరారు
ఏలూరు, న్యూస్‌లైన్ :ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 3 గంట లకు పెనుగొండలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకుం టారు. అక్కడ అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రయూణించి 3.30 గంటలకు పోడూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే రచ్చబండ సభలో పాల్గొంటారు. వివిధ పథకాల కింద ఉపకరణాలు, మంజూరు పత్రాలు అందిస్తారు. సాయంత్రం 6గంటలకు పెనుగొండ ఏఎంసీ అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. -
రాజకీయ ‘రచ్చ’బండ
బొబ్బిలి/రూరల్, న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ఎత్తుగడలకు ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని ఆ పార్టీ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారు. బొబ్బిలి రాజులు, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతు న్న రచ్చబండ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా రు. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ఆయన ఆ పార్టీలో ఉన్న కొంతమందితో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కూడా ఉత్తర్వులు జారీ చేసేంది. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమానికి అధికారికంగా ఎమ్మెల్యే లేకపోవడంతో మంత్రి బొత్స బొబ్బిలిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఏకంగా మం డలానికి ఒక కమిటీని నియమించారు. మాజీ ఎమ్మెల్యే, పీసీసీ కార్యవర్గ సభ్యుడు శంబంగి వెంకట చినఅప్పలనాయుడుకు తెర్లాం మండలం మినహా మిగతా అన్ని మండలాల్లోనూ ప్రత్యేక స్థానం కల్పించారు. సర్పంచ్‌లను చైర్మన్లుగా, మిగతా అధికార పార్టీ పెద్దలను సభ్యులుగా నియమించారు. దీనికి జిల్లా యంత్రాంగం ఆమో దం తెలిపి ఆయా మండల, మున్సిపాలిటీలకు ఉత్తర్వు లు జారీ చేసింది. వారి ఆధ్వర్యంలోనే రచ్చబండ నిర్వహించాలని పేర్కొరింది. బొబ్బిలి పురపాలక సంఘానికి శంబంగితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తినాయుడులను కమిటీగా నియమిస్తూ మున్పిపల్ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యూరుు. అలాగే బొబ్బిలి మండలానికి శంబంగితో పాటు ఆయన సోదరుడు పక్కి సర్పంచ్ శంబంగి వేణుగోపాలనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు బొద్దల పద్మావతిలను కమిటీగా వేశారు. తెర్లాంలో నందబలగ సర్పంచ్ గుల్లి పల్లి శ్రీనివాసరావు చైర్మన్‌గా, ఆ మండల అధికార పార్టీ నాయకుడు నర్సుపల్లి బాబ్జీరావు, రాజయ్యపేట సర్పం చ్ గవర సత్యవతిలను సభ్యులుగా నియమించారు. బాడంగిలో శంబంగితో పాటు సర్పంచ్ చొక్కాపు ఆది లక్ష్మి చైర్మన్‌గా, డీసీసీబీ డెరైక్టర్ వాసిరెడ్డి తిలక్ కిరణ్ కుమార్ సభ్యులుగా కమిటీని వేశారు. రామభద్రపురం మండలానికి శంబంగితో పాటు దుప్పలపూడి సర్పంచ్ మరవ సత్యవతి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పికొండ శ్రీరాములునాయుడులను కమిటీగా నియమించారు. నియోజకవర్గంలో పట్టుకోసమే... రచ్చబండ ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నా యకులు పక్కా ప్రణాళికతో ప్రజల వద్దకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. బొబ్బిలిలో ఉంటున్న ఓ నాయ కుడు ముందుగానే ఆయూ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ వారికి, తమను నమ్ముకున్న వారికి ఎలాగైనా పింఛన్లు, ఇళ్లు ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేకాధికారులతో సంతకాలు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. ఏదిఏమైనా ఆ పార్టీ నాయకులు రచ్చబండను రాజకీయంగా ఉపయో గించుకుంటున్నారు. -
పోలీసుల నీడన రచ్చబండ
సాక్షి, గుంటూరు :‘రచ్చబండ’ కార్యక్రమం మూడో రోజు బుధవారం జిల్లాలో గట్టి పోలీస్ బందోబస్తు నడుమ జరిగింది. స్థానిక సమస్యలపై ప్రజలు అధికారు లను నిలదీస్తూ ఆందోళనలు చేయడంతో పోలీసులను మోహరింప జేశారు. తెనాలి నియోజకవర్గంలో రెండుచోట్ల, మున్నంగి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి హాజరవగా, పొన్నూరులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, వినుకొండ నియోజకవర్గం నూజెండ్లలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యాన రచ్చబండ నిర్వహించారు. ఆయా చోట్ల ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశం వుందనే ముందస్తు సమాచారం మేరకు పోలీసులను భారీగా మోహరింపజేశారు. నేతలు, అధికారుల వద్దకు ప్రజలు రావడానికి కూడా వీల్లేని విధంగా పోలీసులు గట్టిబందోబస్తు పెట్టారు. అయినప్పటికీ, నేతలు ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలు స్థానిక సమస్యలపై నినాదాలు చేయడంతో అధికారులు బేజారెత్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు, వెళాంగిణి నగర్ ప్రాంతాల్లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరైన రచ్చబండ కార్యక్రమాల్ని కూడా మమ అనిపించారు. రైతుల్ని పట్టించుకోని అధికారమెందుకు గృహ నిర్మాణం, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర అంశాల ప్రాధాన్యతపైనే సాగిన రచ్చబండ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంటనష్టం జరిగినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని పలు చోట్ల రైతులు ఎండగట్టారు. నూజెండ్ల మండలంలో 25 గ్రామాలకు కలిపి ఒకేచోట రచ్చబండ నిర్వహించడంతో ఆయా గ్రామాల నుంచి భారీస్థాయిలో జనం హాజరైనా ప్రజా సమస్యల ప్రస్థావనే రాలేదు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తాయిలాల ‘వల’ విసురుతుందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న గృహనిర్మాణ బిల్లులపై ప్రజలు సంబంధిత శాఖ డీఈని నిలదీశారు. వివిధ పథకాల కింద దరఖాస్తులు పెట్టుకొనేందుకు ప్రజలు పోటీపడటంతో దళారులు ముందుగానే తీయించి తెచ్చుకున్న దరఖాస్తుల జిరాక్స్ కాపీలను ఒక్కొక్కటీ రూ.5, రూ.10కు అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. ఇక్కడే సీపీఐ నేతలు రచ్చబండకు వ్యతిరేకంగా నినాదా లిచ్చారు. ప్రతీ గ్రామానికి రచ్చబండ నిర్వహించడం మంచిదని ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రజలు ఖండించాలని ఆపార్టీ నేతలు బహిరంగంగా పిలుపునిచ్చారు.అధికారులపై మండిపాటు.. రచ్చబండకు సంబంధించి ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, లబ్ధిదారులకు సరైన సమాచారం అందజేయలేదని అధికారులపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆయా ప్రాంతాల్లో మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లు పింఛన్ల జాబితాలో కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాబోయే ఎన్నికల్లో మంచివ్యక్తిని ఎన్నుకోండి
కడప : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'రచ్చబండ' కార్యక్రమాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వృద్ధుల కోసం కేటాయించిన రూ.9కోట్లు ఫించన్లు వారికి చేరలేదన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోందని డీఎల్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. మరోవైపు పలు జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమం అభాసుపాలవుతోంది. అధికార పార్టీ నేతలతో, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అభివృద్దిపై కొందరు, సమైక్యాంధ్రపై మరికొందరు నిలదీస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తిరుపతి ఎంపీ చింతామోహన్, సత్యవేడు ఎమ్మెల్యే హేమలతను సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. పదవులకు పార్టీకి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సమైక్యవాదులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం రచ్చబండలో పాల్గొనేందుకు వచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చారంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే పులపర్తి అసహనం వ్యక్తం చేస్తూ స్టేజీ దిగి వెళ్లిపోయారు. మరోవైపు కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ముఖ్యమంత్రి కిరణ్ నివేదిక ప్రసంగాన్ని చదవకుండానే మంత్రి శ్రీధర్‌బాబు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
భయపడి 'సీఎం రచ్చబండ' వాయిదా వేయలేదు
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. ఆదిలాబాద్‌లో తెలంగాణ సభ ఉన్నందునే మెదక్‌లో రచ్చబండ వాయిదా వేసినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి మంగళవారమిక్కడ తెలిపారు. అయితే టీఆర్ఎస్, జేఏసీ బెదిరింపులకు భయపడి కార్యక్రమాన్ని వాయిదా వేయలేదని ఆయన స్పష్టం చేశారు. రచ్చబండ వాయిదా వేసుకోమని తెలంగాణ మంత్రులు కోరినట్లు ఆయన తెలిపారు. కాగా త్వరలోనే ముఖ్యమంత్రితో మెదక్‌లో సభ పెడతామని జగ్గారెడ్డి తెలిపారు. కాగా సంగారెడ్డిలో ‘రచ్చబండ’ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. రచ్చబండ కార్యాక్రమంలో పార్టీ నేతలెవరూ పాల్గొనరాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీఎం పాల్గొనే రచ్చబండను బహిష్కరిస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేయగా, టీఆర్ఎస్ ఆ రోజు ఏకంగా జిల్లాబంద్‌కు పిలుపునిచ్చింది. -
తూతూ మంత్రంగా సాగిన రచ్చబండ కార్యక్రమం
-
చచ్చుబండ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కేవలం ప్రచారం కోసమేనని తేలిపోయింది. ఇదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమైన తరుణంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజాగ్రహానికి కారణమవుతోంది. కర్నూలు, మహానందిలో సోమవారం ప్రారంభమైన 3వ విడత రచ్చబండ తీరుతెన్నులే ఇందుకు నిదర్శనం. కర్నూలులో మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనేక మంది సమస్యలపై వినతులు ఇవ్వాలని వచ్చినప్పటికీ ఏ ఒక్కరి నుంచి అర్జీలు తీసుకోలేదు. సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రచ్చబండలో జనానికి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే ఏ ఒక్కరినీ మాట్లాడించిన దాఖలాలు లేవు. గతంలో నివర్వహించిన రచ్చబండలో వచ్చిన ఫిర్యాదుదారుల్లో ఓ ముగ్గురిని పిలిచి రేషన్ కార్డు, కూపన్లు, బంగారుతల్లి పథకం, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు. అయితే వాటిలో రవి అనే వ్యక్తి ఇచ్చిన రేషన్‌కార్డులో పేరు తప్ప అతని ఫొటో లేదు, వారి కుటుంబసభ్యుల పేర్లు లేనే లేవు. వచ్చిన వారంతా అధికారుల కనుసన్నల్లో మెలిగే వారే కనిపించారు. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదిలా ఉంటే రచ్చబండలో సమస్యలపై ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో ముందస్తు చర్యగా పోలీసులను భారీగా మొహరించారు. అందులో భాగంగానే కొంతమంది సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించటం గమనార్హం. మహానందిలో జరిగిన రచ్చబండ కార్యక్రమాని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. రచ్చబండలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనేక మంది గిరిజనులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఏ ఒక్కరికీ పరిష్కారం దొరకలేదు. ఇదే విషయాన్ని పార్వతీపురం కాలనీకి చెందిన గిరిజన మహిళలు వెంకటమ్మ, చందు, సుబ్బమ్మ మంత్రి ఏరాను నిలదీశారు. అదేవిధంగా బుక్కాపురం గ్రామానికి చెందిన వికలాంగుడు అందెరాముడు, శ్రీనివాసులు తదితరులు ఫించన్లు ఇస్తారోమోనని వచ్చారు. అయితే వారికీ నిరాశే మిగిలింది. చేస్తాం.. చూస్తాం.. అంటూ అధికారులను కలవమని చెప్పి ఎవరి దారిన వారు వెళ్లిపోవడం గమనార్హం. -
13 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఈ నెల 13 నుంచి 26 వరకు మూడోవిడత రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులకు పింఛన్లు, రేషన్ కూపన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాల ఫలాలు అందించనున్నట్లు చెప్పారు. మొదట మోమిన్‌పేట మండల కేంద్రంలో ఈ నెల 13న కార్యక్రమం ప్రారంభమవుతుందని, రచ్చబండ కార్యక్రమంపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా సమాచార శాఖ ద్వారా పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నిర్దేశించిన తేదీల వారీగా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. -
నేటి నుంచి మూడో విడత రచ్చబండ
-
నేటి నుంచి రచ్చబండ
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలో మూడో విడత రచ్చబండ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కలెక్టర్ విజయకుమార్ చినగంజాంలో రచ్చబండ గ్రామసభ నిర్వహించనున్నారు. గత రచ్చబండలో వచ్చిన అర్జీలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఈ రచ్చబండలో వారికి ప్రయోజనాలు కల్పించాలని తీర్మానించారు. దీనికిగాను మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 1,60,341గా జిల్లా యంత్రాంగం పేర్కొంది. వీటిలో జిల్లా పౌరసరఫరాల శాఖ ద్వారా 51,942 మందికి రేషన్ కార్డులు, 33,683 మందికి పెన్షన్లు, 1813 మందికి బంగారు తల్లి సర్టిఫికెట్ల పంపిణీ చేయనున్నారు. హౌసింగ్ ద్వారా 2062 మంది లబ్ధిదారుల గుర్తింపు, సాంఘిక సంక్షేమశాఖకు చెందిన 38, గిరిజన సంక్షేమశాఖకు చెందిన 2 భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు సాంఘిక సంక్షేమశాఖ ద్వారా 66,262 మంది ఎస్సీ గృహ వినియోగదారులకు రూ 1.47 కోట్లు, 4579 గిరిజన కుటుంబాలకు కరెంటు బకాయిలను గిరిజన సంక్షేమశాఖ ద్వారా చెల్లించాలని నిర్ణయించారు. 17,081 మంది రేషన్ కార్డులకు అనర్హులు: రేషన్ కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 69,023 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో 51,942 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. 17081 మందిని అనర్హులుగా పేర్కొన్నారు. యర్రగొండపాలెం 1536, దర్శి 1550, పర్చూరు 1323, అద్దంకి 941, చీరాల 1194, సంతనూతలపాడు 1160, ఒంగోలు 536, కందుకూరు 1147, కొండపి 1416, మార్కాపురం 2424, గిద్దలూరు 1627, కనిగిరి 2227 కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. అత్యధికంగా మార్కాపురం నియోజకవర్గంలో 43.3 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం గమనార్హం. ఒంగోలులో అర్హులైన దరఖాస్తుదారులకు మొండిచేయి చూపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంజూరైన వారికి కూడా రేషన్ కార్డులను పంపిణీ చేసే పరిస్థితి కనిపించడంలేదు. కేవలం తెల్లకార్డుదారుల ప్రయోజనాలను పొందేందు కు వీలుగా రేషన్కూపన్లు ఈ రచ్చబండలో ఇవ్వాలని నిర్ణయించారు. 33,683 మందికి పెన్షన్లు: జిల్లా వ్యాప్తంగా 33,683 మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే యర్రగొండపాలెం 2993, దర్శి 3231, పర్చూరు 2500, అద్దంకి 3826, చీరాల 2617, కొండపి 3661, మార్కాపురం 2349, గిద్దలూరు 3447, కనిగిరి 3206 మంది వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేతలు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ ఈ రచ్చబండలో చేయాలని నిర్ణయించారు. 1813 మందికి బంగారు తల్లి నమోదుపత్రాలు: జిల్లాలోని 1813 మందికి రచ్చబండ కార్యక్రమంలో బంగారుతల్లి పథకం నమోదు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. వై.పాలెంలో 187, దర్శి 134, పర్చూరు 164, అద్దంకి 167, చీరాల 77, సంతనూతలపాడు 106, ఒంగోలు 35, కందుకూరు 167, కొండపి 122, మార్కాపురం 158, గిద్దలూరు 252, కనిగిరిలో 244 మందిని ఎంపిక చేశారు. గృహనిర్మాణశాఖ రుణాలు 83,396 మందికే: గృహనిర్మాణశాఖ ద్వారా రుణాల కోసం 99,125 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 83,396 మంది మాత్రమే అర్హులని అధికారులు తేల్చారు. అంటే 15,729 మంది అనర్హులుగా నిర్ణయించారు. ఇక రచ్చబండ 1,2ల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికీ 43,951 మంది అర్హులకు రుణాలు అందించాల్సి ఉంది. వీరిలో ఎస్సీలు 10,190, ఎస్టీలు 1331, మైనార్టీలు 2,235, బీసీ, ఇతరులు 30,195 మంది ఉన్నారు. తొలి, రెండో విడత రచ్చబండలోనివారే ఇంత మంది పెండింగ్‌లో ఉంటే మరి కొత్తగా అర్హులుగా గుర్తించిన వారికి రుణాలు ఇక ఎప్పుడు అందజేస్తారనేది వేచిచూడాల్సిందే. శిలాఫలకాలు: పీ.దోర్నాల, మారెళ్ల, దొనకొండ, మార్టూరు, అద్దంకి, వేటపాలెం, ఒంగోలు, ఉలవపాడు, గిద్దలూరుల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్మాణాల కోసం ఒక్కోదానికి రూ 80 లక్షలు కేటాయిస్తూ శిలాఫలాకాలు వేయనున్నారు. వీటితోపాటు రూ 7.50 లక్షల చొప్పున 12 నియోజకవర్గాల్లో 24 సామాజిక భవనాలకు, ఒంగోలులో ఒక్కోటి రూ 2 కోట్లతో ఎస్సీ బాలికల, బాలుర హాస్టళ్లు, కందుకూరు బాలుర, మార్కాపురంలో బాలికల కోసం హాస్టళ్లు నిర్మించేందుకు శిలాఫలకాలు వేయాలని నిర్ణయించారు. కనిగిరిలో రూ 3 కోట్లతో ఇంటిగ్రేటెడ్ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు వీటిలో చాలావాటికి తహసీల్దార్లు స్థలాన్ని కూడా మంజూరు చేయలేదు. అయినప్పటికీ శిలాఫలకాలు వేసుకొని తృప్తి చెందేందుకే అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రచ్చబండ షెడ్యూలు ఇదీ: 11వ తేదీ చినగంజాం, పుల్లలచెరువు, 12న ఇంకొల్లు, కారంచేడు, కురిచేడు, 13న హనుమంతునిపాడు, 15న మార్టూరు, యద్దనపూడి, సీఎస్‌పురం, తర్లుపాడు, గిద్దలూరు, 16న ఒంగోలు, బల్లికురవ, జరుగుమల్లి, వెలిగండ్ల, కొమరోలు, 19న కొత్తపట్నం, కొండపి, పామూరు, ముండ్లమూరు, చీరాల మున్సిపాలిటీ, గిద్దలూరు నగర పంచాయతీ, 20న కొరిశపాడు, కందుకూరు, పొన్నలూరు, కనిగిరి, బేస్తవారిపేట, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీ, కనిగిరి నగర పంచాయతీ, 21న నాగులుప్పలపాడు, సంతమాగులూరు, వలేటివారిపాలెం, త్రిపురాంతకం, అర్ధవీడు, 22న మద్దిపాడు, జే పంగులూరు, లింగసముద్రం, పొదిలి, దొనకొండ, కంభం, 23న సంత నూతలపాడు, అద్దంకి, గుడ్లూరు, మర్రిపూడి, తాళ్లూరు, దోర్నాల, మార్కాపురం మున్సిపాలిటీ, అద్దంకి నగర పంచాయతీ, 24న ఉలవపాడు, 25న చీమకుర్తి, సింగరాయకొండ, దర్శి, మార్కాపురం, చీమకుర్తి నగర పంచాయతీ, 26న చీరాల, వేటపాలెం, కొనకనమిట్ల, పెద్దారవీడు మండల కేంద్రాల్లో రచ్చబండ గ్రామసభలు జరుగుతాయి. -
‘చచ్చు’బండ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పేరుతో అట్టహాసంగా ప్రచారం నిర్వహిస్తున్న రచ్చబండ.. చచ్చుబండగా మారింది. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెపుతున్నప్పటికీ ఈ కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత దరఖాస్తుదారులలో ఏడాది తర్వాత సగం మందికి మాత్రమే మోక్షం కలిగింది. మిగిలిన సగం దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. మళ్లీ 2011 నవంబర్‌లో మలివిడత రచ్చబండ నిర్వహించగా... నేటికీ ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం కలుగలేదు. కాగా, సోమవారం నుంచి మూడో విడత రచ్చబండ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో తొలివిడత రచ్చబండ కార్యక్రమాన్ని 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆర్భాటంగా నిర్వహించారు. గ్రామసభల్లో ప్రధానంగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. మళ్లీ అదే సంవత్సరం నవంబర్‌లో మలివిడత రచ్చబండ నిర్వహించారు. అందులో మొదటి విడత లబ్ధిదారులు కొందరికి పథకాలు అందించి చేతులు దులుపుకున్నారు. రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ‘ఆన్లైన్ చేస్తున్నాం.. త్వరలో రేషన్‌కార్డులు, ఫించన్లు, ఇళ్లు వస్తాయి’ అంటూ అధికారులు తిప్పుకుంటున్నారే తప్ప.. ఒరిగిందేమీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, గతనెల 24 వరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులందరికీ మూడో విడత రచ్చబండలో సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గత రచ్చబండ కార్యక్రమాల్లో ఇచ్చిన దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించకుండా గతనెల 24 వరకు వచ్చిన వాటిని పరిష్కరించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. అమలుకు నోచని ఇందిరమ్మ ఇళ్లు.. అభివృద్ధి పథకాల అమలులో ప్రభుత్వ అలసత్వంతో మొదటి విడత లబ్దిదారులకు ఇప్పటివరకు ఇళ్లు మంజురు కాలేదు. రెండు విడతల్లో 1,13,928 మంది లబ్దిదారులు అర్హులుగా గుర్తించారు. ఇవికాకుండా గ్రీవెన్స్, ఇతర కార్యక్రమాల్లో మరికొందరు దరఖాస్తు చేస్తున్నారు. ఇలా అక్టోబర్ 24 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఈ రచ్చబండలో 61,958 మందికి మంజురూ చేస్తామని అధికారులు చెపుతున్నారు. గుర్తించిన వారిలోనూ కొందరికి రేషన్‌కార్డు లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదు. ఫించన్ల కోసం గత రచ్చబండలో 29,678 మంది దరఖాస్తు చేసుకోగా, నేటికీ వారికి ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనిదే తామేమీ చేయలేమని అధికారులు చేతులెతేస్తున్నారు. రెండోవిడత రచ్చబండలో 62,558 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 42,096 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కానీ వారికి ఇప్పటి వరకూ కార్డులు మంజురు చేయలేదు. దీంతో వారు ఏ ప్రభుత్వ పధకానికీ అర్హులు కావడం లేదు. ప్రచారానికే ప్రాధాన్యత.. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు మోక్షం చూపని ప్రభుత్వం.. ఈ నెల 11 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రచార ఆర్భాటాల కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. -
నేటి నుంచి రచ్చబండ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో నేటి నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలుత ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరు కావడం లేదు. ఇన్చార్జి మంత్రిగా నియామకం అయిన ఆయన జిల్లా సమస్యలపై ఒక్కసారి డీఆర్సీ నిర్వహించారు. అనంతరం ఇప్పటివరకు ఏ సమస్య పరిష్కారానికీ చొరవ చూపలేదు. రచ్చబండ కార్యక్రమ నిర్వహణ ముందు జిల్లాకు వచ్చి ఈ మూడో విడతలో చేపట్టే కార్యక్రమాలను వివరించి వెళ్లారు. రచ్చబండకు హాజరవుతారని అందరూ ఊహించినప్పటికీ ఆయన డుమ్మా కొట్టారు. తరువాత జరిగే కార్యాక్రమాల్లో పాల్గొంటానని చెప్పినట్లు సమాచారం. టేకులపల్లిలో నిర్వహించే రచ్చబండలో కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి పోరిక బలరామ్‌నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. రచ్చబండ నిర్వహణ వివరాలు... ఇల్లెందు నియోజకవర్గంలో టేకులపల్లిలో 11న, 18న గార్ల, 19న బయ్యారం, 15న కామేపల్లి, 22న ఇల్లందు, 23న ఇల్లందు మున్సిపాలిటీ, పినపాక నియోజకవర్గంలో 15న గుండాల, 18న పినపాక, 19న మణుగూరు మున్సిపాలిటి, 20 అశ్వాపురం, 21 మణుగూరు, 22న బూర్గంపహాడ్, పాలేరు నియోజకవర్గంలో 18న ఖమ్మం రూరల్, 19న తిర్మలాయపాలెం, 20న నేలకొండపల్లి, 22న కూసుమంచి, ఖమ్మం నియోజకవర్గంలో 18న ఖమ్మం , రఘనాధపాలెం, 20న ఖమ్మం కార్పొరేషన్లో, మధిర నియోజకవర్గంలో 22న ఎర్రుపాలెం, 23న మధిర, 24న చింతకాని, 25న బోనకల్లు, 26న ముదిగొండ, వైరా నియోజకవర్గంలో 21న ఏన్కూర్, 23న జూలూరుపాడు, 18న కొణిజర్ల, 25న సింగరేణి, 19న వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలో 15న సత్తుపల్లి, 16న సత్తుపల్లి మున్సిపాలిటి, 18న వేసూరు, 20న తల్లాడ, 22న కల్లూరు, 25న పెనుబల్లి, కొత్తగూడెం నియోజకవర్గంలో 18న పాల్వంచ మున్సిపాలిటి, 19న పాల్వంచ, 21న కొత్తగూడెం, అశ్వారరావుపేట నియోజకవర్గంలో 15న వేలేరుపాడు, 19న ముల్కలపల్లి, 21న చండ్రుగొండ, 22న దమ్మపేట, 23న కుక్కునూరు, 25న అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గంలో 11న వాజేడు, 12న చింతూరు, 14న వీఆర్‌పురం, 15న వెంకటాపురం, 19న చర్ల, 20న భద్రాచలం, 22న దుమ్ముగూడెం, 23న కూనవరంలో నిర్వహించనున్నారు. -
రచ్చ.. రాజకీయం
సాక్షి, నల్లగొండ: గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు.. తెలంగాణవాదం... అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ పథకాలు.. రాజకీయ అని శ్చితి.. గ్రూపు గొడవలు.. ఇదీ.. జిల్లావ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా చేపడుతోంది. పల్లెల్లోకి వెళ్తే నిలదీతలు, నిరసనలు తప్పవని భావించింది. వీటి దృష్ట్యా మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించింది. ఈ మేరకు సోమవారం నుంచి 26 తేదీ వరకు రచ్చబండ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల కోసం.... ఏడాదిన్నర కాలంగా జిల్లాలో కొత్తగా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం అర్హత కలిగిన లబ్ధిదారులకు అందించలేకపోయింది. ఐదారుమాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడో విడత రచ్చబండకు తగిన ప్రణాళికతో ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఇటీవల మోక్షం కలిగించారు. అదికూడా అర్హుల్లో కొంతమందికే పథకాలు మంజూరు చేశారు. వీటికి రచ్చబండ -3లో మంజూరు పత్రాలు అందజేయనున్నారు. జిల్లాకు గత ఆగస్టులో 40 వేల మందికిపైగా పెన్షన్లు మంజూరయ్యాయి. వెంటనే వీరికి ప్రతినెలా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికి ఒక్క నెలకూడా పెన్షన్ అందజేయలేదు. వీరందరికి రచ్చబండలో మంజూరు పత్రాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరుగాక ఇతర పథకాలకు సంబంధించి గుర్తించిన వారందరినీ రచ్చబండ జరిగే మండల, మున్సిపాలిటీ కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగిలిన వారు హాజరుకాకపోవడంతో వినతులు తీసుకునే అవకాశం ఉండదు. అంతేగాక నిరసనల నుంచి గట్టెక్కవచ్చని సర్కారు ధీమాగా ఉంది. రాజకీయ లబ్ధిపొందడానికేనని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మొక్కుబడిగా మంజూరు పత్రాలు అందజేయడం, అదికూడా ప్రచార ఆర్భాటాలతో కార్యక్రమం నిర్వహించడం ఎన్నికల జిమ్మికుల్లో భాగమేనని అంటున్నారు. అవసరం లేకున్నా కమిటీలు... ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నైనా తనకు అనుకూలంగా మలచుకుంటోంది. పేదలను ఆదుకునేది తమ ప్రభుత్వమేనని చెబుతూ ఓట్లు దండుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు ఉదాహరణ ప్రస్తుతం జరగనున్న రచ్చబండయే. వాస్తవంగా రచ్చబండ నిర్వహణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ అవసరం లేదు. ఎందుకంటే పథకాలు మంజూరైన వారి అభ్యర్థులను ఇప్పటికే గుర్తించారు. వీరికే రచ్చబండ జరిగే రోజు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ మొత్తం తతంగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కమిటీ అవసరం ఎంత మాత్రమూ లేదు. కానీ సర్కారు కమిటీలు రూపొందించడమేగాక అందులో అధికార పార్టీకి చెందిన వారినే సభ్యులుగా నియమిస్తున్నారు. తద్వారా తామే పథకాలు మంజూరు చేశామని చెప్పుకోవడానికి వీలుంటుంది. అంతేగాక తమది సంక్షేమ ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటుంది. తద్వారా మండల, జిల్లాపరిషత్, సార్వత్రిక ఎన్నికలల్లో లబ్ధి పొందేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది. -
పారదర్శ‘కథ’
సాక్షి, కర్నూలు: రచ్చబండలో అధికార పార్టీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ విడత పార్టీ ప్రమేయాన్ని మరింత పెంచినట్లు స్పష్టమవుతోంది. కార్యక్రమంలో పారదర్శకత తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ విడత ప్రభుత్వం ప్రత్యేక కమిటీలకు శ్రీకారం చుట్టింది. పతి మండలంలో ఆరుగురు అధికారులు, ముగ్గురు సభ్యులకు ఇందులో చోటు కల్పిస్తున్నారు. సభ్యుల్లో సర్పంచ్, ఓ మహిళ, మైనార్టీ వర్గం నుంచి లేదా వార్డు సభ్యుడిని, ఎవరైనా నాయకుడిని ఎంపిక చేసే వీలుంది. ఈ అవకాశాన్ని అధికార పార్టీ నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని ముఖ్య నాయకుల కనుసన్నల్లో 20 రోజుల క్రితం సిద్ధమైన జాబితాలనే అధికారులు ఆమోదించినట్లు సమాచారం. ఉదాహరణకు నంద్యాల పార్లమెంట్ పరిధిలోని మహానంది మండల కమిటీని పరిశీలిస్తే.. సర్పంచ్ జయసింహారెడ్డి, తిమ్మాపురం ఉప సర్పంచ్ అనసూయమ్మ, గోపవరం సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు కొండారెడ్డి ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. పలు మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యలకు, పార్టీ సర్పంచ్‌లకే కమిటీలో అవకాశం కల్పించారు. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెసేతరులకూ అవకాశమే దక్కకపోవడంతో రచ్చబండలో పారదర్శకత ఎలా సాధ్యమనే చర్చ జరుగుతోంది. కమిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులనే ఎంపిక చేయడం వెనుక నిరుపేదలకు అండగా నిలుస్తోంది తమ ప్రభుత్వమే అని బలంగా వినిపించేందుకేనని తెలుస్తోంది. కాంగ్రెసేతర ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, మండలాల్లో ఈ కమిటీ ప్రాబల్యాన్ని మరింత పెంచే యోచనలో అధికార పార్టీ ముమ్మర కసరత్తు చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకండా పింఛన్లు, ఇళ్లు అన్నీ తామే ఇస్తున్నామని చెప్పుకునేందుకు ఈ కమిటీలు ఉపయోగపడనున్నాయి. రచ్చబండ నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపికలో పారదర్శకత తదితర విషయాలను కమిటీలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్చార్జి మంత్రి ప్రతినిధులుగా లబ్ధిదారులకు వివిధ పథకాల అందజేతలోనూ వారు పాల్పంచుకోనున్నారు. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీలను అధికార పార్టీ అన్నివిధాల ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. వేదికపై ఉపన్యసించడంతో పాటు రచ్చబండలో వీరు కీలకం కానున్నారు. ఈ పరిస్థితుల్లో రచ్చబండలో ఏ మేరకు పారదర్శకత ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
తాయిలాల ‘రచ్చ’
బండసాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆరు అంశాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మూడో విడత రచ్చబండకు అధికారులు జిల్లాలో సోమవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 11 నుంచి 26 వరకు నిర్వహించే రచ్చబండలో పూర్తిగా ‘అధికార’ ము ద్ర ఉండేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఎంపీటీసీ, మున్సిపల్‌తోపాటు 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా కార్యక్రమాల రూపకల్పన జరిగిందంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. మొదటి, రెండో విడతల్లో స్వీకరించిన దరఖాస్తులకు ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. మూడో విడతలో ‘తాయిలాలు’గా పరిష్కారం చూపే అవకాశం ఉంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలతోపాటు ఇందిరమ్మ కలలు, బంగారుతల్లి, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లపై శంకుస్థాపన తదితర ఆరు అంశాలకు మూడో విడతలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారపార్టీకి లబ్ధిచేకూరే విధంగా ఇన్చార్జి మంత్రితోపాటు సర్పంచ్, మరో ఇద్దరితో వేసిన కమిటీల ద్వారా దరఖాస్తులు స్వీకరించి లబ్ధిచేకూర్చనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మొదలయ్యే రచ్చబండ తూర్పులో వాంకిడి, పశ్చిమలో బోథ్ మండలాల్లో సోమవారం ప్రారంభం కానుంది. మూడో విడత రచ్చబండ పరిస్థితి ఇదీ.. రచ్చబండ మూడో విడతలో అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్తున్నా... ప్రధానంగా ఆరు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే డీఆర్డీఏ పీడీ, డీఎస్వో, హౌసింగ్ పీడీ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల డీడీలు కచ్చితంగా రచ్చబండకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది. పలు సమస్యలు జిల్లాలో రాజ్యమేలుతున్నా, ఎన్నికల ముందు జనాకర్షక పథకాలకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి, రెండో విడతల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, ఇందిరమ్మ కలల కింద అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఎస్సీ, ఎస్టీ బకాయిలు ఉన్న విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఈ రచ్చబండలో అధిక ప్రాధాన్యం ఉంది. కాగా మూడో విడత రచ్చబండలో 45,294 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. అలాగే 11,210 పింఛన్లు, 11,210 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన 28,603 మంది విద్యుత్ వినియోగదారుల బకాయిలను మాఫీ చేయనున్నారు. రచ్చబండపై అధికార పార్టీ దర్పం మూడో విడత రచ్చబండపై ఈ సారి అధికార పార్టీ ముద్ర కనిపించనుంది. రచ్చబండ నిర్వహించే మండలాల్లో కమిటీలు కీలకపాత్ర నిర్వహించనుండగా... ఆ కమిటీలను జిల్లా ఇన్చార్జి మంత్రి వేయనున్నారు. జిల్లా ఇన్చార్జికి తోడు ఆయన వేసే కమిటీలో సర్పంచి, మహిళా సభ్యురాలితోపాటు మరొకరు ఉంటారు. ఈ కమిటీలను ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రశాంతంగానే పూర్తయినా... ఎమ్మెల్యేలు లేనిచోట అధికార పార్టీలో గ్రూపుల కారణంగా కమిటీల ప్రక్రియ ఇంకా జరగలేదు. అధికారంలో ఉన్న పార్టీ తనకు ప్రయోజనం కలిగించేలా చేసుకోవడం సాధారణ ప్రక్రియే. కాంగ్రెస్ కూడా అదే ధోరణిలో వెళ్లడం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా పనిచేయాలనే తపన ఉన్నవారికి అవకాశం కల్పించడం లేదని కొందరు సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. మూడో విడత రచ్చబండ సందర్భంగా లబ్ధిదారులకు పూర్తిగా అధికార పార్టీ రంగు వేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రానున్న మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త తీసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు ‘స్థానిక’ లబ్ధిచేకూర్చేలా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా మూడో విడత రచ్చబండ లబ్ధిదారులకంటే అధికార పార్టీ నేతలకు లబ్ధిచేకూరేలా ఉందన్న విమర్శల మధ్యన సోమవారం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంపై అందరు దృష్టి సారించారు. -
రచ్చబండ.. ప్రచారమే ఎజెండా
సాక్షి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం మరో రచ్చబండ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు మూడోవిడత రచ్చబండ నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర కు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. జిల్లాలో రెండో విడత రచ్చబండ కార్యక్రమం 2011లో నవంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు జరిగింది. ఈ సమయంలో అడుగడుగునా తెలంగాణ సెగ తగిలింది. చాలా ప్రాంతాల్లో రచ్చబండను అడ్డుకున్నారు. అయితే ఎలాగోలా అధికారులు ప్రజల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను కూడా గుర్తించారు. ఇదంతా ఏడాది క్రితం జరిగింది. అయినా వారికి సంబంధించిన పథకాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇదీ పరిస్థితి... సామాజిక భద్రత పెన్షన్ల కోసం రచ్చబండ -2లో 96,692 మంది నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఇందులో 55,592 మందిని అర్హులుగా గతేడాది గుర్తించారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఇప్పటి వరకు 49,856 మందికి పింఛన్లు మంజూరు చేశారు. వీటినే రచ్చబండ-3లో అధికారికంగా అందజేయనున్నారు. అయితే మిగిలినవారు అర్హులైనా వారిని పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో 5,736 మంది అర్హులకు ఎప్పుడు అందజేస్తారో సర్కారుకే తెలియాలి. అన్ని అర్హతలున్న వీరి పట్ల చిన్నచూపు ప్రదర్శించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 1.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... ఇందులో 74 వేల మందిని అర్హులుగా గుర్తించారు. అయితే వీరందరికీ ఇళ్లు మంజూరు చేసిన పాపాన పోలేదు. కేవలం 42వేల మందికే ఇళ్లు మం జూరు చేసి చేతులు దులుపుకుంది. మిగిలిన 32 వేల మందికి మొండిచేయి చూపింది. తెలుపు రేషన్ కార్డుల కోసం 89,856 మంది నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో దాదాపు 75 వేల మందిని అర్హులుగా గుర్తించి.. కేవలం 47,500 మందికే కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డుదారులకు సంబంధించిన ఫొటోలు ఇటీవలే అప్లోడ్ చేశారు. వీరికి మాత్రమే రచ్చబండలో రేషన్ కార్డులు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన వారికి ఫొటోల అప్లోడ్ తర్వాత ఇచ్చే అవకాశాలున్నాయని తెలి పారు. ఈ లెక్కన 27,500 మం దికి ఎదురు చూపులు తప్పవన్న మాట. ఇలా గతంలోనే స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం లభించకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో మరో రచ్చబండ నిర్వహించి ఏంచేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆరు అంశాలకే ప్రాధాన్యం.. 16 రోజుల పాటు జరిగే రచ్చబండలో ఆరు అంశాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. అంతేగాక 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. ఇందిరమ్మ కలలు పథకం (ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్) కింద పలు మండలాల్లో గుర్తించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. మండల కేంద్రాల్లోనే.. రచ్చబండ నిర్వహణకు సంబంధిం చిన పూర్తిస్థాయి వివరాలు అధికారులకు చేరలేదు. రెండు మూడు రోజుల్లో అందే అవకాశం ఉంది. తొలి విడత రచ్చబండ కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించారు. తర్వాత చేపట్టిన రెండో విడత కార్యక్రమాలు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. ఈ ఏడాది కూడా మండల కేంద్రాల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. రచ్చబండ కార్యక్రమం అమలుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యత జిల్లా ఇన్చార్జ్ మంత్రికి అప్పగించారు. ప్రతి కమిటీలో ముగ్గురు ఉంటారు. వీరిలో సర్పంచ్, మహిళా సంఘం నుంచి కానీ, గ్రామ మహిళ కానీ ఒకరు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మరొకరు ఉంటారు. ఈ కమిటీ మండల బృందంతో కలిసి పనిచేస్తూ రచ్చబండను కొనసాగిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండగా, ప్రజల్లో ప్రచారం చేసుకునేందుకు ఈ రచ్చబండ కార్యక్రమం చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
రచ్చబండకు రాజకీయ రంగు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నైనా తనకు అనుకూలంగా మలచుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తోంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలుండటంతో పాలకులు హడావుడి చేస్తున్నారు. పేదలను ఆదుకునేది తమ ప్రభుత్వమేనని చెబుతూ ఓట్లు దండుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే మూడో విడత రచ్చబండను రాజకీయ వేదికగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల స్థాయి నేతలకు రచ్చబండలో ప్రాధాన్యం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ముగ్గురు సభ్యులతో కమిటీ: రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసిన లబ్ధిదారులతో పాటూ గత నెల 24 దాకా గృహ నిర్మాణ సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల విభాగానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అర్హులకు పథకాలు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు, వారందరినీ మండల స్థాయిలో ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకువీలుగా ఓ కమిటీని వేయనున్నారు. ప్రభుత్వ ప్రయోజనం పొందే లబ్ధిదారులను సమీకరించే బాధ్యతలను ఈ కమిటీలకు అప్పగించి అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వేసే ఈ కమిటీలో సర్పంచ్, ఏదైనా మహిళా గ్రూపు సభ్యురాలు, ఎంపీడీఓ నామినేట్ చేసే వ్యక్తి మరొకరిని సభ్యులుగా నియమిస్తారు. యూనిట్లు పంపిణీ చేసే సమయంలో, లబ్ధిదారులకు అవగాహన కల్పించే విషయంలో వీరి పాత్ర ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులకు కాకుండా అధికార పార్టీ వర్గాలకు బాధ్యతలు అప్పగించడంతో గందరగోళం నెలకొంది. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నచోట వారు చూసుకుంటారు. లేనిచోట కమిటీల ఎంపికలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ తనకు ప్రయోజనం కలిగేలా చూసుకోవడం సాధారణమే అయినా..లబ్ధిదారులకు రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆరింటికి రచ్చబండ మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, బంగారు తల్లి పథకంలో లబ్ధిదారులకు బాండ్ల అందజేత, ఇందిరమ్మ కలలు పథకంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో వసతుల కల్పన, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు 50 యూనిట్లలోపు వాడుకునే వారికి విద్యుత్ చార్జీల చెల్లింపులకు లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల జాబితాను విచారించి ఆన్లైన్లో నమోదు చేశారు. మొదటి విడత రచ్చబండ దరఖాస్తులకు మోక్షం కలిగేందుకు ఏడాదికిపైగా పట్టింది. రెండో విడత విన్నపాలకు అంతకంటే ఎక్కువ సమయమే పట్టింది. లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే లబ్ధిపొందేది మాత్రం వేలల్లోనే. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటికే దిక్కులేదు. ఇక వీటికి ఎప్పటికి మోక్షం కలుగుతుందోనని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ప్రచార గారడి
ఉదయగిరి, న్యూస్‌లైన్: శూన్యంలో నుంచి అద్భుతాలు సృష్టిస్తామని మభ్యపెట్టడంలో మన పాలకులు మాంత్రికులను మించిపోతున్నారు. ఏమీ చేయకుండానే అది చేశాం.. ఇది చేశామంటూ గొప్పలు ప్రచారం చే స్తున్నారు. సంక్షేమ పథకాల అమలును నెలల తరబడి నిలిపేసి ప్రచార వేదికల కోసం ఆరాటపడుతున్నారు. మూడు నెలల క్రితం మంజూరైన అరకొర పింఛన్లను రచ్చబండలో ఆర్భాటంగా పంపిణీ చేసేందుకు వాయిదా వేశారు. మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను తూ.చ.తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆది నుంచి మా ట తప్పుతూనే ఉన్నారు. ఏడాదిన్నర క్రితం నిర్వహించిన రచ్చబండ సందర్భంలో ఆయన చెప్పిన గొప్పలకు తమ కష్టాలు తీరిపోతాయని ప్రజలు భ్రమపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా పింఛన్ల పంపిణీ మంజూరు కాలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీని తెరపైకి తెచ్చారు. జూలైలో కేవలం 30 వేల మందికే మంజూరు చేశారు. అయినా కొంత మంది కైనా లబ్ధి చేకూరుతుందని ప్రజలు సర్దుకుంటే.. ఇప్పటి వరకు వాటి పంపిణీ చేపట్టలేదు. త్వరలో జరగనున్న రచ్చబండలో వాటిని ఆర్భాటంగా పంపిణీ చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ కొత్తగా పింఛన్ మంజూరైన వారి కష్టాలు ఇలా ఉంటే, ఇప్పటికే పొందుతున్న వారి బాధలు మరోలా ఉన్నాయి. మహానేత వైఎస్సార్ హయాంలో ప్రతి నెలా 1వ తేదీన టంఛన్‌గా పింఛన్ పొందారు. ఆదివారమైనా, సెలవైనా, పండగైనా పింఛన్ల పంపిణీ మాత్రం కొనసాగేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదో తేదీ వస్తున్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇంకా పింఛన్ అందలేదు. నిత్యం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే మూడు నెలలకోసారి పింఛన్ పంపిణీ జరుగుతుండటం మన పాలకుల తీరుకు నిదర్శనం. -
ప్రచారమే ఎజెండా
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, సమస్యలను పట్టించుకోని పాలకులు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్లోకి రావటానికి ఎత్తుగడలు ప్రారంభించారు. ఇన్నాళ్లూ ప్రజల ముఖం చూడని వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి రచ్చబండను వేదికగా ఉపయోగించుకునేందుకు యత్నాలు ప్రారంభించారు. జిల్లాలో ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న మూడోవిడత రచ్చబండ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంగా మారనుంది. ఏ పదవీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే వేదికపై కూర్చోబెట్టి, వారితో ఆస్తులు పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వేదికపైన కూర్చునేవారిని ఎంపిక చేసే అధికారం జిల్లా ఇన్చార్జి మంత్రికి ఇచ్చారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మండలాలతో పాటూ మున్సిపాల్టీల్లో కూడా రచ్చబండ నిర్వహణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. పూర్తిగా ఇన్చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల సూచన మేరకే కార్యక్రమం జరగాలని ప్రకటించడంతో ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మారనుందని అర్థమవుతోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా... ఇన్చార్జి మంత్రి సూచించిన పేర్లనే మండలస్థాయి కమిటీల్లో చేర్చాలని స్పష్టం చేశారు. 3వ విడత రచ్చబండ కార్యక్రమాన్ని ఐదు అంశాలకు మాత్రమే పరిమితం చేశారు. జిల్లా స్థాయిలో డీఆర్డీఏ పీడీ, డీఎస్ఓ, హౌసింగ్ పీడీ, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల డీడీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పింఛన్‌దారులను ఆకట్టుకోడానికి 20 నుంచి 40 శాతం లోపు వికలాంగత్వం ఉన్నవారి వద్ద నుంచి కూడా మండల కమిటీలు దరఖాస్తులు స్వీకరించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇదంతా కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత దరఖాస్తుల మాటేంటి ...? గత రెండు విడతల్లో ఇచ్చిన దరఖాస్తులకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించలేదు. వచ్చిన దరఖాస్తులకు.. మంజూరు చేస్తున్న వాటికి పొంతన లేకుండా పోయింది. రేషన్ కార్డుల కోసం 75 వేల దరఖాస్తులు రాగా ఇప్పుడు జరగనున్న రచ్చబండలో కేవలం 29,047 మందికి తాత్కాలిక కూపన్లు మాత్రమే జారీ చేయనున్నారు. అలాగే పింఛన్లకు సంబంధించి 50,860 దరఖాస్తులు రాగా, వాటిలో 31,263 అర్హత గలవిగా తేల్చారు. అందులో కూడా కేవలం 19,307 మందికి మాత్రమే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లక్షా 10 వేలు దరఖాస్తులు రాగా వాటిలో 87 వేలు అర్హమైనవిగా గుర్తించిన అధికారులు ప్రస్తుతం జరగనున్న కార్యక్రమంలో 31,800 మందికి మాత్రమే మంజూరు పత్రాలు అందజేసేందుకు సిద్ధం చేస్తున్నారు. వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 30శాతం మందికి మాత్రమే మంజూరు చేశారు. అధికూడా అధికార పార్టీ నేతలు సూచించిన వారికే మంజూరు చేసి నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఐదు అంశాలకే పరిమితం కేవలం రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణ లబ్ధిదారులకు అనుమతి ఉత్తర్వులు జారీ, ఇందిరమ్మ కలల కింద వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవా లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బకాయి ఉన్న విద్యుత్ బిల్లుల చెల్లింపులకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేశారు. లబ్ధిదారులతోనే... ఈసారి రచ్చబండ కార్యక్రమాన్ని కేవలం లబ్ధిదారులకే పరిమితం చేయనున్నారు. గతంలో మాదిరిగా ప్రజలంతా తమ సమస్యలను చెప్పుకొనేందుకు ఈసారి అవకాశం లేదు. కేవలం లబ్ధిదారుల మాత్రమే రావాలని, రేషన్‌కార్డు, పింఛన్ మంజూరయినట్టు తెలుపుతూ అధికారిక లేఖలు పంపేందుకు సిద్ధం చేస్తున్నారని సమాచారం. లబ్ధిదారులకు మంజూరు స్లిప్పులు ముందే ఇచ్చి వారిని రచ్చబండ సభల వేదికల వద్దకు తీసుకురావాలని, ఖర్చులను ఆయా విభాగాల రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరించాలని ఉత్తర్వులు అందాయి. -
సమర్థంగా రచ్చబండ కార్యక్రమం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడానికి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఇన్చార్జి కలెక్టర్ పి.ఎ.శోభ ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకాధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడత రచ్చబండ కార్యక్రమం ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా 19,307 మందికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. 55,335 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామని, 29,047 మందికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 38 పనులకు శంకుస్థాపన జరుగుతాయని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 78 పనులకు గానూ రూ 17.60 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. 20 నుంచి 39 శాతం లోపు వికలాంగత్వం ఉన్న వారికి పింఛన్ కింద రూ. 200 అందజేయడానికి సదరమ్ కార్యక్రమం చేపట్టనున్నామని, అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. బంగారుతల్లి పథకం కింద మే 1 తర్వాత పుట్టిన అర్హత గల ఆడ పిల్ల పేరు నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుపాను నష్టం అంచనాలను సమగ్రంగా పొందుపర్చాలని సూచించారు. ఎస్.కోట, విజయనగరం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల అనుమతితో షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. సమావేశంలో ఏజేసీ యు.సి.జి. నాగేశ్వరరావు, పీఓ రజిత్కుమార్సైనీ, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, సీపీఓ బి.మోహనరావు పాల్గొన్నారు. రచ్చబండ షెడ్యూల్ ఖరారు నేడు జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న రచ్చబండ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం సాయంత్రానికి ఖరారవుతుందని ఇన్చార్జి కలెక్టర్ పి.ఎ.శోభ తెలిపారు. గురువారం జేసీ చాంబర్లో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా స్వీకరిస్తామన్నారు. -
‘రచ్చబండ’ను విజయవంతం చేయాలి'
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 26 వరకు అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించే మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. రచ్చబండ, ఉపాధి హామీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ విధాన గౌతమిహాలులో ఆమె ఎండీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అక్టోబర్ 24వ తేదీ వరకు అర్హులుగా గుర్తించిన లబ్ధిదారులకు ముందుగానే స్లిప్‌లు ఇచ్చి వారిని రచ్చబండ కార్యక్రమానికి తీసుకురావాలన్నారు. రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహనిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ఉంటుందన్నారు. అలాగే ఇందిరమ్మ కలలు కార్యక్రమం కింద మంజూరు చేసిన వివిధ పనులకు శంకుస్థాపనలుంటాయన్నారు. అలాగే ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బకాయిలు చెల్లిస్తారన్నారు. బంగారుతల్లి సర్టిఫికెట్లు, ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ మంజూరు చర్యలు చేపడతామన్నారు. మండలస్థాయిలో ఎండీవో నేతృత్వంలో తహశీల్దార్, డ్వామా, డీఆర్డీఏ ఏపీవోలు, విద్యుత్, హౌసింగ్ శాఖల ఏఈలు, ఇన్చార్జి మంత్రిచే నియమితులైన సర్పంచ్, ఒక మహిళా సభ్యురాలు, మరో సభ్యునితోపాటు ఇతర మండలస్థాయి అధికారులతో మండల టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ఇన్చార్జి మంత్రి నామినేట్ చేసిన ముగ్గురు సభ్యులతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని ఇతర అధికారులు పాల్గొంటారన్నారు. వెంటనే సంబంధిత శాసనసభ్యులను సంప్రదించి మండలాలవారీ రచ్చబండ కార్యక్రమం తేదీలను ఖరారు చేసి పంపాలని ఎండీవోలను ఆదేశించారు. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్లు, స్త్రీశక్తి భవనాల నిర్మాణం, ఉపాధిహామీ పథకం, ఉద్యానవన పంటలు, మైక్రో ఇరిగేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో సీపీవో మహిపాల్, హౌసింగ్‌పీడీ సెల్వరాజ్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, డ్వామా ఇన్చార్జి పీడీ మల్లిబాబు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
రచ్చబండ ఒక్కరోజే!
అది కూడా మండల కేంద్రాలకే పరిమితం ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు సర్కారు ఎత్తుగడ ఇదివరకే గుర్తించిన లబ్ధిదారులకే పెన్షన్లు, ఇళ్లు వారు మాత్రమే రచ్చబండకు రావాలని షరతు కొత్త అర్జీలను స్వీకరించొద్దని అధికారులకు నిర్దేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఈసారి ‘రచ్చబండ’ ఒక్క రోజుతోనే ముగియనుంది. అది కూడా మండల కేంద్రానికే పరిమితం కానుంది. గ్రామాలకు వెళితే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందనే అనుమానంతో రచ్చబండను ఒక్కరోజుతోనే మమ అనిపించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి 26 వరకు రచ్చబండ షెడ్యూల్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. కార్యక్రమాలను మాత్రం మండల కేంద్రాలకే పరిమితం చేయాలని ఆదేశించింది. స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి ప్రతి మండల/పురపాలక హెడ్‌క్వార్టర్‌లో ఒక్క రోజు రచ్చబండను నిర్వహించాలని సూచించింది. ఈ కార్యక్రమానికి మండల పరిధిలో ఇదివరకే గుర్తించిన లబ్ధిదారులు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి కూపన్లు జారీ చే యాల్సిందిగా ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలందాయి. లబ్ధిదారుల తరలింపును ఆయా శాఖలు పర్యవేక్షించనున్నాయి. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఇందిరమ్మ కలలు పథకం కింద అర్హులుగా గుర్తించిన లబ్ధిదారులు మాత్రమే రచ్చబండకు వచ్చేలా షరతు విధించారు. వీరికి మాత్రమే కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రయోజనాలను అందజేయనున్నారు. రచ్చబండలో కొత్త అర్జీలను స్వీకరించవద్దని ప్రభుత్వం నిర్దేశించింది. కేవలం వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన అర్జీలను మాత్రమే తీసుకోవాలని ఆంక్షలు విధించింది. పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నందున ఇబ్బందులుండవని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలోనే లబ్ధిదారులకు మాత్రమే రచ్చబండను పరిమితం చేసింది. అంతేగాకుండా గ్రామాల బాట పడితే సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం, సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో నిర్వహిస్తున్న ఈ రచ్చబండలో అధికారపార్టీ నేతలను నిలదీసేందుకు అన్ని పార్టీల శ్రేణులు ఎదురుచూస్తున్నాయని, అనవసరంగా ఈ సమయంలో రచ్చబండకు వెళ్లి చీవాట్లు ఎదుర్కోవడం ఎందుకనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మండల కేంద్రాల్లో జరిగే సభలకు లబ్ధిదారులకు మాత్రమే ప్రవేశ మని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, అధికారులు మాత్రం ఇతర అర్జీలు వస్తే కాదనలేం కదా! అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం అధికారులకు కూడా ఒకింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఈనెల 11 నుంచి 26వరకు ఉన్న 13 పనిదినాల్లో ఒక్కో నియోజకవర్గంలో కేవలం నాలుగైదు రోజుల్లోనే రచ్చబండ ముగియడం వారిని తేలికపరుస్తోంది. -
రచ్చబండ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రచ్చబండ కార్యక్రమం గుదిబండగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 11 నుంచి 26 వరకు నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో స్వీకరించిన అర్జీలు పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. ఈ సారైనా మోక్షం లభిస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో నివేదించిన సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో ప్రజలు అధికారులను నిలదీసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి రెండు విడతలుగా నిర్వహించిన కార్యక్రమాల వివరాలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? రేషన్‌కార్డులు, పింఛన్లు, అభయహస్తం, హౌసింగ్, ఉపాధి హామీ, పావలవడ్డి, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఏవైనా సమస్యలు ఉంటే అర్జీలను స్వీకరించనున్నారు. గత రచ్చబండ వివరాలు.. జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని 866 గ్రామ పంచాయతీలతోపాటు ఏడు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్నారు. జిల్లాలో మొదటి విడత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం 58,434 మంది దరఖాస్తులు రాగా, ఇందులో 40,440 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛన్ కోసం 45,482 అర్జీలు రాగా 32,609 మందిని, ఇళ్ల కోసం 1.06 లక్షల అర్జీలు రాగా, 64,578 మందిని అర్హులుగా గుర్తించారు. పావలావడ్డీ రుణాల కోసం 4,404 దరఖాస్తులు, అభయహస్తంకు 2,174, ఉపాధిహామీ పథకం కోసం 10,085, ఆరోగ్యశ్రీ కోసం 9,835 అర్జీలను అధికారులు స్వీకరించారు. మొదటి విడతలో 2.36 లక్షల అర్జీలు రాగా, 1,47 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేశారు. మిగతావారిని అనర్హులుగా గుర్తించినట్లు అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. రెండో విడతలో జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల కోసం 29,643 దరఖాస్తులు, పింఛన్ల కోసం 15,522, ఇళ్ల కోసం 19,100 దరఖాస్తులు వచ్చాయి. అర్హులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఎంత మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు? ఎంతమందిని అనర్హులుగా గుర్తించారనే వివరాలు మండల స్థాయి అధికారుల వద్దే ఉన్నాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మొదటి రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ వారిగా నిర్వహించి లబ్ధిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. రెండో విడత రచ్చబండ కార్యక్రమం మండల స్థాయి కేంద్రాల్లో నిర్వహించారు. దీంతో చాలా మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమం కూడా మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేనా..? జిల్లాలో జనవరి 24, 2011 నుంచి ఫిబ్రవరి 12, 2011 వరకు మొదటి విడత, నవంబర్ 2, 2011 నుంచి 30 నవంబర్ 2011 వరకు రెండో విడత రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో స్వీకరించిన అర్జీలు పరిష్కారానికి పూర్తిస్థాయిలో నోచుకోలేదు. ఫలితంగా అప్పట్లోనే ప్రజాపథం నిర్వహించి అర్జీలు స్వీకరించినా సమస్యలు పట్టించుకోలేదు. తాజాగా మూడో విడత రచ్చబండ కార్యక్రమం అంటూ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో, వార్డుల్లోకి వెళ్లనుంది. రెండు విడతల్లో నిర్వహించిన రచ్చబండలో దరఖాస్తులు చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరిగి లబ్ధిరులు చివరకు వదిలేశారు. రచ్చబండ ద్వారా కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు, బిల్లులు అంటూ ప్రజల ముందుకు వస్తోంది. అయితే కొత్త సమస్యల కోసం ప్రజల వద్దకు వెళ్లేందుకు అధికారులు జంకుతున్నారు. నేడు వీడియో కాన్ఫరెన్స్.. మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహణపై జిల్లాస్థాయి అధికారులతో బుధవారం ఉదయం 11 గంటలకు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమంపై ఆయన అధికారులకు సూచించనున్నారు. -
కొత్త పింఛన్లు రద్దు
సాక్షి, సంగారెడ్డి: వృద్ధులను రాష్ట్ర ప్రభుత్వం వంచిస్తోంది. కాస్తో, కూస్తో ఆదుకుంటున్న పింఛన్లను సైతం దక్కకుండా దూరం చేస్తోంది. మూడో విడత రచ్చబండ రద్దు కావడంతో పింపిణీ చేయడానికి మంజూరు చేసిన కొత్త పింఛన్లను రద్దు చేసింది. గత ఆగస్టు రెండో వారంలో ప్రభుత్వం రచ్చబండ-3 నిర్వహించాలని నిర్ణయించింది. కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రచ్చబండ-2 దర ఖాస్తుదారులకు కొత్త పింఛన్లు, ఇందిరమ్మ గృహాలు, తాత్కాలిక రేషన్ కార్డులను మంజూరు చేసి రచ్చబండ-3లో పింపిణీకి శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకుంది. రచ్చబండ-2లో వచ్చిన 21,213 అర్జీలతో పాటు ఆయా సందర్భాల్లో వచ్చిన ఇతర అర్జీలు 8,993 కలుపుకుని మొత్తం 30,206 మందికి గత ఆగస్టులో పింఛన్లు మంజూరు చేసింది. అందులో 17,283 వృద్ధాప్య, 12,239 వితంతు, 381 చేనేత, 214 వికలాంగ, 89 గీత కార్మికులకు సంబంధించిన పింఛన్లున్నాయి. ఈ మేరకు పింఛన్ల ప్రతిపాదనలో వీరి పేర్లను సైతం చేర్చింది. ఈలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతి తెలుపుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేయడంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల రచ్చబండ-3ను విరమించుకోక తప్పలేదు. ఈ కార్యక్రమం రద్దు అయినా కొత్తగా మంజూరైనా పింఛన్లపై ప్రభావం ఉండదని అధికారులు భావించారు. సెప్టెంబర్ నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీకి ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. ఈలోగా పింఛన్ల ప్రతిపాదన నుంచి కొత్తగా మంజూరైన లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా తొలగించింది. ఆన్లైన్లో సైతం కొత్త లబ్ధిదారుల పేర్లు మాయమయ్యాయి. దీంతో అధికారులు సైతం ఖంగుతిన్నారు. కొత్త పింఛన్లను రద్దు చేసిన సర్కారు తమకు ఎలాంటి సమాచారం అందించలేదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారులు పేర్కొన్నారు. రద్దుకు సంబంధించి కారణాలు తెలియవని వారు చెబుతున్నారు. సీమాంధ్రలో కొనసాగుతున్న సమ్మె వల్ల.. ఓ ప్రాంతంలో కొత్త పింఛన్లు ఇచ్చి ఇంకో ప్రాంతంలో ఇవ్వకపోతే సమస్యలొస్తాయని భావించే ప్రభుత్వం రద్దు చేసి ఉండవచ్చని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు ప్రభుత్వ అనాలోచిత చర్యతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నోటికాడికి వచ్చిన కూడును ప్రభుత్వం లాక్కుందని వృద్ధులు, వికలాంగులు ఆవేదనకు గురయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులకు పింఛన్లు అందించడం కంటే ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం పెద్దపీట వేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రెండో విడత ‘రచ్చబండ’లో రేషన్‌కార్డులకు దరఖాస్తుల వెల్లువ
దోమ, న్యూస్‌లైన్: ప్రభుత్వం చేపట్టిన రెండో విడత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డుల మంజూరుకోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మరికొంత కాలం వేచిచూడక తప్పేలా లేదు. పలు కారణాలతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రేషన్ కార్డులు వస్తాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి రెండో విడత రచ్చబండలో 580 మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి వీలైనంత త్వరగా రేషన్ కార్డులు అందిస్తామని అప్పట్లో ప్రభుత్వం, ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అది మాటలకే పరిమితమైంది. కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. తాజాగా లబ్ధిదారులకు అధికారులు చేస్తున్న సూచనలు కార్డుల మం జూరు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని చెప్పకనే చెబుతున్నాయి. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు ఆధార్ కార్డును జతచేసి అందజేయాలని స్థానిక రెవెన్యూ అధికారులు సూచించారు. వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తామని, పరిశీలన పూర్తయ్యాకే కార్డులను జారీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఎన్ని నెలలు పడుతుందోనని కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తుచేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు.