రచ్చబండ సభలో జరిగిన తోపులాటలో ఊపిరాడక క న్నుమూసిన పసిగుడ్డు ‘మోక్ష’ మరణంపై అధికారులు కట్టుకథలు అల్లుతున్నారు.
కామారెడ్డి, న్యూస్‌లైన్ : రచ్చబండ సభలో జరిగిన తోపులాటలో ఊపిరాడక క న్నుమూసిన పసిగుడ్డు ‘మోక్ష’ మరణంపై అధికారులు కట్టుకథలు అల్లుతున్నారు. రచ్చబండకు వచ్చే ప్రజలకు కావలసిన వసతులు కల్పించే విషయంలో విఫలమైన వారు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల ప్రచారాలను తెరపైకి తెస్తున్నారు. మోక్ష ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతోనే చనిపోయిందని, మోక్ష చనిపోయిన తరువాతనే తల్లి రేణుక రచ్చబండకు తీసుకువచ్చిందని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.
మారుమూల ప్రాంతం
జిల్లా సరిహద్దులో ఉన్న మాచారెడ్డి మండలంలో మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు, ఒడ్డెర గూడాలు ఎక్కువగా ఉన్నా యి. మండలంలో 50 వేల పైచిలుకు జనాభా ఉంది. ఇక్కడ పేదరికం ఎక్కువగా ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు, రైతుకూలీల ఆకలిచావుల రికార్డులు ఉన్నాయి. సరైన సాగునీటి వసతులు లేకపోవడం, కేవలం భూగర్భజలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులలో ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు వలసలు వెళ్తుంటారు. ఇక్కడి ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తుంటారు. రెక్కాడితే డొక్కాడని ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలతో తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని, తద్వారా తమ జీవితాలు బాగుపడు తాయన్న ఆశతో రచ్చబండకు వస్తారు.
గ్రామాలను కాదని
గతంలో గ్రామాలలో నిర్వహించే రచ్చబండ సభలను ప్రస్తుత ప్రభుత్వం మండల కేంద్రాలకు పరిమితం చేసింది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఒకేచోటుకి రావలసి ఉంటుంది. వచ్చే ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. ప్రజలు తమకు కావలసిన పథకాల గురించి దరఖాస్తులు చేసుకోవడానికి సరైన కౌంటర్లు లేక పోవడం, వేలాది మంది తరలి వస్తే, తక్కువ కౌంటర్లు ఏ ర్పాటు చేయడంతో తోపులాడుకునే పరిస్థితులు ఎదురయ్యాయి. తోపులాటలో ఊపిరాడకుండా పోవడంతో మోక్ష అనే మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
గతంలోనూ ఇదే కథ
గతంలో ఇదే మండలంలో మలేరియా మహమ్మారి సోకి వంద మందికి పైగా మృత్యువాత పడినపుడు అధికారులు తప్పించుకునేందుకు రోగం మలేరియా నేనని, మరణాలు మాత్రం కావని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మోక్ష విషయంలో అధికారులు ప్రభుత్వానికి తమ తప్పి దం లేదనే విధంగా రిపోర్టులు పంపినట్టు తెలుస్తోంది. రచ్చబం డ సభలో పాప చనిపోయిన విషయంలో అధికారులు కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పాపను ఆస్పత్రికి చేర్చడం, పోస్టుమార్టం వరకు తరలించి తరువాత అక్కడి నుంచి పత్తా లేకుండా పోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించినవారు లేరు. మోక్ష మరణంపై తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకుని, మానవతా దృక్పథంతోనైనా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత ం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను అధికారులు గుర్తుంచుకోవాలని అంటున్నారు.