moksha
-
సినిమా ఇండస్ట్రీ లో మీ వ్యక్తిగత ప్రయాణం ఎలా ఉంది?
-
కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!
దేవుళ్ల అందరిలోనూ ప్రత్యేక విలక్షణమూర్తి శ్రీకృష్ణుడు!. ఆయన బాల్యం- లీలా మాధుర్యానికి ఆట పట్టు, అనంత దార్శనిక సూత్రాల తేనెపట్టు. ఆయన శృంగార మహత్వం- లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒకరకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు. మరో కోణంలో మహా విషాద నాయకుడు ఇలా ఇద్దరు కృష్ణుడిలో తారసపడతారు. ముఖ్యంగా అరిషడ్వర్గాలను- మోక్షమార్గాలుగానూ, స్వర్గద్వారాలుగానూ అద్భుతంగా నిరూపించాడాయన. ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం సప్తమ స్కంధంలో నారద మహర్షి విశేషంగా వర్ణించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు తలలతో మన మానస్సు అనే సరోవరాన్ని అను నిత్యం కలవరపరుస్తుంటుంది. అవే మన లోపలి శత్రుకూటమి. దాన్ని సమూలంగా తుద ముట్టించాలంటే, కోపం అనే ఘీంకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకుని గజేంద్ర మోకంలోని గజేంద్రుడిలా భగవంతుణ్ని ఆశ్రయించాలికృష్ణుడి ప్రత్యేకత ఏమంటే... ఆ ఆరింటినీ సాధనాలుగా మార్చు కొని, వాటి సాయంతోనూ తనను పొందవచ్చునని హామీ ఇచ్చాడాయన. కోరిక, కోపం, భయం, భక్తి, అనురక్తి, ఆసక్తి, ద్వేషం, స్నేహం... చివరకు శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుణ్ని తమవాణ్ని చేసుకోని పొందొచ్చ్చని భాగవతం నిరూపించింది. అలా ఎవరెవరు ఏయే మార్గాల్లో ఆయనకు దగ్గరయ్యారో నారదుడు వర్ణించి చెప్పాడు కూడా. దారి ఏదైనా గమ్యం ఒక్కటే అన్నాడాయన ధర్మరాజుతో. అదెలా అంటే..మనం చెప్పుకొన్న శత్రువర్గంలో కామం మొదటిది. దాని ద్వారానే గోపికలు హరిని సొంతం చేసుకొన్నారు. కామం అంటే కోరిక ఆసక్తి అనురక్తి... తనకు దక్కాలనే తహతహ. ధర్మా ర్థకామమోక్షాలనే నాలుగు రకాల పురుషార్థాలకు సంబంధించి- కామంలోని నాలుగు కోణాలను భరతముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించాడు. గోపికలది మధురభక్తికి చెందిన కామం. మోక్ష కాంక్షలోంచి ఉప్పొంగిందది. కాబట్టి వారిది 'మోక్ష సంబంధి శృంగారం' అన్నారు పెద్దలు. భరతుడి వివరణలోని మోక్షకామానికి సరైన ఉదాహ రణ గోపికల కామం.'కోరికతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయాద్వేషాలతో శిశు పాలాదులు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా ముని జనులు శ్రీకృష్ణుడికి చేరువ అయ్యారు' అన్నది నారదమహర్షి విశ్లేషణ. ఇదేవిధంగా ఇకృష్ణుడు చెప్పిన మోక్ష మార్గాలు..ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్దరించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్ర మైనది. కళ్లు తెరిచింది- కటకటాల్లో. ఊపిరి పీల్చింది అపాయాల్లో. బతుకు గడిచింది- గండాల్లో. చివరకు ఆయన చరమదశా- పరమ దారుణం. తన కళ్లముందే తన వారంతా ఒకళ్లనొకళ్లు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే- కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలి బొటనవేలికి వేటగాడి బాణం నాటుకుని బొట్టుబొట్టుగా నెత్తురు స్రవించి మనుగడ కడతేరిపోవడమంటే- ఎంత విషాదకరమైన ముగింపు!. ఏమనాలి ఆయన జీవితాన్ని?.ఇది అద్భుతమా..!కృష్ణకథను చెబుతూ వ్యాసమహర్షి 'అద్భుతం' అనే పదాన్ని ప్రయోగించారంటే- ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? కృష్ణుడి పుట్టుక అద్భుతం. ఆయన లీలలు అద్భుతం. ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం. 'ధర్మం' అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు- అద్భుతం అనే భావానికి ప్రాణం పోస్తే- అది కృష్ణుడు. ఎంత చక్కగా ఆయన జీవిత కథ జీవిత పరమార్థాన్ని విశదరపరుస్తుంది. భగవంతుడు సైతం మనిషిగా పుట్టినప్పుడూ కష్టాలు అనుభవించక తప్పదని, ఉన్నత, పతన స్థితుల కలబోత అనే ఆయనే స్వయంగా అవతారం ఎత్తి చూపించాడు. సో కష్టాలకు కలవరపడొద్దు, ఆ జగన్నాథుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మీద భారం వేసి నిశ్చింతగా జీవించి సుఖమయ జీవితాన్ని పొందుదాం. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?) -
‘ఐ హేట్ యు’ అంటున్న యంగ్ హీరో!
‘అథర్వ’ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఐ హేట్ యు’. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్బంగా..చిత్ర నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఐ హేట్ యు’ చిత్రం లవ్ సైకలాజికల్ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో డైరెక్టర్ అంజిరామ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా అందరూ నటీనటుల, టెక్నీషియన్స్ చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. అందరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. -
‘నీతోనే నేను’ మూవీ రివ్యూ
టైటిల్: నీతోనే నేను నటీనటులు: వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత, అకెళ్ల తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: ఎమ్. సుధాకర్ రెడ్డి దర్శకత్వం: అంజిరామ్ సంగీతం: కార్తీక్ బి. కడగండ్ల సినిమాటోగ్రఫీ: మురళీ మోహన్ విడుదల తేది: అక్టోబర్ 13, 2023 కథేంటంటే.. రామ్(వికాష్ వశిష్ట) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మెదక్ జిల్లా లక్ష్మాపూర్ ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వస్తాడు. అదే రోజు స్పోర్ట్స్ టీచర్‌గా ఆయేషా(కుషిత)కూడా అదే స్కూల్లో జాయిన్ అవుతుంది. వీరిద్దరి ఆలోచనలు ఒకటే. పేద పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావాలని కష్టపడుతుంటారు. ఆ స్కూల్లో చదివే పిల్లలకు ఏ ఆపద వచ్చిన తోడుగా నిలుస్తుంటారు. రామ్ మంచి తనం చూసి ఆయేషా అతన్ని ఇష్టపడుతుంది. ఒక రోజు తన ప్రేమ విషయాన్ని రామ్‌తో చెప్పగా అతను నిరాకరిస్తాడు. తనకు అల్రేడీ సీత అనే అమ్మాయితో పెళ్లి అయిందని చెబుతాడు. అసలు సీత ఎవరు? రామ్, సీతల లవ్‌స్టోరీ ఏంటి? సీతకు ఏమైంది? సీతకు, ఆయేషాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రేమించిన రామ్ కోసం అయేషా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఏంటి? మంచి టీచర్‌గా పేరున్న రామ్..తన వృత్తికి ఎందుకు రాజీనామా చేశాడు? చివరకు ఆయేషా ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే ‘నీతోనే నేను’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమాలో ఓ సన్నివేశం ఇలా ఉంటుంది. ప్రార్థన సమయంలో ఓ విద్యార్థిని కళ్లు తిరిగి పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకెళ్తే.. వాటర్ సరిగా తాగకపోవడంతో కిడ్నీలో రాళ్లు వచ్చాయని చెబుతారు. వాటర్ ఎందుకు తాగడం లేదని ఆ విద్యార్థిని అడిగితే.. స్కూల్లో వాష్ రూమ్ సరిగా లేదని, అందులోకి వెళ్లడం ఇష్టంలేకనే నీళ్లు తాగడం లేదని చెబుతుంది. వెంటనే హీరో కలెక్టర్‌కి లెటర్ రాయడం.. ఆ సమస్య తీరిపోవడం జరుగుతుంది. ఈ ఒక్క సీన్ చాలు ‘నీతోనే నేను’ ఓ మంచి సందేశాత్మక చిత్రమని చెప్పడానికి. కమర్షియల్ పంథాలో కొన్ని థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ..ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అంజిరామ్. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ..దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు మాత్రం రొటీన్‌గా ఉంటాయి. ప్రభుత్వం పాఠశాలలో ఉండే సమస్యలు..వాటిని హీరో పరిష్కరించిన తీరు..అన్ని గత సినిమాల్లో మాదిరే ఉంటాయి. స్కూల్ టీచర్‌గా హీరో రావడం..అక్కడి సమస్యలు పరిష్కరించడం..అతని లవ్‌స్టోరీ..ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తి పెంచుతుంది. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పాటలు కూడా కథకు అతికించినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఆయేషా పాత్ర ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కమర్షియల్‌గా ఈ చిత్రం ఏ మేరకు ఆట్టుకుంటుందో తెలియదు కానీ..ఓ మంచి సందేశం మాత్రం ఇస్తుంది. ఎవరెలా చేశారంటే.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాము పాత్రలో వికాస్ వసిష్ట చక్కగా నటించాడు. ఓ బాధ్యత గల టీచర్‌గా, భార్య కోసం పరితపించే భర్తగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక పీటీ టీచర్ ఆయేషాగా కుషిత తన పాత్ర పరిధిమేర నటించింది. హీరో భార్య సీతగా నటించిన మోక్ష.. భావోద్వేగాలను చక్కగా పండించింది. కన్నింగ్ టీచర్‌గా ఆకెళ్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ చిత్ర పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం ఓకే. సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న రాసిన పాటలు బాగున్నప్పటికీ.. కథలో ఇరికించినట్లు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
‘నీతోనే నేను’ చూసి మంచి ఫీలింగ్‌తో బయటకొస్తారు: నిర్మాత
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నీతోనే నేను’. శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని మెదక్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేవలం 33 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. సింగిల్ షెడ్యూల్లో ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. టీచర్స్ మీద సినిమా చేస్తున్నారేంటి అని ఈ జర్నీలో నన్ను చాలా మంది అడిగారు. అంటే మంచి కమర్షియల్ సినిమా చేయవచ్చు కదా అనేది వాళ్ల అభిప్రాయం. కానీ నా ఉపాధ్యాయుల మీద, నా కథ మీద, నా టీమ్ మీద, నా మీద నాకు ఉన్న నమ్మకంతో ముందుకు అడుగులు వేస్తూ వచ్చాను. అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం చేశాను. నా టీమ్‌తో కలిసి సినిమాను చూశాం. సినిమా చాలా బావుందని నా టీమ్ సభ్యులు చెప్పారు. వంద శాతం సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. అక్టోబర్ 13న ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటాను’. దర్శకుడు అంజిరామ్ మాట్లాడుతూ ‘‘మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది. నాలుగు నెలల పాటు ఎంటైర్ టీమ్ కష్టపడింది. అందువల్లే సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయటానికి సిద్ధమయ్యాం. మా సినిమాటోగ్రాఫర్ మురళీ మోహన్ రెడ్డిగారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్‌గారు ఈ జర్నీలో అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్టర్స్ హీరో వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు, ఆకెళ్ల సహా అందరూ చక్కగా నటించారు. ఇక నిర్మాత సుధాకర్ రెడ్డిగారైతే మా వెనుకుండి ముందుకు నడిపించారు. ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టినప్పటికీ ఆయన డేడికేషన్, కమిట్మెంట్తో సినిమాను కంప్లీట్ చేశారు. ఆయన అందించిన సపోర్ట్‌కి ధన్యవాదాలు. కిరణ్‌గారికి, తేజగారికి, ఎడిటర్ ప్రతాప్ సహా టీమ్‌కి థాంక్స్. అక్టోబర్ 13న థియేటర్స్‌లోకి వస్తున్నాం’ అన్నారు. -
సరికొత్త ప్రేమ కథ
కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘‘అలనాటి రామచంద్రుడు’ సరికొత్త ప్రేమ కథా చిత్రం. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. షార్ట్ ఫిల్మ్స్ తీసి అవార్డులు అందుకున్న ఆకాష్ రెడ్డి తొలిసారి దర్శకునిగా అడుగుపెడుతున్నాడు’’ అన్నారు హైమావతి, శ్రీరామ్ జడపోలు. ‘‘మా సినిమా చిరుజల్లుల్లా హాయిగా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు చిలుకూరి ఆకాష్ రెడ్డి. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత: విక్రమ్ జమ్ముల, కెమెరా: ప్రేమ్ సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి, లైన్ ప్రొడ్యూసర్: అవినాష్ సామల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గద్దల అన్వేష్. -
తీవ్రస్థాయిలో జ్వరం.. చిన్నారి మృతి! తండ్రి తిరుగు ప్రయాణం..
జగిత్యాల: డెంగీతో చిన్నారి మృతిచెందిన ఘటన ఆదివారం రాయికల్ మండలం రామాజిపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోనే గౌతమి–రాజరెడ్డి కూతురు గోనే మోక్ష(5)కు వారం రోజులుగా తీవ్రస్థాయిలో జ్వరం రాగా జగిత్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్థారించారు. రక్తకణాలు తక్కువగా ఉన్నాయని తెలపడంతో కరీంనగర్ తరలించి వైద్యం అందిస్తుండగా మృతిచెందింది. రాజరెడ్డి ఇటీవలే ఉపాధి నిమిత్తం గల్ఫ్‌వెళ్లాడు. చిన్నారి మృతితో తండ్రి తిరుగు ప్రయాణం అయ్యాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఓ ప్రేమకథ
వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు హీరోహీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్, పోస్టర్‌ను చిత్ర నిర్మాత ఎమ్. సుధాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ‘‘చదువుకునే టైమ్‌లోనే సినిమా తీయాలనే కల ఉండేది. మంచి టీమ్‌తో ‘నీతోనే నేను’ తీశాను’’ అన్నారు ఎమ్. సుధాకర్ రెడ్డి. ‘‘ఈ సినిమా కోసం టీమ్ ప్రాణం పెట్టి పని చేశారు’’ అన్నారు అంజిరామ్. ‘‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు వికాస్. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ నవీన్, కెమెరామేన్ మురళీ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి. కడగండ్ల పాల్గొన్నారు. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన లక్కీ లక్ష్మణ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన చిత్రం లక్కీ లక్ష్మణ్. మోక్ష కథానాయికగా నటించింది. ఎఆర్ అభి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సోహైల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసేస్తామని కామెంట్లు చేస్తున్నారు. కథేంటంటే.. లక్ష్మణ్(సోహైల్) మధ్య తరగతి యువకుడు. చిన్నప్పటి నుంచి ఏదడిగినా డబ్బులు లేవని చెప్పే తండ్రిపై కోపం పెంచుకుంటాడు. అమ్మాయిలకు దూరంగా ఉంటూ బుద్ధిగా చదువుకుంటాడు. అయితే బీటెక్‌లో చేరిన తొలిరోజే శ్రేయ(మోక్ష) పరిచయం అవుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆమె ధనవంతురాలు కావడంతో లక్కీకి కావాల్సినవన్నీ ఇస్తుంది. ఓ విషయంలో వీరు బ్రేకప్ చెప్పుకుంటారు. తర్వాత లక్ష్మణ్ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే ఓరోజు స్టోర్ మేనేజర్లో పని చేస్తున్న శ్రేయను చూసి లక్కీ షాకవుతాడు. అసలు వీరికి బ్రేకప్ ఎందుకైంది? ధనవంతురాలైన శ్రేయ స్టోర్ మేనేజర్‌గా ఎందుకు పని చేస్తుంది? లక్ష్మణ్ కోసం తండ్రి చేసిన త్యాగం ఏంటి? తండ్రి విలువను హీరో ఎప్పుడు తెలుసుకుంటాడు? అనేదే కథ. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: కొడుకే నా భర్తను హత్య చేసి ఆ నింద నాపై వేశాడు -
‘లక్కీ లక్ష్మణ్’ మూవీ రివ్యూ
టైటిల్: లక్కీ లక్ష్మణ్ నటీనటులు: సయ్యద్ సోహైల్, మోక్ష, దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని తదితరులు నిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: హరిత గోగినేని కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.అభి సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: ఐ.అండ్రూ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేది: డిసెంబర్ 30, 2022 బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. నేడు(డిసెంబర్ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. లక్ష్మణ్(సోహైల్) ఓ మధ్య తరగతి యువకుడు. చిన్నప్పటి నుంచి తండ్రి(దేవీ ప్రసాద్) ఏది అడిగినా..డబ్బులు లేవని చెబుతాడు. దీంతో తండ్రిపై లక్ష్మణ్‌కు కోపం ఏర్పడుతుంది. పెద్దయ్యాక తన తండ్రిలాగా ఉండొద్దని, చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన విలాసవంతమైన జీవితం అనుభవించాలనుకుంటాడు. అందుకే అమ్మాయిలకు దూరంగా ఉంటూ బుద్దిగా చదువుకుంటాడు. అయితే బీటెక్‌లో చేరిన తొలి రోజే అతనికి శ్రేయ(మోక్ష) పరిచయం అవుతుంది. ఆమె బాగా ధనవంతురాలు. అయినా ఆ పొగరు ఎక్కడా చూపించదు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి..అది కాస్త ప్రేమగా మారుతుంది. లక్ష్మణ్ కుటుంబ నేపథ్యం తెలుకున్న శ్రేయ.. అతనికి కావాల్సినవన్నీ ఇస్తుంది. లక్ష్మణ్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒక్కడే ఓ అపార్ట్మెంట్లో ఉంటాడు. ఓ విషయంలో శ్రేయ, లక్ష్మణ్ మధ్య గొడవ జరిగి బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ తర్వాత లక్ష్మణ్ ఓ మ్యారేజ్ బ్యూరో స్టార్ చేసి నాలుగేళ్లలో బాగా డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే.. ఓ రోజు ఒక స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రేయను చూసి లక్ష్మణ్ షాకవుతాడు. బాగా డబ్బులున్న శ్రేయ స్టోర్ మేనేజర్‌గా ఎందుకు ఉద్యోగం చేస్తుంది? లక్ష్మణ్, శ్రేయల బ్రేకప్‌కి కారణం ఏంటి? ఒకప్పుడు మంచి ఇల్లు.. ఆస్తులు ఉన్న లక్ష్మణ్ తల్లిదండ్రులు ఇప్పుడు ఎందుకు అద్దె ఇంట్లో ఉన్నారు? లక్ష్మణ్ కోసం తండ్రి చేసిన త్యాగం ఏంటి? పేరెంట్స్ విలువను లక్ష్మణ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? చివరకు శ్రేయ, లక్ష్మణ్‌లు మళ్లీ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘డబ్బులు ఉంటే చాలు.. అన్ని వచ్చేస్తాయి. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత సుఖంగా బతుకుతాం’అని చాలా మంది భావిస్తారు. అలా అనుకున్న ఓ యువకుడి కథే ఈ ‘లక్కీ లక్ష్మణ్’. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు.. అమ్మాయి ప్రేమ ... ఏదీ తక్కువ కాదు. అలాంటి వాటి కంటే డబ్బు గొప్పది కాదనే ఓ మంచి సందేశాన్ని అందించిన సినిమా ఇది. దర్శకనిర్మాతలు కమర్షియల్‌గా ఆలోచించకుండా ఓ మంచి సందేశాన్ని అందించారు. ఈ విషయంలో వారిని మెచ్చుకోవాల్సిందే. అయితే ఈ మూవీ కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కాలేజీ నేపథ్యం.. ప్రేమ.. బ్రేకప్ ఇలా ప్రతీది గత సినిమాలలో చూసిన సన్నివేశాలే. కొన్ని చోట్ల లాజిక్ లేకుండా కొన్ని సీన్స్ వచ్చిపోతుంటాయి. మధుతో లక్ష్మణ్ ఫోన్ కాల్ సీన్ నవ్విస్తుంది. ఇంటర్వెల్ వరకూ రొటీన్‌గా సాగే ఈ కథ.. సెకండాఫ్ నుంచి టర్న్ తీసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఫస్టాఫ్‌కు సెకండాఫ్‌కు సంబంధమే లేదన్నట్లుగా కథనం సాగుతుంది. లక్ష్మణ్ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేయడం.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి జరిపించడం..బాగా డబ్బులు సంపాదించన తర్వాత పెరెంట్స్ విలువ తెలుకొవడం..ఇలా సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్‌కు 20 నిమిషాల ముందు ప్రేక్షలు కథలో లీనం అవుతారు. క్లైమాక్స్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో సోహైల్ నటన సింప్లీ సూపర్బ్. లక్ష్మణ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. శ్రీ పాత్రకు మోక్ష న్యాయం చేసింది. కాలేజీ సీన్స్‌లో తెరపై అందంగా కనిపిస్తుంది. హీరో తండ్రి స్నేహితుడిగా కాబందరి ఒకే ఒక సీన్లో కనిపిస్తాడు. కానీ అతను చెప్పే సంభాషణలు అలా గుర్తిండిపోతాయి. ఇక హీరో తండ్రిగా దేవి ప్రసాద్ తన పాత్రకు న్యాయం చేశాడు. హీరో స్నేహితులు కిరణ్, చరణ్ పాత్రలు పోషించిన వారి నటన, కామెడీ బాగుంది. ఎమ్మెల్యేగా రాజా రవీంద్ర, కాలేజీ స్టూడెంట్‌గా యాదమ్మ రాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్ రూబెన్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ ఐ.అండ్రూ పనితీరు బాగుంది. నిర్మాత హరిత గోగినేని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. -
కాశీలో ‘మోక్ష’ భవనాలు
లక్నో: కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని. చావు పుట్టుకల నుంచి విముక్తి లభిస్తోందని కొంతమందిలో నమ్మకం. ఆ భావనతోనే చనిపోయేందుకు కాశీ వెళుతున్నారు. కాశీకి వెళ్లిన వాళ్లు కాటికి వెళ్లిన వాళ్లు ఒక్కటే అని గతంలో ఓ నానుడి ఉండేది..అయితే కాటికి వెళ్లేందుకే ఇప్పుడు చాలా మంది కాశీకి వెళుతున్నారు. మోక్షం కోసం వచ్చే ఇలాంటి వారికి వసతి కల్పించేందుకు అక్కడ ప్రత్యేకంగా భవనాలు కూడా ఉన్నాయి. చనిపోయే వారి కోసం ముక్తి భవన్ పారిశ్రామికవేత్త విష్ణుహరి దాల్మియా 1958లో ఈ ముక్తి భవన్‌ను ప్రారంభించారు. కాశీలో చనిపోవాలని వచ్చే వారికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు. చావుకు దగ్గిరగా ఉన్న వాళ్లు ఇక్కడికి వస్తారు. ముక్తి భవన్లో ఉచితంగానే వసతి కల్పిస్తారు. అయితే ఇక్కడికి వచ్చే వారికి తప్పనిసరిగా ఓ సహాయకుడు ఉండాలి. వీరికి ఓ రూమ్ కేటాయిస్తారు. కనీసంగా 15 రోజులు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ లోపు చనిపోతే సరేసరి. లేదంటే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, రూమ్‌ల ఖాళీని బట్టి మరోసారి వసతి అవకాశం ఇస్తామని నలభై ఏళ్లుగా ముక్తి భవన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మేనేజర్ భైరవ్నాథ్ శుక్లా తెలిపారు. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ కాశీలో చనిపోవాలనే తన తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఓ కుమారుడు తండ్రిని తీసుకుని మోక్ష భవన్‌కు వచ్చాడు. అయితే అక్కడ కుమారుడు చనిపోయాడు. తండ్రి మాత్రం బతికే ఉన్నాడు. మరో సంఘటనలో ఓ కొడుకు తన తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు. పదిహేను రోజులు అక్కడే ఉన్నా తండ్రి చనిపోలేదని కొడుకు విసుగ్గా ఆ తండ్రిని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ తండ్రి కనీసం మరో ఐదేళ్లు బతికే అవకాశం ఉందని, ఇలా రకారకాల ఆలోచనలతో ఇక్కడికి వస్తుంటారని శుక్లా తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ జంట కాశీభవన్‌లో తన ఆఖరి మజిలీని గడుపుతున్నారు. వీరిరువురూ విద్యాశాఖలో పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరచుగా కాశీ వెళ్తుండేవారు. రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చి కాశీ భవన్లో ఓ గదిని తీసుకున్నారు. మిగతా జీవితాన్ని అక్కడే సంతోషంగా గడిపేస్తామని చెబుతున్నారు. 20 ఏళ్లుగా అక్కడే నివాసం అస్సీ ఘాట్‌కు సమీపంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ముముక్షు భవన్ ఉంది. ఇందులోనే ప్రాథమికోన్నత పాఠశాల, ఓ గుడి, 60 రూములు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన గులాబ్ బాయ్ అనే మహిⶠ20 ఏళ్లుగా ఈ భవన్‌లోనే ఉంటున్నారు. భర్త మరణానంతరం తన కోరిక మేరకు పిల్లలు ఇక్కడికి తీసువచ్చి వదిలి వెళ్లారని, ఢిల్లీలో కంటే ఇక్కడే తనకు హాయిగా ఉందంటున్నారు గులాబ్. పైగా, ఢిల్లీలో నివశించేవారికి రక్షణ లేకుండా పోయిందని, అక్కడ జరుగుతున్న హత్యల వార్తలను టీవీల్లో చూస్తున్నానని చెప్పారు. ‘ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తోందని చాలామంది ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నారు. అయితే కొన్ని లాడ్జీలు చావులను వ్యాపారంగా మార్చేశాయని’ సీనియర్ జర్నలిస్ట్ అమితాబ్ భట్టాచార్య విమర్శించారు. -
భార్య పై అనుమానంతో..
వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలను కన్నదని అనుమానంతో.. కన్న తండ్రి ఇద్దరు పిల్లలను కిరాతకంగా హతమార్చిన సంఘటన నిజామాబాద్ జిల్లా యడవల్లి మండలం జానకంపేటలో ఆదివారం వెలుగుచూసింది. వివరాలు.. రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన చంద్రశేఖర్(34)కు పన్నెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న చంద్రశేఖర్ వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలను కన్నదని తరచు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ రోజు భార్య ఇంట్లో లేని సమయంలో ఈతకు వెళ్దామని చెప్పి ముగ్గురు పిల్లలను తీసుకొని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలోని అలీసాగర్ కాలువ వద్దకు తీసుకొచ్చాడు. పెద్ద కూతురు స్వాతి(10)ని నీటిలో ముంచి బురదలో పడేసి కాలుతొ తొక్కి చంపాడు. అనంతరం మోక్ష(5) ను కూడా నీటిలో ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశాడు. మూడో సంతానమైన 13 నెలల చిన్నారిని నీటిలో విసిరేయడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని బాబును రక్షించి అతన్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మోక్షం కోసం.. 83 ఏళ్ల వయసులో ఆమరణదీక్ష
మోక్షం సాధించడం కోసం 83 ఏళ్ల మహిళ కటక్‌లో గత 50 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె ఆమరణ దీక్ష ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కటక్‌లోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన భవర్లాల్ సేథి భార్య అయిన విక్కీ దేవి సేథి సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ దీక్ష చేస్తున్నారని, ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని సాధించాలన్న జైన సంప్రదాయం ప్రకారమే ఆమె ఇలా చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇందుకు తన కుటుంబం నుంచి, మత పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే.. ఇది చట్ట విరుద్ధమని, దీనిపై ఒడిషా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ 'స్ట్రగుల్ ఫర్ జస్టిస్' అనే స్వచ్ఛంద సంస్థ ఒరిస్సా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేసింది. ఇలా దీక్ష చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని, ఐపీసీ 306, 309 సెక్షన్ల కింద శిక్షార్హమని ఆ సంస్థ కార్యదర్శి శశికాంత్ శర్మ అన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అనే విషయంలో హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
‘మోక్ష’ ఊపిరాడక మరణించలేదట!
కామారెడ్డి, న్యూస్‌లైన్ : రచ్చబండ సభలో జరిగిన తోపులాటలో ఊపిరాడక క న్నుమూసిన పసిగుడ్డు ‘మోక్ష’ మరణంపై అధికారులు కట్టుకథలు అల్లుతున్నారు. రచ్చబండకు వచ్చే ప్రజలకు కావలసిన వసతులు కల్పించే విషయంలో విఫలమైన వారు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల ప్రచారాలను తెరపైకి తెస్తున్నారు. మోక్ష ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతోనే చనిపోయిందని, మోక్ష చనిపోయిన తరువాతనే తల్లి రేణుక రచ్చబండకు తీసుకువచ్చిందని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. మారుమూల ప్రాంతం జిల్లా సరిహద్దులో ఉన్న మాచారెడ్డి మండలంలో మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు, ఒడ్డెర గూడాలు ఎక్కువగా ఉన్నా యి. మండలంలో 50 వేల పైచిలుకు జనాభా ఉంది. ఇక్కడ పేదరికం ఎక్కువగా ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు, రైతుకూలీల ఆకలిచావుల రికార్డులు ఉన్నాయి. సరైన సాగునీటి వసతులు లేకపోవడం, కేవలం భూగర్భజలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులలో ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు వలసలు వెళ్తుంటారు. ఇక్కడి ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తుంటారు. రెక్కాడితే డొక్కాడని ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలతో తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని, తద్వారా తమ జీవితాలు బాగుపడు తాయన్న ఆశతో రచ్చబండకు వస్తారు. గ్రామాలను కాదని గతంలో గ్రామాలలో నిర్వహించే రచ్చబండ సభలను ప్రస్తుత ప్రభుత్వం మండల కేంద్రాలకు పరిమితం చేసింది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఒకేచోటుకి రావలసి ఉంటుంది. వచ్చే ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. ప్రజలు తమకు కావలసిన పథకాల గురించి దరఖాస్తులు చేసుకోవడానికి సరైన కౌంటర్లు లేక పోవడం, వేలాది మంది తరలి వస్తే, తక్కువ కౌంటర్లు ఏ ర్పాటు చేయడంతో తోపులాడుకునే పరిస్థితులు ఎదురయ్యాయి. తోపులాటలో ఊపిరాడకుండా పోవడంతో మోక్ష అనే మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. గతంలోనూ ఇదే కథ గతంలో ఇదే మండలంలో మలేరియా మహమ్మారి సోకి వంద మందికి పైగా మృత్యువాత పడినపుడు అధికారులు తప్పించుకునేందుకు రోగం మలేరియా నేనని, మరణాలు మాత్రం కావని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మోక్ష విషయంలో అధికారులు ప్రభుత్వానికి తమ తప్పి దం లేదనే విధంగా రిపోర్టులు పంపినట్టు తెలుస్తోంది. రచ్చబం డ సభలో పాప చనిపోయిన విషయంలో అధికారులు కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పాపను ఆస్పత్రికి చేర్చడం, పోస్టుమార్టం వరకు తరలించి తరువాత అక్కడి నుంచి పత్తా లేకుండా పోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించినవారు లేరు. మోక్ష మరణంపై తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకుని, మానవతా దృక్పథంతోనైనా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత ం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను అధికారులు గుర్తుంచుకోవాలని అంటున్నారు. -
మూడు నెలల చిన్నారి ప్రాణాలు తీసిన రచ్చబండ
రచ్చబండ కార్యక్రమం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. బంగారుతల్లి పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసేందుకు తల్లిదండ్రులు తీసుకొచ్చిన మూడు నెలల మోక్ష అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి చర్చబండ కార్యక్రమంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలకేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తీవ్రంగా తోపులాట జరగడంతో మూడు నెలల మోక్ష తీవ్ర అస్వస్థతకు గురైంది. రచ్చబండ నిర్వహిస్తుండగా అకస్మికంగా తోపులాట జరగడంతో ఊపిరాడక చిన్నారి మోక్ష తీవ్ర అనారోగ్యానికి లోనైంది. ఆ చిన్నారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. బంగారుతల్లి పథకం ద్వారా చెక్కు తీసుకోడానికి మాచారెడ్డి మండలంలోని భవానీపేట తండాకు చెందిన చిన్నారి మోక్షను వారి తల్లిదండ్రులు మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి తీసుకువచ్చారు. రచ్చబండలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఆ చిన్నారి చివరకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇలాంటి విషాదకర సంఘటన చోటుచేసుకోవడం పట్ల కార్యక్రమానికి వచ్చిన పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలుత అందరూ చిన్నారి మోక్షను బంగారుతల్లి లబ్ధిదారుగా భావించారు. అయితే, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాత్రం ఆమె లబ్ధిదారు కాదని, పథకానికి దరఖాస్తు చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చి ఉంటారని ఆయన చెప్పారు. అలాగే మాచారెడ్డిలో ఏర్పాట్లు కూడా పూర్తిగానే చేశామని కలెక్టర్ తెలిపారు. అయితే, దరఖాస్తు తీసుకోడానికే తాము అక్కడకు వచ్చినట్లు చిన్నారి మోక్ష తల్లి రేణుక 'సాక్షి'కి తెలిపారు.