భార్య పై అనుమానంతో.. | Father kills his three children | Sakshi
Sakshi News home page

భార్య పై అనుమానంతో..

Published Sun, May 22 2016 4:42 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Father kills his three children

వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలను కన్నదని అనుమానంతో.. కన్న తండ్రి ఇద్దరు పిల్లలను కిరాతకంగా హతమార్చిన సంఘటన నిజామాబాద్ జిల్లా యడవల్లి మండలం జానకంపేటలో ఆదివారం వెలుగుచూసింది.

వివరాలు.. రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన చంద్రశేఖర్(34)కు పన్నెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న చంద్రశేఖర్ వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలను కన్నదని తరచు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ రోజు భార్య ఇంట్లో లేని సమయంలో ఈతకు వెళ్దామని చెప్పి ముగ్గురు పిల్లలను తీసుకొని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలోని అలీసాగర్ కాలువ వద్దకు తీసుకొచ్చాడు. 

 

పెద్ద కూతురు స్వాతి(10)ని నీటిలో ముంచి బురదలో పడేసి కాలుతొ తొక్కి చంపాడు. అనంతరం మోక్ష(5) ను కూడా నీటిలో ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశాడు. మూడో సంతానమైన 13 నెలల చిన్నారిని నీటిలో విసిరేయడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని బాబును రక్షించి అతన్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement