Swati
-
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి టౌన్: గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న స్వాతి (14) శనివారం ఉదయం పాఠశాల రెండో అంతస్తు భవనంలోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉంది. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకొని.. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబం మదీనాగూడ ఎంఏ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. స్వాతి తండ్రి పండు రాజు, తల్లి దివ్యవాణి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కాగా, తమ కూతురు ఆత్మహత్య వెనుక హాస్టల్ వారిపైనే అనుమానం ఉందని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆమెతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వార్డెన్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
స్వాతి నాయక్‌కు నార్మన్ బోర్లాగ్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్‌లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్. కాగా, డాక్టర్ స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివారు. -
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్‌ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్‌లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్‌గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్‌లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్‌తో చేయించిన సాఫ్ట్ టాయ్స్‌లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్‌షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఆర్గానిక్ బ్రాండ్‌తో అరకు కాఫీకి.. అంతర్జాతీయ క్రేజ్
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అరకు వ్యాలీ కాఫీకి ఆర్గానిక్ బ్రాండ్ మరింత క్రేజ్ తేనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు వ్యాలీ కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం(ఆర్గానిక్ సర్టిఫికేషన్) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నాలుగేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. దీనివల్ల గిరిజన రైతులు పండించిన కాఫీ, మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత మంచి ధరలు దక్కనున్నాయి. ఫలించిన నాలుగేళ్ల కృషి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్ పరిధిలోని గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1,300 మంది గిరిజన రైతులు 2184.76 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం కోసం నాలుగేళ్లుగా కృషి జరిగింది. తొలుత గొందిపాకలు గ్రామానికి చెందిన రైతులు సేంద్రియ సాగులో ముందున్నారు. గ్రామంలోని రైతులంతా కలసి గిరిజన గ్రామ స్వరాజ్య సంఘంగా ఏర్పడి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీ, అంతర పంటగా మిరియాలను పండిస్తున్నారు. గొందిపాకలుతో పాటు లంబసింగి, కప్పలు గ్రామాల్లో రైతులతోనూ సమావేశాలు నిర్వహించిన జీసీసీ సేంద్రియ సాగును ప్రోత్సహించింది. దీంతో మూడేళ్లుగా క్రమం తప్పకుండా స్కోప్ సర్టిఫికెట్ వచ్చేలా జీసీసీ కృషి చేసింది. మూడేళ్లపాటు దీనిపై సునిశిత అధ్యయనం పూర్తికావడంతో నాల్గో ఏడాది సేంద్రియ సాగు ధ్రువపత్రం జారీకి అపెడా ఆమోదం తెలిపింది. దీంతో తొలి విడతలో చింతపల్లి మండలంలోని 2,184.76 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 1,300 మంది గిరిజన రైతులకు సేంద్రియ ధ్రువపత్రాలు అందించనున్నారు. ఇదే తరహాలో జీకే వీధి, పెదవలస, యెర్రచెరువులు క్లస్టర్లలో మరో 1,300 మంది రైతులు సుమారు 3,393.78 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలు పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి వాటికీ సేంద్రియ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కాగా, ఒక పంటకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం అంత తేలిక కాదు. ఇందుకు పెద్ద కసరత్తే ఉంటుంది. థర్డ్ పార్టీ వెరిఫికేషన్, ప్రతి విషయం ఆన్లైన్ వెరిఫికేషన్, ఆన్లైన్ అప్డేషన్, ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రం జియో ట్యాగింగ్, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వంటివి ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా నిర్వహించాలి. వీటన్నిటినీ జీసీసీ అధికారులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేశారు. మరో మైలురాయి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో జీసీసీ సమర్థంగా సేవలందిస్తోంది. ఇప్పటికే సేంద్రియ బ్రాండింగ్‌తో నాణ్యమైన పసుపు, తేనెను టీటీడీకీ సరఫరాచేస్తున్నా. తాజాగా నాలుగేళ్ల కృషి ఫలించడంతో కాఫీ, మిరియాల సాగుకు సేంద్రియ సాగు ధ్రువపత్రం దక్కడం జీసీసీ చరిత్రలో మరో మైలురాయి. ఇది సాధించినందుకు గర్వంగా ఉంది. – శోభ స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ -
Indian Air Force: సవాలుకు సై
‘ఎగిరించకు లోహ విహంగాలను’ అన్నారు శ్రీశ్రీ ‘సాహసి’ కవితలో. ఈ సాహసులు మాత్రం రకరకాల లోహవిహంగాలను ఎగిరించడంలో తమ సత్తా చాటుతున్నారు. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీ చినూక్ హెలికాప్టర్ యూనిట్లలో తొలిసారిగా ఇద్దరు మహిళా ఫైటర్ పైలట్లు విధులు నిర్వహించబోతున్నారు.... మూడు సంవత్సరాల క్రితం... ‘ఇది చిరకాలం గుర్తుండే పోయే శుభసందర్భం’ అనే ఆనందకరమైన మాట ఫ్లైట్ లెఫ్టినెంట్ పారుల్ భరద్వాజ నోటి నుంచి వినిపించింది. రష్యా తయారీ ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను నడిపిన తొలి ‘ఆల్ ఉమెన్ క్రూ’లో పారుల్ భరద్వాజ్ ఒకరు. ఆమెతోపాటు ఫ్లైట్ లెఫ్టినెంట్ హీన జైస్వాల్, ఫ్లైయింగ్ ఆఫీసర్ అమన్ నిధి ఉన్నారు. ‘ఆల్ ఉమెన్ క్రూ’కు ఎంపిక కావడం అంత తేలికైన విషయం కాదు. రకరకాల పరీక్షలలో విజయం సాధించి దీనికి ఎంపికయ్యారు. మొదట సికింద్రాబాద్‌లోని హకీంపేట్ హెలికాప్టర్ ట్రైనింగ్ సెంటర్లో, ఆ తరువాత బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘ఎంఐ–17వీ5 నడిపే మహిళా బృందంలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. దేశం కోసం ఏదైనా చేయాలనుకునేవారికి స్ఫూర్తినిచ్చే విషయం ఇది’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది పారుల్ భరద్వాజ్. పంజాబ్‌లోని ముకేరియన్ పట్టణానికి చెందిన పారుల్ రకరకాల హెలికాప్టర్లను నడపడంలో సత్తా చాటింది. తాజాగా... అధిక బరువు ఉన్న ఆయుధాలు, సరుకులను వేగంగా మోసుకెళ్లే మల్టీ–మిషన్ ‘చినూక్’ సారథ్య బాధ్యతను తొలిసారిగా ఇద్దరు మహిళలకు అప్పగించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. వారు... పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీలో ఈ ఇద్దరు విధులు నిర్వహిస్తారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఫ్లై– పాస్ట్’ లీడ్ చేసిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన స్వాతి రాథోడ్ రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లాలో జన్మించింది. పైలట్ కావాలనేది తన చిన్నప్పటి కల. ఎన్సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరడం తనను మరోస్థాయికి తీసుకువెళ్లింది. 2014లో పైలట్ కావాలనే తన కోరికను నెరవేర్చుకుంది స్వాతి రాథోడ్. ‘ఎం–17 నుంచి చినూక్లోకి అడుగుపెట్టడం ముందడుగుగా చెప్పుకోవాలి. వాయుసేనలో పనిచేస్తున్న మహిళలు తాము ఉన్నచోటే ఉండాలనుకోవడం లేదు. తమ ప్రతిభను నిరూపించుకొని ఉన్నతస్థాయికి చేరాలనుకుంటున్నారు. ఇది గొప్ప విషయం’ అంటున్నారు ఎయిర్ మార్షల్ అనీల్ చోప్రా. ఎంఐ–17వీ5తో పోల్చితే చినూక్ పనితీరు పూర్తిగా భిన్నం. దీనికితోడు కొన్ని భయాలు కూడా! అమెరికాకు చెందిన ఏరో స్పెస్ కంపెనీ ‘బోయింగ్’ తయారుచేసిన చినూక్ భద్రతపై ఇటీవల కాలంలో రకరకాల సందేహాలు వెల్లువెత్తాయి. వీటి ఇంజన్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందనేది వాటిలో ఒకటి. అయితే దీన్ని ‘బోయింగ్’ సంస్థ ఖండించింది. ఎలాంటి సమస్యా ఉండదని స్పష్టం చేసింది. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. -
స్వాతిముత్యం: ఆరోగ్యం ఆనందం
చాలామంది వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని రెండు ప్రపంచాలు చేసుకుంటారు. సరిహద్దులు గీసుకుంటారు. స్వాతి పిరామల్‌కు మాత్రం అలాంటి సరిహద్దులు లేవు. తనకు వైద్యరంగం అంటే ఎంత ఇష్టమో, ఇష్టమైన వంటకాలను చేయడం అంటే కూడా అంతే ఇష్టం. స్వాతి ఆధ్వర్యంలో జరిగే బోర్డ్ మీటింగ్‌లలో హాట్ హాట్ చర్చలే కాదు, ఆమె వండిన హాట్ హాట్ వంటకాలు కూడా దర్శనమిస్తాయి. ‘ఉరుకులు, పరుగులు వద్దు. కూల్‌గా, నవ్వుతూ పనిచేద్దాం’ అని తరచు చెప్పే శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరామల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం ‘ది షెవాలియే డి లా లీజియన్ దానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ అందుకున్నారు. అంతగా పరిచయం అక్కర్లేని పేరు స్వాతి పిరామల్. సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన స్వాతి తొలిసారి అడుగుపెట్టింది మాత్రం తనకు ఎంతమాత్రం పరిచయం లేని రంగంలోకి! ఆస్ట్రేలియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నికోలస్ లేబోరేటరీస్ కొనుగోలు చేసినప్పుడు తనకు, భర్త అజయ్ పిరామల్‌కు బొత్తిగా ఏమీ తెలియదు. తన చేతిలో మాత్రం ఎంబీబీయస్ డిగ్రీ ఉంది. నడుస్తూ నడుస్తూనే, ప్రయాణిస్తూనే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ఆ కష్టం వృథా పోలేదు. అనతి కాలంలోనే కంపెనీ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ రంగానికి సంబంధించిన పనితీరు విషయానికి వస్తే ‘ఇలాగే’ అన్నట్లుగా ఉండేది. ‘ఇలా కూడా చేయవచ్చు’ అని కూల్‌గా నిరూపించింది స్వాతి పిరామల్. ‘వ్యక్తిగత, వృత్తిజీవితాలకు మధ్య ఉండే సరిహద్దు రేఖను స్వాతి చెరిపేశారు’ అనే మాట వినబడుతుంటుంది. అయితే ఈ కామెంట్‌ను ఆమె ప్రశంసగానే స్వీకరిస్తుంది. ఇంట్లో వంట చేస్తూనే, టీ తయారు చేస్తూనే క్లయింట్స్‌తో స్వాతి మాట్లాడే దృశ్యం సా«ధారణం. చాలా సందర్భాల్లో క్లయింట్స్ ఆమె ఆతిథ్యం స్వీకరిస్తూనే వ్యాపార విషయాలు మాట్లాడుతుంటారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే స్వాతి తన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుంది తప్ప క్లయింట్స్‌తో కలిసి బిజినెస్ విషయాలు చర్చిస్తున్నట్లుగా ఉండదు! ‘ఔషధాలను అమ్మడానికి మాత్రమే మా పని పరిమితమైనది కాదు. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ముందు జాగ్రత్తలు సూచించి, ఆచరించేలా చేయడం కూడా’ అంటుంది స్వాతి పిరామల్. ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరామల్ సైన్స్, ఔషధరంగాల్లో సేవలు, భారత్–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది. ‘మీ ఖాతాలో ఇన్ని విజయాలు ఉన్నాయి కదా, మీరు ఏ విజయాన్ని చూసి ఎక్కువ గర్వపడతారు?’ అని అడిగితే – ‘ఏదీ లేదు’ అని గలగలమని నవ్వుతుంది స్వాతి. మనం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే ఇలా అంటుంది... ‘నా మనవరాలు తన రిపోర్ట్ కార్డ్‌తో నవ్వుతూ నా వైపు పరుగెత్తుకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్నట్లు గర్వపడతాను’. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరామల్ గ్రూప్ వైస్–చైర్పర్సన్ స్వాతి పిరామల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. ‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్న వ్యక్తి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టక ముందు మెడికల్ స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేది. ఆరోగ్య విషయాలపై వీధి నాటికలు తయారు చేసి ఫ్రెండ్స్‌తో కలిసి వాటిలో నటించేది. ప్రస్తుతం ‘పిరామల్ ఫౌండేషన్’ తరపున సామాజికసేవా కార్యక్రమాలు చేపడుతోంది. ‘ప్రజల ఆరోగ్యం, ఆవిష్కరణలు, కొత్త ఔషధాలపైనే నా ప్రధాన దృష్టి’ అని చెబుతుంది స్వాతి పిరామల్. -
సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం
‘నేను ఒక సగటు భారతీయ మహిళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న నాకు అందాల సుందరిగా పట్టాభిషేకం చేయడం భారతదేశం నలుమూలల్లో ఉన్న అద్భుతమైన మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు స్వాతి పాల. ఈ యేడాది హాట్ మండే మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత కిరీటాన్ని ఇటీవల స్వాతి పాల అందుకున్నారు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన స్వాతి, హైదరాబాద్‌లో మీడియా రంగంలోనూ పని చేశారు. కెనడాలో బిజినెస్ అనలిస్ట్‌గా, ఇద్దరు పిల్లలు తల్లిగా, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న గృహిణిగా, తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న సాధకురాలిగా స్వాతి ఎన్నో సంగతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ఈ ఏడాది ప్రయాణం నాకు చాలా అపురూపమైనది. వివాహిత మహిళల కోసం అత్యంత గౌరవనీయమైన, ప్రసిద్ధి చెందిన ఈ అందాల పోటీలు దుబాయ్‌లోని రస్ అల్ ఖైమాలోని హిల్టన్ గార్డెన్ ఇన్ లో జరిగింది. ఈ ఫైనల్స్‌లో దేశ దేశాల నుంచి 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నేను అగ్రగామిగా నిలవడం ఎంతో గొప్పగా, ఆనందంగా అనిపించింది. నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, భూమిని సూచించేలా నన్ను ఎలిమెంట్స్ క్వీన్‌గా ప్రకటించారు. మాది వైజాగ్. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీయే చేశాను. హైదరాబాద్‌కి ఉద్యోగరీత్యా వచ్చాక సాక్షి’ టీవీ ప్రారంభం నుంచి నాలుగేళ్లు హెచ్.ఆర్ విభాగంలోనూ, క్రియేటివ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గానూ వర్క్ చేశాను. మా వారి జాబ్ నేవీ కావడంతో తనకు కెనడాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో నేనూ కెనడా వెళ్లాను. అక్కడే బిజినెస్ అనలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో అప్లై మా వారు ఆన్లైన్లో ఈ అందాల పోటీల గురించి చూసి, నన్ను ప్రోత్సహించారు. అప్లై చేయించారు. 50 వేల అప్లికేషన్స్‌లో 110 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక అయిన వారిలో నేనున్నాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఏడాదిగా చాలా సెషన్స్ అయ్యాయి. వాటిలో రకరకాల టాస్క్‌లు దాటుకుని దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాను. మూడు రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 20 మందితో పోటీ పడి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచాను. కష్టమైనా ఇష్టంతో.. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఈ పోటీలో పాల్గొడానికి చేసిన కృషి చాలా కష్టమైనది. రోజూ జిమ్‌కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవడం, గ్రూమింగ్ సెషన్స్ తీసుకోవడం, ర్యాంప్ వాక్, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం క్లాసులు .. ప్రతిసారీ టాస్క్ అనిపించింది. ఉద్యోగంతో పాటు ఈ హార్డ్ వర్క్ చేయగలనా.. అని సందేహం కలిగింది. కానీ, ప్రారంభించాక మెల్ల మెల్లగా మామూలు అయిపోయింది. అయితే, ఈ క్లాసులన్నీ దాదాపు ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇండియా నుంచి కోచ్‌లుగా ఉన్న రితిక రామ్త్రీ మొదటి ఆరు నెలలు, తర్వాత శైలజ సూచి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండియా టైమింగ్స్‌ను బట్టి నైట్ టైమ్‌లోనూ కోచింగ్ తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను అనే ఉత్సాహంతో ఈ ప్రయాణం నడిచింది. క్లాసికల్ డ్యాన్సర్ ముందు కష్టం అనుకున్నది మెల్లగా మెల్లగా నా దినచర్య మార్చుకోవడంతో ట్రైనింగ్ సులువుగా మారిపోయింది. సెషన్స్‌లో ‘మిమ్మల్నే మిసెస్ ఇండియాగా ఎందుకు సెలక్ట్ చేయాలి?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నాను. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకున్నాను. దీంతో డ్యాన్స్‌లో నాకు సులువు అనిపించింది. పిల్లలే ప్రోత్సాహం కిరీటం వచ్చిందా లేదా అనేది తర్వాతి విషయం. శిక్షణ ఎంత బాగా తీసుకుంటామో ఫైనల్ పోటీలలో ప్రతిఫలిస్తుంది. కానీ, నాలో నాకే చాలా గొప్ప మార్పులు కనిపించాయి. నా పెద్ద కొడుకు తనీష్‌కి పదకొండేళ్లు. వాడు నా ఫొటోలు తీసి, సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ చేసేవాడు. చిన్నవాడు రేయాన్ ఫుడ్ తీసుకోవడంలో చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ‘నువ్వే గెలవాలి’ అనే వారి తాపత్రయం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. రాబోయే పోటీలు 12వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. కెనడాలో వచ్చే నెలలో జరగబోయే ఆడిషన్స్‌లో నేను జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. అయితే, ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయో తెలియాల్సి ఉంది’ అని వివరించారు ఈ మిసెస్ ఇండియా. – నిర్మలారెడ్డి -
‘ఈ ట్వీట్‌తో విమర్శలు వస్తాయని తెలుసు’
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఏం అవకాశం ఉన్నట్టు? ఈ ట్వీట్ చేయడం వల్ల నేను విమర్శలను ఆహ్వానిస్తున్నానని తెలుసు, అయినా దీన్ని గట్టిగా చెప్పాలనిపించింది. నిన్న ఒక కుటుంబంతో ఒక పాపను గమనించాను. పుణెలోని ఒక ధనిక మార్కెట్ ప్రాంతం అది. కచ్చితంగా పాప తొమ్మిది, పది నెలలకు మించి ఉండదు. తనకు హిజాబ్ వేసివుంది. ఈ సందర్భంలో పాపకు ఏం అవకాశం ఉన్నట్టు? నేను హిజాబ్ నిషేధాన్ని సమర్థించడం లేదు. కానీ అంత చిన్న పాపకు వేయడం అనే విషయంలో మాత్రం ఏదో తప్పుగా ఉంది. – రిచా సింగ్, రచయిత్రి కుడి ఎడమల వైఖరులు మెట్రోలో నాకు ఎడమ వైపున ఒక ఢిల్లీ పోలీస్ అంకుల్ కూర్చుని వాట్సాప్‌లో కాంగ్రెస్ పార్టీ మీద జోక్ చదువుతున్నాడు. నాకు కుడి వైపున బహుశా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అనుకుంటాను, లెనిన్ పుస్తకం చదువుతున్నాడు. జీవితంలో బహుశా మొదటిసారి నేను లెఫ్ట్ కంటే ‘రైట్’కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. – కె. స్వాతి, ఢిల్లీ హైకోర్ట్ అడ్వకేట్ ప్రతీకార రాజకీయాలు పశ్చిమ బెంగాల్లో ఒక్క వారంలో 26 రాజకీయ హత్యలు జరిగాయి. వీర్భూమ్ నరమేధంలో 12 మంది మహిళలు, పిల్లల్ని తగలబెట్టి చంపారు. ఇరవై నాలుగ్గంటల క్రితం వాళ్లు బతికున్నారు. ఒక తృణమూల్ నాయకుడి హత్యకు ప్రతీకారంగా జరిగిన హింస ఇది. మమతా బెనర్జీ పాలిత బెంగాల్లో ఇది నిత్యకృత్యమైపోయింది. – అభిజిత్ మజుందార్, సంపాదకుడు ఇంత హింసా? నిజాయితీ లేని మేధావితనం ఒక రాష్ట్రానికీ, దాని ప్రజలకూ ఏం చేయగలదో చూడాలంటే, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతున్నదో గమనించండి. కనీసం అక్కడ జరిగిన నరమేధపు ఫొటోలను ట్వీట్ చేయడానికి కూడా నాకు చేతులు రావడం లేదు. – రణ్వీర్ షోరే, నటుడు ఎలా మద్దతివ్వగలం? వ్లాదిమిర్ పుతిన్‌ను ఓడించడానికి ఉక్రెయిన్‌లోని నాజీలతో జట్టుకట్టడం ఎంత అసంబద్ధ మంటే... పుతిన్‌ను ఓడించడానికి సిరియాలోని ఐసిస్‌తో జట్టుకట్టడంతో అది సమానం. – మాజిద్ నవాజ్, యాక్టివిస్ట్ ఎందుకింత వేగం? కిరాణా సామగ్రి పది నిమిషాల్లో డెలివరీ... పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ... అదీ భారతీయ నగరాల్లో? నిజంగా ఈ డెలివరీ బాయ్స్ జీవితాలు, వాళ్ల రక్తపోట్ల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? – షెఫాలీ వైద్య, పాత్రికేయురాలు ఎందుకు రావడం? రీడింగ్ రూమ్‌కు వచ్చి అట్లానే పూర్తి నిద్రలోకి జారుకునేవాళ్లు నాకు ఎప్పుడూ అర్థం కారు. ప్రతి టేబుల్ మీదా ఒక తల పెట్టివుంది. – జాకబ్ బర్న్‌హామ్, పరిశోధక విద్యార్థి -
క్రియేటివ్ డైరెక్టర్ నుంచి మిసెస్ ఇండియాగా..
అందాల పోటీలు అంటేనే యువత, టీనేజ్ అమ్మాయిలు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లైన మహిళలు సైతం అందాల పోటీల్లో టీనేజ్ అమ్మాయిలకు పోటీని ఇస్తున్నారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేసేందుకు ఎన్నో వేదికలు సిద్దంగా ఉన్నాయి. అలాంటి వాటిలో హాట్ మాండే మిసెస్ ఇండియా ఒకటి. ఇటీవల ఈ వేదికపై మిసెస్ ఇండియాగా పోటీల్లో పాల్గోన్న తెలుగమ్మాయి స్వాతి పాల ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే అందాల పోటీల్లో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా శారీరక, మానసిక సామర్థ్యం, సమయస్ఫూర్తి ఆధారంగా సెలక్టర్లు ఎంపిక చేస్తారు. అలాగే స్వాతిలో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇన్నర్ బ్యూటీ అని కూడా అనిపించుకుంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్ట పొందిన ఆమె సృజనాత్మకతపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. టీవీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా కేరీర్ ప్రారంభించిన స్వాతి విద్య అనే పేరుతో షార్ట్ ఫిలీం తీసి ప్రశంసలు అందుకుంది. అంతేగాక స్వచ్చభారత్పై కొన్ని వీడియోలు తీసి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక పెళ్లయ్యాక పిల్లలకోసం కోన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె.. సేవారంగంపై మెగ్గుచూపింది. నావికాధికారి భార్యగా నేవి భార్యల సంక్షేమం కోసం‘ఎన్డబ్ల్యుడబ్ల్యుఏ’ అనే పేరుతో సంఘాన్ని స్థాపించి అందులో కీలకంగా వ్యవహిరిస్తోంది. అంతేగాక పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ పేరుతో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 15వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. -
నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
మొన్నటి ‘పెర్సీ’ రోవర్‌తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్లకు, తాజా పెర్సీ రోవర్‌కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్‌లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ. నాసా ఆఫీస్‌లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్ల నియంత్రణకు స్క్రీన్‌ప్లే వంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్లలో ఒక్క సోజర్న్ రోవర్‌కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్‌లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పైలట్. ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్‌లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్‌డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్‌గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్‌ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్‌ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్‌వేర్‌కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్‌ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాసా లేబరేటరీలో రోవర్ల మధ్య వందన -
నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..?
కేప్ కెనవరెల్: అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన తాజా ప్రయోగంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా ఉన్నారు. అంతరిక్షం పట్ల చిన్ననాటి నుంచే అమితాసక్తి కలిగిన స్వాతి మోహన్.. భారత్ నుంచి ఏడాది వయసులో తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు. స్టార్ ట్రెక్ స్ఫూర్తితో.. నార్తర్న్ వర్జినియా, వాషింగ్టన్ డీసీల్లో ప్రాథమిక విద్యాభ్యాసం, కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఎస్ చేశారు. ఎంఐటీ నుంచి ఏరోనాటిక్స్/ఆస్ట్రోనాటిక్స్లో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఉద్యోగ విధుల్లో భాగంగా నాసాలో పలు ప్రాజెక్టుల్లో పాలు పంచుకున్నారు. కేసిని (శనిగ్రహం పైకి), గ్రెయిల్ (చంద్రుడిపైకి) ప్రయోగాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ ‘మార్స్ 2020’ ప్రయోగం 2013లో ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్ స్వాతి మోహన్ ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలిసారి టీవీలో ‘స్టార్ ట్రెక్’సిరీస్ చూసిన 9 ఏళ్ల వయసు నుంచే స్వాతిలో అంతరిక్షం పట్ల ఆసక్తి ప్రారంభమైంది. చదవండి: అరుణ గ్రహంపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండైన ‘పెర్సి’ ఒక రూపాయికే పెట్రోలు.. ఎక్కడ? -
ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు
కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. నేనే శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నేనే శేఖర్ మాట్లాడుతూ – ‘‘ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా తెరకెక్కించాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వినీష్ గౌడ్, కో ప్రొడ్యూసర్: ఎన్. మాధవరెడ్డి. -
అందువల్లే స్వాతిరెడ్డి కోర్టుకు హాజరుకాలేకపోయింది
మహబూబ్‌నగర్ క్రైం: సరిగ్గా రెండేళ్ల తర్వాత స్వాతిరెడ్డి పేరు మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. ఈ కేసులో రెండేళ్ల కిందట ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతంగా హత్య చేయడంతో అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. భర్తను హత్య చేసినందుకు స్వాతిరెడ్డికి అప్పట్లో కోర్టు జైలు శిక్ష విధించింది. అనంతరం బెయిల్‌పై స్వాతిని 2018 జూలై 27న విడుదల చేశారు. అయితే, ఆమెను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని జైలు నుంచి నేరుగా పట్టణంలోని మెట్టుగడ్డ దగ్గర ఉన్న రాష్ట్ర సదనంకు తరలించారు. అయితే ఈ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టుకు వాయిదాల కోసం వెళ్లాల్సి ఉండగా మూడు సార్లు ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి స్వాతిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నాగర్‌కర్నూల్ పోలీసులు ఆమెను మంగళవారం అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆమె జైలులో 14రోజుల పాటు శిక్ష అనుభవించనుంది. ఇదిలాఉండగా, స్టేట్‌హోం నుంచి నాగర్‌కర్నూల్ కోర్టుకు వెళ్లడానికి సరైన భద్రత, స్థానిక సిబ్బంది నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే ఆమె కోర్టుకు హాజరుకాకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది. -
కలర్స్ సంక్రాంతి
తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు కనిపించని కష్టకాలంలో స్వాతి తన ఎంట్రీతో ఇండస్ట్రీకి పండగ తెచ్చింది!ఇప్పుడీ ‘పండగ’ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.పెళ్లయ్యాక వచ్చిన మొదటి సంక్రాంతి ఇది. ఈ పండగని స్వాతిఎలా సెలబ్రేట్ చేసుకోబోతోంది?పెళ్లి జీవితం ఎలా ఉంది?మన సినిమాకి మళ్లీ తెలుగు కళను తెస్తుందా?చదవండి.. ‘సాక్షి’కి స్వాతి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ. మీ పెళ్లయ్యాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి... స్పెషల్ ఏంటి? స్వాతి: స్పెషల్ అంటే అమ్మానాన్న నా దగ్గరకు రావడమే. ప్రస్తుతం వికాస్ (స్వాతి భర్త)తో జకార్తాలోనే ఉంటున్నాను. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ ‘నా ఇల్లు’ చూడటానికి అమ్మానాన్న వచ్చారు. ఇంటిని ఎలా సెటప్ చేసుకున్నామో చూశారు. వాళ్లకు నా ఇంటిని చూపించడం హ్యాపీ. పండగ అంటే వాళ్లకు వండిపెట్టడమే స్పెషల్. హైదరాబాద్‌లో అంటే వంట చేసి పెట్టడానికి ఎవరో ఒకరుంటారు. ఇక్కడ నా పని నేనే చేసుకోవాలి. కూతురి కొత్త ఇల్లు మీ పేరెంట్స్‌కి నచ్చిందా? వాళ్లకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇల్లు ఇరుకు ఇరుకుగా ఉండదు. చాలా విశాలంగా ఉంటుంది. అలాగే ఇంటి ముందు ఖాళీ స్థలంలో పచ్చని చెట్లతో చాలా కూల్‌గా అనిపిస్తుంది. వాళ్లు చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నారు. ఇంతకీ పండగకి కొత్త అల్లుడు తన అత్తమామలకు పెట్టిన డిమాండ్స్ ఏంటి? వికాస్ వాళ్లది కేరళ. మనలా వాళ్లకు సంక్రాంతి పెద్ద పండగ కాదు. అందుకని పండగకు డిమాండ్ చేయాలని తనకు తెలియదు. కానీ మా ఆయనకు ఓ తెలుగు పైలట్ ఫ్రెండ్ ఉన్నారు. ‘నువ్వు కొత్త అల్లుడివి. పండగకు ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేయాలి’ అని ఆ ఫ్రెండ్ చెప్పారు. కానీ మా ఆయన అలాంటివేం పట్టించుకోడు. నవ్వేసి ఊరుకున్నాడు. చాలా సింపుల్ వ్యక్తి. అత్తింటివాళ్లతో బాగా కలిసిపోయాడు. మేం కంఫర్ట్‌బుల్‌గా ఉండాలనుకుంటాడు. మరి మీ అమ్మావాళ్లు ఏమైనా తీసుకొచ్చారా? అలాంటివేం లేదు. వాళ్లు తెస్తేనే అన్నట్లు లేదు కదా. మా పెళ్లయ్యాక అమ్మానాన్న మాతో ఎక్కువ రోజులు ఉండలేదు. ఇప్పుడు మెయిన్‌గా మాతో ఉండాలని వచ్చారు. ఇందాక ‘నా ఇల్లు చూడ్డానికి వచ్చారు’ అన్నాను. ఏదో మాటకి అలా అన్నాను కానీ ఇంకా ‘నా ఇల్లు.. మీ ఇల్లు’ అనే ఫీల్ రావడంలేదు. ఇంతకీ వంట మనదేనా? వికాస్‌తో చేయిస్తున్నారా? అఫ్కోర్స్ నాదే. తను అప్పుడప్పుడు చేయందిస్తాడు. చిన్నప్పటి నుంచి అన్ని దేశాలు తిరుగుతున్నాడు. అందుకని వంట నేర్చుకున్నాడు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ‘వంట రాదు’ అని ఒక వయసు తర్వాత చెప్పుకోవడానికి బాగోదు. వంట అనేది మన సర్వైవల్ కోసమే. వంట చేయడం, వేరే దేశంలోనో, రాష్ట్రంలోనో ఉండాలన్నప్పుడు అక్కడి భాష, డ్రైవింగ్... ఇలాంటివన్నీ నేర్చుకుంటే మన కే మంచిది. వికాస్‌కి వంట వచ్చు. కానీ నేను వంట చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ల కోసం చేయడం ఇంకా మజా వస్తుంది. వికాస్ తెలుగు వంటలను ఇష్టపడతారా? తనకి చికె¯Œ బిర్యానీ అంటే చాలా ఇష్టం. రీసెంట్గా చేశాను. వంట ఇక్కడికి వచ్చి నేర్చుకోవడమే. ఏదైనా డౌట్ వస్తే అమ్మకు ఫో¯Œ చేస్తా. ఇప్పుడు అమ్మ వాళ్లు మనం గరిటె తిప్పుతున్న స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్నారు (నవ్వుతూ). ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు.. బయట మిమ్మల్ని ఇష్టపడేవాళ్లు ఉండే ఉంటారు. ఫైనల్లీ కేరళ అబ్బాయిని పెళ్లాడారు. ఎవరు ఎవర్ని పడేశారు? నేను పడేయలేదు. నన్నే పడేశాడు. తెలుగువాళ్లు ‘కలర్స్ స్వాతి’, హీరోయి¯Œ అన్నట్లుగానే చూశారు తప్పితే నన్ను నన్నుగా చూడలేదు. నావైపు ఆశ్చర్యంగా చూసినవాళ్లే తప్ప మామూలుగా చూసినవాళ్లు లేరు. వాళ్లల్లో ఆ ఎగై్జట్‌మెంట్ చాలా క్లియర్‌గా కనిపించేది. ఇక సినిమా తప్ప వేరే సంభాషణలే ఉండేవి కాదు. వికాస్ అలా కాదు. నేను పరిచయమైనప్పడు నన్ను ఓ మామూలు అమ్మాయిలానే చూశాడు. తన జాబ్ (పైలట్) అంటే తనకు చాలా ఇష్టం. సినిమాలు కూడా తక్కువగా చూసేవాడట. తన క్లాస్‌మేట్‌తో నేను రెండు తమిళ సినిమాల్లో యాక్ట్ చేశాను. అతని ద్వారానే మా ఫ్యామిలీకి వికాస్ పరిచయం. మేమేదో డేటింగ్ చేసుకొని పెళ్లి చేసుకోలేదు. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్. ఫిల్మ్ హీరోయిన్, గ్లామర్ ఇండస్ట్రీ అని అంతగా ఆశ్చర్యపడడు. అదీ ఓ ప్రొఫెష¯Œ అన్నట్టుగా చూస్తాడు. నాకది బాగా నచ్చింది. సినిమాలకు బ్రేక్ అనుకోవచ్చా. వికాస్ బైబై చెప్పమన్నారా? ఛా.. ఊర్కోండి (నవ్వుతూ). మనం 2019లోఉన్నాం. ఇంకా భార్యని ఉద్యోగం మానేయమని చెప్పే మగవాళ్లు ఉంటారనుకోను. ఉన్నా చాలా చాలా తక్కువ ఉండొచ్చు. వికాస్‌ది ఆ మెంటాలిటీ కాదు. తను చాలా దేశాలు ట్రావెల్ చేశాడు. బ్రాడ్మైండెడ్. నా ఫ్రెండ్స్ అందర్నీ కలిశాడు. హీరోయిన్లని, డైరెక్టర్లని పరిచయం చేసినప్పుడు ఎగై్జట్ అయిపోతాడని అనుకున్నాను. కానీ చాలా మామూలుగా మాట్లాడాడు. వేరే ప్రొఫెష వాళ్లను కలిశాం అనుకున్నాడు. అలాంటి మెంటాలిటీ ఉన్నతను సినిమాలు మానేయమనడు.యాక్చువల్లీ ఏ సినిమాలోనూ మీరు గ్లామరస్‌గా కనిపించలేదు. కానీ ఇటీవల ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్లో కనిపించడం ఆశ్చర్యం అనిపించింది?బికినీ సీన్స్ చేయాలంటే ఎప్పుడో చేసేదాన్ని కదా. ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా వల్గర్‌గా అనిపించలేదు. తెలుగమ్మాయిలంటే సిమ్మింగ్ చేయరా? నేను ఎప్పటినుంచో స్విమ్మింగ్ చేస్తున్నాను. కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిని కదా... జాగ్రత్తగా ఉన్నాను. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయం. ఇప్పుడు పెళ్లి తర్వాత నాకు ఫ్రీడమ్ వచ్చినట్లనిపిస్తోంది. అంటే.. స్విమ్మింగ్ పూల్ విజువల్స్‌కి వికాస్ ఏమీ అనలేదన్నమాట? అవును. తను కూడా చూశాడు. పైగా ఆ ఇంటర్వ్యూ అప్పుడు ‘నీ నెక్స్›్ట సినిమా ఎప్పుడు?’ అని ఏడిపించాడు. ‘ఇంకేదైనా అడగొచ్చు కదా.. ఆ ప్రశ్న ఎందుకు అడిగావు’ అని ఆ తర్వాత అంటే, ‘స్వాతీ.. నీకు సినిమాలు చేయాలని ఉంటే నిన్ను నేను ఆపను. ఆ విషయం నీకు తెలియజేయడం కోసమే అలా అడిగాను’ అన్నాడు. ఇంతకు ముందు మాట్లాడుతూ పెళ్లి తర్వాత ఫ్రీడమ్ వచ్చినట్లు ఉందన్నారు. అంటే.. అంతకు ముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఒకలాంటి నెమ్మదితనం, ఒకలాంటి ప్రశాంతత అనిపిస్తోంది. పెళ్లికి ముందు వరకు లైఫ్ అంతా హడావుడి. టీవీ షోలు, సినిమాలు అంటూ బిజీ. ఇప్పుడు ఆ హడావుడి నుంచి బయటకు వచ్చాను కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుంది. హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను. మనసంతా తేలికగా అనిపిస్తోంది. ఏదో విముక్తి లభించిన ఫీలింగ్. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నాను. పెళ్లయింది. మనకేం భయం లేదనే భరోసా. జనరల్‌గా చుట్టూ ఉన్నవాళ్లు పెళ్లంటే అదీ ఇదీ అని భయపెడతారు. కానీ నాకేం భయం లేదు. చక్కగా సెటిల్ అయ్యాను అనిపిస్తోంది. ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను.. కానీ ధైర్యంగా ఉంటున్నాను. ఆ ఫీలింగ్‌ని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనెలా ఉన్నా ఫర్వాలేదు అనిపిస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నారని అర్థమవుతోంది. అది సరే... మీ మాటల్లో వెటకారం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరి మీద సెటైర్లు వేస్తున్నారు? సందర్భాన్ని బట్టి ఒకరిపై ఒకరం పంచ్‌లు వేసుకుంటాం. అందరం ఫన్ లవ్వింగే. అయితే వికాస్ చాలా కామ్‌గా ఉంటాడు. అయినా ఎప్పుడూ గడగడా మాట్లాడేవాళ్లది ఏం ఉండదు. అంతా తుస్సే. కామ్‌గా ఉండేవాళ్లు పంచ్లేస్తేనే ఇంకా నవ్వొస్తుంది. తక్కువ మాట్లాడేవాళ్లు ఎక్కువ గమనిస్తుంటారు. వాళ్లు వేసే జోక్స్ వర్కౌట్ అవుతాయి. వికాస్ పంచ్‌లన్నీ అలా వర్కౌట్ అవుతాయి. మా అత్తామామలు కూడా చాలా కూల్. మా విషయాల్లో ఎక్కువ తలదూర్చరు. అలాగని పూర్తిగా వదిలేయరు. వాళ్లి ద్దరూ కేరళలోనే ఉంటారు. చిచ్చరపిడుగులా ఉండే స్వాతి పెళ్లయ్యాక ఏమైనా మారిందా? కొంచెం నెమ్మదస్తురాలైందా? బాగా నెమ్మదితనం అయితే వచ్చింది. అది కూడా చాలా బావుంది. హడావుడి పడటం తగ్గింది. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పక్కవాళ్లు ఏం చేస్తారు? ఎవరేమంటారు? అనే టెన్ష¯Œ ఉండేది. ఇప్పుడా భయం లేదు. పెళ్లి చేసుకుని ఇక్కడికొచ్చాక నాకు చాలా టైమ్ దొరుకుతోంది. లైఫ్‌ని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నాను. ఒక్కో దశలో జీవితం ఒక్కోలా కొనసాగుతుంది. వాటి నుంచి నేర్చుకోవాలి. అన్నింటినీ తలుచుకుంటే జరిగిందంతా మంచికే అనే నమ్మకం వచ్చేసింది. పైలట్ కాబట్టి వికాస్ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు. మీకు ఇంట్లో బోర్ అనిపించదా? ఒక్కోసారి వారంలో నాలుగు రోజులు వెళ్లిపోతాడు. కొన్నిసార్లు పొద్దున్నే వెళ్లి ఈవెనింగ్ వచ్చేస్తాడు. ముందు నాకు అర్థం అయ్యేది కాదు. రెండు మూడు రోజులే కదా.. ఒక్కదాన్నే రిలాక్స్ అయిపోవచ్చు అనుకునేదాన్ని. కానీ మెల్లిగా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇంటిపట్టున ఉంటే బావుండు అనిపిస్తుంది. అంటే.. ఓన్లీ రొమాంటిక్ రీజన్స్ కోసమే కాదు. అలాగని రోజంతా కబుర్లు చెప్పుకుంటాం అని కాదు. ఇద్దరం కలిసి టీవీ చూస్తుంటాం. ఇష్టమైన ఇంకో మనిషి దగ్గర ఉంటే అదో ఆనందం. అవునూ.. పెళ్లికి పెద్దగా ఎవర్నీ పిలవనట్లుంది? చాలా క్లోజ్ సర్కిల్లో పెళ్లి చేసుకోవాలనిపించింది. అందుకని కొంతమందినే పిలిచాను. అందర్నీ పిలిస్తే వాళ్లకు వచ్చే వీలుండకపోవచ్చు. ఎవరి షూటింగ్స్‌తో వాళ్లు బిజీగా ఉంటారు. పైగా వచ్చాక వాళ్లకు అసౌకర్యంగా ఉండకూడదు. మన పెళ్లి మంటపాల్లో నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఇవన్నీ ఆలోచించుకుని సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాను. పెళ్లిని దాచేద్దాం అని కాదు. చేసుకున్న తర్వాత చెబుదాంలే అనుకున్నాను. మాకో క్లోజ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో పెళ్లి విషయం పెట్టాను. అది ఎవరో లీక్ చేశారు. అలా బయటకి వచ్చింది. ఎవర్నీ పిలవకూడదనే అభిప్రాయం అయితే లేదు. చిన్నగా చేసుకుందాం అని. కొందరైతే మీడియా వాళ్లను పిలవలేదని విమర్శించారు. కేవలం తక్కువమంది మధ్యలో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనే ఎవర్నీ పిలవలేదు. ఫైనల్లీ మళ్లీ అడుగుతున్నాం.. సినిమాలకు దూరం అవ్వరు కదా? నా వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. అవకాశాలు వస్తే యాక్ట్ చేస్తా. ఒక్కసారి యాక్టింగ్ చేసిన తర్వాత దాన్ని వదల్లేం. మీ చిన్నప్పటి సంక్రాంతి గురించి? గాలిపటాలంటే ఇష్టమే. కానీ నాకు ఎలా ఉండేదంటే మా అన్నయ్య, వాళ్ల ఫ్రెండ్స్ మా మేడ మీద ఎక్కువగా ఆడేవారు. వాళ్లందరికీ చిన్న సైజ్ అసిస్టెంట్‌ని నేను. కింద నుంచి తినడానికి ఏదైనా తీసుకురా. నీళ్లు అయిపోయాయి బాటిల్ తీసుకురా. ఇది పట్టుకో అంటూ ఆర్డర్లు. వాళ్లందరికీ నేనే అసిస్టెంట్‌ని. ఎప్పుడైనా ౖకైట్ ఇచ్చి ఎగరేయమన్నా కింద పడిపోయేది. ఎలా ఎగరేయాలో అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు వికాస్ గాలికి వ్యతిరేక దిశలో ఫ్లైట్ వెళ్లాలి అని చెబుతుంటే గాలిపటానిది కూడా సేమ్ కాన్సెప్ట్ కదా అనిపించింది. అప్పుడు అది తెలియక మా అన్నకు అసిస్టెంట్‌గా ఉండిపోయా (నవ్వుతూ). ఇంతకీ అమ్మానాన్న∙ఎప్పుడు అవ్వాలని? అయ్య బాబోయ్. అప్పుడే? జీవితం అంటే చిన్న చిన్న ఆనందాలు కూడా ఉండాలని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నాకు పప్పుచారు టేస్ట్ సరిగ్గా కుదిరితే ఆ రోజంతా హ్యాపీగా అనిపిస్తోంది. మా ఇంటి ముందు ఉన్న చెట్టుకి పువ్వు పూచినా, గడ్డి మీద వాటర్ బబుల్స్ చూసినా పిచ్చ హ్యాపీగా ఉంటోంది. వేసవి కాలంలో మంచి మామిడి పండుని ఎలా ఆస్వాదిస్తామో ఇప్పుడు జీవితాన్ని నేనలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఫేజ్ చాలా బాగుంది. అలా అని ఈజీ అనడం లేదు. అనను కూడా. హైదరాబాద్‌లో ఉంటే వంట చేసేవాళ్లు, కారు డ్రైవ్ చేసేవాళ్లు ఉంటారు. అందుకే ఎక్కువ టైమ్ ఉన్నట్టు అనిపించేది. లేనిపోని ఆలోచనలు వచ్చేవి. ఇక్కడ ఆకలేస్తే నేనే లేవాలి, వండుకుని తినాలి. దాంట్లో వచ్చే ఆనందం బావుంది. ఇండిపెండెంట్‌గా ఫీల్ అవుతున్నాను. పెళ్లయిపోతే అంతే సంగతులని కొందరు అంటుంటారు.. మీరేమంటారు? చాలా మంది అమ్మాయిలకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. మనం పెళ్లి మీద జోక్స్ చేస్తుంటాం. భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదర్ అని. కానీ అలా ఏం ఉండదు. మంచి మ్యారేజ్‌లో ఫ్రీడమ్ చాలా ఉంటుంది. కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది అనే హోప్ ఉంటుంది. నాకైతే నా మ్యారీడ్ లైఫ్ అలానే అనిపిస్తోంది. ఫ్రీడమ్ స్టార్ట్స్ విత్ ఏ గుడ్ రిలేష¯Œ షిప్. పెళ్లనేది స్వతంత్రానికి శుభం కార్డ్ మాత్రం కాదు. ఇంట్రడక్ష¯Œ సీనే అని నేనంటాను. -
స్వాతి గారు
నిందితురాలి గురించి చెబుతున్నప్పుడు పోలీసులు ‘తమదైన శైలి’కి భిన్నంగా మర్యాదకరమైన భాషను ఉపయోగిస్తుండగా.. ‘తనది కాకూడని శైలి’లో మీడియా అమర్యాదకరమైన రీతిలో నిందితురాలిని ఆడిపోసుకుంటోంది. విచారణ జరగక ముందే నిందితురాలిని పరమ దుర్మార్గురాలిగా చిత్రీకరించే ‘మోరల్ బైనరీ’ ఇది! ఈసబెల్ అయాండే చిలీ సంతతి అమెరికన్ రచయిత్రి. ‘భూత నిలయం’, ‘మృగ నగరం’ అని అర్థం వచ్చే రెండు నవలల్తో తొలిసారి ఈసబెల్ పేరు అందరికీ తెలిసింది. భూత నిలయంలో భూతాలు ఉండవు. మృగ నగరంలో మృగాలు ఉండవు. మానవ జీవితంలోని సహజ భావనలే ఆ భూతాలు, మృగాలు. ‘మేజికల్ రియలిజం’ ఆమె రచనాశైలి. అంటే ఏం లేదు. కల్పన కల్పనలా ఉండదు. వాస్తవం వాస్తవంలా ఉండదు. పుస్తకంలోని పేజీల్లోపల ఏం జరగాలో అదే జరుగుతుంది. రచయిత్రి వచ్చి జరిపించరు. మోరల్ బైనరీస్ ఉండవు. తప్పు, ఒప్పు తప్ప ఇంకేం అయ్యేందుకు అవకాశమే లేదనే ఆలోచనకు ప్రభావితం చెయ్యడం మోరల్ బైనరీ. అది ఉండదు ఈసబెల్ రచనల్లో. ఈసబెల్ నవలలతో సమానంగా ఆమె మాట ఒకటి బాగా వాడుకలో ఉంది. ‘వాట్ ఐ ఫియర్ మోస్ట్ ఈజ్ పవర్ విత్ ఇంప్యూనిటీ. ఐ ఫియర్ అబ్యూజ్ ఆఫ్ పవర్, అండ్ ది పవర్ టు బ్యూజ్’. శిక్షల నుంచి మినహాయింపు పొందిన అధికారం అంటే ఆమెకు భయం. అధికారం ఇచ్చి, నువ్వేం చేసినా శిక్ష ఉండదని చెప్తే అధికారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి. దుర్వినియోగం చెయ్యడానికే నీకీ అధికారం అని చెప్పినట్లూ అవుతుంది. అదీ ఈసబెల్ భయం. ‘పవర్ విత్ ఇంప్యూనిటీ’ని చట్టం ఎవరికీ ఇవ్వదు. తీసుకుంటారంతే! ఎందుకు తీసుకుంటారూ అంటే.. అధికారం ఉంది కాబట్టి తీసుకోవాలనిపిస్తుందేమో. పోలీసులకు అధికారం ఉంటుంది. న్యాయ వ్యవస్థకు అధికారం ఉంటుంది. ప్రజాప్రతినిధులకు అధికారం ఉంటుంది. ప్రజలకు ఏమైనా చెయ్యాలంటే అధికారం ఉండాలి కనుక ఉండే అధికారాలివన్నీ. అంతే తప్ప, అధికారం ఉంది కదా అని ప్రజల్ని ఏమైనా చెయ్యడానికి ఉండే అధికారాలు కావు. మీడియా కూడా మిగతావాటిలా తనకూ అధికారం ఉందనుకుంటుంది. నిజానికి మీడియాకు ప్రజల తరఫున తనకై తానుగా తీసుకున్న ‘సుమోటో’ లాంటి హక్కు తప్ప, ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఏమీ ఉండదు. కానీ ఉందనుకుంటుంది! ఉందనుకున్న ఆ అధికారంతో ఒక్కోసారి జడ్జిలా తీర్పులు ఇస్తుంటుంది. పోలీసులా ప్రశ్నలు వేస్తుంటుంది. బాబాలా ప్రవచనాలు చెబుతుంటుంది. పొలిటీషియన్ల మీద సెటైర్లు వేస్తుంది. ఏ విషయాన్నైనా తను తప్పనుకుంటే తప్పనిపించేలా చెబుతుంది. తను ఒప్పనుకుంటే ఒప్పనిపించేలా చెబుతుంది. తను దారుణం అనుకుంటే దారుణం అనిపించేలా చెబుతుంది. ఇదే ‘మోరల్ బైనరీ’. దారుణాన్ని దారుణం అని చెప్తే చాలు. దారుణంగా చెప్పాలా! భాషను మార్చుకుంటున్న ఏజ్‌లో ఉన్నాం మనం. ‘తమదైన శైలిలో విచారించగా..’ అని పోలీసుల గురించి మీడియా చెప్పడం కూడా సరికాదు. పోలీసుల అధికార దుర్వినియోగాన్ని ఒక శైలిగా సూత్రీకరించడం అది. నాగర్‌కర్నూల్‌లో భర్త హత్య కేసు విషయంలో స్వాతిని అరెస్ట్ చేసిన వార్తను చెబుతున్నప్పుడు మీడియా.. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిందనీ, భర్త ప్లేసులో ప్రియుడితో దర్జాగా పుణే చెక్కేద్దామనుకుందనీ, సిగ్గు లేదనీ, శరం లేదనీ.. అసలు ఆడ మనిషే కాదనీ తిట్టిపోస్తుంటే.. పోలీసు అధికారులు మాత్రం ఈ కేసు గురించి మీడియాకు వివరాలు ఇస్తూ.. స్వాతిని అనేకసార్లు ‘స్వాతి గారు ఇలా చేశారు’, ‘స్వాతి గారు అలా చేశారు’ అని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ తమకు తెలియకుండానే నేరానికి ‘ఫీల్‌గుడ్’ నేరేషన్ ఇవ్వడం టీవీలో చూస్తున్నవాళ్లందరికీ కొత్తగా అనిపించింది. పోలీసులపై సదభిప్రాయం కూడా కలిగించింది. సమాజాన్ని మెరుగు పరచాలని నిరంతరం పరుగులు తీస్తుండే మీడియా.. ఒక రోజు సెలవు పెట్టయినా తన పద్ధతులను మెరుగు పరచుకునే ఆలోచనలు చేస్తే.. వార్త, వార్తలా ఉంటుంది. రచనల్లోని ‘మేజికల్ రియలిజం’.. వార్తలు చెప్పడంలో కనిపించకూడదు. కనిపిస్తే అది ‘పవర్ విత్ ఇంప్యూనిటీ’నే అవుతుంది. అబార్షన్ వార్తల్ని రాసేటప్పుడు జర్నలిస్టులు ఎంత సున్నితంగా ఆలోచించాలో ‘నేర్పించే’ సెషన్ ఒకటి ‘గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్’ ఆధ్వర్యంలో ఈమధ్య న్యూఢిల్లీలో జరిగింది. పిండాన్ని పిండమనే రాయండి తప్ప శిశువు అని రాయకండనీ, రాసేటప్పుడు తప్పొప్పుల ‘మోరల్ బైనరీస్’ ఇవ్వకండనీ ఆ సెషన్లో చెప్పారు. నేరుగా చెప్పండి తప్ప వేరుగా చెప్పకండి అన్నారు. కరెక్టు మాట. అబార్షన్ని అబార్షన్ అని చెబితే చాలు. ‘దేవుడితో ఆటలు’ (ప్లేయింగ్ విత్ గాడ్) అనక్కర్లేదు. గర్భాన్ని ఉంచుకుంటే గర్భాన్ని ఉంచుకున్నట్లు చెబితే చాలు. ‘మాతృత్వాన్ని కాపాడుకోవడం’ (సేవింగ్ మదర్‌హుడ్) అనక్కర్లేదు. - మాధవ్ శింగరాజు -
బెయిల్‌పై విడుదలైన స్వాతి
మహబూబ్‌నగర్ క్రైం: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గత ఏడాది నవంబర్ 26న ప్రియుడు రాజేశ్‌తో కలసి భర్త సుధాకర్‌రెడ్డిని హత్య చేసిన కేసులో నిందితురాలు స్వాతి శుక్రవారం బెయిల్‌పై విడుదలైంది. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈనెల 16నే ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తుల జామీను (పూచీకత్తు) అవసరం ఉండగా.. ఎవరూ ముందుకు రాక ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. కాగా, బుధ వారం నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వగా శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు, కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో ఆమెను సాయంత్రం జైలు నుంచి విడుదల చేశారు. అయితే స్వాతిని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు, బంధువులెవరూ జైలు దగ్గరకు రాలేదు. ఈ నేపథ్యంలో స్వాతి, ముందుగానే కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు జైలు నుంచి విడుదలయిన తర్వాత ఆశ్రయం కల్పించాలని లేఖ రాశారు. దీంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని నేరుగా జిల్లా కేంద్రంలోని రాష్ట్ర సదనానికి తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు రాజేశ్‌కు ఇంకా బెయిల్ లభించలేదు. భర్తను హత్య చేసిన తర్వాత స్వాతి, అతని స్థానంలో ప్రియుడు రాజేశ్‌ను ప్రవేశపెట్టేందుకు ఆయన ముఖంపై యాసిడ్ పోసి భర్తగా నమ్మించాలని చూసిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
సాగరం చుట్టిన వనితలు
ఎగిసిపడే అలల్ని చూసి జడిసిపోలేదు. పెనుగాలులకు చిగురుటాకైన నావను చూసి వణికిపోలేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 200 రోజులకు పైగా సాగిన సాగర యాత్ర... సగర్వంగా ప్రపంచ రికార్డులకెక్కింది. భారతీయ వనితల సత్తాను చాటింది. పెద్ద తుఫాన్, చల్లని ఈదురుగాలులు, ఎముకలు కొరికే చలి.... ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధించే వరకు పట్టువీడలేదు. రెండు మహా సముద్రాల మీదుగా లక్ష్యాన్ని చేరుకున్నారు. భారతీయ మహిళా నావికుల సామర్థ్యాన్ని ప్రపంచాన్ని చాటేందుకు ఇండియన్ నేవీ 2017 సెప్టెంబర్ 10న ‘నావికా సాగర్ పరిక్రమ’ పేరుతో యాత్రను ప్రారంభించింది. ఇందుకోసమని దేశవ్యాప్తంగా ఉన్న నేవీ విభాగాల నుంచి మెరికల్లాంటి ఆరుగురు మహిళా కెప్టెన్లను నియమించింది. వీరిలో విశాఖపట్టణానికి చెందిన స్వాతి పాతర్లపల్లి, హైదరాబాద్‌కు చెందిన బొడ్డపాటి ఐశ్వర్యలు ఉన్నారు. యాత్ర ఎలా జరిగింది, ఇబ్బందులు ఎలా ఎదురైయ్యాయి, ఆనంద క్షణాలు ఏంటి అనే విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు విశాఖపట్టణానికి చెందిన స్వాతి పాతర్లపల్లి, హైదరాబాద్‌కు చెందిన నేవీ లెఫ్ట్‌నెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డుపల్లిలు. 2015లోనే కార్యచరణ ‘నావికా సాగర్ పరిక్రమ’ కోసం 2015లోనే కార్యచరణను ప్రారంభించారు నేవీ అధికారులు. ఇండియన్ బోటు ద్వారా సుదీర్ఘదూరం సముద్రంలో యాత్ర చేయాలనేది నేవీ రిటైర్డ్ వైస్ అడ్మిరల్ మనోహర్ కల. ఆ కలను సాకారం చేసేందుకు ఇండియన్ నేవీ సీలింగ్ వెజిల్ని తయారు చేసింది. కెప్టెన్ దిలిప్ డోండే సారధ్యంలో టీమ్ ఏర్పాటైంది. ఇందులో వైజాగ్‌కు చెందిన నేవిగేటింగ్ అండ్ కమ్యునికేషన్ ఆఫీసర్ స్వాతి పాతర్లపల్లి, హైదరాబాద్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డుపల్లి, వర్తికా జోషి (రిషికేష్), ప్రతిభా జాంబ్వాల్ (హిమాచల్ ప్రదేశ్), విజయదేవి (మణిపూర్), పాయల్ గుప్తా (డెహ్రడూన్)లు ఎంపికయ్యారు. వీరికి ‘నావికా సాగర్ పరిక్రమ’ చేపట్టే ఏడాది ముందు నుంచే ట్రైనింగ్‌ను ఇచ్చారు. ట్రయల్ ట్రిప్‌గా 2016 మేలో గోవా నుంచి మారిషస్‌కి వీరిచే ఒక మినీ యాత్రను నిర్వహించారు. సుమారు 8 వారాల పాటు సాగిన ఈ ట్రైనింగ్ యాత్రలో ఎదురైన ఒడిదుడుకులను వీరు ఎదిరించారు. మార్గమధ్యలో బోటు రిపేర్ అయితే వారంతటికి వారే రిపేర్ చేసుకోవడం, పెద్ద పెద్ద అలలు తాకినప్పుడు ధైర్యంగా నిలవడాన్ని చూసిన భారత నేవీ అధికారులు ‘నావిక సాగర్ పరిక్రమ’ యాత్ర చేపట్టేందుకు పూర్తి అనుమతి ఇచ్చారు. సముద్రంలో 199 రోజులు 2017 సెప్టెంబర్ 10న గోవా నుంచి ‘తరుణి’ బోటులో ‘నావికా సాగర్ పరిక్రమ’ మొదలైంది. ఇది 254 రోజులు సాగింది. రెండు మహాసముద్రాలు పసిఫిక్, అట్లాంటిక్ మీదుగా సుమారు 21,600 కి.మీ. ప్రయాణించారు. సముద్రం మీద వీరు రోజులు 199 రోజులు ఉంటే, 55 రోజులు వివిధ దేశాల్లో మన దేశ కార్యక్రమాలైన మహిళా సాధికారిత, మేక్ ఇన్ ఇండియా, మానిటరింగ్ మెరీన్ పొల్యూషన్, మానిటిరింగ్ వెదర్ అండ్ గివింగ్ వంటి వాటిపై అవగాహాన కల్పించారు. ఆయా దేశాల్లో అక్కడి స్త్రీలతో మమేకమై వీరి యాత్రా విశేషాలను పంచుకున్నారు. విపత్కర పరిస్థితులను ఎదురించిన స్వాతి వైజాగ్‌కు చెందిన స్వాతి పాతర్లపల్లి నేవీలో నేవిగేటింగ్ అండ్ కమ్యునికేషన్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. ఈ యాత్రలో కమ్యునికేషన్ అండ్ నేవిగేటింగ్ చూసుకునే బాధ్యత స్వాతిదే. రోడ్డు మార్గంలో ఏదైనా యాత్ర చేస్తున్నప్పుడు కమ్యునికేషన్‌కు ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి బాధ్యత వహిస్తున్న వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. అటువంటిది సముద్రం లోపల నేవిగేటింగ్ అండ్ కమ్యునికేషన్‌ను కంట్రోల్ చేయడం అంత సులువైంది కాదనే చెప్పాలి. ‘రెండు పర్యాయాలు తుఫాన్ వచ్చినప్పుడు నెట్వర్క్ పూర్తిగా కటై్టంది. నేవిగేషన్ ఎటు చూపిస్తోందో అర్థం కాలేదు. రెండు గంటల పాటు అవతలి దేశం వారికి కమ్యునికేషన్ కనెక్ట్ చేసేందుకు చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో మా బోటును తాకిన అలలను చూస్తే అందరం భయపడాల్సి వచ్చింది’ అని స్వాతి చెప్పారు. వాలంటీర్‌గా ఐశ్వర్య కలలు సాకారం చేసుకుంది హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య బొడ్డుపల్లి ఈ యాత్రలో కీలకంగా వ్యవహిరించారు. ఐదుగురు లెఫ్ట్నెంట్లతో పాటు ఐశ్వర్య వాలంటీర్‌గా ఉన్నారు. ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి సముద్రంలో బోటు యాత్ర చేయాలనేది కల. ఆ కల ఇండియన్ నేవీ ద్వారా అదీ తాను లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా ఉన్న సమయంలో జరగడం ఐశ్వర్యకు ఆనందాన్ని ఇస్తోంది. ఈ యాత్రలో స్వాతి, పాయల్ గుప్తా, వర్తికా జోషి, విజయదేవిలకు చేదోడుగా ఉంటూ, కీలక సమయాల్లో వాలంటీర్ సేవలను తను అందించడం జరిగింది. ప్రపంచ రికార్డులో భాగస్వామి కావడం పట్ల ఐశ్వర్య పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. పదిరోజులు మ్యాగీ, 14 రోజులు వర్షపునీరు ‘మేం యాత్ర ప్రారంభించిన కొద్దిరోజులకే సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో మేము తెచ్చుకున్న నిత్యవసర సరుకులన్నీ తడిసిపోయి తినడానికి వీలు లేకుండా పోయాయి. పదిరోజుల పాటు మా వెంట తెచ్చుకున్న మ్యాగీని చేసుకుని ఆకలిని తీర్చుకున్నాం’ అని ఐశ్వర్య బొడ్డుపల్లి వివరించారు. ‘బోటులో ఉన్న ఆర్వోప్లాంట్ పాడైంది. దీంతో మంచినీళ్లు లేక ఎన్నో తిప్పలు పడ్డాము. వర్షపునీటిని పట్టుకుని కాచి చల్లార్చుకుని దాహం తీర్చుకున్నాం’ అని చెప్పారు. రాత్రంతా చలిలోనే.. ‘ఫసిఫిక్ మహాసముద్రం దాటిన తరువాత పెద్ద పెద్ద అలలు వ్యాపించాయి. వాతావరణం చాలా చల్లగా అయిపోయింది. అలలు క్రాష్ అయ్యాయి. ఆ సమయంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్ పాయల్‌గుప్తా తలకు బలమైన గాయం అయ్యింది’ అని ఐశ్వర్య చెప్పారు. ‘బోటు ముఖద్వారం వద్ద రెండు పెద్ద తెరచాపలు ఉన్నాయి. వీపరీతమైన గాలి, వర్షం కారణంగా ఆ రెండు తెరచాపలు తెగిపడ్డాయి. దీంతో చల్లని గాలి బోటు లోపలకి రావడంతో రాత్రంతా నిద్ర మానుకుని చలిలోనే గడపాల్సి వచ్చింది’ అని స్వాతి గుర్తు చేశారు. స్వీట్ మెమోరీస్.. ‘అట్లాంటిక్ మహా సముద్రం దాటుతుండగా జనవరి 7న భారీ తుఫాన్ వచ్చింది. బోటు విపరీతంగా కిందకు పైకి ఊగడంతో మునిగిపోతుందనే భయపడ్డాం. కాని అదృష్టం బాగుండి అలా జరగలేదు. ఆ∙తెల్లారి అంటే జనవరి 8న తేదీన అలలు నెమ్మదిగా, చక్కగా వస్తున్నాయి. ఆ సమయంలో రెయిన్బో ఆ అలలపై పడటం, డాల్ఫిన్స్ మా బోటు వద్దకు రావడం చాలా సంతోషమనిపించింది. ఇవి మా ఆరుగురికీ జీవితాంతం గుర్తుండే స్వీట్ మెమోరీస్’ అన్నారు ఐశ్వర్య. మారిషస్ వద్ద స్టీరింగ్ ఫెయిల్ ‘కేప్‌టౌన్ నుంచి గోవా వస్తున్నప్పుడు మారిషస్ వద్ద స్టీరింగ్ ఫెయిల్ అయ్యింది. ఇదే సమయంలో ‘ఫకీర్’ అనే తుఫాన్ కూడా వచ్చింది. చాలా ఆందోళన చెందాము. తిరిగి గోవాకు చేరేదట్లా అంటూ అందరం మానసికంగా వేదనపడ్డాం. ఆరుగురం కలసి అత్యంత కష్టం మీద ఆ బోటును రిపేర్ చేసుకుని యాత్రను విజయవంతం చేశాం’ స్వాతి, ఐశ్వర్యలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నుంచి కితాబు యాత్రను విజయవంతం చేసుకుని ప్రపంచ రికార్డును నెలకొల్పిన సందర్భంగా భారత ప్రధాని రామ్‌నాథ్ కోవింద్ ఈ నారీమణులను గురువారం సత్కరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో స్వాతి పాతర్లపూడి, ఐశ్వర్య బొడ్డుపల్లి, పాయల్ గుప్తా, ప్రతిభా జంబ్వాల్, వర్తికా జోషి, విజయదేవిలు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. యాత్రను విజయవంతం చేసుకుని భారత్‌కు తిరిగొచ్చి యావత్ప్రపంచానికి మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పడం పట్ల రాష్ట్రపతి వీరిని కొనియాడారు. గర్వంగా ఉంది మా అమ్మాయి ఐశ్వర్యని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేవీలోకి వెళ్లేముందు చాలా మంది ఎందుకు పంపిస్తున్నారన్నారు. అయినా మేం లెక్కచెయ్యలేదు. తన ఇష్టానికి ప్రాధాన్యతను ఇచ్చి ప్రొత్సహించాం. ఈ యాత్ర మొదట్లో అందరూ ఆడపిల్లలే... ధైర్యంగా ఉండగలరా అని టెన్షన్ పడ్డాం. మధ్య మధ్య ఫోన్ చేసి తను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో సంతృప్తి చెందాం. బోటు రిపేర్ అయిన విషయాన్ని చెప్పినప్పుడు తిరిగి ఇంటికి వస్తారా..రారా అంటూ ఆందోళన చెందాము. కాని ఇవాళ యాత్ర విజయవంతం కావడంలో మా అమ్మాయి పాత్ర కూడా ఉండటం గర్వంగా ఉంది. ఆడపిల్లలను ఇంటికే పరిమితం చెయ్యకుండా వారికి నచ్చిన రంగంలో అవకాశాన్ని కల్పిస్తే వారు ఏదైనా సాధిస్తారు. – సాయిప్రభాకర్, సత్యవాణ(ఐశ్వర్య తల్లిదండ్రులు) తిండితిప్పలు మానేశాం ‘నావికా సాగర్ పరిక్రమ’ యాత్రలో రెండు సార్లు తుఫాన్ వచ్చిన విషయం మాకు చెప్పలేదు. తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నాం. ప్రతి రెండు రోజులకోసారి ఫోన్ చేసి మమ్మల్ని పలకరించేది. మేము కూడా ఆరుగురి యోగక్షేమాలు తెలుకునే వాళ్లం. యాత్ర విజయవంతం అయ్యి తిరిగొచ్చాక నా కూతురు ఏదైనా సాధిస్తుందనే నమ్మకం మాలో దృడంగా కలిగింది. ఆడపిల్లలకే ప్రతి తల్లిదండ్రులు ప్రాధాన్యతను ఇవ్వాలి. మేము మా అమ్మాయి టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాం, ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. – పాతర్లపల్లి రాణి, ఆదినారాయణ (స్వాతి తల్లిదండ్రులు) – చైతన్య వంపుగాని, సాక్షి ప్రతినిధి -
స్వాతి, షబ్బీర్‌లపై కేసుల్ని ఎత్తివేయాలి
హైదరాబాద్: కఠువా, ఉన్నావ్ ఘటనలకు నిరససగా కార్టూన్ వేసిన సీనియర్ జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడిపై కేసు నమోదుచేయడాన్ని ఖండిస్తున్నట్లు ‘ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్’ సభ్యులు తెలిపారు. సమాజంలో జరిగే దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చేవారిపై కేసులు బనాయించడం భావప్రకటనా స్వేచ్ఛపై దాడిచేయడమేనని విమర్శించారు. ప్రస్తుతం ఈ రకమైన ప్రమాదకర ధోరణి దేశమంతా కొనసాగుతోందన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనలపై స్వాతి తన ఫేస్బుక్లో పోస్ట్చేసిన ఓ కార్టూన్‌పై హిందూ సంఘటన్ అనే సంస్థ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. స్వాతితో పాటు టైమ్స్ నౌ జర్నలిస్ట్ షబ్బీర్ అహ్మద్‌లపై నమోదైన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని నర్సిం, శంకర్, మృత్యుంజయ, సుభానీ తదితర కార్టూనిస్టులు డిమాండ్ చేశారు. -
చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య
-
స్వాతి, రాజేశ్‌లకు 14రోజులు రిమాండ్
-
రాష్ట్రపతి కూతురు స్వాతి.. ఎయిర్‌హోస్టెస్ డ్యూటీ మారింది!
-
రాష్ట్రపతి కూతురు స్వాతి.. ఎయిర్‌హోస్టెస్ డ్యూటీ మారింది!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూతురు స్వాతి ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. అయితే, భద్రతా కారణాల రీత్య ఆమెకు తాజాగా కార్యాలయ విధులను ఎయిరిండియా అప్పగించింది. ఇంటిపేరు వినియోగించని స్వాతి ఇన్నాళ్లు ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాల్లో క్యాబిన్ సిబ్బందిగా పనిచేశారు. అయితే, గత నెల రోజుల నుంచి ఆమెకు ఎయిరిండియా ఇంటిగ్రేషన్ డిపార్ట్మెంట్లో విధులు అప్పగించారు. దీంతో ఎయిర్‌హోస్టెస్‌గా కాకుండా సంస్థ ప్రధాన కార్యాయలంలో ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. 2007లో విలీనమైన ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా ఉద్యోగులకు సంబంధించిన మానవ వనరుల విభాగాన్ని ఇంటిగ్రేషన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రపతి కూతురు కావడంతో ఆమె చుట్టూ భద్రతా సిబ్బంది ఉంటారని, కాబట్టి ఆమె క్యాబిన్ క్రూగా కొనసాగించి.. ఆమె చుట్టు ఉన్న భద్రతా సిబ్బందికి విమాన సీట్లు కేటాయించడం వీలుపడదని, అందుకే ఆమె విధులను మార్చినట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. -
అప్పుడు తమ్ముడు ఇప్పుడు అన్న..
-
వీడని నరేష్ కేసు మిస్టరీ
♦ బైక్ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు..? ♦ ఇప్పటికీ వివరాలు వెల్లడించని పోలీసులు సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేష్ హత్య కేసులో న్యాయం కోసం కుటుంబ సభ్యులు, అఖిలపక్ష ప్రజాసంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. నరేష్ హత్య వెనుక ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నరేష్ హత్య జరిగిన రోజు అతన్ని వాహనంపై ఎక్కించుకునిపోయిన మరో యువకుడి ఆచూకీ ఇంత వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. అలాగే నరేష్ హత్య అనంతరం అతడి శవాన్ని కాల్చి బూడిద చేసి మూసీలో కలిపిన అస్థికలకు సంబంధించిన నివేదిక ఇంకా బయటపెట్టలేదు. ఒక దశలో హత్యకు గురైంది నరేష్ అవునా.. కాదా..? అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోందని ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తానే నరేష్‌ను చంపానని స్వాతి తండ్రి పోలీసు విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే. నరేష్, స్వాతి ప్రేమ వివాహం అనంతరం ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఆత్మహత్య చేసుకోగా నరేష్ మిస్టరీని హత్యకు గురయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు మరణాల వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని సీబీఐ చేత విచారణ చేయించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నరేష్, స్వాతి మరణాల వెనుక స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరి హస్తం ఉందని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్, స్వాతిలు మే 2న ముంబాయి నుంచి భువనగిరికి వచ్చారు. అదే రోజు నరేష్ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడు కనిపించకుండాపోయాడని మే 5న భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 6వ తేదిన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నరేష్ హత్య అనంతరం నిజనిర్ధారణ కమిటీ గ్రామానికి చేరుకుని పలు అంశాలను సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న స్వాతి అంత్యక్రియలు జరిగిన చోట నరేష్ అంత్యక్రియలు జరిగిన ఆనవాళ్లు లేవని నిజనిర్ధారణ కమిటీ తేల్చలేదు. కనీసం శవం కూడా దొరక్కకుండా చేశారని ఆరోపించారు. బైక్‌పై పల్లెర్లకు... నరేష్, స్వాతిని భువనగిరి బస్టాండ్‌లో ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించిన అనంతరం మరో వ్యక్తితో కలిసి బైక్‌పై నరేష్ పల్లెర్ల గ్రామానికి వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. అయితే నరేష్‌ను వాహనంపై తీసుకుపోయింది ఎవరన్నది ఇంత వరకు తేలలేదు. మే 2న నరేష్ సోదరి సెల్ఫోన్లో మాట్లాడినప్పుడు అతను ఎల్బీనగర్ వెళ్తున్నట్లు నరేష్ చెప్పాడు. రాత్రి 11 గంటల తర్వాత ఫోన్ పనిచేయకపోవడంతో నరేష్ కుటుంబ సభ్యుల్లో అనుమానం పెరిగింది. మరో వైపు పోలీసులు సేకరించిన ఆధారాల వివరాలు వెల్లడించాలని నరేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నరేష్‌ను హత్య చేశారా లేక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హత్య కథనం సృష్టించారా అన్నది తేల్చాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు కులసంఘాలు, ప్రజాసంఘాలు సీఎంను కలిసే ఆలోచనలో ఉన్నాయి. కేసు ఇలా... మే 2న ముంబాయి నుంచి భువనగిరికి వచ్చారు. అదే రోజు స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి నరేష్, స్వాతిని అప్పగించారు. ఆ రోజు నుంచి నరేష్ కనిపించకుండాపోయాడు. మే 5న తన కుమారుడు కనిపించడం లేదని నరేష్ తండ్రి వెంకటయ్య భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 6న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 16వ తేదీన స్వాతి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. మే 27న ఎల్బీనగర్ పోలీసుల విచారణలో నరేష్‌ను తానే హత్య చేశానని స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. కేసు నమోదు చేశారు. మే 30న నిజనిర్ధారణ కమిటీ నరేష్, స్వాతిల స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలను సందర్శించి హత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. జూన్ 9న భువనగిరిలో నరేష్ హంతకులను శిక్షించాలని అఖిలపక్షాల సమావేశం జరిగింది. మే 12న సీఎంను కలవాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు ప్రయత్నించి విఫలమయ్యారు. జూన్ 16న సీఎస్‌ను కలిశారు. జూన్ 22న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసి నరేష్, స్వాతి హత్యోదంతంలో నిజనిజాలు తేల్చాలని విజ్ఞప్తి చేశారు -
నరేశ్, స్వాతి హంతకులను శిక్షించాలి
సీఎస్‌ను కలసిన అఖిలపక్ష నేతలు, నరేశ్ తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్న అంబోజి నరేశ్, స్వాతిలను హత్య చేసిన నేరస్తులను శిక్షించాలని, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ చట్టం తీసుకురావాలని పౌర, సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో అఖిలపక్ష నేతలు, అంబోజి నరేశ్ తల్లిదండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ.. సీఎస్ ఎస్పీ సింగ్‌ను కలసి వినతిప్రతం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నరేశ్ హత్య కేసుతోపాటు స్వాతి హత్య కేసునూ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు పట్ల నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హంత కుడైన శ్రీనివాస్‌రెడ్డి ఆస్తులు, భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, నరేశ్ తండ్రికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల భూమి, రక్షణ కల్పించాలన్నారు. -
అందుకే పేరు వేసుకున్నా : మారుతి
రక్షిత్, స్వాతి జంటగా ‘వీడు తేడా’ ఫేమ్ చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లండన్ బాబులు’. మారుతి టాకీస్ పతాకంపై దర్శకుడు మారుతి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ–‘‘స్వీట్ మ్యాజిక్ ప్రసాద్‌గారు ‘ఆండవన్ కట్టళై’ అనే తమిళ సినిమాను చూసి, నన్ను చూడమన్నారు. ఫక్తు కమర్షియల్ సినిమా అనుకున్నా, కానీ విజయ్ సేతుపతితో మాట్లాడాక చాలా ప్యాషన్‌తో చేశారని తెలిసింది. అందుకే రీమేక్ చేశాం. పాస్‌పోర్ట్ కోసం పడే తిప్పల్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. మామూలుగా నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ, నాకు ‘లండన్ బాబులు’ బాగా నచ్చడంతో వేసుకున్నా’’ అన్నారు. ‘‘సినిమాలకు దూరంగా వైజాగ్‌లో ఉన్న నన్ను పిలిచి మరీ మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. రక్షిత్ అనే మంచి హీరోని పరిచయం చేశాననే ఆనందం నాకు ఎప్పుడూ ఉంటుంది’’ అన్నారు చిన్నికృష్ణ. రక్షిత్, స్వాతి, హీరో నిఖిల్, దర్శకులు పరశురామ్, అనిల్ రావిపూడి, సుధీర్‌వర్మ, చందు మొండేటి, ‘డార్లింగ్’ స్వామి, శ్రీకాంత్ అడ్డాల, నటులు జీవా, ఉద్ధవ్, విఠల్, అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: కె. -
నరేశ్, స్వాతి కేసులో పోలీసు అధికారులపై చర్యలు
సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలకు చెందిన నరేశ్ హత్య, స్వాతి ఆత్మహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధి కారులపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. ఈమేరకు బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. భువనగిరి డీసీపీ పాలకుర్తి యాదగిరి, భువనగిరి ఏసీపీ సాదు మోహన్‌రెడ్డిలకు మెమోలు, రామన్నపేట సీఐ శ్రీనివాస్, భువనగిరి పట్టణ సీఐ శంకర్‌గౌడ్‌లకు చార్జ్ మెమోలు ఇచ్చారు. ఆత్మకూర్(ఎం) ఎస్ఐ శివనాగప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అదే విధంగా మోత్కూరు ఎస్ఐ కె.రవికుమార్ భూ వివాదంలో రూ.40వేలు డిమాండ్ చేయడంతో సీపీ సస్పెండ్ చేశారు. -
పథకం ప్రకారమే హత్య?
ప్రేమికులు నరేశ్, స్వాతిని పథకం ప్రకారమే హత మార్చినట్లు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రేమ వివాహం చేసుకుని దారుణ హత్యకు గురైన నరేశ్–స్వాతి స్వగ్రామాలైన పల్లెర్ల, లింగరాజుపల్లిని వారు మంగళవారం సందర్శించి వివరాలు సేకరించారు. ఆత్మకూరు(ఎం)(ఆలేరు): ప్రేమికులు నరేశ్, స్వాతిది పథకం ప్రకారం జరిగిన హత్యలేనని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు లభించకుండా పోలీసులు నిందితులకు సహకరించారని వారు ఆరోపించారు. ప్రేమించి వివాహం చేసుకుని దారుణ హత్యకు గురైన నరేశ్–స్వాతి స్వగ్రామాలైన పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలను తెలంగాణ రాష్ట్ర పౌర సామాజిక ప్రజా సంఘాల నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పాశం యాదగిరి, జాన్‌వెస్లీ, భూపతి వెంకటేశ్వర్లు, పైళ్ల ఆశయ్య, ఆశలత, కూరపాటి రమేష్ . మంగళవారం వారి స్వగ్రామాలైన పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలను సందర్శించారు. నరేశ్ తల్లిదండ్రులు అంబోజు వెంకటయ్య, ఇందిరమ్మ సోదరి నీలిమలను కమిటీ సభ్యులు వారి గృహంలో పరామర్శించారు. అనంతరం నరేశ్–స్వాతిల ప్రేమ వివాహం సంఘటన పూర్వ పరాలను హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు వారి బంధువులను, గ్రామస్తులను విచారించారు. అనంతరం స్వాతి స్వగ్రామమైన లింగరాజుపల్లిని సందర్శించారు. నిందితుడు తుమ్మల శ్రీనివాసరెడ్డి వ్యవసాయ బావి వద్ద నరేశ్–స్వాతిలను దహనం చేసిన ప్రదేశాలను పరిశీలించారు.శ్రీనివాసరెడ్డి చెబుతున్న విధంగా నరేశ్‌ను వ్యవసాయ బావి వద్ద కంది పొరక, టైర్లు వేసి మృతదేహాన్ని దహనం చేసినానని చెబుతున్న తీరుకు సంఘటన జరిగిన స్థలానికి పొంతన లేదని నిర్ధారణకు వచ్చారు. ఎట్టి పరిస్తితుల్లోనూ నరేశ్ మృతదేహాన్ని పరిసరాలను పరిశీలించి చూసినట్లయితే ఇక్కడే కాల్చి, వేసినట్లుగా తగిన ఆధారాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి నరేశ్ హత్యను చట్ట పరంగా దొరకకుండా పోలీసు అధికారుల సలహాలు, సూచనలతోనే శ్రీనివాసరెడ్డి హత్య చేసినట్లు ఆరోపించారు. తర్వాత శ్రీనివాసరెడ్డి ఇంటిని సందర్శించారు. తాళం వేసి ఉండటంతో పరిసరాలతో పాటు ఆవరణలో ఉన్న స్వాతి ఆత్మహత్యకు పాల్పడిన బాత్రూమ్ను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో స్వాతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడే ఆవకాశం లేదన్నారు. నరేశ్–స్వాతిలను ఈ నెల 18న హైకోర్టులో హాజరు పరుచాల్సి ఉండగా అప్పటికే నరేశ్‌ను హత్య చేసిన శ్రీనివాసరెడ్డి తన కూతురును కూడా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించి ఉండవచ్చునని వారు నిర్ధారణకు వచ్చారు. అంబోజు వెంకటయ్య బంధువులకు ఫోన్లు చేసి బెదిరించాడని, అంతే కాకుండా చంపుతానని హెచ్చరించినట్లు నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. వారి వెంట సభ్యులు ఎండీ జహంగీర్, రమ, గోపాల్, ఎంవీ రమణ, బాలకృష్ణ, అబ్బాస్, ప్రసాద్, ఆశాలత, మల్లు లక్ష్మి, ప్రభావతి, అనురాధ, కట్ట నర్సింహ, ఉడుత రవీందర్, కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, నీలం వెంకన్న, నాగరాజు, కొండమడుగు నర్సింహ, కీసరి అరుణ, సిర్పంగ స్వామి, అబ్ధుల్లాపురం వెంకటేషం, మాటూరి బాలరాజు ఉన్నారు. పోలీస్‌లపై హత్యానేరం కేసు నమోదు చేయాలి నరేశ్ హత్య, స్వాతి ఆత్మహత్య వ్యహారంలో పూర్తి వైఫల్యం పోలీసులదే. వారిపై హత్యనేరణం కేసులు నమోదుచేయాలి. అందుకు బాధ్యులైన రామన్నపేట , భువనగిరి సీఐలు , ఆత్మకూరు ఎస్ఐ సస్పెండ్‌చేసి ప్రాసిక్యూట్ చేయాలి. మానవీయ కోణంలో కేసును చూడాలి. – పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలి... నరేశ్, స్వాతి హత్యలపై ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసి 3నెలల్లో తీర్పు వెలవరించాలి. నిందితులను గుర్తించి తగు శిక్ష విధించాలి. భవిష్యత్తులో ఈ లాంటి సంఘటనలు పునరావృతంకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నరేశ్,స్వాతి దారుణహత్యలో రామన్నపేట, ఆత్మకూరు పోలీసులు నేరస్తులకు సహకరించినట్లుగా ఉంది. – మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి..... హత్యకు గురైన నరేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. యాదాద్రి జిల్లా కేంద్రానికి పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలు సమీపంలో ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా కలెక్టర్ సందర్శించక పోవడం విచారకరం.నిందితులు ఎంతటివారైనప్పటికీ కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ప్రభావతి, ఐద్వా జిల్లా కార్యదర్శి -
నరేశ్‌ను చంపింది అక్కడ కాదా..?
► ఇంటి వద్దనే పట్టుకుని చంపి కాల్చేశారా.. లేక మరోచోట చంపి శవం దొరకకుండా చేశారా? ► నరేశ్, స్వాతి కేసులో కొత్త కోణాలు సాక్షి, యాదాద్రి: కులాంతర వివాహం చేసుకున్న నరేశ్ హత్యపై కొత్త కోణాలు వెలుగు చూస్తు న్నాయి. నరేశ్ హత్యకు గురైతే, స్వాతి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, ఈ రెండు విషయాల్లో స్పష్టత లేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. నరేశ్, స్వాతి హత్యల వెనుక శ్రీనివాస్‌రెడ్డి తోపాటు మరికొంత మంది పెద్దలు ఉన్నారని వారందరినీ గుర్తించి శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తన కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో నరేశ్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి హత్య చేశా డని పోలీసులు తెలిపారు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారం గ్రామంలో సందర్శిం చినప్పుడు పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. మే 2న ముంబై నుంచి వచ్చిన నరేశ్, స్వాతిని ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగిం చాడు. ఆ సమయంలో నరేశ్‌తో అతని సోదరి సెల్ఫోన్లో మాట్లాడినప్పుడు తాను ఎల్బీనగర్ వైపు వెళ్తున్నానని చెప్పాడు. 11 గంటల తర్వాత ఆ సెల్‌ఫోన్ పనిచేయలేదు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాత్రం స్వాతి అంత్యక్రియలు నిర్వ హించిన ప్రాంతంలో నరేశ్ అంత్యక్రియలు జరగలేదని చెబుతున్నారు. నరేశ్‌ను ఇక్కడే కాల్చి చంపిన ఆధారాలు లేవని గ్రామస్తులంటున్నారు. పోలీసుల ప్రకారం నరేశ్‌ను శ్రీనివాస్‌రెడ్డి మరో వ్యక్తితో కలసి వాహనంపై తీసుకుపోయి తన వ్యవసాయ పొలంలో చంపి కాల్చివేసి బూడి దను మూసీలో కలిపాడని చెప్పారు. ఇదంతా కట్టు కథ అని నరేశ్ శవం కూడా దొరకకుండా శ్రీనివాస్‌రెడ్డే మాయం చేశాడని కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నరేశ్ మరణం విషయం తెలిసినప్పటికీ చాలామంది భయంతో బయటకు చెప్పలేకపోయారని తెలుస్తోంది. దీంతో పాటు నరేశ్‌ను చంపేశామన్న సంతోషంలో రెండుసార్లు గ్రామంలో విందు భోజనాలు ఏర్పాటుచేశారు. నరేశ్‌ను నిజంగా ఇంటి వద్దనే పట్టుకుని చంపి కాల్చేశారా.. లేక మరోచోట చంపి శవం దొరక కుండా చేశారా? అన్నది తాజాగా చర్చనీ యాంశంగా మారింది. నరేశ్ మరణం విషయం తెలిసిన స్వాతి కోర్టులో నిజం చెబితే తనకు శిక్ష పడుతుందన్న భయంతోనే శ్రీనివాస్‌రెడ్డి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. కొనసాగుతున్న విచారణ నరేష్, స్వాతి మరణాలపై ఆందోళన లు జరుగుతున్నందున రాచకొండ పోలీసు లు విచారణ ముమ్మరం చేశారు. సోమవా రం చౌటుప్పల్ ఏసీపీ స్నేహిత, రామన్నపేట సీఐ శ్రీనివాస్‌తో కలిసి స్వాతి తల్లి పద్మను ఆమె ఇంటిలో కలిసి విచారించారు. ఈ మొత్తం కేసులో స్వాతి తల్లిని ఇంతవరకు ఎవరూ ప్రశ్నించలేదు. మరోవైపు ఆత్మకూరు (ఎం) ఎస్ఐ శివనాగప్రసాద్‌ను హైదరాబాద్‌కు పిలిపించి విచారించారు. ఈ కేసులో పోలీసులపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులు నిజనిజాలు తేల్చాలని విచారణ ముమ్మరం చేశారు. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డిని రిమాండ్ నుంచి మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు చర్యలు ప్రారంభించారు. -
‘పోలీసులే ఈ ఘోరానికి కారకులు’
-
‘పోలీసులే ఈ ఘోరానికి కారకులు’
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన అంబోజు నరేశ్, స్వాతి చావుకు భువనగిరి పోలీసులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని అన్నారు. నరేశ్ అదృశ్యంపై ఫిర్యాదుపై చాలా రోజుల వరకు పోలీసులు స్పందించలేదని అతడి కుటుంబ సభ్యులు వాపోయారు. భువనగిరి డీసీపీ యాదగిరి ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆరోపించారు. మేజర్ల పెళ్లి వియషంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించారు. పెళ్లైన వారానికే ఎందుకు స్వాతి-నరేశ్‌ను ముంబై నుంచి ఎందుకు రప్పించారని నిలదీశారు. మళ్లీ రెండోసారి వీరిని ఆత్మకూరు రప్పించడంలో పోలీసుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మకూరు, రామన్నపేట, భువనగిరి పోలీసుల తీరుపై నరేశ్ బంధువులు మండిపడ్డారు. భువనగిరి పోలీసులపై చర్యల్లేవా, ఈ దారుణానికి భువనగిరి పోలీసులు బాధ్యులు కారా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, పోలీసుల వ్యవహారశైలిపై వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సంబంధిత కథనం: హత్య చేసి.. ఆపై కాల్చేసి.. -
హత్య చేసి.. ఆపై కాల్చేసి..
► వీడిన నరేశ్ మిస్సింగ్ మిస్టరీ ► దారుణంగా హతమార్చిన స్వాతి తండ్రి సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: ‘మిస్సింగ్’మిస్టరీ వీడింది.. ప్రేమ పెళ్లి విషాదాంతమైంది.. యాదాద్రి జిల్లా భువనగిరిలో అదృశ్యమైన అంబోజు నరేశ్ దారుణ హత్యకు గురైనట్లు తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి తండ్రే ఆయన్ను అత్యంత దారు ణంగా హతమార్చాడు. సమీప బంధువుతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు రాచకొండ పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి, అతడి భార్య సోదరి కొడుకు నల్ల సత్తిరెడ్డిలను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శనివారం వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఎల్బీనగర్ డీసీపీ ఎంవీ రావు నేతృత్వంలో దర్యాప్తు చేశామని, తన 21 ఏళ్ల సర్వీసులో ఇంతటి క్లిష్టమైన కేసును చూడలేదని మహేశ్ భగవత్ వ్యాఖ్యానించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... ఫేస్బుక్.. ప్రేమ.. పెళ్లి.. యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం లింగ రాజుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ మండల నాయకుడు తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి కూతురు స్వాతితో ఇదే మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేశ్‌కు రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. నరేశ్ తల్లిదం డ్రులు ముంబైలో ఉంటున్నారు. పల్లెర్లలో తాత వద్ద ఉంటూ నరేశ్ భువనగిరిలో డిగ్రీ చదివాడు. స్వాతి వలిగొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదివింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మార్చి 24న ముంబై వెళ్లిన వీరు మరుసటి రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో తన కూతురు అదృశ్యమైందంటూ నరేశ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకూరు (ఎం) పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. రామన్నపేట ఇన్స్పెక్టర్ కోరడంతో ముంబై నుంచి నరేశ్, స్వాతి మార్చి 27న రామన్నపేట వచ్చారు. అదే రోజు స్వాతి తన తండ్రితో వెళ్లిపోగా.. నరేశ్ ముంబై వెళ్లాడు. స్వాతిని కుటుంబీకులు ఉప్పల్‌లో ఉన్న ఆమె సోదరి వద్ద ఉంచారు. ఇదిలా ఉండగా.. మార్చి 31న స్వాతి మళ్లీ ముంబైలో ఉన్న భర్త నరేశ్ వద్దకు వెళ్లింది. మే 2న తిరిగి వచ్చిన దంపతులు.. స్వాతి అత్తారింటికి వెళ్లిన తర్వాత పలుమార్లు తన తండ్రితో మాట్లాడింది. అక్కడ తన పరిస్థితులు బాగోలేదంటూ పలుమార్లు చెప్పుకుంది. ఈ పరిణా మాల నేపథ్యంలో ఈ నెల 2న నరేశ్, స్వాతి ముంబై నుంచి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం స్వాతి తన తండ్రికి చెప్పింది. దీంతో ఆ రోజు రాత్రి సత్తిరెడ్డితో కలసి అతడి కారులోనే శ్రీని వాస్‌రెడ్డి భువనగిరి వెళ్లాడు. తర్వాత స్వాతిని తీసు కొని శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి లింగరాజుపల్లికి వచ్చారు. బైక్‌ను వెంబడించగా... ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో సిగరెట్ కాల్చుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటి ముందు తెల్లరంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై సంచరిస్తు న్నట్లు గమనించాడు. మరో గంట తర్వాత కూడా అలాగే జరగడంతో అతడెవరో చూద్దామన్న ఉద్దేశంతో ఇంట్లో ఉన్న సత్తిరెడ్డితో కలసి శ్రీనివాస్‌రెడ్డి మరో బైక్‌పై వెంబడించారు. శ్రీనివాస్‌రెడ్డి వెళ్తూ తన వెంట ట్రాక్టర్ రాడ్ కూడా తీసుకువెళ్లాడు. దాదాపు 1.5 కి.మీ. వెంటపడినా ద్విచక్ర వాహనదారుడిని అందుకోలేకపోయారు. అయితే శ్రీనివాస్‌రెడ్డి పొలా నికి సమీపంలో మరో వ్యక్తి.. తమ ముందు వెళ్తున్న బైక్‌ను ఆపడానికి యత్నించాడు. కానీ బైక్ ఆగకుండా వెళ్లిపోయింది. ఆ బైక్‌ను అపేందుకు యత్నించిన వ్యక్తి ఎవరా అని దగ్గరకు వెళ్లి చూడగా అతడిని నరేశ్‌గా గుర్తించారు. పొలంలోనే చంపి కాల్చేశారు... తమ కంటపడ్డ నరేశ్‌ను.. ఇక్కడకు ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? అంటూ శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి ప్రశ్నించారు. అనంతరం బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకొని సమీపంలో ఉన్న తమ కంది చేను వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నరేశ్, సత్తిరెడ్డి కూర్చు ని మాట్లాడుకుంటుండగా.. వెనుక నుంచి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి ట్రాక్టర్ రాడ్‌తో మెడ భాగంలో బలంగా కొట్టాడు. దీంతో నరేశ్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత సమీపంలో ఉన్న కందికట్టలో మృతదేహాన్ని పడేసి నిప్పుపెట్టారు. శవం సగమే కాలడంతో ఆత్మ కూరు(ఎం)లోని పెట్రోల్‌బంక్‌కు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి ఐదు లీటర్ల పెట్రోల్ తెచ్చారు. తమ పొలంలో ఉన్న టైర్ల మధ్యలో మృతదేహాన్ని ఉంచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. తర్వాత శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటికి, నరేశ్ సెల్‌ఫోన్ తీసుకున్న సత్తిరెడ్డి బోడుప్పల్‌లోని తన ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు(మే3) సాయంత్రం మౌలాలీ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లిన సత్తిరెడ్డి నరేశ్ సెల్‌ఫోన్ ధ్వంసం చేశాడు. పొలం వద్దకు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి గన్నీ బ్యాగ్‌లో నరేశ్ అస్థికలను తీసుకెళ్లి వేములకొండ– లక్ష్మాపూర్ మధ్యలో మూసీలో కలిపేశాడు. గన్నీబ్యా గ్ను సమీపంలో పొదల్లోకి విసిరేసి ఇంటికి వెళ్లిపో యాడు. కాగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీపీఎం డిమాండ్ చేసింది. బాత్రూంలో ఉరేసుకున్న స్వాతి.. నరేశ్ మిస్సింగ్‌పై అతడి తల్లిదండ్రులు మే 6న భువనగిరి ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరుసటి రోజు విచారణ కోసం శ్రీనివాస్‌రెడ్డిని పోలీసుస్టేషన్‌కు పిలిచారు. దీంతో పోలీసులు తనను, తన తండ్రిని వేధిస్తున్నా రంటూ స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత 12న మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన స్వాతి.. 16న బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో తన తండ్రి సెల్ఫోన్లో అత్తారింటి వేధింపులు అంటూ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఈ నెల 18న నరేశ్ తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ ఫైల్ చేయడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు 22న ఎల్బీనగర్ డీసీపీ నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది. అనుమా నంతో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిం చగా.. నరేశ్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తదుపరి దర్యాప్తు, ఆధారాల సేకరణ కోసం శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డిని న్యాయస్థానం అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. చిక్కుముడులు ఇంకా ఉన్నాయి ఈ కేసులో ఇంకా కొన్ని చిక్కుముడులున్నాయి. ఆత్మహత్య చేసుకునేప్పటికి స్వాతి నెల రోజుల గర్భిణి. పోస్టుమార్టంలో ఇది ఆత్మహత్యగా తేలినా... వైరల్ అయిన ఆమె 3 సెల్ఫీ వీడియో లు స్వాధీనం చేసుకున్నాం. ఇది సెల్ఫీయా? కాదా.. అనేది నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి గతంలోనూ నేరచరిత్ర ఉందని తెలుస్తోంది. 25 ఏళ్ల కిందట వారింట్లో కొందరు చనిపోగా.. అతడి అనుచరుడిపై కేసు నమోదైంది. నరేశ్ హత్య జరిగిన రోజు అతడితో వచ్చిన తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి ఎవరో గుర్తించాల్సి ఉంది. నరేశ్‌తో వెళ్లిన తర్వాత ముంబైలో తన కుమార్తె గురైన ఆవేదనకు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నాడు. ఇందులో నిజానిజాలు నిర్ధారించాల్సి ఉంది. – మహేశ్ భగవత్, రాచకొండ సీపీ -
లండన్ ప్రయాణం
రక్షిత్, కలర్స్ ‘స్వాతి’ జంటగా నటిస్తున్న చిత్రం ‘లండన్ బాబులు’. తమిళ చిత్రం ‘ఆండవన్ కట్టళై’’కి ఈ చిత్రం రీమేక్. ఏవీఎస్ స్టూడియోస్ సమర్పణలో దర్శక– నిర్మాత మారుతి తెలుగులో నిర్మిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకుడు. చిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘హీరో లండన్ ఎలా వెళ్లాడు? ఎందుకు వెళ్లాడన్నది చిత్రకథాంశం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్. -
ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెపై అత్తింటివారు దాడి చేయ డంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో హైదరా బాద్‌లోని ఆర్కేపురం సౌభాగ్యపురం కాలనీలో తల్లిదం డ్రుల ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున స్వాతి బాత్రూమ్ క్లీనర్ హార్పిక్ తాగింది. అపస్మారకస్థితికి చేరుకున్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోందని, 72 గంటలు గడిస్తేగాని పరిస్థితి చెప్పలేమని, గొంతు ఇన్ఫెక్షన్కు గురైందని, అన్నవాహిక పూర్తిగా దెబ్బతిన్నదని ఓమ్ని ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. అత్తింటివారి వేధింపుల వల్లే.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగి రిగుట్ట మండలం రాళ్లజనగాంకు చెందిన గూడూరు మధుకర్‌రెడ్డి, స్వాతిరెడ్డి దంపతులు కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ నెల 4న మధుకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ‘మధుకర్‌రెడ్డిని నువ్వే హత్య చేశావని స్వాతిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ వారి బంధువు రవీందర్‌రెడ్డి, మామ బాల్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని స్వాతి తండ్రి నర్సింహారెడ్డి ఆరోపించారు. వారి వేధింపులు తాళలేకనే తన కూతురు ఆత్మహత్యకు యత్నించిందని తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, తమకు రక్షణ కల్పించా లని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నలుగురిపై కేసు నమోదు ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి ఆత్మహత్యాయత్నం ఘటనలో చైతన్యపురి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. తనను అత్తింటి వారు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని స్వాతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె అత్త సుగుణ, మామ బాల్‌రెడ్డి, ఆడపడుచు కల్పన, కల్పన భర్త రవీందర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ గురురాఘవేంద్ర తెలిపారు. -
స్వాతి ముందే చెప్పింది!
మధుకర్ భార్య స్వాతి. అన్ని విషయాలూ ముందే చెప్పింది. భర్త డిప్రెషన్లో ఉన్నాడనీ.. కోపం అదుపులో ఉంచుకోలేకపోయేవాడనీ.. చెయ్యి చేసుకునేవాడనీ.. మధుకర్‌కి తను సైకలాజికల్ సపోర్టు ఇచ్చినా సైకియాట్రిక్ సపోర్టు అవసరమనీ.. ‘మనకు ఆస్తులు వద్దు.. సంతోషంగా ఉందాం’ అనీ.. మధుకర్ చనిపోకముందే స్వాతి ఇద్దరి పేరెంట్స్‌కీ, తన భర్తకు.. ముందే చెప్పింది! ‘సాక్షి’కి కూడా స్వాతి ముందే చెప్పింది. తను ఆత్మహత్యాయత్నం చేయకముందే స్వాతి సాక్షికి అన్నీ చెప్పింది. (అమెరికాలో పది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై మధుకర్‌రెడ్డి భార్య స్వాతి.. అత్తింటి వారు తనపై చేస్తున్న ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెంది నిన్న శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకు కొన్ని గంటల ముందు గురువారం నాడు ‘సాక్షి’తో స్వాతి మాట్లాడింది. ఆ వివరాలు.) అసలు ఏం జరిగింది? మేము సియాటెల్‌లో ఉంటాం. అక్కడి నుంచి నేను పనిచేసే చోటుకు మూడు గంటల ప్రయాణం. ఎప్పటిలాగే ఆ రోజూ (ఏప్రిల్ 3) ఆఫీస్‌కి వెళ్లాను. మధ్యాహ్నం రెండు గంటలప్పుడు కాల్ చేశాను మధుకి ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి. ‘మధూ.. రోజూ ఇంత దూరం జర్నీ చేసి రావక్కర్లేదు. ఇకనుంచీ సియాటెల్‌లో ఉన్న బ్రాంచ్‌లోనే నేను వర్క్ చేయొచ్చు అన్నారు మేనేజర్’ అని చెప్పా. ‘గుడ్ న్యూసే. రోజూ పొద్దున్నే లేచి హడావిడిగా కుక్ చేయడం, అంత దూరం జర్నీ చేయడం అన్నీ తప్పుతాయి స్వాతీ’ అని చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత అంటే మధ్యాహ్నం టూ థర్టీకేమో వాళ్ల ఆఫీస్ నుంచి శ్రీనివాస్ నాగేంద్ర అని ఆయన కొలీగ్‌తో చాట్ చేశాడు (ఆ స్క్రీన్ షాట్ ‘సాక్షి’కి చూపించింది స్వాతి). అందులో.. శ్రీనివాస్ అడిగాడు మధుని.. ఎబాప్ (ఎబిఎపి), ఎస్ఏపి తెలిసిన వాళ్లెవరైనా ఉన్నారా? మేనేజర్ అడుగుతున్నాడు’ అని. ‘నన్ను తీసేసే ప్రయత్నం జరుగుతోందా?’.. మధు. ‘అట్లా ఏం కాదు. చాలా వర్క్ ఉంది కదా. అందుకే’.. శ్రీనివాస్.‘ఏం కాదు. నన్ను తీసేస్తారేమో. ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా.. (అప్పటికే యేడాదిగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాడు మధు. అతని ఆఫీస్ ఆర్గాన్లో. అప్పుడప్పుడూ ఆఫీస్‌కు వెళుతూ రెగ్యులర్‌గా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాడు)‘అలా అయితే ముందుగా నన్ను తీసేస్తారు. అబాప్, ఎస్ఏపి తెలిసిన వాళ్లుంటే చెప్పు’.. శ్రీనివాస్. ఈ సంభాషణ రెండున్నర నుంచి మూడున్నర మధ్యలో జరిగింది. మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు? ఎప్పటిలా సాయంత్రం వచ్చాను. అప్పటికే మధు హ్యాంగ్ చేసుకొని ఉన్నాడు! భయమేసి గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాను. రోడ్డు మీద వెళ్తున్నవాళ్లు ‘ఏమైంది?’ అంటూ అడిగారు. చెప్పాను. వాళ్లు లోపలికి వచ్చారు సాయం చేయడానికి. ఈలోపు నేను 911కి కాల్ చేశాను. రెండు నిమిషాల్లోనే 911 వచ్చింది. వెంటనే సీపీఆర్ చేశారు. రెస్పాండ్ కాలేదు. ఇంకో ఫిప్టీన్ మినిట్స్ ఏవో మెడికల్ టెస్ట్స్ చేసి, చనిపోయాడు అని చెప్పారు. బహుశా 3.30 టు 5.30 మధ్యలో హ్యాంగ్ చేసుకొని ఉండొచ్చన్నారు. జాబ్ గురించి ఏమైనా టెన్షన్ వల్ల అలా చేసి ఉండొచ్చా? కావచ్చు. చాలా కాలంగా ఆయన డిప్రెషన్‌తో ఉన్నారు. 2016 నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తరచు మారే ఆయన మూడ్స్‌తో నేనూ సఫర్ అవుతుంటే.. నేనే చెప్పాను. డాక్టర్ దగ్గరకు వెళ్దామని. ఈ మధ్యనే అలా ఉంటున్నాడా? పెళ్లయినప్పటి నుంచీ అంతే. పెళ్లయిన మూడోరోజు మా ఇంట్లో ఫంక్షనయ్యాక మేమిద్దరం కలిసి వాళ్లింటికి వెళ్లాలి. కాని నన్ను అలా వదిలేసి ఆయన ఒక్కరే వెళ్లిపోయారు. మళ్లీ వన్ అవర్‌కి వచ్చి ‘సారీ.. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. ఈ రోజు ఇక్కడే ఉందామన్నారు. మళ్లీ ఒక గంటకు .. ‘వెళ్లిపోదాం’ అన్నారు. ఇలా ఆయన మూడ్ మారడం నాకు చిత్రంగా అనిపించింది. పదిరోజుల తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే.. ఏంటి ఇది అని అడిగాను. ‘నేనిలాగే ఉంటా.. నీకు ఇష్టమైతే రా.. లేకపోతే లేదు’ అన్నారు. నేను చాలా హర్ట్ అయ్యాను. మా ఇంటికొచ్చి మా పేరెంట్స్‌కీ చెప్పాను.. ‘ఆయన ప్రవర్తన నాకు అర్థంకావట్లేదు. నేను వెళ్లను’ అని. మా ఆడపడచు (మధు అక్కయ్య) వచ్చి బతిమాలింది. మా అత్తయ్య, మామయ్య కూడా ‘చిన్న విషయానికే అలా అంటే ఎట్లా..? సర్దుకుపోవాలి. మేమూ మా వాడికి నచ్చచెప్తామని’ నన్ను కన్విన్స్చేశారు. అప్పుడు మా ఆడపడచు ఒక మాట అంది.. ‘మధుని ఇన్ని రోజులు మేం భరించాం. ఇప్పటినుంచి నువ్వు భరించాలి’ అని. ఆ మాట అప్పుడు నాకు అర్థంకాలేదు. యూఎస్ ఎప్పుడు వెళ్లారు? మా పెళ్లికి ముందు నుంచే.. అంటే 2007 నుంచే మధు యూఎస్‌లో ఉండేవారు. 2010 డిసెంబర్లో మా పెళ్లయింది. 2011 జనవరిలో తనతో యూఎస్ వెళ్లా. అక్కడ ఎలా ఉండేది ఆయన ప్రవర్తన? అక్కడికెళ్లాక ఫస్ట్ లాస్‌వేగాస్ ట్రిప్‌కి వెళ్లాం. అక్కడా అంతే. నడుస్తూ నడుస్తూ నన్ను వదిలేసి వెళ్లిపోయేవారు. మళ్లీ సారీ అంటూ వెనక్కి వచ్చేవారు. ఇంట్లో కూడా మూడీగా ఉండేవారు. గదిలోకి వెళ్లి తలుపేసుకునేవారు. కోపమొస్తే ఇంట్లో వస్తువులు అన్నీ విసిరేసేవారు. నా మీద చేయి చేసుకునేవారు. మళ్లీ కూల్ అయిపోయి ‘సారీ.. ఇంకెప్పుడూ అలా చేయను’ అని బతిమాలేవారు. అరేంజ్డ్ మ్యారేజా ? లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే! నిశ్చితార్థం అయ్యాక నెలకు పెళ్లి అయింది. ఆ నెల రోజుల్లో మధు మీతో ఎలా ఉన్నారు? అయిదారుసార్లేమో మాట్లాడుకున్నాం. కొత్తకదా.. షై ఫీలింగ్ అనుకున్నా. పెళ్లయినా అంతే. యూఎస్‌లో కూడా అంతే. ఒక్కరు ఉండడానికే ఇష్టపడేవారు. వాళ్లవాళ్లకు చెబితే ‘పెళ్లికి ముందు మూడేళ్లు ఒంటరిగా ఉన్నాడు కదా.. అదే అలవాటైంది’ అన్నారు. అసలు పెళ్లికంటే ముందే ‘మావాడు ఎవరితో ఎక్కువ మాట్లాడడు’ అని చెప్పారు. కావచ్చు అనుకున్నాం. వాళ్ల అన్నయ్య కూడా ఇంతే. ఎప్పుడు బాగుంటాడో.. ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు. కోపమొస్తే ముందు ఏది ఉంటే అది విసిరేస్తాడు. ఫిట్స్ కూడా వస్తాయి. అందుకే ఆయన కార్ డ్రైవ్ చేయడు. అతనూ రెండుసార్లు సూసైడ్ ఎంటెంప్ట్ చేశాడట. మొన్నీమధ్యే తెలిసింది. మధు ప్రవర్తన గురించి సీరియస్‌గా ఎప్పుడూ వాళ్లవాళ్లతో కాని, మీ వాళ్లతోకాని చెప్పలేదా మీరు? ఎందుకు చెప్పలేదూ. మా అత్తగారు వాళ్లు నేను చెప్పేదేదీ సీరియస్‌గా తీసుకోలేదు. పైగా నేనే వాళ్ల అబ్బాయిని ఇబ్బంది పెడ్తున్నానని తప్పుడు కామెంట్స్ చేసేవాళ్లు బంధువుల దగ్గర. 2015లో.. ‘ఇక లాభంలేదు.. మనం ఇండియా వెళ్లి మీ వాళ్లతో, మా వాళ్లతో మాట్లాడి ఒక సొల్యూషన్కి వద్దామని’ చెప్పాను. వీసా స్టాంపింగ్ ప్రాబ్లమని ఆయన ఆగిపోయారు. నేను మాత్రం వచ్చాను పాపను తీసుకొని. మా అత్తగారూ వాళ్లకి చెప్పాను మధు విషయం. యాజ్ యూజువల్‌గా వాళ్లు సీరియస్‌గా తీసుకోలేదు. సర్దుకుపొమ్మనే చెప్పారు. మా వాళ్లూ అంతే.. పాప ఉంది కదా.. సర్దుకుపో. ఓపిక పట్టు.. ఆయనే మారతాడు’ అని మళ్లీ కన్విన్స్ చేశారు. తిరిగి యూఎస్ వచ్చాను. మార్పు కనపడిందా? లేదు. సిచ్యువేషన్‌ని నేను కూడా హ్యాండిల్ చేయలేకపోయాను. అందుకే 2016లో డాక్టర్‌కి చూపించుకొమ్మని రిక్వెస్ట్ చేశాను. విన్నాడు. ముందు ఇద్దరం కలిసే ఫిజీషియన్ దగ్గరకు వెళ్లాం. ఫిజీషియన్ సైకియాట్రిస్ట్‌కు సజెస్ట్ చేశారు. సైకియాట్రిస్ట్ దగ్గరకు ఒక్కరే వెళ్లారు. కూడా నేను వెళితే ఓపెన్ కాలేడోమో అని నేను వెళ్లలేదు. ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాక బాగున్నాడా? మందులు వేసుకుంటే బాగుండేవాడు. నలుగురితో మాట్లాడేవాడు. హుషారుగా ఉండేవాడు. నాతోకూడా బాగానే ఉండేవాడు. కాని డ్రౌజీనెస్ అనిపిస్తోందని అప్పుడప్పుడు మందులు మానేసేవాడు. అప్పుడు మాత్రం మళ్లీ మొదటికొచ్చేది పరిస్థితి. అసలు తనకు డిప్రెషన్ ఉందని ముందు ఆయనే రివీల్ చేశాడు పెళ్లయి యూఎస్ వెళ్లిన కొత్తలో నన్ను కొట్టాక. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా డాక్టర్‌కి చూపించుకొమని. పెళ్లికి ముందు ఈ విషయాన్ని వాళ్ల వాళ్లు గమనించలేదా? అసలాయన ఎప్పుడూ వాళ్ల పేరెంట్స్‌కి దగ్గర లేడు. వాళ్ల సొంతూరు భువనగిరి. చదువు కోసం ఆయనను హైదరాబాద్‌లో వాళ్ల బంధువుల ఇంట్లో పెట్టారు. ఇంటర్‌కి హాస్టల్. తర్వాత బిట్స్ పిలానీలో బీఫార్మసీ చేశాడు. ఆ తర్వాత యూఎస్. వాళ్ల ఫ్యామిలీతో ఆయనకు పెద్దగా అటాచ్మెంట్ కూడా లేదు. మధు చనిపోయాక కూడా వాళ్ల రాద్ధాంతం అంతా ఆస్తి గురించే. నా కూతురి పేర వాటా అడుగుతానని భయం. పాప పేర ఆస్తి ఇవ్వమంటారేమో అని రాద్దాంతం అన్నారు.. ఆమె వాళ్ల కొడుకు కూతురే కదా! ప్రేమ ఉండదా? వాళ్లకు మనవరాలు పుట్టడం ఇష్టం లేదు. అప్పటికే మధు వాళ్లన్నయ్యకు ఇద్దరు పాపలు. మాకూ కూతురే పుట్టేసరికి చాలా నారాజ్ అయ్యారు. మా పేరెంట్స్‌తో అన్నారు కూడా.. వీళ్లకు కూడా కూతురే పుట్టింది. వారసుడు పుడతాడనుకున్నాం. వారసుడు లేకుండా పోయాడు అని. పాప పుట్టినప్పుడు యూఎస్ వచ్చారు. కానీ మొహంలో సంతోషమే లేదు. మధు ఎలా ఉన్నారు? ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ల పేరెంట్స్ బిహేవియర్‌తో నేను బాధపడుతుంటే పట్టించుకోవద్దని చెప్పారు. అసలు మా ఇన్లాస్ చెప్తున్నట్టు నాకు, మధుకి మధ్య ఎలాంటి గొడవలూ లేవు మొదటినుంచీ. ప్రాబ్లం ఆయన హెల్తే. దాన్నీ మెల్లగా పరిష్కరించుకునే మార్గంలోనే ఉన్నాం. ఇల్లు కొనమని బలవంతం చేసింది మీరేనని అంటున్నారు మీ ఇన్లాస్? అదంతా పచ్చి అబద్ధం. అంతకుముందు మేం రెంట్‌కి ఉండేవాళ్లం. నెలకు 2200 డాలర్లు పే చేసేవాళ్లం. సియాటెల్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. నేనూ జాబ్ చేయడం స్టార్ట్ చేశాక.. అంతంత రెంట్ పెట్టడం కన్నా సొంతిల్లు కొనుక్కోవడం బెటర్ అని ఇద్దరమూ అనుకున్నాం. ముందు ఆయనే ప్రపోజ్ తెచ్చాడు. సరే అని వెళ్లి ఇల్లు చూసి ఇప్పుడున్న ఇంటికి అడ్వాన్స్ పే చేశాం. అప్పటినుంచి ఆయన ఇంకా టెన్షన్ పడిపోవడం, ఒకవేళ జాబ్ ఏమన్నా అయితే ఇంటి లోన్ కష్టమవుతుందేమోనని ఒత్తిడి ఫీల్ అవుతుంటే డ్రాప్ అయిపోదామని అన్నాను. అనడమే కాదు డీల్ క్యాన్సిల్ కూడా చేసుకున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చెప్పదలచుకున్నారు? మధు ఉన్నప్పుడు కూడా నా మీద తప్పుడు ప్రచారమే చేశారు.. ఇంట్లో పని చేయిస్తాను, ఇబ్బంది పెడ్తానంటూ. అమెరికాలో ఆడ, మగ ఇద్దరూ కలిసి ఇంటిపని చేసుకుంటారు. మధుతో కూడా అనేవాళ్లు. ‘ఒరేయ్ మగాడివయ్యుండి ఆ పనులేంట్రా?’ అని. అలాంటి మాటలన్నిటినీ మధు కొట్టిపడేసేవాడు. మా వాళ్లంతే. నువ్వు పట్టించుకోకు అని చెప్పేవాడు. ఆయన చనిపోయాక ఇక ఇప్పుడైతే అడ్డు అదుపూ లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్లు వేసే ఆరోపణలన్నీ తప్పని నేను ప్రూవ్ చేస్తున్నాను. నిజమని ఒక్క రుజువు చూపించమనండి? నా భర్త దహన సంస్కారాలకు వెళితే వాళ్ల బంధువు రవీందర్‌రెడ్డితో జుట్టు పట్టుకొని లాగి, కొట్టించారు నన్ను. ఒక స్త్రీననే విచక్షణ కూడా లేకుండా అలా చేయి చేసుకుంటారా? నా భర్తను చివరి చూపు చూసుకునే హక్కు నాకు లేదా? ఇంటికొచ్చేసరికి నిర్జీవంగా పడి ఉన్న భర్తను చూసి ఎలా తట్టుకొని, ఒక్కదాన్ని ఆ శవాన్ని తీసుకొని ఇండియాకు వచ్చాను. ఎంత కుంగిపోయి ఉంటాను? కనీసం ఆ కనికరం కూడా చూపరా? నా చేయి చేసుకున్న వ్యక్తి ముందస్తు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. స్త్రీ మీద చేయి చేసుకున్న వ్యక్తికి అలా బెయిల్ ఎలా ఇస్తారు? ఇదేనా ఇక్కడ ఆడవాళ్లకు జరిగే న్యాయం? నాకు న్యాయం కావాలి. నా భర్తతో సరిగ్గాలేనని అంటున్నారు. మేమిద్దరం కలిసి ఓ నాలుగు నెలల కిందటే పార్ట్‌టైమ్‌గా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేశాం. ఆ పనిలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నెల కిందటే ఓ ఈవెంట్‌ను చేశాం. మేమిద్దరం బాగా లేకపోతే ఇద్దరం కలిసి ఎలా పనిచేసుకుంటాం? నిరాధారమైన ఆరోపణలెన్నో చేస్తున్నారు. అన్నిటికీ ప్రూఫ్స్ చూపించమనండి?.. అంటూ అప్పటిదాకా ఆపుకున్న దుఃఖాన్ని ఇక పట్టలేకపోయింది స్వాతి రెడ్డి. – ఇంటర్వ్యూ: సరస్వతి రమ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం అపస్మారక స్థితిలో ఉన్న స్వాతి -
డిప్లోమా విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట: ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలంలో జరిగింది. నిడమనూరు మండలం మార్లగడ్డకు చెందిన స్వాతి(16) చిలుకూరు మండలంలోని మిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగ సందర్భంగా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లిన ఆమె సోమవారం సాయంత్రం తండ్రితో కలిసి కాలేజీకి వచ్చింది. అనంతరం కాలేజీలోనే ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కాలేజీ సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, ఆమె కళాశాలకు వచ్చే సమయంలోనే పురుగుల మందు తీసుకుని ఉంటుందని, కుటుంబంతో ఆమె ఘర్షణ పడి ఉంటుందని భావిస్తున్నారు. -
వైభవోపేతం.. స్వామి మహోత్సవం
- అహోబిలేశుడి సన్నిధిలో ఘనంగా వేడుకలు - గోవిందా నామస్మరణతో పులకించిన నల్లమల - స్వామిని దర్శనార్థం అశేషంగా తరలివచ్చిన భక్తులు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి జన్మదిన వేడుకలు నవనారసింహ క్షేత్రాల్లో వైభవోపేతంగా నిర్వహించారు. నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. నవనారసింహ క్షేత్రాల్లోని 10 దేవాలయాల్లో కొలువై స్వయంభూగా వెలసిన లక్ష్మీనృసింహస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సహీత శ్రీజ్వాలానృసింహస్వాములను దేవాలయం ఆవరణలోని మండపంలో కొలువుంచి అర్చన, తిరుమంజనం నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ గావించి మండపంలో కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి , సుదర్శన హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నవనారసింహ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. -
వైభవోపేతం..స్వాతి ఉత్సవం
ఆళ్లగడ్డ: శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రమన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం అహోబిలంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలనంతరం ఉత్సవమూర్తులను శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి అహోబిలం మఠం ప్రతినిధి సంపత్ ఆధ్వర్యంలో అభిషేకం జరిపారు. అర్చన, తిరుమంజనం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నావనారసింహ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. -
డిసెంబర్లో తెరపైకి యాక్కై
యాక్కై చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కుళందై వేలప్పన్ తెలిపారు. యువ నటుడు కృష్ణ, స్వాతి జంటగా నటించిన చిత్రం యాక్కై. ప్రకాశ్‌రాజ్, జోకర్ చిత్రం ఫేమ్ గరు సోమసుందరం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ ఫిలిం పతాకంపై ముత్తుకుమార్ నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ యాక్షన్, సెంటిమెంట్, లవ్, రొమాన్స, కామెడీ వీటిలో ఏ అంశాలతో కూడిన కథ అరుునా దానికి మరింత మెరుగులు దిద్దేది సంగీతం అని తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానన్నారు. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని యువన్‌శంకర్‌రాజా తమ యాకై ్క చిత్రానికి అందిస్తున్నారని తెలిపారు. ఆయన సంగీతంలో నటుడు ధనుష్ పాడిన పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తోందన్నారు. ప్రస్తుతం యువన్‌శంకర్‌రాజా నేపథ్య సంగీతాన్ని సమకూర్చుతున్నారని తెలిపారు.యాక్కై చిత్రానికి ఆయన సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు కుళందై వేలప్పన్ వెల్లడించారు. -
వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన స్వాతి వేడుకలు సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని స్వామి జయంతోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని 10 దేవాలయాల్లో కొలువైన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదవరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. -
వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
– నవ నారసింహ క్షేత్రాల్లోని లక్ష్మీ నృసింహస్వామికి ప్రత్యేక పూజలు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో మంగళవారం స్వాతి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్ష్మీ నృసింహ స్వామి జన్మనక్షాత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవ నారసింహ క్షేత్రాల్లో స్వయంభువుగా వెలసిన స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ.. నిత్య పూజలు చేశారు. ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో కొలువుదీర్చి ముద్రకర్త శ్రీమాణ్ వేణుగోపాలన్, మణియార్ వైకుంఠం స్వామి ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలోని స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యంతో భక్తులు తరించారు. అనంతరం స్వాతి, సుదర్శన హోమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. -
మానవత్వం చాటిన పోలీసులు, వైద్యులు
ఉస్మానియా వైద్యులు, పోలీసుల మానవత్వం ఓ అమ్మాయిని తన ఇంటికి చేర్చింది. గత ఆరు నెలలుగా ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలు, ఫుట్‌పాత్‌లపై పడుకుంటూ కాలం వెల్లదీస్తున్న అభాగ్యురాలిని తన ఊరికి చేర్చారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామానికి చెందిన స్వాతి(20) గత ఆరునెలల క్రితం ఊరు నుంచి నగరానికి వచ్చింది. ఇటీవల ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలలో తిరుగుతుండగా గురువారం గుర్తించిన ఎస్పీఎఫ్ పోలీసులు అఫ్జల్‌గంజ్ సీఐ అంజయ్య, ఉస్మానియా వైద్యులు మహ్మద్ రఫీకి సమాచారం ఇవ్వడంతో అమ్మాయి నుంచి తగిన వివరాలు సేకరించి ఆసుపత్రిలో చికిత్స చేశారు. స్వాతి తన ఊరు పేరు, తన పేరు మాత్రమే చెప్తుండడంతో తన ఊరికి పంపాలని వారు నిర్ణయించి శుక్రవారం పోలీసులు వాహనాన్ని సమాకూర్చి పోలీసుల చేత స్వాతి ఊరు మాల్‌కు పంపించారు. సాక్షితో ఆర్ఎంఓ రఫి మాట్లాడుతూ... స్వాతి మతిస్ధిమితం కోల్పోలేదని, ఏదో భయాందోళనకు గురై ఇంటి నుండి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతుందని, ఏ విషయమడిగినా ఏడుస్తుండడంతో ఇన్స్పెక్టర్ అంజయ్యతో మాట్లాడి తన గ్రామానికి పంపేలా ఏర్పాటు చేశామన్నారు. -
కుమార్తెను కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులపై కేసు
కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను అత్తవారింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన తల్లిదండ్రులపై మేడిపల్లి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా హనుమంతల గూడెంకు చెందిన స్వాతి(19), సూరోజ్ భీష్మాచారి(28) ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం సంతోష్‌నగర్‌లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. భీష్మాచారి నారాయణగూడలోని విజయా డయాగ్నస్టిక్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నాడు. భీష్మాచారి డ్యూటీకి వెళ్లిన తరువాత స్వాతి తల్లిదండ్రులు అలివేలు, సైదిరెడ్డి వచ్చి స్వాతిని బలవంతంగా తీసుకెళ్లారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న భీష్మాచారి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం స్వాతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ చేశారు. ఉత్సవమూర్తులను కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువుంచి ముద్రకర్త శ్రీమాణ్వేణుగోపాలన్, మణియార్ వైకుంఠంస్వామిల ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి.. భక్తుల దర్శనం కోసం ఉంచారు. అనంతరం స్వాతి, సుదర్శన హోమాలను ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నవlనారసింహ క్షేత్రాలు కిటకిటలాడాయి. -
అత్యాచారం చేసి.. యాసిడ్ తాగించి..
ఢిల్లీ: ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. ఓ 14 ఏళ్ల దళిత బాలికపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడి, యాసిడ్ లాంటి పదార్థం తాగించాడు. దీంతో అంతర్గత అవయవాలు పాడైపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. బాలిక మృతికి వ్యవస్థే కారణమంటూ తీవ్రంగా మండిపడింది. ఢిల్లీకి ఇంకా ఎంతమంది నిర్భయలు కావలి అంటూ డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ స్వాతీ మలివల్ తీవ్రంగా మండిపడ్డారు. 'మనం మరో నిర్భయ మృతి చెందేవరకు వెయిట్ చేశాం' అంటూ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో మహిళా కమిషన్ డీసీపీకి నోటీసు ఇచ్చిన తరువాతే నిందితుడిని అరెస్ట్ చేశారన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల రక్షణ విషయంలో హోంమంత్రి అధ్యక్షతన ఓ కమిటీని నియమించాలని స్వాతీ సూచించారు. ఢిల్లీలో మహిళా రక్షణకు ఏర్పాటు చేసిన స్పేషల్ టాస్క్‌పోర్స్‌ను ఇటీవల కేంద్రం రద్దు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. -
నా కూతురిది ముమ్మాటికీ హత్యే..
మృతురాలు స్వాతి తండ్రి ఉప్పల్: తన కూతురిది ముమ్మాటికీ హత్యేనని.. ఆత్మహత్య కాదని ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో విషం తాగి మృతి చెందిన స్వాతి తండ్రి బండి చెన్నకేశవులు (60) ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడు నారాయణ (హోంగార్డు), అతడి ప్రియురాలితో కలిసి బలవంతంగా స్వాతితో విషం తాగించి హత్య చేసి ఉంటారన్నారు. పురుగుల మందుల పేరు కూడా తెలియని తన కూతురు విషం కొని తాగడం అసాధ్యమన్నారు. పోలీసులు తన అల్లుడు నారాయణతో కుమ్మక్కై తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు తన అల్లుడు నారాయణను 4వ తేదీన అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడమే నిదర్శనమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
విచారిస్తున్నాం..!
కొన్ని కేసులు మొండివి. తలాతోక అర్థం కానివి. ఓ పక్క కడుపు రగిలిపోతున్నా... ఇంకో పక్క కన్నీళ్లు రాలుతున్నా... వ్యవస్థ గట్టి ప్రయత్నాలు చేస్తున్నా... ఈ మొండిఘటాలు తేలిగ్గా తెగవు. కేసు ఇంకా సాల్వ్ కానందుకు విచారిస్తున్నాం. పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. చదువుతున్నవాళ్లు.. అయ్యోపాపం అని విచారిస్తున్నారు. వీడని మిస్టరీ ఏడాది దాటినా కనిపించని పురోగతి మూడు జిల్లాలతో ముడిపడి ఉన్న స్వాతి హత్యకేసు పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన ‘బాపూ’ అన్నదే చివరి మాట.. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలంలోని మారుమూల అటవీ గ్రామం బావురుగొండ. వ్యవసాయం చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలనుకున్నారు ఆదివాసీ దంపతులు దారం సమ్మయ్య, లక్ష్మి. వీరికి యూకేశ్వరి, మౌనిక, శివప్రసన్న, స్వాతి, శ్వేత అనే ఐదుగురు కుమార్తెలు, కుమారుడు పవన్ ఉన్నారు. యాకేశ్వరి, మౌనికకు పెళ్లిళ్లు చేశారు. శివప్రసన్న పీజీ పూర్తి చేసి గాంధీనగర్‌లోని జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా చేస్తోంది. అక్క పీజీ చేస్తున్న సమయంలోనే స్వాతి బీఎస్సీ నర్సింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మారుతి కళాశాలలో సీటు వచ్చింది. రెండు సంవత్సరాలు నర్సింగ్ పూర్తి చేసింది. సెలవులకు ఇంటికి వచ్చి చివరి సంవత్సరంలో అడుగు పెట్టేందుకు అన్నీ సర్దుకుని 2015 జూన్ 10న భద్రాచలం బయలుదేరింది. తల్లి లక్ష్మి గంగారం వరకు వచ్చి ఇల్లందుకు వెళ్లే టాటా మ్యాజిక్ ఆటో ఎక్కించింది. కాలేజీకి వెళ్లగానే ఇంటికి ఫోన్ చేస్తానంటూ తల్లికి చెప్పింది స్వాతి. కూతురు కూర్చున్న ఆటో కదిలే వరకు అక్కడే ఉన్న తల్లి.. ఆ తర్వాత ఇంటికి వెళ్లింది. సాయంత్రం 5-6 గంటల మధ్యలో స్వాతి ఫోన్ చేసింది. తండ్రితో ‘బాపూ...’ అన్నది. అంతే! ఫోన్ కట్ అయింది. మారుమూల ప్రాంతం కావడంతో సిగ్నల్ సరిగా లేక కట్ అయి ఉంటుంది అనుకున్నారా తలిదండ్రులు. కూతురు కాలేజీకి వెళ్లే ఫోన్ చేసిందని ధీమాగా ఉన్నారు. ఒక సంవత్సరం చదివితే స్వాతికి ఏదో ఒక ఆస్పత్రిలో ఉద్యోగం వస్తుందని, తన కాళ్లపై తాను నిలబడుతుందనే సంతోషంలో ఉన్నారా దంపతులు. సరిగ్గా వారం రోజులకు హుజురాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి కొత్తగూడ పోలీసులకు సమాచారం వచ్చింది. హుజురాబాద్ సమీపంలో ముళ్లపొదల్లో మృతదేహం లభించిందని, సమీపంలో స్వాతి కుటుంబ సభ్యుల పాస్‌ఫొటోలు లభించాయని, మృతదేహాన్ని గుర్తించడానికి వారిని తీసుకుని రావాలని చెప్పారు. విషయం తెలియగానే పొలం పనులు చేస్తున్న సమ్మయ్య, లక్ష్మి ఉన్నఫళంగా హుజురాబాద్ వెళ్లారు. అప్పటికే శవం కుళ్లిపోయి వాసన పట్టింది. వేసుకున్న దుస్తులు, ఫొటోల ఆధారంగా మృతదేహం స్వాతిదేనని తల్లిదండ్రులు గుర్తించారు. ఆ సమయంలో హుజురాబాద్‌లో ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఎవరో సామూహిక అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అరుుతే ఏడాది దాటినా ఇప్పటివరకు కేసులో ఎలాంటి పురోగతి లేదు. నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. భద్రాచలం వె ళ్లి.. హుజురాబాద్‌లో శవమై.. గంగారంలో ఆటో ఎక్కిన స్వాతి.. ఆ తర్వాత ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిపోకు చెందిన భద్రాచలం బస్సు ఎక్కింది. ఇంటి వద్ద సర్దుకున్న బ్యాగు బస్సులోనే ఉంది. రెండు రోజులు చూసిన డ్రైవర్ బ్యాగును కొత్తగూడెం డిపోలో అప్పగించాడు. స్వాతి మృతదేహం లభించిన తర్వాత విచారణలో భాగంగా పోలీసులు కొత్తగూడెం డిపో నుంచి స్వాతి బ్యాగును స్వాధీనం చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం స్వాతి మాట్లాడిన ఫోన్, సిమ్ కార్డులను పోలీసులు తీసుకున్నారు. అరుుతే హంతకులెవరనేది మాత్రం ప్రశ్నగానే మిగిలింది. కిడ్నాప్ చేశారా..? కాలేజీకి వెళుతున్న స్వాతిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో అనే అనుమానం వ్యక్తం అవుతోంది. స్వాతి బ్యాగు బస్సులో ఉండటం.. కేవలం హ్యాండ్ పర్స్ మాత్రమే తనవద్ద ఉండడంతో ఎవరో కిడ్నాప్ చేసి హుజురాబాద్ తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది నిర్భయ సంఘటనల కంటే మించిందని, మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గిరిజన యువతి హత్యకు గురై సంవత్సరం గడిచినా నిందితులను గుర్తించడంలో జాప్యమేంటని ఆయూ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. - సాదుల రాజు, సాక్షి, కొత్తగూడ, వరంగల్ తిన్న కూడు ఒంట పడుతలేదు సిన్న పిల్ల కాన్నుంచి సక్కగా సాదుకున్నం. బాగా సదువుకుని పైకొత్తదనుకుంటే.. కుళ్లిపోయిన శవమై కనిపించింది. ఎటు సూసినా బిడ్డ కండ్లల్లో కనబడుతోంది. ఇంట్లో దాని ఫొటో సూసినప్పుడల్లా దుఃఖం వస్తుంది. పోలీసులేమో మీరు ఏం చెప్తలేరంటూ మమ్మల్నే గద్దిస్తున్నారు. పాత ముచ్చట్లే చెపుతాండ్లంటూ ఈసడించుకుంటున్నారు. బయటోళ్లు తలోమాట అంటాడ్రు. బతికిన బతుకు కాదు.. సచ్చిన సావు కాదు.. తిన్న తిండి ఒంట బడతలేదు. చెట్టంత బిడ్డను మరువలేక తండ్రి క్యాలి లేకుండా మాట్లాడుతాండు. తోడబుట్టినోల్లు ఎక్కెక్కి ఏడుస్తాండ్రు. - దారం లక్ష్మి, స్వాతి తల్లి బయటకు వెళ్లి చదువుకోవాలంటే భయమేస్తోంది! ఖానాపురం మండలం బుధరావుపేట మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్నా.. అక్కకు అలా జరిగినప్పటి నుండి చదువుకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఆడవాళ్లకు రక్షణ లేకుంటే ఎలా చదువుకునేది..? ప్రభుత్వం చెప్పే మాటలకు.. సమాజంలో జరిగే సంఘటనలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. బస్సెక్కిన అక్కను ఎవరెత్తుకెళ్లారని ఇప్పటికీ పోలీసులు తేల్చలేదంటే, మహిళలకున్న రక్షణ చర్యలు అర్థం చేసుకోవచ్చు. - శ్వేత, స్వాతి చెల్లెలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి స్వాతిని హత్య చేసిన నిందితులను పోలీసులు వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఢిల్లీ లాంటి పట్టణాల్లో జరిగితేనే పట్టించుకుంటారా..? ఆదివాసీ గూడాల్లో.. ఆదివాసీ యువతులపై జరిగితే పట్టించుకోరా..? సంవత్సరం గడిచినా కేసు ముందుకు సాగలేదు. స్వాతి హత్య కేసును సీబీఐకి అప్పగించి నిందితులను గుర్తించాలి. లేదంటే మహిళలకు చట్టాలు, పోలీసులపై నమ్మకం పోతుంది. - శివప్రసన్న, స్వాతి అక్క -
కిరాణా షాపుకు వెళ్లి...
కిరాణ షాపుకు వెళ్లిన ఓ యువతి అదృశ్యం అయింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాటేదాన్ బాబుల్‌రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన పి.అంజమ్మ కుమార్తె స్వాతి(19). అదే ప్రాంతంలోని నానమ్మ ఇంటికి శనివారం మధ్యాహ్నం వెళ్లింది. అక్కడి నుంచి కిరాణా షాపుకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య పై అనుమానంతో..
వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలను కన్నదని అనుమానంతో.. కన్న తండ్రి ఇద్దరు పిల్లలను కిరాతకంగా హతమార్చిన సంఘటన నిజామాబాద్ జిల్లా యడవల్లి మండలం జానకంపేటలో ఆదివారం వెలుగుచూసింది. వివరాలు.. రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన చంద్రశేఖర్(34)కు పన్నెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న చంద్రశేఖర్ వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలను కన్నదని తరచు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ రోజు భార్య ఇంట్లో లేని సమయంలో ఈతకు వెళ్దామని చెప్పి ముగ్గురు పిల్లలను తీసుకొని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలోని అలీసాగర్ కాలువ వద్దకు తీసుకొచ్చాడు. పెద్ద కూతురు స్వాతి(10)ని నీటిలో ముంచి బురదలో పడేసి కాలుతొ తొక్కి చంపాడు. అనంతరం మోక్ష(5) ను కూడా నీటిలో ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశాడు. మూడో సంతానమైన 13 నెలల చిన్నారిని నీటిలో విసిరేయడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని బాబును రక్షించి అతన్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఖమ్మం జిల్లా కూనవరం మండలం పైడిగూడెంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన చిన్నారులు చదల స్వాతి(5), వల్లా భూమిక(5) బుధవారం మధ్యాహ్నం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆడుకుంటూ నీటిలోకి దిగారు. సమీపంలోని ఉన్న వారెవరూ గమనించకపోవటంతో మునిగి చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య ఉండగానే మరో పెళ్లి
కటకటాల్లోకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ చాంద్రాయణగుట్ట: ప్రేమ పేరుతో వల వేసి... ఒకరికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్న ఓ సాప్ట్వేర్ ఇంజినీర్‌ను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం...కర్మన్‌ఘాట్ గాయత్రీనగర్‌కు చెందిన శంకర్ నాయక్ కుమారుడు కిరణ్ కుమార్(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్. సైదాబాద్‌కు చెందిన పుష్పలత(25)ను ఐదేళ్ల పాటు ప్రేమించి 2013లో బాలాపూర్‌లోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు భార్యతో చక్కగా ఉన్న కిరణ్ ఆ తర్వాత బీటెక్‌లో తనతో పాటు చదువుకున్న గౌలిపురాకుచెందిన స్వాతి (24)ని ప్రేమలోకి దించాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి 2015 జూన్‌లో సీతాఫల్‌మండిలోని ఆర్యసమాజ్‌లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యను సైదాబాద్‌లో, రెండో భార్యను గాయత్రీనగర్‌లో ఉంచాడు. ఇదిలా ఉండగా... మొదటి భార్య పుష్పలతను కట్నం తీసుకురావాలని కిరణ్‌కుమార్‌తో పాటు అతని తండ్రి శంకర్ నాయక్, తల్లి, అన్న, తమ్ముడు వేధించసాగారు. ఈ క్రమంలోనే కిరణ్‌కుమార్ రెండో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న మొదటి భార్య పుష్పలత ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ కుమార్‌తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న కిరణ్‌కుమార్ తల్లి, అన్న, తమ్ముడి కోసం గాలింపు చేపట్టారు. -
ప్రేమ పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసం
ప్రేమ పేరుతో యువతులకు వలవేసి ఒకరి తర్వాత ఒకరిని పెళ్లిచేసుకున్న ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌ను ఛత్రినాక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్మన్‌ఘాట్ గాయత్రీనగర్‌కు చెందిన శంకర్ నాయక్ కుమారుడు కిరణ్ కుమార్(27) సాప్ట్వేర్ ఇంజనీర్. సైదాబాద్‌కు చెందిన పుష్పలత(25) అనే యువతిని ఐదేళ్ల పాటు ప్రేమించి 2013లో బాలాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చక్కగా కాపురం చేసుకున్న ఇతగాడు రంగు మార్చాడు. బీటెక్‌లో తనతో పాటు చదివిన గౌలిపురా శ్రీరాం కాలనీకి చెందిన స్వాతి (24)ని ప్రేమ ముగ్గులోకి దించాడు. అంతకు ముందు జరిగిన వివాహాన్ని దాచిపెట్టి 2015 జూన్ లో సీతాఫల్‌మండిలోని ఆర్యసమాజ్‌లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్య పుష్పలతను కట్నం తీసుకు రావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. కిరణ్ తో పాటు.. అతని కుటుంబ సభ్యులు కూడా పుష్పలతను వేధింపులకు గురిచేస్తూ ఉండే వారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెండో వివాహం సంగతి బయట పడింది. దీంతో పుష్పలత ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ కుమార్‌తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా.. కిరణ్ కుమార్ తల్లి, అన్న, తమ్ముడు పరారీలో ఉన్నారు. -
అత్తింటి వేధింపులు తాళలేక...
అత్తింటి వేదింపులు తాళలేక ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. స్థానిక కాలనీకి చెందిన స్వాతి(25)కి రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటినుంచి అత్తింటి వారు వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురైన స్వాతి ఈ రోజు ఇంట్లో ఎవురు లేని సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
స్వాతికి తాళి కడుతుంటే... చేతులు వణికాయి!
‘‘హారర్ సినిమా అనగానే రాత్రి పన్నెండు కాగానే దెయ్యం రావడం, అందరూ భయపడటం జరుగుతుంటుంది. వాటికి భిన్నంగా ‘త్రిపుర’ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ సరికొత్తగా ఉంటాయి’’ అని నవీన్‌చంద్ర తెలిపారు. స్వాతి, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో రాజకిరణ్ దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ‘త్రిపుర’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హీరో నవీన్‌చంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘ ‘అందాల రాక్షసి’ దర్శకుడు హను రాఘవపూడి ద్వారా ‘త్రిపుర’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా నవీన్‌చంద్ర. ఈ సినిమాలో పెళ్లి సీన్ ఉంటుంది. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అని భయం వేసింది. స్వాతి మెడలో తాళి కట్టే టైమ్‌లో నా చేతులు వణికాయి కూడా. స్వాతి కూడా కొంచెం టెన్షన్ ఫీలైంది. అయినా సింగిల్ టేక్‌లో ఈ సీన్‌ను ఓకే చేశాం. త్రిపుర పాత్రలో స్వాతి బాగా నటించింది. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు. -
స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర
స్వాతి టైటిల్ రోల్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘త్రిపుర’. క్రేజీ మీడియా పతాకంపై ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది. తమిళంలో ‘తిరుపుర సుందరి’గా వస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అనుకున్న కథను రాజకిరణ్ అద్భుతంగా తెరకెక్కించారు. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ అందించిన స్క్రీన్‌ప్లే ఓ హైలైట్. ‘స్వామి రారా, కార్తికేయ’ వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన మరో తెలుగు చిత్రమిది. ఆ కోవలోనే ఇదీ హిట్టవు తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు. ‘‘త్రిపుర ఏం చేస్తుంది? ఆమె కథేంటి అనేది సస్పెన్స్. స్వాతి అద్భుతంగా నటించింది. నవీన్‌చంద్ర చేసిన పాత్ర అదనపు ఆకర్షణ. సప్తగిరి కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. హార్రర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 29న పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజా, ఛాయాగ్రహణం: రవికుమార్ సానా, సంగీతం: కమ్రాన్. -
త్రిపుర
పెళ్లి కాని అమ్మాయికొచ్చే కలలన్నీ తియ్యగా ఉంటాయి. కానీ, ‘త్రిపుర’కు వచ్చే కలలు మాత్రం కల్లోలాన్ని సృష్టిస్తాయి. ఆ కలలేంటి? ఆ కలవరాలేంటి? ఆ కల్లోలమేంటి? ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ‘త్రిపుర’ చిత్రం రూపొందింది. ‘కలర్స్’ స్వాతి, నవీన్‌చంద్ర, రావురమేశ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకుడు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బదిలీ కోసం ప్రాణం తీశాడు
విజయనగరం క్రైం: అప్పుల్లో కూరుకుపోయాడు. అక్రమాలకు పాల్పడ్డాడు. కావలసిన చోట బదిలీ లక్ష్యంగా తన స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగినిని దారుణంగా హతమార్చాడు. అతడే రైల్వే ఉద్యోగి కాళ్ల గోపి. శృంగవరపుకోట రైల్వే విద్యుత్ సబ్ స్టేషన్ ఉద్యోగిని చిట్టిమోజు స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన గోపి, మరో ముగ్గురు సహ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు అందించిన వివరాలివి. కొత్తవలసకు చెందిన కాళ్ల గోపి 1994 నుంచి రైల్వే పీఎస్ఐ డిపార్ట్మెంట్లో కళాసీగా పనిచేస్తున్నాడు. 2005 నుంచి ఎస్.కోటలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో డిపార్ట్మెంట్ టెస్టులు రాసి ఉత్తీర్ణుడవడంతో పదోన్నతి మీద జగదల్పూర్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. తనకు పదోన్నతి ఇచ్చి ఎస్.కోటలోనే నియమించాలని గోపి అభ్యర్థించగా వారు నిరాకరించారు. మరోవైపు అతనికి సుమారు రూ.45 లక్షల వరకు అప్పులున్నాయి. దీంతో కొన్నాళ్లుగా మధు, పవన్ అనే ఇద్దరి సహకారంతో రాత్రివేళ విధుల్లో ఉన్నప్పుడు గొడౌన్‌లోని కాపర్ని ముక్కలుగా కోసి తన కారులో తరలించి కొత్తవలస రామకృష్ణకు విక్రయించేవాడు. దానిపై సుమారు రూ.2 లక్షల వరకు సంపాదించి అప్పు తీర్చాడు. ఈ సంపాదనలో మధు, పవన్‌లకు కొంత వాటా ఇచ్చేవాడు. పదోన్నతిపై జగదల్పూర్ వెళ్తే అప్పులు తీర్చడం సాధ్యం కాదని, శృంగవరపుకోటలో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లో పనిచేస్తున్న టెక్నీషియన్‌ను చంపేస్తే తనకు ఆ స్థానంలో బదిలీ జరుగుతుందని భావించాడు. మే 11వ తేదీ సాయంత్రం ఏడుగంటల సమయంలో కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న పెట్రోల్ బంకు వద్ద గోపిని మధు, పవన్, మోహన్‌రాజు కలిశారు. వీరంతా బైకుల్లో పెట్రోల్ పోయించుకుని శృంగవరపుకోట వెళ్లి సబ్‌స్టేషన్ వద్దనున్న లే అవుట్లో బైకులను ఉంచారు. రాత్రి సుమారు 9.50 గంటల సమయంలో సబ్ స్టేషన్ ఇనుప తలుపు కింద నుంచి కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న కళాసి పార్వతి ముఖాన్ని వెనుక వైపునుంచి గోనె సంచితో మూసి, స్వాతిని బయటికి తీసుకొచ్చి కర్రలతో కొట్టి చంపారు. స్వాతి, పార్వతిల వద్ద ఉన్న బంగారు పుస్తెలతాళ్లను సూత్రాలు, సెల్ఫోన్లను చోరీ చేశారు. ఒక పుస్తెలతాడును మధుకి తెలిసిన రమణ అనే వ్యక్తి ద్వారా కొత్తవలస బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టి, మిగిలిన బంగారు ఆభరణాలను నలుగురు పంచుకున్నారు. శృంగవరపుకోట సీఐకు వచ్చిన సమాచారం మేరకు ఈనెల 16న రాత్రి ఎస్.కోట రైల్వే స్టేషన్ సమీపంలో నలుగురిని అరెస్ట్‌చేసి బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించటానికి విశేషంగా కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. కేసు దర్యాప్తు కోసం సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు 27మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిస్టరీ ఛేదించారన్నారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని, వారి కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయన్నారు. సమావేశంలో జిల్లా అదనపు( ఆడ్మిన్) ఎస్పీ ఎ.వి.రమణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి.త్రినాథ్, విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, డీసీఆర్బీ డీఎస్పీ కె.ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు
నర్సింహులపేట : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం నర్సింహులపేట పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నారుు. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలంలోని చిన్నంలా గ్రామానికి చెందిన దబ్బెటి వెంకన్న, నర్సింహులపేట మండలంలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన అక్కిరెడ్డి స్వాతిలు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే వెంకన్న సూర్యాపేటలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుం డగా, స్వాతి సూర్యాపేటలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కాగా, వారి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ మేరకు వెంకన్న, స్వాతిలు ఇటీవల పెళ్లి చేసుకుని కుటుంబసభ్యుల రక్షణ కోరుతూ ఎస్సై వెంకటప్రసాద్‌ను ఆశ్రరుుంచారు. ఇదిలా ఉండగా, ఎస్సై ఇరువురి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. చెన్నారావుపేటలో.. పోలీసులను ఆశ్రరుుంచింది. ఎస్సై పులి వెంకట్‌గౌడ్ కథనం ప్రకారం.. వుండలంలోని గురిజాల గ్రావూనికి చెందిన గొడిశాల వెంకటేశ్వర్లు-విజయు దంపతుల కువూరుడు వుహేష్.. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రశాంతిలు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో ఇటీవల వారు చిల్పూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం పోలీసులను ఆశ్రరుుంచారు. ఈ సందర్భంగా ఎస్సై పులి వెంకట్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ ఇరువురి తల్లిండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తావుని తెలిపారు. -
నిన్నటి ఊసులు రేపటి ఆశలు
కాలచక్రంలో మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ రోజుతో 2014కు శుభం కార్డు పడుతోంది. సరికొత్త ఆశలు మోసులెత్తగా, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న వేళ... ఒక్కసారి గడచిన ఏడాది కాలాన్ని సింహావలోకనం చేసుకుంటే... సినిమా రీలు గిర్రున తిరిగినట్లు ఎన్నెన్నో జ్ఞాపకాలు. వెళ్ళిపోతున్న 2014లో తాము చూసిన మార్పులు, రానున్న 2015కు వచ్చే చేర్పుల గురించి ఆయా విభాగాల్లోని సినీ ప్రముఖులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు... అనుభూతులు... ఎవరికైనా వర్తించే సూక్తి ఇది! - వెంకటేశ్, హీరో 2014లో ‘దృశ్యం’ నాకొక స్వీట్ మెమరీ. సరైన సమయంలో వచ్చిన విజయం అది. ఈ విజయం ఇలాంటి ప్రయోగాలు మరెన్నో చేయగల నమ్మకాన్ని నాలో నింపింది. ఈ సంవత్సరం ఆనందించదగ్గ మరో విషయం - యంగ్‌స్టర్స్ చాలామంది కూడా ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం. ఇక సక్సెస్ రేట్ అంటారా! జయాపజయాలు ప్రతి ఏడాదీ ఉండేవే! ఆ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. చక్కని ప్లానింగ్, హార్డ్‌వర్క్‌తో సిన్సియర్‌గా ముందుకెళ్తే విజయం తథ్యం. ఒక సీనియర్ కథానాయకునిగా నా అభిప్రాయమిది! మల్టీస్టారర్ చిత్రాలను ప్రోత్సహించడం, ప్రయోగాలు చేయడం... వీటి గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఒక వయసు వచ్చాక, రకరకాల పాత్రలు చేసి అనుభవం పొందాక ఇక రొటీన్‌గా వెళ్లడం కరెక్ట్ కాదు. నాకే కాదు, ఎవరికైనా వర్తించే సూక్తి ఇది. అందుకే... వెరైటీ పాత్రలనే ఎన్నుకుంటున్నా. రానున్న 2015లో ‘గోపాల గోపాల’తో రాబోతున్నా. అది కూడా రొటీన్ ఫార్ములా సినిమా కాదు. కథ, కథనం, పాత్రలు కొత్తగా ఉంటాయి. అంతా ఆ సూత్రాన్నే అనుసరిస్తున్నారు - సుద్దాల అశోక్‌తేజ, గీత రచయిత 2014లో ‘లింగ’, ‘ఐ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలకు పాటలు రాశాను. రచయితగా ఆత్మసంతృప్తినిచ్చిన పాటలైతే ఏమీ రాయలేదు కానీ, సంతృప్తినిచ్చిన పాట మాత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో నేను రాసిన ‘నీలిరంగు చీరలోనా...’ పాటే. ఇంకా దాసరిగారి ‘ఎర్రబస్సు’లో కూడా పాట రాశాను. పరిశ్రమ మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది అంత బ్రహ్మండంగా అయితే లేదు. తక్కువగా కూడా ఏమీ అనిపించలేదు. చిన్న చిన్న సినిమాలు విడుదలై సరిగ్గా ఆడకపోవడం మాత్రం బాధ కలిగించింది. బాధాకరమైన మరో విషయం ఏంటంటే... గొప్ప సాహిత్యం అందించాలని మాకుంటుంది. కానీ... ఆ అవకాశం మాత్రం లభించడం లేదు. ఆత్రేయగారు ఓ మాట అనేవారు. ‘ముందు నీకు నచ్చింది చేయ్. అది వాళ్లకు నచ్చకపోతే... వాళ్లకు నచ్చిట్టు చేయ్’ అని. ఇప్పుడు గీత రచయితలంతా ఫాలో అవుతోంది ఆ సూత్రాన్నే. ఈ ఏడాది ఉన్నంతలో మా గీత రచయితలంతా మంచి సాహిత్యాన్నే అందించారు. కాంట్రవర్సీ అంటేనే కథానాయికా..? - స్వాతి, హీరోయిన్ 2014 సాదాసీదాగా సాగిపోయింది. అయితే కొత్త హీరోయిన్లు కొంతమంది ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం ఆనందం అనిపించింది. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా పరిచయమైన రాశీఖన్నా నాకు బాగా నచ్చింది. ఈ ఏడాది ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన హీరోయిన్లంతా గ్లామర్‌కే పరిమితమైపోయారనే విమర్శను నేను అంగీకరించను. ఎందుకంటే గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో వాళ్లకు తెలీదు. నేను కథానాయికగా కెరీర్ ప్రారంభించాక, మొదట్లో అభినయ ప్రధానమైన పాత్రలకే మొగ్గు చూపాను. కానీ కెరీర్ దీర్ఘకాలం కొనసాగాలంటే, గ్లామర్‌గా కనిపించక తప్పదు. అందుకే, ‘స్వామి రా రా’ నుంచి నా అభిమతాన్ని మార్చుకొని కాస్త గ్లామర్‌గా కనిపించడం మొదలుపెట్టాను. ఇప్పుడు తెలుస్తోంది గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో! ఈ ఏడాది అభినయపరంగా చెప్పాల్సి వస్తే -‘మనం’ సినిమాలో సమంత, శ్రీయల గురించి చెప్పాలి. సమంతది నిజంగా చాలా విచిత్రమైన పాత్ర. అలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే వస్తాయి. ఇక శ్రీయ అయితే... ఆ సినిమాలో వెంకటగిరి చీర కట్టుకొని ఎంత అందంగా కనిపించారో! అలాగే.. ‘గీతాంజలి’ సినిమాలో అంజలి పెర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చింది. ఆ దర్శకుడు తీయనున్న తదుపరి చిత్రంలో నేనే కథానాయికను. అయితే, అందరూ అది ‘గీతాంజలి’కి సీక్వెల్ అనుకుంటున్నారు. కానీ, అదొక కొత్త కథ. ఇక ఈ ఏడాది కాంట్రవర్సీల గురించి చెప్పే ముందు.. నాపై వచ్చిన కాంట్రవర్సీ గురించి మాట్లాడటం కరెక్ట్. నాకు పెళ్లి ఖాయమైందనీ, త్వరలో పెళ్లిపీటలు ఎక్కేయబోతున్నాననీ ఓ రూమర్ నాకెంత తలనొప్పి తెప్పించిందో మాటల్లో చెప్పలేను. ఆ టైమ్‌లో నేను ఫారిన్లో ఉన్నా. ఒకటే ఫోన్లు. ‘పెళ్లి కొడుకు కూడా ఎవడో మీరే చెప్పేయండి... ఓ పని అయిపోతుంది’ అని మీడియా వారితో ఘాటుగా స్పందించా. అలాగే... కొంతమంది హీరోయిన్లు ట్విట్టర్ ద్వారా తమ మనోభావాలను వ్యక్తం చేస్తే... వాటికి వేరే రంగు పులిమి మాట్లాడటం నన్ను కాస్త బాధించింది. ఇక శ్వేతాబసు ఉదాంతం గురించి చెప్పేదేముంది. తన విషయంలో అందరూ ఓవర్‌గానే రియాక్టయ్యారు. చివరకు కాంట్రవర్సీ అంటేనే కథానాయిక అన్నట్లు తయారైంది సొసైటీ. దర్శకులే బాధ్యులు! - బోయపాటి శ్రీను, దర్శకుడు ఈ ఏడాది తొలినాళ్లలో బలహీనమైన బాక్సాఫీస్‌కి కొత్త ఊపిరులూదిన చిత్రం నా ‘లెజెండ్’. ఇది నేను గర్వంగా చెప్పుకునే అంశం. అయితే ఈ ఏడాది అత్యధికంగా చిత్రాలు విడుదలైనా, విజయాలు మాత్రం అరకొరగానే ఉండడం నన్ను బాధించింది. సినిమా సమష్టికృషి అయినా, జయాపజయాలకు బాధ్యులు కచ్చితంగా దర్శకులే. దర్శకుని సృజన పైనే సినిమా ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల జడ్జిమెంట్‌లో ఎప్పుడూ లోపం ఉండదు. ఈ ఏడాది విడుదలైన ‘మనం’, ‘రన్ రాజా రన్’ సినిమాలు కూడా నాకు బాగా నచ్చాయి. బాలయ్య వందో సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. ఆ సినిమాను నేను డెరైక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నా దగ్గరైతే కథ లేదు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బాలయ్య స్టేటస్‌కు తగ్గ కథను తయారు చేసి, మళ్లీ ఆయనకు ఘన విజయాన్ని అందిస్తా. ఆ సత్తా నాలో ఉంది. పరిశ్రమ పరిస్థితి బాగా లేదు! - నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), నిర్మాత ఈ ఏడాది ఆర్టిస్టుల పరిస్థితి హ్యాపీ... టెక్నీషియన్ల పరిస్థితీ హ్యాపీ. కానీ నిర్మాతల పరిస్థితే దారుణంగా తయారైంది. దానికి కారణం నిర్మాతల పొరపాట్లే. ఇక్కడ నిర్మాతకు నిర్మాతే శత్రువు. ఈ కారణంగా సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవసరం. ముందు నిర్మాతల్లో మార్పు రావాలి. మార్పు రాకపోతే... ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక నా విషయానికొస్తే 2014 సూపర్‌హిట్ ఇయర్. ఈ ఏడాది ప్రారంభంలో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్‌బస్టర్ నిర్మించాను. ముగింపులో వచ్చిన ‘ముకుంద’ విజయపథంలో దూసుకుపోతోంది. బాధ్యత పెంచిన విజయాలు - అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు ఈ ఏడాది నాకు చాలా స్పెషల్. నా మ్యూజిక్ డెరైక్షన్‌లో వచ్చిన ‘మనం, హార్ట్ ఎటాక్, ఒక లైలాకోసం, పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలు సంగీతపరంగా సంచలనం సృష్టించాయి. ఒక్కో సంవత్సరం ఒక్కో మ్యూజిక్ డెరైక్టర్‌కి కలిసి రావడం మొదట్నుంచీ జరుగుతోందే. ఈ ఏడాది నాకు కలిసొచ్చింది. దీన్ని నేను బాధ్యతగా తీసుకుంటున్నా. ఇక బయటి సినిమాల్లో నాకు నచ్చిన ఆల్బమ్ ‘వన్’. ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఏడాది అత్యంత బాధాకరమైన విషయం చక్రిగారు మనల్ని వదిలి వెళ్లిపోవడం. మంచి సంగీత దర్శకుడు. అలాగే గొప్ప వ్యక్తి కూడా. అలాంటాయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. పరాజయాలకు కారణం అదే! - మార్తాండ్ కె.వెంకటేశ్, ఎడిటర్ 2014లో ఎడిటింగ్‌లో వచ్చిన పెద్ద మార్పు ఒక్కటే. సినిమా ఫిల్మ్ నుంచి డిజిటల్‌కి మారడం. ఫిల్మ్ ఉన్నప్పుడు... భయం, భక్తి ఉండేది. కానీ... డిజిటల్‌గా మారాక ఆ గౌరవం తగ్గిందనే చెప్పాలి. దర్శకునికి ఒక వెర్షనూ, నిర్మాతకు ఒక వెర్షనూ, హీరోకి ఒక వెర్షనూ చేసి చూపిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివే. కాస్త ఇబ్బందికరమైన విషయం అదే. ఇక ఈ ఏడాది సక్సెస్ రేట్ తగ్గడానికి ప్రధాన కారణం కూడా ఓ విధంగా డిజిటలే అనాలి. ఎందుకంటే... ఫిల్మ్ ఉన్నప్పుడు అనుభవం, అభిరుచి, జడ్జిమెంట్ ఉన్న సరైన టెక్నీషియన్స్ పనిచేసేవారు. కానీ డిజిటల్ వచ్చాక ఎవరికి వారే ఎడిటింగ్ చేసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఓ పది సినిమాలకు పనిచేసిన తర్వాత డెరైక్టర్లయ్యేవారు. కానీ ఇప్పుడు ఏ అనుభవం లేకుండానే డెరైక్టర్లైపోతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు సినిమాల విషయంలో పదిమంది కంట్రిబ్యూషన్ ఉండేది. సినిమా బాగా రాకపోతే... ఆ విషయాన్ని దర్శక, నిర్మాతల ముందు కరాఖండిగా చెప్పేసేవాళ్లం. వెంటనే దానికి తగ్గ మార్పులు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు సినిమాలో లోటుపాట్లు ఎత్తి చూపిస్తే, మన దగ్గరకు రావడం మానేస్తున్నారు. ఇది ఒక రకంగా అనారోగ్యకరమైన వాతావరణమే. ఓవరాల్‌గా డిజిటల్ కారణంగా ఎక్కువ సినిమాలు ఎలా వస్తున్నాయో, అలాగే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక నా విషయానికొస్తే ‘దృశ్యం, ఉయ్యాల జంపాల’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశాననే సంతృప్తి ఉంది. ప్లానింగ్‌తో వెళ్తే విజయాలే! - రామ్‌ప్రసాద్, కెమెరామేన్ ఈ ఏడాది తెలుగు సినిమా చిత్రీకరణ రీల్ నుంచి పూర్తిగా డిజిటల్‌కి మారింది. కెమెరా విభాగంలో కొత్తగా చెప్పుకోవాల్సిన మార్పు అదే. నా వరకూ నేను పనిచేసిన ‘ఎవడు’, ‘లెజెండ్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. కెమెరామేన్‌గా నేను పూర్తి ఆనందంతో ఉన్నాను. ఓవరాల్‌గా చూస్తే మాత్రం సక్సెస్‌రేట్ తక్కువగా ఉంది. సరైన ప్లాన్‌తో పకడ్బందీగా ముందుకెళ్తే ఈ అపజయాలను కొంతైనా అధిగమించొచ్చు. ఎందుకంటే... ఈ ఏడాది అపజయాల్లో కాస్ట్ ఫెయిల్యూర్ల సంఖ్య కూడా ఎక్కువే. సరైన ప్లానింగ్ లేకషూటింగ్ డేస్ ఎక్కువై, అనవసరపు ఖర్చు పెరుగుతోంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సినిమాటోగ్రఫీ పరంగా నాకిష్టమైన సినిమాలంటే.. ‘లెజెండ్’, ‘ఎవడు’ సినిమాల పేర్లే చెబుతాను. ఎందుకంటే విమర్శ అయినా, పొగడ్త అయినా... నాకు నేనే చేసుకుంటాను తప్ప మరొకరికి ఆ అవకాశం ఇవ్వను. నిజానికి మన కంటే హిందీ, మలయాళం, తమిళ సినిమాల్లో ఫొటోగ్రఫీ బాగుంటోంది. ఆ సినిమాలు చూసినప్పుడల్లా నాకు బాధ కల్గుతుంటుంది. నేనెందుకు అంత గొప్పగా చేయలేకపోతున్నాను అని. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నాను. - బుర్రా నరసింహ -
దైవం, సైన్స్... వీటిలో ఏది గొప్ప?
భగవంతుడు, సైన్స్... ఈ రెండింటిలో మనిషి నమ్మాల్సింది దేనిని? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందిన చిత్రం ‘కార్తికేయ’. ‘స్వామిరారా’ జంట నిఖిల్, స్వాతి కలిసి నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ -‘‘సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. స్వాతి, నేనూ జంటగా నటించిన ‘స్వామి రారా’ చిత్రం 140 థియేటర్లలో విడుదలైతే, ఈ చిత్రాన్ని 250 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రాలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 24న దీపావళి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో తన పాత్ర పేరు వల్లీ అని, ఎంజాయ్ చేస్తూ ఈ పాత్ర చేశానని ‘కలర్స్’ స్వాతి తెలిపారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సస్పెన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం యూనిట్ సభ్యుల సహకారమే అని నిర్మాత అన్నారు. -
జపాన్ పెయింటింగ్ పోటీలకు తెలంగాణ కళాకారులు
హైదరాబాద్: అంతర్జాతీయ పెయింటింగ్ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు పాల్గొనున్నారు. జపాన్ లో జరిగే చిత్ర ప్రదర్శనకు స్వాతి, విజయ్ లను ప్రభుత్వం ఎంపిక చేసింది. స్వాతి, విజయ్ లు ప్రభుత్వ ఖర్చులతో ఈ పోటీలలో పాల్గొన్నున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరికి లక్షన్నర రూపాయల ఆర్ధిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. -
విందుకు వెళ్లొస్తూ... మృత్యుఒడిలోకి
పెళ్లింట్లో విషాదం కారును ఢీకొట్టిన లారీ వధువు బావ దుర్మరణం మరో ఐదుగురికి గాయాలు బెల్లంపల్లి : మరదలి రిసెప్షన్ విందుకు వచ్చి ఆనందోత్సాహాలతో ఇంటికి తిరిగెళ్తుండగా లారీ ఢీకొనడంతో బావ మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వన్‌టౌన్ ఏఎస్సై ఖాదర్‌పాషా కథనం ప్రకారం... ములుగు మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన స్వాతికి, కాగజ్‌నగర్‌కు చెందిన సురేంద్రచారితో ఈ నెల 20న వివాహం జరిగింది. గురువారం రిసెప్షన్ విందు కోసం స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులు కాగజ్ నగర్‌కు రెండు వాహనాల్లో వచ్చారు. వారిలో స్వాతి అక్కాబావలు హన్మకొండకు చెందిన మహారాజ అంజలి, భాస్కరచారి(28) ఉన్నారు. విందు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున వధూవరులతో కలిసి కాట్రపల్లికి బయల్దేరారు. క్వాలిస్ వాహనంలో వధూవరులు, బంధువులు, మరో కారులో భాస్కరాచారి, బంధువులు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో బెల్లంపల్లి శివారులో మూసివేసిన 68 గని సమీపంలో మంచిర్యాల వైపు నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఓ లారీ అతి వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న భాస్కరాచారి(28) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో భాస్కరచారి భార్య అంజలి, మామ మొగిలయ్య, తోడల్లుడు కృష్ణమాచారి, బావమరిది రామకృష్ణ, తోడల్లుడి కుమారుడు ప్రదీప్‌కు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. బైక్ మెకానిక్ అయిన భాస్కరచారికి కుమారులు స్నేహిత్, వర్షిత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ బానోతు బాలాజీ , తాళ్లగురిజాల ఎస్సై బి.రాజు పరిశీలించారు. మృతుడి తోడల్లుడు కస్పోజు సంజీవచారి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
త్రినేత్రం
వాహనాల కదలికలపై పోలీసుల దృష్టి జీపీఆర్ఎస్తో అనుసంధానం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ప్రయాణికుల భద్రత దిశగా మార్పులు అన్ని క్యాబ్‌లకు ఒకే రంగు ఆర్టీఏ, పోలీసు విభాగాల సన్నాహాలు స్వాతి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగి. విధులు ముగించుకొని వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఇంటికి వెళ్లేందుకు క్యాబ్లోకి ఎక్కింది. అందులో కొందరు ఆకతాయిలు ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఆమె ఓ నెంబర్‌కు ఫోన్ చేసింది. క్షణాల్లో క్యాబ్ ముందు పోలీస్ జీపు ఆగింది. ఆకతాయిల ఆగడాలకు బ్రేక్ పడింది. ఇదేదో కథ కాదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో నగరంలో పోలీసుల నుంచి ఈ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్యాబ్‌లను ఆశ్రయించే ప్రయాణికులు, ముఖ్యంగా యువతులు, మహిళలు క్షేమంగా ఇళ్లకు చేరేందుకు అవకాశం కలుగనుంది. సాక్షి, సిటీ బ్యూరో: ప్రయాణికులకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా తిరిగే క్యాబ్‌ల కదలికలను నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఆర్టీఏ, పోలీసు విభాగాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించేందుకు అనువైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల క్యాబ్‌లను జీపీఆర్ ఎస్తో అనుసంధానం చేయనున్నారు. వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తారు. క్యాబ్‌లపైన 24 గంటల పాటు నిఘా ఉండేవిధంగా కంట్రోల్ రూమ్ పని చేస్తుంది. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు, సందర్శకులు, ఐటీ కారిడార్లలో పని చేసే సాఫ్ట్వేర్ నిపుణులు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల క్యాబ్‌లను ఒకే విధమైన నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేవిధంగా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని క్యాబ్ సంస్థలు సొంతంగా ఇలాంటి జీపీఆర్ఎస్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. మరి కొన్ని క్యాబ్‌లు కాల్ సెంటర్ల ఆధారంగా నడుస్తున్నాయి. ఇలాంటి అన్ని రకాల క్యాబ్‌లను ఇక పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించే విధంగా సరికొత్త జీపీఆర్ఎస్తో లింక్ పెడతారు. గ్రేటర్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే క్యాబ్‌లతో పాటు, హైటెక్ సిటీ, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థలకు తిరిగే క్యాబ్‌లు, సాధారణ క్యాబ్‌లన్నీ కలిపి సుమారు 25 వేల వరకు ఉంటాయి. వీటన్నింటినీ జీపీఆర్ఎస్తో అనుసంధానిస్తారు. వచ్చే ఆగస్టు నాటికి 1000 సిటీ బస్సులను జీపీఆర్ఎస్తో అనుసంధానం చేసే వ్యవస్థకు ఆర్టీసీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మరోవైపు క్యాబ్‌లను కూడా ఇలాంటి వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు రవాణా, పోలీసు విభాగాలు తాజాగా సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణికుల రవాణాకు వినియోగించే అన్ని రకాల వాహనాలను దశల వారీగా ఇలాంటి నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. అన్ని క్యాబ్‌లు తెలుపు రంగులోకి... ప్రయాణికులు తేలిగ్గా గుర్తించేవిధంగా క్యాబ్‌ల రంగులను కూడా పూర్తిగా మార్చి వేయనున్నారు. ప్రస్తుతం క్యాబ్ సంస్థలు తమకు నచ్చిన రంగులలో వాహనాలను నడుపుతున్నాయి. ఇక నుంచి అలా కాకుండా అన్నిటినీ తెలుపు రంగులోకి మార్చి, నీలి రంగు పట్టీని (బ్లూ బ్యాండ్) ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులే కాకుండా పోలీసులు, రవాణా అధికారులు కూడా తేలిగ్గా గుర్తించే విధంగా వాహనం పైన ‘ట్యాక్సీ క్యాబ్’ అని పెద్ద అక్షరాలతో బోర్డును ఏర్పాటు చేస్తారు. డోర్లపైన కూడా ‘ట్యాక్సీ క్యాబ్’ అని రాస్తారు. డ్రైవర్లు తెలుపు రంగు యూనిఫామ్ ధరిస్తారు. ఇందుకు అనుగుణంగా మోటారు వాహనాల చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఆర్టీఏ అధికారి చెప్పారు. నిర్వహణ సంస్థలకు భారం ఆర్టీఏ, పోలీసు విభాగాలు అనుకున్నట్లుగా క్యాబ్‌లను జీపీఆర్ఎస్తో అనుసంధానిస్తే వాటి సంస్థలపైన పెద్ద ఎత్తున నిర్వహణ భారం పడే అవకాశం ఉంది. ఒక్కో వాహనంలో జీపీఆర్ఎస్ పరికరాలను అమర్చుకోవాలంటే రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. పైగా వాహ నాల రంగును కూడా పూర్తిగా మార్చవలసి ఉంటుంది. ఈ సరికొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
తిలక్, స్వాతిలకు టైటిల్స్
బెంగళూరు: వరల్డ్ 10కే బెంగళూరు రన్లో భారత్ నుంచి పురుషుల, మహిళల విభాగాల్లో బి.సి.తిలక్, స్వాతి విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఈ రేస్‌లో 10 కిలోమీటర్ల దూరాన్ని తిలక్ 30 నిమిషాల 26 సెకన్లలో... స్వాతి 37 నిమిషాల 22 సెకన్లలో అధిగమించారు. అనీష్ థాపా (30ని:38 సె), నితేంద్ర సింగ్ రావత్ (30ని:47సె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మహిళల విభాగంలో జయశ్రీ (37ని:35సె), సుప్రియా పాటిల్ (37ని:46సె) రెండు, మూడు స్థానాలను పొందారు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో జెఫ్రీ కమ్వోరర్ (కెన్యా-27ని:44 సెకన్లు)... మహిళల విభాగంలో లూసీ కబూ (కెన్యా-31ని:48 సెకన్లు) టైటిల్స్ సాధించారు. -
చెదిరిన స్వాతి కలలు
సీటు మారడం వల్లే ప్రమాదం పీటలెక్కని ప్రేమ వివాహం మృతురాలు స్వాతి దీనగాథ చెన్నై, సాక్షి ప్రతినిధి : అందరినీ అలరిస్తూ ఆటపాటలతో తడిసిముద్దచేసే ‘స్వాతి’ కలలు చెదిరిపోయూయి. తల్లిదండ్రులతో ముచ్చట్లు, బామ్మతో కబుర్లు, ప్రేమించిన వ్యక్తితో వివాహం...ఇలా ఆమె కన్నకలలను రైలు బాంబు కబళించివేసింది. ఇటీవలే చేరిన ఉద్యోగంలో విరామం తీసుకుని తల్లిదండ్రులను కలుసుకునేందుకు బెంగళూరులో బయలుదేరింది. తనను అమితంగా ప్రేమించే అవ్వకు బహుమతులు, కుటుంబ సభ్యులకు తినుబండారాలను సిద్ధం చేసుకుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోనే ఆలస్యం కావడంతో పరుగుపరుగున ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఆమెకు అప్పుడు తెలియదు తాను మృత్యుకుహరంలోనే కూర్చుంటున్నానని. తనతో పాటు రైలు ఎక్కిన చెన్నైకి చెందిన స్నేహితురాలు రజితతో కలిసి వారికి కేటాయించిన సీటు నెంబరు 9,10లో కూర్చున్నారు. అయితే ఒక కుటుంబం వచ్చి ‘ప్లీజ్ 23, 24 సీట్లలో కూర్చుంటారా’ అని అడిగింది. స్నేహశీలైన స్వాతి సంతోషంగా అంగీకరించింది. మంచి ఉద్యోగం, ఇంటివారికి బహుమతులు వారిని కలవబోతున్నామనే ఆనందం, తాను ప్రేమించిన వ్యక్తితో జరగనున్న వివాహం ఆమెను నిద్రపోనివ్వలేదు. అలాగే గుంటూరులోని వారింటిలో కూడా ఎపుడు తెల్లారుతుందా, స్వాతి వస్తుందా అని జాగారం చేశారు. సీటు మారడంతో దురదృష్టం ఆమె వెన్నంటే నిలిచింది. వారు కూర్చున్న సీటు కిందనే బాంబును అమర్చి ఉన్నారు. చెన్నై రాగానే స్నేహితురాలికి టాటా చెప్పి సాగనంపింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో స్వాతి కన్నుమూసింది. పేలుడు జరగడంతో వెంటనే వెనక్కు వచ్చిన స్నేహితురాలి రజిత కన్నీరుమున్నీరైంది. వెళ్లొస్తానని చెప్పింది... ఇలా వెళ్లిపోతుందని అనుకోలేదంటూ విలపించింది. తెల్లారగానే వచ్చిన ఫోన్‌ను అందుకున్న స్వాతి తండ్రి రామకృష్ణన్, తల్లి కామాక్షిదేవి, బామ్మ రాజ్యలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బీటెక్‌లో 91 శాతం మార్కులతో వర్సిటీ పరిధిలోనే మెరుగైన ర్యాంకును సొంతం చేసుకున్నారు. స్వాతి. చిత్రలేఖనం, కవిత, ఫొటోగ్రఫీలలో దిట్ట. బీటెక్ ఉత్తీర్ణతలో సాధించిన ఉత్సాహంతో ఎంటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్ ద్వారా బెంగళూరులో ఉద్యోగం పొందారు. పరిచయం లేని ఊరు వద్దన్నారు పెద్దలు. అందివచ్చిన తొలి ఉద్యోగం వద్దనకూడదంటూ వారికి నచ్చజెప్పి స్వాతి బెంగళూరు వెళ్లిపోయారు. జనవరిలో తొలి జీతంతో బామ్మకు సెల్‌ఫోన్ కొనిచ్చారు. ప్రతిరోజు రాత్రి స్వాతితో మాట్లాడితేగానీ నిద్రపోను, ఇక తనను నిద్రపుచ్చేదెవరని బామ్మ కన్నీరుమున్నీరయ్యూరు. కాలేజీలోనే ప్రేమ హైదరాబాద్‌లో చదువుతుండగానే తన సహ విద్యార్థిని ఆమె ప్రేమించారు. అయితే సాధారణ కుటుంబం, బాధ్యతలు ఉండటం వల్ల పెళ్లివాయిదా వేద్దామని చెప్పి అతడిని ఆమె ఒప్పించారు. ఆతను సైతం ఆనందంగా అంగీకరించాడు. ఈ దశలో ప్రేమికునికి ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే స్వాతి తన ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారుసైతం అంగీకరించారు. మరో నెలన్నర రోజుల్లో వారిద్దరి వివాహం జరిపేలా నిశ్చయించారు. చక్కనైన ఉద్యోగం, పెద్దల అనుమతితో ప్రేమించిన వ్యక్తితో వివాహం వంటి రంగుల రంగుల కలలు కంటున్న స్వాతిని రైలు బాంబు కబళించివేసింది, భవిష్యత్తుపై ఆమె కన్న కలల ఆమె దేహం మాదిరే ఛిద్రమైపోయాయి. ఆమెను అభిమానించి, ప్రేమించే వారిని కన్నీటి సంద్రంలోకి నెట్టివేశాయి. -
చెదిరిన స్వాతి కలలు
* సీటు మారడం వల్లే మృతి * పెళ్లి పీటలెక్కని ప్రేమజంట * మృతురాలు స్వాతి విషాదగాథ చెన్నై, సాక్షి ప్రతినిధి: అందరినీ అలరిస్తూ ఆటపాటలతో తడిసిముద్దచేసే ‘స్వాతి’ కలలు చెదిరిపోయూరుు. తల్లిదండ్రులతో ముచ్చట్లు, బామ్మతో కబుర్లు, ప్రేమించిన వ్యక్తితో వివాహం.. ఇలా ఆమె కన్నకలలను రైలు బాంబు కబళించివేసింది. ఇటీవలే చేరిన ఉద్యోగంలో విరామం తీసుకుని తల్లిదండ్రులను కలుసుకునేందుకు బెంగళూరు నుంచి బయలుదేరింది. తనను అమితంగా ప్రేమించే అవ్వకు బహుమతులు, కుటుంబ సభ్యులకు తినుబండారాలను సిద్ధం చేసుకుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోనే ఆలస్యం కావడంతో పరుగుపరుగున ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఆమెకు అప్పుడు తెలియదు తాను మృత్యుకుహరంలోనే కూర్చుంటున్నానని. తనతో పాటు రైలు ఎక్కిన చెన్నైకి చెందిన స్నేహితురాలు రజితతో కలిసి వారికి కేటాయించిన సీటు నెంబరు 9,10లో కూర్చున్నారు. అయితే ఒక కుటుంబం వచ్చి ఁప్లీజ్ 23, 24 సీట్లలో కూర్చుంటారా* అని అడిగింది. స్నేహశీలైన స్వాతి సంతోషంగా అంగీకరించింది. మంచి ఉద్యోగం, ఇంటివారికి బహుమతులు వారిని కలవబోతున్నామనే ఆనందం, తాను ప్రేమించిన వ్యక్తితో జరగనున్న వివాహం ఆమెను నిద్రపోనివ్వలేదు. అలాగే గుంటూరులోని వారింటిలో కూడా ఎపుడు తెల్లారుతుందా, స్వాతి వస్తుందా అని జాగారం చేశారు. సీటు మారడంతో దురదృష్టం ఆమె వెన్నంటే నిలిచింది. వారు కూర్చున్న సీటు కిందనే బాంబును అమర్చి ఉన్నారు. చెన్నై రాగానే స్నేహితురాలికి టాటా చెప్పి సాగనంపింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో స్వాతి కన్నుమూసింది. పేలుడు జరగడంతో వెంటనే వెనక్కు వచ్చిన స్నేహితురాలి రజిత కన్నీరుమున్నీరైంది. వెళ్లొస్తానని చెప్పింది... ఇలా వెళ్లిపోతుందని అనుకోలేదంటూ విలపించింది. తెల్లారగానే వచ్చిన ఫోన్‌ను అందుకున్న స్వాతి తండ్రి రామకృష్ణన్, తల్లి కామాక్షిదేవి, బామ్మ రాజ్యలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బీటెక్‌లో 91 శాతం మార్కులతో వర్సిటీ పరిధిలోనే మెరుగైన ర్యాంకును సొంతం చేసుకున్నారు. స్వాతి. చిత్రలేఖనం, కవిత, ఫొటోగ్రఫీలలో దిట్ట. బీటెక్ ఉత్తీర్ణతలో సాధించిన ఉత్సాహంతో ఎంటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్ ద్వారా బెంగళూరులో ఉద్యోగం పొందారు. పరిచయం లేని ఊరు వద్దన్నారు పెద్దలు. అందివచ్చిన తొలి ఉద్యోగం వద్దనకూడదంటూ వారికి నచ్చజెప్పి స్వాతి బెంగళూరు వెళ్లిపోయారు. జనవరిలో తొలి జీతంతో బామ్మకు సెల్‌ఫోన్ కొనిచ్చారు. ప్రతిరోజు రాత్రి స్వాతితో మాట్లాడితేగానీ నిద్రపోను, ఇక తనను నిద్రపుచ్చేదెవరని బామ్మ కన్నీరుమున్నీరయ్యూరు. కాలేజీలోనే ప్రేమ హైదరాబాద్‌లో చదువుతుండగానే తన సహ విద్యార్థిని ఆమె ప్రేమించారు. అయితే సాధారణ కుటుంబం, బాధ్యతలు ఉండటం వల్ల పెళ్లివాయిదా వేద్దామని చెప్పి అతడిని ఆమె ఒప్పించారు. ఆతను సైతం ఆనందంగా అంగీకరించాడు. ఈ దశలో ప్రేమికునికి ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే స్వాతి తన ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారుసైతం అంగీకరించారు. మరో నెలన్నర రోజుల్లో వారిద్దరి వివాహం జరిపేలా నిశ్చయించారు. చక్కనైన ఉద్యోగం, పెద్దల అనుమతితో ప్రేమించిన వ్యక్తితో వివాహం వంటి రంగుల రంగుల కలలు కంటున్న స్వాతిని రైలు బాంబు కబళించివేసింది, భవిష్యత్తుపై ఆమె కన్న కలల ఆమె దేహం మాదిరే ఛిద్రమైపోయాయి. ఆమెను అభిమానించి, ప్రేమించే వారిని కన్నీటి సంద్రంలోకి నెట్టివేశాయి. -
పేలుళ్ల విచారణ వేగవంతం
* ఊహా చిత్రాలు సిద్ధం * జాతీయ భద్రతా దళాల రాక * బెంగళూరు, పాట్నాలకు సీబీసీఐడీ * నకిలీ చిరునామాతో రిజర్వేషన్లు చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుళ్ల ఘటన దోషులను పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేశారు. సీబీసీఐడీ పోలీసులు బెంగళూరు, పాట్నాలకు బయలుదేరి వెళ్లారు. కేంద్రం నుంచి జాతీయ భద్రతా దళం కూడా శుక్రవారం చెన్నైకి చేరుకుంది. రైలులోని రెండు బోగీల్లో జరిగిన పేలుళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన స్వాతి (24) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృత్యువాతపడగా, 14 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. సంఘటన జరిగిన గురువారం నుంచే విచారణ ప్రారంభమైంది. ఈ పేలుళ్ల కుట్రను ఛేదించేందుకు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు ఏర్పాటైన సీబీసీఐడీ విచారణ బృందం రెండుగా ఏర్పడి బెంగళూరు, పాట్నాలకు శుక్రవారం వెళ్లింది. సంఘటన జరిగి 24 గంటలు దాటినా ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఇది తమ చర్య అని చాటుకోలేదు. అయితే ఐఎస్ఐ, ఇండియన్ ముజాహిద్దీన్, అల్ ఉమా సహా పలు తీవ్రవాద సంస్థల పనేనని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. పేలుళ్లు జరిగిన సమయంలో విధుల్లో ఉన్న రైల్వే కార్మికులను, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ప్రయాణికులను విచారిస్తున్నారు. పాట్నాలో మోడీ ఎన్నికల సభ నిర్వహించినపుడు పేలిన బాంబులు, బోగీల్లో పేలిన బాంబులు ఒకే రకమని గుర్తించారు. ఈ కారణంగానే ఒక విచారణ బృందం పాట్నాకు వెళ్లింది. ప్రైవేటు ట్రావెల్స్ ఏజన్సీల ద్వారా నకిలీ అడ్రసుతో తత్కాల్ టికెట్ రిజర్వు చేసుకున్న వారికోసం గాలిస్తున్నారు. రాష్ట్రం నుంచి తత్కాల్ రిజర్వేషన్ చేసుకున్నవారి వివరాలు సేకరించేందుకు రిజర్వేషన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో అనేక ప్రైవేటు ట్రావెల్స్ వారు తాళాలు వేసి పారిపోయారు. బాంబులు పేలిన బోగీలో రిజర్వేషన్ చేసుకున్న ఒక వ్యక్తి ఎస్-6లో ప్రయాణం చేశాడు. అతని ఫోన్ నెంబరు కూడా తప్పుగా ఉండడంతో అతన్ని కూడా అనుమానిస్తున్నారు. పేలుళ్లు జరిగిన రైలులో చెన్నై వరకు ప్రయాణించిన వారి ఇళ్లకు వె ళ్లి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం చెన్నైకి చేరుకున్న జాతీయ భద్రత దళం అధికారులు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని, బోగీలను తనిఖీ చేశారు. సెంట్రల్ స్టేషన్, 9వ నెంబరు ప్లాట్‌ఫాంలోని సుమారు 80 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణకు ఇబ్బందులు తలెత్తకుండా 9వ నెంబరు ఫ్లాట్‌ఫాంకు సీల్‌వేసి సాయుధ పోలీసులతో బందోబస్తు పెట్టారు. పేలుళ్లు జరిగిన బోగీల్లోని ప్రయాణికుల సహకారంతో కంప్యూటర్ ద్వారా నిందితుల ఊహాచిత్రాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. -
చెప్పుతో కొట్టారన్న మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య
దంపతులు సహా ఇద్దరు పిల్లల బలవన్మరణం ఆర్థిక ఇబ్బందులు కూడా మరో కారణం అంటున్న స్థానికులు ఆత్మహత్యకు కారకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు లాలాపేట, న్యూస్‌లైన్ : ఓ వ్యక్తి చెప్పుతో కొట్టిందని మనస్తాపానికి గురైన ఓ నిండు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం లాలాగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నారుల మృతదేహాలను చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్లో పేర్కొన్న విషయాలు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. తార్నాక డివిజన్ శాంతినగర్, ఆర్యానగర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్(33) భార్య స్వాతి(29) ఇద్దరు కుమార్తెలు వర్షిత(05) అక్షయ కృప(03)లతో అద్దె ఇంట్లో మూడవ అంతస్తులో ఉంటున్నారు. ప్రవీణ్‌కుమార్ కొంత కాలం ఓ ఎలక్ట్రానిక్ చానల్లో ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా పనిచేసి మానేశాడు. ప్రస్తుతం ఓ యాడ్ ఎజెన్సీలో కన్స్ల్టెంట్గా ఉన్నాడు. స్వాతి ఇంట్లో టైలర్ పని చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. మృతుడికి వరుసకు పెద్దమ్మ (అనసూయ), అక్క (నాగలత) ఇదే భవనం కింది అంతస్తులో ఉంటున్నారు. వీరికి, స్వాతికి మధ్య మూడు రోజుల కిందట ఘర్షణ జరిగింది. పిల్లల మధ్య జరిగిన తగాదా విషయమై వీరు గొడవపడ్డారు. దీనిపై మంగళవారం సమావేశం ఏర్పాటుచేసిన ఆర్యనగర్ పంచ్కమిటీ సభ్యులు పెద్దమనుషులుగా ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తుండగా.. వారి ముందే అనసూయ, స్వాతిని చెప్పుతో కొట్టారు. ఈ ఘటనతో ప్రవీణ్‌కుమార్, స్వాతి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయమై మరోసారి ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లను తాడుతో గొంతు బిగించి చంపి బెడ్రూంలో బెడ్‌పై పడుకోబెట్టి, పక్క గదిలో భార్యాభర్తలు స్లాబ్‌కు ఉన్న ఇనుప కోక్కాలకు చెరొకవైపు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్ కూతురు వర్షిత, సోదరుడి కూతురు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ప్రతిరోజు ఉదయం వారు కలిసే స్కూల్‌కు వెళ్తారు. గురువారం ఉదయం పాఠశాల సమయం మించిపోతున్నప్పటికి వర్షిత పాఠశాలకు రాకపోవడంతో సోదరుడు సుజీత్‌కుమార్ భవనం మూడవ అంతస్తులో ఉంటున్న ప్రవీణ్‌కుమార్ ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో అనుమానం వచ్చిన సుజీత్‌కుమార్ కిటికిలోంచి చూడగా అన్నా, వదిన వేలాడుతూ కన్పించారు. దీంతో బోరున విలపిస్తూ 100కి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు లాలాగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా బెడ్‌పై, భార్యభర్తలు ఉరికి వేలాడుతూ కనిపించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లాలాగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. స్వాతితో ఘర్షణ పడ్డ అనసూయ, నాగలతలను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చే శామన్నారు. కాగా గత కొంతకాలంగా ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతోందని.. ఆత్మహత్యకు అదీ ఒక కారణం కావచ్చని స్థానికులు చెబుతున్నారు. -
సినిమా రివ్యూ: బంగారు కోడిపెట్ట
టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నవదీప్, స్వాతి నటించిన 'బంగారు కోడిపెట్ట' శుక్రవారం విడుదలైంది. 'బోణి' చిత్రంతో పరిచయమైన రాజ్ పిప్పళ్ల దీనికి దర్శకుడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఎనర్జీ డ్రింక్ కంపెనీలో వంశీ (నవదీప్) భాను (స్వాతి) పనిచేస్తుంటారు. ప్రమోషన్ వస్తుందని ఆశతో ఉన్న భాను బాస్ ప్రవర్తన కారణంగా ఉద్యోగం కోల్పోతుంది. అనుకోకుండా భానుకు డబ్బు అవసరమవుతుంది. డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎనర్జీ డ్రింక్ కంపెనీ వినియోగదారులకు అందించేందుకు పంపే బంగారు బిస్కట్, కాయిన్స్ ను కాజేయాలని ప్లాన్ వేస్తుంది. గోల్డ్ బిస్కట్, కాయిన్స్ ను కాజేసేందుకు వంశీని భాగస్వామిగా పెట్టుకుంటుంది. భానుకి డబ్బు ఎందుకు అవసరమైంది? దొంగతనం చేసే క్రమంలో వంశీకి ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు గోల్డ్ బిస్కట్, కాయిన్స్ ను భాను, వంశీలు విజయవంతంగా దోచుకున్నారా? అనే ప్రశ్నలకు జవాబు 'బంగారు కోడిపెట్ట'. అయితే ఈ కథకు 'బంగారు కోడిపెట్ట' టైటిల్ సంబంధమేమిటని ఆలోచిస్తే.. ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే తెరపైన సమాధానం దొరుకుతుంది. నవదీప్ నటించిన వంశీ పాత్రలో కొత్తదనమే కనిపించదు. ప్రేక్షకులను ఆకట్టుకునే రేంజ్ లో క్యారెక్టర్ ను డిజైన్ చేయకపోవడంతో నవదీప్ చేయాల్సిందేమీ లేకపోయింది. ఇక భాను పాత్రలో అల్లరి, కొంటె పిల్లగా కనిపించినా.. స్వాతి మెప్పించలేకపోయింది. కథలో ఉండే పరిమితుల వల్ల భాను, వంశీ పాత్రలు గొప్పగా ఎస్టాబ్లిష్ కాలేకపోయాయి. కథలో భాగంగా వచ్చే దొరబాబు, ఎర్రబాబు (స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్) పాత్రలు కొంత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తాయి. కానీ కథలో పసలేకపోవడంతో వీరిద్దరి ఫెర్మార్మెన్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎనర్జీ డ్రింక్ కంపెనీ మేనేజర్ గా విలన్ షేడ్ ఉన్న పాత్రలో రచయిత హర్షవర్ధన్ కనిపించారు. హర్షవర్దన్ నటన కూడా అంతంతమాత్రంగానే ఉంది. కథలో కొత్తదనం లేకుండా 'బంగారు కోడిపెట్ట'ను పట్టుకుని దర్శకుడు రాజ్ పిప్పళ్ల మరోసారి సాహసమే చేశాడని చెప్పవచ్చు. బోణీతో ఆకట్టుకోలేకపోయిన రాజ్ పిప్పళ్ల.. కథ, కథనాన్ని గాలికి వదిలేసి మరోసారి నిరాశపరిచారనే చెప్పవచ్చు. రొటీన్ కు భిన్నంగా చిత్రాన్ని రూపొందించినట్టు చిత్ర సన్నివేశాల్ని ఆరంభించినా.. కాసేపటికే విషయం లేదని సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. పూర్తి చిత్రంలో రామ్, లక్ష్మణ్ ఎపిసోడ్ లో పాప సీన్లు, సినీ నటుడు కావాలని ప్రయత్నించే పిజా బాయ్ (సంతోష్) పాత్రలు కొంత పర్వాలేదనిపిస్తోంది. కథ, కథనాలపై మరికొంత శ్రద్ధ వహించి ఉంటే ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకునేది. ఇక ఈ చిత్రంలో సాహిర్ రజా ఫోటోగ్రఫి, మహేశ్ శంకర్ సంగీతం పర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. కథనం పేలవంగా ఉన్న కారణంగా ఎడిటింగ్ కు చంద్రశేఖర్ మరింత పదను పెడితే కొంత ఆసక్తి కలిగించేదేమో. టాలీవుడ్ లో సరైన హిట్ కోసం నవదీప్, స్వాతి, దర్శకుడు రాజ్ పిప్పళ్లకు ఈ కోడిపెట్ట బంగారు గుడ్డు అందించడం కష్టమే. -రాజబాబు అనుముల -
రక్తదానం కాన్సెప్ట్‌తో...
‘‘తమిళంలో ఈ సినిమా నేనే చేయాలి. కథను జడ్జ్ చేయలేక వదులుకున్నాను. రక్తదానం కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఇందులో ఒక పాట పాడాను’’అని సందీప్ కిషన్ చెప్పారు. విజయ్ సేతుపతి, ‘కలర్స్’ స్వాతి, అశ్విన్, నందిత ముఖ్య తారలుగా గోకుల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని ‘ఇదేగా ఆశపడ్డావ్’ పేరుతో తెలుగులో అనువదించారు సమన్యరెడ్డి, సుజన్. సిద్దార్థ్ విపిన్ స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని దర్శకుడు హరీష్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘కలర్స్’ స్వాతి మాట్లాడుతూ -‘‘ఇందులో హీరో హీరోయిన్లు ఉండరు. అన్నీ పాత్రలే ఉంటాయి’’ అన్నారు. తెలుగులో దీన్ని రీమేక్ చేస్తే తానొక పాత్ర చేయాలనుకున్నానని నిఖిల్ తెలిపారు. విజయ్ సేతుపతి మంచి ఆర్టిస్ట్ అని, టైటిల్ బావుందని హరీష్ శంకర్ పేర్కొన్నారు. రాహుల్, రఘుబాబు, మహత్, నందిత, సంపూర్ణేష్‌బాబు తదితరులు మాట్లాడారు. -
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
గుత్తి, న్యూస్‌లైన్ : మూడు రోజుల క్రితం అదృశ్యమైన పట్టణంలోని కోట వీధికి చెందిన డిగ్రీ విద్యార్థిని స్వాతి(20) బుధవారం తన ఇంటి పక్కనున్న పాడుబడిన బావిలో శవమై తేలింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట వీధిలో నివసిస్తున్న మాజీ సైనికోద్యోగి దస్తగిరి, వరలక్ష్మి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు కాగా ముగ్గురికి పెళ్లిళ్లు చేశాడు. మిగతా ఇద్దరిలో స్వాతి పట్టణంలోని ఎంఎస్ డిగ్రీ కాలేజ్‌లో దూరవిద్య ద్వారా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. మరో కూతురు కూడా స్థానిక శ్రీసాయి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ అభ్యసిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి స్వాతి కనిపించడం లేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పలుచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్వాతి అక్క నీరజ తమ ఇంటి పక్కన ఉన్న పాడుబడిన బావిలోకి కసువు వేసేందుకు వెళ్లింది. అందులో కసువు వేస్తూ తొంగి చూడగా స్వాతి శవం తేలి ఉండడాన్ని చూసింది. ఆమె కేకలు విన్న బావి పక్కనే ఉన్న ఇళ్లలోని వారు, మృతురాలి కుటుంబ సభ్యులు పరుగున వచ్చారు. స్వాతి మృతదేహం చూసి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో ట్రెయినీ డీఎస్పీ ఉషారాణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్వాతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనిస్నేహితులు, సన్నిహితులు అంటున్నారు. కాగా పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ డీఎస్పీ చెప్పారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణం
మలేసియాటౌన్‌షిప్, న్యూస్‌లైన్: ప్రియుడి తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించడంలేదని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం... నిజాంపేటలో ఉండే కృష్ణమోహన్ కుమార్తె స్వాతి (26) బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. శనివారం ఉదయం 10 గంటల సమయంలో స్నానం చేయడానికి తన బెడ్రూంలోకి వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు. గమనించిన తల్లి తలుపు తట్టినా తెరచుకోలేదు. దీంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగ స్వాతి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతురాలి తల్లిదండ్రులను విచారించగా... ఇటీవల కొండాపూర్‌కు చెందిన ఓ యువకుడితో స్వాతికి పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. స్వాతి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించగా.. అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన స్వాతి బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా ఇద్దరి మనసు
చిరుసాయి, కృష్ణ, జయంతి, స్వాతి ముఖ్య తారలుగా.. ఉమా పరమేశ్వర్ దర్శకత్వంలో ఆకుల సత్యనారాయణ, నందకిషోర్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. తొలి దృశ్యానికి పి. సత్యారెడ్డి క్లాప్ ఇవ్వగా, వి. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. డా. డి. రామానాయుడు యూనిట్ సభ్యులకు ఆశీస్సులు అందజేశారు. నిర్మాతల్లో ఒకరైన ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘ఇదే సంస్థపై నిర్మించిన ‘ఎంఎల్ఎ భరత్’ త్వరలో విడుదల కానుంది. తాజా చిత్రం షూటింగ్‌ని మూడు నెలలో పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘స్నేహితులను స్నేహంగా, ప్రేమికులను ప్రేమికులుగా చూడాలనే కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. మంచి పాటలు రాయడానికి స్కోప్ ఉందని వేల్పుల వెంకటేష్ చెప్పారు. మంచి పాత్రలు చేస్తున్నామని చిరుసాయి, కృష్ణ, స్వాతి తెలిపారు. -
కుర్రకారుకి తొందరెక్కువ
రఘు, స్వాతి జంటగా తమిళంలో రూపొందిన ‘రాట్టినం’ చిత్రం ‘కుర్రకారుకి తొందరెక్కువ’ పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. సత్యదేవ పిక్చర్స్ అధినేత ఆర్. సత్యనారాయణ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘దర్శకుడు తంగస్వామి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. నేటి తరానికి కావల్సిన అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్న సినిమా. కరెక్ట్‌గా చెప్పాలంటే అమ్మ చేతి కమ్మని వంటలా ఉంటుంది. నటీనటులు కొత్తవాళ్లయినప్పటికీ బాగా యాక్ట్ చేశారు. మనూ రమేష్ మంచి పాటలిచ్చారు. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. తమిళంలోలానే తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో పాల్గొన్న వి. సాగర్, ప్రసన్నకుమార్ సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.