సీఎస్‌ను కలసిన అఖిలపక్ష నేతలు, నరేశ్ తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్న అంబోజి నరేశ్, స్వాతిలను హత్య చేసిన నేరస్తులను శిక్షించాలని, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ చట్టం తీసుకురావాలని పౌర, సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో అఖిలపక్ష నేతలు, అంబోజి నరేశ్ తల్లిదండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ.. సీఎస్ ఎస్‌పీ సింగ్‌ను కలసి వినతిప్రతం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నరేశ్ హత్య కేసుతోపాటు స్వాతి హత్య కేసునూ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు పట్ల నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హంత కుడైన శ్రీనివాస్‌రెడ్డి ఆస్తులు, భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, నరేశ్ తండ్రికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల భూమి, రక్షణ కల్పించాలన్నారు.