మా ఇద్దరి మనసు | Maa Iddari Manasu Movie Opening | Sakshi
Sakshi News home page

మా ఇద్దరి మనసు

Published Mon, Sep 16 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

మా ఇద్దరి మనసు

మా ఇద్దరి మనసు

చిరుసాయి, కృష్ణ, జయంతి, స్వాతి ముఖ్య తారలుగా.. ఉమా పరమేశ్వర్ దర్శకత్వంలో ఆకుల సత్యనారాయణ, నందకిషోర్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. తొలి దృశ్యానికి పి. సత్యారెడ్డి క్లాప్ ఇవ్వగా, వి. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. 
 
 డా. డి. రామానాయుడు యూనిట్ సభ్యులకు ఆశీస్సులు అందజేశారు. నిర్మాతల్లో ఒకరైన ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘ఇదే సంస్థపై నిర్మించిన ‘ఎంఎల్‌ఎ భరత్’ త్వరలో విడుదల కానుంది. తాజా చిత్రం షూటింగ్‌ని మూడు నెలలో పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. 
 
 ‘‘స్నేహితులను స్నేహంగా, ప్రేమికులను ప్రేమికులుగా చూడాలనే కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. మంచి పాటలు రాయడానికి స్కోప్ ఉందని వేల్పుల వెంకటేష్ చెప్పారు. మంచి పాత్రలు చేస్తున్నామని చిరుసాయి, కృష్ణ, స్వాతి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement