jayanti
-
మానవతకు ప్రతిరూపం
మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకా నందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గ రెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివే దిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో మరణించిన సిస్టర్ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.– సాకి ‘ 99511 72002(నేడు సిస్టర్ నివేదిత జయంతి) -
ప్రధానిగా ఉంటూ కుమారుని ప్రమోషన్ అడ్డుకున్న శాస్త్రి
నేడు ఇద్దరు మహనీయుల పుట్టినరోజు. మహాత్మా గాంధీతో పాటు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా అక్టోబర్ 2నే జన్మించారు. శాస్త్రి 1904 అక్టోబర్ 2న యూపీలోని మొగల్‌సరాయ్‌లో జన్మించారు. శాస్త్రి తన జీవితాంతం సామాన్యుల అభివృద్ధికి పాటుపడ్డారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో శాస్త్రి ప్రధాన పాత్ర పోషించారు. నెహ్రూ తర్వాత భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు.అవినీతికి వ్యతిరేకంగా లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్న నిర్ణయాలు అతనిలోని నిజాయితీని ప్రతిబింబిస్తాయి. శాస్త్రిలోని వినయపూర్వక స్వభావం, సరళత్వం, నిజాయితీ, దేశభక్తి అందరికీ స్ఫూర్తినందిస్తాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తన కుమారుని ప్రమోషన్‌ను నిలిపివేశారు. తన కుమారుడు అక్రమంగా ఉద్యోగంలో పదోన్నతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న శాస్త్రి అందుకు అడ్డుపడ్డారు. కుమారునికి పదోన్నతి కల్పించిన అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని నాటి తరం నేతలు చెబుతుంటారు.లాల్ బహదూర్ శాస్త్రి కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు ఏదో ప్రభుత్వ పనిమీద కలకత్తా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన కారు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. కొద్దిసేపటిలో ఆయన డిల్లికి వెళ్లాల్సిన ఫ్లైట్ ఉంది. ఈ పరిస్థితిని గమనించిన నాటి పోలీస్ కమిషనర్ ఒక ఐడియా చెప్పారు. శాస్త్రి ప్రయాణిస్తున్న కారుకు సైరన్‌తో కూడిన ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. అయితే శాస్త్రి అందుకు నిరాకరించారు. అలా చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక.. -
గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
-
స్వేచ్ఛ కోసం విప్లవించి...
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ పంథాలో పనిచేసి దేశానికి ప్రాణాలు అర్పించినవారిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. 1906 జూలై 23న మధ్యప్రదేశ్ లోని బాబానగర్‌లో ఆయన జన్మించారు. అయితే ఆయన పూర్వీకులు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు కావడంతో తల్లిదండ్రులు కాశీ విద్యా పీఠంలో సంస్కృత విద్యను అభ్యసించడానికి ఆయన్ని చేర్చారు.అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమానికి ఆకర్షితుడై 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తాను చదువుకుంటున్న సంస్కృత విద్యాపీఠం ముందే ధర్నా చేశాడు. పోలీ సులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ‘నీ పేరేమిటి?’ అన్న జడ్జి ప్రశ్నకు ఆ 15 ఏళ్ల బాలుడు ‘ఆజాద్’ (స్వేచ్ఛ) అని సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి అతడి పేరులో ఆజాద్ భాగమయ్యింది. ఇటువంటి సమాధానాలకు అతడికి 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు జడ్జి.పెద్దవాడవుతున్న కొద్దీ అహింసా మార్గంలో దేశా నికి స్వాతంత్య్రం రాదని ఆయన నమ్మాడు. భగత్‌సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లాఖాన్లతో మైత్రి ఏర్పడింది. వీరంతా కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’ అనే విప్లవ సంస్థను స్థాపించారు. వారి పోరాటానికి అవసరమైన వనరులను సమకూర్చు కోవడానికి 1925లో కకోరి వద్ద బ్రిటిష్ ప్రభుత్వ ధనాన్ని తరలిస్తున్న రైలును ఆపి దోపిడీ చేశారు.ఈ కేసులో అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ లాంటివారిని పట్టు కుని ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆజాద్ అజ్ఞాతంలోకి వెళ్లి పనిచేయ సాగాడు. 1931 ఫిబ్రవరి 27 ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఆల్ఫ్రెడ్ పార్కు’లో ఆజాద్ ఉన్నాడని తెలిసిన పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్ తన తుపాకితో వీరోచి తంగా పోరాడి చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకొని పోలీసులకు ప్రాణా లతో చిక్కకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాడు. అలా స్వతంత్ర భారత యజ్ఞంలోస్వీయ సమిధయ్యాడు. – ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు -
అల్లూరి జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజుకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘స్వాతంత్ర్య సమర యోధుడు.. బ్రిటీష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవ వీరుడు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పోరాటాలు, ఆయన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.స్వాతంత్ర్య సమర యోధుడు.. బ్రిటీష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవ వీరుడు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పోరాటాలు, ఆయన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టుకున్నాం. నేడు ఆల్లూరి సీతారామరాజు గారి…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2024 -
మన్యం విప్లవ జ్యోతి..
భారత స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పథాన్ని అనుసరించి పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు అగ్రగణ్యుడు. విశాఖ జిల్లా పాండ్రంకిలో జన్మించిన ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ విద్యతో పాటు యుద్ధ విద్య, జ్యోతిష్యం వంటివాటిని అభ్యసించాడు. తరువాత దేశ సంచారం చేసి దేశంలో ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని విశాఖ జిల్లా కృష్ణదేవిపేట వచ్చి మన్యంలో తిరుగుబాటు మొదలుపెట్టాడు.కవర్డు, హైటర్ వంటి అధికారులను సీతారామరాజును మట్టు పెట్టటానికి మన్యం పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. లోతుగడ్డ వాగు దగ్గర సీతారామరాజు ఉన్నాడని తెలుసుకొని, 300 మంది పటాలంతో వాళ్లు బయలుదేరారు. ముందుగానే వారి రాకను పసిగట్టిన సీతా రామరాజు విలువిద్యలో ఆరితేరిన గోకిరి ఎర్రేసు, గాము గంటం దొర, మల్లు దొర, పడాలు అగ్గిరాజువంటి వారితో కలిసి గొరిల్లా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇరుకైన మార్గంలో వస్తున్న కవర్డ్, హైటర్లు సీతారామరాజు దళం దెబ్బకు పిట్టల్లా రాలిపోయారు. ఇది రామరాజు మొదటి విజయం. దీంతో రామరాజు తలమీద బ్రిటిష్ గవర్నమెంట్ 10 వేల రివార్డు ప్రకటించింది.అయితే ఈ దాడిలో మల్లు దొరకు తుపాకీ గుండు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు రామరాజు బ్రిటిష్ వారితో పోరాడాలంటే విల్లంబులు చాలవనీ, తుపాకులు కావాలనీ భావించాడు. తుపాకుల కోసం ఎవరి మీద దాడి చేయకుండా, పోలీస్ స్టేషన్లో తుపాకులను, మందుగుండు సామగ్రిని కొల్లగొట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అన్నవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లకు ఒకదాని తరువాత మరొకదానికి మిరపకాయ టపా పంపి తాను స్టేషన్‌పై దాడికి వస్తున్నట్లు తెలిపి మరీ తుపాకులను దోచుకున్నాడు. పోలీస్ రికార్డుల్లో తాను ఎన్ని తుపాకులు తీసుకువెళ్తున్నాడో ఆ వివరాలన్నీ రాసి కింద ‘శ్రీరామరాజు’ అని సంతకం చేశాడాయన.గుంటూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న రూథర్‌ఫర్డ్‌ను సీతారామరాజును అణచడానికి విశాఖ జిల్లాకు పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదే సమయంలో పరమ నీచుడైన బ్రిటిష్ మేజర్ గుడాల్, గిరిజన గూడేలపై పడి ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తూ పసిపిల్లలను వధించటం, భార్యల ఎదుటే భర్తను చంపటం, గిరిజన గూడేలను తగలబెట్టడం లాంటి చర్యలకు ఒడిగట్టాడు. ఇది సీతారామరాజుకి తెలిసి, తన వల్ల అమాయకులైన గిరిజన జనం చనిపోవడం, ఇబ్బందులపాలు కావడం ఇష్టంలేక లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యలో గుడాల్ మాటు వేసి, తన సైన్యంతో సీతారామరాజును బంధించాడు. ఆయన్ని నులక మంచానికి కట్టి, నానా హింసలు పెట్టి, వీధుల్లో ఊరేగించి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక విప్లవ జ్యోతి అమరదీపమై దేశ స్వాతంత్రోద్యమానికి దారి చూపింది. – పొత్తూరి సీతారామరాజు, కాకినాడ (నేడు అల్లూరి సీతారామరాజు జయంతి) -
అంబేద్కర్ సాధించిన అద్భుత విజయాలు
నేడు అంబేద్కర్ జయంతి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో ఒక దళిత మహర్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బి ఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ అంబేద్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే. నిజానికి అంబేద్కర్ ఇంటిపేరు అంబావ్డేకర్ (మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం ‘అంబవాడే’ పేరు నుండి వచ్చింది). అయితే అతని గురువు మహదేవ్ అంబేద్కర్ ఇంటిపేరును ‘అంబావ్డేకర్’ నుండి ‘అంబేద్కర్’గా పాఠశాల రికార్డులలో మార్చారు. అంబేద్కర్ మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్లో పనివేళలను 12 గంటల నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు. బాబా సాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్‌లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. అతని తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకనిగా పేరుగాంచారు. పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొలంబియా యూనివర్శిటీలో ఉన్న మూడేళ్లలో, అంబేద్కర్ ఆర్థికశాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో ఆరు, ఫిలాసఫీలో ఐదు, హ్యుమానిటీస్‌లో నాలుగు, పాలిటిక్స్‌లో మూడు, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మన్లలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు. 1995లో అంబేద్కర్ రాసిన ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్, బీహార్లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తరువాత 2000లో ఈ ప్రాంతాల విభజన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్. హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ తదితన తొమ్మిది భాషల్లో అంబేద్కర్‌కు పరిజ్ఞానం ఉంది. ఇంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మక అధ్యయనం చేశాడు. బుద్ధ భగవానుడు కళ్లు తెరిచి చూస్తున్న మొదటి చిత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారు. అంతకు ముందు బుద్ధ భగవానునికి చెందిన పలు చిత్రాలు కళ్లు మూసుకున్న తీరులో ఉండేవి. -
అంబేద్కర్‌కు యూపీ సీఎం నివాళులు!
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు. షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగుస్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. వివక్ష లేని, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని సీఎం యోగి పేర్కొన్నారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ నగరంలో జన్మించారు. ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. -
సోషల్ జస్టిస్‌కు నిలువెత్తు సాక్ష్యం..
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు స్ఫూర్తి సామాజిక న్యాయ మహా శిల్పం రూపంలో సగర్వంగా నిలిచింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానం 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేయడం విశేషం. అలాగే 81 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పీఠం(ఫెడస్టల్)పై 125 అడుగుల ఎత్తుగల ఈ అంబేడ్కర్ కాంస్య విగ్రహం కొలువై ఉంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్(సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తామని స్థలం ఎంపిక చేసి కనీస కార్యాచరణ లేకుండా గాలికొదిలేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం చెప్పింది చేసి చూపించేలా సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. దేశీయంగా తయారైన ఈ కాంస్య విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినది, దేశంలోని మతాతీత విగ్రహాల్లో ఇదే అతి పెద్దది కావడం మరో విశేషం. అంతటి స్ఫూర్తివంతమైన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో అంబేడ్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు శనివారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌కు లోబడి నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు, సామాజికవేత్తలు, అంబేడ్కర్ వాదులు విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు. దర్శనీయక్షేత్రంగా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలకు అందించేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ప్రముఖ దర్శనీయ క్షేత్రంగా అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో విజయవాడ నగర నడిబొడ్డున చరిత్రాత్మక స్వరాజ్ మైదానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడక కోసం ఈ ప్రాంతాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. పచ్చని ప్రకృతి ప్రతిబింబించేలా సౌందర్యవంతంగా దీనిని తీర్చిదిద్దారు. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంతంలో మరెన్నో ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చి్రల్డన్స్ ప్లే ఏరియా, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్ వేస్తో సహా మొత్తం ప్రాంతాన్ని తీర్చిదిద్దడం విశేషం. -
ఛత్రపతి శివాజీ శౌర్యానికి మారుపేరని ఎందుకంటారు?
ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలోని బంగారు పుటలలో నిక్షిప్తమయ్యాయి. భారతదేశంలో శివాజీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటికీ ఛత్రపతి శివాజీని శౌర్యానికి ప్రతీకగా చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతియేటా ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు. శివాజీ 1630, ఫిబ్రవరి 19న శివనేరి కోటలోని మరాఠా కుటుంబంలో జన్మించాడు. శివాజీ పూర్తి పేరు శివాజీ భోంస్లే. అతని తండ్రి పేరు షాజీ భోంస్లే, తల్లి పేరు జిజియాబాయి. శివాజీ తండ్రి అహ్మద్‌నగర్ సుల్తానేట్‌లో పనిచేసేవారు. శివాజీ తల్లికి మతపరమైన గ్రంథాలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఇదే శివాజీ జీవితంపై ప్రభావం చూపింది. మహారాజ్ శివాజీ జన్మించిన కాలంలో దేశంలో మొఘలుల దండయాత్ర కొనసాగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 15 ఏళ్ల వయసులో మొఘలులపై తన మొదటి దాడిని చేశాడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమే ఈ దాడి జరిగింది. దీనినే గెరిల్లా వార్ఫేర్ విధానం అంటారు. శివాజీ ఈ కొత్త తరహా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించారు. గెరిల్లా వార్ఫేర్ సూత్రం ‘హిట్ అండ్ రన్‌వే’. శివాజీ బీజాపూర్‌పై తన గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో దాడిచేసి అక్కడి పాలకుడు ఆదిల్షాను ఓడించి, బీజాపూర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674లో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఈ సమయంలోనే శివాజీ అధికారికంగా మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీని ‘మరాఠా గౌరవ్’ అని కూడా పిలిచేవారు. శివాజీ తీవ్ర అనారోగ్యంతో 1680 ఏప్రిల్ 3న కన్నుమూశాడు. అనంతరం ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. -
సుభాష్ చంద్రబోస్ ఏం చదువుకున్నారు? ఐసీఎస్ ఎందుకు వద్దన్నారు?
నేడు (జనవరి 23) స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. బోస్ పుట్టిన రోజును శౌర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2021లో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విద్యార్హతలు ఏమిటి? ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, బోస్ ఎందుకు ఆ ఉద్యోగంలో చేరలేదో తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897, జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్లోని కటక్‌లో జన్మించారు. బోస్ తన తల్లిదండ్రులకు తొమ్మిదవ సంతానం. బోస్ నాటి కలకత్తాలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. బోస్ కేవలం తన 24 ఏళ్ల వయసులో ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత ఉద్యోగాల అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, బ్రిటీష్ వారికి బానిసగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యోగంలో చేరలేదు. బోస్ స్వాతంత్ర్య పోరాటంలో కాలుమోపేందుకు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి, నాటి ప్రముఖ నేత చిత్తరంజన్ దాస్‌తో జతకట్టారు. 1921లో చిత్తరంజన్ దాస్‌కు చెందిన స్వరాజ్ పార్టీ ప్రచురించే ‘ఫార్వర్డ్’ అనే వార్తాపత్రికకు సంపాదకత్వ బాధ్యతలను బోస్ స్వీకరించారు. 1920 నుంచి 1942 వరకు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఆవిష్కరింపజేసే ‘ది ఇండియన్ స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని బోస్ రచించారు. బోస్ 1939లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే కొంతకాలానికే బోస్ ఆ పదవికి రాజీనామా చేశారు. నేతాజీ తన జీవితకాలంలో 11 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఇది కూడా చదవండి: స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు? -
మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్ రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు. ‘‘మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశాం. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇంద్రధనస్సులా అందరం కలిసే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు.. మనందరిది. ప్రతి అడుగులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుని వెళ్తున్నాం. వివిధ పథకాల ద్వారా రూ. 2.5 లక్షల కోట్లకు పైగా నగదు అందజేశాం. చంద్రబాబు హయాంలో మైనార్టీల సంక్షేమానికి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మన ప్రభుత్వంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశాం. విజయవాడ నుంచి హజ్‌యాత్రకు వెళ్తే అవకాశం కల్పించాం. అదనపు భారం పడకుండా రూ.14 కోట్లు మన ప్రభుత్వం చెల్లించింది. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనం అందిస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా.. -
స్వాతంత్రం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు?
అక్టోబర్ 2 గాంధీ జయంతిగా జరుపుకుంటారు. భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ 1869, అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ. బాపూజీ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులను ఏకంచేసి, అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్యమైన భూమికను అందించారు. భారతదేశంలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మోహన్‌దాస్ అనంతరం ఇంగ్లండ్‌కు వెళ్లారు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లి, వలసదారుల హక్కులను కాపాడేందుకు అక్కడ సత్యాగ్రహం నిర్వహించారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ ఎలా జాతిపిత అయ్యారు? ప్రతి భారతీయుడు ఆయనను బాపు అని ఎందుకు పిలుస్తారనే దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇందులో సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ మొదలైనవి ఉన్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అహింసా సూత్రాన్ని పాటించారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంచేందుకు నిరంతరం ప్రయత్నించారు. భారత స్వాతంత్ర్యం తరువాత గాంధీజీ భారతీయ సమాజానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం పనిచేశారు, హిందూ-ముస్లిం ఐక్యతను ప్రోత్సహించారు. సత్యం, సంయమనం, అహింసల మార్గాన్ని అనుసరించాలని చెబుతూ, అందుకు స్ఫూర్తిగా నిలిచారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ తన సర్వస్వం త్యాగం చేశారు. సాదాసీదా జీవితమే మనిషికి ఆనందాన్నిస్తుందని ఆయన తన నడత ద్వారా చూపారు. గాంధీజీ ఒక అన్వేషకునిగానూ ప్రసిద్ధి చెందారు. సరళత, నిర్లిప్తత, ఆత్మతో అనుసంధానం అనే భావనలతో గాంధీజీ జీవించారు. ధోతీ ధరించి, ఎక్కడికైనా కాలినడకనే ప్రయాణించి, ఆశ్రమాలలో కాలం గడిపిన గాంధీజీ భారతీయులకు తండ్రిలా మారారు. ఈ కారణంగానే ప్రజలు ఆయనను బాపు అని పిలవడం ప్రారంభించారు. మహాత్మా గాంధీని ‘జాతి పితామహుడు’ అని పిలిచిన మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గాంధీజీని ‘జాతి పితామహుడు’ అని పిలిచి గౌరవించారు. మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటంలో విశేష కృషి చేసిన కారణంగానే బోస్.. గాంధీజీని ఉన్నతునిగా పేర్కొన్నారు. అప్పటి నుండే అందరూ గాంధీజీని ‘జాతిపిత’ అని పిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?
సత్యం, అహింసల మార్గాన్ని అనుసరించి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. అక్టొబరు 2న జాతిపిత జన్మదినం. ప్రపంచంలోని చాలా మంది ప్రముఖులు నేటికీ గాంధీజీని తమ స్ఫూర్తిదాతగా భావిస్తారు. గాంధీజీలోని నాయకత్వ లక్షణాలు, అనుసరించిన విలువలు, ఆయన గుణగణాలు దేశాన్ని ఏకం చేయడానికి దోహదపడ్డాయి. బాపుజీ అనుసరించిన జీవన శైలిని నేటికీ విజయానికి ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు. జాతిపిత జన్మదినోత్సవం సందర్భంగా ప్రతీఒక్కరికీ ఉపకరించే గాంధీజీ బోధనలలోని కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తి ఆలోచనలే అతనిని తీర్చిదిద్దుతాయి. అందుకే మనం ఏమనుకుంటామో అదే అవుతాం. మనం చేసే ఏ ఒక్క పని అయినా ఎవరికైనా సంతోషాన్ని కలిగించగలిగితే, అది వేలమంది తలలు వంచి చేసే ప్రార్థన కన్నా ఉత్తమమైనది. జీవితంలో చాలా సార్లు ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎదుటివారిని ప్రేమతో గెలిచే ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచంలో నిజమైన శాంతి నెలకొనాలంటే యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం జరగాలి. దీనిని మనం మన పిల్లలతోనే ప్రారంభించాలి. అప్పుడే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది. ఈ భూమిపై ఎప్పటికీ జీవించాలి అన్నట్లుగా మీ జీవితాన్ని మలచుకోండి. బలం అనేది శారీరక సామర్థ్యాల నుండి కాదు.. అసమానమైన సంకల్ప శక్తి నుండి సమకూరుతుంది. కాబట్టి మీ సంకల్ప శక్తిని బలంగా ఉండనివ్వండి. ఎవరినైనా కోల్పోయే వరకు వారి ప్రాముఖ్యతను చాలామంది అర్థం చేసుకోలేరు. అందుకే ముందుగానే ఎదుటివారి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఏదైనా పని చేసే ముందే దానిగురించి ఆలోచించండి. పని చేసిన తరువాత మీరు ఎంత ప్రయత్నించినా, మీ పనుల ఫలితాలు ఎలా ఉంటాయో ఎప్పటికీ తెలుసుకోలేరు. అందుకే మీరు చేసే పనిపైన మాత్రమే దృష్టి పెట్టండి. ఎవరైనా సరే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద నష్టం మరొకటి లేదు. అందుకే మీ ఆత్మగౌరవాన్ని మీరే కాపాడుకోండి. ఇది కూడా చదవండి: త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు! -
గవర్నర్ నిర్ణయంతో బీసీలకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో వెనుకబడిన తరగతులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగతుల వారికి బీజేపీ వ్యతిరేకమని గవర్నర్ తాజా నిర్ణయంతో మరోమారు నిరూపితమైందన్నారు. శాసనమండలి ఆవరణలో మంగళవారం జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర మంత్రి మండలి ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేసిన ఇద్దరి పేర్లను తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని స్పష్టం చేశారు. దేశంలో భారత రాజ్యాంగానికి బదులు బీజేపీ రాజ్యాంగం నడుస్తుందనే అనుమానం కలిగేలా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
లండన్ నగరంలోని ఈస్ట్ హామ్లో జులై 8న వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ గారిని అభిమానించే యువకులు, పిల్లలు,పెద్దలు, మహిళలు లండన్ నుండే కాకుండా యూకేలోని ఇతర నగరాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటూ మళ్ళీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవస్యకత గురించి యూకే వైఎస్ఆర్సీపీ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా గారు ప్రసంగించారు. మలిరెడ్డి కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులు పీసీ రావు, కిరణ్ పప్పు, ఓబుల్ రెడ్డి పాతకోట, మనోహర్ నక్క, బీ నారాయణరెడ్డి, భాస్కర్ మాలపాటి , ఎన్ఆర్ నందివెలుగు, తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: మహానేత వైఎస్సార్‌కు ఘనంగా స్మృత్యంజలి -
అధికారికంగా ‘అల్లూరి’ జయంతి.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం ఈ నెల 4వ తేదీన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులిచ్చింది. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ శాఖల పరిధిలో మంగళవారం అల్లూరి జయంతిని జరపాలని పేర్కొంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధిపతులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..! -
కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇన్నేళ్లుగా రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.గతంలో ఈ కార్యక్రమాలకు హాజరుకాకుండా అంబేడ్కర్‌ను అవమానించిన కేసీఆర్ ఎన్నికలొస్తున్నాయని ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారని దుయ్యబట్టారు. అలాగే, రూ.కోట్లు వెచ్చించి ప్రకటనలు ఇస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి సంజయ్, ఇతరనేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. ‘దళితబంధు దేశానికి దిక్సూచి అంటూ ఇచ్చిన ప్రకటనలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంతమందికి దళితబంధు ఇచ్చారో, ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలి. దీనిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని అన్నారు. అంబేడ్కర్‌ను, దళితులను అడుగడుగునా అవమానించిన కేసీఆర్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించే అర్హత లేదన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడినే తొలి సీఎంగా చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదు. దళితులకు మూడెకరాలు ఎందుకివ్వలేదు? దళితుల పేరిట ఉన్న జాగాలను ఎందుకు లాక్కుంటున్నారు? ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ నిధులివ్వకుండా పేదలకు విద్య, వైద్యాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు?’ అంటూ కేసీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. దమ్ముంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. వీటికి సమాధానాలు ఇవ్వలేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. అణగారిన వర్గాల దిక్సూచి అంబేడ్కర్ అని ఐక్యరాజ్యసమితి చెప్పిందంటే అంబేడ్కర్ గొప్పతనం అర్ధం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నేతలు బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కొప్పు బాషా, మాజీ డీజీపీ క్రిష్ణప్రసాద్ పాల్గొన్నారు. కాగా, ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి సంజయ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. మహాశయా... మన్నించు... ‘అంబేడ్కర్ మహాశయా... మాట ఇస్తున్నా. 2023లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అధికారంలోకి వచ్చాక మీ ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతామని పార్టీపక్షాన హామీ ఇస్తున్నా’ అని అంబేడ్కర్‌ను ఉద్దేశించి బండి సంజయ్ లేఖ రాశారు. ‘మహాశయా... మన్నించు.. మీ వంటి చారిత్రక వ్యక్తి విగ్రహాన్ని దళిత ద్రోహి ప్రారంభించడం బాధగా ఉంది. మీరు రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ మిమ్మల్ని అవమానించినోళ్లే ఓట్ల కోసం మీ జపం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వం ధారపోసిన మహనీయుడు మీరు. అందరికీ ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి మీరు. అలాంటి మీ విగ్రహం వద్దే ఓట్ల రాజకీయ క్రీడను మొదలుపెట్టడం బాధగా ఉందన్నారు. ౖ‘2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ మీ విగ్రహం సాక్షిగా చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నారు’ అని ఎద్దేవాచేశారు. ‘నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేస్తున్నోళ్లే మీ సిద్ధాంతం గొప్పదని బాకాలు కొడుతున్నారని ధ్వజమెత్తారు. -
ముఖ్య అతిధి గా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్
-
అధ్యయనం కోసం కమిటీ
సాక్షి, అమరావతి: బీసీల కుల గణనపై కార్యాచరణకు కమిటీని నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. 139 బీసీ కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ఏపీలో బీసీల గణన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశ సామాజిక విప్లవోద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి వేణు మాట్లాడుతూ బీసీ సంఘాల ఆభ్యర్ధన మేరకు బీసీల కుల గణన కార్యాచరణ బాధ్యతను సీఎం జగన్ తనకు అప్పగించారని తెలిపారు. దీనిపై కమిటీని నియమించి ఇతర రాష్ట్రాల్లో కూడా అధ్యయం చేస్తామన్నారు. చదువు అనే ఆయుధంతో సమాజంలో గుర్తింపు, గౌరవం సాధించడంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శంగా నిలవగా సీఎం జగన్ వారి ఆశయాలను ఆచరిస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. బీసీలకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు వారికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం దేశంలో పూలే ఆశయాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారేనని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సామాజిక న్యాయం చేయలేదన్నారు. సామాజిక న్యాయంపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని చంద్రబాబు, లోకేశ్‌కు సవాల్ విసిరారు. విద్య అనే ఆయుధాన్ని కలిగి ఉంటే సమస్యలను సమర్ధంగా ఎదుర్కోవచ్చని, ఈ దిశగా విద్యా రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, పోతుల సునీత, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, అగ్రికల్చరల్ మార్కెటింగ్ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎన్టీయార్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ సిటీ పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులు అర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి పాల్గొన్నారు. -
సరిగ్గా అమలు చేసివుంటే...
భారత ఉపఖండంలో పుట్టి ప్రపంచ మానవాళి కంతటికీ దుఃఖనివారణోషధి నందించిన మొట్ట మొదటి తాత్వికుడు బోధిసత్వుడు. ఆయనను గురువుగా భావించి తన జీవితాన్ని అణగారిన జాతుల అభ్యున్నతికి అంకితం చేసిన వారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు అంబేడ్కర్ పేరును తమతమ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగించుకుంటున్నారు కానీ చిత్తశుద్ధితో ఆయన ఆశయాలను నెరవేర్చడం లేదు. ఇటువంటి సమయంలో ఐక్యరాజ్యసమితి మాత్రం ఆయన జన్మదినాన్ని ‘విశ్వశ్రేయస్సు’ దినంగా ప్రపంచమంతా జరుపుకోవాలని పిలుపు నివ్వడం మనందరికీ గర్వకారణం. వందలాది దేశాల రాజ్యాంగాలు క్షుణ్ణంగా చదివి జీర్ణించుకొని, దేశ దేశాల చరిత్రలను అవగాహన చేసుకొని, భారతీయాత్మను ఆవహింప జేసుకొని అద్భుతమైన రాజ్యాంగాన్ని రాశారు అంబేడ్కర్. ఈ రాజ్యాంగం భిన్న మతాలూ, భాషలూ, సంస్కృతులూ కలిగిన భారతదేశాన్ని ఐక్యం చేసింది. నోరులేని వారు కూడా స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించడానికి భావప్రకటనా స్వేచ్ఛ నిచ్చింది. ప్రతి మనిషీ తనకు ఇష్టమున్న రీతిలో జీవించడానికి మతస్వేచ్ఛ నిచ్చింది. వివిధ మత విశ్వాసాలను గౌరవిస్తూనే లౌకికత్వాన్ని అనుసరించాలని నిర్దేశించింది. నిరక్షరాస్యులై విద్యా గంధానికి దూరంగా ఉన్న భారతీయులందరికీ విద్యాహక్కునిచ్చింది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సత్సంబంధాలు ఉండేలా సమాఖ్య రాజ్యంగా భారత్‌ను ప్రకటించింది. ప్రతి రాష్ట్రం కేంద్ర సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూనే... తమతమ రాష్ట్రాలను తమదైన పద్ధతిలో అభివృద్ధి చేసుకునే స్వేచ్ఛ దీని వల్ల లభించింది. యుగాలుగా అణచివేతకు గురైన భారతీయ మహిళకు అన్ని విధాలా అభివృద్ధి చెందే హక్కులు ప్రసాదించింది రాజ్యాంగం. వర్ణవ్యవస్థ వల్ల దేశ ప్రజల్లో ఏర్పడిన సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి స్టేట్ సోషలిజం కావాలని చెప్పింది. ప్రభుత్వరంగం బలోపేతం కావాలని పేర్కొంది. అసమానతలను, అంతరాలను తగ్గించడానికి బలహీన కులాల వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను పొందుపరిచింది. ప్రభుత్వరంగ ప్రాజెక్టులను, కర్మాగారాలను, విశ్వ విద్యాలయాలను ప్రోత్సహించింది. ఎలా చూసినా భారత రాజ్యాంగం సమగ్రమైనది. అవసరమైన సవరణలు చేయడానికి వీలుకలిగింది కూడా. ఇటు వంటి రాజ్యాంగాన్ని మార్చాలనడం సరికాదు. (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసి ఉంటే దేశంలో ఇప్పుడున్న చాలా సమస్యలు పరిష్కారమయ్యుండేవి. సామాజిక, ఆర్థిక అంతరాలు, కుల మత భావనలు ఈ స్థాయిలో ఉండేవి కావు. ఫెడరల్ స్ఫూర్తి, లౌకిక భావన, స్టేట్ సోషలిజం భావనలు పేరుకు మాత్రమే మిగిలిపోయేవి కాదు. (క్లిక్: లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది) - డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త సాహితీవేత్త -
అంబేద్కర్‌కు చంద్రబాబు నివాళి
-
అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు నేతలు పాల్గొన్నారు. చదవండి: నా తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలి: సీఎం జగన్ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీ రాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కులం, ప్రాంతం, మతం అనే భేదాలు లేకుండా గౌరవించే వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజల మేలు కోసం చివరివరకు పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. డీజీపీ కార్యాలయంలో.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. -
తండ్రికి నివాళులర్పించిన వైఎస్ భారతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ భారతి నివాళులు అర్పించారు. అంధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసిన గంగిరెడ్డి అభిమానులు.. దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్ రాజారెడ్డి భవన్ వద్ద గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. చదవండి: ఖరీఫ్‌లో సిరుల పంట -
మనకు తెలియని యోధురాలు.. ఆమె ఎవరు?
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది. ఆమె ఎవరు? జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్దే కావడం విశేషం. శివగంగ రాణి నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్‌వారు ఊడిపడ్డారు. బ్రిటిష్ దాడి అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు. అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్‌వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది. 8 ఏళ్ల అజ్ఞాత వాసం వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు. ప్రతిదాడి అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్‌వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది. అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు. -
Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు
Best Teacher Jayanthi Narayanan: స్పెషల్ చిల్డ్రన్‌కి ఆమె తల్లి, తండ్రి, గురువు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న జయంతి ‘దేవుడు నన్ను ఈ పిల్లల కోసమే పుట్టించినట్టున్నాడు’ అని నమ్ముతుంది. దాదాపు 36 ఏళ్లుగా ఆమె చెన్నై మైలాపూర్‌లోని క్లార్క్స్కూల్లో ఇప్పటికి కనీసం వెయ్యిమంది స్పెషల్ చిల్డ్రన్కు కనీస చదువు, ప్రవర్తన నేర్పించింది. ‘నా జీవితం వారికే అంకితం’ అంటోంది జయంతి. మైలాపూర్‌లో ‘ది క్లార్క్ స్కూల్ ఫర్ ది డెఫ్’లో జయంతిని పిల్లలు ఎవరూ టీచర్‌గా చూడరు. వాళ్లు స్పెషల్ చిల్డ్రన్. కొంతమందికి వినిపించదు. కొందరు చూడలేదు. మరికొందరికి బుద్ధి వికాసంలో లోపం. వారికి ఆమే అమ్మ. గురువు. తండ్రి కూడా. ‘లాక్డౌన్లో నాకు చాలా కష్టమైంది. పిల్లల్ని విడిచి నేను ఉండలేకపోయాను. వాళ్లు నన్ను చూడక ఇరిటేట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు’ అంటుంది జయంతి. ఆమె చూస్తేనే వారికి సగం స్వస్థత. 1984 నుంచి ఆమె ఆ స్కూల్లో పని చేస్తోంది. ఎందరో పిల్లలు ఆమె చేతుల మీదుగా కనీస అవసర ప్రవర్తనను నేర్చుకుని స్కూలు దాటి పోయారు. వారందరూ ఇలాగే ఆమెకు ప్రేమను పంచి ఆమె ప్రేమను పొంది వెళ్లారు. అందుకే ఆమెను ప్రభుత్వం బెస్ట్ టీచర్‌గా గుర్తించింది. సహనమే శక్తి ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి అని మూడేళ్ల పసివాడికి కూడా అర్థమవుతుంది. కాని బుద్ధి వికాసంలో లోపం ఉంటే పదేళ్లు వచ్చినా తెలియదు. ‘మనకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీళ్లకు ఎందుకు అర్థం కాదు అనిపిస్తుంది. కాని బుద్ధి వికాసం లేని పిల్లలకు అది అతి పెద్ద పనితో సమానం’ అంటుంది జయంతి. ఆమె పని చేస్తున్న స్కూల్లో ప్రతి సంవత్సరం రకరకాల శారీరక, మానసిక లోపాలతో పిల్లలు చేరుతారు. వారి వారి లోపాలను, వాటి స్థాయులను బట్టి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ‘స్పెషల్ విద్యార్థులకు చదువు చెప్పే డిప్లమా కోర్సు చేశాక ఎం.ఎస్సీ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు చేశాను. పిల్లల పట్ల సానుభూతి, కరుణతో ఉండాల్సిన టీచర్‌గా మారిపోయాను’ అంటుంది జయంతి. ఆమె కుటుంబం ఆమెను ఈ పనిలో ప్రోత్సహిస్తుంది. కాకపోతే వారికి ఒకటే సందేహం. ఇంత ఓపిక ఎలా? అని. ‘ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి డస్సిపోతారు. తమ పిల్లల మీద తామే చిరాకు పడతారు. కాని నేను పొరపాటున కూడా వారిని విసుక్కోను. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెబుతాను. ఒక పిల్లవాడు ప్లేటు కింద పడకుండా భోజనం ప్లేటు తీసుకుంటే, తనకు తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తే అదే ఆ పిల్లవాడికి నాకూ కూడా పెద్ద ఘనవిజయంగా భావిస్తాను’ అంటుంది జయంతి. ఈ మహమ్మారి రోజుల్లో స్కూళ్లు తిరిగి తెరిచాక ఆ పిల్లలకు సరిగ్గా మాస్క్ ధరించేలా చేయడం పెద్ద పనిగా ఉంది. వారికి దానిని పెట్టుకోవడం కూడా పెద్ద పనే. కాని జయంతి ఓపిగ్గా చేస్తుంది. వీడియో పాఠాలు కొందరు తమది ఉద్యోగం మాత్రమే అనుకుంటారు. కొందరు తమది కర్తవ్యం అనుకుంటారు. అందుకే ఎన్ని విధాలుగా పని చేయవచ్చో అన్ని విధాలుగా చేస్తూ పోతారు. లాక్డౌన్ సమయంలో స్పెషల్ చిల్డ్రన్కు ఆన్లైన్ క్లాసులు తీసుకునే సాహసం చేసింది జయంతి. వారికి ఫోన్, లాప్టాప్ ఉపయోగించడం కష్టం. కాని ప్రయత్నించి తన పిల్లలతో కాంటాక్ట్‌లో ఉంది. అంతే కాదు స్పెషల్ పిల్లల తల్లిదండ్రులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ఉపయోగపడేలా వీడియో పాఠాలు తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈమె తయారు చేసిన 34 వీడియోలు ప్రశంసలు పొందాయి. ఎన్నో చేయాలి స్పెషల్ చిల్డ్రన్కు అవసరమైన ప్రత్యేక స్కూళ్లు, క్లాస్రూమ్ లు ప్రతి ఊళ్లో ఉండాలని అంటుంది జయంతి. ‘వారికి ఇండివిడ్యుయెల్ కోర్సులు ఉండాలి. వాళ్లు ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్లతో కంప్యూటర్లు ఉండాలి. బ్రెయిలీ ప్రింటర్లు ఉండాలి. స్పెషల్ పిల్లలు చదువును ఎంజాయ్ చేసే వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికీ అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది’ అంటుంది జయంతి. ఇలాంటి మంచి మనసున్న టీచర్, అమ్మలాంటి టీచర్ ప్రతి స్పెషల్ చైల్డ్‌కు దక్కాలని కోరుకుందాం. -
ఆయన... కాలం చెల్లని కవి
తెలుగు సమాజంలో జాషువా ప్రాసంగికత కాలం నడుస్తున్న కొలదీ పెరుగుతోంది. ఆయన మరణించి యాభై ఏళ్ళు గడచినా ఆయన కవిత్వం మన సమాజంతో సజీవ సంబంధం కలిగి ఉంది. 1895 సెప్టెంబర్ 28న అంటే 126 ఏళ్ళ క్రితం పుట్టిన జాషువా 1971లో మరణించారు. ఆయన 76 ఏళ్ళు జీవించారు. ఈ జీవిత కాలంలో 1917 నుండి 1966 దాకా విభిన్న రచనలు చేశారు. కొన్ని పౌరాణిక రచనలు మినహాయిస్తే, ఆయన రచించిన సాంఘిక కావ్యాలు ఈనాటికీ తెలుగు సమాజంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. గుర్రం జాషువా ఏయే సామాజిక రుగ్మతల్ని తన కవిత్వంలో విమర్శకు పెట్టారో, అవి ఇప్పుడు కూడా యథాతథంగాగానీ, రూపం మార్చుకొనిగానీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకు ఒక అందమైన భారతదేశ సామాజిక స్వప్నం ఉంది. ఆ కల ఇంకా సాకారం కాలేదు. ఆ అందమైన భారతీయ సమాజం ఆవిర్భవించేదాకా ఆయన కవిత్వానికి సామాజిక ప్రాసంగికత ఉంటుంది. వలసపాలన ముగిసిన వెంటనే ‘అచ్చముగ భారతీయుడనైతి నేడు’ అని ఎగిరి గంతేసిన కవి జాషువా. సాంఘికంగా వివక్షలు, ఆర్థికంగా అసమానత, రాజకీయంగా అవినీతి, సాంస్కృతికంగా మౌఢ్యం లేని కొత్త భారతదేశం జాషువా స్వప్నం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఆయన సమాజంలో రావలసిన మార్పులను గుర్తుచేస్తూ వచ్చారు. తన స్వప్నం సాకారం కావడానికి ఏయే సామాంజి కాంశాలు అడ్డుపడుతున్నాయో వాటినన్నిటినీ విమర్శిం చారు జాషువా. 1932 నాటి ‘పిరదౌసి’ కావ్యం నుండే ఆయన శ్రమదోపిడీని విమర్శించారు. 1934 నాటి ‘అనాథ’ కావ్యం నుండే స్త్రీ శక్తిని కీర్తించారు. ఆధిపత్యం, అసమానత, అవినీతి, మౌఢ్యం ఈ నాల్గింటిని ప్రజలకు శత్రువులుగా భావించిన జాషువా, అవి లేని భారతదేశం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. అయితే, స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడచిపోతున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఆయన ఈనాటికీ మనకు కావలసిన కవి. సాంఘిక నిరంకుశత్వానికి భౌతిక రూపమైన కులవ్యవస్థను, దాని వికృతచేష్ట అయిన అస్పృశ్యతను జాషువా తీవ్రంగా విమర్శించారు. అస్పృశ్యతా నిర్మూలనకు అనేక సందర్భాలలో పిలుపునిచ్చారు. ‘అనాథ’, ‘గబ్బిలం’ వంటి అనేక కావ్యాలలో తన దళిత వేదనను ఆగ్రహం గానూ, ఆర్ద్రతతోనూ వినిపించారు. ‘కుల భేద పిశాచి’ అని కులవ్యవస్థను నిర్వచించారు. దళితకులంలో పుట్టినకవిగా తన అనుభవాలను కవితలుగా మలిచారు. ‘కసరిబుసకొట్టు నాతని గాలిసోకనాల్గుపడగల హైందవ నాగరాజు’ అన్న వాక్యం జాషువా కులనిరసనలలో అగ్రగామి. ‘చెండింపుమస్పృశ్యతన్’ అని ఒక చోట, ‘కారుణ్యంబున నంటరాని తనమును ఖండింపవా?’ అని మరోచోట ఇలా అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారు. సాంఘిక వివక్ష, కులనిరంకుశత్వం లేని వ్యవస్థను కోరుకొన్న జాషువ ఈనాటికీ సామాజిక అవసరమే. కాలం ఎంతమారుతున్నా, దళితులు చదువుకొని, చైతన్యవంతులవుతున్నా వాళ్ల పట్ల వివక్ష మాత్రం తగ్గవలసినంతగా తగ్గలేదు. అందుకే ఆయన కాలంచెల్లిన కవి కాదు. అభ్యుదయ సాహిత్యం మొదలవుతున్నప్పుడే జాషువా ఇతర మార్క్సిస్టు కవులలాగే మన సమాజంలోని వర్గ వైరుధ్యాలను గుర్తించారు. సంపద అందరిదీ కావాలని, శ్రమదోపిడీ నశించాలని కోరుకున్నారు. దళితులు శ్రమదోపిడీకి గురికావడాన్ని నిరసించారు. వాని రెక్కలకష్టంబు లేనినాడు / సస్యరమ పండి పులకింప సంశయించు / వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు / భోజనము బెట్టు, వానికి భుక్తి లేదు (గబ్బిలం) అంటూ దళిత శ్రామికుల శ్రమ పరాయీకరింపబడటాన్ని జాషువా అధిక్షేపించారు. ‘ఒక ప్రాణి కొక ప్రాణి యోగిరంబ’య్యే వ్యవస్థను నిరసించి, మానవీయ భారతదేశం ఆవిర్భవించాలని జాషువా ఆకాంక్షించారు. ఇప్పుడు దేశంలో ఎంతో మార్పు వచ్చినా అధిక సంఖ్యాకుల శ్రమ మాత్రం దోపిడీకి గురౌతూనే ఉంది. శ్రమ దోపిడి నశించేదాకా జాషువా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. ఆయన గాంధీజీ అడుగుజాడలలో నడిచిన రాజకీయ కవి. ‘గబ్బిలం’, ‘బాపూజీ’ వంటి కావ్యాలలో జాషువా తన రాజకీయ దృక్పథాన్ని చాటి చెప్పారు. అయితే స్వాతంత్య్రానంతర రాజకీయాలలో ఆడంబరాలు పెరిగిపోవడం, ఆర్థిక అవినీతి పెచ్చరిల్లడం, ఎన్నికలలో ధనప్రాబల్యం ప్రవేశిం చడం వంటి అనేక దుష్పరిణామాల మీద జాషువా కవితాగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం రాగానే దేశం పూర్తిగా మారిపోతుందని కవి ఆశించారు. ఒక ఏడాది గడచినా మార్పు కనిపించలేదు. మొదటి సార్వత్రిక ఎన్నికలలోనే ధనం పాత్రను గుర్తించి ఆనాడే ప్రజలను హెచ్చరించారు జాషువ. ఇప్పుడు ఈ ధనప్రధాన ఎన్నికల రంగం బాగా బలిసిపోయింది. మతం పేరు మీద మౌఢ్యం రాజ్యమేలడాన్ని ఆయన వ్యతిరేకించారు. మతం కన్నా మనిషి ప్రధానమని భావిం చారు. నరుని కష్టపెట్టి నారాయణుని కొలిచే వింత సంస్కృతిని ప్రశ్నించారు. పెండ్లిండ్లకు, విగ్రహాలకు విపరీతంగా ధనం ఖర్చుపెడుతూ ప్రజలు ఆకలితో మాడుతుంటే పట్టిం చుకోని అమానుషత్వాన్ని నిలదీశారు. అంటువ్యాధులు వచ్చినపుడు ప్రతిమలను పూజించడం ‘ముతక తెలివి’ అన్నారు. కందుకూరి, గురజాడల నుండి అనేకమంది తెలుగు ప్రజా రచయితలు సమాజ పునర్నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో గుర్రం జాషువా ఒక్కరు. మరణించి 50 ఏళ్ళు ముగిసినా ఆయన కవిత్వం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఈ సందర్భంలో ఆయన కవిత్వాన్ని సమకాలీన దృక్పథంతో అధ్యయనం చేసి, పునర్మూల్యాంకనం చేయడం ఇప్పుడు చేయవలసిన పని. ఇదే ఆ మహాకవికి అసలైన నివాళి. ‘కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి/పంజరాన కట్టువడను నేను /లోకనిఖిలమెట్ల నిర్ణయించిన నాకు/తరుగులేదు విశ్వనరుడ నేను’ (నేడు గుర్రం జాషువా 126వ జయంతి) రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు -
తొలి మహిళా సత్యాగ్రాహి.. సుభద్రా కీ కహానీ
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశం కోసం సేవ చేసిన త్యాగధనులు మరోసారి స్మరణకు వస్తున్నారు. తొలి మహిళా సత్యాగ్రాహి, జైలుకు వెళ్లిన తొలి మహిళా కాంగ్రెస్ కార్యకర్త, గొప్ప కవయిత్రి సుభద్ర కుమారి చౌహాన్‌ను ఆమె 117వ జయంతి సందర్భంగా ‘డూడుల్’తో గూగుల్ గౌరవించింది. స్ఫూర్తివంతమైన ఆమె జీవితాన్ని గుర్తుకు తెచ్చింది. ఆడపిల్లల్ని ఇప్పుడు కూడా ‘అటు వెళ్లొద్దు... అది చేయొద్దు’ అనే పెద్దలున్న రోజుల్లో దాదాపు 110 ఏళ్ల క్రితం 9 ఏళ్ల వయసులో కవిత్వం రాసింది సుభద్ర కుమారి చౌహాన్. రాయడమే కాదు... దానిని పత్రికలకు పంపింది. పంపితే అది అచ్చయ్యింది. సుభద్ర కుమారి చౌహాన్ కొన్ని పనులు చేయడానికి ఈ భూమ్మీదకు వచ్చింది. కొన్ని పనులు చేసి తరలి వెళ్లిపోయింది. భారత స్వాతంత్రోద్యమం ఆమెను తప్పక తలచుకుంటూ ఉంటుంది. హిందీ సాహిత్య సమాజం ఆమెను తలుచుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు రంగాలలో ఆమె గొప్ప ముద్రను వదిలి వెళ్లింది. తొమ్మిది మంది సంతానంలో సుభద్ర కుమారి అలహాబాద్‌లో 1904లో జన్మించింది. నలుగురు అన్నదమ్ములు, ఐదుమంది అక్కచెల్లెళ్లలో ఆమె ఒకతి. తండ్రి, ఇతర అన్నయ్యలు ఆడపిల్లలను ఆడపిల్లల్లానే ఉంచాలని అనుకున్నా చివరి అన్నయ్య రాజ్ బహదూర్ సింగ్ మాత్రం తన తోబుట్టువులను ముఖ్యంగా సుభద్రను ప్రోత్సహించేవాడు. ‘చేయాల్సిన అల్లరి చేయండి’ అని వాళ్లకు రక్షణ గా నిలిచేవాడు. ఆ అన్న అండతో సుభద్ర కవిత్వం రాసింది. 1913లో ఆమె రాసిన తొలి కవిత ‘నీమ్’ (వేపచెట్టు) ‘మర్యాద’ అనే పత్రిక లో అచ్చయ్యింది. ఆడపిల్లలకు చదువేంటి అనే ఆ రోజుల్లో ఆమె అలహాబాద్‌లోని ‘లేడీ సుందర్‌లాల్ హాస్టల్’లో ఉండి చదువుకుంది. ఆ సమయంలో ఎన్నో కవితలు రాసింది. అక్కడే చదువుకుంటున్న తర్వాతి రోజుల్లో ప్రఖ్యాతి చెందిన కవయిత్రి మహాదేవి వర్మతో కలిసి ఆమె కవిత్వం ఉద్యమంలా కొనసాగించింది. 1919లో కవి, పత్రికా రచయిత అయిన లక్ష్మణ్ సింగ్‌తో వివాహం జరిగినప్పుడు కట్నం ప్రస్తావన గాని, తల మీద కొంగు కప్పుకుని వధువు ముఖం దాచుకునే సంప్రదాయం కాని పాటించకుండా చాలా సరళంగా వివాహం జరుపుకుంది. ఆ రోజుల్లో ఇది పెద్ద వార్త. ఝాన్సీ కీ రాణి సుభద్ర కుమారి చౌహాన్ కవితలు దేశభక్తిని కలిగించేలా ఉండేవి. బ్రిటిష్ వారిని పారదోలేందుకు ఝాన్సీ లక్ష్మిని స్ఫూర్తిగా తీసుకోమని సుభద్ర రాసిన ‘ఝాన్సీ కీ రాణి’ ఉత్తర భారతదేశంలో ప్రతి విద్యార్థి నేటికీ ఏదో ఒక తరగతిలో చదువుతూనే ఉంటాడు. ‘ఝాన్సీ కీ రాణి’ కవిత వేదిక మీద వేలసార్లు చదవబడింది. 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్‌వాలాబాగ్‌లో మీటింగ్ జరుగుతుంటే డయ్యర్ చేసిన ఘాతుకానికి సుభద్ర కదిలిపోయింది. ‘జలియన్‌వాలాబాగ్‌లో వసంతం’ పేర ఒక కవిత రాసింది. అంతే కాదు ఆ మరుసటి సంవత్సరమే భర్తతో కలిసి పూర్తిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తగా మారిపోయింది. తొలి మహిళా సత్యాగ్రాహి సుభద్ర ఇప్పుడు భర్తతో కలిసి జబల్పూర్ (మధ్యప్రదేశ్)ను తన కార్యక్షేత్రం చేసుకుంది. భర్త పత్రిక నడుపుతుంటే సుభద్ర సైకిల్ మీద రోజూ 14 కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలకు స్వాతంత్రోద్యమ అవసరం తెలియచేసేది. అంటరానితనంకు వ్యతిరేకంగా ప్రచారం చేసేది. 1922లో ‘జెండా సత్యాగ్రహం’ జబల్పూర్లో ఉధృతంగా జరిగింది. ప్రయివేటు, పబ్లిక్ స్థలాల్లో దేశ జెండాను ఎగురవేయడం ఆ కార్యక్రమం. ఆ సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తొలి ధీర మహిళగా సుభద్ర కుమారి చౌహాన్ చరిత్రకెక్కింది. ఆ తర్వాత ఆమె ఉపన్యాసాలకు జనం విరగపడసాగారు. ఆమె తన ఉపన్యాసాల మధ్య ‘ఝాన్సీ కీ రాణి’ కవితను ఉత్తేజపూర్వకంగా చదువుతూ ఉందని బ్రిటిష్ ప్రభుత్వం ఆ కవితను నిషేధించింది. అంతే కాదు.. 1923లో నాగపూర్‌లో జెండా సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్లిన సుభద్రను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. దేశంలో అలా అరెస్ట్ అయిన తొలి మహిళా సత్యాగ్రాహి ఆమె. జైల్లో ఉండి ఆమె కవిత్వం రాసింది. ‘లాంతరులో చమురు లేదు. అది ప్రాణం విడిచేలోపు నాలుగు పంక్తులు రాసుకుంటాను’ అని రాసిందామె. చిన్న వయసులో మరణం సుభద్ర కుమారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురిలో తన బాల్యం చూసుకుంటూ ఆమె అద్భుతమైన కవిత్వం రాసింది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆమె ఇంకా ఉత్సాహంగా పని చేస్తూ నాగ్‌పూర్‌లో ఒక ఉపన్యాసం ఇచ్చి జబల్పూర్కు తిరిగి వస్తుండగా 1948లో కారు యాక్సిడెంట్ లో మరణించింది. అప్పటికి ఆమె వయసు 43 సంవత్సరాలు. సుభద్ర కుమారి చౌహాన్ పేరిట ఎన్నో సాహిత్య పురస్కారాలు ఉన్నాయి. ఒక కోస్ట్‌గార్డ్ నౌకకు ఆమె పేరు పెట్టారు. జబల్పూర్లో ప్రభుత్వం ఆమె విగ్రహం పెట్టింది. ప్రస్తుతం అమృతోత్సవాల సందర్భంగా ఆమె 117వ జయంతి రావడంతో గూగుల్ ఆమె స్మరణగా డూడుల్ చేసి గౌరవాన్ని ప్రకటించింది. ‘ఆమె స్ఫూర్తి గొప్పది’ అని గూగుల్ వ్యాఖ్యానించింది. -
‘అభినయ శారదా’ జయంతి.. ఇందిరా గాంధీ ముద్దాడిన వేళ
నృత్యం ఆమెకున్న బలం. అయితే బొద్దు రూపం తన సినిమా కలకు అడ్డం పడింది. కానీ, ఏదో ఒకనాటికి నటిగా రాణిస్తానని తనకు తానుగా ఆమె చేసుకున్న శపథం.. నెరవేరడానికి ఎంతో టైం పట్టలేదు. అనుకోకుండా దక్కిన అవకాశం.. ఆ సినిమా అద్భుత విజయం ఆమెను బిజీ హీరోయిన్ను చేసింది. సంప్రదాయ హీరోయిన్ మార్క్‌ను చెరిపేసి కన్నడలో తొలి గ్లామర్ డాల్‌గా నిలిచింది జయంతి. మూడు దశాబ్దాలపాటు దక్షిణాది సినిమాల్లో అగ్ర కథనాయికగా హీరోయిన్గా.. ఆపై హుందా పాత్రలతో అలరించింది. ముఖ్యంగా సొంత గడ్డపై ‘అభినయ శార్దూలే’(నటనా శారదా-నటనా దేవత)గా పిల్చుకునే స్థాయికి చేరుకుందామె. అందుకే అభిమానులు.. ఆ దిగ్గజ నటి లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: జనవరి 6, 1945లో బళ్ళారిలో పుట్టింది కమలా కుమారి అలియాస్ జయంతి. తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఇంగ్లీష్ టీచర్. తల్లి సంతాన లక్ష్మి, కమలా కుమారితో పాటు ముగ్గురు అక్కాచెళ్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చిన్నప్పుడే భర్త నుంచి వేరుపడిన సంతాన లక్ష్మి.. పిల్లల్ని తీసుకుని మద్రాస్‌కు మకాం మార్చేసింది. చిన్నతనంలోనే క్లాసికల్ డ్యాన్సింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన కమల.. మనోరమ(సీనియర్ నటి)తో స్నేహం పెంచుకుంది. చిన్నతనంలోనే కమలకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. నటుడు నందమూరి తారక రామారావు(స్వర్గీయ)ను ఆమె ఆరాధించేది. ఆయన్ని చూసేందుకు బచ్చా గ్యాంగ్‌ను వెంటపెట్టుకుని స్టూడియోలకు సైతం వెళ్తుండేది. ఆ సమయంలో ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్గా చేస్తావా?’ అంటూ ముద్దాడి ఆటపట్టించేవారని జయంతి చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేవారామె. అనుకోకుండా అదృష్టం.. క్లాసికల్ డ్యాన్సర్‌గా రాణిస్తున్న టైంలోనే కమల.. కొన్ని సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ అవకాశాల కోసం ప్రయత్నించేది. అయితే బొద్దుగా ఉందని, డ్యాన్సులు చేయలేదేమోనన్న అనుమానంతో ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఛాలెంజింగ్‌గా తీసుకుందామె. కష్టపడి బరువు తగ్గే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉండగా కన్నడ దర్శకుడు వైఆర్ పుట్టస్వామి ఓ కొత్త సినిమా కోసం అడిషన్స్ నిర్వహిస్తున్నాడు. ఆ టైంలో డ్యాన్స్ రిహాల్స్ కోసం వెళ్లిన ఆమెను చూసి.. ఏకంగా లీడ్ రోల్ ఇచ్చేశాడాయన. అంతేకాదు కమలా కుమారి పేరును కాస్త.. ‘జయంతి’గా మార్చేశాడు. అలా ఆమె తొలిచిత్రం జెనుగూడు(1963)తో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఇక ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో.. జయంతి కాల్షీట్స్ కోసం డైరెక్టర్లు క్యూ కట్టారు. ఇందిర ముద్దాడిన వేళ జయంతి రెండో సినిమా ‘చందావల్లీ తోట’ సూపర్ హిట్. ఆ చిత్రానికి ప్రెసిడెంట్ మెడల్ కూడా దక్కింది. ఇక ఆమె కెరీర్‌ను తారాస్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘మిస్ లీలావతి’(1965). కన్నడనాట ఈ సినిమా ఓ సెన్సేషన్ హిట్.. ట్రెండ్ సెట్టర్ కూడా. కంప్లీట్ బోల్డ్ థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా శాండల్‌వుడ్‌కు గ్లామర్ సొగసులు అద్దింది జయంతి. వెస్స్ర్టన్ అటిరే.. టీషర్టులు, నైటీలు, అంతేకాదు కన్నడలో తొలిసారి స్విమ్ సూట్లో కనిపించిన నటిగా జయంతికి ఒక గుర్తింపు దక్కింది. నటనతోనూ దేశవ్యాప్తంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది. మిస్ లీలావతికి ఆమెకు ప్రెసిడెంట్ మెడల్ దక్కింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ మెడల్ అందించింది. అంతేకాదు జయంతిని ఆప్యాయంగా ముద్దాడి.. గుడ్ లక్ కూడా చెప్పింది ఇందిర. అది తన జీవితంలో మరిచిపోలేని క్షణంగా జయంతి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకునేవాళ్లు. కన్నడ టు తెలుగు.. వయా తమిళ్ 1962- 79 మధ్య సౌత్ సినిమాల్లో జయంతి హవా కొనసాగింది. కన్నడ, తమిళ్, తెలుగులో అగ్రహీరోల సరసన అవకాశాలే దక్కాయి ఆమెకు. ఆ స్టార్ డమ్‌తో హిందీ, మరాఠీ భాషల్లోనూ నటించింది. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, నాలుగు కన్నడ ఉత్తమ నటి స్టేట్ అవార్డులు(మరో రెండు సపోర్టింగ్ రోల్స్‌కు కూడా) దక్కించుకుంది. జయంతి అంటే.. ‘మోస్ట్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్’ హీరోయిన్ అనే పబ్లిసిటీ ఆమెకు నేషనల్ వైడ్‌గా ఫేమ్ తెచ్చిపెట్టింది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్లు అందుకుంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన జగదేక వీరుని కథ, కుల గౌరవం, కొండవీటి సింహాసనం, జస్టిస్ చౌదరిలో, కన్నడ దిగ్గజం డాక్టర్ రాజ్‌కుమార్ సరసన ఏకంగా 45 సినిమాల్లో నటించి రికార్డు నెలకొల్పింది. పుట్టన్నా కంగళ్, దొరై-భగవాన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్ లాంటి వాళ్లతో నటించి ఎన్నో కల్ట్ క్లాసిక్స్ అందించారు. అటుపై 80వ దశకంలో శ్రీనివాస మూర్తి, ప్రభాకర్ లాంటి వాళ్ల పక్కన భార్యామణి పాత్రలు దక్కించుకున్న ఆమె.. కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని తిరిగి సపోర్టింగ్ రోల్స్‌తో అలరించారు. దర్శకుడితో వివాహం.. విడాకులు నటుడు, తెలుగు దర్శకుడు పేకేటి శివరామ్‌ను జయంతి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరూ విడిపోయారు. లీడ్ రోల్స్ అవకాశాలు తగ్గుతున్న టైంలో.. తల్లి పాత్రలకు సైతం ఆమె ముందుకు రావడం విశేషం. 2005-06లో డాక్టర్ రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుందామె. ఎయిడ్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా తీసిన ఓ యానిమేటెడ్ ట్యూటోరియల్ కు ఆమె గాత్రం సైతం అందించడం విశేషం. కొడుకు కేకేతో జయంతి 2017లో పద్మభూషణ్ డాక్టర్ సరోజా దేవీ నేషనల్ అవార్డు ఆమెకు దక్కింది. 2018లో ఆమె అనారోగ్యం బారినపడగా.. చనిపోయిందంటూ పుకార్లు మీడియా హౌజ్‌ల ద్వారా వ్యాపించాయి. అయితే ఆమె బాగానే ఉందని కుటుంబం ప్రకటించింది. చివరికి అనారోగ్యంతో జులై 26, 2021న ఆమె తుదిశ్వాస విడిచినట్లు కొడుకు కుమార్(కేకే) ప్రకటించాడు. తెలుగు సినిమాపై నటి జయంతి ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకవైపు హీరోయిన్‌గానే కాకుండా.. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, దొంగ మొగుడు, తల్లిదండ్రులు, స్వాతి కిరణం, ఘరానా బుల్లోడు, పెద్దరాయుడు, రాముడొచ్చాడు, కంటే కూతుర్నే కను లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆమెకు మరింత దగ్గర చేశాయి. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ‘మెచ్యూర్డ్’ నటిగా ఆమె నటన ఇప్పటికీ ఆడియొన్స్ కళ్ల ముందు మెదలాడుతూనే ఉంటుంది. పెదరాయుడులో జయంతి -
SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం
సినీ పరిశోధకునిగా, కళాసంస్థ నిర్వాహకుడిగా చాలా మంది సినీ ప్రముఖులతో సన్నిహితంగా మెలిగే భాగ్యం, వాళ్ళ వ్యక్తిత్వాలను అతి దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగాయి. అయితే బాలు గారి లాంటి వ్యక్తిని నేను చూడలేదు. పేరెన్నికగన్న గాయకుడిగా కీర్తి గడించినా ఎంతో ఒదిగి ఉండే తత్వం, స్థాయిలకు అతీతంగా అందరినీ గౌరవించే గుణం, నలుగురికీ సాయం చేసే దాతృత్వం, ఓర్పు, సహనంతో మెలగడం ఇవన్నీ వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. ‘సంగమం ఫౌండేషన్’ వ్యవస్థాపకుడిగా ఈ రెండు దశాబ్దాలలో నేను చేసిన అనేక కార్యక్రమాలలో బాలు గారు పాల్గొన్నారు. ప్రఖ్యాత గాయని పి.సుశీల గారు కొన్నేళ్ళ క్రితం ‘పి.సుశీల ట్రస్ట్’ను నెలకొల్పి ఆ ట్రస్ట్ ద్వారా ఏటా ఒక సింగర్‌ని జాతీయ స్థాయి పురస్కారంతో గౌరవించాలని సంకల్పించారు. తొలి అవార్డును గాయని యస్. జానకి గారికి బహూకరించాలనుకున్నారు. అప్పుడు బాలు గారి కచేరీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో ఆ కార్యక్రమ నిర్వహణ అంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది. రవీంద్రభారతిలో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమం సాయంత్రం అనగా సౌండ్ సిస్టవ్‌ు చెక్ చేయడానికి ఉదయం పదకొండు గంటలకే బాలు గారు రవీంద్రభారతికి వచ్చారు. కొద్ది రోజుల ముందే లక్షలు ఖర్చుపెట్టి పెద్ద సౌండ్ సిస్టవ్‌ును రవీంద్రభారతి యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఆ సిస్టవ్‌ును చెక్ చేసిన బాలు గారు నాదగ్గరకొచ్చి ‘సంజయ్ గారూ! సౌండ్ సిస్టమ్ ఓకే. కానీ కొత్త సౌండ్ సిస్టవ్‌ు కాబట్టి సౌండ్ ఆపరేటర్లకు ఆ సిస్టవ్‌ును ఆపరేట్ చేయడంలో ఇంకా పూర్తి పట్టు చిక్కినట్లులేదు. సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మేము, ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. రిస్క్ ఎందుకు? మీకు అభ్యంతరం లేకపోతే నా కచ్చేరీలన్నింటికీ రెగ్యులర్‌గా వాడే సౌండ్ సిస్టమ్‌నే పిలిపించుకుంటా’ అన్నారు. ‘అలాగే సర్’ అని, వారికి రెగ్యులర్‌గా వచ్చే సౌండ్ సిస్టమ్ వారినే పిలిపించి ఏర్పాట్లు చేశాం. అంతా బాగా జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలు గారి దగ్గర కెళ్ళి ‘సౌండ్ సిస్టమ్ వారికి పేమెంట్ ఎంత ఇవ్వాలి సార్’ అని అడిగాను. దానికి వారు ‘‘సంజయ్ గారూ! ‘రవీంద్రభారతి సౌండ్ సిస్టమే వాడతాంగా’ అని సౌండ్‌కు మీరు బడ్జెట్ వేసుకొని ఉండరు. సడెన్‌గా నేను వచ్చి ఆ సౌండ్ సిస్టమ్‌ను కాదని నాకు అలవాటున్న సౌండ్ సిస్టమ్‌ను తెప్పించుకుని దానికి మిమ్మల్ని పేమెంట్ ఇవ్వండని అడిగితే మీకెంత ఇబ్బంది! ఇప్పటికిప్పుడు మీరెక్కడి నుంచి తెస్తారు? ఏం ఫరవాలేదు. మీరేమీ ఇవ్వకండి, నేను చూసుకుంటా’’ అని చెప్పి వారే స్వయంగా వారి జేబులోంచి రూ. 15 వేలు తీసి సౌండ్ సిస్టమ్ వారికి ఇచ్చారు. నాకు నోట మాట లేదు. ఖర్చు పెట్టించేవారినే చూశా కానీ, ఏ సెలబ్రిటీ ఎదురు ఖర్చు పెట్టడం చూడలేదు. మరునాడు ఉదయం బాలు గారి హోటల్ రూమ్‌కి నేను, సుశీల గారు వెళ్ళాం. ‘బాలూ! నేను పాడమని అడగగానే వెంటనే ఒప్పుకుని పాడావు. ఇంత ఇమ్మని ఏమీ అడగకుండానే వచ్చి పాడావు. ఇపుడే ట్రస్ట్ ప్రారంభించాం. ఇది నీ స్థాయి రెమ్యూనరేషన్ కాకపోయినా అభిమానంతో ఇస్తున్నా ఈ యాభై వేలుంచు’ అన్నారు సుశీల. వెంటనే బాలు చిరుకోపాన్ని ప్రదరిస్తూ, ‘అమ్మా! మీ పాటలు వింటూ పెరిగినవాణ్ణి. మీ పక్కన పాడడంతోనే నా సినీ కెరీర్ ప్రారంభమైంది. అలాంటి మీరు ఒక ట్రస్ట్ పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే, మా వంతు సహకారం అందించాలి గాని మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేంటి! ఇంకెప్పుడూ ఇలా చేయకండి’ అని తన చేతికిచ్చిన డబ్బుల కవర్‌ను సుశీల గారికిచ్చేసి, ఆమె కాళ్ళకు నమస్కరించారు. అప్పట్లో ఉడుత సరోజిని అని సీనియర్ సినీ గాయనికి ఆరోగ్యం బాగాలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మా సంస్థ తరఫున సన్మానించి, కొంత నగదు ఇచ్చాం. నెల ముందే బాలు గారిని సంప్రతించి, ఆహ్వానించాం. ‘అదే రోజు బెంగళూరులో ప్రోగ్రామ్ ఉంది. రాలేను సారీ’ అన్నారు. సరోజిని గారి సన్మానం రోజున మా ఏర్పాట్ల హడావిడిలో మేముండగా సడెన్‌గా బాలు గారి నుండి ఫోన్. ‘‘కార్యక్రమం బాగా చేయండి. నేను రాలేకపోతున్నానని బాధగానే ఉంది. అయినా నా మిత్రుడు మురళితో ఓ పాతిక వేలు పంపిస్తున్నా. సరోజిని గారికి నా నమస్సులు తెలియజేసి ఆ మొత్తాన్ని వారికి అందజేయండి’’ అని కోరారు. ఎంతో బిజీగా ఉండే బాలుగారు, వారు రాలేకపోయినా, నెల తర్వాత జరిగే ప్రోగ్రావ్‌ు తేదీని గుర్తుపెట్టుకొని, తన సీనియర్ గాయని కోసం బాధ్యతగా పాతిక వేలు పంపడం చూసి మళ్ళీ ఆశ్చర్యపోయా. హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయా. ప్రముఖ సితార్ విద్వాంసులు జనార్దన్ మిట్టా అంటే బాలు గారికి ప్రత్యేకాభిమానం. తను పాడిన తొలి చిత్రం నుండి అనేక వేల చిత్రాలలోని పాటలకు సితార్ వాయించిన జనార్దన్ గారికి రావాల్సిన గుర్తింపు రాలేదని బాలు గారి భావన. జనార్దన్ గారు పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో వారికో ఘన సన్మానం చేసి గౌరవించాలనుకున్నారు బాలు. ఆ కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా చేయమన్నారు. అప్పుడే వరసగా మూడు ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాము. మళ్ళీ వెంటనే ప్రోగ్రామ్ అంటే స్పాన్సర్స్ కష్టమేమో అని తటపటాయిస్తూ వారికి విషయం చెప్పా. బాలు వెంటనే అప్పటికప్పుడు తనకు తెలిసిన వ్యాపారవేత్తలకు ఫోన్లు చేసి, స్పాన్సర్ చేయించారు. కార్యక్రమం ముందురోజు బాలుగారు నాకు ఫోన్ చేసి ‘‘ఏమండీ! జనార్దన్ గారు పెద్దవారు, వారిని మామూలుగా సత్కరించి వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే స్వర్ణకంకణం తొడిగి గౌరవిద్దామనుకుంటున్నా. చెన్నైలో పనుల ఒత్తిడిలో ఉన్నాను. కంకణం కొనే టైమ్ లేదు. ఏమీ అనుకోకుండా ఓ లక్ష రూపాయల్లో మంచి స్వర్ణకంకణం మీరు నా తరఫున షాపింగ్ చేయండి’’ అన్నారు. నా దగ్గరున్న డబ్బుతో స్వర్ణకంకణం కొన్నాను. కార్యక్రమం రోజు బాలు దంపతులు తమ ఖర్చులతోనే విమానంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు వచ్చారు. రవీంద్రభారతికి రాగానే రిసీవ్ చేసుకోవడానికి ఎదురెళ్లాను. కారు దిగుతూనే స్వర్ణకంకణం కోసం నేను ఖర్చుపెట్టిన లక్షరూపాయలు నా చేతిలో పెట్టేశారు. అంత పకడ్బందీగా ఉంటారు బాలు గారు. బాలు గారు అంత ఘనమైన సత్కారాన్ని తనకు చేయించడంతో సంతోషంలో సితార్ జనార్దన్ గారికి వేదికపైనే ఆనందభాష్పాలు రాలాయి. ఓ సాటి కళాకారుడిని ఇంత ఘనంగా గౌరవించే మనసు ఎంతమందికి ఉంటుంది! ఇలా ఎన్నో సంఘటనలు. ఏది ఏమైనా, బాలు గారి లాంటి వ్యక్తులు అరుదు. విశిష్ట వ్యక్తిత్వం వారి సొత్తు. అమరగాయకుడు ఘంటసాల గారి విగ్రహాన్ని హైదరాబాద్‌లో తన సొంత ఖర్చులతో నెలకొల్పారు బాలు. అలాగే, నెల్లూరులో తమ సొంత ఇంటిని వేద పాఠశాల నిమిత్తం కంచి కామకోటì పీఠానికి డొనేట్ చేశారు. మిత్రులెందరినో ఆపదలో ఆదుకున్నారు. లెక్కలేనన్ని గుప్తదానాలు చేశారు. 2020 ఫిబ్రవరిలో చెన్నైలో బాలు గారిని వారింట్లో కలిసినప్పుడు ‘త్వరలో హైదరాబాద్ వస్తున్నా. అప్పుడు టైమ్ తీసుకుని మీ ఆఫీసు కొచ్చి తెలుగు సినిమాపై మీరు సేకరించిన కలెక్షన్స్ అన్నింటినీ తీరిగ్గా చూస్తా. ఏయన్నార్, యస్వీఆర్లపై మీరు వేసిన ఫోటో బయోగ్రఫీ పుస్తకాలు నాకు బాగా నచ్చాయి. ఆ తరహాలో నా మీద కూడా ఒక పుస్తకాన్ని ప్లాన్ చేయాలి. అది కూడా మీతో అప్పుడు చర్చిస్తాను’ అన్నారు. అవేమీ జరగకుండానే కరోనా మహమ్మారి బారిన పడి 2020 సెప్టెంబర్ 25న బాలు ఈ లోకాన్ని వీడారు. వారితో పాటే నిబద్ధత, సమర్థత, విధేయత, మంచితనం, మానవత్వం కూడా వెళ్ళిపోయాయేమో అనిపించింది. – సంజయ్ కిషోర్, ప్రముఖ సినీ పరిశోధకులు నేడు యస్పీబీ స్వరనీరాజనం యస్పీబీ 75వ జయంతి సందర్భంగా ఈ శుక్రవారం తెలుగు సినీపరిశ్రమ అంతా కలిసి ‘స్వరనీరాజనం’ అందిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది వరకూ 12 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో దర్శకులు కె. విశ్వనాథ్, హీరో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, తమ అనుభవాలు పంచుకోనున్నారు. ఆర్పీ పట్నాయక్ సారథ్యంలో గాయనీ గాయకులు, సంగీత దర్శకులు పాటలు పాడనున్నారు. జూమ్‌లో జరిగే ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని యూ ట్యూబ్‌లో చూడవచ్చు. -
ధర్మోద్ధారకులు శంకరాచార్యులు
ధర్మానికి గ్లాని ఏర్పడినపుడు శిష్టరక్షణకై దుష్టశిక్షణకై తాను అవతారాన్ని ధరిస్తానని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పాడు. ‘సంభవామి యుగే యుగే’ ధర్మగ్లాని అంటే జనులకు స్వధర్మాచరణ పట్ల శ్రద్ధా భక్తులు లోపించడం ధర్మాచరణ కించిత్తు కూడా ఆచరణ చేయకుండా ఉండటం. అలానే వేదాలలో... శాస్త్రాలలో చెప్పినదానికి విరుద్ధంగా ధర్మాన్ని ప్రబోధించి జనులను పక్కదోవ పట్టించి అవైదిక ధర్మ ప్రాబల్యం పెరగడం. అలాంటి సమయంలో పునః ధర్మప్రతిష్ట చేయడానికి భగవదవతారం జరుగుతుంది. కలియుగానికి వచ్చేసరికి జనులలోని రాక్షస ప్రవృత్తిని తీసివేయాలి. అంటే వారిని అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపు బుద్ధిని ప్రచోదించేలా చేయాలని, జ్ఞానభిక్ష పెట్టాలనీ సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో ఆర్యాంబా శివగురువులనే పుణ్యదంపతులకు కేరళ రాష్ట్రం కాలడీ క్షేత్రంలో పూర్ణానదీ తీరాన వైశాఖ శుద్ధ పంచమి శుభతిథిన తేజోమూర్తిౖయెన శంకరాచార్యుల వారు జన్మించారు. శంకరులు బాల్యంలోనే అత్యంత ప్రజ్ఞాశాలిగా ఉండేవారు. ఆయన ఐదవ సంవత్సరంలో ఉపనయనాన్ని చేసుకొని అతి తక్కువ సమయంలో ఏ మానవ మాత్రునికి కూడా సాధ్యం కాని ‘అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశీ సర్వశాస్త్రవిత్’ ఎనిమిదవ సంవత్సరంలో చతుర్వేదాలు 12 సంవత్సరాల వయస్సులోపు సర్వశాస్త్రాలను అధ్యయనం చేశారు. వేదాధ్యయన సమయంలో భిక్షాటనకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా ఆమె ఒక ఉసిరికాయను ఇచ్చింది. ఆమె దారిద్య్ర పరిస్థితిని చూసి చలించిపోయిన శంకరులు ‘కనకధారా స్తోత్రం’ ఆశువుగా స్తుతించారు. దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది. శంకరుల సన్యాస ఆశ్రమ స్వీకారం కూడా చాలా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో తల్లిని ఆనుమతి కోరారు. సన్యాసం స్వీకరిస్తే తన ఒంటరి అవుతానన్న కారణంతో తల్లి అందుకు నిరాకరించింది. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. తనను సన్యసించడానికి అనుమతిస్తే మొసలి వదిలేస్తుందని చెప్పారు. ఈ సంసారబంధాలు తనను మొసలిలా పట్టుకున్నాయని ఆ బంధాల నుండి తనను తప్పించమని కోరారు. దీనినే ఆతుర సన్యాసం అంటారు, సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను విడిచి వెళ్లిపోయింది. తరువాత గురువుకోసం అన్వేషిస్తూ నర్మదా నదీతీరంలో ఉన్న గోవింద భగవత్పాదులను దర్శించి ఆయననే తన గురువుగా తెలుసుకొన్నారు. ‘షోడశే కృతవాన్ భాష్యం’ తరువాత మహోత్కృష్టమైన బ్రహ్మసూత్రాది గ్రంథాలకు భాష్యాన్ని రచించారు. మహా మహా పండితులకు కూడా మళ్లీ, మళ్లీ చదివితే కాని అర్థం కాని ఎన్నో గ్రంథాలు రచించారు. కనీసం శబ్దజ్ఞానం కూడా లేనటువంటి సామాన్యవ్యక్తికి కూడా వేదాంతాది విషయాలను ‘భజగోవిందం’ వంటి స్తోత్రాల ద్వారా ప్రబోధించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించాలన్నా సమైక్యవాదాన్ని స్థాపించాలన్నా ఆదిశంకరుల సిద్ధాంతం తప్ప మరొకటి లేదని నిరూపించినవే ఆదిశంకరుల రచనలు. ఆయన కాలినడకన దేశాద్యంతం పర్యటించి అవైదికమైన 72 మతాలను సప్రమాణంగా ఖండిస్తూ వేదప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆదిశంకరులు వైదిక మతోద్ధారకులు. దాని పేరే అద్వైత సిద్ధాంతం. ‘‘వేదో నిత్యమధీయతాం’’ తదుదితం కర్మస్వనుష్టీయతాం అనే అనేకమైన ఉపదేశాలను జనహితానికి ఆయన ప్రబోధించిన జ్ఞానమార్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంతవరకు ప్రసరింప చేయాలనే ఉద్దేశ్యంతో తూర్పున పూరీలో గోవర్థన పీఠం, దక్షిణాన శృంగేరీలో శ్రీ శారదా పీఠం, పశ్చిమాన ద్వారకలో శారదా పీఠం, ఉత్తరాన బదరిలో జ్యోతిష్పీఠాలను స్థాపించారు. ఈ పీఠాలు, పీఠాధిపతుల ద్వారా ఎల్లప్పుడూ జనులకు ధర్మ ప్రబోధం జరిగి అందరూ వేదోక్తకర్మలను ఆచరించి జ్ఞానమార్గాన్ని పొంది శ్రేయోవంతులు అవాలని లోకోపకారం కోసం మహత్తరమైన కార్యకలాపాలను శంకరాచార్యుల వారు చేశారు. అలాంటి మహోన్నతమైన శ్రీ శంకరాచార్యుల వారిని అయన జయంతి సందర్భంగా స్మరించడం కన్నా ప్రతి సనాతన ధర్మ అనుయూయులకు పుణ్యమేముంది? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరుల వారిని ఈరోజు ఆరాధించాలి. ఆరాధించడం, పూజించడం, స్మరించడం ఎంతముఖ్యమో ఆయన ప్రతిపాదించిన ధర్మాన్ని పాటించడం అంతే ముఖ్యం. ఎల్లప్పుడూ స్వధర్మాన్ని ఆచరిస్తూ, జ్ఞానోపార్జన చేస్తూ ఈ జీవనాన్ని సఫలీకృతం చేసుకుందాం. (నేడు శంకర జయంతి) వ్యాసోఝల గోపీకృష్ణశర్మ వేద పండితులు, శృంగేరీ పీఠం -
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
-
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మిథున్ రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని కొనియాడారు. ‘‘ఆయన చూపిన బాటలో నడుస్తూ.. అందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని’’ సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. విశాఖలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.. విశాఖపట్నం: ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే.. బీసీలకు, బడుగు వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని మంత్రి అవంతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి నేతల ఆశయాల సాధనలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి భావితరాలకు ఆదర్శమన్నారు. చదవండి: ‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’ టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి.. -
వాల్తేరులో పుట్టిన అగ్గిబరాటా
ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా అందరూ కీర్తించే దేవికా రాణి మన వాల్తేరులో పుట్టింది. మరణించే నాటికి బెంగళూరులో 450 ఎకరాల విలువైన ఎస్టేట్‌ను వారసులు లేకపోవడం వల్ల ఎవరికి చెందాలో తేల్చక వదిలిపెట్టింది. ఆమె 1933లోనే తెర మీద ముద్దు సన్నివేశంలో నటించింది. దిలీప్ కుమార్‌ను స్టార్‌ను చేసింది. ఈ రాణి గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు... సాధారణంగా మగవాళ్లు లిఖించే చరిత్రలే నమోదవుతూ ఉండే సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొత్తదార్లు, వేర్లూ వేసిన దేవికా రాణిని మాత్రం అందరూ మార్గదర్శిగా గుర్తించి గౌరవిస్తారు. ఆమెను ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా’గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ఆమె చేసిన ఘనమైన పనులే. వాల్తేరులో సంపన్న బెంగాలీ కుటుంబానికి దేవికా రాణి జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ మన్మథనాథ్ చౌదరి జన్మతః జమీందార్. తల్లి లీలాదేవి చౌదరి సాక్షాత్ రవీంద్రనాథ్ టాగూర్‌కు మేనకోడలు. అందుకని దేవికా రాణి 9 ఏళ్లకే లండన్ వెళ్లి అక్కడి బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. అక్కడే పరిచయమైన బారిస్టర్ చదువు చదివి సినిమా దర్శకుడైన హిమాంశును ప్రేమించింది. అతని కోరిక మేరకు సినిమా నటిగా మారింది. దానికి ముందే ఆమె సినిమా కళను అభ్యసించింది. మొత్తం మీద సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్‌ల అధ్యయనం తర్వాత ఆ జంట ఇండియా తిరిగి వచ్చి ముంబైలో ‘బాంబే టాకీస్’ను ప్రారంభించి సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. తెర మీద ముద్దు వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి దేవికా రాణీయే. 1933లో తీసిన ‘కర్మ’ సినిమా కోసం భర్త హిమాంశును ఆమె నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకుంది. ఇప్పటికీ కూడా ఇది రికార్డు. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన ‘అఛూత్ కన్య’ సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అశోక్ కుమార్ ఆ సంస్థలో భాగస్వామి కూడా అయ్యాడు. దేవికా రాణి నటుడు దిలీప్ కుమార్‌ను హీరోను చేసింది. ఆ రోజుల్లో (1944) దిలీప్ కుమార్‌కు 250 రూపాయలు జీతం ఆఫర్ చేస్తే అతను అది నెలకా సంవత్సరానికా తేల్చుకోలేక సతమతమయ్యాడు. కాని ఆమె ఇచ్చింది నెలకే! అప్పటికి రాజ్ కపూర్‌కు సంవత్సరమంతా కలిపి ఆర్.కె. స్టూడియోలో 150 రూపాయల జీతం వచ్చేది. అలాంటి ప్రభావం దేవికా రాణిది. అశోక్ కుమార్, దేవికారాణి భర్తతో విడిపోయి భర్త హిమాంశు జీవించి ఉండగానే అతనితో వైవాహిక బంధంలో ఉండకుండా కేవలం ప్రొఫెషనల్ బంధంలోనే ఉండిపోయింది దేవికా రాణి. భర్త చనిపోయాక కొన్నాళ్లకు ఆమె రష్యన్ చిత్రకారుడు శ్వెతోస్లవ్ రోరిచ్‌ను వివాహం చేసుకుని మనాలిలో ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెకు నెహ్రూ కుటుంబం సన్నిహితమైంది. ఆ తర్వాత ఆ జంట బెంగళూరు వచ్చి 450 ఎకరాల ఎస్టేట్ కొని అందులో ఎవరినీ కలవక జీవించారు. ఆమె దగ్గర పని చేసిన మేనేజర్ ఒకామె ఆమె ఎస్టేట్ విషయాలు గోల్మాల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. దేవికా రాణి మరణించాక ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేసింది. చివరకు సొంతం చేసుకుంది. వెండితెర గతిని మార్చిన దేవికా రాణి ముంబైకి, వెండితెర వ్యక్తులకు దూరంగా జీవించడం ఒక విచిత్రం. 1994లో ఆమె మరణించాక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
సత్యార్థ ప్రకాశకులు స్వామి దయానంద సరస్వతి
పరాయి పాలనలో మగ్గుతున్న దేశాన్ని బానిసత్వపు శృంఖలాల నుంచి విడిపించి, సమాజాన్ని బాగుపరచడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యులుగా నిలిచారు స్వామి దయానంద సరస్వతి. దయానందుల అసలు పేరు మూల శంకర్. చిన్ననాడే భగవంతుడ్ని దర్శించాలనే తలంపుతో ఇల్లు వదలి వెళ్లి మధురలోని విరజానంద సరస్వతుల వద్దకు చేరారు. వారి సాన్నిధ్యంలో వేద, వేదాంత విద్యలను అభ్యసించి, సమాజం పట్ల అవగాహన రావడానికి గురువుల అనుమతితో దేశాటనకు బయలుదేరారు. ఆనాటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిన దయానంద తన జీవితం ఇక సమాజసేవకే అంకితమని నిశ్చయించుకున్నారు. సంఘసంస్కారం–ఆర్యసమాజం: దయానంద సరస్వతి సతీ సహగమనం, బాల్యవివాహాలపై తీవ్రంగా పోరాడి జనాలలో గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. కర్మసిద్ధాంతాన్ని, పునర్జన్మను గట్టిగా విశ్వసించే దయానందులు ఆచార వ్యవహారాలను మాత్రం వ్యతిరేకించారు. ఆర్యసమాజాన్ని స్థాపించి స్త్రీ జాతి సముద్ధరణకు నడుం బిగించారు. స్వధర్మానికి తిరిగి చేరుకునే వారికోసం ఆర్యసమాజం ద్వారా శుద్ధి కార్యక్రమం నిర్వహించేవారు. వీరు చేపట్టిన సంస్కరణలకు ఆనాటి ప్రముఖ నాయకులు సైతం ప్రభావితమయ్యారు. దయానంద భాష్యం: వేదాలు మానవులు రచించినవి కావనీ, సాక్షాత్తూ పరమాత్మ నుండే ఉద్భవించాయని బలంగా నమ్మిన వీరు ‘సత్యార్థ్ ప్రకాశ్’ పేరుతో వేదాల సారాన్ని సామాన్యుడి దాకా చేర్చే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా వేదాలను ఆధునిక కోణంలో చూడాలన్న దృక్పథంతో వేదాలకు వీరు రాసిన భాష్యం ‘దయానంద భాష్యం’ పేరుతో సుప్రసిద్ధమైంది. వేదాలు చెప్పిన స్త్రీ సమానత్వం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. వేదాలతో పాటు ప్రాథమిక విద్య అవసరాన్ని గుర్తించి అనేక కళాశాలలు నెలకొల్పి విద్యాదానం చేశారు.జాతీయవాదిగా తన బోధనలతో భారతదేశాన్ని సాంఘికంగా, మతపరంగా సంఘటిత పరచి ప్రజలలో దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా అవిరళ కృషి సల్పి, హిందూధర్మానికి దయానందులు చేసిన సేవ తరువాతి సమాజ సంస్కర్తలకు ఆదర్శంగా నిలిచింది. (నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి) -అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు చదవండి: వివాహ బంధం: బ్రహ్మముడి అంటే...? ‘రాగాలు’ రాగిణులై కనబడ్డాయి -
ఎవరింట్లోనైనా నాన్న అలాగే ఉంటాడు!
నాన్న ఏ కూతురికైనా ఎన్నాళ్లు గడిచినా మనసులో నిలిచి ఉంటాడు. మరి రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సందర్భంలో తన పాటతో వినిపించే ఘంటసాల వంటి తండ్రికి పుట్టిన కూతురు ఆ నాన్నను ఎలా మరచిపోగలదు? ఘంటసాల పెద్ద కుమార్తె శ్యామల నేడు ఆయన జయంతి సందర్భంగా సాక్షితో పంచుకుంటున్న జ్ఞాపకాలివి ఆమె మాటల్లోనే... ‘మీ నాన్నగారు అంత గొప్ప గాయకులు, సంగీత దర్శకులు కదా! మరి ఇంట్లో మీ అందరితో ఎలా ఉండేవారు? మామూలుగా మాట్లాడేవారా?’ – ఇవి మేము కొన్ని వందలసార్లు అడిగించుకున్నాం. ఇవేం ప్రశ్నలు? ఎవరింట్లోనైనా నాన్న అనే వ్యక్తి అందరితో మామూలుగా మాట్లాడక మరొకలా ఎలా ఉంటారబ్బా? మనమూ అందరిలాంటి వాళ్లమే కదా? మరెందుకు అంత కుతూహలంగా అడుగుతున్నారు? అని ఆశ్చర్యంగాను, తికమకగాను ఉండేది. అప్పట్లో బాగా చిన్న వాళ్లం అవడం వల్ల నాన్నగారి ప్రత్యేకత తెలిసేది కాదు’’ సాదాసీదాగా నాన్నగారు సినిమా పరిశ్రమకి చెందినవారైనా మా ఇంట్లో ఆ ప్రభావం ఏమాత్రం ఉండేది కాదు. అందరం నేల మీద చిరుచాపలు పరచుకుని కూర్చునే భోజనం చేసేవాళ్లం. హాల్లో కింద కూర్చుని ఎవరి స్కూలు పెట్టి వాళ్లు ఒళ్లో పెట్టుకుని హోమ్‌వర్కు రాసుకునేవాళ్లం. రాత్రివేళ వరుసగా నవారు మంచాలు వేసుకుని పడుకునేవాళ్లం. వేసవి కాలమైతే డాబా మీద చాపలు వేసుకుని నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ, నిద్రలోకి జారుకునేవాళ్లం. ఏ రోజైనా ఉదయం ఆరు గంటలకి పక్కలు తీసి సర్దిపెట్టాలిసిందే. పెద్దవాళ్లకి మాత్రం కాఫీ, టిఫిను. పిల్లలకి ఊరగాయ, పెరుగు కలిపి చద్దన్నమే. ఎనిమిదిన్నరకల్లా పిల్లల సెక్షన్ పని పూర్తి. వేసవి సెలవులకి పిన్నిగారి పిల్లలు, మావయ్యగారి పిల్లలు వచ్చేవారు. సంగీతరావుగారి పిల్లలు, మేము అందరం కలిపి దాదాపు పదిహేనుమంది ఉండేవాళ్లం. పెద్ద ఆవరణలో ఇంటి చుట్టూ పరుగెత్తడానికి కావలసినంత చోటుండేది. దొంగ పోలీసు, దాగుడు మూతలు, ఏడు రాళ్లు, చెడుగుడు, ప్లేబాల్, బొంగరాలు, గోళీలు, స్కిప్పింగ్, రింగ్, షటిల్‌కాక్... అబ్బ! ఎన్ని ఆటలు ఆడేవాళ్లమో.. అప్పుడప్పుడు నాన్నగారు విశ్రాంతిగా ఇంట్లో పడుకున్నప్పుడు దాక్కోవటానికి ఆయన మంచం కింద దూరేవాళ్లం. అమ్మ వచ్చి, ‘బయటికిపోయి ఆడుకోండి’ అని కసిరేది. నాన్నగారు మాత్రం నిద్రపోతున్నట్లు నటించేవారు. కానీ ఆయనలో తన్నుకు వస్తున్న నవ్వు మెలకువగా ఉన్నట్లు పట్టించేసేది. అంతమంది కలిసి బిగ్గరగా అరుచుకుంటూ, పరిగెత్తుతూ, కొట్టుకుంటూ, అలుగుతూ, గోలగోల చేస్తుంటే నాన్న ఎంత సంబరంగా చూసేవారో!! అన్నీ ఇంట్లోనే.. నాన్నగారికి విడిగా ఆఫీసు లేదు. ఎవరినైనా ఇంటికే రమ్మనేవారు. అందువల్ల ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుండేవారు. సముద్రాల, కృష్ణశాస్త్రి, యామిజాల పద్మనాభస్వామి, కొసరాజు, కోట సత్య రంగయ్య శాస్త్రి వంటి సాహిత్య మూర్తులతో పాటు, ఆర్కెస్ట్రా వాళ్లు, సంగీత దర్శకులు, గాయకులు.. అందరితో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరం పాటల పోటీలు, నాటకాలు – చాలా బిజీగా ఉండేవాళ్లం. ప్రైజు సాధించుకుని వచ్చేవాళ్లం. మొదటిసారి నా పన్నెండవ ఏట రేడియో నాటకానికి చెక్కు ఇచ్చారు. ఆ తరువాత చిన్నన్నయ్యకి చెక్కు వచ్చింది. ఆ రోజు నాన్నగారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ‘నా పిల్లలు కేవలం గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, అప్పుడే సంపాదనపరులు కూడా అయ్యారు’ అంటూ పొంగిపోయేవారు. అప్పటికప్పుడు స్వీట్లు తెప్పించేవారు. పండుగలకు పాటలు.. వినాయకచవితి నాడు పూజ పూర్తయ్యాక అందరం కలిసి పాటలు పాడడం, దసరాకి బొమ్మల కొలువులు, పేరంటాలు, దీపావళికి ఇంట్లో చిచ్చుబుడ్లు, మతాబులు చుట్టించడం, సంక్రాంతికి ముందు నెలరోజులు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలని తీర్చడం, భోగిమంటలు – ఇవి మాత్రమే పండుగలు కావు – నాన్నగారితో గడిపిన ప్రతీ క్షణం ఒక పండగలాగే గడిచిపోయింది. చుప్పనాతి దేవుడు నాన్నగారిని మాకు కనిపించకుండా లాక్కుపోయాడు గానీ, ఆయన జ్ఞాపకాలని, ఆయన ఉనికిని, మాటని ఆలోచనలని మాత్రం ఈ నాటికీ అంగుళమైనా కదిలించలేకపోయాడు. – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ నాన్న మంచి నేర్పారు.. ‘చిన్న పెద్ద అని వయోభేదం గానీ, స్థాయీ భేదం గానీ చూడకుండా ఎవరికి యివ్వవలసిన ప్రాధాన్యాన్ని వారికి ఇవ్వాలి, మన అభిప్రాయాలు మనకి ఉన్నట్లే అందరికీ ఉంటాయి, వాటిని గౌరవించాలి, ఎక్కడ ఎలా ఉన్నా లోపాలు ఎన్నక అందరినీ కలుపుకుని పోవాలి, ఏది కావాలన్నా దానికి కృషి చేయడమే మన వంతు. ఫలితం అనుకూలంగా వస్తే మరొక లక్ష్యం వైపు దృష్టి పెట్టు, ప్రతికూలిస్తే మళ్లీ ప్రయత్నించు. ఎలాగో అలా మరమనిషిలా బ్రతికేయడం కాదు, బుద్ధితో మనసుని అనుసంధానం చేసి జీవించు, అలా చేయగలిగినప్పుడే ఆనందం, తృప్తి నిన్ను అంటిపెట్టుకుని ఉంటాయి’ అని నాన్న నిరంతరం చెబుతుండేవారు. కానీ ఈ రోజుల్లో కాలం విలువ నేర్పే పెద్దలకి తీరిక లేదు. పిల్లలకి సమయమూ లేదు. – ఘంటసాల శ్యామల (ఘంటసాల పెద్ద కుమార్తె) -
కర్నూలులో వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలు
కర్నూలు (అర్బన్): కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో శనివారం వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో ఇప్పటికే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, వాలీ్మకి కార్పొరేషన్ చైర్మన్ డా.బి. మధుసూదన్, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య చర్చించారు. వాల్మీకి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణం కర్నూలుకు చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్లో ఉన్న వాల్మీకి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమానికి కారి్మక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ రామారావు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాలకు చెందిన వాల్మీకి నేతలు హాజరుకానున్నారు. -
భారతీయతకు ప్రతిరూపం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అసమాన ప్రతిభ కనబర్చి, ‘భారత రత్నం’గా భాసించిన ఎ.పి.జె. అబ్దుల్ కలాం భారతీయతకు నిలువెత్తు ఉదాహరణ. ఇతర మతాల పట్ల సామరస్య ధోరణితో ఉండడం తండ్రి నుండి ఆయనకు అబ్బింది. ‘గొప్పవారికి మతం స్నేహితులను అందించే ఒక మార్గం. అల్పులకు మతం ఘర్షణలకు ఒక కారణం’ అనేవారు కలాం. ఆధ్యాత్మికత కలాం జీవితమంతా ఆయనతో పాటే కొనసాగింది. ‘ట్రాన్సిడెన్స్: మై స్పిరిచ్యువల్ ఎక్స్పీరియెన్సెస్ విత్ ప్రముఖ్ స్వామీజీ’ పుస్తకంలో తన ఆధ్యాత్మిక యాత్రను వివరించారు. స్వామి నారాయణ సంప్రదాయానికి చెందిన ప్రముఖ్ స్వామీజీని తన ఆధ్యాత్మిక గురువుగా ఆయన భావించేవారు. న్యూఢిల్లీలో 2001 జూన్ 30న మొదటిసారి స్వామీజీని కలిసినప్పుడే కలాం ఆయనపట్ల ఆకర్షితులయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం సెప్టెంబరులో అక్షరధావ్‌ుపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో సహా అందరూ క్షేమంగా ఉండాలని ప్రముఖ్ స్వామీజీ ప్రార్థించడం కలాంను కదిలించింది. దేవుడి కక్ష్యలోకి తనను ప్రవేశ పెట్టిన మహిమాన్వితుడిగా స్వామీజీని ఆయన పేర్కొన్నారు. ఐదు అంశాల్లో అభివృద్ధి వల్ల దేశం పురోగమిస్తుందని కలాం భావించేవారు. 1. వ్యవసాయం, ఆహారం. 2. విద్య, వైద్యం. 3. సమాచార సాంకేతికత. 4. విద్యుత్తు, రవాణా, మౌలిక వసతులు. 5. క్లిష్టమైన సాంకేతిక విషయాల్లో స్వావలంబన. వీటికి ప్రముఖ్ స్వామీజీ ఆరో అంశాన్ని చేర్చారు. నేరం, అవినీతిలతో కల్మషమైన ప్రపంచానికి ఆధ్యాత్మికతను అందజేయడం. ఇదే కలాం ఆధ్యాత్మిక దృక్కోణమైంది. లీడ్ ఇండియా కార్యక్రమం కలాం ఆశయాలకు అద్దం పట్టింది. యువతలో ఉత్తమ ఆలోచనలను పాదుకొల్పడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీంట్లో భాగంగా వేలాది విద్యార్థులను స్వయంగా కలిసి, సంభాషించారు. కలాం నేర్పిన జీవన మంత్రాన్ని మరోసారి విద్యార్థులు, యువత గుర్తుకు తెచ్చుకోవాలి. (నేడు అబ్దుల్ కలాం 89వ జయంతి) -డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు ‘ మొబైల్ 94410 46839 -
నో పార్కింగ్
సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని సుశాంత్ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్’ (షూటింగ్ మొదలుపెడుతున్న విషయాన్ని ఉద్దేశిస్తూ) అని ట్వీట్ చేశారు సుశాంత్. హీరో సుమంత్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆప్యాయత నిండిన అన్ని జ్ఞాపకాలు ఈ రోజు ఎక్కువగా మెదులుతున్నాయి తాతా.. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞుడనై ఉంటాను’ అని భావోద్వేగపూరితంగా రాసుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్. -
‘సంక్షేమంలో దేశానికే ఏపీ ఆదర్శం’
సాక్షి, తాడేపల్లి: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పూల మాలలు వేసి నివాళర్పించారు. (అంబేడ్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి) అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. నేడు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలనుకున్నామని.. కానీ కరోనా వల్ల ఇళ్ల పట్టాల కార్యక్రమం చేయలేకపోయమని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళా సాధికారికతకు కూడా సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. -
అంబేద్కర్ సేవలు నిరుపమానం: బిశ్వభూషణ్
సాక్షి, విజయవాడ: భారత రాజ్యాంగ పితామహుడుగా అంబేద్కర్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. రేపు(మంగళవారం) అంబేద్కర్ జయంతి సందర్భంగా గవర్నర్ సందేశమిచ్చారు. మహిళలు, బలహీన వర్గాలకు సమాన హక్కులను కల్పించే దిశగా ఆధునిక భారతదేశం కోసం జీవితకాల పోరాటం చేశారని ప్రస్తుతించారు. కులం లేని నవ సమాజ నిర్మాణానికి అంబేద్కర్ పునాదులు వేశారని కొనియాడారు. తన జీవితాన్ని పేదలు, అణగారిన, దిగువ కులాలకు చెందిన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేసిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని కీర్తించారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి, దళితులపై సామాజిక వివక్షను అరికట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు. -
శోభాయమానంగా.. ‘శోభాయాత్ర’
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన వీరహనుమాన్ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో, కాషాయవర్ణ శోభిత నిలువెత్తు హనుమాన్ జెండాలతో నిర్వహించిన ప్రదర్శన ఉత్సాహంగా సాగింది.విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు నగరం నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. గౌలిగూడ రామమందిర్లో యజ్ఞం నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యఅధ్యక్షుడు అలోక్‌కుమార్, కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శి వినాయక్దేశ్ పాండేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రకుట్ స్వామి రామ హృదయ్‌దాస్, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద వేలాదిమంది హనుమాన్ భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులు హనుమంతుడి జెండాను చేతబూని గౌలిగూడ నుంచి తాడ్బంద్వరకు ర్యాలీగా తరలి వెళ్లారు.శోభాయాత్ర ఉత్తేజభరితంగా, ప్రశాంతంగా సాగింది. భారీ బందోబస్తు...... గౌలిగూడ రామమందిర్ నుంచి సాగిన శోభాయాత్రకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.అడుగడుగునా సీసీ కెమెరాలతో గట్టి నిఘాను ఉంచారు. రామ మందిరం పనులు ప్రారంభిస్తాం : అలోక్‌కుమార్ వీరహనుమాన్ శోభాయాత్రలో భాగంగా కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికలో వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యఅధ్యక్షుడు అలోక్‌కుమార్ స్వామి రామ హృదయ్‌దాస్, వినాయక్ దేశ్‌పాండేలు మాట్లాడారు. ఏడాదిలోపు అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు యువశక్తిలోని ఐక్యతను చాటాయని, ఇంది ఎంతో శుభసూచకమన్నారు. ఈ శోభాయాత్ర అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. దుష్టశక్తుల నాశనానికి ఇలాంటి ఐక్యత అవసరమన్నారు. గతంలో ఎలాంటి ఆయుధాలు , డైనమెట్ లేకుండా చేతులతోనే అయోధ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేశామని గుర్తు చేశారు. హైదరాబాద్ హిందూ ప్రజల ఐక్యత ఉందనడానికి నిదర్శనం ఈ శోభాయాత్రనే అన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామదాస్, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, నేతలు గాల్‌రెడ్డి, కైలాశ్, ముఖేష్‌లతో పాటు స్థానిక నాయకులు డాక్టర్ భగవంత్‌రావు, యమన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కవర్ స్టోరీ : జై భీమ్..
అట్టడుగు కులంలో జన్మించాడు. పసితనంలో తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చవి చూశాడు. అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నాడు. అంతమాత్రాన కుంగిపోలేదు. తనలో తానే కుమిలిపోలేదు. దుర్భర పరిస్థితులకు ఎదురీదుతూనే విదేశాల్లో ఉన్నత చదువులు చదివాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్య్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు. తన సాటి దళితులు తలెత్తుకుని బతికేలా చేసేందుకు అహరహం కృషి చేశాడు. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించాడు. ఆయనే అంబేద్కర్. దళితుల ఆత్మగౌరవ ప్రతీక. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, ఆయన చెప్పిన మాటలను మననం చేసుకుందాం... ‘‘మనం పోరాడితే తప్ప ఏదీ లభించదు. ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. స్వయం సహాయంతో ముందుకు సాగాలి. మనం తక్కువ వాళ్లం అనే భావన వదిలిపెట్టి సమాజంలోని ఇతర వర్ణాల వారితో సమాన హోదాతో జీవించడానికి ప్రయత్నించండి. మీ అలవాట్లను మార్చుకుని అందరిలా ఆత్మగౌరవంతో బతకండి’’.. మహారాష్ట్రలోని మహద్ గ్రామంలో 1927 మార్చి 19న జరిగిన దళిత మహాసభలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ అన్న మాటలివి. అలాగని ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రసంగించిన మరునాడే దళితుల మానవ హక్కులను అమలుపరచడానికి కార్యరంగంలోకి దిగారు. వందలాది మంది దళితులతో ఊరేగింపుగా ఆ ఊళ్లోని సవర్ణులు వాడుకునే చౌదర్ చెరువుకు వెళ్లి, అందులోని నీటిని దోసిలి పట్టి తాగారు. ఆయన అనుచరులందరూ ఆయననే అనుసరిస్తూ ఆ చెరువు నీటిని తాగారు. తరతరాలుగా నిమ్నజాతులలో పాతుకుపోయిన నిరాశా నిస్పృహలను పటాపంచలు చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సంఘటన అది. నిజానికి మహద్‌లోని చౌదర్ చెరువును అన్ని కులాల వారూ ఉపయోగించవచ్చునని మునిసిపాలిటీ 1924లోనే ప్రకటించింది. అయినా అగ్రవర్ణాల వారికి భయపడి అక్కడి దళితులెవరూ ఆ చెరువు జోలికి పోయేందుకు సాహసించలేదు. చెరువు సంగతి తేల్చుకోవడానికే అక్కడ మహాసభలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆ మహాసభలలో పాల్గొని, దళితుల్లో స్ఫూర్తి నింపారు. వారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపారు. ఆయన చొరవతోనే మహద్‌లోని దళితులకు చెరువు నీళ్లను వాడుకునే హక్కు దక్కింది. అంబేద్కర్‌లోని ఈ పోరాట పటిమకు నేపథ్యం ఆయన బాల్యం, ఆయన ఎదుగుదలలోనే ఉంది. తండ్రి నుంచి స్ఫూర్తి అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావు రామ్‌జీ అంబేద్కర్. ఆయన తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్. తల్లి భీమాబాయి. అప్పటి సెంట్రల్ ప్రావిన్స్‌లోని (ఇప్పటి మధ్యప్రదేశ్) మహు గ్రామంలో 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టారు. మహులో బ్రిటిష్ సైనిక స్థావరం ఉండేది. అంబేద్కర్ తండ్రి రామ్‌జీ బ్రిటిష్ సైన్యంలో సుబేదారుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. రామ్‌జీ, భీమాబాయి దంపతులకు పద్నాలుగు మంది సంతానం. రామ్‌జీ పూర్వీకులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్గడ్కు ఐదు మైళ్ల దూరంలో ఉన్న అంబావాడే రామ్‌జీ వంశీయుల స్వగ్రామం. ఆ ఊరి పేరు మీదే ఆ కుటుంబానికి అంబేద్కర్ అనే ఇంటి పేరు వచ్చింది. రామ్‌జీ సక్పాల్ మహర్ కులానికి చెందినవారు. దళితుల్లో మహర్లు కొంత సాహసవంతులు. ఈస్టిండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో అందులో చేరిన వారు మహర్లే. రామ్‌జీ కుటుంబ సభ్యులు కబీరు బోధించిన భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేది. భక్తి సంప్రదాయానికి చెందిన ప్రవక్తలు కులభేదాలను పాటించలేదు. ఈ కారణంగానే నాటి దళితుల్లో చాలామంది భక్తి సంప్రదాయానికి ఆకర్షితులయ్యారు. అంబేద్కర్ తల్లి భీమాబాయి తండ్రి, ఆరుగురు పినతండ్రులు కూడా సైన్యంలో సుబేదార్లుగా పనిచేసిన వారే. భీమాబాయి తరఫు వారు ముర్బాద్ ప్రాంతంలో సంపన్నుల కిందే లెక్క. వారిది కూడా కబీరు భక్తి సంప్రదాయమే. రామ్‌జీ ఉద్యోగ విరమణ చేసే నాటికి అంబేద్కర్‌కు రెండేళ్లు మాత్రమే. ఉద్యోగ విరమణ తర్వాత రామ్‌జీ కుటుంబంతో దాపోలీకి చేరుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం లేరు. సతారాలో వేరే ఉద్యోగం వెదుక్కుని అక్కడకు చేరుకున్నారు. తల్లి పోయే నాటికి అంబేద్కర్‌కు ఆరేళ్లు. రామ్‌జీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజ చేసేవారు. పిల్లలకు రామాయణ, మహాభారత గాథలను, మహాపురుషుల చరిత్రలను, వీరగాథలను కథలుగా చెప్పేవారు. తుకారాం, ముక్తేశ్వర్, మొరోపంత్ల కీర్తనలను పిల్లల చేత పాడించేవారు. రామ్‌జీ ఒక మిలిటరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేశారు. మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో ఆయనకు చక్కని ప్రావీణ్యం, అనువాద నైపుణ్యం ఉండేవి. తండ్రి శిక్షణలోనే అంబేద్కర్ అనువాదంలో మంచి ప్రావీణ్యం సాధించారు. రామ్‌జీకి దళితుల దుస్థితిపై స్పష్టమైన అవగాహన ఉండేది. దళితులను ఆ దుస్థితి నుంచి బయటపడేయడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు చేశారు. అంటరానితనం వల్ల దళితులు ఎదుర్కొంటున్న వివక్షను ఆయన బొంబాయి గవర్నర్‌ను కలుసుకుని వివరించారు. దళితుల స్థితిగతులను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పట్లో మహర్లను సైన్యంలోకి తీసుకోరాదంటూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. వివక్షాపూరితమైన ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని రామ్‌జీ ప్రభుత్వానికి అర్జీ రాశారు. తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితోనే అంబేద్కర్ దళితుల స్థితిగతులను మెరుగుపరచడానికి తుదివరకు పోరాటం సాగించారు. బాల్యంలో చేదు అనుభవాలు అంబేద్కర్ తండ్రి రామ్‌జీ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు. చివరకు సతారాలోని ఒక ఉపాధ్యాయుడు వారిని తన క్లాసుకు రానిస్తానని ఒప్పుకున్నాడు. దాంతో రామ్‌జీ తన కుటుంబాన్ని సతారాకు తరలించారు. అంబేద్కర్, ఆయన అన్న ఆనందరావు సతారాలోని స్కూల్లో చేరారు. క్లాసులో ఒక మూలగా గోనెగుడ్డలు పరుచుకుని కూర్చునేవారు. తోటి పిల్లలు వీరితో మాట్లాడేవారు కాదు. ఉపా«ధ్యాయులు వీరిని ప్రశ్నలు అడిగేవారు కాదు. నోట్సులు దిద్దేవారు కాదు. స్కూల్లో దాహం వేస్తే సైగ చెయ్యాలి. ఎవరైనా దయతలచి దూరం నుంచే నీరు ఎత్తి పోసేవారు. అంటరానితనంలోని అమానుషత్వం అప్పుడే అంబేద్కర్‌కు అర్థమైంది. అలాంటి రోజుల్లోనే అంబేద్కర్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. స్కూల్‌కు వేసవి సెలవులు ఇచ్చారు. గోరేగాంవ్‌లో ఉన్న తండ్రి దగ్గరకు అంబేద్కర్, అతని అన్న, మేనల్లుడు బయలుదేరారు. వీరి రాక గురించిన సమాచారం అందకపోవడంతో రామ్‌జీ స్టేషన్‌కు రాలేదు. చాలాసేపు ఎదురు చూసి, ఇక లాభంలేకపోవడంతో స్టేషన్ మాస్టర్ సాయంతో ఎడ్లబండిని మాట్లాడుకున్నారు. బండి కొంత దూరం పోయిందో లేదో బండివానికి వీరు అంటరానివారని తెలిసింది. వెంటనే అతను బండి ఆపేసి, బండీ ఎద్దులూ మైలపడిపోయాయని కేకలు వేస్తూ వీరిని బయటకు విసిరేశాడు. బయట ఎండ మండిపోతోంది. అప్పటికే పిల్లలు ముగ్గురూ బాగా అలసిపోయి ఉన్నారు. అంబేద్కర్ అన్న రెట్టింపు బాడుగ చెల్లిస్తామని ఆశపెట్టడంతో బండివాడు శాంతించాడు. అయితే, బండిని తాను తోలనన్నాడు. అంబేద్కర్ అన్న బండి తోలుతుంటే, పిల్లలిద్దరూ వెనుక కూర్చున్నారు. బండివాడు నడుచుకుంటూ బండిని అనుసరించాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్నా తోవలో వాళ్లకు ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఎవరిని అడిగినా నీళ్లు లేవనేవారు. పక్కనే ఉన్న మురికి కాలువలోని నీళ్లు తాగమనేవారు. అంబేద్కర్ పసి మనసుపై ఈ సంఘటన బాగానే ప్రభావం చూపింది. అంబేద్కర్ జీవితంలో ఇలాంటి చాలా సంఘటనలే ఎదురయ్యాయి. ఆదరించిన ఉపాధ్యాయుడు బాల్యం నుంచి అంబేద్కర్‌లో సాహస ప్రవృత్తి ఎక్కువ. ఒకసారి చలిగాలులతో భోరున వర్షం కురుస్తోంది. గొడుగు లేకుండా స్కూలుకు వెళ్లాలని పందెం వేశారు తోటి పిల్లలు. అంతే, అంబేద్కర్ తన పుస్తకాల సంచి, గొడుగు అన్న చేతికి ఇచ్చి, తాను వర్షంలో తడుసుకుంటూనే స్కూలుకు బయలుదేరాడు. స్కూలుకు చేరే సరికి చిత్తుగా తడిసిపోయాడు. తల మీద నుంచి నీళ్లు కారుతున్నాయి. క్లాసు టీచరైన పెండ్సే అంబేద్కర్ పరిస్థితి చూసి చలించిపోయాడు. బ్రాహ్మణుడే అయినా ఆయన కాస్త మంచివాడు. వెంటనే తన కొడుకుని పిలిచి, అంబేద్కర్‌ను తమ ఇంటికి తీసుకెళ్లి వేణ్నీళ్ల స్నానం చేయించి, తడి బట్టలు ఆరవేసి, పొడిబట్టలు ఇవ్వమని చెప్పాడు. ఆ ఉపాధ్యాయుని ఆదరణను, తనపై చూపిన ఆప్యాయతను అంబేద్కర్ ఎప్పుడూ మరువలేదు. అంబేద్కర్‌పై ఆ ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. స్కూలు రికార్డుల్లో భీమ్‌రావుగా ఉన్న పేరును భీమ్రావు అంబేద్కర్గా నమోదు చేసిన ఉపాధ్యాయుడు ఆయనే. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూనే, కొందరు దయామయుల సహాయ సహకారాలతో అంబేద్కర్ 1907లో మెట్రిక్ పూర్తి చేశాడు. అంబేద్కర్ మెట్రిక్ ఉత్తీర్ణుడవడంతో అతని కులం వారంతా సంతోషించారు. ప్రముఖ సంఘ సంస్కర్త ఎస్.కె.బోలే అధ్యక్షతన సన్మాన సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న ప్రసిద్ధ మరాఠీ రచయిత, సంస్కర్త కృష్ణాజీ అర్జున్ తాను రచించిన ‘గౌతమబుద్ధ చరిత్ర’ను అంబేద్కర్‌కు బహూకరించారు. బుద్ధుని సామాజిక ధర్మం ఆ వయసులోనే అంబేద్కర్‌కు అవగతమైంది. ఉన్నత విద్యా ప్రస్థానం మెట్రిక్ పూర్తయిన కొద్ది రోజులకే అంబేద్కర్‌కు పెళ్లి జరిగింది. బాల్య వివాహాలు జరిగే ఆ కాలంలో తొమ్మిదేళ్ల రమాబాయితో ఆయన పెళ్లి జరిగింది. ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చేరాడు. అనారోగ్యం కారణంగా ఒక ఏడాది చదువుకు ఆటంకం కలిగింది. అదే సమయంలో తండ్రి రామ్‌జీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అంబేద్కర్ చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కేలూస్కర్ బాసటగా నిలిచాడు. అంబేద్కర్‌ను బరోడా మహారాజు దగ్గరకు తీసుకుపోయాడు. ‘అర్హులైన నిమ్నజాతీయులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాను’ అంటూ బొంబాయి సమావేశంలో ఆయన అన్న మాటలను గుర్తు చేస్తూ, అంబేద్కర్‌ను పరిచయం చేశాడు. బరోడా మహారాజు వెంటనే అంబేద్కర్‌కు నెలకు పాతిక రూపాయల ఉపకార వేతనాన్ని ఏర్పాటు చేశాడు. అంబేద్కర్ 1912లో బీఏ పూర్తి చేశాక కొంతకాలం బరోడా సంస్థానంలో ఉద్యోగం చేశాడు. బరోడా మహారాజు ఆర్థిక సాయంతో అమెరికాలోని కొలంబియా వర్సిటీలో చేరాడు. స్వదేశానికి వచ్చాక బరోడా సంస్థానంలో పదేళ్లు ఉద్యోగం చేయాలనే షరతులపై బరోడా మహారాజు అంబేద్కర్‌కు ఆర్థిక సాయం చేశారు. కొలంబియా వర్సిటీ నుంచి అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, డాక్టరేట్ పూర్తి చేశారు. అమెరికాలో చదువు పూర్తయ్యాక 1917లో అంబేద్కర్ తిరిగి భారత్ చేరుకున్నాడు. బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా చేరారు. ఒక దళితుడు విదేశాల్లో చదువుకుని ఉన్నత ఉద్యోగంలో చేరడాన్ని సంస్థానంలోని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. కింది ఉద్యోగులు సైతం ఫైళ్లను ఆయన బల్లపై ఎత్తి వేసేవారు. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ ఎక్కువ సమయం సంస్థాన గ్రంథాలయంలో గడిపేవారు. అదేకాలంలో కొల్హాపూర్ మహారాజు సాహూ మహారాజు అస్పృశ్యత నిర్మూలన కోసం కృషి సాగిస్తుండేవారు. ఆయన ఆధ్వర్యంలోని ‘మూక నాయక్’ పక్షపత్రికకు అంబేద్కర్ సంపాదకత్వం వహించేవారు. సాహు మహారాజు అంబేద్కర్ తిరిగి విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక సాయం చేశారు. ఆయన సాయంతో విదేశాలకు వెళ్లిన అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా ఎంఏ, డీఎస్సీ పూర్తి చేశారు. లండన్‌లో బార్ ఎట్ లా పూర్తి చేశాడు. కొలంబియా వర్సిటీ నుంచి ఎల్ఎల్డీ పట్టా సాధించి, తిరిగి స్వదేశానికి వచ్చారు. కులవివక్షపై పోరాటం స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంబేద్కర్ కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆయన 1927లో ‘బహిష్కృత భారతి’ అనే మరాఠీ పక్షపత్రికను ప్రారంభించారు. అందులోని ఒక వ్యాసంలో ‘‘తిలక్ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేవాడు కాదు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, జన్మహక్కు అని ప్రకటించి ఉండేవాడు’’ అని రాశారు. అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్ సాగించే జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ అస్పృశ్యతా నిర్మూలన కోసం సాగించిన కృషికి నాటి కాంగ్రెస్ నేతల నుంచి పూర్తి మద్దతు ఉండేది కాదు. గాంధీ దళితులను చూసిన కోణం వేరు. ఆయన వర్ణ వ్యవస్థను వ్యతిరేకించలేదు. వర్ణ వ్యవస్థ భారత దేశానికి గల ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉందని సమర్థించారు. అయితే, అంటరానివారుగా ఉన్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజం బాగు కోసం తమ వృత్తులను చేస్తున్నారని, అలాంటి వారిని ఇతర వర్ణాల వారందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయంగా అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్ర పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారు. రాజ్యాంగ సవరణలకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం 1930, 31, 32 సంవత్సరాలలో నిర్వహించిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ అంబేద్కర్ పాల్గొన్నారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీ కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యారు. ఆ సమావేశంలోనే గాంధీకి, అంబేద్కర్‌కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ పట్టుబడితే, అలా చేయడం వల్ల హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందంటూ గాంధీ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గాంధీ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత 1932లో రామ్సే మెక్‌డొనాల్డ్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదిస్తూ ‘కమ్యూనల్ అవార్డు’ను ప్రకటించాడు. అప్పటికి ఎరవాడ జైలులో ఉన్న గాంధీ, ఈ ప్రకటన తెలిసిన వెంటనే జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనివల్ల అంబేద్కర్‌పై నైతిక ఒత్తిడి పెరగడంతో ఆయన గాంధీతో పూనా ఒప్పందానికి సిద్ధపడ్డారు. ఉమ్మడి నియోజకవర్గాల్లో ‘కమ్యూనల్ అవార్డు’ కంటే ఎక్కువ స్థానాలను దళితులకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. గాంధీ అంటరానితనం నిర్మూలన కోసం చేపట్టిన ఉద్యమంలో అంబేద్కర్‌ను భాగస్వామిగా చేసినా, గాంధీ విధానాలతో పొసగక అంబేద్కర్ బయటకు వచ్చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ వంటి సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. అదే కాలంలో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత దేశానికి విభజనతో కూడిన స్వాతంత్య్రం వచ్చాయి. అంబేద్కర్ సూక్తులు ►మనిషికీ మనిషికీ మధ్యనున్న అసమానత్వమే అన్ని బాధలకూ మూలం. ►గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సద్వర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి. ►పుసక్తాలు దీపాల వంటివి. వాటిలోని వెలుతురు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. ►కేవలం పుస్తకాలను చదివి వదిలేస్తే ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్లేనా? ►కులం పునాదుల మీద దేనినీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు. ►రాజ్యాంగం దుర్వినియోగమైనట్లు తెలిస్తే, దానిని తగులబెట్టే తొలి వ్యక్తిని నేనే. ►మేధస్సుకు పదును పెట్టడమే మనిషి అస్తిత్వానికి పరమార్థం. ►స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్నే నేను ఇష్టపడతారు. ►సామాజిక స్వేచ్ఛను సాధించనంత వరకు చట్టం కల్పించిన స్వేచ్ఛ మీకు అందదు. ►రాజకీయ నియంతృత్వాన్ని సామాజిక నియంతృత్వంతో పోల్చలేం. ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయవేత్త కంటే, సమాజాన్ని ఎదిరించే సంస్కర్తే ధైర్యశాలి. ►ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోదలచిన వారు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఎంతటి మహాత్ముల వద్దనైనా వదులుకోరాదు. ►ఒక వర్గాన్ని మరో వర్గంపైకి ఉసిగొలిపే ధోరణి ప్రమాదకరం. ►నా దేశ సమస్యలకు, నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ తలెత్తితే, ముందు నేను నా జాతి సమస్యలకే ప్రాధాన్యమిస్తాను. ►దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. ►నీ కోసం జీవిస్తే, నీలోనే మిగిలిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ► మండిన కొవ్వొత్తి మనది కానట్లే, గడిచిన కాలమూ తిరిగి రాదు. రాజ్యాంగ రచన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మనదైన సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. రాజ్యాంగ రచన కోసం ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే, దాదాపు మొత్తం రాజ్యాంగ రచనా భారాన్ని అంబేద్కరే నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తు సమావేశంలోఅప్పటి కేంద్ర మంత్రి టి.టి.కృష్ణమాచారి మాట్లాడుతూ, ‘‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. మిగిలిన ఒకరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యంగ రచనా భారమంతా అంబేద్కర్ ఒక్కరే మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనడంలో సందేహం లేదు.’’ అన్నారు. అంబేద్కర్ కేంద్ర తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా, 1951లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. బౌద్ధమత స్వీకారం అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి 1935లో మరణించారు. తర్వాత ఆయన తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదా కబీర్‌ను పెళ్లాడారు. జీవిత చరమాంకంలో 1956 అక్టోబర్ 14న అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. అంతకు చాలాకాలం ముందే ఆయన ‘నేను హిందువుగా పుట్టినా, హిందువుగా మాత్రం మరణించను’ అని ప్రకటించారు. బౌద్ధం ఈ దేశ సంస్కృతిలో భాగమేనని, తన మత మార్పిడి వల్ల దేశ చరిత్రకు, సంస్కృతికి ఎలాంటి భంగం కలగకుండా చూశానని చెప్పుకున్నారు. బౌద్ధం స్వీకరించిన కొద్ది కాలానికే, 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ కన్నుమూశారు. రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా, ఆర్థిక, న్యాయ నిపుణుడిగా ఆయన చేసిన నిరుపమానమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించింది. -
పుస్తక రూపంలో చెన్నారెడ్డి జీవిత చరిత్ర
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు తెలియజేయాలని పలువురు రాజకీయ, ప్రముఖ వక్తలు అభిప్రాయపడ్డారు. గొప్ప పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడైన చెన్నారెడ్డిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ఉన్న మర్రి చెన్నారెడ్డి రాక్‌గార్డెన్‌లో చెన్నారెడ్డి మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదివారం ఇందిరాపార్కు రాక్‌గార్డెన్‌లో చెన్నారెడ్డి శత జయంతి (100) ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభలో ప్రతిపక్షాల దాడిని సైతం హుందాగా స్వీకరించే ముఖ్యమంత్రుల్లో స్వర్గీయ చెన్నారెడ్డి ఒకరని కితాబిచ్చారు. చెన్నారెడ్డి జీవితం పట్టువిడుపులా ఉండేదని, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని తెలిపారు. గొప్ప వ్యక్తిత్వం గల బహుముఖ ప్రజ్ఞశాలి చెన్నారెడ్డి అని కొనియాడారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ.. చెన్నారెడ్డి కొందరివాడు కాదని, అందరి వాడని, తనతో విభేదించే వారిని కూడా ఆమోదింపజేసుకునే విలక్షణ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ గవర్నర్లు రోశయ్య, రాంమోహన్‌రావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వరరెడ్డి, నంది ఎల్లయ్య, టి.సుబ్బరామిరెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, సమర సింహారెడ్డి, ఉమావెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, గడ్డం ప్రసాద్‌కుమార్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, కిష్టయ్య, దైవజ్ఞశర్మ, ఏఐసీసీ సభ్యుడు ఎం.సూర్యనాయక్, మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయన సమాధి, విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. -
ఉక్కుమణి
మణి.. అమూల్యమైనది.‘ఉక్కు’కు తోడైన ఆ మణి..తండ్రి జీవితాన్నుండి ప్రభావితమైతండ్రి జీవితాన్ని ప్రభావితం చేసి..వారసత్వానికే వన్నె తెచ్చింది.ఉక్కు సంకల్పం నాన్నది. ఉద్యమ గుణం మణిది. అందుకే మణిబెన్.. ఉక్కుమణి! నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి. నేడే గుజరాత్లో పటేల్ ఐక్యతా ప్రతిమ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఆ ఉక్కుమనిషికి చివరి వరకు బాసటగా ఉన్న కుమార్తె మణిబెన్ పటేల్ గురించి స్ఫూర్తిదాయకమైన విశేషాలు, విశేషాంశాలూ ఇవి.‘నేనూ పెద్దవాడినైపోయాను. ఇప్పటికైనా ఏదో మార్గం ఎంచుకోవాలి నువ్వు!’ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 1944లో తన ఏకైక కుమార్తె మణిబెన్ పటేల్‌కు ఇచ్చిన సలహా ఇది. ‘పటేల్: ఏ లైఫ్’ పేరుతో గాంధీజీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారు. కూతురితో ఈ మాట అనే నాటికి సర్దార్ స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ కుడిభుజం. తొందరలోనే స్వరాజ్యం వస్తుందని అంతా నమ్ముతున్న కాలం. ఆ అంచనా వాస్తవం కూడా. గాంధీజీకి ముఖ్య అనుచరుడిగా, జవహర్లాల్ నెహ్రూకు సముడిగా స్వతంత్ర భారతదేశంలో పటేల్ స్థానం ఏమిటో ఊహించడం కష్టం కాదు. అయినా ఆయన కూతురికి ఇలాంటి సలహా ఇచ్చారు. అంటే తన సంతానం రాజకీయాలలోకీ, ప్రభుత్వ పదవులలోకీ రావాలని ఆయన ఎంతమాత్రం అనుకోలేదు. సర్దార్ పటేల్, జవేర్బాయి పటేల్‌లకు ఒక కూతురు, కొడుకు. కూతురే మణిబెన్. కొడుకు దహ్యా పటేల్. పటేల్‌కు 33 ఏళ్ల వయసులో భార్యా వియోగం జరిగింది. పటేల్‌కు సంతానమంటే ఎంతో అనురాగం. ద్వితీయ వివాహం చేసుకుంటే సమస్యలు ఎదురవుతాయనీ, అవి పిల్లలను ఇబ్బంది పెడతాయనీ చేసుకోలేదు. ఆ మరుసటి సంవత్సరమే బారిస్టర్ చదువు కోసం సర్దార్ టెంపుల్ టౌన్‌కు (ఇంగ్లండ్) వెళ్లారు. అప్పుడే చాలాకాలం మణిబెన్ నానమ్మ దగ్గర, పెదనాన్న విఠల్‌భాయ్ పటేల్‌ల దగ్గర పెరిగింది. విఠల్‌భాయ్ పటేల్ కూడా చరిత్ర ప్రసిద్ధుడే. జీవితాంతం తండ్రికి బాసట మణి, దహ్యా కూడా గుజరాత్ విద్యాపీలో చదువుకున్నారు. మణి గుజరాతీ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. నిజానికి మణిబెన్ (1903–1990) దేశ సేవకు అంకితమైంది. ఆమె స్వాతంత్య్రోద్యమంలో తండ్రితో, గాంధీజీతో కలసి నడిచారు. జీవితాంతం తండ్రికి బాసటగా ఉన్నారు. మణిబెన్ తండ్రికి కార్యదర్శి, వ్యక్తిగత సేవిక, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే న ర్స్. ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసే పని కూడా ఆమెదే. ఆయన బట్టలు కూడా ఉతికేవారు. తండ్రి జీవిత చరమాంకంలో ప్రతిక్షణం ఆయనను వెన్నంటే ఉన్నారు మణి. అందుకే ఆమె రాసిన డైరీ ‘ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ సర్దార్ పటేల్: ది డైరీ ఆఫ్ మణిబెన్ పటేల్’ ఎన్నో కీలక చారిత్రకాంశాలను, ఇంకా చెప్పాలంటే చరిత్ర పుటలకు ఎక్కడం సాధ్యంకాని రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌లోని కరంసద్లోనే (సర్దార్ పటేల్ పూర్వీకుల స్వగ్రామం) మణి జన్మించారు. స్వస్థలంలోను, గుజరాత్ విద్యాపీuŠ‡లోను చదువుతున్నప్పుడే గాంధీజీ ఉపన్యాసాలు, బోధనలు ఆమెకు ఉత్తేజం కలిగించాయి. 1918లో ఆమె అహమ్మదాబాద్‌లోని గాంధీజీ ఆశ్రమంలో చేరారు. మనవరాలి పెళ్లి గురించి పటేల్ తల్లి లాద్బా (తండ్రి పేరు జవేర్భాయ్, పటేల్ భార్య పేరు కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది) తపన పడుతూ ఉండేవారు. కానీ పెళ్లి విషయంలో కూతురి అభిప్రాయం ఏమిటో, పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఆయన అడగలేదు. కారణం– ఆ ఇంట పిల్లలు పెద్దల ఎదుట నోరు విప్పరు. పెద్దలు కూడా అంతే. పిల్లలతో చాలా తక్కువ మాట్లాడతారు. తాను 33వ ఏట కూడా చుట్టు పక్కల పెద్దలు ఉంటే పెదవి కదపలేదని ఒక లేఖలో పటేల్ రాశారు. 1926లో మరోసారి మణి అహ్మదాబాద్‌లోని గాంధీ ఆశ్రమానికి వెళ్లారు. 1927 జనవరిలో గాంధీజీ నుంచి పటేల్‌కు ఒక లేఖ అందిది. ‘వివాహం చేసుకునే యోచన ఏదీ ప్రస్తుతం మణి దగ్గర లేదు. ఆ విషయం గురించి మీరు ఆందోళన చెందవద్దు. నాకు వదిలిపెట్టండి!’ ఇదీ సారాంశం. చివరికి ఆమె అవివాహితగానే ఉండిపోయారు. సత్యాగ్రహంలో మూడో పటేల్ సహాయ నిరాకరణోద్యమంలో ఆమె గాంధీజీ, తన తండ్రిలతో కలసి పాలు పంచుకున్నారు. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో కూడా ఆమె పాల్గొన్నారు. గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలోనూ కొద్దికాలం ఉన్నారు. 1928 నాటి బార్డోలీ సత్యాగ్రహంలో ముగ్గురు పటేళ్లు కనిపిస్తారు. మొదటివారు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన సర్దార్ పటేల్. రెండు, ఆయన అన్నగారు విఠల్‌భాయ్ పటేల్. మూడు, మణిబెన్ పటేల్. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మణి అరెస్టయ్యారు. పూనా దగ్గరి ఎరవాడ జైలుకు ఆమెను పంపారు. గాంధీజీ చరిత్రలోనే కాకుండా, ఉద్యమ చరిత్రలో కూడా కీలకమైన రెండు ఘట్టాలు అక్కడే చోటు చేసుకున్నాయి. ఆ జైలుకు వెళ్లిన పదిరోజులలోనే గాంధీజీకి ఎంతో ఆప్తుడు, ఆయన కార్యదర్శి మహదేవ దేశాయ్ అనార్యోంతో హఠాత్తుగా కన్నుమూశారు. తరువాత కొద్దికాలానికే కస్తూర్బా కూడా అక్కడే కన్నుమూశారు. అంటే గాంధీజీని బాగా కదిలించిన, కుంగదీసిన రెండు ఘటనలకు మణి ప్రత్యక్ష సాక్షి. నెహ్రూ తీరుకు నిరాశ! 1950లో తండ్రి మరణించిన తరువాత మణిబెన్ ప్రథమ ప్రధాని నెహ్రూను కలవడానికి ఢిల్లీ Ðð ళ్లారు. ఆ క్షణాలను గురించి అమూల్ రూపశిల్పి వర్ఘీస్ కురియన్ (‘నాకూ ఉంది ఓ కల’ పుస్తకంలో) మనసును కదిలించే ఒక ఘట్టాన్ని నమోదు చేశారు. మణిబెన్ స్వయంగా కురియన్‌కు ఈ సంగతి చెప్పారు. ‘నీవు మాత్రమే ఈ పని చేయాలి’ అంటూ తండ్రి చివరి క్షణాలలో పెట్టిన షరతు మేరకు ఒక పెద్ద సంచి, పద్దుల పుస్తకం ఒకటి నెహ్రూకు అప్పగించారు మణి. ఆ సంచిలో 35 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ పుస్తకం పార్టీ ఖర్చులు, విరాళాల వివరాల పుస్తకం. ఈ రెండు అప్పగించిన తరువాత నెహ్రూ నోటి నుంచి ఒక మాట కోసం మణి ఎదురు చూశారట. అదేమిటని కురియన్ అడిగారు. ‘ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న మాట ఆయన నోటి నుంచి వస్తుందని అనుకున్నాను. కానీ ఆయన (నెహ్రూ) ‘థాంక్స్’ అనే వెళ్లిపోయారు’ అని సమాధానమిచ్చారామె. నెహ్రూకూ, పటేల్‌కు మధ్య వైరుధ్యాలు ఆ కాలానికి ఎంత తారస్థాయిలో ఉండేవో దీనిని బట్టే అర్థమవుతుంది. పటేల్ మరణించడానికి రెండు నెలలముందు జరిగిన ఒక ఉదంతం గురించి మణిబెన్ డైరీలో ఏం రాశారో అహ్మదాబాద్‌కు చెందిన రతీన్దాస్ వెల్లడించారు. ‘బాబ్రీ మసీదు జీర్ణోద్ధరణ, సోమ్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణం వేరువేరు అంశాలు.సోమ్‌నాథ్ ఆలయం కోసం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడం లేదు’ అని పటేల్ వివరణ ఇవ్వగానే నెహ్రూ మౌనం వహించారన్నదే ఆ పేజీలోని మాటల సారాంశం. మరోసారి ‘మణి’ దండి యాత్ర గాంధీజీ మరణించే వరకు ఢిల్లీలోని బిర్లా భవన్‌లోనే మణిబెన్ కూడా ఉన్నారు. ఆయన హత్యకు గురైన తరువాత కూడా కొద్దికాలం అక్కడ ఉండవలసిందని బిర్లాలు కోరారు. అందుకు ఆమె అంగీకరించలేదు.తన బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. మణిబెన్ 1976లో మరోసారి దండి యాత్ర జరిపారు. కారణం– భారత ప్రజానీకంలో ధైర్య సాహసాలను పునరుద్ధరించడమే. అది ఎమర్జెన్సీ కాలం.అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న నాయకులను విడుదల చేయాలనీ, ఎమర్జెన్సీ ఎత్తివేయాలనీ, పత్రికల మీద సెన్సార్ షిప్‌ను వెంటనే తొలగించాలనీ నినాదాలు ఇస్తూ ఆమె దండి యాత్ర నిర్వహించారు.ఇందిరాగాంధీ ప్రభుత్వం అరెస్టు చేసింది. మణిబెన్ ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలను వీక్షించి 1990లో అంతిమ శ్వాస విడిచారు. ‘పటేల్‌ది ఒక తాత్విక వారసత్వం.దానిని మేం సొంతానికి ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. దానిని ప్రజలే అర్థం చేసుకోవాలి. అనుసరించాలి. రుద్దే ఆలోచన మాకు లేదు’ అంటున్నారు పటేల్ వారసులు. ముందే రాజకీయాల్లోకి రాలేదు పటేల్ మరణించిన తరువాత మాత్రమే మణిబెన్ రాజకీయాలలోకి వచ్చారు. గుజరాత్ కాంగ్రెస్ శాఖకు కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఎన్నో సాంఘిక, విద్యా సంస్థల కోసం పనిచేశారు. నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ తరఫున తొలి లోక్‌సభకు (1952–1957) ఆమె దక్షిణ కైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తరువాత రెండో లోక్‌సభకు (1957–1962) ఆనంద్ నియోజక వర్గం నుంచి గెలిచారు. 1964–70 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. – గోపరాజు నారాయణరావు -
మహా పోరాటయోధుడు
‘ఒక వ్యక్తికి ఉన్న జీవించే హక్కును హరిస్తే అతడు తిరుగుబాటుదారుడు కాక తప్పదు’ అంటారు నెల్సన్ మండేలా. నిజమే. అణచివేత కలకాలం సాగదు. అణచివేత పెరిగే కొలదీ నియంతల అహంకారం పతనమయ్యే క్షణాలు సమీపిస్తున్నట్టే. ఇదే ప్రపంచ దేశాల చరిత్రలో కనిపిస్తుంది. అయితే అందుకు సాగిన ఉద్యమాల స్వరూపాలు వేరు. పోరాటాల స్వభావాలు వేరు. వాటికి నాయకత్వం వహించిన నేతల పంథాలు వేరు. నెల్సన్ మండేలా అనే మహా పోరాటయోధుడు కూడా అందులో ఒకరు. తన జాతి స్వేచ్ఛ కోసం 27 ఏళ్లు ఆయన తన స్వేచ్ఛను జైలు గోడలకు బలిచేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆధునిక ప్రపంచ చరిత్రలో వివక్షకూ, నిరంకుశత్వానికీ చిరునామాగా కనిపిస్తుంది. ఈ దేశం పేరుతో భారతీయులకు కూడా చిరపరిచయమే ఉంది. ఆ దేశంతో, భారతీయులు జాతిపితగా పిలుచుకునే మహాత్మా గాం«ధీ అక్కడ జరిపిన హక్కుల పోరాట చరిత్రతో భారతీయుల పరిచయం ఉద్వేగ భరితమైనది. నల్లజాతీయులు (అక్కడి శ్వేతజాతి ప్రభుత్వం దృష్టిలో నల్లవారే కాదు, భారతీయుల కూడా నల్లవారి కిందే లెక్క) జుట్టు పెంచినా పన్ను కట్టించుకున్న దేశమది. పెళ్లి కూడా ఒక మత సంప్రదాయం మేరకే జరగాలన్న వ్యవస్థ అది. ఫస్ట్‌క్లాస్ టిక్కెట్‌తో రైలు ఎక్కినా నల్లజాతీయుడు కాబట్టి గాంధీజీని రైలు బోగీ నుంచి కిందకు నెట్టివేసిన అధికార మదం ఆనాటి ఆ దేశ ప్రభుత్వానిది. అలాంటి చోట జాతి వివక్ష ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న శ్వేతజాతిని నెల్సన్ మండేలా తల వంచేటట్టు చేయగలిగారు. నెల్సన్ మండేలా (జూలై 18,1918– డిసెంబర్ 5,2013)కూ, గాంధీజీకీ కొన్ని విషయాలలో సామ్యాలు కనిపిస్తాయి. అహింసా పద్ధతులతో నిరంకుశత్వాన్ని మెట్టు దిగేటట్టు చేయవచ్చునని గాంధీజీ విశ్వాసం. శాసనోల్లంఘన ద్వారా ఎలాంటి ప్రభుత్వాలనైనా కదిలించవచ్చునని ఆయన అనుభవం. నెల్సన్ మండేలా ఉద్యమ తొలి దశ కూడా అలాగే మొదలైంది. అహింస ద్వారా, శాసనోల్లంఘన ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముందు తలొగ్గేటట్టు చేయవచ్చునని ఆయన అనుకున్నారు. కానీ ఆయన శాంతియుత పంథాను విడిచిపెట్టి సాయుథ పథం వైపు నడవక తప్పని పరిస్థితులు తలెత్తాయి. మహాత్ముడి ఉద్యమానికీ, మండేలా ఉద్యమానికి మధ్య కాలం తన లక్షణాన్ని అంతగా మార్చుకుందేమోమరి! మండేలా రాజకీయాలు, ఉద్యమం, ప్రస్థానం గురించి చెప్పుకునే ముందు ఆయన గత చరిత్రను స్మరించుకోవాలి. ఆయనను ఉద్యమకారునిగా మారడం వెనుక వాస్తవాలు అందులోనే ఉన్నాయి. అదొక దేశ చరిత్ర. ఒక జాతి బాధల గాథ. అందులో ఆగ్రహం, ఆవేశాల కథ. ఇలాంటి వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం లాంఛనం అని చెప్పలేం కూడా. అదొక చారిత్రక అవసరం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న కాలమది. కానీ ఆ యుద్ధం తెచ్చిన విపత్తులతో, కరువు కాటకాలతో ప్రపంచం కొత్త యుద్ధం ప్రారంభిస్తున్న కాలం. కానీ ఆ యుద్ధం కొన్ని గణనీయ మార్పులు తెచ్చింది. నాలుగు నియంతృత్వాలు కుప్పకూలాయి. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా నియంతలు పతనమయ్యారు. కొత్త రాజకీయ తాత్వికతలు బలం పుంజుకున్నాయి. రాజకీయాలు వేడెక్కాయి. రాడికల్ భావాలు పదునెక్కాయి. కానీ శ్వేతజాతి అధీనంలో, లేదా శ్వేతజాతి నల్లబంటుల చేతిలో ఉన్న దక్షిణాఫ్రికా మాత్రం మార్పునకు నోచుకోలేదు. బహుశా మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ విజయం అందుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కానీ యుద్ధం ఆరంభం కావడానికి ముందే గాంధీజీ ఆ దేశంలో రాజకీయ చైతన్యానికీ, హక్కుల స్పృహకూ అంకురార్పణ చేశారు. ఇదంతా జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తరువాత దక్షిణాఫ్రికా రాజకీయ వాతావరణం మీద ఉన్న అసంతృప్తి కొత్త మలుపు తీసుకుంది. ఆగ్రహంగా, ఆవేశంగా ఆ అసంతృప్తి రూపు దాలుస్తున్న సమయంలో మండేలా జన్మించారు. నెల్సన్ మండేలా అసలు పేరు నెల్సన్ రోలిలాహ్లా మండేలా. మాడిబా ఆయన ముద్దుపేరు. థెంబు తెగ. కేప్ పరిధిలోని ఉటాటా అనే ప్రాంతంలో మెజో అనే ఊళ్లో ఆయన జన్మించారు. మాట్లాడే భాష హోసా. కానీ చదువుకు సుదూరంగా ఉండిపోయిన తెగలలో అదొకటి. తండ్రి గాడ్లా హెన్రీ. బహుభార్యాత్వం ఉన్న ఆ తెగలో గాడ్లా నాలుగు వివాహాలు చేసుకున్నాడు. వారిలో మూడవ భార్య కుమారుడు నెల్సన్. గాడ్లా థెంబు తెగకు అధిపతి. ఆ తెగ నుంచి మొదటిసారి పాఠశాలలో చేరిన వాడు నెల్సన్ మండేలాయే. అక్కడే క్రైస్తవ ఉపాధ్యాయురాలు ‘నెల్సన్’ అన్న అక్షరాలను అతడి తెగ ఇచ్చిన పేరులో చేర్చింది. అలా ఎందుకు జరిగిందో తనకు మాత్రం తెలియదని మండేలా ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ పుస్తకంలో చెప్పుకున్నారు. తరువాత ఉన్నత చదువుల కోసం ఆయన పెద్ద త్యాగం, సాహసం చేయవలసి వచ్చింది. వారి ఆచారం మేరకు తెగ ఆధిపత్యాన్ని త్యజించిన తరువాత మాత్రమే నెల్సన్‌కు ఉన్నత చదువులకు వెళ్లడానికి అవకాశం చిక్కింది. విట్వాటర్సాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు నెల్సన్. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాలు మొదలయ్యాయి. నల్లజాతీయుల విముక్తికోసం అప్పటికే ఉద్యమిస్తున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో మండేలా సభ్యుడయ్యారు. ఆ వెంటనే, అంటే 1944లో ఆ సంస్థ యువజన శాఖకు నాయకుడయ్యారు. చదువు పూర్తి చేసి న్యాయవాదిగా నల్లజాతీయుల కోసం సలహాలు ఇచ్చేందుకు మొదట ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు (నిజానికి గాంధీజీ చేసిన పని కూడా ఇదే. దక్షిణాఫ్రికా ప్రభుత్వం నుంచి హక్కులు సాధించేందుకు నల్లజాతీయులను, భారతీయులను ఏకం చేయడానికి ముందు గాంధీజీ అక్కడ న్యాయసలహాదారుగానే పనిచేశారు). తన మండేలా బాల్యమిత్రుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు అలీవర్ టాంబో సంఘం ఏర్పాటులో సహకరించారు. 1948 తరువాత జాతి వివక్ష ప్రభుత్వం రుద్దిన చట్టాలతో సర్వం కోల్పోయిన వారికి న్యాయ సహాయం చేయడమే వీరి ఉద్దేశం. దీనితో పాటు ఇలాంటి చట్టాల గురించి నల్లజాతీయులలో అవగాహన కల్పించడానికి దేశమంతా తిరుగుతూ ఉండేవారు. 1948లో జరిగిన ఎన్నికలు నల్లజాతీయుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన నేషనల్‌పార్టీ ప్రభుత్వం నల్లజాతీయుల హక్కులకు మరింతగా ఆటంకాలు కల్పించడం ఆరంభించింది. అప్పటిదాకా జరిగిన పోరాటాలు వ్యర్థమైపోయే సూచనలు కనిపించాయి. అల్పసంఖ్యాక శ్వేత జాతి ప్రభుత్వం మరింత బలపడే విధంగా చర్యలు మొదలయినాయి. పైగా నల్లజాతీయులకు పూర్తి స్థాయి పౌరసత్వం కల్పించాలంటూ అఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం కూడా ఊపందుకుంటున్న కాలం. అందుకోసం అహింసా పద్ధతులలో సమ్మెలు, బాయ్కాట్లు, శాసనోల్లంఘన జరుగుతోంది. అప్పుడే మండేలా ప్రభుత్వం దృష్టిలో పడ్డారు. నిజానికి నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం 1955లో అక్షరబద్ధమైన ‘ఫ్రీడమ్ చార్టర్’ రచనలో కూడా మండేలాదే కీలక పాత్ర. ఆ హక్కుల పత్రాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అందుకే ప్రభుత్వం ఆయన మీద మరింతగా దృష్టి కేంద్రీకరించింది. మండేలాను వెంటాడడం మొదలయింది. నిఘా విస్తరించింది. డిసెంబర్ 5,1956న మండేలా సహా, 155 మంది ఉద్యమకారులను శ్వేతజాతి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆరోపణ – దేశద్రోహం. ఈ కేసును 1961లో న్యాయస్థానం కొట్టివేసింది. కానీ ఒక దశలో మండేలా సహా పలువురికి మరణశిక్ష పడవచ్చునని అంతా భయపడ్డారు. ఇది జరగడానికి ముందే మరో దారుణం జరిగింది. దానిపేరే షార్ప్‌విల్లే హత్యాకాండ. మార్చి 21, 1960న ఆ దుర్ఘటన జరిగింది. నల్లజాతి యువకులను మరింత వేధించడానికీ, వారి జీవించే హక్కును మరింత పరిమితం చేయడానికీ జాత్యహంకార ప్రభుత్వం అంతకు ముందే ఒక చట్టం తెచ్చింది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చే నల్లజాతీయులు వారి వివరాలను తెలిపే పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. 16 సంవత్సరాలు దాటిన ప్రతి నల్లవానికి ఇది అనివార్యం. తరువాత నల్లజాతి మహిళలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపచేశారు. అంటే పట్టణాలకు వారి వలసను నిరోధించడమే ఈ చట్టం ఉద్దేశం. ఇలాంటి పత్రాలు లేవంటూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సంస్థ సభ్యులని, పాన్ ఆఫ్రికన్ ఆఫ్రికనిస్టు కాంగ్రెస్ సభ్యులను వేధించేవారు (పాన్ ఆఫ్రికనిస్టు కాంగ్రెస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో చీలిక వర్గం). అప్పటి నేషనల్‌పార్టీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అధినేత డాక్టర్ హెన్రిక్ వెర్వోర్డ్ ఇందుకు బాధ్యులు. ఈ చర్యకు నిరసనగా శాంతియుతంగా ఉద్యమం చేయాలని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నిజానికి ఆ మార్చి 31న నిరసనలు చేపట్టాలని ఆ సంస్థ ఉద్దేశం. కానీ పాన్ ఆఫ్రికనిస్టులు మార్చి 21న నిరసన జరపాలని నిర్ణయించారు. దేశమంతా ఉద్యమం జరిగినా, షార్ప్‌విల్లే దురాగతం మాత్రం (ట్రాన్స్‌వాల్ దగ్గరలోనిది. ఇది కూడా ఆనాటి గాంధీజీ ఉద్యమ క్షేత్రాలలో ఒకటి) ఘోరమైనది. ఏడు నుంచి పదివేల మంది వరకు ఉద్యమకారులు షార్ప్‌విల్లే పోలీసు స్టేషన్‌ను ముట్టడించాలని వచ్చారు. వారి నినాదం ఒక్కటే– ‘మా దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. మమ్మల్ని వెంటనే అరెస్టు చేయండి!’ ఉద్యమం శాంతియుతంగా జరుగుతూ ఉండగా పోలీసులే రెచ్చగొట్టి కాల్పులు జరిపారని ఉద్యమకారుల ఆరోపణ. ఉద్యమకారులే హింసకు దిగారని పోలీసుల వాదన. ఏమైనా కాల్పులలో 69 మంది చనిపోయారు. 29 మంది చిన్నారులు సహా 260 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉదంతమే చాలామంది నల్లజాతీయులకు శాంతియుత పంథా మీద నమ్మకం పోయేలా చేసింది. ఈ దుర్ఘటన దక్షిణాఫ్రికా నల్లజాతీయుల మనసులను ఎంతగా గాయపరిచిందంటే, ఆ రక్తపంకిల చరిత్రను నేటికీ మార్చి 21న దేశమంతా స్మరించుకుంటుంది. ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. షార్ప్‌విల్లే హింసాకాండతో మండేలా కూడా తన అహింసా సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. 1961లో ఏర్పడిన ఉఖంటో వి సిజ్వే (జాతి చేతిలోని బల్లెం) లేదా ‘ఎమ్ కె’ అనే సంస్థలో ఆయన సభ్యుడయ్యారు. నిజానికి ఇది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌తో ఎడబాటు కాదు. ఎమ్ కె కూడా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేసే సాయుధ పోరాట సంస్థ. గెరిల్లా పోరాట పంథాలో జాత్యహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం దీని ఉద్దేశం. ఇందుకోసమే ఆయన అల్జీరియా వెళ్లి కొద్దికాలం గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ పొంది వచ్చారు. కానీ అక్కడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆగస్ట్ 5, 1962న మండేలాను జాత్యహంకార ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ రోజే బయటి ప్రపంచంతో ఆయన బంధం తెగిపోయింది. మళ్లీ ఆయన వెలుగు చూడడానికి 27 ఏళ్లు పట్టింది. విచారణ తరువాత మండేలాను జూన్ 12, 1964న కేప్‌టౌన్‌కు సమీపంలోని రూబెన్స్ ఐలెండ్ జైలుకు తరలించారు. ఇందులో ఆయన ఏకాంత ఖైదీ. భార్య విన్నీ మండేలాను తప్ప వేరెవరినీ ఆయనను కలుసుకోవడానికి అనుమతించలేదు. ఖైదీ నం. 46664 ముద్రతో రాళ్లు కొట్టారు. కానీ ఆ రాళ్లతో పాటు జాత్యహంకార ప్రభుత్వ ఆధిపత్యం కూడా చితికిపోతూ వచ్చిందన్నది వాస్తవం. మండేలా స్వస్థలం ట్రాన్స్కెయికి పరిమితమైతే విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. అందుకు మండేలా సమాధానం, ‘జాతి వివక్ష ఎన్ని రూపాల్లో ఉన్నప్పటికీ దాని అన్ని రూపాలను కూడా నేను తీవ్రంగా ద్వేషిస్తున్నాను. దీని మీద తుది వరకు పోరాడతాను.’ 1973 నుంచి 1988 వరకు కూడా ఇలాంటి ప్రతిపాదనను అంగీకరించమని ప్రభుత్వం మండేలాను బలవంత పెడుతూనే ఉండేది. మధ్యలో మాట మార్చి హింసను వీడితే విడుదల గురించి ఆలోచిస్తామని కూడా 1985లో మరో ప్రతిపాదన పంపించింది. దీనిని కూడా ఆయన అంగీకరించలేదు. ఆయన రూపం మారిపోయింది. ఆరోగ్యం క్షీణించింది. అవేమీ బయట ప్రపంచానికి తెలియకుండానే 18 ఏళ్లు గడచిపోయాయి. 1988లో క్షయ వ్యాధి సోకింది. అప్పెడు విక్టర్ వెర్సటర్ జైలుకు తరలించారు. మధ్యలో మళ్లీ పోల్స్మూర్ జైలులో కొన్నాళ్లు ఉంచారు. 1980 నాటికి ప్రపంచంలో మండేలా విడుదలకు ఉద్యమం ప్రారంభమైంది. కానీ జాత్యహంకార ప్రభుత్వం వాటిని చెవిన పెట్టలేదు. కానీ 1990 నాటికి అధ్యక్షుడు బోథా అధ్యాయం ముగిసింది. జాత్యహంకార ప్రభుత్వం వాస్తవాలను గుర్తించక తప్పని వాతావరణంలో బోథాకు ఎఫ్ డబ్లు్య డీక్లార్క్ వారసునిగా అధ్యక్ష స్థానంలోకి వచ్చాడు. ఇతడు కొన్ని వాస్తవాలను గమనించాడని చెప్పక తప్పదు. అంతర్జాతీయ ఒత్తిడి ఎక్కువయింది. అంతర్యుద్ధ భయం పెరిగింది. దీనితో చర్చలు జరిపి మొత్తానికి మండేలాను విడుదల చేయడమే కాకుండా నల్లజాతీయులకు అధికారం అప్పగించడానికి కూడా అంగీకరించాడు డీక్లార్క్. అలా ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మండేలా విడుదల సాధ్యమైంది. ఫిబ్రవరి 11, 1990 ఆయన జైలు నుంచి విముక్తి పొందారు. అంతకాలం దాదాపు రెండు దశాబ్దాల పాటు మండేలా అంటే ఒక్క ఫొటోను బట్టే తెలిసేది. కానీ ఆయన బయటకు వచ్చే సమయానికి ఆ రూపమే వేరు. పుట్టుకతోనే మనిషిలో ద్వేషించే గుణం ఉండదని అంటారు మండేలా. అది ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. అందుకే రంగు ఏదైనా అందరికీ స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఉండాలన్నదే నా ఆకాంక్ష అన్నారాయన. ఇది ఆయన దక్షిణాఫ్రికాకు అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత అన్న మాట అనుకుంటే పొరపాటు. ఆయన జైలులో మగ్గుతున్నప్పటికీ కూడా అలాంటి మాట ఆయన హృదయం పలకగలిగింది. అందుకే మండేలా మహోన్నతుడయ్యాడు. అమెరికా ఆయన మీద ఉగ్రవాది ముద్ర వేసింది. కానీ ప్రపంచం ఆ ముద్రను పట్టించుకోలేదు. ఒక పోరాట యోధునిగా, హక్కుల ఉద్యమానికి నిలువెత్తు ఆదర్శంగా గౌరవించింది. మండేలా 1994–1999 మధ్య దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా పనిచేశారు. దేశంలోని నలుపు తెలుపు వర్ణాల మధ్య అంతరాలను నిర్మూలించడానికి ఆ కొద్దికాలంలోనే ఆయన కృషి చేశారు. వారి మనసుల మధ్య ఇంద్రచాపం వంటి వారథి నిర్మించడానికి తపన పడ్డారు. రగ్బీ తెల్లజాతి క్రీడ కాబట్టి దానిని దూరంగా ఉంచాలని ఉద్యమకాలంలో కొందరు గట్టిగా అభిప్రాయపడ్డారు. దానిని చాలాకాలం అమలు చేశారు. కానీ ఆ క్రీడను తిరిగి ఆడమని అందరినీ ఆయన ప్రోత్సహించాడు. సయోధ్యకు మండేలా అనుసరించిన వ్యూహం ఇంత సున్నితంగా ఉంది. దక్షిణాఫ్రికాకు ఆయన అధ్యక్షుడైన తరువాతే తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వెనుకబాటు తెచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్న తన వారి కోసం 500 ఆస్పత్రులు నిర్మించాడాయన. 15 లక్షల మంది బాలలను బడికి పంపించాడు. చిరకాలం బానిసత్వంతో మగ్గిన ఒక జాతిని పునరుజ్జీవింప చేయడానికి ఆయన చేసిన కృషి మండేలాలోని పరిపాలకుడిని, ద్రష్టనే కాకుండా ఆయనలోని నిజమైన రాజనీతిజ్ఞుడిని ఆధునిక ప్రపంచం ఎదుట ఆవిష్కరించింది. పదవి నుంచి దిగిపోయిన తరువాత మండేలా సేవారంగాన్ని ఎంచుకున్నారు. ఆయన కుమారుడు ఎయిడ్స్ వ్యాధితో మరణించాడు. అతడి జ్ఞాపకార్థం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన పనిని చేపట్టారు మండేలా. భార్య విన్నీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమెతో విడిపోయారు. తాను ఒక జాతి స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మాట నిజమే అయినా, తనకూ కొన్ని బలహీనతలు ఉన్నాయని, కాబట్టి తనను మనిషిగానే చూడాలని ఆయన సవినయంగా మనవి చేశారు. జీవితాన్ని తెరచిన పుస్తకంలా ప్రపంచం ఎదుట ఇలా ఉంచిన నేతలు నిజంగానే అరుదు. - డా. గోపరాజు నారాయణరావు -
జాతిపితా... నన్ను దీవించండి
‘ఎవరిది వాళ్లకుంటుంది’.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని డైలాగ్ ఇది. ఎవరిది వాళ్లకు ఉన్నప్పుడు అడాల్ఫ్ హిట్లర్‌కి, నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కి ఇంకెంతుండాలి? హిట్లర్ నియంత. నేతాజీ.. నియంతలకే ఒక వింత! స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ గైడ్ లైన్స్ ఏవీ ఫాలో కాలేదు నేతాజీ. ‘శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదు, గన్ తీసి కణతలకు గురిపెడితే వస్తుంది’ అని గాంధీజీతోనే వాదించినవాడు నేతాజీ. అలాంటి వాడు జర్మనీతో టై–అప్ అయి, బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ఇండియాకు స్వాతంత్య్రం సంపాదించాలని ప్లాన్ వేసుకుని హిట్లర్ని కలవడానికి వెళ్లాడు. సహాయం కోసం కాదు, ‘ఇచ్చిపుచ్చుకోవడం’ అనే డీల్ కోసం వెళ్లాడు. హిట్లర్ కూడా బ్రిటన్‌పై పోరాడుతున్నాడు కాబట్టి, నేతాజీ సైన్యం (సొంత సైన్యం) హిట్లర్‌కు, హిట్లర్ సైన్యం నేతాజీకి హెల్ప్ చేస్తుంది. అది మాట్లాడ్డానికి వెళ్లాడు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అవుతాడు అనే సింపుల్ లాజిక్‌తో వెళ్లాడు. తగ్గి వెళ్లలేదు. దేశం కోసం తగ్గితే మాత్రం ఏముంది అనీ వెళ్లలేదు. చెయ్యి కలిపితే కలిపాడు, లేకుంటే లేదు. ఎవరిది వాళ్లకు ఉంటుంది.. అనుకుని వెళ్లాడు. హిట్లర్ అనుచరులు నేతాజీని ఆహ్వానించారు. అయితే హిట్లర్ దగ్గరికి వెళ్లనివ్వలేదు. బయటి గదిలోనే కూర్చోబెట్టారు! ‘ఫ్యూరర్ లోపల ఇంపార్టెంట్ మీటింగులో ఉన్నారు’ అని చెప్పారు. ఫ్యూరర్ అంటే లీడర్ అని.నేతాజీ చాలాసేపు బయటే వేచి ఉన్నాడు. బల్ల మీద న్యూస్ పేపర్లు ఉంటే, వాటిని తిరగేస్తున్నాడు. ఎంతసేపటికీ రాడే హిట్లర్! చివరికి వచ్చాడు. వచ్చాక నేతాజీని చూసీచూడనట్లు మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నేతాజీ కూడా గమనించీ, గమనించనట్లు ఉండిపోయాడు. హిట్లర్ రావడం, నేతాజీని చూడడం; నేతాజీ కూడా హిట్లర్‌ను గమనించడం, గమనించనట్లు ఉండడం.. అలా చాలాసార్లు జరిగింది. తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి, నేతాజీ పక్కన నిలుచున్నాడు హిట్లర్. నేతాజీ పట్టించుకోలేదు. పేపర్ చదువుతున్నట్లుగా ఉండిపోయాడు. హిట్లర్.. నేతాజీ వెనక్కు Ðð ళ్లి నిలుచుని నేతాజీ భుజాలపై చేతులు వేశాడు! వెంటనే నేతాజీ తలతిప్పి చూసి, ‘‘హిట్లర్!’’ అన్నాడు. హిట్లర్ నవ్వాడు. ‘‘హిట్లర్‌నని నువ్వెలా చెప్పగలవ్?’’ అన్నాడు. నేతాజీ నవ్వాడు. ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్ చంద్రబోస్ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అన్నాడు. అంతేగా. ఎవరిది వాళ్లకుంటుంది. హిట్లర్‌కి చాలామంది డూప్‌లు ఉండేవాళ్లు. డూప్‌లకు పల్టీకొట్టే రకం కాదు నేతాజీ. ప్రతి లక్ష్యానికీ రెండు దారులు ఉంటాయి. ‘కంటికి కన్ను’ దారొకటి. ‘రెండో చెంప’ దారొకటి. మొదటి దారి నేతాజీది. రెండో దారి గాంధీజీది. అలాగని నేతాజీ.. గాంధీజీని గౌరవించకుండా లేరు! సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న ‘ఆజాద్ హింద్’ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ, తొలిసారిగా నేతాజీ.. గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా.. నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’అని కోరాడు. (రేపు.. జనవరి 23.. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి). – మాధవ్ శింగరాజు -
1600మంది ఖైదీలకు విముక్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్, జయలలితల జయంతి సందర్భంగా తమిళనాడు జైళ్లలోని 1,600 మంది యావజ్జీవ ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించనున్నది. ఎంజీఆర్ జయంత్యుత్సవాలను ఈనెల 17వ తేదీన, వచ్చే నెల 25న జయలలిత జయంతిని నిర్వహించనున్నారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో పదేళ్లకుపైగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని జైళ్లలోని జాబితాను కలుపుకుంటే 1,900 మంది ఖైదీల విడుదలకు జైళ్లశాఖ నుంచి సిఫార్సులు అందాయి. వీరిలో 1,600 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
సత్యమే సుందరం
ఆయన అమృతహస్తాలు ఆపన్నులను ఆదుకున్నాయి. కష్టాలలో ఉన్నవారిని సేదతీర్చాయి. ఆయన వితరణ దాహార్తితో పరితపిస్తున్న లక్షలాది ప్రజల దాహార్తి తీర్చింది. ఆయన చేసిన విద్యాదానం ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించింది. ప్రేమపూరితమైన ఆయన పలుకు, వెచ్చని ఆయన స్పర్శ వేలాదిమందికి ఉపశమనం కలిగించింది. ఆయన నీతిబోధ, సత్యవాక్పాలన, సేవానిరతి ప్రపంచదేశాలన్నింటికీ పాకి, కోటానుకోట్ల మందిని శిష్యులుగా చేసుకుంది. ప్రేమ, శాంతి, సహనం, సత్యం, సేవాతత్పరత వంటి అనేక ఉత్తమ గుణాలు కలగలసిన భగవాన్ శ్రీసత్యసాయిబాబా బోధామృతం నుంచి జాలువారిన కొన్ని బిందువులు... భారతదేశం అపూర్వ ఆధ్యాత్మిక సంపదకు పుట్టినిల్లని, మన పూర్వీకులు, ఋషులు చేసిన కృషి ఫలితమే మన సంస్కృతీ సంప్రదాయాలని, ఇటువంటి పవిత్ర భారతదేశంలో మనం పుట్టడం జన్మజన్మల అదృష్టమని బాబా ఎప్పుడూ చెప్పేవారు. నేను దేవుడనే– మీరూ దేవుడే నేనూ దేవుడినే, మీరూ దేవుడే, కాని, ఆ విషయం నాకు తెలుసు కాని మీకు తెలియదని పలుమార్లు చెప్పేవారు బాబా. మానవ నిజస్వరూపం, మన కంటికి కనిపించే స్వరూపం కాదని, ప్రేమ మన నిజమైన స్వరూపమని, దానిని మనమంతా పెంపొందించుకోవాలని చెబుతూ, అందుకు నిదర్శనంగా అందరినీ ‘ప్రేమస్వరూపులారా’ అనే పిలిచేవారు.భారతదేశంలో పుట్టిన ప్రతివారూ పేదయినా, ధనికుడైనా, ఈ ఆధ్యాత్మిక సంపదకు అందరూ వారసులేనని, దాని విలువ గుర్తించలేక మన సంఘం మనకు చూపించే ధన సంపద, ఆర్జన, సుఖాలు, వైజ్ఞానికత వంటి వాటితో కాలం గడుపుతూ మన జీవితాలను నిష్ప్రయోజనం కావించుకుంటామని అనేక ప్రసంగాలలో ఆవేదన వ్యక్తం చేసేవారు బాబా.మన చుట్టూ ఉన్న సంఘాన్ని చూసి, ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని, తాను చనిపోయినప్పుడు తనతో రాదని తెలిసినా, తనకు కావలసిన దానికన్నా అధిక సంపాదన కోసం, భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారని చెబుతారు. భగవంతుడు సృష్టించిన 84 లక్షల జీవరాశులలో, మానవ సృష్టి అత్యద్భుతమని, మానవ జాతికి అదనంగా ఇచ్చిన ‘విచక్షణ’ అనే జ్ఞానం ఒక పెద్ద వరమని, దాని ఉపయోగంలో అంటే ఏది చెడు, ఏది మంచి అని తెలుసుకొని, ఆదర్శంగా, ఆధ్యాత్మికంగా, సుఖమయ జీవితాన్ని అనుభవించవచ్చని బోధిస్తారు. ధనసంపాదనే ధ్యేయంగా ఉన్న ఈ సంఘంలో, మనకు తెలియకుండానే మనలో స్వార్థం పెరుగుతుందని, ఆ స్వార్థమే జాతి, దేశ సంస్కృతి వినాశాలకు దారి తీస్తుందని, ప్రపంచ చరిత్ర కూడా అదే నిజమని నిరూపించిందని చెబుతుంటారు. స్వార్థంతో... సర్వప్రాణులందరూ ప్రేమతత్వాన్ని పెంచుకోవడమే మనకు అంటుకున్న స్వార్థానికి విరుగుడు అని అంటారు. ఈ విషయంలో ‘నీ స్నేహితులెవరో చెబితే, నీవు ఎటువంటి వాడివో నేను చెబుతాను’ అని అంటారు. అంటే మన చుట్టూ ఉన్న సంఘం మనమీద ఎంత ప్రభావం చూపుతుందని చెప్పడం, చాలా సాధారణంగా ‘అందరినీ ప్రేమించు– అందరినీ సేవించు’ ‘అందరికీ సాయం చెయ్యి ఎవరినీ బాధపెట్టకు’ అనే విచక్షణతో, ప్రేమను పెంచుకోవచ్చని, ఎంతటి కరడుగట్టిన స్వార్థాన్ని కూడా కరిగించే అవకాశమని, జీవిత పరమార్థమని బోధిస్తాడు. శక్తి కొలది తనకు భగవంతుడు ఇచ్చిన దానిలో (సంపద కాని, విజ్ఞానం కాని, శక్తి కాని అధికారం కాని, ఏదైనా కాని తోటి అభాగ్యులకు సేవ చేయగలిగితే, ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవచ్చని, తన జీవితమే దానికి నిదర్శనమని అంటారు. పదవుల కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం, ప్రచార నిమిత్తం చేసే సేవలు స్వార్థాన్ని పెంచుతాయేగాని, తగ్గించవంటారు. ప్రతి మానవుడు తన జీవితం కోసం బాధ్యతల కోసం, కావలసిన ధనాన్ని సంపాదించుకుంటూ, తోటి మానవునికి, జీవులకు తన శక్తి కొలది నిస్వార్థమైన సేవ చేస్తే, ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటూ భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చని చెప్పేవారు. మన జీవన ప్రయాణం మానవత్వం నుంచి దైవత్వానికే మన జీవన ప్రయాణం అనేవారు... సర్వులందు ప్రేమయే వారు జగతికి ఇచ్చిన సందేశం. స్వామి జన్మదిన సందర్భంగా మనం వారు చెప్పిన విధానంలో మనలోని ప్రేమను పెంచుకుంటూ, తోటివారికి శక్తి కొలది సహాయ పడుతూ, ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటూ, సనాతన ధర్మాచరణతో ఈ మిగులు జీవితాన్ని సార్థకత చేసుకునే ప్రయత్నం చేద్దాం. – శంకర నారాయణ ప్లాంజెరి (హ్యూస్టన్, అమెరికా నుంచి) ►క్రమశిక్షణ ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు. ►ఈ రోజును ప్రేమతో మొదలు పెట్టు ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. ► రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. దేవుణ్ణి గుర్తించడానికి అదే సరైన దారి. ►కోరికలు ప్రయాణాలలో తీసుకు వెళ్లే వస్తువులలాంటివి. ఎక్కువయిన కొద్దీ జీవిత ప్రయాణం కష్టం అవుతుంది. ► దైవమే ప్రేమ; ప్రేమలో జీవించు. ►ప్రతి అనుభవం ఒక పాఠం. ► ప్రతి వైఫల్యం ఒక లాభం. ►ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ►ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ►ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ► ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది. ►దేవుడు ఆకాశం నుంచి దిగి మరల పైకి ఆకాశానికి వెళ్లేవాడు కాదు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ►అన్ని ప్రాణులను ప్రేమించు అది చాలు. ►నేటి విద్యార్థులే రేపటి గురువులు. ►ఇంటిలో ఆదర్శం ఉంటే, దేశంలో నిబద్ధత ఉంటుంది. ► సత్యానికి భయం లేదు. అసత్యం నీడను చూసి కూడా వణుకుతుంది. -
అభినవ ఆధ్యాత్మిక తపశ్చక్రవర్తి
పతనావస్థలో ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ ఒక్క తాటిమీద నడిపించగల శక్తి ఒక్క అద్వైత మతానికే ఉందనీ, దాంతోనూ ఐక్యతను సాధించవచ్చనీ, అందుకు తన శిష్యులను కూడా సమాయత్తం చేయాలనీ సంకల్పించారు శంకర భగవత్పాదులు. అందులో భాగంగా భారతదేశం నలుమూలలా నాలుగు పరమ పీఠాలను స్థాపించారు. వాటిలో ఒకటి కర్ణాటక రాష్ట్రం చిక్మగళూర్ జిల్లాలోని శ్రీశృంగేరీ శారదాపీఠం. ఈ పీఠానికి మొట్టమొదటి అధిపతి శ్రీశ్రీశ్రీ సురేశ్వరాచార్య. కాగా శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి 36వ (పస్తుత) అధిపతి. ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామివారు. భారతీతీర్థులకు ముందు శ్రీమదభినవ విద్యాతీర్థుల వారు అధిపతిగా ఉన్నారు. నేడు వారి జయంతి. ఈ సందర్భంగా వారి గురించి స్మరించుకుందాం... శ్రీ శృంగేరి జగద్గురు పీఠాన్ని అలంకరించిన శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామివారు పూర్వపీఠాధిపతుల తేజశ్శక్తులను సంగ్రహించి, సంప్రదాయ సిద్ధంగా మత వ్యాఖ్యానం చేస్తూ, అన్ని తరగతుల వారితోనూ, అన్ని రకాలైన శిష్యులతోనూ, సత్యసాధకులతోనూ, సత్యశోధకులతోనూ సన్నిహితంగా మెలిగారు. ఆదిశంకరుల తర్వాత కాలినడకన మూడుమార్లు భారతదేశమంతటా పర్యటించారు. తమ అనుగ్రహ భాషణంతో, ఆశీర్వచన బలంతో ఛిన్నాభిన్నమైన అనేక జాతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక శక్తులను పోగు చేసి, దేశాన్ని ఏకం చేశారు. బెంగళూరుకు చెందిన కైపు రామశాస్త్రి, వెంకటలక్ష్మి పుణ్యదంపతులకు పింగళ నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు అనగా 1917 సంవత్సరంలో జన్మించిన శ్రీనివాస శాస్త్రి, అసాధారణ ధారణ శక్తితో, అనన్య సామాన్యమైన శాస్త్రజ్ఞానంతో గురువనుగ్రహంతో ప్రతిష్ఠాత్మకమైన శృంగేరీ పీఠానికి 35వ జగద్గురువు స్థానాన్ని అలంకరించి, ఆ స్థానానికే వన్నె తెచ్చిన మహనీయులు. దక్షిణ భారతదేశమంతటా అనేకమార్లు సంచరించి, అనేక స్థలాలలో పలు ధర్మకార్యాలను జరిపించారు. విద్వత్సభలను ఏర్పాటు చేశారు. శ్రీ శంకర భగవత్పాదులపై భక్తిని కలిగించేందుకు ‘అఖిల భారత శంకర సేవాసమితి’ అనే సంస్థను స్థాపించారు. శ్రీ శృంగేరీ శంకర మఠ శాఖలను నెలకొల్పారు. హైదరాబాద్‌లోని నల్లకుంటలోగల శ్రీ శృంగేరి శారదాపీఠం నిత్యనామార్చనలతో, సుప్రభాత సేవలతో, కుంకుమపూజలతో భక్తుల నీరాజనాలందుకుంటూ కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఆ చల్లని తల్లి శ్రీశారదాంబ విగ్రహ ప్రతిష్ఠాపన 1960లో శృంగేరీ పీఠాధిపతి పరమగురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థమహాస్వామి దివ్యహస్తాల మీదుగా జరగడం భాగ్యనగర వాసుల భాగ్యంగా చెప్పుకోవచ్చు. -
ఊరూరా పాపన్న జయంతి
సాక్షి, హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ జయంతిని ఈ నెల 18న రాష్ట్రంలో గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం రవీంద్రభారతిలో జైగౌడ్ ఉద్యమం– జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి వారోత్సవాలను నిర్వహించారు. జమీందారీ, దొరల వ్యవస్థ రూపుమాపితేనే బహుజనులకు మేలు జరుగు తుందని భావించిన గొప్ప వ్యక్తి పాపన్న అని స్వామిగౌడ్ కొనియాడారు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండనే గెలిచారన్నారు. వివాహ శుభలేఖల్లో పాపన్న బొమ్మను ముద్రిం చుకోవాలన్నారు. పార్టీలు కాదని జాతి, కులం, బంధుత్వం ప్రధానమన్నారు. ప్రతి గౌడ తమ వాహనాలపై సర్దార్ అని రాసుకోవాలని సూచిం చారు. వట్టికూటి రామారావు ఎంతో కష్టించి గౌడ బంధువుల్ని కలుపుకుని జైగౌడ ఉద్యమం గ్రామగ్రామన తీసుకెళ్లటంతోనే సర్దార్ పాపన్న గౌడ గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. సినీï నటుడు తల్వార్ సుమన్‌గౌడ్ మాట్లాడుతూ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రికి విన్నవిద్దామన్నారు. నగరంలో గౌడ భవన్ నిర్మించాలని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వమే సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహిం చాలని, పాపన్న గీత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.5వేల కోట్లు కేటాయించాలని జైగౌడ ఉద్యమం జాతీయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వట్టికూటి రామారావుగౌడ్, డాక్టర్ చిర్రా రాజుగౌడ్ కోరారు. గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, ఆర్టీవోలు చక్రవర్తిగౌడ్, రవీందర్‌గౌడ్, పీపీ కృష్ణమూర్తిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు మదన్‌మోహన్‌గౌడ్, వ్యాపారవేత్త బాలగోని బాలరాజ్‌గౌడ్, విద్యావేత్త సుభాష్ గౌడ్, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్, జాతీయ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, పులుస మురళీగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ బూర మల్సూర్‌గౌడ్ పాల్గొన్నారు. -
కోరిక తీర్చలేదని చంపేశాడు
యువతి పాలిట కాలయముడైన ప్రియుడి స్నేహితుడు బుచ్చిరెడ్డిపాళెం (కోవూరు) : ప్రియుడి స్నేహితుడు ఆమెపై కన్నేశాడు. కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. చివరకు కాలయముడిలా మారి ఆమెను హతమార్చాడు. అదే సమయంలో ఆమె ప్రియుడు అక్కడకు చేరుకున్నా మౌనం వహించాడు. హంతకుడితో కలిసి యువతి మెడలోని బంగారు నగలతో ఉడాయించాడు. యువతి అదృశ్యం కేసు కీలక మలుపులు తిరిగి.. చివరకు హత్య కేసుగా తేలింది. వివరాల్లోకి వెళితే.. బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన చీదెళ్ల జయంతి అనే యువతి ఖాదర్‌నగర్‌కు చెందిన వివాహితుడు మస్తాన్‌తో ఈ ఏడాది జనవరిలో వెళ్లిపోయింది. వారిద్దరూ జనవరి 7వ తేదీన తిరుమలలో వివాహం చేసుకున్నారు. మరునాడు కట్టుబడిపాళెం చేరుకున్నారు. ఈ వ్యవహారంపై మస్తాన్ ఇంట్లోను, జయంతి ఇంట్లోను వివాదం రేగింది. దీంతో ఇద్దరూ కలిసి వేరేచోటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు మస్తాన్ తన స్నేహితుడైన నాయుడుపేటకు చెందిన నరేష్‌ను సాయం కోరారు. మస్తాన్, జయంతి, నరేష్ కలిసి 9వ తేదీన హైదరాబాద్‌కు బయల్దేరారు. పదో తేదీ అక్కడకు చేరుకున్నారు. సిటీ బస్సు ఎక్కి నిర్మల్‌లోని శివారు ప్రాంతమైన శాంతినగర్‌కు వెళ్లారు. అక్కడ కూర్చుని ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనే విషయాలను చర్చించారు. అనంతరం మస్తాన్ బహిర్భూమికి వెళ్లాడు. అప్పటికే జయంతిపై కన్నేసిన నరేష్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. జయంతి ప్రతిఘటించడంతో పీకపిసికి చంపేశాడు. తిరిగొచ్చిన మస్తాన్‌కు జరిగిన విషయం చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారు. విషయం బయటకు తెలియకుండా జయంతి నోట్లో పురుగు మందు పోశారు. ఆమె ఒంటిపై ఉన్న రెండున్నర సవర్ల బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించారు. జనవరి 11న ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. నిర్మల్ ఎస్సై సునిల్‌కుమార్ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా కేసు నమోదు చేశారు. ఆమె హత్యకు గురైనట్టు పోస్టుమార్టంలో తేలడంతో సెక్షన్ 302గా కేసు మార్చారు. విచారణలో భాగంగా... జయంతి కనబడటం లేదని జయంతి తల్లి అంకమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ ఏడాది మార్చిలో బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులకు మస్తాన్, నరేష్ విషయం తెలిసింది. ఇరువురిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారిని నిర్మల్ తీసుకెళ్లారు. గుర్తు తెలియని మృతదేహం జయంతిదేనని సీఐ సుబ్బారావు, ఎస్సై నాగశివారెడ్డి నిర్ధారించారు. దీంతో అక్కడి కేసు వివరాలను తీసుకుని బుచ్చిరెడ్డిపాళేనికి వచ్చారు. మస్తాన్, నరేష్‌ను విచారణ జరుపుతున్నారు. దీనిపై ఎస్సై నాగశివారెడ్డిని సంప్రదించగా జయంతి హత్య చేయబడిందన్న వార్త వాస్తవమేనన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
ఘనంగా నరసింహ స్వామి జయంత్యుత్సవాలు
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురష్కరించుకుని దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ పల్లకిలో కూర్చోబెట్టి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. -
వైభవంగా నృసింహ జయంతి
ఆళ్లగడ్డ : అహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు శనివారం నుంచి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మమార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తిరమంజనం నిర్వహించి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ ఉత్సవాలు రోజుకో రకంగా ఈ నెల 9 వరకు వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆలయ వర్గాలు తెలిపాయి. -
పాదముద్రలు
నేడు అంబేడ్కర్ జయంతి ►1891: ఏప్రిల్ 14న రామ్‌జీ శక్పాల్ – భీమాబాయిలకు 14వ సంతానంగా అంబేడ్కర్ జన్మించారు. తండ్రి రామ్‌జీ మిలిటరీ పాఠశాలలో టీచర్. ►1904: రామ్‌జీ శక్పాల్ తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబాయికి మార్చారు. ►1907: భీమ్రావు మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే సంవత్సరం రమాబాయితో వివాహం. ►1911: మహారాజా సాయాజీరావు గైక్వాడ్ అంబేడ్కర్ కళాశాల విద్య కొనసాగించటం కోసం నెలకు రూ.25 ఇవ్వడానికి వాగ్దానం చేశాడు. ►1912: డిసెంబర్ 12న అంబేడ్కర్ పెద్ద కుమారుడు యశ్వంత్ జన్మించాడు. ►1913: ముంబయి విశ్వవిద్యాలయం నుండి అంబేద్కర్ బిఏ పరీక్ష పాసయ్యి బరోడా ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగిగా చేరాడు. బరోడా మహారాజు అంబేడ్కర్ విదేశాల్లో చదువుకునేందుకు సంవత్సరానికి 230 పౌండ్ల ఉపకార వేతనాన్ని మంజూరు చేశాడు. ఉన్నత విద్య అనంతరం బరోడా రాష్ట్రంలో పదేళ్ళపాటు ఉద్యోగం చేయాలన్న నియమంపై అంబేడ్కర్ సంతకం చేశాడు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో అంబేడ్కర్‌కు ప్రవేశం లభించింది. ►1916: కొలంబియా యూనివర్శిటీలో అంబేడ్కర్ ‘భారతదేశంలో కులాలు’ అనే ఆలోచనా ప్రేరక వ్యాసాన్ని సమర్పించారు అంబేడ్కర్ అమెరికా వదిలి (మే నెల) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పాలిటిక్స్‌లో ఎంఎస్సీ, డిఎస్సీలు చదవటానికి (అక్టోబర్) ఇంగ్లండ్ చేరుకున్నాడు. కొలంబియా విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ డిగ్రీకి సమర్పించిన ‘భారత జాతీయ ఆర్థిక వనరులు, చారిత్రక విశ్లేషణ’ అనే పరిశోధనా వ్యాసానికి అనుమతి లభించింది. ► 1917: బరోడా ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనం కాలపరిమితి అయిపోయినందున అంబేడ్కర్ చదువును మధ్యంతరంగా ఆపివేసి భారత్ వచ్చేశాడు. మహారాజా సాయాజీరావుని కలుసుకుని బరోడా ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. అస్పృశ్యత సృష్టించిన అవమాన సంఘటనలతో అనతికాలంలోనే ఉద్యోగం వదిలివేసి అంబేడ్కర్ ముంబయి రావలసి వచ్చింది. ► 1923: హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. ► 1927: ఫిబ్రవరి 18న ముంబయి శాసనసభ సభ్యుడిగా అంబేడ్కర్ ప్రమాణ స్వీకారం చేశాడు. ► 1930: అక్టోబరు 4న అంబేద్కర్ మొదటి రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు లండన్ వెళ్ళాడు. సమావేశంలో ఆయన అస్పృశ్యుల ప్రతనిధిగా నమోదయ్యాడు. ► 1931: ముంబయిలోని మణిభవన్‌లో అంబేడ్కర్ గాంధీజీని మొట్టమొదటిసారిగా కలిశాడు. గాంధీజీతో అంబేడ్కర్ ‘నాకు స్వదేశం ఉందని మీరంటున్నారు. మళ్ళీ చెబుతున్నాను. నాకు స్వంత దేశం లేదు. మమ్మల్ని పిల్లులు, కుక్కలకన్నా హీనంగా చూస్తుంటే ఇది నా దేశమని, ఇది నా మతమని ఎలా అనుకుంటారు. నేనే కాదు కొద్దిపాటి ఆత్మకౌరవమున్న ఏ అస్పృశ్యుడూ ఈ నేలను చూసి గర్వపడలేడు’ అన్నారు. ► 1935: అంబేడ్కర్ భార్య శ్రీమతి రమాబాయి అంబేడ్కర్ మే, 27న ముంబయిలో మరణించారు. ► 1942: భారత్ వైస్రాయ్ గారి కార్యనిర్వాహక వర్గంలో డా. అంబేడ్కర్‌కు స్థానం కల్పించారు. అంత పెద్ద పదవిని పొందిన తొలి అస్పృశ్యుడు ఆయనే. ► 1946: రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం జరిగింది. డా. రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ► 1948: రాజ్యాంగ ముసాయిదా ప్రతిని అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో చర్చ కోసం సమర్పించారు. అదే సంవత్సరం డా.సవితతో వివాహం. ► 1950: స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్ ప్రమాణ స్వీకారం. ► 1956: డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీ అలీపూర్ రోడ్డులోని 26 నంబర్ ఇంటిలో డా. అంబేడ్కర్ తుదిశ్వాస విడిచారు. లక్షలాది ప్రజల దర్శనం... బొంబాయి – దాదర్ సముద్ర తీరంలో బౌద్ధమత ఆచారాలతో కుమారుడు యశ్వంత్చే అంతిమ సంస్కారాలు. ► 1990: డాక్టర్ అంబేడ్కర్‌కు మరణానంతరం భారత అత్యున్నత పౌర సత్కారం ‘భారతరత్న’ ప్రదానం జరిగింది. రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ చేతుల మీదుగా అంబేడ్కర్ సతీమణి డా.సవిత (మాయి) ఈ పురస్కారాన్ని అందుకున్నారు. -
ఘనంగా జ్యోతిబా పూలే జయంతి
హైదరాబాద్: జ్యోతిబా పూలే 191వ జయంతి సందర్భంగా ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ నాయకులు పూలే చిత్రపటానికి పూల మాలవేసి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ మంత్రి వర్గంలో సామాజిక సమతుల్యత లోపించిందని, మైనార్టీలకు, గిరిజనులకు ప్రాతినిద్యమే లేదని, మహిళా ప్రాతినిద్యం కేవలం 8 శాతమేనని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాసు కృష్ణా రెడ్డి, డాక్టర్ శైలజానాధ్, డాక్టర్ తులసిరెడ్డి, సూర్యానాయక్, గిడుగు రుద్రరాజు, జంగాగౌతమ్, రవిచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘అమ్మ’ జయంతి
► వాడ వాడలా సేవలు ► మార్మోగనున్న అమ్మ నామస్మరణ ► జ్ఞాపకాలతో ఒంటరిగా చిన్నమ్మ ఆవేదన ► కేడర్‌కు చెర నుంచి లేఖ పురట్చితలైవిగా, తమిళుల హృదయాల్లో అమ్మగా చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వనిత జే జయలలిత జయంతి శుక్రవారం. భౌతికంగా అమ్మ తమ ముందు లేని సమయంలో జరుపుకుంటున్న తొలి జయంతి అన్నాడీఎంకే వర్గాలకు తీవ్ర మనో వేదనే. అందుకే సేవా కార్యక్రమాలతో ముందుకు సాగేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ప్రసంగాలు, అమ్మ జయలలిత నామస్మరణ మార్మోగే రీతిలో అన్నాడీఎంకే వర్గాలు చర్యలు తీసుకున్నాయి. ఇక, అమ్మ జ్ఞాపకాలతో ఒంటరిగా జయంతి రోజును గడపాల్సిన పరిస్థితి తనకు ఏర్పడిందని చిన్నమ్మ శశికళ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి, చెన్నై: ఫిబ్రవరి 24, 1948న నాటి మైసూరు రాష్ట్రం, నేటి కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా పాండవ పుర తా లుకా మేలుకోట్టె గ్రామంలో తమిళ అయ్యంగార్ కుటుంబంలో జే. జయలలిత జన్మించిన విషయం తెలిసిందే. బాల్యంలో అనేక కష్టాలను అనుభవించిన ఆమె చదువులో్లనే కాదు, కథక్, భరతనాట్యం, మోహినీ ఆట్టం, మణిపురి నాట్యంలలో ప్రావీణ్యతను సాధించి వెండి తెర మీద ఓ వెలుగు వెలిగారు. ఏ రంగంలోనైనా తనదైన ప్రత్యేకతను చాటుకునే జయలలిత, రాజకీయ గురువు ఎంజీఆర్ అడుగు జాడల్లో సాగి తమిళనాట అమ్మగా అవతరించారు. ప్రజాహిత పథకాలు, సుపరి పాలనే లక్ష్యంగా తమిళనాడు సీఎం హోదాలో ముందుకు సాగిన జయలలిత బర్త్‌డేను ప్రతి ఏటా అన్నాడీఎంకే వర్గాలు ఆనందోత్సాహాలతో జరుపుకునే వారు. అయితే, ఈ ఏడాది అమ్మ అనంత లోకాలకు చేరడంతో తొలిసారిగా జయలలిత జయంతిని జరుపుకోవాల్సిన పరిస్థితి. జయలలిత బతికి ఉంటే, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలతో వేడుకలు జరిగేవి. అయితే, బరువెక్కిన హృదయంతో అమ్మ జయంతిని సేవా కార్యక్రమాలతో జరుపుకునేందుకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధం అయా్యయి. వాడ వాడల్లో ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు సంక్షేమ కార్యక్రమాల పంపిణీ నిమిత్తం చర్యలు తీసుకున్నారు. ఇక,వాడ వాడల్లో అమ్మ చిత్ర పటాల్ని కొలువు దీర్చి పూల మాలుల వేసి నివాళులర్పించడమే కాకుండా, ఆమె ప్రసంగాల్ని హోరెత్తించేందుకు సిద్ధం అయా్యరు. చిన్నమ్మ శశికళ నేతృత్వంలోని అన్నాడీఎంకే శిబిరం, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని శిబిరం వర్గాలు పోటా పోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగనున్నాయి. ఇక, మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు పెద్ద ఎతు్తన పార్టీ నాయకులు, మంత్రులు, కేడర్ తరలి వచ్చే అవకాశాలు ఎకు్కవే. దీంతో ఆప రిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మ జ్ఞాపకాలతో జయలలిత జయంతిని పురస్కరించుకుని పరప్పన అగ్రహార చెర నుంచి కేడర్‌కు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ లేఖ రాశారు. అమ్మ సేవలు, పథకాలు, సుపరి పాలనను అందులో వివరించారు. అమ్మ భౌతికంగా లేకుండా జరుపుకుంటున్న ఈ జయంతి తీవ్ర మనోవేదనను కల్గిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ దూరం అవుతారని కలలో కూడా ఎవ్వరూ ఊహించ లేదని పేర్కొన్నారు. అమ్మ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే విధంగా సేవా కార్యక్రమాలతో జయంతిని జరుపుకుందామని పిలుపునిచ్చారు. 33 సంవత్సరాలుగా అమ్మతో కలిసి ఆనందంగా బర్త్‌డే వేడుకను జరుపుకున్నట్టు, అయితే, ఈ సారి అమ్మ జ్ఞాపకాలతో ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి హృదయంలో అమ్మ ఉన్నారని, అమ్మ పేరు మార్మోగే విధంగా, కుట్ర దారులు, వ్యతిరేకుల గుండెల్లో గుబులు రేపే విధంగా ప్రతి కార్యకర్త ఈసందర్భంలో ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. -
చిత్ర, శిల్పకళా విమర్శకు చిరునామా
కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో శిల్ప చిత్రకళ పరంపర అవిచ్ఛిన్నమైనది. చిత్రకళనే వృత్తిగా భావించి దానినే అంటిపెట్టుకుని జీవనం సాగించిన ‘నకాషి’ సామాజిక వర్గం తెలంగాణలో ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ శతాబ్దాల తరబడి చిత్రకళకు కేంద్రం. ఈ క్రమంలో చిత్ర శిల్పకళా చరిత్రనూ, అందులోని పరిణామ క్రమాన్నీ అధ్యయనం చేసి, వాటిని విమర్శనాత్మకంగా విశ్లేషించిన రచయిత, చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. 1950 నుంచి 90 వరకు ఆయన 37 వ్యాసాలు రాశారు. అవి ‘చిత్ర, శిల్పకళా రామణీయకము’ పేరుతో 2009లో పుస్తకంగా వెలువడ్డాయి. కాకతీయుల అలంకరణ కళ, తెలంగాణలో పటచిత్ర కళ, గోడచిత్ర కళతోపాటు, ఒక వ్యక్తి చిత్రకారుడిగా మారే క్రమంలో అనుభవించే మానసిక పరిస్థితిపై, నేటికాలాన చిత్రకళారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కొండపల్లి వ్యాసాలు రాశారు. తెలంగాణ చరిత్రలో ‘దక్కన్ కలాం’పై రాస్తూ అందులోని భిన్నదశలను ప్రస్తావించారు. సాధారణంగా తన సమకాలీనుల ప్రతిభ గురించి ఏ చిత్రకారుడూ రాయడు. కాని ఆయన పీటీ రెడ్డి సహా కాపు రాజయ్య, అంట్యాకుల పైడిరాజు, ముస్లిం చిత్రకారణి కమలేష్ ప్రత్యేకతలేమిటో తెలిపారు. రాజకీయ నాయకురాలిగానే తెలిసిన సంగెం లక్ష్మీబాయమ్మను చిత్రకారిణిగా పరిచయం చేశారు. ఆదిమకళతో మొదలై, ఆధునిక సర్రియలిస్టు ప్రక్రియ ప్రస్తావనతో పుస్తకం ముగుస్తుంది. (జనవరి 27న కొండపల్లి శేషగిరిరావు జయంతి) సామిడి జగన్‌రెడ్డి 8500632551 -
చిల్లుకుండలో... నీళ్ళు పోయకండి!
సత్యపథం ‘అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు’ అన్న నినాదాన్ని ఒక మంత్రంగా, ఒక స్ఫూర్తిగా మలచినవారు శ్రీసత్యసాయిబాబా. బోధలతో కర్తవ్యాన్ని గుర్తు చేసేవారు కొందరైతే, బోధలతోపాటు ఆచరణ ద్వారా లోకానికి దారి చూపేవారు మరికొందరు. సత్యసాయి బోధలు, సేవలు పుట్టపర్తి దాటి ప్రపంచమంతా విస్తరించాయి. 1926 నవంబర్ 23న జన్మించిన సత్యసాయి చిన్నప్పటినుంచే తాత్వికంగా, వైరాగ్యంగా మాట్లాడేవారు. అయితే, మాటల కంటే చేతలే ముఖ్యమని నమ్మిన బాబా విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దాహార్తితో నిండిన ఎన్నో గ్రామాలకు నీటి వసతి కల్పించారు. సత్యసాయి బోధలు దేవుడు ఒకటే. రెండు కాదు. సాధన చేస్తే నువ్వే దైవం కావచ్చు. ఇంద్రి యాలు కోరినవన్నీ ఇస్తూ, మనసు ఆడించినట్టల్లా ఆడుతూ పోతే - నువ్వెప్పటికీ దైవం కాలేవు, దైవాన్ని చేరుకోలేవు. నీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు చూసుకోవడం నీ బాధ్యత. నీ దైనందిన, వృత్తిపనులు వదిలి పెట్టాలని ఎవరూ కోరుకోరు. ఈ ప్రపంచంలో హాయిగా జీవించు. కానీ ఆధ్యాత్మిక స్రవంతికి ఎన్నడూ దూరం కావద్దు. నాలుక రుచులను కోరుతుంది. రుచులను అందిస్తూ పోతే శరీరానికే ప్రమాదం. నాలుక రుచికీ, మాటకూ ఆధారం. కాబట్టి రెండింతల జాగ్రత్త లేకపోతే, రెండింతల ప్రమాదం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, చిల్లుకుండలో నీరు పోసినట్లే. మాట అదుపు తప్పితే... మరీ ప్రమాదం. తక్కువ మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. అవసరమైనంతే మాట్లాడాలి. మాటలో తీవ్రత పెరగకూడదు. అరుపులు, కేకలుగా మారకూడదు. కోపంలో, ఉత్సాహంలో కూడా మాట జారకూడదు. విద్య, వైద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో దారిదీపంగా నిలచిన బాబా 2011 ఏప్రిల్ 24న దేహాన్ని విడిచిపెట్టినా, ఆయన బోధలు, సత్యసాయి ట్రస్ట్ సేవలు స్ఫూర్తినిస్తున్నాయి. - పమిడికాల్వ మధుసూదన్ -
ఘనంగా దాశరథి జయంతి వేడుకలు
మరిపెడ : మహాకవి దాశరథి రంగాచార్యులు 89వ జయంతి వేడుకలను మండలంలోని చిన్నగూడూరులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీఆర్ఎస్ మండల కార్యదర్శి దేశగాని కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని రచించిన దాశరథి రంగాచార్యులు మరిపెడ మండలంలో జన్మించడం మాకు గర్వకారణమన్నారు. మహాకవులు దాశరథి కృష్ణమాచార్యులు, రం గాచార్యులు జన్మించిన చిన్నగూడూరు గ్రామాన్ని మండల కేం ద్రంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నాయకులు రామడుగు బ్రహ్మం, కొత్త శేఖర్, నీలం శం కరయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు పోలేపాక వెంకన్న, గాడిపెల్లి సోమయ్య, జంపాల సోమన్న, దాసరి సత్తయ్య, నల్ల కృష్ణ, దేశగాని నారాయణ పాల్గొన్నారు. -
టంగుటూరి ప్రకాశం.. ఆదర్శం
కర్నూలు(అగ్రికల్చర్): టంగూటూరి ప్రకాశం పంతులు నిస్వార్థ జీవితాన్ని, ఆయన పట్టుదల, అకుంటిత దీక్షను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు పేర్కొన్నారు. మంగళవారం టంగుటూరి 145వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వం తరుపున కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టుంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో అనంతరం కర్నూలు బాలభవన్, నంద్యాల గురురాజ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ సందర్బంగా డీఆర్ఓ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఒంగోలు జిల్లాకు చెందిన వారయిన వెనుకబడిన కర్నూలును ఆంధ్రరాష్ట్రానికి రాజధానిని చేయడంలో ఆయన పాత్ర కీలకమైందన్నారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కర్నూలు అభివద్ధికి పునాది వేశారన్నారు. జమిందారి వ్యవస్థను రద్దు చేసి పలు శాశ్వత పనులు చేసిన ఘనత ఆయనదేనన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడిన మహామనిషిగా కొనియాడారు. ప్రకాశం పంతులు జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశం పంతులు జీవితం విద్యార్థులకు విజ్ఞానాన్ని ఇస్తుందన్నారు. కర్నూలులో టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహాన్ని నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఏఓ తహేరా సుల్తానా, తెలుగు బాష వికాశ ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంటు డాక్టర్ వీరస్వామి, ప్రముఖ రచయిత ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, కళాకారుడు ఇనయతుల్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
ప్రకాశం పంతులకు నివాళి
కడప సెవెన్‌రోడ్స్ : టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్బంగా మంగళవారం ఏడురోడ్ల కూడలిలోని ఆయన విగ్రహానికి పలువురు జిల్లా అధికారులు, అనధికారులు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉదయమే కలెక్టర్ కేవీ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ, మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు హరిప్రసాద్, సుభాన్‌బాష, గోవర్దన్‌రెడ్డి తదితరులు ప్రకాశం పంతుల త్యాగనిరతి, రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మనాభం
సింహాద్రిపురం : హాస్యనటుడు బసవరాజు పద్మనాభం బహుముఖ ప్రజ్ఞాశాలి అని కుటుంబ సభ్యులు, అభిమానులు కొనియాడారు. శనివారం పద్మనాభం జయంతిని ఘనంగా నిర్వహించారు. పద్మనాభం ోదరుడు, నాటి నిర్మాత పురుషోత్తమరావు నివాసంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమరావు మాట్లాడుతూ పద్మనాభం మన lసింహాద్రిపురం వాసి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వెండి తెరపై హాస్యాన్ని పండించి చిత్ర రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్లో దేవత చిత్రాన్ని నిర్మించడంతోపాటు పొట్టి ప్లీడర్, శ్రీరామకథ సినిమాలకు దర్శకత్వం వహించారన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పురుషోత్తమరావు, ఆనంద్, కుసుమకుమారి, చంద్రరేఖ, స్నేహితులు కొండారెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటకృష్ణయ్య, షరీఫ్ తదితరుల పాల్గొన్నారు. -
రేపు అధికారికంగా జయశంకర్ జయంతి
రాంనగర్ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఈనెల 6వ తేదీన జిల్లాస్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
మా గుండె చప్పుడు నీవయ్యా..
విశాఖపట్నం : జనం కోసం బతికావు..జనం గుండెల్లో నిలిచావు..జననేతవై దివికేగావు. రాజన్నా.. నీవు లేవంటే నమ్మలేమయ్యా..మా గుండె చప్పుడు నీవయ్యా..అంటూ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకుంటూ జిల్లా వాసులు నివాళులర్పించారు. వైఎస్ 67వ జయంతిని పార్టీలకతీతంగా జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్లో వైఎస్సార్ విగ్రహానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు జంక్షన్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మాడుగుల పాతబస్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. కె.కోటపాడులో జరిగిన వేడుకల్లో మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి జగన్మోహన్ పాల్గొన్నారు. అక్కడి మూడు రోడ్లు కూడలిలోని విగ్రహనికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కేక్‌ను కట్ చేశారు. కోటవురట్ల మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ సెల్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. యలమంచిలి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం అచ్యుతాపురం కూడలిలో విగ్రహానికి పూలమాల వేశారు. కోటవురట్లలో మాజీ ఎమ్మెల్సీ డీఎస్ఎన్ రాజు, నక్కపల్లి నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు,కార్యకర్తలు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని నర్సీపట్నం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. అబీద్‌సెంటర్‌లో ఉన్న వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాయకరావుపేటల మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణలు పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. చోడవరంలో మాజీ ఎమ్మెల్యేకరణం ధర్మశ్రీ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలులు వేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యలమంచిలిలో అదనపు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో హరిపాలెం, తిమ్మరాజుపేట, జగ్గన్నపేట, మునగపాక గ్రామాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అరకులోయలో పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యురాలు కె.అరుణకుమారి, కొయ్యా రాజారావుమహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కశింకోటలోని ప్రధాన రహదారిలోని వైఎస్సార్ నిలువెత్తు విగ్రహానికి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దంతులూరి శ్రీధర్‌రాజు పూలమాల వేశారు. మండల కేంద్రం డుంబ్రిగుడలో ఎంపీపీ వంతల జమున,జెడ్పీటీసీఎం కుజ్జమ్మ వేడుకలను నిర్వహించారు. -
ప్రజల గుండెల్లో పదిలం
ఘనంగా వైఎస్సార్ జయంతి భూపాలపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాడని వైఎస్సార్ సీపీ మండల నాయకుడు ఇటుకాల భాస్కర్ అన్నారు. వైఎస్ 67వ జన్మదిన వేడుకలను భూపాలపల్లి పట్టణంలోని అమృత వర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అనాథ చిన్నారులచే కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆశ్రమానికి ఫ్యాన్‌ను బహుకరించారు. అనంతరం బాస్కర్ మాట్లాడుతూ.. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధీర్, నాగరాజు, బుర్ర శ్రీకాంత్, ఏనుగు ఆజాద్‌రెడ్డి, రాజేష్, కొమటిరెడ్డి రవీందర్, శ్రావణ్ పాల్గొన్నారు. గణపురంలో.. గణపురం: మండల కేంద్రంలోని కర్కపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ అభిమానులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని కొండాపురంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నిరంజన్, ప్రశాంత్, శ్రీకాంత్, శివ కృష్ణకాంత్, విజయ్, రవి తదితరులు పాల్గొన్నారు. చిట్యాలలో.. చిట్యాల : దివంగత ముఖ్యమంత్రి, జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్సార్ జన్మదిన వేడుకలను శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు జన్నె రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, యూత్ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, మహిళా విభాగం అధ్యక్షురాలు భీంరెడ్డి స్వప్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కాగిత రాజ్‌కుమార్ హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్మిక విభాగం అధ్యక్షుడు నెమలపురి రఘు, జిల్లా కార్యదర్శి మంచె అశోక్, జిల్లా సాంస్కతిక విభాగం అధ్యక్షుడు బుల్లెట్ వెంకన్న, జిల్లా నాయకులు రజనీకాంత్, ఆజాద్‌రెడ్డి, రత్నాకర్, పుల్యాల గాంధీ, మండల నాయకులు జన్నె రమేష్, జన్నె అశోక్, జన్నె నందు తదితరులు పాల్గొన్నారు. ప్రజల హృదయాలలో నిలిచిన మహానేత వైఎస్సార్.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్ జన్మదిన వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్‌ను ప్రజలు, రైతులు దేవుడని కొలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు అప్పం కిషన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు భీంరెడ్డి స్వప్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కాగిత రాజ్‌కుమార్, జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాయంపేటలో.. శాయంపేట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ 68వ జయంతి వేడుకలను మండలంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు మండలకేంద్రంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుడు అల్లె అర్జున్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్యను అందించిన మహానీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మారపల్లి సుధాకర్, అరికిల్ల వీరయ్య, అరికిల్ల శివకష్ణ, మారపల్లి సుదర్శన్, మునిగే విజేందర్, తదితరులు పాల్గొన్నారు. మొగుళ్లపల్లిలో.. మొగుళ్ళపల్లి: మండల వైఎస్సార్ సీపీ అధ్వర్యంలో డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మండల అధ్యక్షుడు పుల్యాల గాంధీ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలో రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ పథకం, ఇందిరమ్మ ఇల్లు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో నాయకులు రవివర్మ, లడె సమ్మారావు, మంద రమేష్, కల్లెపల్లి రమేష్, పి సామెల్, ప్రభాకర్, విజేందర్, అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
నా దేవుడు..!
తూప్రాన్: ఈమె పేరు లక్ష్మీనర్సమ్మ. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ బారి నుంచి బయటపడి ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఆమెకు ఆయనే దైవమయ్యాడు. ఇలా ఎందరెందరో ఆయన పథకాల ద్వారా లబ్ధిపొందారు. అంతరంగాల నిండా ఆయన రూపాన్నే నింపుకొన్నారు. రైతు బాంధవుడు.. ఆరోగ్య ప్రదాత.. సంక్షేమ పథకాలు పేదల దరిచేర్చిన మహనీయుడు.. విద్యార్థుల్లో వెలుగులు నింపిన విద్యాదాత.. దివంతగ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికీ ప్రజల్లో గుండెల్లో కొలువై ఉన్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా కొందరి అంతరంగాలు... దంపతులకు పునర్జన్మ వర్గల్: వర్గల్‌కు చెందిన పెద్ది నర్సింగరావు, భవానీ దంపతులకు వరుణ్ సాయి, సుమశ్రీ పిల్లలు. పేదరికం కారణంగా 2006లో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. నర్సింగరావు నగల దుకాణంలో గుమాస్తాగా చేరారు. ఈక్రమంలో భవానీకి గుండెజబ్బు సోకింది. లక్షల విలువైన వైద్యం చేయిస్తే తప్ప భార్య బతకదని తెలిసి నర్సింగరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో అతను కూడా గుండె జబ్బు బారినపడ్డారు. ఒకరికి శస్త్ర చికిత్స జరిపించడమే గగనం అనుకుంటున్న తరుణంలో ఇద్దరినీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పునర్జన్మనిచ్చింది. జీవితాంతం రుణపడి ఉంటాం సదాశివపేట రూరల్: ఇతని పేరు మహ్మద్ రహీం. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిపొందారు. సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రహీం నిరుపేద వ్యవసాయ కూలి. పొలం నుంచి ఎడ్లబండిపై పత్తిని తీసుకొస్తుండగా.. ప్రమాదవశాత్తు బండి చక్రాల కింద పడిపోయాడు. నడుము విరిగిపోయింది. నరాలు చిట్లిపోయాయి. వైద్యానికి అవసరమైన రూ.లక్షలను ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే చెల్లించింది. ‘జీవితాంతం వైఎస్‌కు రుణపడి ఉంటా’ అని ఆయన తెలిపారు. ఆయన వల్లే మంచి ఉద్యోగం కల్హేర్: ‘దివంగత సీఏం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కలిపించారు. రిజర్వేషన్‌తో ఇంటర్, డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివా. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి.. మేలు చేశారు. నాలా చాలా మంది ఆయన చలవతో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.’ అని చెప్పారు కల్హేర్‌కు చెందిన ఎండీ సలీం. రుణమాఫీతో గట్టెక్కా.. కోహీర్: ‘నాకున్న మూడెకరాల పొలంలో చెరకు పంట వేశా. ఇందుకోసం ఎస్బీఐ దిగ్వాల్లో రూ.50 వేల పంట రుణం తీసుకున్నా. ఆ సంవత్సరం చెరకు క్రషింగ్ సక్రమంగా లేకపోవడంతో నష్టాలు మిగిలాయి. పెట్టుబడులు తిరిగిరాకపోగా.. అప్పు మిగిలింది. వడ్డీతో కలిసి అప్పు రూ.80,600 అయ్యింది. అదే సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతు రుణమాఫీ ప్రకటించాడు. దీంతో రుణం మాఫీ అయ్యింది. ఆయన మేలు ఈ జన్మలో మరచిపోలేను’. - తలారి తుల్జయ్య, రైతు-దిగ్వాల్ ఆదుకున్న పావలావడ్డీ దౌల్తాబాద్: ‘దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంభనకు ఎంతో తోడ్పడ్డారు. 12 ఏళ్ల కిందట మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరా. వైఎస్ హయాంలో పావలా వడ్డీ కింద తీసుకున్న రుణంతో పాడి గేదెలు తీసుకున్నా. పాల వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో నెలవారీ వాయిదాలు చెల్లించా. తక్కువ వడ్డీ కావడంతో ఆ రుణం చాలా ఉపయోగపడింది’. - తిప్పగౌని పద్మ, రాజ్యలక్ష్మీ మహిళ సంఘ సభ్యురాలు, కోనాపూర్, దౌల్తాబాద్ రీయింబర్‌సమెంట్‌తో లాభం వెల్దుర్తి: 2009వ సంవత్సరం నుంచి 2013 వరకు హైదరబాద్ సమీపంలోని నిజాంపేటలో రుషి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివా. ఐటీ గ్రూప్ తీసుకున్నా. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఉచితంగా చదువులు పూర్తిచేశారు. 2014లో చెన్నై కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. మండలంలో దాదాపు 10 పది ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారు. అంతా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. - కె. స్వాతి. వెల్దుర్తి ఇంజినీరింగ్ పూర్తిచేశా జహీరాబాద్ టౌన్: ‘నా పేరు అబ్దుల్ ముర్తజా. జహీరాబాద్‌లోని మూసానగర్ కాలనీలో ఉంటాం. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఇంజినీరింగ్ పూర్తి చేశా. - అబ్దుల్ ముర్తుజా, జహీరాబాద్ దేవుడులేని జాతర మెదక్: ‘వైఎస్ రాజశేఖరరెడ్డి లేని రాష్ట్రం దేవుడు లేని జాతరలాంటిది. ఆయన మాకు ఇచ్చిన భూమిని దున్నుకొని జీవిస్తున్నాం.ప్రజల కష్టాల్ని కళ్లారా చూసి పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిండు.’.. అని మెదక్ మండలం బి.భూపతిపూర్ గిరిజన తండాకు చెందిన నునావత్నాజీ వైఎస్‌ను గుర్తుచేసుకొని కంటతడి పెట్టారు. ఆయన వల్లే తిండి గింజలు కౌడిపల్లి: ‘ఆ మారాజు దయతో ఇన్ని తిండి గింజలు పండించుకుంటున్నం. ఎన్నో ఏళ్లుగా సాగుచేసిన భూమిపై ఎలాంటి పట్టా లేకుండే. అడవుల్లో పంట పండించుకునేవాళ్లుం. రాజశేఖర్‌రెడ్డి సార్ పట్టాలు ఇవ్వడంతో గిప్పుడు మాకిన్ని తిండి గింజలు దొరుకుతున్నయి.’ అని కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ పంచాయతీ కన్నారం శేరితండాకు చెందిన గిరిజన రైతు దంపతులు కెతావత్ దుర్గ్య, ముత్యాలి తెలిపారు. శేరితండాకు చెందిన దంపతులు కెతావత్ దుర్గ్య, ముత్యాలుకు నలుగురు కొడుకులు. వెఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అటవీ హక్కు చట్టం రావడంతో వీరికి లాభించింది. కాస్తులో ఉన్న రెండెకరాల భూమిపై పట్టా హక్కు పత్రాలను అందుకున్నారు. - దుర్గ్య, రైతు కన్నారం శేరితండా ‘ఫైజాబాద్’తో లాభాలు కౌడిపల్లి: దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చలవతో ఫైజాబాద్ ఎత్తిపోతల పథకంతో నాలుగేళ్లు రెండు పంటలు పండాయి. అంతకు ముందు 15 సంవత్సరాలు అవుసలోని కుంట కింద రెండెకరాల సాగుభూమి ఉన్నా నీళ్లు లేక బీళ్లుగా మారడంతో ఇబ్బంది పడ్డాం. ఎత్తిపోతల పథకం 2011లో పూర్తికావడంతో చెరువు, కుంటలకు నీరు వచ్చింది. వానాకాలం, యాసంగి దాదాపు 800 ఎకరాల్లో రెండు పంటలు పండించాం. మంచి లాభాలు వచ్చాయి. - బక్క శ్రీశైలం, రైతు, ఫైజాబాద్, కౌడిపల్లి మండలం అప్పు మాఫీ చేసిండు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల అప్పులు మాఫీ చేసి ఆదుకున్న దేవుడు. 2004 నుంచి వరుసగా కరువు ఉండటంతో పంటలు పండలేదు. అప్పులపాలైనం. రైతుల బాధలు తెలుసుకున్న వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేసిండు. - కట్కూరి నారాయణరెడ్డి, రైతు నంగునూరు పెరిగిన గ్రూపుల సంఖ్య శివ్వంపేట: శివ్వంపేట మండలంలో 2003 సంవత్సరంలో 250 డ్వాక్రా గ్రూపులు ఉండగా వైఎస్ఆర్.. పావలావడ్డీ పథకం అమలు చేయడంతో 2004-2009 మధ్య గ్రూపుల సంఖ్య 750కి చేరింది. బ్యాంక్ ద్వారా 2002 సంవత్సరంలో రూ.30 వేలు మొదటిసారిగా రుణం పొంది అధిక వడ్డీ చెల్లించాం. ఆపై 2004లో వైఎస్ఆర్ మహిళల కోసం పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టడంతో లక్షల్లో రుణాలు పొందారు. - భాగ్యమ్మ, తేజస్విని గ్రూపు అధ్యక్షురాలు -
దేవుడిలా వచ్చాడు... కష్టాలు తీర్చాడు!
నేడు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి. మారాజు... మన సార్.. పుట్టినరోజు. అలాంటి తండ్రి మన గుండె గర్భంలో ఉంటే... పురిటినొప్పులు ఎలా ఉంటాయి? తియ్యటి జ్ఞాపకాల్లా ఉంటాయి. సేద తీర్చే స్మృతుల్లా ఉంటాయి. పేగు పంచుకున్న మధురిమల్లా ఉంటాయి. అప్పుడే పుట్టిన బోసి నవ్వుల్లా ఉంటాయి. ఊహు! ఈ బొడ్డుతాడు తెగదు. ఈ బంధం వీడదు. గర్భగుడిలోని పవిత్రమైన విగ్రహం ప్రతిఫలించే కిరణాల్లా... వై.ఎస్.ఆర్. జ్ఞాపకాలు గుండె గర్భంలో కొలువై ఉన్నాయి. కేరింతలు కొడుతున్నాయి. అశేష ఆత్మీయ క్షణాల ఆ కేరింతల్లో ఇవి.. గోరంత. పావలా బొట్టు రూపాయి కంటే పెద్దగా కనిపించింది. సూర్యుడి కంటే ఎక్కువ వెలుగునిచ్చింది. నుదుటినున్న చీకటిని చెరిపేసింది. అన్నలా నా జీవితాన్ని మలిచారు! నా కాళ్లమీద నేను నిలదొక్కుకోవడంతో పాటు మరో ఐదు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తానని కలలో కూడా అనుకోలేదు. వైయస్ఆర్గారు మా మహిళలకు పావలా వడ్డీ రుణం రూపంలో మంచి దారి చూపించారు. నేను 2005లో లక్ష రూపాయలు తీసుకుని రైసు మిల్లు, పిండిమర పెట్టాను. అదిప్పుడు ఐదు లక్షల స్థాయికి చేరుకుంది. మా పాపకు మంచి సంబంధం చూసి, పెళ్లి చేశాను.మరోవైపు గ్రామైక్య సంఘ ప్రెసిడెంటుగా, ఇందిరాక్రాంతి పథక మండల సమాఖ్య అధ్యక్షురాలిగా కూడా చేశాను. ఇప్పుడు విజయనగరంలోని టీటిడిసీలో, ఆర్.కె. టౌన్‌షిప్‌లోని జిఎమ్మార్ సంస్థకు చెందిన మెస్‌లను చూసుకుంటున్నాను. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వైఎస్ఆర్ అనుకున్నారు. అన్నలా నాలాంటి ఎందరో చెల్లెళ్ల జీవితాన్ని మలిచారాయన. - మత్య నాగమణి (ముగడ గ్రామం - బాడంగి మండలం - విజయనగరం) అదే నా జీవనాధారం అన్ని అవయవాలూ సక్రమంగా ఉంటేనే పని దొరకడం కష్టం. ఇక.. శారీరక లోపం ఉంటే ఎవరు ఆదరిస్తారు? మా కుటుంబం పరిస్థితి కూడా అంతంత మాత్రం. అమ్మా నాన్న (నూకాబత్తిని సుభాషిణి, మాణిక్యరావు) కూలి పనులకు వెళతారు. వాళ్లకు నేను పెద్ద భారమే. పల్లెత్తు మాట అనకుండా నన్ను సాకారు. వాళ్ల కష్టం చూడలేక కుమిలిపోయేదాన్ని. అలాంటి సమయంలోనే రాజశేఖర్‌రెడ్డిగారు పావలా వడ్డీ రుణాల ప్రవేశం మొదలుపెట్టారు. అది నాకు కొండంత అండ అయ్యింది. 15,000 రూపాయలు రుణం తీసుకుని, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా. దాని మీద వచ్చే డబ్బులు, అమ్మా నాన్నలు కష్టం చేసి తెచ్చే డబ్బులతో ఇప్పుడు మేం ఇబ్బంది లేకుండా బతకగలుగుతున్నాం. ఏ ఆధారం దొరకదేమోనని దిగులుపడ్డ నాకిప్పుడు ఆ చిన్న బడ్డీ కొట్టే పెద్ద ఆధారమైంది. పావలా వడ్డీ రుణం వల్ల నాక్కలిగిన ఆర్థిక బలం నేను వికలాంగురాలిననే విషయాన్ని మర్చిపోయి శారీరక బలాన్నిస్తోంది. రాజశేఖర్‌రెడ్డి సారూ.. మీ కుటుంబం చల్లగా ఉండాలి. - భాగ్యలక్ష్మి, గుంటూరు బువ్వ పెట్టిన తండ్రి..! నాకు బువ్వపెట్టి బతుకిచ్చిన తండ్రి రాజశేఖర్‌రెడ్డి. నాకు 18 ఎకరాల పొలం ఉంది. ఆరుగురు కొడుకులకు తలా 3 ఎకరాలు పంచి ఇచ్చాను. ఆ పొలంలో సజ్జలు, ఆముదాలు పండిస్తాం. సీజన్లో వరి సాగు చేస్తాం. వ్యవసాయం అంటే తేలికైన పనేమీ కాదు. రెక్కలు ముక్కలు చేసుకోవాలి. కానీ ఏడాదంతా కష్టపడి పండిస్తే వచ్చేది పెట్టుబడులకు, కరెంట్ బిల్లులకే సరిపోయేది. కానీ మా కష్టాలను తీర్చడానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అవుతూనే మొట్టమొదటగా ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం పెట్టారు. అది మా పాలిట వరమయ్యింది. మాబోటి రైతులకు ఎంతో మేలు జరిగింది. విద్యుత్ చార్జీల రూపంలో పోయేదంతా మిగలసాగింది. దాంతో మా కష్టానికి ఫలితం దక్కింది. మా జీవితాల్లో మార్పు వచ్చింది. మాకు కడుపునిండా బువ్వపెట్టిన ఆ తండ్రిని మేం మరవలేమయ్యా! చెప్పాలంటే... ఆయన కాలంలో మాబోటి రైతులు రాజుల్లెక్క బతికారు. అందుకే మేం బతికున్నంత కాలమూ ఆయన్ను యాది పెట్టుకుంటం. - బొడ్డుపల్లి సత్తయ్య, గుమ్మడవెల్లి, నల్లగొండ దేవుడిలా వచ్చాడు... కష్టాలు తీర్చాడు! రైతుల కష్టం తెలిసిన దేవుడు వైఎస్ఆర్. వానలు పడక, కరెంట్ లేక, బోరు నీళ్లు అందక.. నానా కష్టాలు పడి సాగు చేసిన పంట అతివృష్టి, అనావృష్టితో దెబ్బ తింటున్న సమయంలో ఆయన దేవుడిలా వచ్చారు. మా కష్టాలన్నీ తీర్చారు. వ్యవ సాయానికి ఉచితంగా విద్యుత్ ఇస్తానని ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే నిలుపుకున్నారు. ఆయన పుణ్యమాని చిన్న రైతులం, మెట్ట ప్రాంత రైతులం ఎంతో లబ్ధి పొందాం. అంతుకుముందు వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించలేక తంటాలు పడ్డాం. ఆయన పెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఆ సమస్యను తీర్చేసింది. ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాదు... దానికితోడు ఏడు గంటల విద్యుత్ సరఫరా కూడా చేయటంతోఎంతో మేలు జరిగింది. వ్యవసాయం ఉన్నంత కాలం వైఎస్‌ను మరువలేం. - గుమ్మడి రామకృష్ణ, పెదపారుపూడి, కృష్ణాజిల్లా ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటిలోని కాగితాల కంటే ఎక్కువ సంఖ్యలో కలలు ఉంటాయి... ప్రతి స్టూడెంట్లో. ఆ కలలు కళకళలాడాలంటే జేబులు గలగలలాడాలి. ఫీజులు ‘కట్ట’గలగాలి. వై.ఎస్.ఆర్. అందరి ఫీజులను గలగలమనిపించారు. ఆ మహానుభావుడి దయ! నాన్న సింగరేణిలో పనిచేసేవారు. ఆయన వీఆర్ఎస్ తీసు కున్నాక మా ఆర్థికస్థితి అతలాకుతలమైంది. ఎలాగో కష్టపడి పదో తరగతిలో మండల టాపర్‌గా నిలిచాను. పై చదువులకు వెళ్లాలంటే దిక్కుతోచని పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆసరాతో బాసర ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ పూర్తి చేశాను. ‘గేట్’లో ఉత్తీర్ణత సాధించి ఎంటెక్‌లో చేరాను. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందగలిగాను. అంతా ఆ మహానుభావుడి దయ. - వేమూర్ల రాజేశ్, రెబ్బెన, ఆదిలాబాద్ జిల్లా నా పిల్లలు ప్రయోజకులయ్యారు! నేను దర్జీని. బట్టలు కుడితే తప్ప పూటగడవదు. ముగ్గురు పిల్లలనూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాను. మంచి మార్కులు తెచ్చుకోవడంతో ముగ్గురికీ ప్రైవేటు కాలేజీల్లో ఉచితంగా సీట్లు వచ్చాయి. పెద్దబ్బాయి నసీరుద్దీన్, అమ్మాయి రుక్సానా మెడిసిన్, చిన్నబ్బాయి నిజాముద్దీన్ ఇంజినీరింగ్ చదవాలనుకున్నారు. దర్జీ పనితో పిల్లల ఆశలు తీర్చడమెలా అని దిగులు చెందుతున్న తరుణంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆదుకుంది. పిల్లలు కోరుకున్నది చదువుకున్నారు. ప్రయోజకులయ్యారు. - షేక్ ఫయాజ్ బాషా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నం పెట్టే అన్నదాతతో ఉండాల్సింది రుణానుబంధం కానీ.. రుణాల బంధం కాదు. శత్రుత్వాన్ని కూడా మాఫీ చేసే సంస్కారం ఉన్నవాళ్లం. అన్నదాత రుణాలను మాఫీ చేయలేమా? చేయొద్దూ!! పొలం అమ్మేద్దామనుకున్నా.. ‘‘వ్యవసాయానికి వీలుగా ట్రాక్టర్ కొనుగోలుకు కనగల్ శాఖ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో రూ. 4 లక్షలు అప్పు తీసుకున్నా. మిత్తి(వడ్డీ) తో కలుపుకుని నాలుగు లక్షలు కాస్తా రూ. 7 లక్షల పైచిలుకు అయ్యింది. చెల్లించలేని గడ్డు పరిస్థితి వచ్చింది. బ్యాంక్ అధికారులేమో పలుమార్లు ట్రాక్టర్‌ను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. సరే అనుకొని, బ్యాంక్ అప్పు తీర్చేందుకు ఉన్న రెండు ఎకరాల భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డా. అయితే అప్పటి సీఎం వైఎస్ పుణ్యమా అని ట్రాక్టర్ కోసం బ్యాంక్‌లో తీసుకున్న రుణంలో మిత్తి రూ. 3,15,000 ఒకే దఫా మాఫీ అయింది. దీంతో అప్పటి నుంచి వైఎస్‌ను నా గుండెల్లో పెట్టుకున్నా. ఆయనపై అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు’’. - కారింగు జానకిరాములు, బుడమర్లపల్లె, నల్లగొండ జిల్లా రుణ విముక్తి పొందా... అప్పులు చేసి మరీ 15 ఎకరాల్లో వరి సాగు చేశా. నగలు తనఖా పెట్టి సుమారు రూ. 3 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నా. పంటలు సరిగ్గా పండక అప్పుల ఊబిలో కూరుకుపోయాను. కానీ రుణమాఫీ పథకం పుణ్యమాని ఒక్క పైసా కూడా బ్యాంకుకు కట్టాల్సిన పని లేకుండా పోయింది. వైఎస్ హయాంలో కుటుంబంలో ఎంత మంది పేరున రుణాలు ఉన్నా ఎటువంటి షరతులూ లేకుండా మాఫీ చేశారు. కానీ రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారు. అది కూడా అప్పులో కేవలం లక్షన్నర మాత్రమే. అదీ ఏకకాలంలో చేయకుండా విడతల వారీగా చేయడం ఇబ్బందిగా ఉంది. - కళ్లం వీరారెడ్డి, పోతుకట్ల, ప్రకాశం జిల్లా కూలి చేసేవాడు కూలి చేస్తూనే ఉన్నాడు. కౌలు చేస్తున్నవాడు కౌలు చేస్తూనే ఉన్నాడు. ఉహు... లాభం లేదు. పరిస్థితి మార్చాలనుకున్నారు వైఎస్ఆర్. ఆ సామి వల్ల వాళ్లు ఆసాములయ్యారు. నడుం మీద తుండుకట్టు... భుజం మీద తుండుగుడ్డ అయింది. భయపడకుండా ఎవుసం చేసుకుంటున్నా! భూమిల నాగలిని పెట్టినానంటే సాలు ఫారెస్టోల్లు వచ్చి పడేటోళ్లు. నాగలిని ముక్కలు చేసోటోళ్లు. అదేమని అడిగితే.. బండబూతులు తిట్టేవారు. కొట్టేవారు. అన్యాయంగా కేసులు పెట్టేవాళ్లు. బాబూ.. అయ్యా అని కాళ్లా వేళ్లా పడి బతిమాలుకున్నా డబ్బులు వసూలు చేసోటోల్లు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అంతే, నాకున్న మూడెకరాలకు హక్కు పత్రం వచ్చింది. అప్పటి సంది ఎవరితో ఇబ్బందులు లేకుండా సక్కగా ఎవుసం చేసుకుంటున్నాను. భూమిని అనుకూలంగా చదును చేసుకుని మంచి పంట తీస్తున్నా. దీంతో అప్పులు తీరి ఆర్థికంగా స్థిరపడ్డా. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు హక్కుపత్రాలకు పంటరుణాలు ఇస్తారన్నారు. ఆయన పోయిన తరువాత మమ్మల్నెవరూ పట్టించుకోవడం లేదు. - బానోతు ఈర్య, కొత్తపల్లి, వరంగల్ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయగలిగాను... ఆడపిల్ల పెళ్లి అంటే ఎంత కష్టమైనదో చెప్పాల్సిన పనిలేదు. మాకు నలుగురు కూతుళ్లు. అయినా కూడా వాళ్లకు పెద్ద ఇబ్బంది పడకుండా పెళ్లిళ్లు చేయగలిగామంటే అదంతా రాజశేఖరరెడ్డిగారి పుణ్యమే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 2010లో సర్వే నెంబరు 31లో 85 సెంట్లు భూమిని మాకు అందజేశారు. ఆ భూమిలో గోగు, శనగ వంటి పంటలు పండిస్తున్నాం. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో ఉపాధి పొందుతున్నాం. అంతకు ముందు నేను, నా భర్త కూలీలుగా పనికి వెళ్లేవాళ్లం. భూమి అందడంతో సొంతంగా సేద్యం చేసుకుంటున్నాం. సొంత ఇంటిని కట్టుకోగలిగాం. నలుగురు కుమార్తెల్లో ముగ్గురికి పెళ్లిళ్లు చేసేశాం. ఆర్థికంగా అంతగా ఇబ్బంది పడకుండా జీవించగలగడానికి కారణం ఆ మహానుభావుడే. మా కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది. - ఆర్నిపల్లి రామలక్ష్మి, జక్కువ, కృష్ణాజిల్లా ఆదాబ్.. ఆదాబ్.. ఆదాబ్.. ఆదాబ్.. నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం భాయ్లకు. ధర్మం నాలుగు పాదాల మీద నిలబడి ఉంటుందని రిజువైంది.ఆదాబ్.. ఆదాబ్.. ఆదాబ్.. ఆదాబ్... నాడు పొలంలో... నేడు పాఠశాలలో..! చిన్నప్పట్నుంచీ చదువంటే ప్రాణం. కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా పొలం పనులకు వెళ్లక తప్పలేదు. నలుగురి సంతానంలో నేనే పెద్దవాడ్ని కావడంతో చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు నాపై పడ్డాయి. నాకంటే చిన్నవాళ్లైన ముగ్గురు తమ్ముళ్ల మంచిచెడ్డలు ఆలోచించి మోటార్ వైండింగ్, పొలం పనులు చేస్తుండేవాడ్ని. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. 2007లో బీయిడీ పూర్తిచేశా. మరుసటి ఏడాది డీఎస్సీ పరీక్ష రాశాను. 57 మార్కులు వచ్చాయి. వైఎస్ మైనార్టీలకు అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ల పుణ్యమా అని ఉపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. లేదంటే మళ్లీ పలుగు, పార పట్టుకుని పొలంలోకి వెళ్లేవాడ్ని. ఇవాళ ఇలా భావిభారత పౌరుల చేత అక్షరాలు దిద్దిస్తూ, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నానంటే కారణం ఆ మహానుభావుడే. మైనార్టీ రిజర్వేషన్ల కారణంగా నాతో పాటు యాలాల మండలంలోనే మరో ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. - షేక్ అహ్మద్, కమాల్‌పూర్, యాలాల మండలం, రంగారెడ్డి పూరి గుడిసె. ఈ రాష్ట్రంలో పూర్మెన్ ఉండకూడదు. పక్కా ఇల్లు కడితే పక్కా ఆశలు పుట్టుకొస్తాయి. పెద్దవాళ్లు కావాలి అన్న ఆకాంక్ష పుట్టుకొస్తుంది. మట్టిలో కాదు, రాతితో జీవితాన్ని కట్టాలన్న దీక్ష వస్తుంది. మట్టి మనుషులలో రాతి దీక్షను మొలకెత్తించిన మనిషి వై.ఎస్.ఆర్. అడగని వారికీ సాయం చేశారాయన! ‘నాకు ఫలానా సాయం కావాలి’ అని వైఎస్ఆర్ ని కలిసిన ఎవరూ అసంతృప్తితో వెనక్కి వెళ్లింది లేదు. అడగని వారికి కూడా సహాయం చేసే మనిషి ఆయన. నేను కర్నూలు ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా ఉన్నప్పుడు ఓ రోజు ఆయన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తనిఖీకి వచ్చారు. ఓ వార్డులో కాలు తొలగించిన రోగిని చూసి ఆగిపోయారు. అతడి కేస్ షీట్ చూసి... ‘ఏమయ్యా! బీడీలు, చుట్టలు బాగా కాలుస్తావా, పొగతాగే వారికి ఈ జబ్బు వస్తుంది. అందుకే నీకు కాలు తీసేశారు. ఆరోగ్యం పాడు చేసుకుంటే ఏం వస్తుంది’ అని చనువుగా మందలించారు. పక్కనే ఉన్న జాయింట్ కలెక్టర్‌తో ‘అతడికి వికలాంగుల పెన్షన్ ఇప్పించండి’ అన్నారు. ఏదో సందేహం వచ్చినట్లు ఆగి ‘నీకు ఇల్లు ఉందా’ అని అడిగారు. లేదని అనగానే... పక్కా ఇంటిని శాంక్షన్ చేయమని జేసీకి ఆదేశం ఇచ్చేశారు. అడిగిన వారికి సహాయం చేసే నాయకులను చూశాను. సహాయం కోసం తిప్పుకునే నాయకులూ తెలుసు. కానీ అడగక ముందే అవసరాన్ని గుర్తించి సహాయం చేసే నాయకుడు వైఎస్ఆర్! - డాక్టర్ హనుమంతరాయుడు, హైదరాబాద్ రోడ్డు మీదో, వీధిలోనో, మారుమూల ఇంట్లోనో, పొలం గట్టునో... మనిషికి, ప్రాణానికి మధ్య జీవితం బొడ్డు తాడు తెగిపోతే... కుయ్ కుయ్ కుయ్‌మని ప్రాణ సంకటానికి ప్రాణ శకటం వస్తే! ప్రాణం లేచి వస్తుంది. నమ్మకం లేచి నిలుచుంటుంది. దేవుడిని కళ్లారా చూస్తున్నట్లుండేది! నాకు 2007, డిసెంబరు 13న యాక్సిడెంట్ అయి, కాలు విరిగింది. ఊహించని ఆ సంఘటనకు షాక్‌లోకి వెళ్లిపోయాను. కానీ అదృష్ట వశాత్తూ 108 సర్వీసు అంబులెన్స్ వచ్చి నన్ను క్షణాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ జరిగింది. అయితే ఏ పనీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను చూసి ఇంట్లో వాళ్లంతా కన్నీరు మున్నీరయ్యారు. దాంతో 2008 మార్చి 16వ తేదీన నేను మొదటిసారిగా రాజశేఖరరెడ్డిగారిని సిఎం క్యాంపు ఆఫీసులో కలిశాను. ఆయన నా పరిస్థితి తెలుసుకుని ఆర్థిక సహాయం చేశారు. ‘‘బాధపడకు, నేనున్నాను, ధైర్యంగా ఉండు’’ అన్నారు. ఇది జరిగి ఏడాది నిండక ముందే మా మారుమూల గ్రామానికి వచ్చారు. ‘‘నీ కాలు బాగైంది కదా’’ అని అడగడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. వైఎస్‌గారిని కలిసిన ప్రతిసారీ నాకు దేవుడిని కళ్లారా చూస్తున్నట్లే ఉండేది. కలిసింది మూడు సార్లే అయినా జీవితాంతం గుర్తు పెట్టుకోగలిగినంత సంతోషాన్ని దాచుకోగలిగాను. - బానోతు రవీందర్ నాయక్, హేమ్లా తండా, నల్లగొండ నీలి ఆకాశం కరగదు. దానికి కరుణ ఉండదు. అలాంటి ఆకాశం రైతు జీవితాన్ని మబ్బు మబ్బుగా చేసేస్తుంది. నిరాశ ముసురుతుంది. మబ్బుకుండను ఆయన రాజ్యం తెచ్చింది. ఆయన ఉంటే మబ్బు ఉన్నట్టే. వాన ఉన్నట్టే. మరి వానని భూమి మీద మబ్బుగా మార్చాలంటే? జలయజ్ఞం చేయాలి. భూమి మీద పారే మబ్బులే... జలయజ్ఞం. భగీరథుడు... వైఎస్! సింగూరు ప్రాజెక్టు ద్వారా సేద్యానికి నీరందిస్తామని దాదాపు ముప్పై ఏళ్లుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు హమీ ఇచ్చి మరిచారు. కానీ వైఎస్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కాలువల నిర్మాణం ప్రారంభించారు. ఆయన తర్వాత వచ్చినవారు కాలువ పనులు పూర్తి చేయ లేకపోయారు. సింగూరు నీటిపైనే ఈ ప్రాంత రైతులు ఆధారపడి ఉన్నారు. అటువంటి నేత మళ్లీ రాడు. ఆయనే ఉంటే కాలువ ఎప్పుడో పూర్తయ్యేది. - ముస్లాపురం భాగయ్య, రైతు, పోసానిపేట, మెదక్ రైతు బాంధవుడు! ధవళేశ్వరం వద్ద ఆన కట్ట కట్టిన కాటన్ రైతుల హృదయాల్లో ఎలా నిలిచి పోయాడో అలాగే వైఎస్ కూడా అన్నదాత గుండెల్లో అజేయుడిగా మిగిలి పోతాడు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన నాయకుడు. - దేవలంక రాము, రైతు నాయకుడు, నరేంద్రపురం, తూ.గో. పుట్టిన రోజు కానుక నా అభిమాన నేత వైఎస్ఆర్ పుట్టిన రోజుకు కానుక ఇవ్వాలని ఎనిమిది వేల పప్పు దినుసులతో ఆయన చిత్రాన్ని తయారు చేశాను. వారంలో ధాన్యచిత్రం పూర్తయింది. కానీ నా అభిమాన నాయకునికి చేరేదెలా? నా చేతుల్తో ఆయనకు అందించే భాగ్యం కలగాలని దేవుణ్ని కోరుకునేవాడిని. ఆ అదృష్టం 2009లో వచ్చింది. నల్లగొండ జిల్లా, కోదాడలో ప్రచారం బస్సు ఆగగానే భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టేశారు. నేను గుంపులో ఉండిపోయాను. ఆయన బస్సు పైకి వచ్చి అందరికి అభివాదం చేస్తున్నారు. నేను చిత్రపటాన్ని పెకైత్తి పట్టుకున్నాను. కళ్లతోనే ‘ఏమిటది’ అన్నట్లు సైగ చేశారు. ‘తర్వాత తీసుకుంటాను’ అన్నట్లు చేత్తోనే సైగ చేశారు. సమావేశం ముగిసింది. అందరూ బస్సెక్కి డోర్లు మూసేశారు. అవకాశం జారిపోయిందనే దిగులు. అంతలోనే... కిటికీ తెరిచి నన్ను పిలిచి చిత్రపటాన్ని తీసుకుని ‘బాగుందని’ ప్రశంసిస్తూ షేక్ హ్యాండిచ్చారు. ఆయన మాటకు కట్టుబడే మనిషి మాత్రమే కాదు, సైగతో చెప్పినా కూడా ఆచరణలో పెట్టే నాయకుడు. - తమలపాకుల సైదులు, కోదాడ పేరు పెట్టి పిలిచే ఆప్యాయత మా నాన్నగారికి వైఎస్ గారితో కొద్దిపాటి పరిచయం. ఆయన 2006లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి అపస్మారక స్థితిలోకి పోయారు. ఆ మర్నాడే పేపర్లో వార్త చూశారో ఏమో సి.ఎమ్ ఆఫీస్ నుంచి ఆస్పత్రికి ఫోన్... ‘‘సి.ఎమ్ గారు వాకబు చేయమన్నారు. ఎలా ఉన్నారు? ఏ అవసరం ఉన్నా చెప్పమన్నారు’’ అన్నారు. తర్వాత మూడవరోజు... ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ‘‘బాగైపోతుందమ్మా ధైర్యంగా ఉండండి’’ అని మా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎంత ఖర్చయినా వెనకాడవద్దని ఆస్పత్రి వర్గాల వారికి చెప్పారు. మా నాన్నగారు కొద్దిగా కోలుకున్నాక సి.ఎమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మేము క్యాంపు ఆఫీస్‌కి వెళ్లాం. నాన్నగారు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారని వెంటనే ఆయనే మా దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచి ‘‘జేమ్స్ ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా? నడుస్తున్నావా? నీకు ఏ అవసరాలున్నా మీ అబ్బాయిలను నా దగ్గరకు పంపించు, మంచి ట్రీట్మెంట్ తీసుకో’’ అని చెప్పారు. ఆ ఆప్యాయత మరవలేనిది. - ప్రేమ్, సుధీర్, హైదరాబాద్ అనుకుంటే చేస్తారు... ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఏదైనా సాయం అడిగితే చేస్తామంటారు. చేయరు. కొందరు చేసినట్టు నటిస్తారు. చేయరు. మరికొందరు అసలేమీ చేయకనే, సాయం అడగడానికి వెళ్లాం కదా అని ఈసడిస్తారు. కాని నేను ఎరిగిన వైఎస్... చేయాలనుకుంటే చేసే మనిషి. ముక్కూ ముఖం ఎరగకపోయినా సాయం చేయడానికి చేయి అందించే మనిషి. మాది కడపజిల్లాలోని ఒక పల్లెటూరు. 1994 మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమా పాసయినా ఉపాధి లేదు. తండ్రి మరణించడంతో దిక్కుతోచని స్థితి. ఏం చేయాలో అర్థంకాక వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారిని కలిశాను. అదే మొదటిసారి కలవడం. సిఫార్సు లెటరు రాసిచ్చి, లిమిటెడ్ కంపెనీలో చేర్పించారు. లెటర్ ఇచ్చి ‘నేను రికమండేషన్ చేశాను కదా అని ఎవరూ కూర్చోబెట్టి జీతాలు ఇవ్వరు. కష్టపడి పని చేయ్. కెరీర్ డెవలప్ చేసుకో’ అన్నారు. ఆయన ఇచ్చిన లెటర్ జిరాక్స్ లామినేషన్ చేయించి భద్రంగా ఉంచుకున్నాను. ఆయన ఇచ్చిన సలహా పాటిస్తున్నాను... పాటిస్తాను. ఎప్పటికీ మరువను. - ఎ. జయలక్ష్మీరెడ్డి, బెంగళూరు నేనున్నాను... అని ఆదుకున్నారు! భారతదేశ పటంలో మా ఊరు ఎక్కడుందో మాకే తెలియదు. అలాంటిది మా పొందూరు ఖద్దరు మహాత్మాగాంధీని ఆకర్షించి, ఆయన ప్రశంసలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అయితే క్రమేణా ఖద్దరు ఉత్పత్తులకు ఆదరణ తగ్గింది. ఊరు వెలవెలపోతూ, నేత కార్మికులు విలవిలలాడుతున్న తరుణంలో ‘‘నేనున్నాను’’ అంటూ వై.ఎస్.గారు వచ్చారు. మా గ్రామ కార్మికులకు ఆయన పునర్జన్మ ఇచ్చారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొందూరు ఖద్దరు గొప్పతనం చెప్పి, ప్రచారం లభించేలా చేసి మమ్మల్ని గట్టెక్కించారు. ఖద్దరు అంటే మాకు రాజశేఖరరెడ్డిగారే గుర్తుకొస్తారు. ఆయన ధరించే పొందూరు ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చీ, మువ్వన్నెల కండువా... ఖద్దరు ప్రాశస్త్యాన్ని చాటుతుంటాయి. చక్కనైన పంచె కట్టు, నలగని చొక్కాతో హుందాగా కనిపిస్తూ మా గ్రామ వస్త్రాలకు శోభను తెచ్చారాయన. చేనేత కార్మికులకు పింఛను, పావలా వడ్డీ రుణం, మార్కెటింగ్ సదుపాయం కోరాం. అభయం ఇచ్చారు. అంతలోనే - ఆ రాజాధిరాజు వెళ్ళిపోయారు. - దండా గోవిందరావు, పొందూరు, శ్రీకాకుళంజిల్లా ఆ దండను దాచుకున్నాం... 1990 లో రాజశేఖర్‌రెడ్డిగారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జంగారెడ్డిగూడెం వస్తున్నారని తెలిసి, మా నాన్నగారు, మా అన్నదమ్ములు ముగ్గురం ఆయన రాక కోసం ఎంతో ఆతృతతో రోడ్డుకు పక్కగా నిలబడ్డాం. సెక్యూరిటీ మధ్య వై.యస్గారు మందుకు నడుస్తున్న వారల్లా మా నిరీక్షణను గుర్తించి ఆగి పలకరించి ‘‘పట్టణంలో జరిగే మీటింగ్‌కు త్వరగా రండి’’ అని ఆహ్వానించారు. ఇలా ఆయనతో అనుబంధం ఏర్పడింది. తిరిగి 2003 లో పాదయాత్రలో భాగంగా మా ఇంటికి దగ్గర్లోనే వై.యస్గారు బస చేశారు. ఉదయమే మా కుటుంబ సభ్యులమంతా ఆయన దగ్గరకు వెళ్ళాం. విలేకర్లు, స్థానిక నాయకులతో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. నా కూతురు ప్రశాంతి వైయస్‌గారి దగ్గరకు వెళ్ళి నూలు దండను ఆయన మెడలో వేసింది. ఆయన ముచ్చటపడి అదే దండను అమ్మాయి మెడలో వేశారు. మళ్ళీ మా అమ్మాయి ఆయన మెడలో వేసింది. మళ్ళీ వైయస్‌గారు అమ్మాయి మెడలో వేశారు. ఆ దండను ఆయన జ్ఞాపికగా పదిలంగా మా ఇంట్లో దాచుకున్నాం. - పి.ఎస్.ఎస్.ఎస్.గాంధీ, జంగారెడ్డిగూడెం నా ఇష్టదైవానికి... భక్తితో... ఆ దేవుడు నా అభిమాన నేత. ప్రజల ఆరాధ్యదైవం. అలాంటి గొప్ప నాయకుడికి ఘనంగా నివాళులర్పించాలని నా మనసు పదే పదే కోరింది. కానీ ఆర్థికంగా పేదను. డబ్బు ఖర్చు పెట్టి గొప్ప పనులు చేయలేను. నా కూతురి వివాహం చేస్తూ... ఆహ్వాన పత్రిక మీద ఆ దేవుడి ఫొటో వేశాను. ఎవరి ఇష్టదైవం ఫొటోలు వారు వేసుకుంటారు. ఆ దైవాలను మనం చూడలేదు. విన్నాం అంతే. పేదల దేవుడు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి గొప్ప పాలన అందించిన వై.ఎస్. ఫొటోను నా కూతురి పెళ్ళి పత్రికపై అచ్చు వేయించుకొని నా ఆత్మీయ నాయకుడికి నివాళి అర్పించాను. శుభలేఖ మీద చనిపోయినవారి ఫొటో వద్దని ఎందరో వారించారు. నా దృష్టిలో ఆయన జీవించే ఉన్నారు. కొన్ని కోట్ల జనం మదిలో సజీవంగా ఉన్నారు. ఆయనకు మరణం లేదు. అటువంటి ఫొటో ‘శుభలేఖ’ మీద ఉండటం శుభమే. - మేకల మోహన్, కమలానగర్, అనంతపురం తాతయ్య ఉత్తరం! వై.ఎస్ తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన భద్రాచలం పర్యటనలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. ఆ హాస్టల్లోని బాలబాలికలు సిఎం గారిని గౌరవంగా సార్, సార్ అని సంబోధించినప్పుడు, వారిని వారించి, ‘‘నన్ను తాతయ్య అని పిలవండి’’ అని అలాగే పిలిపించుకుని మురిసిపోయారు. 2004లో బాలభవన్ వేసవి శిబిరంలో నేను, మా అక్క ముగింపు వేడుకలలో పాల్గొన్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన సమయం అది. మేము దాచుకున్న 500 రూపాయలను ఇచ్చాం. నగదు తీసుకోరన్నారు. చెక్కు ఇవ్వడం మాకు చేతరాదని ఆ డబ్బును సి.ఎం గారికి అందచేయమని మంత్రిని కోరాం. మేము ఆ డబ్బులు పంపించామని తెలుసుకున్న వై.ఎస్.గారు. మమ్మల్ని మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని భద్రంగా దాచుకున్నాం. ఓసారి వైఎస్ తాతయ్యను చూడాలంటే నాన్న క్యాంప్ ఆఫీస్‌కు తీసుకెళ్ళారు. - సత్తి సుమధుర, షాదాన్ స్కూల్, హైదరాబాద్ ఫొటో ముచ్చట వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు 1982లో గోరంట్ల జూనియర్ కాలేజీ ప్రారంభించడానికి వచ్చారు. ఆయన ప్రసంగం నన్నెంతో ఆకర్షించింది. వై.ఎస్. ప్రసంగం మొదలై, అది పూర్తయ్యేవరకు ఆయన అభిమానులు పూలమాలలు వేయడం, ఫొటోలు తీయించుకోవడం జరిగింది. నేను కూడా ఆయనకు పూలమాల వేశాను. ఫొటో కోసం వెయిట్ చేస్తుండగా, కెమెరాలో రీల్ అయిపోయింది. నా ముఖంలోని బాధను గమనించిన వై.ఎస్.గారు నా భుజం తట్టి, ఇంకోసారి తప్పకుండా అవకాశం వస్తుందని ఊరడించారు. ఆ తర్వాత... కొన్ని నెలలకు ఆయన్ను కలిసే అవకాశం మళ్లీ వచ్చింది. వై.ఎస్.గారు నన్ను చూసి, ‘‘బాగున్నావా’’ అని అడిగారు. ‘‘చాలా దూరం నుంచి వచ్చినట్లున్నావు కదా’’అని అంటూనే, ‘‘ఫొటో తీసుకునే అవకాశం మనకు ఈ రోజు వస్తుంది’’ అన్నారు. అలా ఆ రోజు నా ముచ్చట తీరింది. ఆ సంఘటనను గుర్తుపెట్టుకోవడం నాకెంత ఆశ్చర్యమో. ఎంత జ్ఞాపకశక్తి! వై.ఎస్.గారితో దిగిన ఫొటోపై ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని పదిలంగా దాచుకున్నాను. - కొడేకండి హైదర్ వలి, గోరంట్ల రంజాన్ ‘బోనస్’ 2003లో రంజాన్ పర్వదినం. ‘ప్రజాహిత బస్సుయాత్ర’లో భాగంగా అనంతపురం వచ్చిన వై.ఎస్.గారు గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. నేను వారి దగ్గరకు వెళ్ళి - ‘‘సార్... ఈ రోజు రంజాన్ పండుగ. కానుకగా టోపీ తెచ్చాను’’ అని చెప్పాను. ఆయన సంతోషంగా ‘‘క్యారీ ఆన్’’ అన్నారు. స్వయంగా నా చేతులతో నేను ఆయనకు టోపీ అలంకరించాను. ‘‘ఏమయ్యా... టోపీ టైట్‌గా ఉన్నట్లుందే’’ అని నవ్వుతూ అన్నారు. ఆ మధుర క్షణాలు నేను ఎన్నటికీ మరచిపోలేనివి. ఆ రోజు మా వెంట ఒక అబ్బాయి కూడా వచ్చాడు. అతడిని చూసి వై.ఎస్.గారు. - ‘‘ఏమయ్యా... పఠాన్ డ్రెస్ వేసుకుని జోరుగా ఉన్నావు. వీళ్ళకంటే నువ్వే జోరుగా ఉన్నావు’’ అని మమ్మల్ని చూపిస్తూ, ఆ అబ్బాయితో చమత్కరించారు. నేను ధైర్యం చేసి ‘‘సార్... మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది’’ అన్నాను. ‘‘మీ ఆశీర్వాదం ఉండాలి’’ అని అన్నారు. ఆ మాట నాకెంతో సంతోషం వేసింది. రంజాన్ రోజు వై.ఎస్.గారిని కలవడం నిజమైన పండగగా, పండగ బోనస్‌గా భావించాం. - పి.షఫీయుల్లాఖాన్, అనంతపురం గులాబీ మొక్కను నాటుకున్నాం... డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి జ్ఞాపకాలు మా గుండెల్లో ఎప్పుడూ నిండుగా ఉంటాయి. మా పెరట్లో ఆయన గుర్తుగా గులాబీలు పూస్తున్నాయి. ఆ గులాబీలను చూసినప్పుడల్లా చిరునవ్వులు చిందిస్తున్న వైఎస్సే కనిపిస్తారు. డాక్టర్ వైఎస్సార్‌ని కలిసింది ఒక్కసారే అయినా అది ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది. ‘‘వై.ఎస్.ఆర్ పిడుగురాళ్ళ వస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారా పరిచయం చేయిస్తాను రా’’ అని మా మామగారు కబురు పంపారు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నరసరావుపేటలో దండ కొనుక్కుని వెళ్ళాను. గురజాల ఎమ్మెల్యే నన్ను వై.ఎస్.గారికి పరిచయం చేస్తూ - ‘‘మీ వీరాభిమాని’’ అన్నాడు. తక్షణం నా అభిమాన నేతకు నమస్కరించి, దండ వేసి, శుభాకాంక్షలు తెలిపాను. ఆయన నన్ను చిరునవ్వుతో ‘‘ఏం చేస్తుంటావు? పిల్లలెంతమంది? అంతా బాగున్నారా? ఏదైనా అవసరమైతే కలువు’’ అని ఆత్మబంధువులా మాట్లాడారు. అలాంటి మనిషి మన మధ్య లేరంటే గుండెని పిండేసినట్లవుతోంది. ఆయన అంత్యక్రియల రోజు గుర్తుగా గులాబీ మొక్కను నాటుకున్నాం. - షేక్ హబీబుల్లా, పర్చూరు -
అంతన్నారింతన్నారు..!
నేడు అల్లూరి జయంతి అల్లూరి స్మారక చిహ్నాల అభివృద్ధికి రూ.2 కోట్లిస్తామని అయ్యన్న హామీ కేటాయింపు రూ. లక్షల్లో అభివృద్ధి ప్రచారానికే పరిమితం నేడు అల్లూరి పార్కులో వేడుకలు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల అభివృద్ధికి నేతల హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీల పరిస్థితి అదేవిధంగా ఉంది. వీటిలో కొన్ని మాత్రమే అమలుకు నోచుకోగా అత్యధికం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రూ. 2 కోట్లు కేటాయించామని చెబుతున్న నేతలు వాటిని ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. గొలుగొండ: కేడీపేట అల్లూరి పార్కు అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. గతేడాది పర్యాటకశాఖ నుంచి పార్కు అభివృద్ధికి రూ.20 లక్షల వరకు మంజూరు అయ్యాయి. వాటితోనే విద్యుత్ దీపాలంకరణ, పర్యాటకుల విశ్రాంతికోసం చిన్న కాటేజీలు, రెస్టారెంట్, గ్రంథాలయ భవనం ఏర్పాటయ్యాయి. అంతకుమించి చేపట్టిన పనులేమీ లేవని పర్యాటకులు విమర్శిస్తున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు. వీటిని జులై నాలుగులోగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అల్లూరి పార్కులో సుమారు 12 అడుగుల అల్లూరి విగ్రహం ఏర్పాటు పర్యాటకులకోసం మ్యూజియం కేడీపేట అల్లూరి పార్కు నుంచి గాది గూం జలపాతం మీదుగా లంబసింగి వరకు పర్యాటకంగా అభివృద్ధి పర్యాటకులకు పూర్తిగా తాగునీరు సౌకర్యం పర్యాటకులకోసం రెస్టారెంట్పార్కు పూర్తిస్థాయిలో అభివృద్ధి (పచ్చదనం) జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ఇప్పటివరకు చేపట్టిన పనులుపార్కులో ఎండ ప్రభావానికి చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడంపాత భవనాలకు సున్న, పెయింటింగ్పార్కు చుట్టూ పెరిగిన తుప్పల తొలగింపుపార్కులో శానిటేషన్ మెరుగు ఠపాడైన లైట్లకు మరమ్మతులు తాగునీరు అందేలా పైపులైన్లకు మరమ్మతులు ఇలా చిన్న పనులు మినహా ప్రధాన హామీలు అమలుకు నోచుకోలేదు. రెండేళ్లుగా అయ్యన్న ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లూరి పార్కులో సోమవారం నిర్వహించే వేడుకల్లో పాల్గొనే ఆయన ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ప్రధాన కేంద్రాల్లో అల్లూరి విగ్రహాలు ఏర్పాటు చేయాలిఆదివాసీ గిరిజన ఐక్యవేదిక ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి గడుతూరు రాంగోపాల్ డిమాండ్ డుంబ్రిగుడ: అల్లూరి జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ ఐక్యవేదిక ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి గడుతూరు రాంగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాల్లో అల్లూరి విగ్రహాలతోపాటు అనుచరులు గంటందొర, బోనంగి పండుపడాల్, మల్లుదొర్ర విగ్రహాలను ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై గతంలో కలెక్టర్ యువరాజ్, వుడా వీసీ బాబూరావునాయుడుకు వినతిపత్రాలు అందజేశామని గుర్తుచేశారు. ఇప్పటికైనా వారు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
జగద్గురువు ఆదిశంకరులే!
నేడు శంకర జయంతి శంకరులు జన్మించేనాటికి ఆనాటి సమాజంలో బహుదేవతారాధన విస్తృతంగా కొనసాగుతోంది. శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం ఇలా ఎన్నో మతాలు, వాటి ఉపశాఖలు లెక్కకు మిక్కిలిగా వర్థిల్లుతున్నాయి. ఆయా మతాలు, శాఖలు పరస్పర విరుద్ధంగా చెప్పే విషయాలతో అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో, ఆత్మ పరమాత్మ తత్వాల సారమేమిటో, ఏ మతం మంచిదో, ఏ శాఖ చెప్పిన విధానాలను పాటించాలో తెలీని అయోమయ స్థితిలో పడ్డారు సామాన్య ప్రజానీకం. ఆ సమయంలో దశోపనిషత్తుల సారాంశాన్ని రంగరించి శంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపించారు. ఏ మతాన్ని నిరసించకుండా వారి ఆచారాలను, విధానాలను సంస్కరించి షణ్మత స్థాపకులయ్యారు. ఆయా మతాలన్నిటినీ సమన్వయం చేసి అద్వైతంలో విలీనం చేశారు. పండితుల కోసం శంకర భాష్యాలు, సామాన్యుల కోసం సాధనా పంచకం, ఆత్మబోధలాంటి అజరామరమైన రచనలను అందించారు. పామరుల కోసం వేదాంతం తేలిగ్గా అర్థమయ్యేందుకు వారు సులువుగా పాడుకోగలిగేలా భజగోవిందం లాంటివి రచించారు. ఆయన రచించిన సౌందర్యలహరి, శివానందలహరి, కనకధారాస్తోత్రం, మహిషాసుర మర్దినీ స్తోత్రం నేటికీ భక్తులు పాడుకుంటున్నారు. ఇంతేకాదు, నిర్వాణ షట్కమ్, కౌపీన పంచకం, సాధనా పంచకం, ప్రశ్నోత్తరి, మణిమాల, నిర్వాణ మంజరి, సార తత్త్వోపదేశం, వివేక చూడామణి, వేదాంత డిండిమ, ఆత్మ షట్కమ్, ఆత్మబోధ తదితరాలనూ అందించారు. ఇతరులకు హితాన్ని బోధించే వ్యక్తే గురువు. అందుకే ఆస్తికులే కాదు, నాస్తికులు కూడా తమకు హితాన్ని బోధించే నిస్వార్థులైన గురువులనే సేవిస్తారు. మన జీవితంలో ధర్మమనే ఒక అసాధారణమైన శక్తి ఉన్నదని నిరీశ్వరవాదులైన బౌద్ధులు కూడా అంగీకరించారు. అటువంటి ధర్మాన్ని జీవితంలో అనుభవానికి అందించే గురువుకు లౌకిక గురువు కన్నా గొప్ప స్థానం సహజంగానే సిద్ధిస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ, అటువంటి ధర్మగురువుల పరంపరలో వచ్చిన కొందరు ‘సంకుచిత దృష్టితో ‘మన మతమే సత్యం, మిగతా అంతా పెడదారులు’ అని ఉపదేశిస్తూ వచ్చారు. ఫలితంగా ధర్మం పేరిట కూడా రాగద్వేషాదులు అధికం కావడానికి అవకాశం ఉంది కాబట్టి ధర్మాలన్నింటినీ సామరస్యం కావించి చూపే ఒక మహాగురువు అవసరం. మిగతా మతాలన్నింటిని తుడిచేసి, దీక్ష లేక శుద్ధి అనే నెపాలతో అందరినీ తమ మతానికి చేర్చుకొని అన్ని మతాలను ఏకం చేస్తే మతసమన్వయం చేకూరుతుందని ఇప్పుడు చాలా చోట్ల భావిస్తున్నారు. అయితే అదే నిజమైన ధర్మమార్గమని చెప్పడానికి వీలుకాదు. నిజంగా ధర్మం బయటి వేషభాషలకు సంబంధించినది కాదు. అది హృదయానికి చెందినది అని గ్రహించాలి. శంకర జయంతిని జరుపుకోవడం నేటికీ జరుగుతోంది. అది చాలదా... ఆయనే జగద్గురువని చెప్పడానికి! - స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ శారదాపీఠం, విశాఖపట్నం -
జై హనుమాన్...
నగరంలో ఘనంగా హనుమజ్జయంతి వైభవంగా సాగిన శోభాయాత్ర అబిడ్స్/కలెక్టరేట్: జై హనుమాన్..జై శ్రీరాం...జై భజరంగబళి నినాదాలతో నగరం హోరెత్తింది. హనుమాన్ జయంతిని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. నగరం నలుమూలలా హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు. గౌలిగూడ రాంమందిర్‌లో ముందుగా భజరంగ్‌దళ్ తెలంగాణ అధ్యక్షులు వై.భానుప్రకాష్ హనుమాన్‌జీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రను వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ కార్యదర్శి సురేంద్రకుమార్ జైన్, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు మూసాపేట రామరాజు, కార్యాధ్యక్షులు సురేందర్‌రెడ్డి, భాగ్యనగర్ వీహెచ్‌పీ అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్, బెంగుళూరు క్షేత్ర భజరంగ్‌దళ్ సంయోజకులు సూర్యనారాయణ ముఖ్యఅతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. శోభాయాత్రకు జంట నగరాల నుంచి వేలాదిమంది హనుమాన్ భక్తులు ర్యాలీగా తరలివచ్చారు. జంటనగరాలకు చెందిన హిందీనగర్, వివేకానందనగర్, ఆర్యనగర్, విద్యానగర్, మహంకాళినగర్, అణుశక్తి, విశ్వకర్మనగర్, వాయుపుత్రనగర్ జిల్లాలతో పాటు పాతబస్తీలోని ధూల్‌పేట్, బేగంబజార్, మంగళ్‌హాట్, జియాగూడ, పురానాపూల్, షాలిబండ, చార్మినార్, బహదూర్‌పురా, అత్తాపూర్, జాంబాగ్, గన్‌ఫౌండ్రీ, సుల్తాన్‌బజార్, కోఠి, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది హనుమాన్ భక్తులు ర్యాలీలో పాల్గొని జైశ్రీరామ్ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గౌలిగూడ రాంమందిర్ ప్రధాన రహదారి నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా మీదుగా సుల్తాన్‌బజార్, కాచిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి నుంచి తాడ్బంద్ హనుమాన్ ఆలయానికి తరలివెళ్లింది. పాల్గొన్న ప్రముఖులు హనుమాన్ శోభాయాత్రలో భజరంగ్ దళ్ నగర అధ్యక్షులు వీరేశలింగం, మాజీ ఎమ్మెల్యే పి.రామస్వామి, భజరంగ్సేన రాష్ట్ర అధ్యక్షులు ఠాకూర్ యమన్‌సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు గోవింద్‌రాఠి, వై. కృష్ణ, గొడుగు శ్రీనివాస్‌యాదవ్, బంగారు సుధీర్‌కుమార్, కార్పొరేటర్ జి. శంకర్‌యాదవ్, బీజేపీ నగర కార్యవర్గ సభ్యులు గుండెవోని శ్రీనివాస్‌యాదవ్, మీరంపల్లి కృష్ణ, రమేష్‌లతో పాటు టీఆర్ఎస్ గన్‌ఫౌండ్రి నాయకులు సంతోష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రకు సెంట్రల్, ఈస్ట్‌జోన్ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. డీసీపీ కమల్‌హాసన్‌రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాధ్, అడిషనల్ డీసీపీ సుంకరి సత్యనారాయణ, ఏసీపీ రావుల గిరిధర్, ఇన్స్పెక్టర్లు అంజయ్య, శివశంకర్, ఇతర అధికారులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
తెలుగు స్వతంత్ర భాష
బెజవాడలో మారిన బండి తెల్లవారుతోందనగా కొండపల్లి దాటింది, అది మొదలు ‘‘పరాయిదేశం వెడుతున్నా’’ మన్నట్టుంది నాకు. ఇప్పటికన్నీ, తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వాడికి, మొదటిమాటు, తునిదాటితే మరో ప్రపంచమూ, ఒంగోలు దాటితే మరో ప్రపంచమూ, నరసరావుపేట దాటితే మరో ప్రపంచమూ, కొండపల్లి దాటితే మరో ప్రపంచమున్నూ. అసలు, ఏలూరు దాటితేనే భేదం కనపడుతుంది, అది అవగాహన కానిది కాదు. అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ కూడా కండగల తెనుగే; కాని, కాదేమో అనిపిస్తుందెక్కడికక్కడే. అందుకు బెదరక, మళ్లీ మళ్లీ వెళ్లాడా, తెనుగుభాష తన విశ్వరూపం కనపరుస్తుంది, ఆంధ్రత్వమున్నూ సమగ్రం అవుతుంది, వెళ్లిన వాడికి. ఒక్కొక్క సీమలోనొక్కొక్క జీవకణం వుంది తెనుగు రక్తంలో, అన్నీ వొకచోటికి చేర్చగల-అన్నీ వొక్క తెనుగువాడి రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకు రావాలి, అంతే. మొదటిమాటు విశాఖపట్నం వెళ్లాన్నేను. అప్పటి నాకున్నది వొక్కటే ప్రాణం. వారం రోజులున్నా నా మొదటి మాటక్కడ. రెండో ప్రాణం సంక్రమించినట్టనిపించింది, దాంతో నాకు. తరవాత నెల్లూరు వెళ్లాను, మూడో ప్రాణం సంక్రమించినట్టనిపించిందక్కడ. అదయిన తరవాత కడపా, అనంతపురమూ, నంద్యాలా వెళ్లాను. నాలుగో ప్రాణం సంక్రమించినట్టనిపించింది. చివరికి హనుమకొండ వెళ్లాను, అయిదో ప్రాణం కూడా నాకు సంక్రమించినట్టు-నా ఆంధ్ర రక్తం పరిపూర్ణం అయి నట్టనుభూతం అయింది నాకు. ఇవాళ చూసుకుంటే, అయిదు ప్రాణాల నిండు జీవితమే నాది, అందుకు తగ్గ దార్డ్యం మాత్రం కూడలేదనే చెప్పాలింకా. అందుకోసం నేను చేసుకున్న దోహదం బహు తక్కువ, మరి. ఆంధ్ర హృదయం-ఆంధ్రభాషపరంగా వ్యక్తం అవుతున్న జీవనసరళి నాకింకా బాగా అవగాహన కాలేదు. నా స్వప్రాంతపు పలుకుబడిలో యెంత జీవశక్తి వుందో, అక్కడక్కడి పలుకుబళ్లలోనూ అంతంత జీవశక్తి వుంది, వారాల్లోనూ మాసాల్లోనూ పట్టు బడేది కాదది. ఒక్కొక్క చోట ప్రచలితం అయే కాకువూ, వొక్కొక్క చోట ప్రయుక్తం అయే యాసా పుస్తకాలు చదివితే అందవు, వొకచోట కూచున్నా దొరకవు- పల్లెలూ పట్నాలూ తిరగాలి, అష్టాదశవర్ణాల వారిలోనూ పరభాషా వ్యామోహం లేనివారిని కలుసుకోవాలి, ఆ పలుకుబళ్లు చెవులారా వినాలి, ఆ ప్రయోగ వైచిత్రి సవిమర్శంగా పట్టుకోవాలి, ఆ నాదం-చిక్కని ఆ మధుర గంభీరనాదం అవగాహన చేసుకోవాలి, అన్నిటికీ ప్రధానంగా ‘‘ఇది నా సొంతభాష-మొదటిమాటు, నా తల్లి, నా జీవశక్తికి జతచేసిన-నాకు వాగ్ధార ఆవిర్భవింపచేసిన సంజీవిని అన్న ఆత్మీయతా, మమతా ఉద్బుద్ధాలు చేసుకోవాలి, ముందు. అప్పుడు గాని యే తెనుగువాడికీ నిండు ప్రాణం వుందని చెప్పడానికి వీల్లేదు. దానికోసం నా పరితాపం యిప్పటికీ. నిజం చెప్పవలసి వస్తే యే వొక్క శాస్త్రంలో సమగ్ర పరిజ్ఞానంలేని షట్‌శాస్త్ర పండితుని స్థితి నాదివాళ. అయినా, నా తెనుగుభాష శాస్త్రీయం-తాటాబూటం కాదు. నా తెనుగుభాష యుగయుగాలుగా ప్రవాహిని అయివుండినదిగాని, యివాళ, ఆ భాషలో నుంచి వొక మాటా, యీ భాషలోనుంచి వొకమాటా యెరువు తెచ్చుకుని భరతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు. నా తెనుగుభాష ఎక్కడ పుట్టినా చక్రవర్తుల రాజ్యాంగాలు నడిపిందిగాని, పరాన్నభుక్కు కాదు. నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలదిగాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందీకాదు, అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీ కాదు. యావద్భారతదేశంలోనూ, యీ విశాల విశ్వంలో కూడా తెనుగువాణ్ణిగా, నేనే నిర్వహించవలసిన కార్యక్రమం కొంత వుంది, నా దృఢవిశ్వాసం యిది. అందుకోసం, అన్ని సీమల పలుకుబళ్లూ బోధపరుచుకుని, అన్ని సీమల జీవశక్తీ కూర్చుకుని స్వస్వరూప జ్ఞానంతో దృఢంగా నిలవగలగాలి నేను. నాకు మాత్రం యీ ఆకాంక్ష కూడా వుంది, పూర్తిగా. (ఏప్రిల్ 23 శ్రీపాద 125వ జయంతి సందర్భంగా-సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ‘అనుభవాలు-జ్ఞాపకాలూను’ నుంచి) -
అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం
చిత్తూరు(గిరింపేట): బడుగు బలహీన వర్గాలకు అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మెసానికల్ మైదానం వద్ద గల అంబేడ్కర్ భవన్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి, ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ మనిషిని మనిషిగానే చూడండి అని చాటిచెప్పిన మహానుభావుడు అంబేడ్కర్ అన్నారు. ప్రతి దళితుడూ సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి మాట్లాడుతూ దళితులందరూ ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నదే అంబేడ్కర్ ఆశయమన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనుండడం అభినందనీయమని పేర్కొన్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వకుండా ఇళ్లు మంజూరు చేస్తే వారు ఎక్కడ కట్టుకోవాలని నిలదీశారు. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ చిత్తూరు, తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. జూన్ లోపు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ డెరైక్టర్ వైవీరాజేశ్వరి, జేసీ-2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో విజయచందర్, సోషల్ వెల్ఫేర్ జేడీ విజయకుమార్, డీఆర్డీఎ పీడీ రవిప్రకాష్, ఆర్డీవో కోదందరామిరెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ డీడీ ప్రభాకర్‌రెడ్డి, వివిధ శాఖాధికారులు, దళిత నాయకులు పాల్గొన్నారు. -
జన నీరాజనం
-
అంబేడ్కర్ అందరివాడు కాదా..
సీఎం వెళ్లే వరకు ఎదురుచూపులు కారెం శివాజీ జెండాలతో హల్చల్ విజయవాడ(భవానీపురం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడు కాదా.. కొందరికే పరిమితమా..! పోలీసు పహారా మధ్య అంబేడ్కర్ విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాక మానదు. పైగా ముఖ్యమంత్రి వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించే వరకు మిగిలిన ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నాయకులకు పోలీసులు అనుమతించకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9.15కు వస్తారని సమాచార శాఖ ప్రకటించింది. ఆయన 10.40 గంటల సమయంలో వచ్చి నివాళి అర్పించి వెళ్లిపోయారు. సీపీఐ తదితర ప్రజా సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. మాలమహానాడు జెండాలతో శివాజి హల్చల్.. మాల మహానాడు నాయకుడు, ఎస్టీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బుధవారం నియమితులైన కారెం శివాజీ పదవి వచ్చిన రెండో రోజే హల్చల్ చేయడంపై పలువురు నివ్వెరబోయారు. ప్రభుత్వ కార్యక్రమంలో మాలమహానాడు జెండాలను ప్రదర్శించే యత్నం చేసిన శివాజీ అనుచరులను డీసీపి కాళిదాసు వారించారు. కొద్దిసేపు శివాజీ కాళిదాసుతో వాదించినా చివరికి జెండాలను తొలగించక తప్పలేదు. తిరిగి శివాజి అనుచరులు ప్లకార్డులు తీసుకువచ్చి చేతపట్టుకున్నారు. వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఒప్పుకోలేదు. మళ్లీ ఆయనతో శివాజీ వాగ్వాదానికి దిగారు. సీఎం ఫొటో ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పేమిటని వాదనకు దిగారు. దానిపై మీ ఫొటో కూడా ఉంది కదా అని సీఐ అనడంతో మంత్రి కిషోర్ పెట్టుకోమన్నారని చెప్పారు. సీఐ మంత్రితో మాట్లాడిన తరువాత వాటిని ప్రదర్శించారు. మండుటెండలో హాస్టల్ విద్యార్థినీలు.. సీఎం వస్తున్నారని కస్తూరిబాయిపేటలోని బాలికల హాస్టల్లోని విద్యార్థినీలను తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు తీసుకువచ్చారు. వారిని అంబేడ్కర్ విగ్రహ సమీప వంతెన ప్లాట్‌ఫాంపై కూర్చోపెట్టారు. దాదాపు గంటకుపైగా మండుటెండలో కూర్చోలేక వారు నానా అవస్థలుపడ్డారు. సీఎం పది నిముషాలలో వస్తారనగా వారిని తీసుకువెళ్లి షామియానాలో కూర్చోపెట్టారు. -
జన నీరాజనం
భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్ 125వ జయంతిని గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా యుగ పురుషుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలుచోట్ల అన్నదానాలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
ప్రేమలో పడితే...
యువత ప్రేమలో పడ్డాక వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీశంకర్ , జయంతి జంటగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో పొందూరి రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ ప్రేమకథ ల్లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి లక్ష్మణ్, సహ నిర్మాత: పొందూరి సాయిమురళీకృష్ణ. -
యువతే దేశ భవిత
‘లే.. లేచి నిలబడు, ధైర్యంగా.. బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో, నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో, నీకు కావాల్సిన బలం.. శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. మంచి చెడులను సృష్టించుకునేది మీరే.’ అంటూ స్వామి వివేకానంద తన బోధనలతో నవ భారత నిర్మాణానికి బాటలు వేశాడు. వివేకానందుడి ప్రవచనాలను ఒంటబట్టించుకున్న పలువురు యువకులు తమ అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. నేడు స్వామి వివేకానంద జయంతి -
బాబా సేవలో 5 వసంతాలు
నేడు సత్యసాయిబాబా జయంతి తగరపువలస : ఇందుగలడు అందుగలడు ఎందెందు వెదికినా అందందేగలడంటూ భక్త ప్రహ్లాదుడు శ్రీహరిపై నమ్మకం ఉంచి భక్తిని చాటుకున్నాడు. అంతకాకపోయినా అలాంటి నమ్మకంతోనే తగరపువలసకు చెందిన వానపల్లి సన్యాసిరావు అనే 76 ఏళ్ల వృద్ధుడు బాబాపై నమ్మకంతో ఏభై వసంతాలుగా సేవ చేస్తూనే భక్తి మాధుర్యాన్ని చవిచూస్తున్నాడు. తగరపువలస ప్రధానరహదారిని ఆనుకుని ఉన్న సత్యనారాయణ కొండ దిగువ భాగంలో ఉన్న ఈ పురాతన మందిరాన్ని ఎందరు విడిచిపెట్టి పోయినా ఆయన మాత్రం ఎవ్వరొచ్చినా రాకున్నా భౌతికంగా బాబా లేకపోయినా మందిరంలో ఉదయం, సాయంకాల సేవలను త్యజించలేదు. బాబా జన్మనక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని శనివారం పురాతన మందిరంలో జయంతి వేడుకలు జరుపుతున్నారు. బాబాయే రప్పించుకున్నారు.. నెల్లిమర్ల జూట్‌మిల్లులో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న సన్యాసిరావును 1965లో చిట్టివలస జూట్యాజమాన్యం ఇక్కడకు రప్పించుకుంది. అప్పటినుంచే ఆయనకు బాబా మందిరానికి వెళ్లే అలవాటయ్యింది. 1970లో బాబా రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని రికార్డు చేయడానికి సన్యాసిరావు వెళ్తే స్వయంగా బాబాయే ఆయన వద్ద ఆగి ఆప్యాయంగా నిమిరారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన దరిదాపులకు ఎలాంటి బాధలూ చేరలేదని, పైగా తన కుటుంబానికి కూడా బాబా ఆశీస్సులు లభించాయని ఆయన చెబుతారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన మందిరం బీటలువారడంతో ఇక్కడి సభ్యులంతా చిట్టివలసలో మందిరం కట్టుకుని వెళ్లిపోయినా సన్యాసిరావు మాత్రం బాబా కొలువైన ఈ పురాతన మందిరాన్ని విడిచిపెట్టి వచ్చేదిలేదని తెగేసి చెప్పారు. హుద్‌హుద్ తుపాను ధాటికి ఎన్నో నిర్మాణాలు దెబ్బతిన్నా ఈ మందిరంలోకి వర్షపుచుక్కలు కూడా రాలేకపోయాయి. బాబాపై నమ్మకమే నడిపిస్తుంది.. మందిరానికి నేను వచ్చే తొలిరోజుల్లో రంగూరి పెదరమణ, రమణమూర్తి పంతులు, గిడుగు సుబ్బారావు, జోగ అప్పలస్వామి వంటి వారు మందిరంలో వేకువజామున ఓంకారం, సుప్రభాతం, విష్ణుసహస్రనామాలు సాయంత్రం వేళల్లో ధ్యానం, భజనలు నిర్వహించేవారు. అలాంటి ఈ పవిత్రమందిరాన్ని విడిచిపెట్టడానికి మనసొప్పలేదు. ఇద్దరు, ముగ్గురు సాయంతో క్రమం తప్పకుండా ఈ క్రతువులు ఆచరిస్తూనే ఉన్నాను. బయట నుంచి ఎటువంటి చందాలు వసూలు చేయకుండానే నాకు వచ్చే పెన్షన్‌తోనే బాబాసేవతో పాటు నారాయణసేవ చేస్తున్నాను. కడ వరకు ఈ మందిరంలో బాబాసేవలోనే గడుపుతాను. రుద్రుడే సాయిరుద్రునిగా అవతరించి ఆరుద్ర నక్షత్రమున నరుని నారాయణుడిగా మార్చడానికి వచ్చినాడని నా నమ్మకం. - వానపల్లి సన్యాసిరావు, తగరపువలస