ఊరూరా పాపన్న జయంతి
సాక్షి, హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ జయంతిని ఈ నెల 18న రాష్ట్రంలో గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం రవీంద్రభారతిలో జైగౌడ్ ఉద్యమం– జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి వారోత్సవాలను నిర్వహించారు. జమీందారీ, దొరల వ్యవస్థ రూపుమాపితేనే బహుజనులకు మేలు జరుగు తుందని భావించిన గొప్ప వ్యక్తి పాపన్న అని స్వామిగౌడ్ కొనియాడారు.
సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండనే గెలిచారన్నారు. వివాహ శుభలేఖల్లో పాపన్న బొమ్మను ముద్రిం చుకోవాలన్నారు. పార్టీలు కాదని జాతి, కులం, బంధుత్వం ప్రధానమన్నారు. ప్రతి గౌడ తమ వాహనాలపై సర్దార్ అని రాసుకోవాలని సూచిం చారు. వట్టికూటి రామారావు ఎంతో కష్టించి గౌడ బంధువుల్ని కలుపుకుని జైగౌడ ఉద్యమం గ్రామగ్రామన తీసుకెళ్లటంతోనే సర్దార్ పాపన్న గౌడ గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు.
సినీï నటుడు తల్వార్ సుమన్‌గౌడ్ మాట్లాడుతూ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రికి విన్నవిద్దామన్నారు. నగరంలో గౌడ భవన్ నిర్మించాలని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వమే సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహిం చాలని, పాపన్న గీత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.5వేల కోట్లు కేటాయించాలని జైగౌడ ఉద్యమం జాతీయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వట్టికూటి రామారావుగౌడ్, డాక్టర్ చిర్రా రాజుగౌడ్ కోరారు.
గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, ఆర్‌టీవోలు చక్రవర్తిగౌడ్, రవీందర్‌గౌడ్, పీపీ కృష్ణమూర్తిగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు మదన్‌మోహన్‌గౌడ్, వ్యాపారవేత్త బాలగోని బాలరాజ్‌గౌడ్, విద్యావేత్త సుభాష్ గౌడ్, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్, జాతీయ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, పులుస మురళీగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ బూర మల్సూర్‌గౌడ్ పాల్గొన్నారు.