నేడు ఇద్దరు మహనీయుల పుట్టినరోజు. మహాత్మా గాంధీతో పాటు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా అక్టోబర్ 2నే జన్మించారు. శాస్త్రి 1904 అక్టోబర్ 2న యూపీలోని మొగల్‌సరాయ్‌లో జన్మించారు. శాస్త్రి తన జీవితాంతం సామాన్యుల అభివృద్ధికి పాటుపడ్డారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో శాస్త్రి ప్రధాన పాత్ర పోషించారు. నెహ్రూ తర్వాత భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు.
అవినీతికి వ్యతిరేకంగా లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్న నిర్ణయాలు అతనిలోని నిజాయితీని ప్రతిబింబిస్తాయి. శాస్త్రిలోని వినయపూర్వక స్వభావం, సరళత్వం, నిజాయితీ, దేశభక్తి అందరికీ స్ఫూర్తినందిస్తాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తన కుమారుని ప్రమోషన్‌ను నిలిపివేశారు. తన కుమారుడు అక్రమంగా ఉద్యోగంలో పదోన్నతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న శాస్త్రి అందుకు అడ్డుపడ్డారు. కుమారునికి పదోన్నతి కల్పించిన అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని నాటి తరం నేతలు చెబుతుంటారు.
లాల్ బహదూర్ శాస్త్రి కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు ఏదో ప్రభుత్వ పనిమీద కలకత్తా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన కారు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. కొద్దిసేపటిలో ఆయన డిల్లికి వెళ్లాల్సిన ఫ్లైట్ ఉంది. ఈ పరిస్థితిని గమనించిన నాటి పోలీస్ కమిషనర్ ఒక ఐడియా చెప్పారు. శాస్త్రి ప్రయాణిస్తున్న కారుకు సైరన్‌తో కూడిన ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. అయితే శాస్త్రి అందుకు నిరాకరించారు. అలా చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు.
ఇది కూడా చదవండి: గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..
Comments
Please login to add a commentAdd a comment