Sardar Sarvai Papannagoud
-
హైదరాబాద్‌లో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సర్దార్ పాపన్నగౌడ్ మహారాజ్ 374వ జయంతి వేడుకలలో భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాపన్నగౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. సర్దార్ పాపన్న ఆనాడే సామాజికంగా వెనుకబడిన వారిని కలుపుకొని రాజ్యాధికారం కోసం అడుగులు ముందుకు వేశారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో సమానత్వం లభించేలా పోరాడారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్వగ్రామం సర్వాయిపేటను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకోసం రూ.4.7 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. పాపన్న సేవలకు గుర్తుగా హైదరాబాద్ నడిబొడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే అయన జీవిత చరిత్రపై బుక్‌లెట్‌ను ప్రచురించనున్నట్లు భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కష్ణమోహన్, హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, బీసీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, బీసీనేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న జీవితం నేటి తరానికి ఆదర్శంరాజ్యాధికారం కోసం బడుగులను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను జయించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు టీపీసీసీ కల్లుగీత విభాగం ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. మంత్రి పొన్నంతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, కల్లుగీత విభాగం అధ్యక్షుడు నాగరాజు గౌడ్ తదితరులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పాపన్నగౌడ్ జీవితం గురించి నేటి తరాలు తెలుసుకోవాలని, ఆయన బాటలో నడవాలని కోరారు. పాపన్న స్వగ్రామానికి నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిధుల విడుదలకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావులకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
సర్వాయి పాపన్న పోరాటం గొప్పది
సిరిసిల్ల టౌన్: బీఆర్ఎస్ అన్ని కులాలు, వర్గాల బాధలు ఎరిగి..వారిని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించే పేదల సర్కారు అని మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. çఆ రోజుల్లో పాపన్న ఆత్మగౌరవ పోరాటం చేశారని గుర్తు చేశారు. పదిమంది సైన్యంతో మొదలైన పాపన్న పోరాటం గోల్కొండ కోటపై జెండా ఎగురవేసే వరకు సాగిందన్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ పోరాటాన్ని కొద్దిమందితో ప్రారంభించి ఇప్పుడు అదే గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తున్నారని చెప్పారు. ఐఐటీ ముంబై ఆధ్వర్యంలో గౌడ్లకు సేఫ్టీ మోకులు అందిస్తామని తెలిపారు. నీరా సెంటర్లు జిల్లాలు, మండల కేంద్రాల వరకు విస్తరింపజేస్తామని హామీ ఇచ్చారు. కోనసీమ, పాపికొండలకు దీటుగా సిరిసిల్ల మానేరు పరీవాహక ప్రాంతాలు మారాయన్నారు. సిరిసిల్ల శివారులోని మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో 120 మంది సామర్థ్యం గల బోటును ప్రారంభించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, గౌడ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్దన్‌గౌడ్, కార్యదర్శి బుర్ర నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బహుజనులపై జరిగే కుట్రలను తిప్పికొడతాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రంలో కొందరు ప్రతిపక్ష నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బహుజనులను అణచివేసే కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పికొడతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహుజనులు కష్టపడి ఎదిగితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వారిపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే ట్యాంక్‌బండ్‌పై రూ. 3 కోట్లతో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ బహుజన మహనీయులపై పరిశోధనలు చేసి వారి చరిత్రను విద్యావంతులు ప్రచారం చేయాలని సూచించారు. అంతకుముందు పాపన్నగౌడ్ జీవితచర్రితపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గౌడ కార్పొరేషన్ చై ర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, స్పోర్ట్స్ అ థారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బహుజన చక్రవర్తి పాపన్నగౌడ్
కందుకూరు: మొగల్ పాలకుల దౌర్జన్యాలు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి 33 కోటలను జయించి, గోల్కొండ కోటను సైతం ఆరు నెలల పాటు పాలించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కందుకూరులో గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిద్ధూగౌడ్, సీనియర్ నాయకుడు అంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి ఆయన ఆవిష్కరించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గొలుసు కట్టు చెరువులను నిర్మించిన ఘనత పాపన్నకే దక్కుతుందన్నారు. ఆయన జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు వీరేందర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని వి. శ్రీనివాస్ గౌడ్ ,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ,స్థానిక గౌడ కులస్తులు నేతలతో కలిసి ఆవిష్కరించారు . రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తాలో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు అన్ని కులాలను మతాలను సమానంగా ఆదరిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్తులకు కూడా కొకపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు.అదేవిధంగా రైతన్నల లాగే,గౌడన్నలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. ఎక్కడికో వెళ్లి గియకుండా,గౌడన్నలకు దగ్గరగా ఉండాలనే చెరువు కట్ట మీద ఈత చెట్లు పెట్టినట్లు,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలకే ఉందన్నారు.ఆదాయం పెంచుకోవాలని మంత్రి సూచించారు.కుల వృత్తుల వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.నాడు భయం భయంగా ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునేవారని,నేడు నగరం నడి బొడ్డున నీరా కేఫ్ లు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉంటున్నారన్నారు..బీసీ ల్లోని కుల చేతి వృత్తుల వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొగల్ పాలకుల దౌర్జన్యాలకు , నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరాఠయోధుడు చత్రపతి శివాజీ సమకాలికులు తెలుగు గడ్డపైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లు తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసి గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి లను అధికారికంగా నిర్వహించడంతోపాటు చారిత్రక ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు మతాలకు వృత్తుల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలను రద్దుచేసి గౌడ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి చెట్లను నాటుతున్నమన్నారు కల్లుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలకు ఔషధ గుణాలున్న నీరాను అందిస్తున్నామన్నారు. గీత కార్మికులు సాహసపేతమైన వృత్తిని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి కల్లు, నీరాను అందించి ఎంతో భయంకరమైన క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధమైన రోగాల బారి నుండి ప్రజలను కాపాడుతున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు వీటితోపాటు వైన్ షాప్ లలో 15శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. -
తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ పాపన్నగౌడ్: కిషన్‌రెడ్డి
చిక్కడపల్లి (హైదరాబాద్): తెలంగాణ గడ్డ పౌరుషానికి ప్రతీక సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం త్యాగరాయగానసభలో గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్పై పోస్టల్ కవర్ అవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జి.కిషన్‌రెడ్డి.. ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, తెలంగాణ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పి.విద్యాసాగర్రెడ్డిలతోకలసి పాపన్నగౌడ్ పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పాపన్నగౌడ్ తెలంగాణ రాబిన్‌హుడ్ అని కీర్తించారు. ఆయన మొగల్ చక్రవర్తి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, అయితే పాలకులు ఆయన చరిత్రను మరుగున పడేశారని అన్నారు. గోల్కొండ కోటకు రూ.10 కోట్ల తో లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. భువనగిరి కోటను కూడా ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. టీఆర్ఎస్ సర్కార్ గౌడ వృత్తిని నిర్వీర్యం చేసేవిధంగా ప్రతి గ్రామంలో బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫైరింగ్‌పై కక్కుర్తి రాజకీయాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/గన్‌ఫౌండ్రీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనపై కొందరు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదిగితే ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు విలువైన స్థలాలను కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం మహబూబ్‌నగర్‌లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జరిగిన ఫ్రీడం రన్‌ను ప్రారంభించేందుకు చేసిన ఫైరింగ్‌ను అనవసర వివాదం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలిపారు. -
బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి
గన్‌ఫౌండ్రీ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ గత ప్రభుత్వాలు కల్లు, నీరాలపై తప్పు డు ప్రచారం చేసి అమ్మకాలను నిషేధించగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ గీతవృత్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ నెల 22న రూ.5 కోట్ల ఇ గౌడ ఆత్మగౌరవ భవనం నిర్మాణం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మంచి రాజుగా గుర్తింపు పొందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను లండన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ గుర్తించినా ఇక్కడి పాలకులు ఇంకా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఏపీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ విద్యతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బహుజనుల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారని తెలిపారు. -
ఊరూరా పాపన్న జయంతి
సాక్షి, హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ జయంతిని ఈ నెల 18న రాష్ట్రంలో గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం రవీంద్రభారతిలో జైగౌడ్ ఉద్యమం– జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి వారోత్సవాలను నిర్వహించారు. జమీందారీ, దొరల వ్యవస్థ రూపుమాపితేనే బహుజనులకు మేలు జరుగు తుందని భావించిన గొప్ప వ్యక్తి పాపన్న అని స్వామిగౌడ్ కొనియాడారు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండనే గెలిచారన్నారు. వివాహ శుభలేఖల్లో పాపన్న బొమ్మను ముద్రిం చుకోవాలన్నారు. పార్టీలు కాదని జాతి, కులం, బంధుత్వం ప్రధానమన్నారు. ప్రతి గౌడ తమ వాహనాలపై సర్దార్ అని రాసుకోవాలని సూచిం చారు. వట్టికూటి రామారావు ఎంతో కష్టించి గౌడ బంధువుల్ని కలుపుకుని జైగౌడ ఉద్యమం గ్రామగ్రామన తీసుకెళ్లటంతోనే సర్దార్ పాపన్న గౌడ గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. సినీï నటుడు తల్వార్ సుమన్‌గౌడ్ మాట్లాడుతూ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రికి విన్నవిద్దామన్నారు. నగరంలో గౌడ భవన్ నిర్మించాలని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వమే సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహిం చాలని, పాపన్న గీత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.5వేల కోట్లు కేటాయించాలని జైగౌడ ఉద్యమం జాతీయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వట్టికూటి రామారావుగౌడ్, డాక్టర్ చిర్రా రాజుగౌడ్ కోరారు. గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, ఆర్టీవోలు చక్రవర్తిగౌడ్, రవీందర్‌గౌడ్, పీపీ కృష్ణమూర్తిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు మదన్‌మోహన్‌గౌడ్, వ్యాపారవేత్త బాలగోని బాలరాజ్‌గౌడ్, విద్యావేత్త సుభాష్ గౌడ్, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్, జాతీయ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, పులుస మురళీగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ బూర మల్సూర్‌గౌడ్ పాల్గొన్నారు.