సిరిసిల్ల టౌన్: బీఆర్‌ఎస్ అన్ని కులాలు, వర్గాల బాధలు ఎరిగి..వారిని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించే పేదల సర్కారు అని మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. çఆ రోజుల్లో పాపన్న ఆత్మగౌరవ పోరాటం చేశారని గుర్తు చేశారు.
పదిమంది సైన్యంతో మొదలైన పాపన్న పోరాటం గోల్కొండ కోటపై జెండా ఎగురవేసే వరకు సాగిందన్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ పోరాటాన్ని కొద్దిమందితో ప్రారంభించి ఇప్పుడు అదే గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తున్నారని చెప్పారు. ఐఐటీ ముంబై ఆధ్వర్యంలో గౌడ్లకు సేఫ్టీ మోకులు అందిస్తామని తెలిపారు. నీరా సెంటర్లు జిల్లాలు, మండల కేంద్రాల వరకు విస్తరింపజేస్తామని హామీ ఇచ్చారు. కోనసీమ, పాపికొండలకు దీటుగా సిరిసిల్ల మానేరు పరీవాహక ప్రాంతాలు మారాయన్నారు.
సిరిసిల్ల శివారులోని మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో 120 మంది సామర్థ్యం గల బోటును ప్రారంభించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, గౌడ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్దన్‌గౌడ్, కార్యదర్శి బుర్ర నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బహుజనులపై జరిగే కుట్రలను తిప్పికొడతాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రంలో కొందరు ప్రతిపక్ష నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బహుజనులను అణచివేసే కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పికొడతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహుజనులు కష్టపడి ఎదిగితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వారిపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే ట్యాంక్‌బండ్‌పై రూ. 3 కోట్లతో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ బహుజన మహనీయులపై పరిశోధనలు చేసి వారి చరిత్రను విద్యావంతులు ప్రచారం చేయాలని సూచించారు. అంతకుముందు పాపన్నగౌడ్ జీవితచర్రితపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గౌడ కార్పొరేషన్ చై ర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, స్పోర్ట్స్ అ థారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment