పాపన్నగౌడ్‌పై పోస్టల్‌కవర్ ఆవిష్కరిస్తున్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బూర నర్సయ్యగౌడ్ తదితరులు
చిక్కడపల్లి (హైదరాబాద్): తెలంగాణ గడ్డ పౌరుషానికి ప్రతీక సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం త్యాగరాయగానసభలో గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్‌పై పోస్టల్ కవర్ అవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జి.కిషన్‌రెడ్డి.. ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, తెలంగాణ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పి.విద్యాసాగర్‌రెడ్డిలతోకలసి పాపన్నగౌడ్ పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పాపన్నగౌడ్ తెలంగాణ రాబిన్‌హుడ్ అని కీర్తించారు. ఆయన మొగల్ చక్రవర్తి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, అయితే పాలకులు ఆయన చరిత్రను మరుగున పడేశారని అన్నారు. గోల్కొండ కోటకు రూ.10 కోట్ల తో లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. భువనగిరి కోటను కూడా ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. టీఆర్‌ఎస్ సర్కార్ గౌడ వృత్తిని నిర్వీర్యం చేసేవిధంగా ప్రతి గ్రామంలో బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment