
సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతున్న మంత్రి సబిత. చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ , గోరటి వెంకన్న
కందుకూరు: మొగల్ పాలకుల దౌర్జన్యాలు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి 33 కోటలను జయించి, గోల్కొండ కోటను సైతం ఆరు నెలల పాటు పాలించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కందుకూరులో గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిద్ధూగౌడ్, సీనియర్ నాయకుడు అంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గొలుసు కట్టు చెరువులను నిర్మించిన ఘనత పాపన్నకే దక్కుతుందన్నారు. ఆయన జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు వీరేందర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment