Sabita reddy
-
Ranga Reddy District: ఇద్దరు సీఎంలు, ముగ్గురు హోంమినిస్టర్లు మనవారే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేకమంది ఉద్ధండులకు నిలయంగా ఈ జిల్లా నిలిచింది. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్ (ఒకప్పడు మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో భాగం) నియోజకవర్గం నుంచే గెలుపొందారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి కూడా ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్ నుంచి ఒకసారి, మేడ్చల్ నుంచి మరోసారి గెలుపొందారు. కేంద్రమంత్రిగా పనిచేసిన దివంగత నేత సూదిని జైపాల్‌రెడ్డి కూడా ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలుపొందారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ తొలిసారిగా ఓటమిని చవిచూసింది ఇక్కడే. ఆయనపై గెలుపొందిన చిత్తరంజన్‌దాస్ చెన్నారెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గం.. మేడ్చల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు నిర్వహించగా పది మంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఒకరు ముఖ్యమంత్రిగా.. మరో ఐదుగురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో సుమిత్రాదేవి (1967–72) జిల్లా నుంచి తొలి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మర్రిచెన్నారెడ్డి 1978లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వికారాబాద్, తాండూరు నుంచి రెండేసి సార్లు, సనత్‌నగర్ నుంచి ఒకసారి, మేడ్చల్ నుంచి ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఉమా వెంకట్రామిరెడ్డి(1983, 1989) కాంగ్రెస్ నుంచి, సురేందర్‌రెడ్డి(1985) టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందడమే కాకుండా ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత 1994 నుంచి 2004 వరకు టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు తూళ్ల దేవేందర్‌గౌడ్ గెలుపొందారు. ఆయన హోం, రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత కార్మికశాఖ మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి సైతం మే డ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. చేవెళ్ల నియోజకవర్గం.. చేవెళ్ల నియోజకవర్గానికి 1962 నుంచి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు నిర్వహించగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో 1985 నుంచి వరుసగా నాలుగు సార్లు (టీడీపీ నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి ఒకసారి) గెలుపొందిన పి.ఇంద్రారెడ్డి ఉమ్మడి ఏపీలోని ఎన్టీఆర్ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన అకాల మరణం తర్వాత ఆ స్థానానికి (2000) నిర్వహించిన ఉపఎన్నికల్లో ఆయన సతీమణి సబితారెడ్డి గెలుపొందారు. ఆమె 2004లో కాంగ్రెస్ నుంచి మళ్లీ విజయం సాధించి తొలి మహిళా హోంమంత్రి(దేశంలోనే తొలి మహిళా హోంమంత్రి)గా పనిచేశారు. దంపతులిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొండమే కాకుండా ఒకే శాఖకు మంత్రిగా పనిచేయడం విశేషం. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా మహే శ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సబితారెడ్డి గనులు భూగర్భవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.2018లో అదేస్థానంలో కాంగ్రెస్ అభ్య ర్థిగా విజయం సాధించి.. ఆ తర్వాత అధికార బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పరిగి నియోజకవర్గం.. పరిగి నియోజకవర్గానికి ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరిగగా.. 12 మంది రెడ్డి సామాజికవర్గం వారే విజయం సాధించారు. మూడుసార్లు మైనార్టీ(ముస్లిం) అభ్యర్థులు గెలుపొందారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా కమతం రామిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1972, 1989లో ఆయనే కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. జలగం వెంగళ్రావు, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్లో.. కమతం రాంరెడ్డి వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 1978, 1983లో పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఎ.షరీ్‌ఫ్ చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఐదుసార్లు(1985, 1994, 1999, 2004, 2009) గెలుపొందిన హరీశ్వర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కొడుకు కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వికారాబాద్, తాండూర్‌లో.. వికారాబాద్‌లో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా ఎనిమిది మంది ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రశేఖర్ కొంతకాలం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేయగా, గడ్డం ప్రసాద్ కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు. ఇక్కడ నుంచి గెలుపొందిన రామస్వామి కూడా మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. తాండూరుకి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో మాణిక్య రావు, మర్రి చెన్నారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పైలెట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం.. షాద్‌నగర్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1952లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్‌గా పనిచేశారు. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ పి.శంకర్రావు గతంలో కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.అలాగే 2009లో కంటోన్మెంట్ నుంచి గెలుపొందికిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. తొలి మహిళా హోంమంత్రిగా సబితారెడ్డి అలాగే చేవెళ్ల నుంచి గెలుపొందిన పటోళ్ల ఇంద్రారెడ్డి, సబితారెడ్డి దంపతులిద్దరూ ఉమ్మడి ఏపీలో హోంమంత్రులుగా పనిచేశారు. అయితే దివంగత నేత, మాజీ సీఎం డా.వైఎస్సార్ కేబినేట్లో దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా సబితారెడ్డి రికార్డులకెక్కారు. ఇదే జిల్లాకు చెందిన తూళ్ల దేవేందర్‌గౌడ్ సైతం ఉమ్మడి ఏపీలో హోంమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహేశ్వరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితారెడ్డి విద్యాశాఖ మంత్రిగా, మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి కార్మికశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో 10 స్థానాల్లోని అభ్యర్థులకు ఇప్పటివరకు ఆయా మంత్రివర్గాల్లో అవకాశం లభించింది. అయితే రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు ఇప్పటి వరకు ఏ మంత్రివర్గంలోనూ చోటు లభించకపోవడం గమనార్హం. కల్వకుర్తి నియోజకవర్గం.. కల్వకుర్తి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు నిర్వహించగా 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత సూదిని జైపాల్‌రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఈ నియోజకవర్గమే. 1969, 1972లో కాంగ్రెస్ నుంచి, 1978,1983లో జనతా పార్టీ నుంచి జైపాల్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహబూబ్‌నగర్ నుంచి రెండుసార్లు, మిర్యాలగూడ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొంది కేంద్రమంత్రిగా పనిచేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. 1989లో ఇక్కడి నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌ను ఓడించిన చిత్తరంజన్‌దాస్‌కు చెన్నారెడ్డి మంత్రివర్గంలో చోటు లభించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో 1957–67 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఎంఎన్ లక్ష్మీనర్సయ్య సహా 1978లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సుమిత్రాదేవి, 1999లో టీడీపీ నుంచి గెలుపొందిన కొండ్రు పుష్పలీల మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(బీఆర్ఎస్) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
మంత్రి సబితారెడ్డికి పోటీగా బరిలో మేయర్ పారిజాత?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు చల్లానర్సింహారెడ్డి సహా సీనియర్ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కొత్త మనోహర్‌రెడ్డి ఇటీవల కర్ణాటక వెళ్లారు. డిప్యూటీ సీఎంతో పై రవీ చేయించారు.అయినా అధిష్టానం మాత్రం చిగురింతవైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అభ్యర్థి పేరు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. సర్పంచ్‌గా మొదలైన ప్రస్థానం చిగురింత పారిజాత మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. మంత్రి సబితారెడ్డి ఆశీస్సులతో బడంగ్పేట్ మేయర్ పీఠాన్ని అధిష్టించారు. ఆమెకు గతంలో బాలాపూర్ సర్పంచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకే అధికార బీఆర్ఎస్ను వీడి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. అప్పటి నుంచి మంత్రికి పోటీగా బరిలో నిలిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల తుక్కుగూడ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభ ఏర్పాట్లు కూడా మేయర్ దంపతులే చూసుకున్నట్లు తెలిసింది. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లో వీరికి మంచి పట్టుంది. -
6,612 టీచర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఆమె గురువారం ఎస్సీఈఆర్టీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా భర్తీ చేసేందుకు 6,612 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 5,089 పోస్టులు సాధారణ పాఠశాలల్లో, 1,523 పోస్టులు ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం నిర్దేశించినవి. వీటిని త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించా రు. 2017లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించి 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ద్వారా భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. దీనితో గతంలో నిర్వహించినట్టుగా డీఎస్సీల ద్వారా నియామకాలు చేపట్టనున్నాం..’’ అని మంత్రి సబితారెడ్డి వివరించారు. 9,979 పోస్టులకు పదోన్నతులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,22,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. వీటిలో 1,03,343 పోస్టుల్లో టీచర్లు పనిచేస్తున్నారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 6,612 పోస్టులను భర్తీ చేస్తుండగా.. పదోన్నతుల ద్వారా మరో 9,979 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన కేటగిరీలో గెజిటెడ్ హెచ్ఎం ఖాళీలు 1,947 ఉన్నాయని, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు 2,162 ఉన్నాయని.. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతుతో వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందని వివరించారు. మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ఎస్జీటీ టీచర్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 15న టెట్ డీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన నియామకాలకు టెట్ కీలకమని.. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తామని సబితారెడ్డి ప్రకటించారు. టెట్ ఫలితాలను వచ్చేనెల 27వ తేదీన ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాల ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతోందని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే తక్షణమే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇటీవల కేజీబీవీల్లో 1,264 పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని.. కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుతో మరో 160 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. వీటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా విద్యాశాఖలో 3,896 మందికి లబ్ధి చేకూరిందని, ఇందులో అత్యధికులు విద్యాశాఖ వారే ఉన్నారని మంత్రి చెప్పారు. గురుకుల విద్యాసంస్థల్లో కూడా పలువురు ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. మొత్తంగా విద్యాశాఖ పరిధిలో 8,792 పోస్టులు, కాలేజీల్లో 3,149 పోస్టుల భర్తీ ప్రక్రియలు టీఎస్పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నాయని తెలిపారు. భర్తీ చేసే టీచర్ పోస్టులు ఇవీ.. మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు: 6,612 జనరల్ టీచర్లు: 5,089 వీరిలో స్కూల్ అసిస్టెంట్లు: 1,739 సెకండరీ గ్రేడ్ టీచర్లు: 2,575 భాషా పండితులు: 611 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 164 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 1,523 వీటిలో ప్రాథమిక స్థాయిలో 796 పోస్టులు – ప్రాథమికోన్నత స్థాయిలో 727 పోస్టులు ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ’ ఇలా.. ప్రతి జిల్లాకు ఒక ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)’ ఉంటుంది. దీనికి సదరు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (జెడ్పీ సీఈఓ) వ్యవహరిస్తారు. గతంలో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది. -
పాపపు కాంగ్రెస్.. శాపపు బీజేపీ.. దీపంలాంటి కేసీఆర్
ఇబ్రహీంపట్నం/అబ్దుల్లాపూర్‌మెట్ /మహేశ్వరం: పాపపు కాంగ్రెస్ కావాలా? శాపపు బీజేపీ కావాలా? దీపం లాంటి కేసీఆర్.. బీఆర్ఎస్ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.62.21 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం మంత్రి సబితారెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డి అంటుంటే, వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని బీజేపీ అంటోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తూ ఏటా మూడు పంటలు సాగు చేసుకోమంటున్నారని గుర్తు చేశారు. వారిని నమ్మొద్దు ఎన్నికలు రాగానే ఇది చేస్తాం..అది చేస్తామని చెప్పే నాయకులను నమ్మొద్దని మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల మధ్యే ఉండే సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. వీఓఏలు, మెప్మా ఆర్పీల ఆటోమెటిక్ రెన్యూవల్, ఇన్సూరెన్స్, వేతన పెంపు సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ పూర్తికాగానే, మహిళలకు రావాల్సిన వడ్డీలేని రుణాలను చెల్లిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ. కేసీఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకా లు, అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాపీ కొడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. రాష్ట్రానికి రావాల్సిన రూ.35 వేల కోట్ల నిధులు మోదీ సర్కార్ ఎందుకు నిలిపేసిందో..? కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
బహుజన చక్రవర్తి పాపన్నగౌడ్
కందుకూరు: మొగల్ పాలకుల దౌర్జన్యాలు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి 33 కోటలను జయించి, గోల్కొండ కోటను సైతం ఆరు నెలల పాటు పాలించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కందుకూరులో గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిద్ధూగౌడ్, సీనియర్ నాయకుడు అంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి ఆయన ఆవిష్కరించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గొలుసు కట్టు చెరువులను నిర్మించిన ఘనత పాపన్నకే దక్కుతుందన్నారు. ఆయన జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు వీరేందర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
టీకాలు ఎగిరొస్తాయ్!
వికారాబాద్: దేశంలో డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. తెలంగాణ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ‘ఆకాశ మార్గం ద్వారా మందులు’ ప్రాజెక్టు ఈ నెల 11న ప్రారంభం కానుంది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలసి జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా టీకా చేరవేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. శనివారం ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కార్యక్రమం జరుగనుంది. జిల్లా పరిధిలోని ఐదు పీహెచ్‌సీలకు మొదటి రోజు డ్రోన్ల ద్వారా చేరవేయనున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ, వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్‌పేట పీహెచ్‌సీలకు ముందుగా డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు డ్రోన్ల ద్వారా టీకా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులు, పీహెచ్‌సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు గగనతలంలో ఎగరటం, గమ్యస్థానాలకు చేరే వరకు పర్యవేక్షణ, వాటి రక్షణను పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి సబితారెడ్డి ఈ నెల 11న కార్యక్రమం జరిగే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలోని మైదానాన్ని బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సభా వేదిక, డ్రోన్లు ఎగిరే ప్రదేశం, మీడియా గ్యాలరీ తదితరాలను పరిశీలించిన మంత్రి.. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, ఫైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు వికారాబాద్ నుంచి అనంతగిరి రోడ్డులోని 100 పడకల ఆస్పత్రిని సబిత సందర్శించారు. కోవిడ్ పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్ సెంటర్ ప్రారంభిస్తామని చెప్పారు. 9–10 కి.మీ. దూరం వరకు.. డ్రోన్ల ద్వారా టీకాలను తీసుకెళ్తుండటం దేశంలో ఇదే తొలిసారి. అందువల్ల గురు, శుక్రవారాల్లో అధికారులు వీటిని పరీక్షించనున్నారు. ఈ రెండు రోజులు డ్రోన్లు కనుచూపు మేర నుంచి 500–700 మీటర్ల దూరం వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుంచి 9–10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సరఫరా చేయడాన్ని ప్రారంభిస్తారు. ఇవి టీకాతోపాటు, మందులు, ఇతర వైద్య పరికరాలను కూడా తీసుకెళ్తాయి. దీనికోసం డ్రోన్‌ఆధారితవస్తు రవాణాలో పేరొందిన స్కై ఎయిర్ కన్సార్టియం.. బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్‌తో కలిసి పనిచేస్తోంది. -
దసరా వరకు పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను ఆదేశించామని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు యూని వర్సిటీలు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించాయి. దసరా తర్వాత పరీక్షలు యథావిధిగా ఉంటాయని వెల్లడించాయి. 27వ తేదీ పరీక్షలు యథావిధిగా జరుగు తాయని జేఎన్టీయూ వెల్లడించింది. -
తెలంగాణ ఊటీగా అనంతగిరి..
వికారాబాద్ అర్బన్: అనంతగిరిని తెలంగాణ ఊటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రులు, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి అనంతగిరి కొండల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి సబితారెడ్డి అనంతగిరి గుట్టను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. స్పందించిన సీఎం.. ఈ ప్రాంతాన్ని వెంటనే అభివృద్ధి చేయాలని ఆదేశించారని, మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కోసం ప్రణాళికలు, నివేదికలు సమర్పించాలని ఆదేశించారని పేర్కొన్నారు. అనంతగిరిని హాస్పిటల్ టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజంలా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వివరించారు. అధికారులంతా టీం వర్క్ చేసి 10 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. తాము మరోసారి సమావేశమై చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణలోనే అనంతగిరిని ఉత్తమ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని వివరాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని వేస్తున్నామని తెలిపారు. 10–15 రోజుల్లో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకే అందరం ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. -
సిగ్నల్ ఫ్రీ.. రవాణాకు రూట్ క్లియర్
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: గ్రేటర్ నగరంలో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా సిగ్నల్ ఫ్రీ రవాణా కోసం మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌లో బయోడైవర్సిటీ జంక్షన్ డబుల్ హైట్ ఫ్లై ఓవర్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దీంతో, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనదారులు సిగ్నల్‌తో పని లేకుండా హైటెక్‌సిటీకి వెళ్లవచ్చు. ఎస్సార్డీపీలో భాగంగా ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన అండర్‌పాస్‌లు/ఫ్లైఓవర్లలో ఇది ఎనిమిదవది. దీనికోసం జీహెచ్ఎంసీ రూ. 69.47 కోట్లు ఖర్చు చేసింది. 3 లేన్ల ఈ ఫ్లై ఓవర్ పొడవు దాదాపు కిలోమీటరు. ఈ ఫ్లైఓవర్‌తో : మెహిదీపట్నం వైపు నుంచి హైటెక్‌సిటీ, మైండ్ స్పేస్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు మార్గం సుగమమైంది.ఎస్సార్డీపీలో భాగంగా ఐటీ కారిడార్‌లో ఇప్పటికే మైండ్‌స్పేస్ జంక్షన్, కూకట్పల్లి జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీల వద్ద అండర్‌పాస్‌లు అందుబాటులోకి రావడంతో బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి జేఎన్ టీయూ వరకు వరకుట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. ఇక గచ్చిబౌలి జంక్షన్ వద్ద..: గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి రూ. 330 కోట్లతో కొండాపూర్ వైపు నుంచి ఓఆర్ఆర్ వైపు గచ్చిబౌలి జంక్షన్ వద్ద పై వరుసలో ఆరులేన్ల ఫ్లై ఓవర్, మైండ్‌స్పేస్ వైపు నుంచి ఓఆర్ఆర్ వైపు నాలుగు లేన్ల ఫ్లైవర్, శిల్పా లే ఔట్ రోడ్ వైపు నుంచి గ్యాస్ గోడౌన్ వరకు మరో మార్గం నిర్మించనున్నారు. ఈ పనులకు కూడా కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వీటిద్వారా రెండు వైపులా ప్రయాణాలు చేయవచ్చు. వీటి ద్వారా ఐటీ కారిడార్‌పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం గచ్చిబౌలి మార్గంలో గంటకు 9 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 2036 నాటికి వీటి సంఖ్య 17,711 పెరిగే అవకాశం ఉంది. శిల్పా లే ఔట్ మార్గంలో 2040నాటికి 5,200లకు చేరే అవకాశం ఉంది.కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్ల వల్ల గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గడంతో పాటు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల మార్గాలకు మరింత కనెక్టివిటీ పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి
మాజీ హోంమంత్రి సబితారెడ్డి శంకర్పల్లి: ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా శంకర్‌పల్లికి చెందిన జూలకంటి పాండురంగారెడ్డిని నియమించారు.ఈ మేరకు సబితారెడ్డి నియామకపత్రం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. నూతన యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. తనకు పదవి ఇచ్చినందుకు మాజీ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, రావులపల్లి మాజీ సర్పంచ్ రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, ఎంపీపీ నర్సింహులు, జెడ్పీటీసీ సభ్యురాలు కళావతి, వైస్ ఎంపీపీ శశిధర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకుడు నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు భూషణం, యూత్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, షారుఖ్ పాల్గొన్నారు. -
ప్రత్యేక పూజలు చేసిన సబితారెడ్డి
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్ గ్రామంలో ఆదివారం బోనాల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహంకాళీ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ప్రసిద్ధి గాంచిన అతి పూరాతన ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చన, పుష్పాలంకరణ, అభిషేకం చేసి పసుపు, గంధంతో అమ్మవారిని అలంకరించారు. సాయంత్రం గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో సుమారు 200 బోనాలు.. శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో, యువకుల డ్యాన్సులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎంపీపీ పెంటమల్ల స్నేహసురేష్, సర్పంచ్ అత్తెని కౌసల్యబాబు యాదవ్, ఎంపీటీసీ మదన్మోహన్, ఉప సర్పంచ్ కప్పల సుందరయ్య, కాంగ్రెస్ నాయకులు అత్తెని మహేందర్ యాదవ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పహడీషరీఫ్ సీఐ చలపతి, ఎస్ఐ మహేందర్‌జీ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు బ్రహ్మంచారి, చిప్ప సురేష్, యాదయ్య, శ్రీకాంత్, రవి నాయక్, నాసర్‌ఖాన్, సామెల్‌రాజ్, నర్సింగ్‌రాజ్, విలాస్, శ్రీనివాస్ నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పూజలు మంఖాల్, తుక్కుగూడ గ్రామాల్లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు మాజీ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, మంఖాల్ గ్రామ సర్పంచ్ కౌసల్య, ఉప సర్పంచ్ సుందరయ్య, నాయకులు కొమిరెడ్డి నర్సింహరెడ్డి, మాజీ ఎంపీపీ పాండు నాయక్, మహేందర్ యాదవ్, నల్ల వీరేష్‌గౌడ్, మంత్రి రాజేష్, కాకి ఈశ్వర్ ముదిరాజ్, సురేష్, శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేష్ యాదవ్, శ్రీధర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
సమస్యలు గాలికొదిలేసిన సర్కార్
కండువాలు మార్చే పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శ శంకర్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని, పార్టీ కండువాలు మార్చే పథకాన్ని శరవేగంగా అమలు చేస్తుందని రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక అతిథిగృహంలో శుక్రవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండకాలం తీవ్రంగా ఉందని, వర్షాలు లేక తాగు, సాగునీరు లేక, రైతన్నలు అల్లాడిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ‘గ్రామజ్యోతి’ పేరిట ప్రతి గ్రామంలో కమిటీలు వేశారే తప్ప.. ఇంతవరకు నిధులు కేటాయించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులను గ్రామజ్యోతి నిధులుగా చూపించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వనికి దమ్మూ, ధైర్యం ఉంటే వేసవిలో గ్రామాల్లోకి వెళ్లి గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లా ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఒక్క సమావేశం నిర్వహించలేదంటే ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తోందన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకానికి కొబ్బరికాయలు కొట్టకముందు ఇళ్ల బిల్లులు చెల్లించని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. రెండు సంవత్సరాలకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాజకీయాలను పక్కనపెట్టి ప్రజాసమస్యలపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ నర్సింలు, వైస్ ఎంపీపీ శశిధర్‌రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్‌పాషా, దేవులనాయక్, నాయకులు నారాయణ, విఠలయ్య, ప్రకాశ్, మాణిక్‌రెడ్డి, రవీందర్, సత్యనారాయణరెడ్డి, చెంగల్ గోపాల్‌రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, యాదయ్య, ఎంపీటీసీ సభ్యుడు మైసయ్య, యాదిరెడ్డి, పార్శి బాలకృష్ణ, లక్ష్మీకాంత్‌రెడ్డి, రమేష్, లింగారెడ్డి, గోవర్దన్ యాదవ్, బాలన్నగారి కాంతిరెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సినిమా చూపిస్తున్నారు
మాజీ హోం మంత్రి సబితారెడ్డి మణికొండ: ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని... రైతులకు మూడేళ్ల వరకే రుణ మాఫీ చేస్తానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోవైపు కొత్త సచివాలయ నిర్మాణానికి ఉవ్విళ్లూరడం వెనుక మర్మమేమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలపాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె నార్సింగ్‌లో పార్టీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. అటవీ శాఖ భూముల్లో ఫిలింసిటీ నిర్మాణం, ఎర్రగడ్డలో సచివాలయం, సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రజలకు ఆయన సినిమా చూపిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద అంతలా నిధులు ఉంటే ముందుగా రైతులకు సంపూర్ణ రుణమాఫీతో పాటు మహిళలకు అభయ హస్తం పింఛన్లు... ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించి ఆదుకోవాలని సూచించారు. సచివాలయాన్ని తరలించే విషయంలో ప్రతిపక్షాలు, ప్రజలకు సమాధాన పరచాలి తప్ప ప్రభుత్వ పెద్దలు ఎదురు దాడి చేయటం మంచి పద్ధతి కాదన్నారు. వాస్తు బూచి చూపి ప్రభుత్వం స్వలాభం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తోందనే అనుమానం రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు. మణికొండ, పుప్పాలగూడ పంచాయతీల పరిధిలో మంజీర పైప్‌లైన్ పనులు పూర్తి కావటంతో పాటు గతంలోనే జలమండలికి డబ్బులు చెల్లించినందున వెంటనే నీటిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశిస్తే పోటీ జిల్లా నాయకులతో పాటు పార్టీ అధిష్ఠానం సమష్టి నిర్ణయం తీసుకుని ఆదేశిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీకి గెలిచే వ్యక్తులు కావాలని.. తనకు టికెట్టు ఇస్తే పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు. -
పెద్దల రేసు
చలికాలంలోనూ జిల్లా రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. త్వరలో ఖాళీ అయ్యే శాసనమండలి (స్థానిక సంస్థలు) స్థానం నుంచి బరిలో దిగడానికి కాకలు తీరిన రాజకీయయోధులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నం నరేందర్‌రెడ్డి పదవీకాలం మార్చితో ముగియనుంది. దీంతో ఈ కుర్చీపై కన్నేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ‘పెద్దలు’ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నరేందర్‌రెడ్డి, సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కదన కుతూహలం ప్రదర్శిస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సమరంలో పట్టు నిలుపుకొన్న కాంగ్రెస్.. అధికారంతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ పార్టీలు మండలి పోరులో సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. మండల, జిల్లా ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు లభించాయి. ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోయేందుకు అవసరమైన స్థానాలు దక్కినప్పటికీ అనంతరం జరిగిన పరిణామాలతో ఆ పార్టీ డీలాపడింది. పలువురు ప్రజాప్రతినిధులు కారెక్కడంతో సంఖ్యాబలంలో తేడా వచ్చింది. 211 ఎంపీటీసీలు, 16 జెడ్పీటీసీలు గెలుచుకున్న ఆ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అధికస్థాయిలో కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ కేవలం 141 ఎంపీటీసీలు, 12 జెడ్పీటీసీలు, ఒక మున్సిపాలిటీ మాత్రమే గెలుచుకున్నప్పటికీ, గద్దెనెక్కడమే తరువాయి ఆ పార్టీలోకి వలసల పర్వం కొన సాగింది. దీంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. మరోవైపు స్థానికంలో చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు గెలుచుకున్న టీడీపీకి 160 ఎంపీటీసీలు, 07 జెడ్పీటీసీలు, రెండు మున్సిపాలిటీల్లో పాగా వేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లకు ‘దేశం’ మద్దతు కీలకంగా మారడంతో తాజా కౌన్సిల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కదన కుతూహలం సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ‘మండలి’ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించారు. దశాబ్దకాలం జిల్లా రాజకీయాలను శాసించిన సబితకు గ్రామీణంపై బలమైన పట్టుంది. స్థానిక సంస్థల్లో పార్టీకి మెజార్టీ ఉండడం, ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునేందుకు సరిపడా సభ్యులుండడంతో ఆమె ‘పెద్దల’సభపై గురిపెట్టారు. గత ఎన్నికల్లో పోటీచేయలేదనే సానుభూతి సానుకూలాంశంగా మారనుందనే వాదన వినిపిస్తోంది. ఎంపీటీసీల్లో సింహభాగం స్థానాలు తమవే కావడం, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కంటే రెట్టింపు సంఖ్యలో కౌన్సిలర్లు ఉండడం ప్లస్ పాయింట్ కాగలదనే భావనలో ఉన్నారు. అయితే తన అభ్యర్థిత్వంపై వైరివర్గం అనుసరించే వైఖరిపైనే సబిత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాగా, సమీప బంధువైన నరేందర్రెడ్డిపై పోటీచేసే అంశంలో చెల్లెమ్మ తీసుకునే నిర్ణయంపైనా సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ గురువైన మామ ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులపై పోటీ విషయంలో నరేందర్‌రెడ్డి వైఖరి ఎలాగుంటుందనేది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. చెల్లెమ్మ కాదంటే.. ఒకవేళ సబిత పోటీకి నిరాకరిస్తే బరిలో దిగాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. ‘స్థానిక’ంలో పార్టీ బలీయంగా ఉండడం, ప్రత్యర్థి శిబిరాల్లోని రహస్యమిత్రులు సహకరిస్తారనే ధీమాతో ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. టీఆర్ఎస్కు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీ, బీజేపీల మద్దతుపైనే గంపెడాశలు పెట్టుకుంది. ఈ పార్టీలను తమవైపు తిప్పుకోగలిగితే గెలుపు సులువని కేఎల్లార్ శిబిరం అంచనా వేస్తోంది. గులాబీ నాయకత్వంపై గుర్రు మీదున్న సీనియర్ నేత కొప్పుల హరీశ్వరరెడ్డి స్నేహ‘హస్తం’తో విజయానికి బాటలువేసుకోవాలని భావి స్తోంది. జిల్లాలోనే అత్యధికంగా ఎంపీటీసీలను పరిగి సెగ్మెంట్లో గెలుచుకోలిగింది. పాతమిత్రుడితో జతకట్టడం ద్వారా మంత్రి మహేందర్‌రెడ్డిని దెబ్బతీసేలా ద్విముఖ వ్యూహాన్ని అమలుచేసే అంశాన్ని కేఎల్లార్ వర్గం పరిశీలిస్తోంది. ఇక టీడీపీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా తమ గెలుపులో కీలకం కానున్నాయని కిచ్చన్న అంచనా వేస్తున్నారు. మండలి ఎన్నికల్లో టీడీపీ సొంతంగా పోటీచేసే అవకాశాలు లేకపోవడం, ఎంపీపీ ఎన్నికల్లో బీజేపీ కూడా మద్దతుగా నిలిచినందున.. ఆ పార్టీ కూడా తనకు అండగా నిలుస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. గుట్టుగా గులాబీ వ్యూహం మరోసారి గెలుపు ఢంకా మోగించాలని భావిస్తున్న నరేందర్‌రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. మండలాలవారీగా ప్రజాప్రతినిధులతో భేటీ అవుతూ భవిష్యత్తు వ్యూహాన్ని వివరిస్తున్నారు. పరోక్ష ఎన్నికల వ్యూహరచనలో దిట్టగా పేరున్న నరేందర్.. మరోసారి మండలిలో ప్రవేశించేందుకు ఇతర పార్టీల సభ్యులతో రహస్య మంతనాలు సాగిస్తున్నారు. కాగా, సీనియర్‌నేత హరీశ్వర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారు. ఇప్పటికే తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో సస్పెన్స్ నెలకొంది. -
తాండూరు కాంగ్రెస్‌లో అయోమయం!
* నియోజకవర్గ కొత్త ఇన్చార్జిగా నారాయణరావు * ఇన్‌ఛార్జి మార్పుతో రమేష్ అసంతృప్తి? * సబితారెడ్డి వర్గానికి ఊరట తాండూరు: తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మార్పు ఆ పార్టీలో అయోమయానికి దారితీసింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎం.మాణిక్‌రావు తనయుడు ఎం.రమేష్ ఇన్చార్జిగా కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఇన్చార్జి మార్పు పరిణామం పార్టీలో కొందరికి ఆశ్చర్యాన్ని.. మరికొందరికి ఊరటను కలిగించింది. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పార్టీ ఇన్చార్జి అని పట్టణ శాఖ ప్రకటించింది. శాసన సభ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా మినహా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇన్చార్జిగా తను ఉండాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ నారాయణరావు అప్పట్లో తోసిపుచ్చారు. అధిష్టానం ప్రకటించే వరకు రమేష్యే ఇన్చార్జిగా కొనసాగుతారని నారాయణరావు అప్పట్లో ప్రకటించారు. మరి ఉన్నట్టుండి నారాయణరావు ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నారాయణరావుకు పార్టీ పగ్గాలు దక్కడంతో రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి వర్గీయులు ఊరట చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరు నాయకులు, రమేష్ వర్గీయులు ఆయనను బాధ్యతలను తప్పించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో కుట్ర దాగి ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇది నిజమనో.. కాదనో రమేష్ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో ఆయన ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకొన్నారా.. లేదా? అనే సందేహాలు ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే కొంత కాలంగా రమేష్ వైఖరిని వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రమేష్‌కు సదరు నాయకుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. రమేష్ ఇన్చార్జిగా కొనసాగితే పార్టీలో తమ పలుకుడి ఏమీ ఉండదని భావించిన సదరు నాయకులు పార్టీలో తమ ఆధిపత్యం కోసం నారాయణరావు ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించేలా ఒత్తిడి తీసుకువచ్చినట్టు ప్రచారం సాగుతోంది. పార్టీని బలోపేతం చేయడంతోపాటు నాయకులందరినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళతాడనే కారణంతో అధిష్టానం నారాయణరావుకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినట్టు పట్టణ శాఖ చెబుతోంది. పార్టీలో కొందరు నాయకులు తమ ‘పనులు’ చేయించుకోవాలనే కుట్రలో భాగంగానే అర్ధంతరంగా ఇన్చార్జి మార్పు పరిణామం చోటుచేసుకుందనే అభిప్రాయం రమేష్ వర్గీయుల్లో వ్యక్తమవడం గమనార్హం. ఇన్చార్జి మార్పుపై రమేష్ కూడా అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తమ్మీద తాండూరు కాంగ్రెస్‌లో తాజా పరిణామంతో అయోయమ పరిస్థితి నెలకొంది. -
..ఇలా ఓడిపోయాం! : కాంగ్రెస్ నేతలు
ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న జిల్లా కాంగ్రెస్ నేతలు సాక్షి,రంగారెడ్డి జిల్లా: ‘గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వకపోవడం, నేతల మధ్య సమన్వయలోపం’ పార్టీ కొంపముంచిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అభిప్రాయపడింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి అధిష్టానం కూడా ఒక కారణమని తెగేసి చెప్పింది. అభ్యర్థుల ఎంపికలో సమర్థులను పరిగణనలోకి తీసుకోకపోవడం, గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొట్టేవారికి టికెట్లు ఇవ్వడం పార్టీ పరాజయానికి దారితీసిందని పార్టీ నేతలు ఏకరువు పెట్టారు. తెలంగాణ క్రెడిట్ తమదేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని, మేనిఫెస్టో కూడా ఓటర్ల దరికి చేర్చలేకపోయామని వాపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికలపై శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జిల్లా నేతలతో పోస్టుమార్టం నిర్వహించారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం సెగ్మెంటు నేతలతో వేర్వేరుగా నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక పరిస్థితులు, పనితీరుపై ఆయా నేతలు ఏకరువు పెట్టారు. చతికిలపడ్డాం.. ‘కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా ఇతర పార్టీలకు లేదు. కానీ సొంత పార్టీ నేతలు వ్యతిరేకంగా పనిచేసినందునే ఓటమిపాలయ్యాం’ అంటూ సమావేశంలో పలువురు నేతలు ముక్కుసూటిగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందినట్లు నేతలు ముక్తకంఠంతో మనసులోమాటను బయటపెట్టారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న నేతల మధ్య సమన్వయం కొరవడిందని, దీంతో ఇతర పార్టీలకు ఇది అదనుగా మారడంతో ఓటమి చెందామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత తమదేననే అంశాన్ని ప్రజలకు వివరించలేకపోయామని, అయితే టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ అంశాన్ని సొమ్ము చేసుకోవడంతో విజయం సాధించారని విశ్లేషించారు. జిల్లాలో విభిన్న ప్రాంతాలకు చెందిన వాళ్లున్నారని, వీరిపై టీఆర్ఎస్ వ్యూహరచన ఫలించిందన్నారు.ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరితో ప్రజలు ఆలోచనలో పడ్డారని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుని పూర్వవైభవం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితులతోనే : సబిత జిల్లాలో నెల కొన్న ప్రత్యేక పరిస్థితుల వల్లే ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చినట్లు మాజీమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మారని, మోడీ ప్రభావం బాగా పనిచేసిందని, దీంతో ఆ పార్టీలకు అధికంగా సీట్లు వచ్చాయని అభిప్రాయపడ్డారు. జనాదరణలేని వారికి టికెట్లు : మల్రెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానం ఎదుట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులకు కాకుండా ఏమాత్రం జనాదరణలేని పైరవీకారులకు పెద్దపీట వేయడంతో పార్టీ పరాభవం చెందిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహేశ్వంలో తనకు టికెట్ ఖ రారులో జాప్యం జరిగిందని, ఇది తన గెలుపుపై ప్రభావం చూపిందని వాపోయారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కాలె యాదయ్య (చేవెళ్ల), టి.రామ్మోహన్‌రెడ్డి(పరిగి)లను టీపీసీసీ చీఫ్ పొన్నాల అభినందించారు. సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉంది : ప్రసాద్‌కుమార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన పని లేదని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ స్పష్టం చేశారు. కానీ కార్యకర్త స్థాయిలో నూతనోత్సాహంతో వ్యూహాత్మకంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, ఈ అంశాన్ని అనుకూలంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లిల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఉందని, అనుకూలంగా మలుచుకోవడంలో మనం చొరవ చూపాలని అన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, పి.కార్తీక్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు వెంకటస్వామి, క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, డీసీసీబీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్, భీంరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మోక్షం
త్వరలో ప్రారంభం కానున్న పనులు టెండర్ దక్కించుకున్న దిలీప్ బిల్డ్‌కాన్ కంపెనీ 85 కిలోమీటర్ల మేరజాతీయ రహదారి విస్తరణ {V>Ð]l*Ë పరిధిలో నాలుగు లేను హైదరాబాద్ -శ్రీశైలం రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పనులు చేపట్టడానికి సర్వే చేస్తున్నారు. గత ప్రభుత్వం శ్రీశైలం రహదారిని జాతీయ రహదారిగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ మేరకు రహదారిని 85కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సబితారెడ్డి చొరవతో రహదారి విస్తరణకు రూ.270కోట్లు మంజూరయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులకు శంకుస్థాపన చేయలేదు. ఇదిలాఉంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దిలీప్ బిల్ట్‌కాన్ కంపెనీ ఈ రోడ్డు విస్తరణ పనులను రూ.207కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం ఆ కంపెనీ సర్వే పనులు చేపట్టింది. రహదారి పక్కన మట్టి నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. వాటి ఆధారంగా ఏ ప్రాం తంలో ఏ విధంగా పనులు చేపట్టాలో నిర్ణయిస్తారు. జిల్లా పరిధిలోని మహేశ్వరం గేట్ 23వ కిలోమీటర్ నుంచినల్లగొండ జిల్లా డిండి 108వ కిలోమీటర్ వరకు మొత్తం 85కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ జరగనుంది. ప్రస్తుతం ఉన్న రహదారిని 10మీటర్ల వెడల్పుతో విస్తరించి రెండుపక్కల మీటరు చొప్పున సైడ్‌బర్మ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల పరిధిలో రోడ్ల విస్తరణ.. హైదరాబాద్ - శ్రీశైలం రహదారి విస్తరణలో భాగంగా జిల్లాతోపాటుగా మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాల పరి ధుల్లో రోడ్లను నాలుగు లేన్లుగా నిర్మించనున్నారు. కందుకూరు, కడ్తాల్, మైసిగండి, మిఠాయిపల్లి, ఆమన్‌గల్లు, వెల్దం డ, డిండి ప్రాంతాల్లో రహదారిని 30మీటర్లకు విస్తరించడంతో పాటు రోడ్డుకిరువైపులా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారికి అడ్డువచ్చే వచ్చే భవనాలను తొలగించే అవకాశం ఉంది. జాతీయ రహదారి విస్తరణతో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ప్రయా ణం సులభం కానుంది. మరోపక్క రహదారికి ఇరువైపులా రియల్ వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశమూ ఉంది. టెండర్ పనులు పూర్తయ్యాయి: నారాయణ, ఏఈఈ (జాతీయ రహదారి) హైదరాబాద్ -శ్రీశైలం రహదారి పనులకు రూ.270 కోట్లకు టెండర్ పిలిస్తే దిలీప్ బిల్డ్‌కాన్ కంపెనీ రూ.207కోట్లకు దక్కించుకుంది. శంకుస్థాపన అనంతరం త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. గ్రామాలు, పట్టణాలు ఉన్న ప్రాం తాల్లో 30మీటర్ల మేర నాలుగు లేన్లు, మిగతా ప్రాంతాల్లో 10 మీటర్ల చొప్పు -
కాంగ్రెస్ నేతల రహస్య భేటీ?
శంకర్పల్లి,న్యూస్‌లైన్: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో రాజకీయ సమీకరణాల కోసం వివిధ పార్టీల నాయకులు సమాయత్తం అవుతున్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని పొద్దుటూర్ ప్రగతి రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈమేరకు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, ఎమ్యెల్సీ యాదవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి కాలె యాదయ్య ఇతర ముఖ్యనేతలు హాజరయినట్లు తెలిసింది. సోమవారం వెలువడనున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు , మంగళవారం వెలువడనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, ఆ తరువాత అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఎంపీపీ స్థానాలతోపాటు, జెడ్పీటీసీ చైర్మన్‌గిరి కైవసం చేసుకోవాలనే దానిపై ప్రత్యేకంగా చర్చించారని తెలుస్తోంది. అయితే సమావేశానికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు నాయకులు నిరాకరించారు. -
మోడల్ నిర్మాణాలు!
పరిగి, న్యూస్‌లైన్: ఈ విద్యా సంవత్సరం కూడా మోడల్ స్కూళ్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కన్పించడంలేదు. మరో నెల రోజుల్లో 2014-15 సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభం కావాల్సిఉంది. కానీ 33 నెలలు క్రితం అట్టహాసంగా శంకుస్థాపన చేసిన భవనాలు మాత్రం పూర్తి కాలేదు. ఇక మరో వైపు ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ వివాదమైంది. భవన నిర్మాణాలు, విద్యార్థులను చేర్చుకునే ప్రక్రియలోనూ అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులనుచేర్చుకునేందుకు విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం.. రెండు సంవత్సరాలుగా విద్యార్థులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉంది. జూన్, జూలై నెలల్లో హడావిడి చేస్తున్న విద్యాశాఖ అధికారులు.. అనంతరం స్వీకరించిన దరఖాస్తులను చెత్తబుట్టలో పడేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు శంకుస్థాపనచేసి 33 నెలలు గడుస్తున్నా మోడల్ స్కూళ్ల భవన నిర్మాణాలకు గ్రహణం వీడడం లేదు. శిలాఫలకాలకే పరిమితం.. ఆదర్శ పాఠశాలల ఏర్పాటు కోసం 2011-12 విద్యా సంవత్సరానికి ముందు జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలకు అప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితారెడ్డి శంకుస్థాపనలు చేశారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మోడల్‌స్కూళ్లు మంజూరయ్యాయి. ఐదు పాఠశాలల భవనాలకు రూ.15కోట్లు మంజూరు చేశారు. 2011 జూన్ 28న ఒకేరోజు నియోజకవర్గ పరిధిలోని ఐదు స్కూళ్లకు సబితారెడ్డి శిలాఫలకాలు వేశారు. కానీ ఇప్పటివరకు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. స్థలాలకు నిధులేవీ? శిలాఫలకాలు వేసింది మొదలు ఆదర్శ పాఠశాలల ఏర్పాటులో అనేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. నిర్మాణం కోసం ఒక్కో భవనానికి రూ.మూడు కోట్లు మంజూరు చేసినప్పటికీ స్థలాల కొనుగోలుకు మాత్రం నిధులు ఇవ్వలేదు. దీంతో కొన్ని చోట్ల శంకుస్థాపనకు ముందే స్థల వివాదాలు తెరపైకి వచ్చాయి. మండల కేంద్రాల్లో అందరికీ అందుబాటులో ఉండాల్సిన పాఠశాలలు మారుమూల గ్రామాలకు తరలిపోయాయి. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో, గండేడ్ మండలం వెన్నచ్చేడ్లో, పూడూరు మండలం మన్నెగూడలో ఇప్పటికే భవన నిర్మాణాలు ప్రారంభం కాగా దోమ మండలానికి చెందిన దిర్సంపల్లి, దాదాపూర్ గ్రామాల మధ్య ఈ విషయమై పెద్దవివాదమే తలెత్తింది. అది క్రమంగా రాజకీయ రంగు పులుముకొని భవన నిర్మాణానికి అడ్డంకిగా మారింది. పరిగిలో శంకుస్థాపన చేసిన మినీస్టేడియం స్థలం వివాదాల్లోకి వెళ్లడంతో ఇక్కడ పాఠశాల నిర్మాణం ఆగిపోయింది. మండల పరిధిలోని జాపర్‌పల్లి గుట్టపై స్థలాన్ని పరిశీలించి పునాదులు తీశారు. కానీ ఇప్పటికీ ఆ భవనం బెస్మెంట్ లెవల్ దాటలేదు. తల్లిదండ్రుల ఎదురుచూపు పిల్లలను ఆదర్శ పాఠశాలల్లో చేర్చేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారు. గత రెండేళ్ల నుంచి దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ తరగతులు మాత్రం ప్రారంభం కావడంలేదు. ఈ ఏడాదీ అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. -
ఇంద్రారెడ్డికి ఘన నివాళులు
చేవెళ్లరూరల్, న్యూస్‌లైన్ : మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 14వ వర్ధంతిని మంగళవారం కౌకుంట్ల గ్రామంలో నిర్వహించారు. ఆయన సతీమణి సబితారెడ్డి, తనయుడు కార్తీక్‌రెడ్డి తదితర కుటుంబ సభ్యులు గ్రామంలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఇంద్రారెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇంద్రారెడ్డిపై అభిమానంతో ఎందరో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని, వారి ఆదరాభిమానాలతోనే మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. తొలిసారిగా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి తమ కుటుంబం నుంచి కార్తీక్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాంత ప్రజలను తమ కుటుంబం మరిచిపోదనీ, మరింత ఎక్కువ కాలం సేవ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ప్రజల అకాంక్ష నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. దివంగత ఇంద్రారెడ్డి కన్న తెలంగాణ కల నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఆయన అభిమానులపై ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి, నాయకులు కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, రమణారెడ్డి, ఎం.బాల్‌రాజ్, వెంకటేశం గుప్తా, రవికాంత్ రెడ్డి, శివానందం, బల్వంత్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అలీ, వనం మహేందర్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తనయుల గెలుపు కోసం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులంతా కొత్తవారవడం, వీరు ప్రముఖుల వారసులు కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతుండగా.. టీడీపీ నుంచి మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్ బరిలో నిలిచారు. ఇద్దరు మాజీ హోంమంత్రులకు తనయుల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూహాత్మక ప్రచారాలు.. పల్లె, పట్టణ వాతావరణం కలయిక చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. కార్తీక్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌ల బంధువర్గం సైతం ప్రచారంలో పాల్గొంటోంది. వీరేందర్‌కు అండగా దేవేందర్‌గౌడ్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరేందర్ తన మిత్రవర్గంతోనూ కలిసి ప్రచార కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణ అంతా వీరేందర్ సోదరుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పట్టణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. చేవెళ్ల సొంత ప్రాంతం కావడంతో ఇక్కడినుంచే అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కార్తీక్‌రెడ్డికి అండగా సబితారెడ్డి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయగా.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్తీక్ సోదరులు ప్రచార కార్యక్రమాల నిర్వహణను చూసుకుంటున్నారు. మరోవైపు కార్తీక్ చిన్నమ్మ, సోదరి కూడా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. -
పేరు గొప్ప..ఊరు దిబ్బ!
శంషాబాద్, న్యూస్‌లైన్ : శంషాబాద్‌కు కృష్ణా జలాలు తెచ్చింది తామంటూ... లేదు ఇచ్చింది మేమంటూ కాంగ్రెస్, టీడీపీల నేతలు పోటీపడి ప్రచారం చేసుకున్నారు. ఇవిగో నీళ్లంటూ ప్రారంభోత్సవాలు జరిపి గొప్పలు పోయారు. ఇక ఈ ప్రాంతంలో తాగునీటికి కొరత ఉండదని గప్పాలు కొట్టారు. శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరా ఘనత తమదేనంటూ ఇరు పార్టీల నాయకులు ఇంకా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. క్షేత్రస్థాయికి వస్తే... ప్రారంభోత్సవాలప్పుడు రెండు మూడు రోజులు సక్రమంగా, తర్వాత అరకొరగా... నెలరోజుల నుంచి పూర్తిగా నీటిసరఫరా నిల్చిపోయింది. ప్రస్తుతం పంచాయతీ ద్వారా బోరుబావుల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, తెచ్చింది మేము... ఇచ్చింది మేమేనంటూ ఇరు పార్టీల నాయకులు ఇంకా ప్రచారం చేసుకుంటుండటాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం పథకాన్ని ప్రారంభించగా... శంషాబాద్‌కు కృష్ణా జలాలు చుక్కనీరు కూడా సరఫరా కావడం లేదు. రూ.11 కోట్లు ఖర్చు చేసి పైప్‌లైన్ పనులు పూర్తి చేసినా జలమండలితో ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష నేతలు వందశాతం విఫలమయ్యారు. ఒక్కసారి కాదు ఏకంగా రెండు, మూడు సార్లు ఇక్కడ కృష్ణా నీటి సరఫరాను ప్రారంభించిన ఘనత కాంగ్రెస్, టీడీపీలకే దక్కుతుంది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేత కూడా ప్రారంభం చేయించారు. ఆ తర్వాత మాజీ హోంమంత్రి సబితారెడ్డి 2013 జనవరి 10న మరోసారి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కృష్ణా జలాల సరఫరాలో తన కృషి కూడా ఎంతో ఉందని గొప్పలు చెప్పుకున్నారు. ఇరు పార్టీల నాయకులు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. కొద్దిరోజుల పాటు సరఫరా అయిన నీరు మళ్లీ నిల్చిపోయింది. జలమండలికి పట్టదు.. శంషాబాద్ గ్రామ పంచాయతీ నుంచి జలమండలికి చెల్లించాల్సిన రూ.13కోట్ల గ్రాంటు గతేడాది జూలైలోనే విడుదలైనా చెల్లింపు ప్రక్రియలో సాంకేతిక సమస్యలతో నాలుగు నెలలు ఆలస్యమైంది. మొత్తం మీద ఈ చెల్లింపు ప్రక్రియపై సర్కారు జీవో విడుదల చేసినా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. శంషాబాద్‌కు కొంతకాలం అరకొరగా నీటిని సరఫరా చేసిన జలమండలి.. నెల రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీల నేతలపై శంషాబాద్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తాండూరు తుది బరిలో ఎవరో!
తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది ఆసక్తిగా మారింది. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా అభ్యర్థులను ఖరారు చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచే పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎవరు తుది బరిలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీల మధ్య పొత్తుల నేపథ్యంలో తుది బరిలో ఎవరు నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. కాగా గత నెలలో మాజీ మంత్రి, స్వర్గీయ చంద్రశేఖర్ కుమారులు మల్కూడ్ నరేష్, రాకేష్ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో నరేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజుగౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో ఆసక్తిగా మారింది. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని నరేష్, రాజుగౌడ్ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదరడంతో తాండూరు సీటు బీజేపీ, టీడీపీలో ఏ పార్టీకి దక్కుతుందనేది సందిగ్ధంగా మారింది. బీజేపీ నుంచి రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి ఇక్కడ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పొత్తులో ఈ సీటు బీజేపీకి దక్కుతుందా లేదా టీడీపీ తీసుకుంటుందా? అనేది చర్చనీయాంశమైంది. ఇక వైఎస్సార్ సీపీ, ఎంఐఎంతోపాటు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలు తమ అభ్యర్థులను దించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. -
యూటీ ప్రతిపాదన తగదు
కందుకూరు, న్యూస్‌లైన్: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఆమోదించడం తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి నిదర్శనమని, సీమాంధ్ర నేతలు యూటీ చేయాలనడం అర్థరహితమని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేయాలని, భద్రాచలం మాదేనంటూ సీమాంధ్ర నేతలు కుటిల రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. జీఓఎంకు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కేవలం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉందని, సీమాంధ్రలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరీవాహక ప్రాంతాలు ఉన్నాయని, తీర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గమని ఈ ప్రాంత ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారన్నారు. సీమాంధ్ర నేతలు సమస్యలు సృష్టించకుండా భౌతికంగా విడిపోయి మానసికంగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు సురేందర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, ఈశ్వర్‌గౌడ్, ఇజ్రాయిల్, కృష్ణనాయక్, మహేష్‌గౌడ్, చిర్ర సాయిలు, రాణాప్రతాప్‌రెడ్డి, దశరథ, బాబురావు, శోభ, లత, కరుణాకర్‌రెడ్డి, సమీర్, ఎస్.పాండు, హామీద్, దేవేందర్, కె.పాండు, దర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.