హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మోక్షం | Hyderabad - Srisailam Road salvation | Sakshi
Sakshi News home page

హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మోక్షం

Jun 7 2014 12:02 AM | Updated on Mar 28 2018 11:05 AM

హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మోక్షం - Sakshi

హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మోక్షం

హైదరాబాద్ -శ్రీశైలం రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.

త్వరలో ప్రారంభం కానున్న పనులు
టెండర్ దక్కించుకున్న దిలీప్ బిల్డ్‌కాన్ కంపెనీ
85 కిలోమీటర్ల మేరజాతీయ రహదారి విస్తరణ
{V>Ð]l*Ë పరిధిలో నాలుగు లేను

 
హైదరాబాద్ -శ్రీశైలం రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పనులు చేపట్టడానికి సర్వే చేస్తున్నారు. గత ప్రభుత్వం శ్రీశైలం రహదారిని జాతీయ రహదారిగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ మేరకు రహదారిని 85కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సబితారెడ్డి చొరవతో రహదారి విస్తరణకు రూ.270కోట్లు మంజూరయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులకు శంకుస్థాపన చేయలేదు. ఇదిలాఉంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దిలీప్ బిల్ట్‌కాన్ కంపెనీ ఈ రోడ్డు విస్తరణ పనులను రూ.207కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం ఆ కంపెనీ సర్వే పనులు చేపట్టింది. రహదారి పక్కన మట్టి నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. వాటి ఆధారంగా ఏ ప్రాం తంలో ఏ విధంగా పనులు చేపట్టాలో నిర్ణయిస్తారు. జిల్లా పరిధిలోని మహేశ్వరం గేట్ 23వ కిలోమీటర్ నుంచినల్లగొండ జిల్లా డిండి 108వ కిలోమీటర్ వరకు మొత్తం 85కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ జరగనుంది. ప్రస్తుతం ఉన్న రహదారిని 10మీటర్ల వెడల్పుతో విస్తరించి రెండుపక్కల మీటరు చొప్పున సైడ్‌బర్మ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

 గ్రామాల పరిధిలో రోడ్ల విస్తరణ..

 హైదరాబాద్ - శ్రీశైలం రహదారి విస్తరణలో భాగంగా జిల్లాతోపాటుగా మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాల పరి ధుల్లో రోడ్లను నాలుగు లేన్లుగా నిర్మించనున్నారు. కందుకూరు, కడ్తాల్, మైసిగండి, మిఠాయిపల్లి, ఆమన్‌గల్లు, వెల్దం డ, డిండి ప్రాంతాల్లో రహదారిని 30మీటర్లకు విస్తరించడంతో పాటు రోడ్డుకిరువైపులా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారికి అడ్డువచ్చే వచ్చే భవనాలను తొలగించే అవకాశం ఉంది. జాతీయ రహదారి విస్తరణతో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ప్రయా ణం సులభం కానుంది. మరోపక్క రహదారికి ఇరువైపులా రియల్ వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశమూ ఉంది.
 టెండర్ పనులు పూర్తయ్యాయి:
 నారాయణ, ఏఈఈ (జాతీయ రహదారి)
 హైదరాబాద్ -శ్రీశైలం రహదారి పనులకు రూ.270 కోట్లకు టెండర్ పిలిస్తే దిలీప్ బిల్డ్‌కాన్ కంపెనీ రూ.207కోట్లకు దక్కించుకుంది. శంకుస్థాపన అనంతరం త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. గ్రామాలు, పట్టణాలు ఉన్న ప్రాం తాల్లో 30మీటర్ల మేర నాలుగు లేన్లు, మిగతా ప్రాంతాల్లో 10 మీటర్ల చొప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement