Hyderabad - Srisailam Road
-
ఎలివేటెడ్ బదులు.. కేబుల్ కార్ మార్గం..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ – శ్రీశైలం పుణ్యక్షేత్రం మధ్య రోడ్డు విస్తరణలో భాగంగా నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన భారీ ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ దృష్టి పెట్టింది. దాదాపు 45.42 కి.మీ. నిడివితో ఈ మార్గంలో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీని నిర్మాణానికి రూ.7,690 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంత భారీ వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే బదులు రూ.2,270 కోట్లతో పూర్తయ్యే కేబుల్ కార్ కారిడార్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై నివేదిక అందజేయాలని ఆ శాఖ కార్యదర్శి ఉమాశంకర్ తాజాగా అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీ నిడివితో కేబుల్ కార్ మార్గం లేదు. దాని నిర్మాణం, నిర్వహణ సవాళ్లతో కూడుకున్నది కావటంతో ఆచితూచి పరిశీలించి నివేదిక అందించాలని అధికారులు నిర్ణయించారు. జంతువులకు ఇబ్బంది లేకుండా.. హైదరాబాద్ – శ్రీశైలం రహదారిని గతంలోనే నాలుగు వరసలకు విస్తరించారు. కానీ, శ్రీశైలం మార్గంలోని మన్ననూరు వరకే ఆ విస్తరణ కొనసాగింది. మన్ననూరు నుంచి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం మొదలవుతుంది. మధ్యలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఉంటుంది. ఇక్కడ పెద్ద పులులతోపాటు చాలా రకాల వణ్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వాటికి అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్డును విస్తరించలేదు. అక్కడి నుంచి సాధారణ డబుల్ రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డుమీద ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం వైపు రాత్రి 9 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించరు. పగటిపూట మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలం పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొంతకాలంగా రోడ్డును విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, వణ్యప్రాణులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అటవీ శాఖ అందుకు అనుమతించటం లేదు. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచి్చంది. మన్ననూరు నుంచి తెలంగాణ పరిధి ఉన్న పాతాళగంగ వరకు 62.40 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలని.. ఇందులో జంతువుల సంచారం ఉండే 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ (వంతెన తరహా) పద్ధతిలో రోడ్డు నిర్మించాలన్నది ప్రతిపాదన. దీనిని గతేడాది నవంబర్‌లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారికంగా ప్రతిపాదించింది. ఇది పూర్తయితే దేశంలో అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్లలో ఒకటిగా నిలవనుంది. ఖర్చు తగ్గించేందుకు.. ఎలివేటెడ్ కారిడార్ భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు కావటంతో దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని తాజాగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి ఉమాశంకర్ భావించారు. దీనిపై అధ్యయనం చేయాలని జాతీయ రహదారుల విభాగాన్ని ఆదేశించారు. ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించాల్సి వస్తే, తక్కువ నిడివి ఉండే ప్రత్యామ్నాయ అలైన్‌మెంటును సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కుదరని పక్షంలో ఎలివేటెడ్‌కు బదులు కేబుల్ కార్ మార్గాన్ని నిర్మించే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.170 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కేబుల్ కార్ మార్గానికి కిలోమీటర్‌కు రూ.50 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. -
హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మోక్షం
త్వరలో ప్రారంభం కానున్న పనులు టెండర్ దక్కించుకున్న దిలీప్ బిల్డ్‌కాన్ కంపెనీ 85 కిలోమీటర్ల మేరజాతీయ రహదారి విస్తరణ {V>Ð]l*Ë పరిధిలో నాలుగు లేను హైదరాబాద్ -శ్రీశైలం రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పనులు చేపట్టడానికి సర్వే చేస్తున్నారు. గత ప్రభుత్వం శ్రీశైలం రహదారిని జాతీయ రహదారిగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ మేరకు రహదారిని 85కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సబితారెడ్డి చొరవతో రహదారి విస్తరణకు రూ.270కోట్లు మంజూరయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులకు శంకుస్థాపన చేయలేదు. ఇదిలాఉంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దిలీప్ బిల్ట్‌కాన్ కంపెనీ ఈ రోడ్డు విస్తరణ పనులను రూ.207కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం ఆ కంపెనీ సర్వే పనులు చేపట్టింది. రహదారి పక్కన మట్టి నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. వాటి ఆధారంగా ఏ ప్రాం తంలో ఏ విధంగా పనులు చేపట్టాలో నిర్ణయిస్తారు. జిల్లా పరిధిలోని మహేశ్వరం గేట్ 23వ కిలోమీటర్ నుంచినల్లగొండ జిల్లా డిండి 108వ కిలోమీటర్ వరకు మొత్తం 85కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ జరగనుంది. ప్రస్తుతం ఉన్న రహదారిని 10మీటర్ల వెడల్పుతో విస్తరించి రెండుపక్కల మీటరు చొప్పున సైడ్‌బర్మ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల పరిధిలో రోడ్ల విస్తరణ.. హైదరాబాద్ - శ్రీశైలం రహదారి విస్తరణలో భాగంగా జిల్లాతోపాటుగా మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాల పరి ధుల్లో రోడ్లను నాలుగు లేన్లుగా నిర్మించనున్నారు. కందుకూరు, కడ్తాల్, మైసిగండి, మిఠాయిపల్లి, ఆమన్‌గల్లు, వెల్దం డ, డిండి ప్రాంతాల్లో రహదారిని 30మీటర్లకు విస్తరించడంతో పాటు రోడ్డుకిరువైపులా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారికి అడ్డువచ్చే వచ్చే భవనాలను తొలగించే అవకాశం ఉంది. జాతీయ రహదారి విస్తరణతో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ప్రయా ణం సులభం కానుంది. మరోపక్క రహదారికి ఇరువైపులా రియల్ వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశమూ ఉంది. టెండర్ పనులు పూర్తయ్యాయి: నారాయణ, ఏఈఈ (జాతీయ రహదారి) హైదరాబాద్ -శ్రీశైలం రహదారి పనులకు రూ.270 కోట్లకు టెండర్ పిలిస్తే దిలీప్ బిల్డ్‌కాన్ కంపెనీ రూ.207కోట్లకు దక్కించుకుంది. శంకుస్థాపన అనంతరం త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. గ్రామాలు, పట్టణాలు ఉన్న ప్రాం తాల్లో 30మీటర్ల మేర నాలుగు లేన్లు, మిగతా ప్రాంతాల్లో 10 మీటర్ల చొప్పు