ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి
మాజీ హోంమంత్రి సబితారెడ్డి
శంకర్‌పల్లి: ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా శంకర్‌పల్లికి చెందిన జూలకంటి పాండురంగారెడ్డిని నియమించారు.ఈ మేరకు సబితారెడ్డి నియామకపత్రం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. నూతన యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. తనకు పదవి ఇచ్చినందుకు మాజీ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, రావులపల్లి మాజీ సర్పంచ్ రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, ఎంపీపీ నర్సింహులు, జెడ్పీటీసీ సభ్యురాలు కళావతి, వైస్ ఎంపీపీ శశిధర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు భూషణం, యూత్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, షారుఖ్ పాల్గొన్నారు.