మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు చిత్రంలో మంత్రి సబిత, ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నం/అబ్దుల్లాపూర్‌మెట్ /మహేశ్వరం: పాపపు కాంగ్రెస్ కావాలా? శాపపు బీజేపీ కావాలా? దీపం లాంటి కేసీఆర్.. బీఆర్‌ఎస్ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.62.21 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం మంత్రి సబితారెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డి అంటుంటే, వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని బీజేపీ అంటోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తూ ఏటా మూడు పంటలు సాగు చేసుకోమంటున్నారని గుర్తు చేశారు.
వారిని నమ్మొద్దు
ఎన్నికలు రాగానే ఇది చేస్తాం..అది చేస్తామని చెప్పే నాయకులను నమ్మొద్దని మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల మధ్యే ఉండే సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. వీఓఏలు, మెప్మా ఆర్పీల ఆటోమెటిక్ రెన్యూవల్, ఇన్సూరెన్స్, వేతన పెంపు సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ పూర్తికాగానే, మహిళలకు రావాల్సిన వడ్డీలేని రుణాలను చెల్లిస్తామన్నారు.
మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ. కేసీఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకా లు, అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాపీ కొడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. రాష్ట్రానికి రావాల్సిన రూ.35 వేల కోట్ల నిధులు మోదీ సర్కార్ ఎందుకు నిలిపేసిందో..? కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment