ఇంద్రారెడ్డికి ఘన నివాళులు
ఇంద్రారెడ్డికి ఘన నివాళులు
Published Wed, Apr 23 2014 3:12 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
చేవెళ్లరూరల్, న్యూస్‌లైన్ : మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 14వ వర్ధంతిని మంగళవారం కౌకుంట్ల గ్రామంలో నిర్వహించారు. ఆయన సతీమణి సబితారెడ్డి, తనయుడు కార్తీక్‌రెడ్డి తదితర కుటుంబ సభ్యులు గ్రామంలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఇంద్రారెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇంద్రారెడ్డిపై అభిమానంతో ఎందరో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని, వారి ఆదరాభిమానాలతోనే మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. తొలిసారిగా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి తమ కుటుంబం నుంచి కార్తీక్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాంత ప్రజలను తమ కుటుంబం మరిచిపోదనీ, మరింత ఎక్కువ కాలం సేవ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ప్రజల అకాంక్ష నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. దివంగత ఇంద్రారెడ్డి కన్న తెలంగాణ కల నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఆయన అభిమానులపై ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి, నాయకులు కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, రమణారెడ్డి, ఎం.బాల్‌రాజ్, వెంకటేశం గుప్తా, రవికాంత్ రెడ్డి, శివానందం, బల్వంత్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అలీ, వనం మహేందర్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement