
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను ఆదేశించామని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు యూని వర్సిటీలు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించాయి. దసరా తర్వాత పరీక్షలు యథావిధిగా ఉంటాయని వెల్లడించాయి. 27వ తేదీ పరీక్షలు యథావిధిగా జరుగు తాయని జేఎన్‌టీయూ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment