Postponeds
-
దసరా వరకు పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను ఆదేశించామని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు యూని వర్సిటీలు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించాయి. దసరా తర్వాత పరీక్షలు యథావిధిగా ఉంటాయని వెల్లడించాయి. 27వ తేదీ పరీక్షలు యథావిధిగా జరుగు తాయని జేఎన్టీయూ వెల్లడించింది. -
జాతీయ క్రీడలు మళ్లీ వాయిదా!
న్యూఢిల్లీ: ఇప్పటికే మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోని 36వ జాతీయ క్రీడలకు మరోసారి వాయిదా గండం తప్పడం లేదు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న గోవా... సాధారణ ఎన్నికలు, భద్రత, పాఠశాలలకు సెలవులతో వాలంటీర్లు అందుబాటులో ఉండరంటూ నిర్వహణపై అశక్తత వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు లేఖ రాసింది. వాస్తవానికి గతేడాది నవంబరులోనే గోవా ఈ క్రీడలకు వేదిక కావాల్సింది. తాజాగా మరోసారి చేతులెత్తేసింది. దీనిపై రూ.10 కోట్లు జరిమానా వేస్తామంటూ ఐఓఏ మండిపడుతోంది. -
డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా దారుణం
తిరుపతి కల్చరల్: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పరీక్ష ఆన్లైన్లో నిర్వహించి, పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి.చిన్నబాబు, నగర కార్యదర్శి కె.సుమన్ మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ ఐదోసారి కూడా వాయిదా వేయడం దారుణమన్నారు. నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న అభ్యర్థుల నోటిలో మట్టికొట్టారని విమర్శించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలుగుదేశం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి తరువాత విస్మరించిందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేస్తారన్న నమ్మకంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు వేలకువేలు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్రంలోనున్న ఖాళీ పోస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు జాఫర్ సాదిక్, వీరాంజనేయులు, విశ్వనాథ్, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఒక్కరోజు.. 11 వాయిదాలు!
న్యూఢిల్లీ: రాజ్యసభ కొత్త రికార్డు సృష్టించింది. నిరసనలతోపాటు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా బుధవారం ఒక్కరోజే 11 సార్లు వాయిదా పడింది. అవినీతి నిరోధక (సవరణ) బిల్లు–2013పై చర్చ విషయంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య వివాదంతో రికార్డు స్థాయిలో వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 11గంటలకు సమావేశమైన రాజ్యసభ 20 నిమిషాలకే వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైనా.. సభలో నిరసనలు కొనసాగటంతో మూడు గంటల వ్యవధిలోనే మరో 10 సార్లు వాయిదా పడింది. దేశ ప్రయోజనంతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని.. అయితే ప్రభుత్వమే చర్చ జరగకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. -
కాల్‌మనీ కేసు ఈనెల 22కు వాయిదా
-
పదేపదే వాయిదాలు కోరతారెందుకు?
ఇరు రాష్ట్రాల జీపీలు, ఏజీపీలపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కేసుల విచారణ సందర్భంగా ఇరురాష్ట్రాల ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ) పదేపదే వాయిదాలు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోరిన వివరాల్ని అధికారులు సకాలంలో అందించడం లేదన్న కారణాన్ని సాకుగా చూపుతూ తరచూ వాయిదాలు కోరుతుండటాన్ని తప్పుపట్టింది. విచారణకు సహకరించని కిందిస్థాయి అధికారులను బాధ్యులుగా చేస్తూ ఆయాశాఖల ముఖ్య కార్యదర్శులకు భారీ జరిమానా విధిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. చిత్తూరు జిల్లాల్లో ఓ భూవివాదానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ గతవారం విచారణకొచ్చినప్పుడు పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు గడువుకావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇందుకు జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం అనుమతినిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకొచ్చింది. ఈసారి కూడా ప్రభుత్వ న్యాయవాది వివరాలు సమర్పించేందుకు గడువు కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. ఇలా పదేపదే వాయిదాలు కోరడం సరికాదని పేర్కొంది. అయితే ప్రభుత్వ న్యాయవాది, వివరాల సమర్పణకు చివరి అవకాశమివ్వాలని కోరగా, ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.