
న్యూఢిల్లీ: ఇప్పటికే మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోని 36వ జాతీయ క్రీడలకు మరోసారి వాయిదా గండం తప్పడం లేదు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న గోవా... సాధారణ ఎన్నికలు, భద్రత, పాఠశాలలకు సెలవులతో వాలంటీర్లు అందుబాటులో ఉండరంటూ నిర్వహణపై అశక్తత వ్యక్తం చేస్తోంది.
ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు లేఖ రాసింది. వాస్తవానికి గతేడాది నవంబరులోనే గోవా ఈ క్రీడలకు వేదిక కావాల్సింది. తాజాగా మరోసారి చేతులెత్తేసింది. దీనిపై రూ.10 కోట్లు జరిమానా వేస్తామంటూ ఐఓఏ మండిపడుతోంది.