Indian Olympic Association
-
ఐఓఏలో వైరం... ఎస్జీఎం చక్కదిద్దేనా?
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లోని సహచరులతో ఏర్పడిన వైరంతో ఇబ్బంది పడుతున్న ఐఓసీ అధ్యక్షురాలు పీటీ ఉష ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 25న జరగబోయే ఈ మీటింగ్‌లో సమస్యలు, విబేధాలు, ఇతరత్రా అంశాలపై చర్చిద్దామని ఆమె పేర్కొంది. ‘వివాదానికి దారి తీసిన అంశాలు, అసాధారణ సమస్యలు... ఇలా అన్నింటిపై చర్చించేందుకు ఎస్జీఎం నిర్వహించాలని నిర్ణయించాను. ఈ నెల 25న ఆఫీస్ బేరర్లు, స్టేక్ హోల్డర్లంతా హాజరు కావాలని కోరుతున్నాను. ఈ ఎస్జీఎం హైబ్రిడ్ మీటింగ్. అంటే నియమావళిలోని ఆర్టికల్ 8.3 ప్రకారం ఎవరైనా సభ్యులు ప్రత్యక్షంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటే ఆన్లైన్ మీటింగ్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఐఓఏ వెబ్సైట్లో ఉంటుంది’ అని ఉష ఐఓఏ సభ్యులకు ఈ–మెయిల్ పంపారు. ముఖ్యంగా ఒలింపిక్ సంఘానికి సీఈఓగా రఘురామ్ అయ్యర్‌ను నియమించడాన్ని ఎగ్జిక్యూటివ్ (ఈసీ) సభ్యులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోతున్నారు. తాము ఎంతగా వ్యతిరేకించినా ఆయనకు పదవిని కట్టబెట్టడంపై ఈసీ సభ్యులంతా గుర్రుగా ఉన్నారు. కోశాధికారి సహదేవ్ యాదవ్‌పై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా చర్చనీయాంశమైంది. ఈ లుకలుకలతో ఐఓఏ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు ఐఓఏను ఒక ప్రొఫెషనల్ దృక్పథంలో నడిపించేందుకు సీఈఓ అవసరం ఎంతో ఉందని ఉష వాదిస్తోంది. అయ్యర్‌కు సీఈఓ పదవేమీ పూర్తిగా కొత్తేం కాదు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలతో పాటు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ లీగ్, అల్టీమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లకు సీఈఓ పనిచేసిన విశేషానుభవం రఘురామ్ అయ్యర్ సొంతం. ఐఓఏ నిర్వహించే ఎస్‌జీఎంలో స్పోర్ట్స్ కోడ్‌పై కూడా చర్చ జరిగే అవకాశముంది. గరిష్ట వయోపరిమితిపై ప్రధానంగా చర్చిస్తారు. -
అప్పీలుకు వెళ్దామంటే వినేశ్ ఒప్పుకోలేదు: హరీశ్ సాల్వే
భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)పై రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే స్పందించారు. వినేశ్ లాయర్ల నుంచి తమకు ఎలాంటి సహకారం లభించలేదన్న ఆయన.. స్పోర్ట్స్ కోర్టు తీర్పుపై స్విస్ కోర్టులో అప్పీలుకు వెళ్దామంటే వినేశ్ నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. కాగా ప్యారిస్ ఒలిపింక్స్-2024లో మహిళల యాభై కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు పడింది. ఫైనల్లో పాల్గొనకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనర్హురాలిగా ప్రకటించింది. రజత పతకమైనా ఇవ్వాలని కోరగాఈ క్రమంలో వినేశ్ ఫొగట్, ఐఓఏ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించింది. కానీ, అప్పటికే టైటిల్ రేసు మొదలైందని.. అందుకే వినేశ్‌కు పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వలేమని సదరు న్యాయస్థానం పేర్కొంది.అయితే, సెమీస్ వరకు నిబంధనల ప్రకారం గెలిచాను కాబట్టి కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలన్న వినేశ్ ఫొగట్ అభ్యర్థన పిటిషన్‌ను స్వీకరించింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వేతో పాటు విదూశ్‌పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అనేక వాయిదాల అనంతరం కోర్టు తీర్పునిస్తూ.. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా నిబంధనలకు విరుద్ధమే అంటూ వినేశ్‌కు రజతం ఇవ్వలేమంటూ పిటిషన్‌ను కొట్టిపారేసింది.ఐఓఏపై వినేశ్ ఆరోపణలుఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫొగట్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోర్టుకు వెళ్లిన సమయంలో ఐఓఏ నుంచి తనకు ఎలాంటి సహకారం లభించలేదని ఆరోపించింది. దేశం తరఫున కాకుండా.. తన పేరు మీదే పిటిషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. అయితే, అక్కడా తనకు న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హరీశ్ సాల్వే తాజాగా స్పందించారు.వినేశ్ లాయర్లు సహకరించలేదు‘‘ఈ కేసులో మాకు, అథ్లెట్ నియమించుకున్న లాయర్లకు మధ్య సమన్వయం లోపించింది. నిజానికి భారత ఒలింపిక్ సంఘం మెరుగైన వ్యక్తుల(తమను ఉద్దేశించి)ను ఆమె కోసం నియమించింది. కానీ.. ఆమె లాయర్లు మాత్రం.. ‘మీతో మేము ఎలాంటి విషయాలు పంచుకోము. మాకు తెలిసిన సమాచారం మీకు ఇవ్వము’ అన్నట్లుగా ప్రవర్తించారు. ఫలితంగా ప్రతి అంశంలోనూ ఆలస్యమైంది.అయిన్పటికీ మా శక్తి వంచన లేకుండా ఆఖరి వరకు పోరాడాము. అయితే, చివరకు మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పుడు కూడా నేను ఆమెకు ఓ సూచన చేశాను. మనం స్విస్ కోర్టుకు వెళ్దామని చెప్పాను. అందుకు ఆమె ముందుకు రాలేదు కూడాకానీ తన లాయర్లు మత్రం ఆమెకు ఇక ముందుకు వెళ్లే ఉద్దేశంలేదని చెప్పారు’’ అని హరీశ్ సాల్వే చెప్పుకొచ్చారు. కాగా ఈ పరిణామాల తర్వాత 30 ఏళ్ల వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలికి రాజకీయాల్లో చేరింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తోంది.చదవండి: Vinesh Phogat: వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే? -
వినేశ్ విషయంలో మా తప్పేమీ లేదు: పీటీ ఉష
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత అంశంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తప్పొప్పులను ఎంచుతూ వినేశ్ అనుకూల, ప్రతికూల వర్గాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా భారత ఒలింపిక్ సంఘం(IOA) వైద్య బృందం తీరుపై విమర్శలు వస్తున్నాయి. వినేశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వినేశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. పార్లమెంటులోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య వినేశ్ అంశమై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో IOA అధ్యక్షురాలు పీటీ ఉష కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైద్య బృందాన్ని సమర్థిస్తూ.. వినేశ్, ఆమె కోచ్‌దే తప్పు అన్నట్లుగా పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు.. ‘‘రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి క్రీడల్లో బరువు నియంత్రణ అంశం అనేది పూర్తిగా సదరు అథ్లెట్, అతడు లేదంటే ఆమె కోచ్ బాధ్యత.ఈ విషయంలో IOAచే నియమితులైన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దీవాలా, ఆయన బృందానికి ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేదు. IOA మెడికల్ టీమ్, డాక్టర్ పార్దీవాలాపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నా.వాస్తవాలు తెలుసుకోకుండా IOA వైద్య బృందాన్ని బాధ్యుల్ని చేస్తూ.. వారిని తప్పుబట్టడం సరికాదు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొన్న ప్రతీ భారత అథ్లెట్‌కు వారికంటూ సొంత సహాయక సిబ్బంది ఉంది. ఎన్నో ఏళ్లుగా వారితోనే ఈ అథ్లెట్ ప్రయాణం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే IOA మెడికల్ టీమ్‌ను నియమించాం.పోటీల సమయంలో ఆటగాళ్లు గనుక గాయపడితే.. వారికి చికిత్స అందించడం మాత్రమే వీరి ప్రాథమిక విధి. తమకంటూ సొంతంగా న్యూట్రీషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్లేని అథ్లెట్లకు కూడా వీరు సేవలు అందిస్తారు’’ అని పీటీ ఉష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినేశ్ ఫొగట్ బరువు విషయంలో వినేశ్తో పాటు ఆమె కోచ్‌లదే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో హర్యానా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తద్వారా ఈ క్రీడాంశంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఫైనల్‌కు ముందు బరువు తూచగా.. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫలితంగా వినేశ్ ఫొగట్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు అప్పీలు చేసింది. ఇందుకు సంబంధించిన తీర్పు ఆగష్టు 13న వెలువడనుంది. -
Vinesh Phogat: తీర్పు 13కు వాయిదా!
పారిస్: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను డిస్క్వాలిఫై చేసిన అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) తీర్పు మరో సారి వాయిదా పడింది. భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల 13న తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి శుక్రవారమే దీనిపై వాదనలు ముగిశాయి. దాంతో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు తీర్పు రానుందని సమాచారం రాగా అది జరగలేదు. అనంతరం ఆదివారం అదే సమయానికి రావచ్చని వినిపించినా... చివరకు మంగళవారానికి వాయిదా పడినట్లు తెలిసింది. నిజానికి ఒలింపిక్స్ ముగిసేలోగానే దీనిపై స్పష్టత ఇస్తామని సీఏఎస్ పేర్కొంది. అయితే వినేశ్ అంశాన్ని ‘ప్రత్యేక కేసు’గా చూస్తుండటంతో తీర్పు ఆలస్యమవుతూ వస్తోంది. కేసుకు సంబంధించి మరికొన్ని అదనపు డాక్యుమెంట్లను ఆదివారం సాయంత్రంలోగా తమకు అందించాలని సీఏఎస్ ఇరు పక్షాలను కోరింది. రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఉండటంతో వినేశ్‌ను నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. దాంతో ఆమె న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తొలి రోజు ఫైనల్ చేరే వరకు నిబంధనలకు అనుగుణంగా తన బరువు పరిమితికి లోబడే ఉందని... కాబట్టి అప్పటి వరకు వచ్చిన ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటూ తనకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆమె తరఫున సీఏఎస్‌లో వాదించారు. ఈ వ్యవహారంలో సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఐఓఏ అధికారులు చెప్పారు. -
Paris Olympics 2024: భారత రెజ్లర్‌పై మూడేళ్ల నిషేధం
పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై భారత ఒలింపిక్ సంఘం (IOA) చర్యలు తీసుకుంది. అంతిమ్‌పై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. అంతిమ్‌తో పాటు ఆమె సహాయక సిబ్బంది మొత్తాన్ని తక్షణమే స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘం ఆదేశించింది. అంతిమ్ అక్రిడేషన్‌పై ఆమె సోదరి ఒలింపిక్ విలేజ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐఓఏ అంతిమ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. 19 ఏళ్ల అంతిమ్ ఒలింపిక్స్ తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. టర్కీ రెజ్లర్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. -
Vinesh Phogat: స్పందించిన ఒలింపిక్ సంఘం.. కీలక వ్యాఖ్యలు
మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత వేటుపై భారత ఒలింపిక్ సంఘం(IOA) అధ్యక్షురాలు పీటీ ఉష స్పందించారు. ఇలాంటి పరిణామాన్ని అస్సలు ఊహించలేదని వాపోయారు. ఇలాంటి కఠిన సమయంలో భారత ఒలింపిక్ సంఘంతో పాటు ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుందని వినేశ్‌కు ధైర్యం చెప్పానన్నారువినేశ్ ఫొగట్ విషయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య న్యాయం కోసం యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు అప్పీలు చేసిందని పీటీ ఉష పేర్కొన్నారు. వినేశ్ విషయంలో తప్పక పోరాడతామని స్పష్టం చేశారు. వినేశ్ ఫొగట్‌ను నిర్ణీత బరువుకు తీసుకువచ్చేందుకు.. భారత వైద్య బృందం ఎంతగా శ్రమించిందో తనకు తెలుసనన్న ఉష.. రాత్రంతా ఆమె వర్కౌట్లు చేస్తూ గడిపిందని పేర్కొన్నారు. పోటీకి తనను తాను సన్నద్ధం చేసుకునేందుకు వినేశ్ ఎంతో కఠిన శ్రమకోర్చిందని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా ఒలింపిక్ విలేజ్‌కు వెళ్లి వినేశ్ ఫొగట్‌ను కలిశానని.. దేశమంతా తన వెంటే ఉందని భరోసా ఇచ్చినట్లు పీటీ ఉష తెలిపారు.వినేశ్ స్థానంలో ఫైనల్‌కు ఆమెకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం స్వర్ణ పతక పోటీలో పాల్గొనాల్సి ఉండగా.. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు వేశారు నిర్వాహకులు. 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంగా వినేశ్ పతక ఆశలు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో సెమీస్‌లో వినేశ్ ఫొగట్ చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్ ఫైనల్‌కు అర్హత సాధించినట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 11 ప్రకారం.. వినేశ్ స్థానంలో లోపెజ్కు ఈ అవకాశం దక్కినట్లు తెలిపారు. ఇక ప్రిక్వార్టర్స్ , క్వార్టర్స్‌లో వినేశ్ చేతిలో ఓడిన జపాన్ యూ సుసాకీ, ఉక్రెయిన్ ఒక్సానా లివాచ్ కాంస్య పతక పోరులో తలపడతారని పేర్కొన్నారు. #WATCH On Vinesh Phogat's disqualification, President of the Indian Olympic Association (IOA) PT Usha says, "Vinesh's disqualification is very shocking. I met Vinesh at the Olympic village polyclinic a short while ago and assured her complete support of the Indian Olympic… pic.twitter.com/hVgsPUb03y— ANI (@ANI) August 7, 2024 -
Paris Olympics:ఆంధ్రా టు పారిస్.. ఆడుదాం ఒలింపిక్స్
విజయవాడ స్పోర్ట్స్: ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్‌లో సత్తాచాటేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 26 నుంచి పారిస్‌లో ప్రారంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే భారత జట్లను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇటీవలే ప్రకటించింది. ఒలింపిక్స్‌లో జరిగే 32 క్రీడా పోటీలకు గానూ భారత్ నుంచి 16 క్రీడలకు ప్రాతినిధ్యం వహించే 113 మంది సభ్యుల జాబితాను ఐఓఏ ఇటీవల వెల్లడించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఏడుగురు చోటు దక్కించుకుని రాష్ట్ర క్రీడా ప్రతిష్టను దేశానికి చాటారు. రియో, టోక్యో ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటి పతకాలు సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది ఒలింపిక్స్ క్రీడల్లోనూ సత్తాచాటనుంది. పతాకధారిగా భారత జట్లను ముందుండి నడిపించే బాధ్యతను సింధుకు భారత ప్రభుత్వం అప్పగించింది. సింధూతో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిమహారాజ్, రికర్వ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, అథ్లెట్లు యర్రాజి జ్యోతి, దండి జ్యోతికశ్రీ, పారా రోవర్ కె.నారాయణ, పారా సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పారిస్ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు ఇప్పటికే కొందరు క్రీడాకారులు ఆ దేశానికి చేరుకున్నారు. రాష్ట్రంలో పెరిగిన క్రీడా ప్రమాణాలుగడిచిన ఐదేళ్లలో రాష్ట్ర యువతలో క్రీడా ప్రమాణాలు పెరిగాయనడానికి ప్రపంచ అత్యున్నత క్రీడా సంబరం ఒలింపిక్స్‌కు గతం కంటే రెట్టింపు సంఖ్యలో ఎంపికైన క్రీడాకారులే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి సింధు (బ్యాడ్మింటన్), శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), రజిని (హాకీ) ఎంపికయ్యారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), రజిని (హాకీ) ఎంపికయ్యారు. అయితే ఈ దఫా జరిగే ఒలింపిక్స్‌కు ఎంపికైన ఏడుగురు క్రీడాకారుల్లో ఐదుగురు కొత్త వారు ఉన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో ఎలాగైనా పతకం సాధించాలనే కసితో అథ్లెట్లు జ్యోతికశ్రీ, జ్యోతి, ఆర్చర్ ధీరజ్, పారా ఒలింపిక్స్ క్రీడాకారులు నారాయణ, అర్షద్ గత నాలుగేళ్లుగా కఠోర శిక్షణ తీసుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి క్రీడాకారులు సింధు, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, హాకీ క్రీడాకారిణి రజిని, సాత్విక్ సాయిరాజ్‌తో పాటు పలువురిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సన్మానించి, నగదు ప్రోత్సాహకాలు ఇచ్చారు. అంతేగాక అకాడమీ ఏర్పాటుకు భూములను కేటాయించారు. దీంతో జ్యోతి సురేఖకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ చొరవ, క్రీడాకారులకు లభిస్తున్న భరోసాతో క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్న యువత ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ తలుపులు తడుతున్నారు.స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధుఅంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు విజయవాడ వాసి. ఇప్పటి వరకు రెండు ఒలింపిక్ మెడల్స్ (రియో, టోక్యో)ను కైవసం చేసుకుంది. 2017లో ప్రపంచంలో రెండో ర్యాంక్ సాధించిన ఆమె ప్రస్తుతం 11వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఏషియన్ గేమ్స్‌లో రెండు, కామన్వెల్త్లో మూడు, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు సాధించింది. ఇప్పటి వరకు మొత్తం 454 మ్యాచ్‌లు ఆడింది. 2020లో పద్మభూషణ్, 2016లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, 2015లో పద్మశ్రీ, 2013లో అర్జున అవార్డులతో భారత ప్రభుత్వం అమెను సత్కరించింది.రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన సాత్విక్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌కు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ పోటీల్లో మూడు, కామన్వెల్త్లో రెండు, బ్యాడ్మింటన్ ప్రపంచ పోటీల్లో ఒకటి, థామస్ కప్ పోటీల్లో ఒక పతకం సాధించాడు. 2015 నుంచి 2019 వరకు జరిగిన 10 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సిరీస్‌లలో తలపడి టైటిల్స్ సాధించాడు. భారత ప్రభుత్వం అతన్ని మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డ్‌లతో సత్కరించింది. బొమ్మదేవర ధీరజ్విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ తన ఆరో ఏట నుంచే రికర్వ్ ఆర్చరీలో శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ 15వ ర్యాంక్, ఆసియాలో నాలుగో ర్యాంక్, ఇండియాలో నంబర్–1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. త్వరలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో రికర్వ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో, టీం విభాగంలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ పోటీల్లో ఒక పతకం, అంతర్జాతీయ పోటీల్లో నాలుగు, జాతీయ పోటీల్లో నాలుగు పతకాలు సాధించాడు. యర్రాజి జ్యోతివిశాఖపట్నానికి చెందిన యర్రాజి జ్యోతి అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో 10 పతకాలు, రెండు కామన్వెల్త్ పతకాలు, ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది. దండి జ్యోతికశ్రీపశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ఈ ఏడాది అథ్లెటిక్స్ 4(్ఠ)400 రిలే ఈవెంట్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటి వరకు ఆమె రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది. ఒలింపిక్స్ భారత జట్లకు జరిగిన పోటీల్లో విశేష క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పారిస్‌కు పయనమైంది.షేక్ అర్షద్నంద్యాల జిల్లాకు చెందిన షేక్ అర్షద్ పారా సైక్లింగ్ చాంపియన్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు జరిగిన పారా సైక్లింగ్ ఆసియా కప్ పోటీల్లో ఒక పతకం, అంతర్జాతీయ పోటీల్లో రెండు పతకాలు కైవసం చేసుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరిగే ఒలింపిక్స్‌లో తన సత్తా చాటేందుకు పారిస్‌కు పయనమవుతున్నాడు.కె.నారాయణకర్నూలుకు చెందిన కె.నారాయణ పారా ఒలింపిక్స్‌లో పారా రోవర్‌గా క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు అనేక జాతీయ, అంతర్జాతీయ పారా రోయింగ్ పోటీల్లో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పటి వరకు ఆరు అంతర్జాతీయ పతకాలు, నాలుగు జాతీయ పతకాలు సాధించాడు. -
Wrestling Federation of India: సస్పెన్షన్‌ను పట్టించుకోం... కమిటీని గుర్తించం!
న్యూఢిల్లీ: ఇంత జరిగినా కూడా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్ర క్రీడాశాఖ విధించిన సస్పెన్షన్‌ను పట్టించుకోమని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నియమించిన అడ్‌హక్ కమిటీని కూడా గుర్తించబోమని ధిక్కారపు ధోరణిని ప్రదర్శించారు. త్వరలోనే జాతీయ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్íÙప్ పోటీలను నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. ‘మేం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యాం. రిటరి్నంగ్ అధికారి దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేశారు. అలాంటి కార్యవర్గాన్ని ఎందుకు విస్మరిస్తారు. అడ్‌హక్ కమిటీతో మాకు సంబంధం లేదు. మా సమాఖ్యను మేమే నడిపించుకుంటాం త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పోటీల నిర్వహణపై నిర్ణయం కూడా తీసుకుంటాం’ అని సంజయ్ వెల్లడించారు. నియమావళిని అతిక్రమించలేదని ఇదివరకే క్రీడాశాఖకు సంజాయిషీ ఇచ్చామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. -
రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలు ఐఓఏకు అప్పగింత..
నూతనంగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటనల వల్ల కేంద్ర క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్(ఐఓఏ)కు కేంద్రం అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏకు క్రీడా శాఖ లేఖ రాసింది. రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ఐఓఏను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏంజరిగిందంటే? అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం సంజయ్ సింగ్.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఈ నెలాఖరులోపు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గల నందినగర్‌లో జరుగుతాయని ప్రకటించాడు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో నిబంధనలకు విరుద్దంగా ప్రకటన చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. ప్యానెల్ మొత్తంపై వేటు వేసింది. అదే విధంగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడింట్‌గా ఎంపిక కావడంపై రెజ్లర్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆట నుంచి తప్పుకోగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో క్రీడా శాఖ నిర్ణయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: Govt Suspends WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌పై వేటు -
రంగుల ఒలింపిక్స్ స్వప్నం
ఎప్పటి నుంచో వింటున్నదే... తెర వెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నదే... ఇప్పుడు అధికారి కంగా ఖరారైంది. 128 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్ళీ విశ్వక్రీడల్లో పునఃప్రవేశం చేయనుంది. మరో అయిదేళ్ళలో రానున్న 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈ ‘జెంటిల్మెన్ క్రీడ’ సహా స్క్వాష్, బేస్‌బాల్/ సాఫ్ట్‌బాల్, లక్రాస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ఆటలు అయిదింటిని అదనంగా ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న వేళ ఈ ప్రకటన రావడం విశేషం. ముంబయ్‌లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌లో 2036 నాటి ఒలింపిక్స్ నిర్వహణకు మన ప్రధాని బాహాటంగా ఉత్సుకతను వ్యక్తం చేశారు. ఆ వెంటనే రెండు రోజులకే ఒలింపిక్ కార్యక్రమ సంఘం అధ్యక్షుడు కార్ల్ స్టాస్ క్రికెట్‌కు ఒలింపియాడ్‌లో స్థానాన్ని ప్రకటించడం ఉత్సాహం నింపింది. కాలానికి తగ్గట్టు మారే ఈ ప్రయత్నం అభినందనీయమే. అదే సమయంలో ఇది పలు సవాళ్ళపై చర్చ రేపింది. ఎప్పుడో 1900లోనే తొలిసారిగా ప్యారిస్ ఒలింపిక్స్‌లోనే క్రికెట్ భాగమైంది. తర్వాత ఇన్నేళ్ళకు లాస్ ఏంజెల్స్‌లో మళ్ళీ తెరపైకి వస్తోంది. స్క్వాష్ సహా మిగతా 4 ఆటలకు విశ్వ క్రీడాంగణంలో ఇదే తెరంగేట్రం. ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా సంరంభం నుంచి ఇన్నేళ్ళుగా క్రికెట్‌ను దూరంగా ఉంచడం దురదృష్టకరమే! ఇప్పుడు టీ–20 క్రికెట్ విస్తృత ప్రాచుర్యం పొందడమే కాక మును పెన్నడూ లేని విధంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఆ ఫార్మట్ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో టీ–20 క్రికెట్‌కు కూడా చోటివ్వడం ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచన. తద్వారా ఒలింపిక్స్ మరింత చేరువవుతుంది. ఫుట్‌బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధికులు అనుసరించే క్రీడగా క్రికెట్ ప్రసార, ప్రచార హక్కులతో ఒలింపిక్ సంఘానికి వచ్చే ఆదాయం, అటు నుంచి భారత్‌కు లభించే వాటా సరేసరి. అందుకే, ఐఓసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా లెక్కలే ఉన్నాయి. అయితే చిన్న తిరకాసుంది. క్రికెట్ సహా కొత్తగా చేరే ఆటలన్నీ 2028 ఒలింపిక్స్‌కే పరిమితం. వాటిని తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆపైన 2032లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే బ్రిస్బేన్ నిర్ణయిస్తుంది. నిజానికి, కామన్వెల్త్ దేశాలే కాక, ప్రపంచమంతా ఆడే విశ్వక్రీడగా క్రికెట్ విస్తరించాల్సి ఉంది. ఐఓసీ గుర్తింపు పొందిన 206 దేశాల్లో ప్రస్తుతం 50 శాతాని కన్నా తక్కువ చోట్లే క్రికెట్ ఆడుతున్నారు. కనీసం 75 శాతం చోట్ల క్రికెట్ తన ఉనికిని చాటాల్సి ఉంది. అది ఓ సవాలు. కొన్ని ఐఓసీ సభ్యదేశాలు చేస్తున్న ఈ వాదన సబబే. అలాగే, కొత్తగా ఒలింపియాడ్లోకి వస్తున్న అయిదింటిలో నాలుగు... టీమ్ స్పోర్ట్స్. కాబట్టి, క్రీడాగ్రామంలో ఆటగాళ్ళ సంఖ్య అంగీకృత కోటా 10,500 కన్నా 742 మేర పెరుగుతుంది. గేమ్స్ విలేజ్‌పై భారం తగ్గించడానికి ఇతర ఆటల్లో అథ్లెట్ల కోటా తగ్గించడం, కొన్ని మెడల్ ఈవెంట్లను ఈసారికి పక్కనపెట్టడమే మార్గం. అది కొంత నిరాశే! అలాగే, ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునఃప్రవేశం బాగానే ఉంది కానీ, అగ్ర క్రికెటర్లు ఆ క్రీడాసంరంభంలో కాలుమోపుతారా అన్న అనుమానం పీడిస్తోంది. ఇటీవలి ఏషియన్ గేమ్స్ అనుభవమే అందుకు సాక్ష్యం. ఆసియా ఖండంలోని అధిక భాగం అగ్రశ్రేణి జట్లు ప్రధాన ఆటగాళ్ళను అక్కడకు పంపనే లేదు. అదేమంటే, దగ్గరలోనే 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఉందన్నాయి. ఇండియా అయితే ఏషియాడ్కి క్రికెట్ జట్టునే పంపకూడదనుకుంది. ఆఖరు క్షణంలో క్రికెట్ బోర్డ్ మనసు మార్చుకుంది. వచ్చే 2028 నాటి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ఇంకా ఖరారు కాలేదు గనక, ఆ ఏడాది జూలైలో 16 రోజుల పాటు సాగే ఒలింపిక్స్‌లో అగ్రతారలు ఆడేందుకు వీలుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని ఒలింపిక్ సంఘం ఆశాభావంలో ఉంది. గతంలో యూ23 అవతారంలో ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ ప్రయోగం చేశారు. కానీ, ఆదరణ, ఆదాయం అంతంతే! టెన్నిస్, గోల్ఫ్లను చేర్చుకున్నా, ప్రథమశ్రేణి పేర్లు కనపడలేదు. ఇక, వరు ణుడి కరుణపై ఆధారపడడం క్రికెట్‌కు మరో తలనొప్పి. తాజా ఏషియాడ్‌లో వాన వల్ల మ్యాచ్ రద్దయి, టీ20 ర్యాంకింగ్‌ను బట్టి స్వర్ణపతక విజేతను నిర్ణయించిన ప్రహసనం చూశాం. ఇక, 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేలా సర్వశక్తులూ ఒడ్డుతామని మోదీ ప్రకటించడం సంతోషమే అయినా, సాధ్యాసాధ్యాలపై అనుమానాలున్నాయి. జీ20 సదస్సు, ఏషియాడ్‌లో పతకాల శతకం తెచ్చిన ఉత్సాహంలో ప్రధాని దీన్ని ‘140 కోట్ల ప్రజల స్వప్నం’గా పేర్కొన్నారు. కానీ, వేల కోట్లతో స్టేడియమ్‌లు నిర్మించేకన్నా సామాన్యులకు కూడుగూడుపై దృష్టి పెట్టాలనే వాదనని విస్మరించలేం. భారీ ఖర్చు రీత్యా 2026 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి సైతం ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఇక, 2010లో మన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అప్పట్లో భారత ఒలింపిక్ అసోసియేషన్‌ను 14 నెలలు ఐఓసీ బహిష్కరించింది. అవన్నీ మనం మర్చి పోరాదు. 2035 నాటికి భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుందనీ, 2047కి అగ్రరాజ్యంగా అవతరిస్తామనీ జబ్బలు చరుస్తున్న వేళ ఒలింపిక్స్ స్వప్నం వసతులు పెంచుకోవడానికీ, క్రీడా ప్రతిభను పెంచిపోషించుకోవడానికీ ఉపయుక్తమే! దాని వెంటే ఉన్న సవాళ్ళతోనే సమస్య. తలసరి ఆదాయంలో మనల్ని ఎంతో మించిన లండన్, టోక్యో, ప్యారిస్, సియోల్లకున్న సహజ మైన సానుకూలత మనకుందా? సంబరం ముగిశాక ఏథెన్స్, రియో లాంటి ఆతిథ్య దేశాలకు ఐరావతాలుగా మారి క్రీడాంగణాల్ని వాడుకొనే ప్రణాళిక ఉందా? పేరుప్రతిష్ఠలతో పాటు ప్రజలకూ పనికొచ్చేలా వ్యూహరచన చేస్తేనే ఎంత రంగుల కలకైనా సార్థకత. -
హర్షనీయం.. ఒక్క బౌట్తోనే అర్హతకు అవకాశం
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై కొన్ని నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్న స్టార్ రెజ్లర్లకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హక్ కమిటీ గొప్ప ఊరటనిచ్చింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్‌లో ఆరుగురు రెజ్లర్లకు కేవలం ఒకే బౌట్ ద్వారా అర్హత పొందే అవకాశం కల్పించింది. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, బజరంగ్ పూనియా, జితేందర్ కిన్హాలు మిగతా సెలక్షన్ ట్రయల్స్ విజేతలతో తలపడి గెలిస్తే చాలు ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దీనికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన వీరంతా కేంద్ర క్రీడాశాఖను నేరుగా ఆయా క్రీడల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో స్టార్ రెజ్లర్ల విన్నపాన్ని కేంద్ర క్రీడాశాఖ, ఐఓఏ మన్నించాయి. అయితే ఈ నామమాత్ర బౌట్‌పై ఇతర ఔత్సాహిక రెజ్లర్లు విమర్శిస్తున్నారు. -
జూలై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జూలై 6వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజున ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం నియమించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మహేశ్ మిట్టల్ కుమార్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 23 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 28న వాటిని పరిశీలిస్తారు. జూలై 2న ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. -
WFI (రెజ్లింగ్ ఫెడరేషన్) ఎన్నికలకు ముహూర్తం ఖరారు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలు జులై 4న జరుగుతాయని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సోమవారం ప్రకటించింది. జమ్మూ అండ్ కశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ మిట్టల్ కుమార్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లు IOA తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో పదవీకాలాన్ని ( 3 విడతలు, 12 సంవత్సరాలు) పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. WFI ముందుగా మే 7న ఎన్నికల తేదీని ప్రకటించింది. అయితే వివాదాల నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఒప్పుకోలేదు. ఎన్నికలను నిర్వహించడానికి ఇద్దరు సభ్యుల తాత్కాలిక కమిటీని నియమించి, నూతనంగా ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది. కాగా, గత కొద్ది వారాలుగా భారత రెజ్లర్లు WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంతో పలు చర్చల అనంతరం రెజ్లర్లు ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ వరకు ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం ముందు రెజ్లర్లు ఐదు డిమాండ్లు ఉంచారు. అవేంటంటే.. 1.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి. 2.అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు. 3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. 4. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలి. 5.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి. చదవండి: డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్.. పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు..? -
‘నా అకాడమీని ఆక్రమిస్తున్నారు’
తిరువనంతపురం: అథ్లెటిక్ దిగ్గజం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కన్నీళ్ల పర్యంతమైంది. కోజికోడ్‌లోని తన అకాడమీలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి భద్రతపై కూడా ఉష తన బాధను వెల్లడించింది. ‘నా అకాడమీ మధ్యలోనే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మేం బౌండరీ నిర్మించుకునేందుకు కూడా అడ్డు పడుతున్నారు. అదేమని అడిగితే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశా ను. ఆయన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అకాడమీలోని 25 మంది మహిళా అథ్లెట్లలో 11 మంది ఉత్తరాదికి చెందినవారు. వారి భద్రత మాకు ముఖ్యం’ అని ఉష పేర్కొంది. సుమారు 30 ఎకరాల ఈ అకాడమీ స్థలాన్ని కేరళలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషకు 30 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చింది. గత జూలైలో రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత తనపై ఇలాంటి వేధింపులు పెరిగాయని ఉష చెబుతోంది. దురదృష్టవశాత్తూ ప్రతీ రాజకీయ పార్టీ తనను మరో పార్టీ సానుభూతిపరురాలిగా చూస్తోందని, అయితే తనకు ఎలాంటి రాజకీయాలు తెలియవని ఉష తన బాధను ప్రకటించింది. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. కీలక పరిణామం
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద మూడురోజులుగా ఆందోళన చేపట్టారు. గురువారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రెజ్లర్లు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో వినేశ్ పొగాట్, భజరంగ్ పూనియా సహా మిగతా రెజ్లర్లు శుక్రవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ)కు లేఖ రాశారు. తాజగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ఒలింపిక్ కమిటీ(ఐవోఏ) ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో మేరీకోమ్ సహా డోలా బెనర్జీ, అలకనంద ఆశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్‌లతో పాటు ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు. కాగా సభ్యుల్లో ఒకరైన సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ.. మేము ఆందోళన చేస్తున్న రెజ్లర్ల వాదనలు వింటాం. అభియోగాలను పరిశీలించిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన న్యాయం జరిగేలా చూస్తాం అని పేర్కొన్నారు. Indian Olympic Association (IOA) has formed a seven-member committee to probe the allegations of sexual harassment against WFI chief Brij Bhushan Sharan Singh. Members are Mary Kom, Dola Banerjee, Alaknanda Ashok, Yogeshwar Dutt, Sahdev Yadav and two advocates: IOA pic.twitter.com/BjuyEbUHZu — ANI (@ANI) January 20, 2023 చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?! ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ -
ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన మూడోరోజు కొనసాగింది. ఈ వ్యవహారంపై గురువారం కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనను మరింత ఉదృతం చేసిన రెజ్లర్లు శుక్రవారం భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ చేశారు. రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతకవలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు పీటీ ఉషకు రాసిన లేఖలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను నివేధించారు. కాగా ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ అంశం తనకు బాధ కలిగించిందని.. బాగా డిస్టర్బ్ చేసిందన్నారు. రెజ్లర్లు రాసిన లేఖ తనకు అందిందని.. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఐవోఏ ముందు రెజ్లర్లు ఉంచిన నాలుగు ప్రధాన డిమాండ్లు ► లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి. ► డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్‌భూషణ్ వెంటనే రాజీనామా చేయాలి. ► భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలి ► డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి @PMOIndia @AmitShah @ianuragthakur @PTUshaOfficial pic.twitter.com/PwhJjlawPg — Vinesh Phogat (@Phogat_Vinesh) January 20, 2023 రాజీనామా చేసే ప్రస్తకే లేదు: బ్రిజ్ భూషణ్ అంతకముందు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు.. ఎంపీ బ్రిజ్ భూషణ్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించిన ఆయన రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు.ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ మీడియాకు తెలిపారు. చదవండి: ‘సాయ్’ స్పందన సరిగా లేదు రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ -
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం!
2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీన్ని సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారు. జీ 20 ప్రెసిడెన్సీని భారత్ ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించగలిగినప్పుడు..ఐఓఏతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహించగలదని భావిస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒలింపిక్స్‌కు పూర్తిగా సిద్ధమైన తర్వాతనే భారత్ బిడ్ వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని.. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆతిథ్య నగరంగా మారుతుందని ఠాకూర్ చెప్పారు. గతంలో 1982 ఆసియా క్రీడలు, 2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైందన్నారు. -
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా గగన్ నారంగ్
భారత స్టార్ షూటర్.. ఒలింపిక్ అథ్లెట్ గగన్ నారంగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా గగన్ నారంగ్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్‌ను ద్రువీకరించారు. ఇక గగన్ నారంగ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. -
చరిత్ర సృష్టించిన దిగ్గజ అథ్లెట్.. కీలక పదవిలో పీటీ ఉష! ఏకగ్రీవ ఎన్నిక
PT Usha: దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నిక కానుంది. 58 ఏళ్ల ఉష ఆదివారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ల సమర్పణకు ఆదివారమే ఆఖరి రోజు. అయితే, ఉష మినహా మరెవరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఐఓఏ ప్రెసిడెంట్‌గా పీటీ ఉష ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. ఇక ఈ పదవి అధిరోహించనున్న మొదటి మహిళగా ఈ దిగ్గజ అథ్లెట్ చరిత్ర సృష్టించడం విశేషం. అయితే ఐఓఏలోని మిగతా 12 పదవుల కోసం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వచ్చే నెల 10న ఐఓఏ ఎన్నికలు జరుగుతాయి. పరుగుల రాణి.. తృటిలో పతకం చేజారినా కాగా కేరళకు చెందిన పీటీ ఉష సుమారు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిచెప్పింది. ఇక 25 ఏళ్ల కెరీర్లో పలు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో మొత్తంగా 102 పతకాలను గెలుచుకుంది ఉష. అయితే, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. క్రీడా రంగంలో తన వంతు సేవ చేసిన ఉష.. ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్.. ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందుడుగు వేసిన అఫ్గనిస్తాన్ -
పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అథ్లెట్స్ కమిషన్‌కు ఎన్నిక
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్‌కు ఎన్నికైంది. ఈ కమిషన్‌లో పది మంది క్రీడాకారులుంటారు. ఇందులో ఐదుసార్లు ప్రపంచ మహిళా బాక్సింగ్ విజేత మేరీకోమ్, వింటర్ ఒలింపియన్ శివ కేశవన్, మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), గగన్ నారంగ్ (షూటింగ్), వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), రాణి రాంపాల్ (మహిళా హాకీ), భవాని దేవి (ఫెన్సింగ్), భజరంగ్ లాల్ (రోయింగ్), ఓం కర్హన (షాట్‌పుట్)లు ఉన్నారు. లింగ వివక్షకు తావులేకుండా ఐదుగురు చొప్పున మహిళా, పురుష ప్లేయర్లకు ఐఓఏ కమిషన్‌లో సమ ప్రాధాన్యత ఇచ్చారు. పది మంది సభ్యులకు గాను సరిపడా నామినేషన్లు వేయడంతో వాళ్లంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐఓఏ వెల్లడించింది. కొత్త ఐఓఏ నియమావళి ప్రకారం ఈ కమిషన్ నుంచి ఇద్దరు సభ్యులు (పురుషుడు, మహిళ) ఐఓఏకు సంబంధించిన వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. ఐఓఏలోని సభ్యులకు ఉన్న ఓటింగ్ హక్కులు కమిషన్‌లోని ఇద్దరు సభ్యులకు ఉంటాయని ఐఓఏ వర్గాలు వెల్లడించాయి. -
జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులకు గడువు పెంపు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులు సమర్పించేందుకు కేంద్ర క్రీడాశాఖ తుది గడువును మూడు రోజులు పెంచింది. ఇంతకుముందు ప్రకటించినట్లు ఈ నెల 27తో గడువు ముగియగా... తాజాగా వచ్చే నెల 1వ తేదీ (శనివారం) వరకు అర్హత గల క్రీడాకారులు, కోచ్‌లు, సంఘాలు, యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నుంచి క్రీడాశాఖకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్‌లో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ‘భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్యలు, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ నామినేషన్లను అక్టోబర్ 1లోపు ఆన్లైన్లో పంపాలి’ అని కేంద్ర క్రీడాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడిగా వైదొలిగిన అనిల్ ఖన్నా
స్పోర్ట్స్ సీనియర్ అథారిటీ అనిల్ ఖన్నా బుధవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. తాత్కాల్కిక అధ్యక్షునిగా అనిల్ ఖన్నాను గుర్తించలేమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) గతంలో స్పష్టం చేసింది. ఈ మేరకే ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఇక డిసెంబర్ కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకపోతే భారత్ నిషేధిస్తామని ఐఓసీ ఈ నెల 8న హెచ్చరించింది. అనిల్ ఖన్నా మాట్లాడుతూ.. ''ఐవోసీ ఒప్పుకోకపోవడంతో తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నా. ప్రస్తుతం ఐఓఏ క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఐఓఏ కార్యకలాపాలను సాధారణ స్థితికి తేవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృష్టి చేస్తోంది. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారని ఆశిస్తున్నా'' అంటూ తెలిపాడు. -
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సుమారివాలా
Adille Sumariwalla Appointed As Interim President Of Indian Olympic Association: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు, మాజీ ఒలింపియన్ ఆదిల్ సుమారివాలా ఎన్నికయ్యారు. వ్యక్తిగత కారణాల చేత మాజీ అధ్యక్షుడు నరిందర్ బత్రా రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని సుమారివాలా భర్తీ చేయనున్నారు. ఎన్నికలు జరిగే వరకు సుమారివాలా ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఐవోఏ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు సుమారివాలా అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఈ నియామకం జరిగినట్లు ఐవోఏ వెల్లడించింది. కాగా, భారత ఒలింపిక్ సంఘం చరిత్రలో ఓ ఒలింపియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆదిల్ సుమారివాలా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున అథ్లెటిక్స్‌లో (100 మీటర్ల రన్నింగ్) ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత -
Commonwealth Games 2022: విజేతలకు ఐఓఏ నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఘనంగా సత్కరించింది. నగదు పురస్కారాలతో వారిని గౌరవించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 7.5 లక్షల చొప్పున ఐఓఏ అందించింది. ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ ఖన్నా, రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించింది. -
పీవీ సింధుకు అరుదైన గౌరవం
బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు రేపటి (జులై 28) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మహా క్రీడా సంగ్రామానికి సంబంధించి ప్రారంభ వేడుకలు (ఓపెనింగ్ సెర్మనీ) కూడా రేపే ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు మొదలవుతాయి. గాయం కారణంగా భారత పతాకధారి నీరజ్ చోప్రా ఈ ఈవెంట్ నుంచి తప్పుకోవడంతో ఓపెనింగ్ సెర్మనీలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) బుధవారం (జులై 27) వెల్లడించింది. రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్ సాధించిన సింధుకు గతంలో పలు సందర్భాల్లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని టీమిండియాను లీడ్ చేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉంటే, 72 దేశాల నుంచి 5 వేలకుపైగా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. 12 రోజుల పాటు (జులై 28- ఆగస్ట్ 8) 20 క్రీడా విభాగాల్లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. 18వ సారి ఈ ఈవెంట్లో పాల్గొంటున్న భారత్.. మొత్తం 16 విభాగాల్లో 214 మంది అథ్లెట్లతో పోటీపడుతుంది. భారత్ బంగారు పతకాలు సాధించే అవకాశం ఉన్న విభాగాల్లో మహిళల బ్యాడ్మింటన్ కూడా ఒకటి. ఈ ఈవెంట్‌కు ముందే సింగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న సింధు ఈసారి తప్పక గోల్డ్ సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. సింధు గత కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. చదవండి: పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్వెల్త్ గ్రామంలోకి కోచ్‌కు అనుమతి