
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జూలై 6వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజున ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం నియమించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మహేశ్ మిట్టల్ కుమార్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 23 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 28న వాటిని పరిశీలిస్తారు. జూలై 2న ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు.