![We Donot Recognise Ad-Hoc Panel says Sanjay Singh Defies WFI Suspension - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/2/SANJAY-SINGH-NEW-WFI-CHIEF.jpg.webp?itok=meYux_U1)
న్యూఢిల్లీ: ఇంత జరిగినా కూడా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్ర క్రీడాశాఖ విధించిన సస్పెన్షన్‌ను పట్టించుకోమని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నియమించిన అడ్‌హక్ కమిటీని కూడా గుర్తించబోమని ధిక్కారపు ధోరణిని ప్రదర్శించారు. త్వరలోనే జాతీయ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్íÙప్ పోటీలను నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు.
‘మేం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యాం. రిటరి్నంగ్ అధికారి దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేశారు. అలాంటి కార్యవర్గాన్ని ఎందుకు విస్మరిస్తారు. అడ్‌హక్ కమిటీతో మాకు సంబంధం లేదు. మా సమాఖ్యను మేమే నడిపించుకుంటాం త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పోటీల నిర్వహణపై నిర్ణయం కూడా తీసుకుంటాం’ అని సంజయ్ వెల్లడించారు. నియమావళిని అతిక్రమించలేదని ఇదివరకే క్రీడాశాఖకు సంజాయిషీ ఇచ్చామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment