Union Sports Department
-
Wrestling Federation of India: సస్పెన్షన్‌ను పట్టించుకోం... కమిటీని గుర్తించం!
న్యూఢిల్లీ: ఇంత జరిగినా కూడా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్ర క్రీడాశాఖ విధించిన సస్పెన్షన్‌ను పట్టించుకోమని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నియమించిన అడ్‌హక్ కమిటీని కూడా గుర్తించబోమని ధిక్కారపు ధోరణిని ప్రదర్శించారు. త్వరలోనే జాతీయ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్íÙప్ పోటీలను నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. ‘మేం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యాం. రిటరి్నంగ్ అధికారి దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేశారు. అలాంటి కార్యవర్గాన్ని ఎందుకు విస్మరిస్తారు. అడ్‌హక్ కమిటీతో మాకు సంబంధం లేదు. మా సమాఖ్యను మేమే నడిపించుకుంటాం త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పోటీల నిర్వహణపై నిర్ణయం కూడా తీసుకుంటాం’ అని సంజయ్ వెల్లడించారు. నియమావళిని అతిక్రమించలేదని ఇదివరకే క్రీడాశాఖకు సంజాయిషీ ఇచ్చామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. -
జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులకు గడువు పెంపు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులు సమర్పించేందుకు కేంద్ర క్రీడాశాఖ తుది గడువును మూడు రోజులు పెంచింది. ఇంతకుముందు ప్రకటించినట్లు ఈ నెల 27తో గడువు ముగియగా... తాజాగా వచ్చే నెల 1వ తేదీ (శనివారం) వరకు అర్హత గల క్రీడాకారులు, కోచ్‌లు, సంఘాలు, యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నుంచి క్రీడాశాఖకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్‌లో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ‘భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్యలు, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ నామినేషన్లను అక్టోబర్ 1లోపు ఆన్లైన్లో పంపాలి’ అని కేంద్ర క్రీడాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
అథ్లెట్ జైషా ఆరోపణలపై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో మారథాన్ అథ్లెట్ ఓపీ జైషాకు రేసులో కనీసం మంచి నీళ్లు కూడా దొరకని ఘటనపై కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఓంకార్ కేడియా, డెరైక్టర్ వివేక్ నారాయణ్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది. వారం రోజుల్లో వీరు నివేదిక అందించాల్సి ఉంది. ఒలింపిక్స్‌లో జరిగిన మహిళల మారథాన్ పోటీలో పాల్గొన్న ఓపీ జైషాకు కనీసం మంచినీళ్లను కూడా అందుబాటులో ఉంచలేదు. సుదీర్ఘమైన ఈ పోటీ సందర్భంగా అథ్లెట్ల కోసం ప్రతీ 2.5 కి.మీ దూరంలో ఆయా దేశాలు ఆహారం, నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్‌తో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేస్తుంటాయి. కానీ భారత్ స్టాల్స్ అన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో జైషా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఓ వైపు విపరీతమైన ఎండ కాస్తుండగా, ఆమె దాహంతో అలమటించాల్సి వచ్చింది. చివరికి రేసు పూర్తి చేసినా డీహైడ్రేషన్‌కు గురై అపస్మారక స్థితిలో కుప్పకూలింది. అయితే జైషా ఆరోపణలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఖండించింది. రేసుకు ముందురోజే ఆమెను కలిసి నీటి ఏర్పాట్లు చేస్తామని చెప్పగా ఆమె తిరస్కరించిందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.