న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులు సమర్పించేందుకు కేంద్ర క్రీడాశాఖ తుది గడువును మూడు రోజులు పెంచింది. ఇంతకుముందు ప్రకటించినట్లు ఈ నెల 27తో గడువు ముగియగా... తాజాగా వచ్చే నెల 1వ తేదీ (శనివారం) వరకు అర్హత గల క్రీడాకారులు, కోచ్‌లు, సంఘాలు, యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది నుంచి క్రీడాశాఖకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్‌లో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ‘భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్యలు, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ నామినేషన్లను అక్టోబర్ 1లోపు ఆన్‌లైన్లో పంపాలి’ అని కేంద్ర క్రీడాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment