Last date extend
-
జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులకు గడువు పెంపు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులు సమర్పించేందుకు కేంద్ర క్రీడాశాఖ తుది గడువును మూడు రోజులు పెంచింది. ఇంతకుముందు ప్రకటించినట్లు ఈ నెల 27తో గడువు ముగియగా... తాజాగా వచ్చే నెల 1వ తేదీ (శనివారం) వరకు అర్హత గల క్రీడాకారులు, కోచ్‌లు, సంఘాలు, యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నుంచి క్రీడాశాఖకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్‌లో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ‘భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్యలు, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ నామినేషన్లను అక్టోబర్ 1లోపు ఆన్లైన్లో పంపాలి’ అని కేంద్ర క్రీడాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఏప్రిల్ జీఎస్టీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పోర్టల్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఏప్రిల్ నెల జీఎస్టీఆర్–3బీ ఫారం దాఖలుకు గడువును మే 24 వరకూ కేంద్రం పొడిగించింది. అలాగే సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ పోర్టల్‌ను తీర్చిదిద్దిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ను ఆదేశించింది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ మేరకు ట్వీట్ చేసింది. అంతకు ముందు .. ఏప్రిల్ నెల జీఎస్టీఆర్–2బీ జనరేట్ కావడంలోనూ, జీఎస్టీఆర్–3బీ ఆటోమేటిక్‌గా రూపొందటంలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఇ న్ఫీ రిపోర్ట్ చేసినట్లు సీబీఐసీ తెలిపింది. దీం తో సదరు లోపాలను సరిచేయాలంటూ కంపెనీని ప్రభుత్వం ఆదేశించిందని, సాంకేతిక బృందం దీనిపై పని చేస్తోందని ఒక ట్వీట్లో పేర్కొంది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ప్రతి నెలా 20, 22, 24 తారీఖుల్లో జీఎస్టీఆర్–3బీని దాఖలు చేయాల్సి ఉంటుంది. విక్రయాలకు సంబంధించిన జీఎస్టీఆర్–1 ఆధారంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) స్టేట్మెంట్ అయిన జీఎస్టీఆర్–2బీ రూపొందుతుంది. ఇది తదుపరి నెల 12వ రోజు నాటికి వ్యాపార సంస్థలకు అందుబాటులోకి వస్తుంది. పన్నుల చెల్లింపు సమయంలో ఐటీసీని క్లెయిమ్ చేయడానికి, జీఎస్టీఆర్–3బీని దాఖలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చదవండి: పప్పు, ఉప్పు, సబ్బు.. ధరలన్నీ మండుతున్నాయ్ -
అదనపు ఛార్జీలు లేకుండా పన్ను చెల్లింపు .. సెఫ్టెంబరు 30 వరకే ఛాన్స్!
వివాద్ సే విశ్వాస్ పథకం కింద ఎటువంటి వంటి అదనపు చార్జీలు లేకుండా పన్ను చెల్లించడానికి ఉన్న ఆఖరు తేదిని ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకటించింది. వివాద్ సే విశ్వాస్ ద్వారా పన్ను చెల్లింపులో భాగంగా ఫారమ్ 3 వల్ల ఇబ్బందులు ఎదురైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకటించింది. అదనపు ఛార్జీలతో పన్నులు చెల్లించేందుకు అక్టోబరు 31కే చివరి తేది అని, ఇకపై గడువు పొడగింపులు ఉండవని సీబీడీటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 29న సీబీడీటీ ప్రకటన జారీ చేసింది. Date of payment under the Direct Tax Vivad se Vishwas Act, 2020 (without additional amount) extended to 30th September, 2021. The last date for payment of the amount (with additional amount) remains 31st October, 2021. Press release issued. pic.twitter.com/gNPPUEbEEF — Income Tax India (@IncomeTaxIndia) August 29, 2021 చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ -
నేడే నామినేషన్ల సమర్పణకు చివరి రోజు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల సందర్భంగా వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సోమవారం (నేడు) చివరి రోజు. మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల, ఇతర పార్టీల వారు సోమవారం నామినేషన్ సమర్పించేందుకు సమాయత్తమవుతున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా, ఖమ్మం నుంచి బరిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా, ఇంకా మహా కూటమి మద్దతుతో నామా నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇంకా బీఎల్ఎఫ్–సీపీఎం కూటమి నుంచి పోటీ చేస్తున్న ఖమ్మం, పాలేరు అభ్యర్థులు పాల్వంచ రామారావు, బత్తుల హైమావతిలు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ప్రక్రియ 19వ తేదీ (సోమవారం)తో ముగియనుంది. ఇన్నిరోజులుగా అధికారులు నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకున్నారు. చివరిరోజు కూడా ఇదే సమయాన్ని పాటించనున్నారు. గడువు ముగుస్తుండడంతో అభ్యర్థులు సరైన పత్రాలతో సంబంధిత కార్యాలయం లోపలికి చేరుకోవాల్సి ఉంటుంది. సమయాన్ని మూడు గంటల వరకే కుదించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావాహులు తిరుగుబాటు అభ్యర్థులుగా, మరికొందరు స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక గడువు ముగుస్తుండడంతో ఈ నెల 22వ తేదీ వరకు ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ గడువు విదించింది. నామినేషన్‌కు చివరిరోజు కావడంతో ప్రధాన అభ్యర్థులు....తిరుగుబాటు, స్వతంత్ర అభ్యర్థులను అనునయించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంరూరల్ తహసీల్దార్ కార్యాలయంలో, పువ్వాడ అజయ్‌కుమార్ అర్బన్తహసీల్దార్ కార్యాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దాఖలైన పత్రాలన్నింటినీ 20వ తేదీన ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. -
ఉపకారవేతనాల దరఖాస్తుకు మరో అవకాశం!
సాక్షి, హైదరాబాద్ : పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణకు మరో అవకాశం ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారంతో ముగిసింది. దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ సంక్షేమ శాఖలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13.10 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. దరఖాస్తు గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించలేదు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం, అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 21 వేల మంది విద్యార్థులుంటారని కళాశాల యాజమాన్యాల సంఘం అంచనాలు వేసింది. దరఖాస్తు గడువు తేదీ ముగియడంతో ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు నమోదును ప్రభుత్వం నిలిపివేసింది. ఈ క్రమంలో తమ దరఖాస్తులు స్వీకరించాలంటూ ఎస్సీ అభివృద్ధి శాఖకు విద్యార్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు విద్యార్థులు సంబంధిత అధికారులను సంప్రదిస్తుండగా.. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు సైతం దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. కనీసం వారం పాటు దరఖాస్తుకు అవకాశం ఇస్తే ప్రత్యేక శ్రద్ధతో పూర్తిస్థాయిలో దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యాల సంఘాలు లిఖితపూర్వకంగా లేఖలు సమర్పించాయి. ఈ క్రమంలో వారికి అవకాశం ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
'వరద' జిల్లాల్లో ఇంటర్ ఫీజు గడువు పొడిగింపు
హైదరాబాద్ : వరద ప్రభావిత జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డ్ డిసెంబర్ 10 వరకు పెంచింది. ఈమేరకు బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్ధులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా 10వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని సూచించారు.