మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ తన చర్యతో మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రశ్న అడిగిన పాపానికి ఒక మహిళా జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించడమే గాక మైక్‌ను విరగ్గొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిజ్‌భూషణ్ చర్యపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విషయంలోకి వెళితే.. ప్రముఖ న్యూస్ చానెల్‌కు చెందిన రిపోర్టర్.. ''రెజ్లర్లకు లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసులు మీపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.. నేరం రుజువైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారా'' అంటూ ప్రశ్నించింది. రిపోర్టర్ ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిజ్‌భూషణ్.. ''నేనెందుకు రాజీనామా చేస్తాను.. నా రాజీనామా గురించి ఎందుకడుగుతున్నారు''' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
''అనంతరం మీపై చార్జ్‌షీట్ లు ఫైల్ అయ్యాయి.. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది'' అని అడగ్గా.. బ్రిజ్‌భూషణ్ రిపోర్టర్‌వైపు ఉరిమి చూస్తూ ''చుప్(Shut Up)'' అంటూ కారు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో రిపోర్టర్ తన ప్రశ్నకు జవాబు చెప్పాలంటూ మైక్‌ను కారు డోరులో పెట్టింది. దీంతో కోపంతో మైక్‌పై నుంచే డోర్‌ను గట్టిగా వేశాడు. దీంతో రిపోర్టర్ చేతికి గాయమవ్వగా.. మైక్ విరిగిపోయింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేయగా ట్రెండింగ్‌గా మారింది.
#LIVE कैमरे पर एक महिला पत्रकार से पहलवानों के साथ उत्पीड़न का आरोपी भाजपाई सांसद धमका रहा है, उनका माइक तोड़ रहा है,
— Srinivas BV (@srinivasiyc) July 11, 2023
क्या महिला बाल विकास मंत्री @smritiirani बता सकती है ये किसके शब्द है? किसके संस्कार है? pic.twitter.com/689KVkrBRg
बृजभूषण का ऑन कैमरा जब एक महिला पत्रकार के साथ ऐसा व्यवहार है तो ऑफ कैमरा आप ख़ुद समझ लें. #BrijBhushanSharanSingh pic.twitter.com/UdvtUhTZSH
— Vividha (@VividhaOfficial) July 11, 2023
ఇక మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ పై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సుమారు 108 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్ (chargesheet)లో తెలిపారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
కాగా ఢిల్లీ కోర్టు గత శుక్రవారం బ్రిజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ పలుమార్లు ఖండించారు.
చదవండి: Ashes 2023: 'అరె శాండ్‌పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్
Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే'
Comments
Please login to add a commentAdd a comment