పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై భారత ఒలింపిక్ సంఘం (IOA) చర్యలు తీసుకుంది. అంతిమ్‌పై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. అంతిమ్‌తో పాటు ఆమె సహాయక సిబ్బంది మొత్తాన్ని తక్షణమే స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘం ఆదేశించింది.
అంతిమ్ అక్రిడేషన్‌పై ఆమె సోదరి ఒలింపిక్ విలేజ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐఓఏ అంతిమ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. 19 ఏళ్ల అంతిమ్ ఒలింపిక్స్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. టర్కీ రెజ్లర్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment