రామచంద్రన్‌కు ఐఓఏ పగ్గాలు | Indian Olympic Association set to appoint Ramachandran as president | Sakshi

రామచంద్రన్‌కు ఐఓఏ పగ్గాలు

Published Sun, Jan 26 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

రామచంద్రన్‌కు ఐఓఏ పగ్గాలు

రామచంద్రన్‌కు ఐఓఏ పగ్గాలు

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పగ్గాలు నారాయణ రామచంద్రన్ చేపట్టనున్నారు. దీంతో పాటు ప్రధాన కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులకూ కేవలం లాంఛనమైన ప్రకటనే మిగిలుంది. భారత స్క్వాష్ రాకెట్ సమాఖ్య (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రామచంద్రన్ బీసీసీఐ చీఫ్ ఎన్.శ్రీనివాసన్‌కు స్వయానా సోదరుడు.
 
 వచ్చే నెల 9న జరిగే ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు శనివారం చివరి రోజు కావడంతో రామచంద్రన్ ఎన్నిక ఖరారైంది. ఐఓఏ సీని యర్ సభ్యుడైన ఆయన 2008-2012 వరకు సంఘం కోశాధికారిగా పనిచేశారు. హాకీ ఇండియా అసోసియేట్ ఉపాధ్యక్షుడు రాజీవ్ మెహతా కూడా ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా టెన్నిస్ సంఘం చీఫ్ అనిల్ ఖన్నా కోశాధికారిగా, వీరేంద్ర నానవతి సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement