Ramachandran
-
మారడోనా టు పారషూట్
ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కోవాలి అన్నట్టు.. నటి శరణ్య రామచంద్రన్ నాయర్ కూడా ఎక్కడైతే తన నటనపై విమర్శలను ఎదుర్కొందో అక్కడే ప్రశంసలను అందుకోవాలని నిశ్చయించుకుంది. సినిమాలు, సిరీస్‌లలో అభినయిస్తూ ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె గురించి కొన్ని విషయాలు..శరణ్య పుట్టి, పెరిగిందంతా కేరళలోని తిరువనంతపురంలో. ఎమ్బీఏ చేస్తున్నప్పుడు పాకెట్ మనీ కోసం మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎమ్బీఏ పూర్తయిన తర్వాత సొంత బిజినెస్ మొదలుపెట్టాలనుకుంది. వరుస మోడలింగ్ అవకాశాలతో ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. మరెన్నో ఫొటో షూట్స్‌తో బిజీగా మారింది. అలా ఓ యాడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్ వచ్చింది.ఒక్క సినిమా చేసి వెళ్లిపోదాం అనుకుంది. కానీ, ఆ చిత్రం ‘మారడోనా’ పెద్దగా ఆడలేదు. శరణ్య యాక్టింగ్‌పై కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో, నటిగా తనేంటో నిరూపించుకోవాలని నిశ్చయించుకుంది.తను నటించిన ‘టూ స్టేట్స్’, ‘మై నేమ్ ఈజ్ అళగన్’, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా పరవాలేదు అనిపించాయి. ‘ఝాన్సీ’ సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగు పెట్టి తెలుగు వీక్షకులకూ పరిచయమైంది.ప్రస్తుతం తను నటించిన ‘పారషూట్ ’ సిరీస్ తెలుగు, తమిళ, మలయాళంతో పాటు పలు భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. వీక్షకాదరణ పొందుతోంది.ఆనందం అనేది ఎవరో ఇస్తే రాదు. మనలోనే ఉంటుంది. అందుకే నేనెప్పుడూ నా మనసు చెప్పిందే వింటాను.– శరణ్య రామచంద్రన్ నాయర్. -
MR Jyothy: తండ్రి మెచ్చిన తనయ
ఎంబీఏ చేసిన ఎంఆర్ జ్యోతి వ్యాపార పాఠాలను కళాశాలలో కంటే తండ్రి రామచంద్రన్ అడుగు జాడల్లో నుంచే ఎక్కువగా నేర్చుకుంది. అయిదువేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ‘జ్యోతి ల్యాబ్స్’ను వేల కోట్ల టర్నోవర్‌కి తీసుకువెళ్లాడు ఎంపీ రామచంద్రన్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కంపెనీని మరోస్థాయికి తీసుకువెళుతోంది. ‘తండ్రి మెచ్చిన తనయ’ అనిపించుకుంది... తండ్రి అయిదు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు జ్యోతి వయసు అయిదు సంవత్సరాలు. త్రిసూర్ (కేరళ)లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంత కష్టపడ్డాడో జ్యోతికి కళ్లకు కట్టినట్లుగా గుర్తుంది. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకున్న తండ్రి ఇటుకా ఇటుకా పేర్చి కంపెనీని బలోపేతం చేశాడు. సెలవు అంటూ లేకుండా వారానికి ఏడు రోజులూ పనిచేసేవాడు. ప్రాడక్ట్స్ లోడింగ్ నుంచి పత్రికలకు ఇచ్చే అడ్వరైజ్మెంట్ల వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. సింగిల్ ప్రాడక్ట్ ‘ఉజాల’తో మొదలైన కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘జ్యోతి ల్యాబ్స్’ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో ఆరుగురు మహిళల బృందం ఇంటింటికీ తిరిగి ‘ఉజాల’ అమ్మేవారు. కట్ చేస్తే... 2005లో కంపెనీ మార్కెటింగ్ విభాగంలో చేరింది జ్యోతి. ఆ తరువాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. 2020లో కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించింది. బాధ్యతలు చేపట్టడానికి ముందు తరువాత అనే విషయాకి వస్తే ఎండీగా కంపెనీ ఆదాయాన్ని పెంచింది. నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి రెండో తరం ఎంటర్ ప్రెన్యూర్ అయిన జ్యోతి నిర్మాణాత్మకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రాడక్ట్ ఇన్నోవేషన్స్. అడ్వర్టైజింగ్ ప్లాన్స్ వరకు ఎన్నో విషయాలపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధాన ఆధారం... ఫ్యాబ్రిక్ కేర్, డిష్ వాషింగ్ ప్రాడక్ట్స్. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది జ్యోతి. గత సంవత్సరం కంపెనీ మార్గో సోప్ మూడు వేరియంట్స్‌ను లాంచ్ చేసింది. పర్సనల్ కేర్‌కు సంబంధించి ఇతర విభాగాలను కూడా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కంపెనీ. బహుళజాతి సంస్థల నుంచి పోటీ తట్టుకొని మార్కెట్లో ఛాలెంజర్ బ్రాండ్‌గా నిలవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ‘ఇక తిరుగులేదు’ అంటూ ఆ ఆత్మవిశ్వాసం ఎక్కువైతే మార్కెట్లో ఒక్కో మెట్టు కిందకు దిగక తప్పదు. అందుకే ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకుంది జ్యోతి. గతంలోలాగా భవిష్యత్ ఉండకపోవచ్చు. భారీ సవాళ్లు ఎదురు కావచ్చు. జ్యోతి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దార్శనిక దృష్టితో ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది. కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో చేరిన కొత్తలో తండ్రితో కలిసి దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లు, రిటైలర్లు, స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించి ఎన్నో మీటింగ్‌లలో పాల్గొంది. ప్రతి మీటింగ్ ఒక పాఠశాలగా మారి తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ‘గతమెంతో ఘనకీర్తి’ అని గతంలోనే ఉండిపోకుండా ‘ట్యూన్ విత్ ది చేంజింగ్ టైమ్స్’ అంటున్న జ్యోతి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం (ఉదా: రియల్–టైమ్ డేటాను ఉపయోగించడం) ఆటోమేటింగ్ ప్రాసెస్, ఓపెన్ డోర్ కల్చర్ వరకు ఎన్నో ఆధునిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలంతో గొంతు కలుపుతూనే ఉంది. గెలుపుదారిలో కొత్త ఉత్సాహంతో ప్రయాణిస్తూనే ఉంది. -
కష్టకాలంలోనూ ఎగురుతున్న గుర్రాలు
కనీసం వందకోట్ల డాలర్ల విలువను సాధించగలిగిన స్టార్టప్ సంస్థలను యూనికార్న్‌లు అంటున్నారు. 2022 నాటికి భారత్ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇవి ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత ఎక్కువ యూనికార్న్‌లను కలిగిన దేశం మనదే. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను వీటి అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ వ్యాప్తి గురించి అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. ఉక్రెయిన్‌లో సైనిక సంఘర్షణ, పెరుగుతున్న అంతర్జాతీయ వడ్డీరేట్లు అనే ద్వంద్వ తాకిడి నుంచి కోలుకోవడానికి ఆర్థిక వ్యవస్థ మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ, ఒక రంగం మాత్రం శరవేగంగా పెరుగుతోంది. బాహ్య పరిణామాలకు ఈ రంగం ఏమాత్రం ప్రభావితం కానట్లు కనిపిస్తోంది. ఆ రంగం ఏదో కాదు, యూనికార్న్‌లు అని పేరొందిన భారీ స్టార్టప్ సంస్థలు. ఈ సంవత్సరం భారత్ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. 2011లో దేశంలో తొలి స్టార్టప్ వెంచర్ యూనికార్న్‌గా మారి దశాబ్దం గడిచింది. ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత యూనికార్న్ సంస్థలు అధికంగా ఉన్న మూడో దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఉమ్మడిగా చూస్తే ఈ వంద స్టార్టప్ సంస్థలు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వీటి మొత్తం విలువ ఇప్పుడు 333 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఒక బిలియన్ డాలర్ల విలువను మార్కెట్లో సాధించిన స్టార్టప్ కంపెనీని యూనికార్న్ అని పిలుస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం ఇలాంటి వెంచర్లు చాలా అరుదుగా ఉండేవి కాబట్టి పూర్వకాలపు పౌరాణిక ఒంటికొమ్ము రెక్కల గుర్రాల్లాగా వీటిని వర్ణించేవారు. కానీ ఇప్పుడు, అమెరికా 487 యూనికార్న్ సంస్థలనూ, చైనా 301 సంస్థలనూ కలిగి ఉన్నాయి. ఇప్పుడు యూనికార్న్ అనే పదం డెకాకార్న్ వరకు విస్తరిస్తోంది. అంటే కనీసం 10 బిలియన్ డాలర్ల విలువ గల సంస్థలుగా ఇవి ఎదుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఫ్లిప్‌కార్ట్, నైకా, బైజూస్, స్విగ్గీ వంటి కొన్ని స్టార్టప్ సంస్థలు 10 బిలియన్ డాలర్ల నిధులు సేకరించిన వెంచర్లుగా నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2020 సంవత్సరం నుంచే యూనికార్న్ వెంచర్లు బాగా పెరుగుతూండటమే. మరో మాటలో చెప్పాలంటే, మహమ్మారి తర్వాతే ఇవి విస్తరిస్తున్నాయి. ఆ సంవత్సరం దేశంలో 11 యూనికార్న్ సంస్థలు ఆవిర్బవించాయి. 2021లో వీటి సంఖ్య రికార్డు స్థాయిలో 44. ఈ ఏడాది గత ఆరునెలల కాలంలో 16 ఏర్పడటం విశేషం. ‘ఇంక్42’ సంస్థ ప్రకారం, 2025 నాటికి దేశంలో 250 యూనికార్న్‌లు ఏర్పడతాయని అంచనా. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల యూనికార్న్‌లలో ఫండింగ్ కాస్త తగ్గుముఖం పట్టింది కానీ, 2022లో కూడా ఇన్నోవేషన్, స్టార్టప్‌ల ఎకో–సిస్టమ్ ఇప్పటికీ వికాస దశలోనే సాగుతోంది. ఫండింగ్‌కి సంబంధించి కాస్త ఆందోళన ఉన్నప్పటికీ అనేక స్టార్టప్‌లు ఈ సంవత్సరం కూడా యూనికార్న్ క్లబ్లో చేరనున్నాయి. మహమ్మారి కాలంలో ఆఫీసుకు నేరుగా వెళ్లి పనిచేసే పద్ధతి నుంచి, ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి ప్రపంచం మారిపోయింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి... ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లవైపు సృజనాత్మక ఆవిష్కరణలను మళ్లించింది. ఇళ్లనుంచి బయటకు వెళ్లడంలో అవరోధాలు ఏర్పడటంతో ప్రజాజీవితంలో ఇంటర్నెట్ మరింత పెద్ద పాత్ర వహించే స్థాయికి పరిణమించింది. కాబట్టి రిటైల్ కొనుగోళ్లు చేయడం, ఆర్థిక లావాదేవీలను సాగించడం, బిజినెస్‌ను నిర్వహించడంతో పాటు విద్య సైతం ఆన్లైన్ యాక్టివిటీగా మారిపోయింది. పేటీఎం, మొబివిక్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీల ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తృతరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్కెట్ వంటి తాజా స్టార్టప్‌లు దేశంలోని 2వ, 3వ శ్రేణి నగరాల్లో వేగంగా విస్తరించాయి. యూనికార్న్ ప్రపంచం విస్తరణకు మరొక కారణం సులభమైన ఫండింగ్. దేశంలో డిజిటల్ ఎకో సిస్టమ్ విస్తరణకు అపారమైన అవకాశం ఉంటుందని మదుపుదారులు గ్రహిస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి ఇప్పటికీ సాపేక్షికంగా తక్కువ స్థాయిలో, అంటే 41 శాతంగానే కొనసాగుతోంది. అంటే ఈ రంగంలో పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క. అయితే ఆన్లైన్ స్పేస్‌లో వినియోగదారుల సంఖ్య ఇప్పటికీ ఏడు శాతంగా మాత్రమే నమోదైంది. వాట్సాప్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్న వారు సైతం ఫిజికల్ రిటైల్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారని తాజా డేటా చెబుతోంది. దేశంలోని 44 కోట్లమంది వాట్సాప్ యూజర్లలో 15 శాతంమంది మాత్రమే ఆన్లైన్లో కొంటున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే అయిదు లేదా పది సంవత్సరాల కాలంలో వెంచర్ కేపిటల్ ఫండ్స్ దీర్ఘకాలిక అంచనాల ప్రాతిపదికపై మదుపు పెట్టడానికి సిద్ధపడటం ఖాయం అని తేలుతోంది. గత సంవత్సరం నుంచి చైనాలో టెక్ కంపెనీలపై రెగ్యులేటరీ నిబంధనలను పెంచుతున్న నేపథ్యంలోనే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో వెంచర్ కేపిటలిస్టులు మన దేశంలోని పరిణామాలపై తాజాగా దృష్టి సారిస్తున్నారు. మొత్తంమీద చూస్తే, లాభదాయకమైన ఐడియాలపైనే మదుపుదారులు డబ్బు పెడతారన్నది నిజం. గత కొన్ని సంవత్సరాల్లో ప్రారంభమైన అనేక స్టార్టప్ సంస్థలు ఫిన్‌టెక్, ఈ–కామర్స్ లేదా సాఫ్ట్వేర్ సర్వీస్ కేటగిరీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. కొన్ని సమస్యలను ఎంపిక చేయడం కష్టమే అవుతుంది గానీ, నైకా సంస్థ ఆన్లెన్ మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల విషయంలో గ్యాప్ ఉన్నట్లు కనుగొన్నది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు కూడా మార్కెట్లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని మీషో సంస్థ కనుగొంది. దేశంలో అత్యధిక సంఖ్యలో యూనికార్న్‌లను (33) కలిగి ఉన్న ఫిన్ టెక్ సంస్థలు రిటైల్ వినియోగదారులతోపాటు వ్యాపార సంస్థల డిజిటల్ చెల్లింపుల అవసరాలను కూడా పూరించడంలో అధిక కృషి చేస్తున్నాయి. ఆన్లైన్ బిజినెస్‌లలో ఉన్న ఖాళీలను పూరించడంలో సాయపడేందుకు ‘సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్’ స్టార్టప్‌లు ముందుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్ లేదా ఎడ్టెక్ వెంచర్లుగా పేరొందిన సంస్థలు బైజూస్ వంటి డెకాకార్న్‌ల వికాసానికి దారితీశాయి. మహమ్మారి కాలంలో ఆరోగ్య సంరక్షణ మరో ప్రాధాన్య రంగంగా ముందుకొచ్చింది. ఆరోగ్య రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం వల్ల ఇన్నోవస్సెర్, ఫార్మియాసీ, క్యూర్‌ఫిట్, ప్రిస్టిన్ కేర్ వంటి శైశవదశలోని యూనికార్న్‌ల ఆవిర్భావానికి తావిచ్చాయి. యూనికార్న్‌లు ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయనడంలో సందేహమే లేదు. ప్రత్యేకించి ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను యూనికార్న్‌ల అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ అభివృద్ధి గురించి మరీ అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. కొన్ని యూనికార్న్‌లు హైరింగ్ రంగంలో అడుగుపెట్టాయి. అయితే మొత్తం ఉపాధిరంగంలో తమదైన పాత్ర పోషించడానికి తగినంత పెద్ద మొత్తంలో ఇలాంటి వెంచర్లకు నిధులు లభ్యం కావడం లేదన్నది వాస్తవం. అదే సమయంలో, స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, డెకాకార్న్‌ల వంటి వెంచర్లను దీర్ఘకాలిక దృష్టితోనే అంచనా వేయాలి. కాలం గడిచేకొద్దీ ఈ తరహా వెంచర్లు దేశాన్ని మరింత వేగంగా డిజిటల్ యుగంలోకి తీసుకెళతాయి. అంతే కాకుండా అంతిమంగా అసమానతలను తగ్గించడం వైపు దేశాన్ని నడిపిస్తాయి. అంతిమంగా, యూనికార్న్‌లను ఒంటరి ద్వీపాల్లాగా చూడకూడదు. దేశ వాణిజ్య వాతావరణంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే ఉత్ప్రేరకాలుగా ఇవి పనిచేస్తాయి. సాంకేతికత ఆధారంగా పనిచేసే స్టార్టప్‌లు వేటికవి విడివిడిగా ఉంటాయి కానీ సాంప్రదాయికమైన ఇటుకలు, ఫిరంగి తయారీ పరిశ్రమల్లో సైతం ఇవి సృజనాత్మకతను పెంచుతున్నాయి. ‘బిగ్ టెక్’ కంపెనీ విదేశాల్లోనూ స్టార్టప్‌ల నుంచే ఆవిర్భవించింది. ప్రపంచమంతటా ఇప్పుడు స్టార్టప్‌ల రాజ్యం నడుస్తోంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఫైనాన్షియల్ జర్నలిస్టు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా రాంచందర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధిపతిగా డాక్టర్ ఎస్.రాంచందర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీగా ఉన్న ఆయనకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘చీకటి’ రోజుల్లో చెన్నై
సాక్షి, చెన్నై: ఆ ఫోటోగ్రఫీ కళాకారుడు ఈ కరోనా కాలాన్ని బ్లాక్డేస్గా అభివర్ణించాడు. తన కంటికి కెమెరా కన్ను జోడించి రంగ రంగుల చెన్నై మహానగరాన్ని నలుపు తెలుపుల మద్రాసు పట్టణంగా మార్చివేశాడు. ‘చెన్నై టూ మద్రాస్’ పేరున ఆనాటి పాత మధురాలను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎల్ రామచంద్రన్ మాట్లాడారు. ఫొటోగ్రఫీపై ఒక వ్యక్తికి శిక్షణ ఇచ్చేందుకు లాక్డౌన్ సమయంలో చెన్నైలో పర్యటించినపుడు నిర్మానుష్యంగా మారిపోయినరోడ్లు, ప్రయాణికులు లేని కారణంగా బోసిపోయిన చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్, ప్రాచీనకాలం నాటి హెరిటేజ్ భవనాలు ఆశ్చర్యపరిచాయని తెలిపారు. వచ్చేపోయే జనాలతో నిత్యం రద్దీగా ఉండే చెన్నై మహానగరం వెలవెలబోతూ వందేళ్ల వెనకటి మద్రాసు నగరంగా మారిపోయిందా అనిపించింది. లాక్డౌన్ వల్ల కీడేకాదు ప్రకృతి, పర్యావరణ పరంగా మేలు కూడా జరిగింది. రిప్పన్ బిల్డింగ్ కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు తిరగడం లేదు, బ్రిటీష్ కాలంనాటి ప్రాచీన కట్టడాలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. 1940 కాలంలో ఎవ్వరూ ఆఫీసులకు వెళ్లేవారు కాదని, ఇళ్ల నుంచే పనిచేసేవారని సమాచారం. నేడు అదే పునరావృతమైంది. భవిష్యత్తులో మరోసారికి అవకాశం లేని ఇటువంటి అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించాలనే ఆలోచన నుంచి ‘చెన్నై టూ మద్రాసు’ అల్బమ్ పుట్టుకొచ్చింది. నాటి రోజులకు అద్దం పట్టాలనే ఉద్దేశంతో బ్లాక్ అండ్ వైట్‌లో ఫొటోలను తీసి అప్పటి మధురస్ముృతులకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాను. ఫొటోగ్రఫీ అనేది అనంతరం, ఎన్నిరకాల కొత్తపుంతలు తొక్కినా ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఫొటోగ్రాఫర్‌గా తన 13 ఏళ్ల కాలంలో యూరప్, నార్త్ అమెరికాతోపాటూ ఆసియా దేశాలన్నీ పర్యటించాను. ఆల్బమ్ ఆవిష్కరణలో ఫొటోగ్రాఫర్ ఎల్ రామచంద్రన్ యూఎస్‌లో యూనివర్సిటీ తమిళ విభాగం నుంచి డాక్టరేట్ పొందాను. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో అనేక అవార్డులు అందుకున్నాను. సాధారణ ప్రజలు సైతం నా ఫొటో గురించి మాట్లాడుకున్నపుడే నేను ఎంతో కొంత విజయాన్ని సాధించినట్లు భావిస్తాను. రూ.45 వేల విలువ జేసే 550 డీ కెనాన్ అనే సాధారణ కెమెరాతో నా వృత్తిజీవితాన్ని ప్రారంభించి ఈ ఆల్బమ్ కోసం అత్యంత ఖరీదైన అత్యాధునిక 5 డీ మార్క్–4 కెమెరాతో సిగ్మా 14 ఎంఎం ఆర్ట్ లెన్స్‌ను వినియోగించాను. ఆల్బం కోసం తీసిన 400 ఫొటోలు అన్నీ అద్భుతాలే. అభిలాష, అంకిత భావం ఉంటే ఫొటోగ్రఫీలో ఎవరైనా అద్భుతాలు సాధింవచ్చని తెలిపారు. మెరీనాబీచ్ వద్ద నెప్పియార్ వంతెన -
సేఫ్టీ 'షి'లబస్..
మహిళ భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విమెన్ సేఫ్టీ వింగ్ మరో బృహత్తర కార్యచరణ సిద్ధం చేసింది. ఇటీవల హైదరాబాద్‌లోని ఐదు డిగ్రీ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా విద్యార్థుల నేతృత్వంలో నడిచే పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవి మంచి ఫలితాలివ్వడంతో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ కాలేజీల్లో పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లను ప్రారంభించనున్నారు. దీనికోసం 33 జిల్లాల నుంచి 2,200 కాలేజీల ప్రిన్సిపాళ్లను నగరానికి విమెన్ సేఫ్టీ వింగ్ ఆహ్వానించింది. వీరందరితో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో భారీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్ర రామచంద్రన్ తదితరులు హాజరవనున్నారు. – సాక్షి, హైదరాబాద్ స్కూలు, జిల్లా, రాష్ట్రస్థాయి క్లబ్‌లు.. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఇదే అతిపెద్ద కార్యక్రమం కావడం గమనార్హం. దీనిని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయాలని విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతిలక్రా నిర్ణయించారు. దీనికోసం స్కూలు, మండల, జిల్లా స్థాయిల్లో క్లబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, రవాణా, విద్యాశాఖ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు ఈ క్లబ్‌లకు మార్గదర్శకంగా ఉంటారు. దీనికోసం రవాణా, విద్య, స్త్రీశిశు సంక్షేమ శాఖలతో పోలీసు శాఖ ముందుగానే సమన్వయం చేసుకుంది. డిగ్రీ, పీజీ విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు నుంచి జూన్ వరకు ఏయే కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో విమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక సిలబస్ రూపొందించింది. ఏమేం చేస్తారు? - విద్యార్థులకు ఆత్మస్థైర్యం, సంకల్ప బలం పెంచే కార్యక్రమాల నిర్వహణ. ఆపదలో ఎలా వ్యవహరించాలి.. ఎవరిని సంప్రదించాలి.. అన్న విషయాల్లో శిక్షణ - సామాజిక, మహిళా, శిశు, రోడ్డు భద్రతల్లో వినూత్న ఆవిష్కరణలకు వ్యాసాలు, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు. వేధింపులు, సైబర్ నేరాలు, వర కట్నం, గృహ హింసలపై చైతన్యం చేయడం - పోలీస్స్టేషన్ల, భరోసా కేంద్రాల సందర్శన - చిన్నారుల్లో గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన. జిల్లా సేఫ్టీ క్లబ్ స్కూలు/కాలేజీ స్థాయి సేఫ్టీ క్లబ్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా సేఫ్టీ క్లబ్‌లు ఉంటాయి. ఇందులో జిల్లా విద్యాశాఖాధికారి, ఇద్దరు మహిళా ప్రముఖులు, అడిషనల్ ఎస్పీ ర్యాం కు ఆఫీసర్, ఐదు పాఠశాలల నుంచి ప్రతినిధులు, ఆర్టీఏ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జిల్లా క్రీడా/యువజన అధికారి, స్వయం సహాయక బృంద నాయకురాలు ఉంటారు. స్కూలు/ కాలేజీ స్థాయి సేఫ్టీ క్లబ్ ఇందులో ముగ్గురు పేరెంట్స్, 10 మంది విద్యార్థులు, ఒక లా అండ్ ఆర్డర్ మహిళా పోలీస్, ఒక ట్రాఫిక్ పోలీస్, గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకురాలు సభ్యులుగా ఉంటారు. వీరంతా తొలుత విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి రక్షణ, రోడ్డు భద్రత, డయల్ 100, ట్రాఫిక్ రూల్స్, హాక్ ఐ, షీటీమ్‌ల పనితీరు, వారిని ఎలా సంప్రదించాలి తదితర వివరాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు కూడా వీరు నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. రాష్ట్ర స్థాయి క్లబ్‌లు జిల్లా స్థాయి సేఫ్టీ క్లబ్‌ల పనితీరును మదింపు చేసేందుకు రాష్ట్ర సేఫ్టీ క్లబ్‌లు ఉంటాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ/విద్యాశాఖ కమిషనర్ నామినేట్ చేసిన రీజనల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్య కమిషనర్ నామినేట్ చేసిన మహిళా ప్రతినిధి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ లేదా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకు అధికారి, రవాణా శాఖ, రాష్ట్రస్థాయి యువజన క్రీడా ప్రతినిధి, మెప్మా నుంచి ఓ అధికారి ఉంటారు. -
ఒకే ఒక్కడు.. ఇక మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపిక ఏకగ్రీవమైంది. గడువు నిన్నటితోనే ముగియటం.. ఇప్పటిదాకా ఒకే ఒక్క నామినేషన్ రావటంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ పేరును ప్రకటించటమే మిగింది. రాహుల్‌కి మద్దతుగా మొత్తం 89 నామినేషన్లు వచ్చాయి. అవన్నీ పరిశీలించి సహేతుకంగానే ఉన్నాయని ఎంపీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం రామచంద్రన్ తెలిపారు. ఈ మేరకు అధికారికంగా స్క్రూటినీ నివేదికను విడుదల చేసింది. ఏ క్షణమైన రాహుల్ ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీని 19 ఏళ్లుగా (పదేళ్లపాటు యూపీఏ పాలనతో కలిపి) నడుపుతున్న అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి రాహుల్ పగ్గాలు స్వీకరించబోతున్నారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైనప్పటినుంచీ రాహుల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలపై అడపాదడపా చర్చ జరిగినా.. చివరకు దేశంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారటం, 2019 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీ కీలక బాధ్యతలు అందుకోనున్నారు. యువరాజు నాయకత్వంలో.. ఇటీవలి కాలంలో వరుస ఓటములతో కుదేలైన పార్టీకి తిరిగి పునర్వైభవం వస్తుందని పలువురు యువ, సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
ప్రభుత్వంతో మాట్లాడతా...
నిషేధంపై ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్ న్యూఢిల్లీ: కేంద్రం విధించిన నిషేధంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ స్పందించారు. త్వరలోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ)లను సంప్రదించిన అనంతరం ఈ విషయమై క్రీడా శాఖతో మాట్లాడతానని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఐఓఏ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై క్రీడా శాఖ ఐఓఏకు షోకాజ్ నోటీసు ఇవ్వగా అటు నుంచి స్పందన లేకపోవడంతో నిషేధం విధించింది. నిషేధంపై బింద్రా మద్దతు ఐఓఏపై నిషేధాన్ని మాజీ షూటర్ అభినవ్ బింద్రా సమర్థించారు. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘కఠినంగా ఉంటేనే భారత క్రీడారంగంలో మార్పు కనిపిస్తుంది. చట్టం తేవాల్సిన అవసరం ఉంది. క్రీడా శాఖ ఐఓఏను నిషేధించడం సరైన చర్య. సుపరిపాలన, నీతి నియమాల కాలం ఇది’ అని బింద్రా ట్వీట్ చేశారు. -
రామచంద్రన్దే బాధ్యత
ఐఓఏ అధ్యక్షుడిపై క్రీడల మంత్రి గోయెల్ ఆగ్రహం ముంబై: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో వివాదాస్పద నియామకంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ నిప్పులు చెరిగారు. కళంకితులైన సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలా నియామకానికి ఐఓఏ చీఫ్ ఎన్.రామచంద్రనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా అసంబద్ద నిర్ణయం. చర్చలోనే లేని అంశానికి ప్రాధాన్యమివ్వడమేంటి... ఏకగ్రీవ నియామకమంటూ ఆమోదించడమేంటి? ఐఓఏ ప్రధాన విధి నైతిక విలువలకు కట్టుబడి ప్రాథమిక సూత్రాలను పాటించడం.క్రీడల్లో పారదర్శక పాలన అందించడం. కానీ చేసిందేమిటి? చార్జిషీట్ నమోదైన వ్యక్తులను అందలమెక్కించింది. దీనిపై షోకాజ్ నోటీసులిచ్చాం. శుక్రవారంకల్లా ఐఓఏ సంజాయిషీ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని గోయెల్ అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చార్టర్‌ను కాదని, ఐఓఏ నియమావళిని విస్మరించి తీసుకున్న నిర్ణయాలను క్రీడాశాఖ ఎంతమాత్రం సమ్మతించదని ఆయన స్పష్టం చేశారు. గతంలోనూ చౌతాలా నియామకాన్ని ఐఓసీ ఏమాత్రం గుర్తించలేదని ఆయన గుర్తు చేశారు. మరో వైపు ఇంత వివాదం రేగుతున్నా భారత అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఐఓసీ అభ్యంతరం చెబితేనే గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని లేదంటే కొనసాగుతానని చెప్పారు. కల్మాడీ తన నిర్దోషిత్వం నిరూపించుకునే వరకు పదవి చేపట్టబోనని బుధవారమే ప్రకటించారు. -
నిశ్చితార్థానికి వెళ్లి వస్తూ...
► రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి ► పెరంగళత్తూరులో విషాదం ► మృతుల్లో ముగ్గురు మహిళలు నిశ్చితార్థానికి వెళ్లి వస్తూ ఓ కుటుంబం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన చెన్నై పెరంగళత్తూరుకు చెందిన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. జాతీయ రహదారిపై అతి వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ ఢీ కొనడంతో ఐదుగురు సంఘటనా స్థలంలోనే విగత జీవులు అయ్యారు. మరొకరు ఆసుపత్రిలో మరణించారు. సాక్షి, చెన్నై: తాంబరం సమీపంలోని పెరంగళత్తూరుకు చెందిన సుందరం(60) కా టాన్ కొళత్తూరులోని ఎస్ఆర్ఎం వర్సిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సింగపూర్‌లో ఇంజనీర్‌గా ఉన్న తనయుడు నరేష్‌కు వివాహం జరిపేందుకు సుంద రం నిర్ణరుుంచాడు. తంజావూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తో వివాహ నిశ్చితార్థానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం నిమిత్తం పెరంగళత్తూరు, రెడ్‌హిల్స్‌లోని తన బంధువు ల్ని తంజావూరుకు సుందరం తీసుకెళ్లా డు. కొందరు బంధువులు తనతో పాటు గా కారులో, మిగిలిన వారిని వ్యాన్‌లో తీసుకెళ్లారు. ఆదివారం నిశ్చితార్థం ము గించుకుని రాత్రికి రాత్రే తిరుగు పయ నం అయ్యారు. ఆనందోత్సాహాలతో శుభకార్యాన్ని ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న వాళ్లు, మరికొన్ని గం టల్లో పెరంగళత్తూరు చేరుకోవాల్సి ఉం ది. మార్గమధ్యలో మృత్యువు కబళించడంతో ఆరుగురు విగత జీవులయ్యారు. నిశ్చితార్థానికి వెళ్లి వస్తూ....: తిరుగు పయనంలో కారును సుందరం బంధువు దురైరాజ్ కుమారుడు రామచంద్రన్(34) నడిపాడు. ఆ కారులో మరో బంధువు వీరాస్వామి భార్య పద్మ(55), కార్తీకేయన్ భార్య సుశీల(65), ఇరులయ్య కుమారుడు ఆకాష్(11)లతో పాటుగా రెడ్‌హిల్స్‌కు చెందిన పాపాత్తి (65)లు పయనం సాగించారు. విల్లుపురం జిల్లా ఉలందూరు పేట సమీపంలోని ఆసనూరు వద్దకు సోమవారం వేకువ జామున ఒంటి గంట సమయంలో చేరుకుంది. అక్కడి కూడలి వద్ద హఠాత్తుగా తిరుచ్చి వైపుగా వెళ్తున్న లారీ అడ్డు పడడంతో కారు అదుపు తప్పింది. రెండు వాహనాలు అతి వేగంగా ఢీ కొనడంతో కారులో ఉన్న వాళ్లందరూ తలా ఓ దిక్కున పడ్డారు. వెనుక వైపు వ్యాన్‌లో వస్తున్న మిగిలిన బంధువులు ఈ ఘటనతో ఆందోళనలో పడ్డారు. హుటాహుటీన కారు వద్దకు సమీపించారు.అప్పటికే కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో పాటు గా సుందరం, ఆకాష్, పాపాత్తి, పద్మ, సుశీల మృతి చెందడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. రామచంద్రన్ తీవ్ర గా యాలతో పడి ఉండడంతో హుటాహుటీన ఉలందూరుపేట ఆసుపత్రికి తరలించారు. అరుుతే, అక్కడ చికిత్స ఫలిం చక మరణించాడు. తమ వాళ్లు ఆరుగురు మరణించడంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో పడ్డారుు. సమాచారం పెరంగళత్తూరు, రెడ్ హిల్స్‌లోని మిగి లిన బంధువులకు అందడంతో సర్వత్రా శోక సంద్రంలో మునిగారు. కొందరు అరుుతే, ఆగమేఘాలపై ఉలందూరు పేటకు తరలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో గంటన్నరకు పైగా జాతీయ రహదారిలో వాహనాల రాక పోకలకు తీవ్ర ఆటంకం తప్పలేదు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను మంగళవారం పెరంగళత్తూరుకు తరలించే అవకాశాలు ఉన్నారుు. -
సీపీఎం సారథి ఏ రాముడో!
పోటీలో సీతారాం.. రామచంద్రన్ ఆ ఇద్దరి చుట్టూ తిరుగుతున్న సభలు నాయకత్వ మార్పిడిపై తర్జన భర్జన (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సీపీఎంలో నాయకత్వ మార్పిడి అనుకున్నంత సునాయాసంగా కన్పించడం లేదు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న దక్షిణాది నేతలిద్దరూ ఉద్దండులే కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వీరిద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలో తేల్చుకోలేక ప్రతినిధులు సతమతమవుతున్నారు. ‘మా పార్టీ నాయకత్వ ఎన్నిక మీరు(మీడియా) అనుకున్నంత క్లిష్టమైందో, బూర్జువా పార్టీల మాదిరి హోరాహోరీ జరిగేదో కాదు’ అని సీపీఎం నేతలు చెబుతున్నంత తేలి గ్గానైతే పరిస్థితి లేదు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పదవీకాలం ఈ నెల 19తో ముగియనుంది. విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభ 19న కొత్త ప్రధాన కార్యదర్శిని, పొలిట్‌బ్యూరోను ఎన్నుకోవాల్సి ఉంది. నూతన రాజకీయ, ఎత్తుగడల పంథా, సరికొత్త రాజకీయ విధానం, పార్టీ పునర్నిర్మా ణం, వచ్చేఏడాది జరుగనున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కొత్త రథసారథి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రధాన కార్యదర్శి పదవికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీతారాం ఏచూరి, కేరళకు చెందిన రామచంద్రన్ పిళ్లై పోటీపడుతున్నారు. ఇద్దరూ పొలిట్‌బ్యూరో సభ్యులే. సీనియర్లే. సీతారాం తెలుగువారే అయినా బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. కాగా ఈసారి మహిళకు అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న భావనా వ్యక్తమైంది. కానీ ప్రస్తుతం ఆస్థాయి వ్యక్తి పార్టీలో ఎవరూలేరు. ఉన్న ఏకైక పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కారత్ భార్య. ఆయన తప్పుకోగానే ఆమెకు ఈ పదవిస్తే ప్రజల్లోకి తప్పు భావన వెళ్లే వీలున్నందున ప్రస్తుతానికీ అంశాన్ని పక్కనబెట్టారు. దీంతో ఏచూరి, పిళ్లై మధ్యనే పోటీ కేంద్రీకృతమైంది. పార్టీ వ్యవహారాల్లో చేయితిరిగిన నేత ఏచూరి ... అగ్రవర్ణానికి చెందిన సీతారాం ఏచూరి(63) అటు పార్లమెంటరీ ఇటు పార్టీ వ్యవహారాల్లోనూ చేయితిరిగిన నేత. పలు భాషల్లో మాట్లాడగల దిట్ట. వయసు రీత్యానూ ప్రస్తుత పొలిట్‌బ్యూరో సభ్యుల్లో చిన్నవారు. పార్టీ సైద్ధాంతిక, వ్యూహకర్తల్లో ఒకరు. ప్రస్తుతం పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నందున ఈయనకు అవకాశమిస్తే ఇప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీని నడిపిస్తారన్న అభిప్రాయం ఓ వర్గంలో ఉంది. బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్నందున.. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని, చిన్నచిన్న ఎంఎల్ గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చి పార్టీకి పునరుజ్జీవం కల్పిస్తారన్న భావనా ఉంది. బెంగాల్‌తోపాటు త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు పూర్తిగా, ఆంధ్రా నుంచి పాక్షిక మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోంది. చెప్పుకోదగిన ఉద్యమ చరిత్ర లేదని, మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించలేదని, తెరవెనుక వ్యవహారాలు నిర్వహిస్తుంటారన్న విమర్శలు ఆయనకున్న ప్రతికూలతలు. సుదీర్ఘ అనుభవం రామచంద్రన్ సొంతం కేరళలో బలమైన వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్రన్ పిళ్లై(77)కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఉద్యమ చరిత్ర ఉన్నవారు. వ్యవసాయరంగ సమస్యలపై మంచి పట్టుంది. సైద్ధాంతిక అవగాహనా అపారమే. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ వ్యతిరేకవర్గంతోపాటు బిహార్, తమిళనాడు, ఏపీలో కొంతమేరకు మద్దతుంది. ప్రకాశ్ కారత్ మద్దతూ ఆయనకే ఉన్నట్టు సమాచారం. హిందీ సరిగా మాట్లాడలేకపోవడం, వయస్సు ప్రతికూలతలు. ఎన్నిక జరిగే విధానమిలా.. మహాసభకు హాజరైన ప్రతినిధులు కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు. ఈ కమిటీ ప్రధానకార్యదర్శిని ఎన్నుకుంటుంది. ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో సభ్యులను ఎంపిక చేసి కేంద్ర కమిటీకి తెలియజేస్తారు. ఆ కమిటీ ఆమోదం తర్వాత పేర్లను మహాసభలో ప్రకటిస్తారు. మహా సభల్లో ఈ ప్రక్రియ అంతా ఆదివారం జరుగుతుంది. -
పొరపాటుకు ‘చెక్’
చెక్కుల రూపంలోనూ ఆస్తి పన్ను చెల్లించవచ్చు : బీబీఎంపీ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తప్పు చేసిన వారికి, చేయని వారికీ ఒకే రకమైన ‘శిక్ష’ను విధించడం ద్వారా చేసిన పొరపాటును బీబీఎంపీ ఎట్టకేలకు సరిదిద్దుకుంది. ఇకమీదట ఆస్తి పన్ను చెల్లింపునకు చెక్కులను కూడా స్వీకరిస్తామని బుధవారం ప్రకటించింది. నగరంలో ఆస్తి పన్ను చెల్లింపు ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెలాఖరులోగా చెల్లించిన వారికి మొత్తం పన్ను మొత్తంలో ఐదు శాతం రాయితీ కూడా లభిస్తుంది. దీంతో పెద్ద మొత్తంలో పన్ను వసూలయ్యేది. గతంలో చెక్కుల రూపంలో పన్నులను స్వీకరించే వారు. అయితే కొన్ని చెక్కులు నిరాదరణకు గురవడం, బీబీఎంపీ సిబ్బందే అవకతవకలకు పాల్పడడం వల్ల ఎన్నడూ లేని విధంగా ఈఏడాది డీడీలు లేదా పే ఆర్డర్ల రూపంలో మాత్రమే పన్ను చెల్లించాలని బీబీఎంపీ షరతు విధించింది. రూ వెయ్యి లోపు అయితే నగదు రూపంలోనే చెల్లించవచ్చని ఆదేశించింది. వీటి కోసం బ్యాంకుల వద్ద క్యూలో నిలుచుకోలేక చాలా మంది పన్ను చెల్లింపు పట్ల ఉత్సాహం చూపించలేదు. సాధారణంగా ఈ ఒక్క నెలలోనే రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలయ్యేది. ప్రస్తుతం ఇప్పటి వరకు రూ. 84 కోట్లు మాత్రమే వసూలైంది. మరో వారం రోజుల్లో రూ.150 కోట్ల వరకు వసూలు కావడం గగనమే. డీడీలు, పే ఆర్డర్ నిబంధన వల్లే పన్ను చెల్లింపు పట్ల నగర పౌరులు పెద్దగా ఉత్సాహం చూపడం లేదని తేలడంతో బీబీఎంపీ నాలుక్కరచుకుని, నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీనికి తోడు బీబీఎంపీ సిబ్బంది ఈ నెల 17 వరకు లోక్‌సభ ఎన్నికల్లో నిమగ్నం కావడం, తర్వాత వరుసగా మూడు రోజులు సెలవు రావడం వల్ల కూడా పన్ను వసూలులో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడువు పెంపు అనుమానమే సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఐదు శాతం రాయితీ పొందడానికి గడువు తేదీని పొడిగించే అవకాశాలుంటాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, గడువు పెంపు అనుమానమేనని బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. అసలే ఆదాయం లేక నానా అగచాట్లు పడుతున్న బీబీఎంపీకి ప్రస్తుత పన్ను వసూలు వైనం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన తయారైంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో వచ్చే నెలాఖరు వరకు ఐదు శాతం రాయితీ గడువును పొడిగించినట్లయితే పన్ను వసూళ్లు ఊపందుకుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెల్ల అర్జీ తప్పనిసరి ఈ ఏడాది పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేనందున, నిర్ణీత దరఖాస్తు పూర్తి చేసి సమర్పించాలనే నిబంధనపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పన్ను మొత్తంలో మార్పు లేనప్పుడు దరఖాస్తు ఎందుకని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. అయితే కేఎంసీ చట్టం ప్రకారం పన్ను మొత్తంతో పాటు నిర్ణీత దరఖాస్తును భర్తీ చేసి సమర్పించడం తప్పనిసరని బీబీఎంపీ తెలిపింది. కాగా బీబీఎంపీ సహాయ రెవెన్యూ అధికారి కార్యాలయాలతో పాటు ఐడీబీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఐఎన్జీ వైశ్యా బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, బెంగళూరు వన్ కేంద్రాల్లో డీడీలు లేదా పే ఆర్డర్ల రూపంలో ఆస్తి పన్ను చెల్లించే అవకాశం కల్పించినట్లు వివరించింది. రూ.వెయ్యి లోపైతే నగదు రూపంలో చెల్లించవచ్చని తెలిపింది. -
భారత ఒలింపిక్ సంఘంపై సస్పెన్షన్ ఎత్తివేత
భారత క్రీడాభిమానులకు పెద్ద ఊరట. రాబోయే ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని పట్టుకునే మన క్రీడాకారులు వెళ్లచ్చు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఉన్న సస్పెన్షన్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎత్తేసింది. దాంతో దాదాపు ఏడాది నుంచి ఉన్న ఇబ్బంది తొలగిపోయినట్లయింది. ఐఓఏకు కొత్తగా ఎన్నికలు నిర్వహించడంతో ఈ నిషేధాన్ని ఐఓసీ ఎత్తేసింది. ఆరోపణలున్న వారిని ఐఓఏలో ఎలా కొనసాగిస్తారంటూ 14 నెలల క్రితం ఐఓసీ మన ఒలింపిక్ సంఘంపై నిషేధం విధించింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తమ్ముడు ఎన్.రామచంద్రన్ ప్రపంచ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పుడు కొత్తగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో నిషేధాన్ని ఎత్తేసినట్లు ఐఓసీ తమకు ఫోన్ ద్వారా తెలియజేసిందని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు. ఇక్కడ కొత్తగా జరిగిన ఎన్నికలను ఐఓసీకి చెందిన ముగ్గురు పరిశీలకులు కూడా ప్రత్యక్షంగా వచ్చి చూశారు. వారు సంతృప్తి చెందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఐఓఏ పీఠంపై రామచంద్రన్
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన అధ్యక్షుడిగా ప్రపంచ స్క్వాష్ సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి రామచంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎన్.శ్రీనివాసన్‌కు స్వయానా సోదరుడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో రామచంద్రన్‌తోపాటు ప్రధాన కార్యదర్శిగా భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు రాజీవ్ మెహతా, కోశాధికారిగా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నాలు కూడా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఎనిమిది ఉపాధ్యక్ష పదవుల కోసం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడడంతో అనివార్యంగా జరిగిన ఎన్నికల్లో భారత రోయింగ్ సమాఖ్య చీఫ్ రాజ్‌లక్ష్మి సింగ్ దేవ్ ఓటమిపాలయ్యారు. ఉపాధ్యక్షులుగా అనురాగ్ ఠాకూర్, అఖిలేశ్ దాస్‌గుప్తా, జనార్దన్‌సింగ్ గెహ్లాట్, ఆర్.కె.ఆనంద్, జి.ఎస్.మంధర్, తర్లోచన్‌సింగ్, బీరేంద్ర ప్రసాద్ బైశ్యా, పర్మిందర్‌సింగ్ దిండ్సాలు ఎన్నికయ్యారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రతినిధులు పీర్ మీరో, ఫ్రాన్సిస్కో జె.ఎలిజాల్డే, హుసేన్ అల్ ముసాలమ్లు ఈ ఎన్నికలకు పరిశీలకులుగా వ్యవహరించారు. తాజా ఎన్నికలతో ఐఓఏపై ఐఓసీ విధించిన నిషేధం ఎత్తివేసేందుకు మార్గం సుగమమైంది. ఐఓఏలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుండడం, ఒలింపిక్ చార్టర్‌కు విరుద్ధంగా కళంకిత వ్యక్తులు పదవులు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఐఓసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే 2012 నవంబర్‌లో ఐఓఏ ఎన్నికలు జరిగి అధ్యక్ష, కార్యదర్శులుగా అభయ్‌సింగ్ చౌతాలా, లలిత్ భానోత్లు ఎన్నికైనా వారిని ఐఓసీ గుర్తించలేదు. సరికదా... తిరిగి ఎన్నికలు నిర్వహిస్తేనే నిషేధం ఎత్తివేతపై పరిశీలిస్తామని మెలిక పెట్టింది. తాజా ఎన్నికలతో ఐఓఏకు క్లీన్ కార్యవర్గం లభించినట్లేనని ఐఓసీ భావిస్తోంది. సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ముగిసే ఈ నెల 23 లోగా తాము ఐఓసీ చీఫ్‌కు నివేదిక సమర్పిస్తామని ఎన్నికలకు పరిశీలకుడిగా వ్యవహరించిన రాబిన్ మిచెల్ తెలిపారు. ఇదే జరిగితే ఐఓఏపై 14 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తే సోచి ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భారత అథ్లెట్ల చేతిలో కనిపించని జాతీయ పతాకాన్ని ముగింపు వేడుకల్లో చూసే అవకాశం దక్కవచ్చు. -
రామచంద్రన్‌కు ఐఓఏ పగ్గాలు
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పగ్గాలు నారాయణ రామచంద్రన్ చేపట్టనున్నారు. దీంతో పాటు ప్రధాన కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులకూ కేవలం లాంఛనమైన ప్రకటనే మిగిలుంది. భారత స్క్వాష్ రాకెట్ సమాఖ్య (ఎస్ఆర్ఎఫ్ఐ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రామచంద్రన్ బీసీసీఐ చీఫ్ ఎన్.శ్రీనివాసన్‌కు స్వయానా సోదరుడు. వచ్చే నెల 9న జరిగే ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు శనివారం చివరి రోజు కావడంతో రామచంద్రన్ ఎన్నిక ఖరారైంది. ఐఓఏ సీని యర్ సభ్యుడైన ఆయన 2008-2012 వరకు సంఘం కోశాధికారిగా పనిచేశారు. హాకీ ఇండియా అసోసియేట్ ఉపాధ్యక్షుడు రాజీవ్ మెహతా కూడా ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా టెన్నిస్ సంఘం చీఫ్ అనిల్ ఖన్నా కోశాధికారిగా, వీరేంద్ర నానవతి సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. -
బన్రూటికి ‘అన్నా’
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రతి ఏటా తిరువళ్లువర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళ మేధావులు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ సేవల్ని అందిస్తున్న వారికి బిరుదుల్ని ప్రదానం చేస్తారు. ఈ ఏడాదికి గాను బిరుదులకు ఎంపికైన వారి వివరాల్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదుకు బన్రూటి రామచంద్రన్ ఎంపికయ్యారు. ఇటీవల డీఎండీకే నుంచి బన్రూటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి తాను వైదొలగుతున్నట్టు బన్రూటి ప్రకటించినా, ఆయన సేవల్ని తమ పార్టీకి ఉపయోగించుకునేందుకు అన్నాడీఎంకే వ్యూహ రచన చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో సేవలకు గుర్తింపుగా దివంగత నేత అన్నాదురై అడుగుజాడల్లో నడుస్తున్న బన్రూటికి అన్నా బిరుదును ప్రకటించడం గమనార్హం. బిరుదులు: తిరువళ్లువర్ బిరుదును యూసీ(తైవాన్), ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ బిరుదును అన్నాడీఎంకే నాయకురాలు సులోచనా సంపత్, అంబేద్కర్ బిరుదును ప్రొఫెసర్ ఎం ప్రకాష్, అన్నా బిరుదును బన్రూటి రామచ ంద్రన్, విద్యా ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ బిరుదును అయ్యారు వాండయార్, భారతీయార్ బిరుదును ప్రొఫెసర్ కె జ్ఞాన సంబంధన్, భారతీ దాసన్ బిరుదును రాధాచల్లప్పన్, తిరువికా బిరుదును అశోక్ మిత్రన్, ముత్తమిళ్ కావలర్ విశ్వనాథన్ బిరుదును ప్రొఫెసర్ జయ దేవన్‌కు ఇవ్వనున్నారు. బుధవారం తిరువళ్లువర్ దినోత్సవ వేడుకలు ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలో ఘనంగా జరగనున్నాయి. ఇందులో వీరికి బిరుదులు ప్రదానం చేయనున్నారు. బిరుదులతోపాటుగా సర్టిఫికెట్లు, తలా రూ.లక్ష నగదు, ఒక సవరం బంగారు పతకం అందజేయనున్నారు. అలాగే, ఆర్థికంగా చితికిన తమిళ మేధావులు 30 మందికి ప్రభుత్వ సహకారం అందించనుంది. సంక్రాంతి పతకాలు: పోలీసుల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులను ప్రదానం చే స్తారు. నేరాల కట్టడిలో, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కు పాదం మోపే రీతిలో పోలీసులకు సర్వాధికారాల్ని అప్పగించారు. ఈ ఏటా తొలి సారిగా సంక్రాంతి పతకాలు అందించేందుకు నిర్ణయించారు. ఈమేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ మేరకు పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న 1685 మందికి సంక్రాంతి పతకాలను ప్రకటించింది. 1500 మంది పోలీసులకు, 119 మంది అగ్నిమాపక సిబ్బందికి, 60 మంది జైళ్లలో పనిచేస్తున్న వార్డెన్లు తదితర సిబ్బందికి, పోలీసు ఫొటోగ్రాఫర్లు, డాగ్ స్క్వాడ్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న వాళ్లకు తలా ఇద్దరికి చొప్పున ఈ పతకాలను ప్రకటించారు. ఈ పతకాలతో పాటుగా వీరికి ప్రతి నెలా వేతనంతో పతకాల ప్రోత్సాహంగా రూ.200 అదనంగా ఇవ్వనున్నారు. -
నైపుణ్యం ఉంటేనే వృత్తిలో రాణింపు
సాక్షి,బెంగళూరు: నైపుణ్యం ఉంటేనే ఎంచుకున్న రంగంలో రాణించగలరని భారత్ యూనివర్శిటీ ప్రతినిథి రామచంద్రన్ పేర్కొన్నారు. బెంగళూరులో ‘విద్యా ఉపాధి అవకాశాలు - నైపుణ్యం’ అంశంపై ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ తదితర వృత్తి విద్యా సంబంధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు తరగతి గదులకే పరిమితమవుతున్నారన్నారు. అందువల్లే చదువు ముగిసిన వెంటనే వారికి ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నారు. ప్రపంచీకరణ నేపపథ్యంలో చాలా రకాల పరిశ్రమలు నెలకొల్పబడుతున్నా, అందుకు తగ్గ నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత, వైనరీ, బయోటెక్నాలజీ పరిశ్రమలల్లో ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. దీనిని నివారించడానికి వృత్తి కోర్సులను అందిస్తున్న విద్యాసంస్థలు విద్యా ఏడాది ప్రారంభంలోనే ఆయా పరిశ్రలమతో ఒప్పందం కుదుర్చుకుని నెలకు కనీసం 10 గంటల పాటు తమ విద్యార్థులకు అక్కడ శిక్షణ ఇప్పించాలన్నారు. వైద్య, దంత వైద్య, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రస్తుతం ఈ విధానమే అమల్లో ఉందని రామచంద్ర గుర్తుచేశారు. ఈమేరకు ప్రభుత్వం కూడా నిబంధనలు రూపొందిస్తే అటు విద్యార్థులకు ఇటు పారిశ్రామిక వర్గాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చివరి సెమిస్టర్‌లోనే ఇంటర్న షిప్ చేయాలనే ఆలోచన మాని వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన మొదటి ఏడాది నుంచే ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సరిపోయే పరిశ్రమల్లో పనిచేయడం మంచిదని రామచంద్రన్ విద్యార్థులకు సూచించారు.