ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కోవాలి అన్నట్టు.. నటి శరణ్య రామచంద్రన్ నాయర్ కూడా ఎక్కడైతే తన నటనపై విమర్శలను ఎదుర్కొందో అక్కడే ప్రశంసలను అందుకోవాలని నిశ్చయించుకుంది. సినిమాలు, సిరీస్‌లలో అభినయిస్తూ ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె గురించి కొన్ని విషయాలు..
శరణ్య పుట్టి, పెరిగిందంతా కేరళలోని తిరువనంతపురంలో. ఎమ్‌బీఏ చేస్తున్నప్పుడు పాకెట్ మనీ కోసం మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎమ్‌బీఏ పూర్తయిన తర్వాత సొంత బిజినెస్ మొదలుపెట్టాలనుకుంది.
వరుస మోడలింగ్ అవకాశాలతో ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. మరెన్నో ఫొటో షూట్స్‌తో బిజీగా మారింది. అలా ఓ యాడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్ వచ్చింది.
ఒక్క సినిమా చేసి వెళ్లిపోదాం అనుకుంది. కానీ, ఆ చిత్రం ‘మారడోనా’ పెద్దగా ఆడలేదు. శరణ్య యాక్టింగ్‌పై కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో, నటిగా తనేంటో నిరూపించుకోవాలని నిశ్చయించుకుంది.
తను నటించిన ‘టూ స్టేట్స్’, ‘మై నేమ్ ఈజ్ అళగన్’, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా పరవాలేదు అనిపించాయి. ‘ఝాన్సీ’ సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగు పెట్టి తెలుగు వీక్షకులకూ పరిచయమైంది.
ప్రస్తుతం తను నటించిన ‘పారషూట్ ’ సిరీస్ తెలుగు, తమిళ, మలయాళంతో పాటు పలు భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. వీక్షకాదరణ పొందుతోంది.
ఆనందం అనేది ఎవరో ఇస్తే రాదు. మనలోనే ఉంటుంది. అందుకే నేనెప్పుడూ నా మనసు చెప్పిందే వింటాను.
– శరణ్య రామచంద్రన్ నాయర్.
Comments
Please login to add a commentAdd a comment