Saranya
-
వివాదంలో రఘువరన్ బీటెక్ నటి.. !
కోలీవుడ్ ధనుశ్ నటించిన చిత్రం రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో అతనికి జోడీగా అమలా పాల్ నటించింది. ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగుల బాధలను చూపే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో రఘువరన్‌కు తల్లిగా నటి శరణ్య పొన్వన్నన్ నటించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని వారు నివాసముండే విరుంగబాక్కంలో పార్కింగ్ గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. పార్కింగ్ విషయంలో పొరుగింటి వారితో వివాదం తలెత్తింది. దీంతో పక్కింటి వారు శరణ్య పొన్వన్నన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను నటి బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు తెలుస్తోంది. అయితే శరణ్య రఘువరన్ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. -
చిగురించే శుభలేఖ.. మీ ఇంటికి వచ్చిన తులసి.. ఆరోగ్యదాయిని!
ఒకప్పడు శుభలేఖ అంటే... పసుపు సుగంధాలతో అందే ఆహ్వానం. డిజిటల్ యుగంలో వాట్సాప్‌లోనే ఆహ్వానం. పెళ్లయ్యాక డిలీట్ చేయకపోతే మెమరీ చాలదు. ఆ తర్వాత ఆ పత్రిక మన మెమరీలోనూ ఉండదు. కానీ... ఈ శుభలేఖ ఎప్పటికీ నిలిచి ఉండే ఓ జ్ఞాపకం. మంచాల వారి పరిణయ ఆహ్వానం... ఏటా మనింటికి ఎన్నో పెళ్లిపత్రికలు వస్తూ ఉంటాయి. ‘అరె! నా పెళ్లిలో పట్టుపరికిణితో బుట్టబొమ్మలా తిరిగిన ఆ చిన్నమ్మాయికి పెళ్లా! కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తోందో? అనుకుంటూ పెళ్లి కార్డును మురిపెంగా చూస్తాం. పెళ్లయిన తర్వాత ఆ కార్డునుపాత పేపర్లలో వేసేయడానికి మనసొప్పదు. శుభలేఖను గౌరవించాలి, ఆ జంట వైవాహిక జీవితం కలకాలం లక్షణంగా సాగాలంటే పెళ్లికార్డును అగౌరవపరచకూడదనే సెంటిమెంట్ మనది. ఈ సెంటిమెంట్‌కు కొత్త నిర్వచనం చెప్తోంది డాక్టర్ శరణ్య. ఆహ్వాన పత్రిక ముద్రించిన పేపర్‌ను తులసి గింజలను కలిపి తయారు చేయించింది. ‘‘నా పెళ్లి తర్వాత ఈ కార్డును మట్టి కుండీలో వేసి నీరు పోయండి. నాలుగు రోజుల్లో కార్డు కరిగిపోతుంది, మరో నాలుగు రోజులకు పచ్చగా జీవం పోసుకున్న తులసి మొక్క మనల్ని పలకరిస్తుంది. మీ ఇంటికి వచ్చిన తులసి, మీ ఇంటి ఆరోగ్యదాయిని. భూమాతకు కొత్త ఊపిరినిచ్చే ఆరోగ్యలక్ష్మిని చూస్తూ మీ ముఖంలో విరిసే చిరునవ్వే మాకు మీరిచ్చే ఆశీర్వాదం’’ అంటోంది. శుక్రవారమే పెళ్లి! డాక్టర్ శరణ్యది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్. ఎంఎస్ ఆఫ్తాల్మాలజీ చేస్తోంది. ఈ నెల 24వ తేదీన పెళ్లి పీటల మీద కూర్చోనున్న శరణ్య తన వివాహాన్ని ఇలా పర్యావరణహితంగా మార్చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకుంది. ‘‘నేచర్ ఫ్రెండ్లీ లైఫ్ స్టయిల్ నాకిష్టం. నా పెళ్లి కూడా అలాగే జరిగితే బావుణ్ణనిపించి అదే మాట నాన్నతో చెప్పాను. పెళ్లి వేదిక అలంకరణ నుంచి భోజనాల వరకు మొత్తం ప్లాస్టిక్ రహితంగా ఉండాలని కూడా అనుకున్నాం. అది పెద్ద కష్టం కాలేదు. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం దొరికింది. కార్డుల కోసం చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ‘ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కార్డ్స్’ కోసం నేను ఇంటర్నెట్లో, నాన్న తన బిజినెస్ కాంటాక్ట్స్‌తో ప్రయత్నించాం. నాన్నకు తెలిసిన వాళ్ల ద్వారా అహ్మదాబాద్‌లో హ్యాండ్‌మేడ్ పేపర్ తయారీతో పాటు మనం కోరిన స్పెసిఫికేషన్లన్నీ వచ్చేటట్లు కస్టమైజ్డ్గా ప్రింట్ చేసిస్తారని తెలిసింది. మూడు నెలల ముందుగా ఆర్డర్ చేయాలి, ఈ ఎకో ఫ్రెండ్లీ ఆహ్వానపత్రికల ఆలోచన తెలిసి మా అత్తగారింట్లో కూడా అందరూ సంతోషించారు. భూమాత పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు నా పెళ్లికార్డుతో ఇంతమందికి తెలిశాయి. దీనికి మూలకారణం మా నాన్నే. ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ కోసం చైతన్య సదస్సులు నిర్వహిస్తారు. మా చెల్లికి పక్షులంటే ఇష్టం. వేసవిలో పక్షుల కోసం ఒకపాత్రలో నీరు, గింజలు పెడుతుండేది. పక్షుల సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో రెండు వేల బర్డ్ ఫీడర్ బాక్సులు పంచింది. మా ముత్తాత రాజేశం గారు ఫ్రీడమ్ ఫైటర్. మా తాత శంకరయ్య కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. అదే వారసత్వంతో నాన్న కూడా వేసవిలో నగరంలో వాటర్ ట్యాంకులతో నీటి పంపిణీ వంటి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. బతుకమ్మ వేడుక కోసం గునుగుపువ్వు సేకరించి శుద్ధి చేసి పంచడం కూడా చాలా ఇష్టంగా చేస్తాం. మనం మన సంస్కృతికి వారసులం మాత్రమే కాదు వారధులం కూడా. ప్రతి సంప్రదాయాన్నీ ఇలా సృజనాత్మకంగా మలుచుకోగలిగితే మనం చేసిన పని మనకు ప్రత్యేకతను ఇస్తుంది. సాంస్కృతిక వారధులుగా సంతోషమూ కలుగుతుంది. పెళ్లి పత్రిక మీద దేవుడి బొమ్మలు, వధూవరుల ఫొటోలు ఉంటాయి. వాటినిపారేయలేక ఇంట్లోనే పెట్టుకుంటే దొంతర పెరిగిపోతూ ఉంటుంది. మా పెళ్లి పత్రిక మాత్రం తులసి మొక్కగా మీ కళ్ల ముందు ఉంటుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ’’ అని సంతోషంగా వివరించింది డాక్టర్ శరణ్య. – వాకా మంజులారెడ్డి -
బతిమిలాడినా రాలేదు.. నటి శరణ్యపై నిర్మాత ఫైర్
తమిళ సినిమా: ఆదిరాజ్ దర్శకత్వం వహింన చిత్రం అరువా సండై. వైట్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రాజా నిర్మిం కథానాయకుడిగా నటింన చిత్రం ఇది. సిలంది, కన్నడ చిత్రం గణతంత్ర చిత్రాల ఫేమ్ ఆదిరాజా దర్శకత్వం వహింన ఈ చిత్రానికి ధరన్ కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. నిర్మాత కలైపులి ఎస్ ధాను తమిళ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ మురళి, కేఆర్, నటుడు నిర్మాత కె. రాజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, కథానాయకుడు వి.రాజా మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తాను ఎంతో కష్టపడి నిర్మించి విడుదల చేస్తున్నానని చెప్పారు. అయితే చిత్ర ప్రమోషన్స్‌కి హీరోయిన్లు రావడం లేదని అంటున్నారని, చివరికి అమ్మ పాత్ర పోషిస్తున్న నటీమణులు కూడా రావడం లేదని ఆరోపించారు. ఈ చిత్రంలో నటి శరణ్య పొన్వన్నన్ ది హీరోయిన్ పాత్ర కంటే ముఖ్యమైందని చెప్పారు. అలాంటిది ఆమె చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమిలాడినా పాల్గొనలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. అదే పెద్ద నిర్మాత చిత్రం అయితే ఆమె ఇలా ప్రవర్తిస్తుందా..? అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా వర్ధమాన నిర్మాతలను తొక్కేసే ప్రయత్నం చేయరాదన్నారు. అతిథిగా పాల్గొన్న నిర్మాత కె.ఆర్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకున్నారు. -
క్యాన్సర్‌తో పోరాటం.. ప్రముఖ యువ నటి మృతి
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (35) కన్నుమూశారు. కేరళ త్రివేండ్రంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం(ఆగస్టు9)న తుదిశ్వాస విడిచారు. పదేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో అప్పటి నుంచి శరణ్యకు 11 పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శరణ్యకు పరిశ్రమలోని పలువురి నటులు సహాయం అందించారు. అయితే కొన్ని వారాల క్రితం ఆమెకు కరోనా సోకడంతో మరోసారి ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడింది. న్యుమోనియాతో పాటు రక్తంలో స్టోడియం స్థాయిలు పడిపోవడంతో కొన్ని రోజుల పాటు కేరళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శరణ్య చికిత్స పొందింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడటంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారం కన్నుమూసింది. మంత్రకోడి, సీత మరియు హరిచందనం సహా పలు మలయాళ టీవీ సిరియల్స్‌తో బాగా పాపులర్ అయిన శరణ్య పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది. -
ఇంటర్నెట్లో అది దొరకదు!
పార్వతీశం, శ్రీవల్లి, శరణ్య, నరేన్, పోసాని కృష్ణమురళి, బాలాచారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రపటం’. బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత ఆర్.బి. చౌదరి విడుదల చేశారు. బండారు దానయ్య కవి మాట్లాడుతూ– ‘‘ఇంటర్నెట్లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి.. దొరకనిదల్లా భావోద్వేగం మాత్రమే. దాన్ని మా చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రి, కూతురి కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలున్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’ కూడా బాగా వచ్చింది. మరో రెండు చిత్రాలు కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను’’ అన్నారు. -
నటి ఇంట్లో విషాదం
చెన్నై: తమిళ, తెలుగు సినిమాల్లో హీరోల తల్లి పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి శరణ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ దర్శకుడు ఆంటోనీ భాస్కర్ రాజ్(95) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని విరుగంబక్కమ్‌లో తన కూతురు శరణ్య ఇంట్లో ఉన్న ఆయనకు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. (దర్శకుడు నిషికాంత్ ఇకలేరు) దర్శకుడి మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా 70కు పైగా చిత్రాలను తెరకెక్కించిన ఏబీ రాజ్ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువగా తమిళనాడులోనే జరిగింది. తొలుత శ్రీలంకలో దర్శకుడిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మలయాళం పరిశ్రమలో అడుగు పెట్టారు. అక్కడ స్టార్ హీరోలతో కలిసి పలు హిట్ సినిమాలు నిర్మించిన ఆయన తమిళంలోనూ సినిమాలు రూపొందించారు. (సెప్టెంబర్‌లో బిగ్‌బాస్; అతడికి 16 కోట్లు!) -
తండ్రి మందలించాడని..
గొల్లపల్లి(వెల్గటూర్): చదువుకోమని తండ్రి మందలించడంతో మండలంలోని కిషన్‌రావుపేటకు చెందిన కీకల శరణ్య అనే డిగ్రీ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కీకల చంద్రయ్య కూతురు శరణ్య ధర్మారం మండలంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుతుంది. కొద్ది రోజుల క్రితం చదువు విషయమై తండ్రితో వాగ్వాదం జరిగింది. దీంతో కలత చెందిన శరణ్య ఈనెల 27న వేకువ జామున ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కరీంనగర్‌కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తండ్రి చంద్రయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వేధింపులతోనే శరణ్య ఆత్మహత్య
ముషీరాబాద్: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారి వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, వారిని శిక్షించాలని కరీనంగర్‌లోని కాపువాడకు చెందిన మృతురాలి తల్లిదండ్రులు మోహన్, విజయ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ చిన్న కుమార్తె శరణ్య(25)ను రామగుండం ఎన్టీపీసీకి చెందిన ఎం.మధుకర్‌కు ఇచ్చి 2015 నవంబర్‌లో వివాహం జరిపించామన్నారు. రూ.10లక్షలు నగదు, 30తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.30లక్షలు విలువ చేసే రెండుగుంటల స్థలాన్ని కట్నం కింద ఇచ్చామన్నారు. తమ కుమార్తె ఓసాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా పెళ్లయిన తరువాత ఉద్యోగం మానిపించి మధుకర్ తనతోపాటు బెంగళూరు తీసుకెళ్లారన్నారు. అదనపు కట్నం కోసం భర్త చిత్రహింసలకు గురిచేయడంతో ఈ నెల 3న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆమె ఏడు నెలల గర్భవతిని చెప్పారు. శరణ్య మృతిపై బెంగళూరులోని మాడివాల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందన్నారు. మధుకర్ తనకున్న పలుకుబడితో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, కరీంనగర్ ఎస్పీ స్పందించి తమ కుమార్తె ఆత్మహత్యకు కారుకులైన మధుకర్, అతని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయూలని కోరారు. -
భర్త వేధింపులే బలి తీసుకున్నాయి...
ఆత్మహత్య చేసుకున్న శరణ్య తల్లిదండ్రుల ఆరోపణ ముషీరాబాద్: శాడిస్తు భర్త వేధింపులు తాళలేక తన కుమార్తె శరణ్య ఆత్మహత్య చేసుకుందని కరీనంగర్ జిల్లా కాపువాడకు చెందిన మృతురాలి తల్లిదండ్రులు మోహన్, విజయలు ఆరోపించారు. సోమవారం రాంనగర్ వారు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... చిన్న కుమార్తె శరణ్య(25)ను గోదావరిఖని ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్ రాజమౌళి కుమారుడు ఎం.మధుకర్‌కు ఇచ్చి 2015 నవంబర్‌లో పెళ్లి చేశారు. రూ.10 లక్షలు నగదు, 30 తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.30 లక్షలు విలువ చేసే రెండు గుంటల స్థలం కట్నం కింద ఇచ్చారు. పెళ్లికి ముందు శరణ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. నెలకు రూ.80 వేలు జీతం వచ్చేది. ఉద్యోగం మాన్పిం చి భర్త శరణ్యను తనతో పాటు బెంగళూర్ తీసుకెళ్లాడు. ప్రస్తు తం ఆమె ఏడు నెలల గర్భిణి. బెంగళూర్ వెళ్లాక మధుకర్ భార్యను మానసిక శారీరక వేధింపులకు గురి చేసేవాడు. ఉద్యోగానికి వెళ్లే ముందు భార్య ఎవరితోనూ ఫోన్లో మాట్లాడకూడదని ఫోన్‌కు లాక్ చేసేవాడు. ఏప్రిల్ 25న కరీంనగర్లో శర్యణకు శ్రీమంతం చేశారు. బెంగళూరుకు తిరిగి వెళ్లే సమయంలో తన భర్త వేధిస్తున్న తీరును తల్లిదండ్రులకు చెప్పి రోదించింది. అయితే, తల్లిదండ్రులు కూతురికి సర్దిచెప్పి పంపారు. కాగా, భర్త మధుకర్, అత్తింటివారు రకరకాలుగా వేధిస్తుండటంతో తాళలేక తమ కుమార్తె ఈనెల 3న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని శరణ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె మృతిపై బెంగళూరులోని మాడివాల పోలీస్ స్టేష న్ పరిధిలో కేసు నమోదు చేశామని, అయితే అల్లుడు మధుకర్ తన పలుకుబడితో కేసును తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి నాయిని, డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీ స్పందించి తమ కుమార్తె ఆత్మహత్యకు కారుకులైన అల్లుడు మధుకర్, అతని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించాలని వేడుకున్నారు. -
రీ పోస్టుమార్టం చేయండి
సాక్షి, చెన్నై: ఎస్వీఎస్ వైద్య కళాశాల విద్యార్థిని శరణ్య మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు మద్రా సు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలోని ఎస్వీఎస్ సిద్ధ వైద్య కళాశాలకు చెందిన విద్యా కుసుమాలు మోనీషా, శరణ్య, ప్రియాంక అనుమానాస్పద స్థితిలో బావిలో గత నెల శవాలుగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీసీఐడీ దర్యాప్తు చేస్తూ వస్తున్నది. అయితే, తమ కుమార్తె మృతిలో అనుమానం ఉందంటూ మోనీషా తండ్రి తమిళరసన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో మోనీషా మృత దేహానికి రీ పోస్టుమార్టం చెన్నైలో జరిగింది. ఈ నివేదిక హత్యే అన్న అనుమానాలకు బలం చేకూరినట్టు అయింది. ఈ పరిస్థితుల్లో తన కుమార్తె శరణ్య మృత దేహానికి కూడా రీ పోస్టుమార్టం చేయాలంటూ ఆమె తండ్రి ఏలు మలై కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన అభ్యర్థనను సింగిల్ బెంచ్ తిరస్కరించింది. మృత దేహం ఖననం చేసి రెండు వారాలకు పైగా అవుతున్నదని, ఈ సమయంలో మళ్లీ రీ పోస్టుమార్టంకు ఆదేశాలు ఇవ్వలేమని బెంచ్ స్పష్టం చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఏలుమలై అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ న్యాయమూర్తి సతీష్‌కుమార్ అగ్నిహోత్రి, న్యాయమూర్తి వేణుగోపాల్ నేతృత్వంలో బెంచ్ ముందుకు గురువారం వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది శంకర సుబ్బు వాదనలు విన్పించారు. అయితే, ప్రభుత్వం తరపు న్యాయవాది షణ్ముగ వేలాయుధం రీ పోస్టుమార్టంకు అడ్డు తగులుతూ వాదన విన్పించారు. దీంతో న్యాయమూర్తులు జోక్యం చేసుకుని పిటిషనర్ రీ పోస్టుమార్టం కోరుతుంటే, ప్రభుత్వానికి ఎందుకు ఇంత వ్యతిరేకత అని స్పందించారు. చివరకు రీ పోస్టుమార్టంకు ఆదేశించారు. అయితే, మృత దేహాన్ని ఖననం చేసిన చోటు రీ పోస్టుమార్టం జరగాలని సూచించారు. అలాగే, పిటిషనర్ కోరినట్టుగా, పోస్టుమార్టం బృందంలో వారి తరఫు డాక్టర్‌ను నియమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారి తరపు డాక్టర్ పోస్టుమార్టంను పర్యవేక్షించ వచ్చేగానీ, పోస్టుమార్టం జరపకూడదంటూ సూచించారు. -
ఇక సినిమాలకు గుడ్ బై..?
వినాయకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన, కేరళ కుట్టి శరణ్య మోహన్.. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి, తరువాత దక్షిణాదిలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్ రోల్స్‌తో పాటు చెల్లెలి పాత్రల్లో కూడా అలరించిన ఆమె ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యే కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అరవింద్ కృష్ణన్ ను పెళ్లాడిన శరణ్య.. సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తుందట. అయితే స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్, సింగర్ అయిన శరణ్య ఆ రంగాల్లో తన కెరీర్ ను కంటిన్యూ చేయాలనుకుంటుంది. మరి శరణ్య అనుకున్నట్టుగా సినిమాలకు దూరమవుతుందో లేక అందరూ హీరోయిన్ల లాగే లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి. -
హిచ్‌కాక్ తరహా స్క్రీన్‌ప్లే
ఆ బంగ్లాలో ఓ ఫ్యామిలీ దిగుతుంది. అక్కడ ఏవేవో వింతలూ విడ్డూరాలూ వాళ్లకు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘నో ఎండ్’. భరత్, స్నేహానాయుడు, ప్రవీణ్, శరణ్య కాంబినేషన్లో మురళి కామేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ వింత అనుభూతిని కలిగిస్తుందని, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని మురళి కామేటి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాము అద్దంకి, కెమెరా: రవి.ఎం. మురళీకృష్ణ, సహనిర్మాతలు: సంజీవ కామేటి, నరేశ్ యాదవ్.