ఇంటర్నెట్‌లో అది దొరకదు! | Chitrapatam Movie Motion Teaser Launch | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌లో అది దొరకదు!

Published Sun, Apr 25 2021 6:28 AM | Last Updated on Sun, Apr 25 2021 6:28 AM

Chitrapatam Movie Motion Teaser Launch - Sakshi

పార్వతీశం, శ్రీవల్లి, శరణ్య, నరేన్, పోసాని కృష్ణమురళి, బాలాచారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రపటం’. బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత ఆర్‌.బి. చౌదరి విడుదల చేశారు. బండారు దానయ్య కవి మాట్లాడుతూ– ‘‘ఇంటర్నెట్‌లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి.. దొరకనిదల్లా భావోద్వేగం మాత్రమే. దాన్ని మా చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రి, కూతురి కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలున్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘డాటర్‌ ఆఫ్‌ బుచ్చిరెడ్డి’ కూడా బాగా వచ్చింది. మరో రెండు చిత్రాలు కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement