Naren
-
మార్కెట్ పతనానికి కారణం ఈ వ్యాఖ్యలేనా..?
భారత స్టాక్‌మార్కెట్ సూచీలు గత కొన్ని రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తీవ్రంగా పడిపోయిన మార్కెట్ సూచీల్లో ప్రధానంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లే అధికంగా ఉన్నాయి. అందుకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) శంకరన్ నరేన్ చేసిన కామెంట్లు కారణమని కొందరు భావిస్తున్నారు. అసలు ఆయన స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేశారో తెలుసుకుందాం. స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లు గత ఐదేళ్లలో సాధించిన లాభాలను కాపాడుకోవాలని నరేన్ సూచించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రస్తుతం అధిక వాల్యుయేషన్‌లో ఉన్నాయని, రిస్క్‌లను నిర్వహించడానికి వైవిధ్యభరితంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.లాభాలు కాపాడుకోవడం: గత ఐదేళ్లలో ఆర్జించిన రాబడులను కాపాడుకోవాలని నరేన్ నొక్కి చెప్పారు. ఆ సమయంలో ఈక్విటీలు లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లు గణనీయమైన రాబడులను చూశారని ఆయన పేర్కొన్నారు.ఓవర్ వాల్యుయేషన్: లార్జ్ క్యాప్ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు అధిక విలువను కలిగి ఉన్నాయని నరేన్ అన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను విక్రయించడమే ఈ అసమానతలకు కారణమని, ఇది మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ధరలను పెంచేలా చేసిందన్నారు.డైవర్సిఫైడ్ స్ట్రాటజీ: ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్, గ్లోబల్ స్టాక్స్, బంగారం, వెండి వంటి పెట్టుబడులను సూచిస్తూ వైవిధ్యభరితంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెట్టుబడులన్నీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టొద్దని తెలిపారు.మార్కెట్ అస్థిరత: 2008-2010 కాలం కంటే 2025 మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు. ఇన్వెస్టర్లు ఈ విభాగాల్లో తమ పెట్టుబడులను రిడీమ్ చేసుకోవాలని సూచించారు.ఇదీ చదవండి: కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?వివరణనరేన్ చేసిన ఈ వ్యాఖ్యలను మార్కెట్ పరిగణలోకి తీసుకుని భారీగా నష్టపోయినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై నరేన్‌ను వివరణ కోరగా ఆయన స్పందించారు. ‘భారత మార్కెట్లో దీర్ఘకాలిక వృద్ధి తథ్యం. దానిపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ప్రస్తుత సవాలు డబ్బు సంపాదించడం కాదు. దాన్ని పరిరక్షించడం. ఇన్వెస్టర్లు తమ లాభాలను కాపాడుకోవడంపై దృష్టి సారించాలి. ఎప్పటినుంచో చాలామంది అంచనా వేస్తున్నట్టుగానే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ భారీగా పెరిగాయి. ఈ పెట్టుబడులతో జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. ఈ వ్యవహారంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా మాట్లాడుతూ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ఒడిదొడుకులకు లోనుకావద్దని, దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలని కోరారు. -
కడపను సినిమాల్లో అలా చూపించారు.. కానీ: నరేన్ రామ్
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్ర నరేన్ రామ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నరేన్ రామ మాట్లాడుతూ.. 'ఛాన్సుల కోసం వెతుకుతుండగా నన్ను పిలిచి మరి ఆఫర్ ఇప్పించారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి నా ప్రొఫైల్ చూసి ఓకే చెప్పారు. నా పాత్ర బాగుంటుంది. నాకు కథ నచ్చడంతోనే చేశాను. భవిష్యత్తులో ఈ డైరెక్టర్‌తో ఇంకా వర్క్ చేయాలని ఉంది. హీరో విశ్వ కార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాడు. మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హీరోయిన్ అయుషీ మంచి అమ్మాయి. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ కోసం నేను ఫస్ట్ టైం కడపకు వెళ్లా. చాలా వరకు అక్కడే షూట్ జరిగింది. సినిమాల్లో కడప అంటే ఫ్యాక్షన్ అలా చూపించారు. కానీ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు కూడా బాగా సపోర్ట్ చేశారు' అని అన్నారు. కాగా.. నరేన్ రామ త్వరలోనే తెలుగులో WHO అనే సినిమాతో రాబోతున్నారు. తమిళంలో కొన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. నరేన్ రామ సీనియర్ నటుడు గుమ్మడికి బంధువు. గుమ్మడి నరేన్‌కు తాతయ్య వరుస అవుతారు. అలా మొదట్నుంచి సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. తెలుగు వారైనా నరేన్ తల్లి తండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడ తమిళ పరిశ్రమలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. నరేన్ తమిళంలో మూడు సినిమాలు హీరోగా, ఒక సినిమాలో విలన్‌గా చేశారు. తెలుగులో కలియుగ పట్టణంలో సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. -
ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ ర్యాలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల ఫలితాలపై దేశీ మార్కెట్ల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో ఎస్ నరేన్ తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గి, పరిస్థితి సద్దుమణిగితే మార్కెట్లలో ఒక్కసారిగా ర్యాలీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే గానీ జరిగితే మార్కెట్ల ఫోకస్ మళ్లీ అమెరికా ఫెడ్ రేట్ల పెంపు తదితర పాత అంశాల పైకి మళ్లుతుందని చెప్పారు. మరో మారు మార్కెట్లో ఒడిదుడుకులకు ఇది దారితీయొచ్చన్నారు. అలా కాకుండా ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే, మరింత కరెక్షన్ చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని నరేన్ వివరించారు. క్రూడాయిల్ ధర భారీగా పెరిగిపోవడం భారత్‌కి ప్రతికూల పరిణామమే కాగలదన్నారు. ‘‘దీర్ఘకాల ఇన్వెస్టర్లు, సిస్టమాటిక్‌గా వచ్చే 12–18 నెలల పాటు పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ మంచి అవకాశం కాగలదు. దీర్ఘకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఇటు ఈక్విటీ, అటు డెట్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అసెట్ అలోకేషన్‌లో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి’’ అని నరేన్ చెప్పారు. మెరుగ్గా లార్జ్ క్యాప్స్ .. ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోందని నరేన్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) .. ప్రతి నెలా దేశీయంగా ఈక్విటీలను నికరంగా విక్రయిస్తూనే ఉన్నారని.. ఇప్పటి వరకూ 15.41 బిలియన్ డాలర్ల ఈక్విటీలను విక్రయించారని ఆయన చెప్పారు. 2008 తర్వాత ఎఫ్‌పీఐలు ఇంత సుదీర్ఘకాలం పాటు అమ్మకాలు జరపడం ఇదే ప్రథమం అని నరేన్ తెలిపారు. సాధారణంగా ఎఫ్‌పీఐలు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇప్పటి వరకూ భారీ స్థాయిలో అమ్మకాల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా కనిపిస్తున్నాయని నరేన్ చెప్పారు. మార్కెట్లలో మధ్యమధ్యలో వచ్చే ఒడిదుడుకుల కారణంగా వచ్చే 2–3 ఏళ్లలో వేల్యూ ఇన్వెస్టింగ్‌కు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాబట్టి వేల్యూ స్టాక్స్ ఆధారిత స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చని నరేన్ పేర్కొన్నారు. -
ఇంటర్నెట్లో అది దొరకదు!
పార్వతీశం, శ్రీవల్లి, శరణ్య, నరేన్, పోసాని కృష్ణమురళి, బాలాచారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రపటం’. బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత ఆర్.బి. చౌదరి విడుదల చేశారు. బండారు దానయ్య కవి మాట్లాడుతూ– ‘‘ఇంటర్నెట్లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి.. దొరకనిదల్లా భావోద్వేగం మాత్రమే. దాన్ని మా చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రి, కూతురి కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలున్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’ కూడా బాగా వచ్చింది. మరో రెండు చిత్రాలు కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను’’ అన్నారు. -
గీతాపురిలో ఏం జరిగింది?
నరేన్, శ్రవణ్ కుమార్, పార్థు, దుష్యంత్ కుమార్ ముఖ్య తారలుగా జి.రామకృష్ణ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘గీతాపురి కాలనీ’. గరలకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘స్టోరీ నచ్చడంతో రాజీపడకుండా నిర్మించాం. ఐదుగురి పిల్లల నేపథ్యంలో జరిగే స్టోరీ. విద్య విలువ చెప్పే చిత్రమిది’’ అన్నారు. ‘‘నటులు తప్ప పాత్రలు కనిపించవు ఈ సినిమాలో. గీతాపురిలో ఏం జరిగిందన్నది ఆసక్తిని కలిగిస్తుంది. పిల్లల సినిమాలు తక్కువ అవుతున్న సమయంలో బాలల సినిమా తీశాం’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్. ‘‘కో–ప్రొడ్యూస్ చేస్తూ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను’’ అన్నారు దుష్యంత్ కుమార్. ఈ సినిమాకు సంగీతం: రామ్ చరణ్, కెమెరా: మహేష్ మట్టి. -
జేపీ.. మోడీ ఫొటో వాడొద్దు: బీజేపీ
సాక్షి,హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన ఎన్నికల ప్రచారం, పత్రికాప్రకటనల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఫొటోను వాడుకోవటం ఏ మాత్రం సరికాదని బీజేపీ పేర్కొంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... తన స్వార్థం కోసం బీజేపీ, మోడీ పేర్లను జేపీ వాడుకోవటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే ఆయన తన ప్రచారంలో మోడీ ఫొటోలను తీసేసి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని లేకుంటే బీజేపీ కార్యకర్తలు ఆయన్ను నిలదీయాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు.