గీతాపురిలో ఏం జరిగింది? | Geethapuri Colony to release on May 18 | Sakshi
Sakshi News home page

గీతాపురిలో ఏం జరిగింది?

Published Fri, May 18 2018 4:28 AM | Last Updated on Fri, May 18 2018 4:28 AM

Geethapuri Colony to release on May 18  - Sakshi

నరేన్, శ్రవణ్‌ కుమార్, పార్థు, దుష్యంత్‌ కుమార్‌ ముఖ్య తారలుగా జి.రామకృష్ణ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘గీతాపురి కాలనీ’.  గరలకంఠ మద్దేటి శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్రం నేడు  విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘స్టోరీ నచ్చడంతో రాజీపడకుండా నిర్మించాం. ఐదుగురి పిల్లల నేపథ్యంలో జరిగే స్టోరీ. విద్య విలువ చెప్పే చిత్రమిది’’ అన్నారు. ‘‘నటులు తప్ప పాత్రలు కనిపించవు ఈ సినిమాలో. గీతాపురిలో ఏం జరిగిందన్నది ఆసక్తిని కలిగిస్తుంది. పిల్లల సినిమాలు తక్కువ అవుతున్న సమయంలో బాలల సినిమా తీశాం’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్‌. ‘‘కో–ప్రొడ్యూస్‌ చేస్తూ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్‌ రోల్‌ చేశాను’’ అన్నారు దుష్యంత్‌ కుమార్‌. ఈ సినిమాకు సంగీతం: రామ్‌ చరణ్, కెమెరా: మహేష్‌ మట్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement