shravan kumar
-
సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్'
నిర్మల్: సంక్రాంతి అంటే రంగవల్లులకు పేరు. అయితే ఆ సంక్రాంతి ముగ్గులో విభిన్నతను ప్రదర్శించాలనుకున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన చిత్రకారుడు అడ్డిగ శ్రావణ్ కుమార్.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత వయసు ప్రమేయం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు బానిసగా మారుతున్నారు. అధికసమయాన్ని వీటికే వెచ్చిస్తున్నారు. ఇదే అంశాన్ని స్థానిక మంజులాపూర్ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్ తన ఇంటిముందు స్వయంగా వేసిన ముగ్గులో సందేశం రూపంలో అందించాడు. రోడ్డుపై వచ్చిపోయే వారు సందర్శించేలా ‘‘డోంట్ బి అడిక్టెడ్’’ అంటూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గులో పలు సామాజిక మాధ్యమాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాడు. ఫేస్బుక్, ఇంస్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, జిమెయిల్, గూగుల్ క్రోమ్ వంటి పలు ఇంటర్నెట్ సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ వాటికే అడిక్ట్ అవుతున్న తీరును ఇలా సృజనాత్మకంగా ప్రదర్శించడం పలువురిని ఆలోచింపజేస్తోంది. చాలామంది విభిన్నరీతిలో ఇచ్చిన సందేశాన్ని ప్రశంసిస్తున్నారు. ఇవి కూడా చదవండి: సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ? -
ఎస్సై రాత పరీక్ష ఫలితాలపై స్టే ఎత్తివేత
సాక్షి, అమరావతి: ఎస్సై అభ్యర్థుల ‘ఎత్తు’ వివాదం కీలక మలుపు తిరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తమ ‘ఎత్తు’ను సరిగా కొలవలేదంటూ పలువురు అభ్యర్థులు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎస్సై రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. మంగళవారం కోర్టు హాలులో నిర్వహించిన ఎత్తు పరీక్ష ఫలితాలు, రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు గతంలో నిర్వహించిన ఫలితాలతో సరిపోలడంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై ఆరోపణలు చేస్తూ కోర్టుకొచ్చిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చి.. కోర్టు ముందుంచడంపైనా మండిపడింది. ఈ పత్రాల యథార్థతపై దర్యాప్తు చేయాలని గుంటూరు ఐజీ పాలరాజును ఆదేశించింది. ఆ వైద్యులను విచారించాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎత్తు, ఛాతీ కొలతలపై వివాదం ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లో భాగమైన ఎత్తు, ఛాతీ చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో ఎత్తు విషయంలో అర్హులుగా ప్రకటించిన తమను తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు వెల్లడించవద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ చేశాయి. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నరేంద్ర ధర్మాసనం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే రూ.లక్ష జరిమానా విధిస్తామని, అందుకు సిద్ధమైన అభ్యర్థులే ఎత్తు పరీక్షకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మందిలో 19 మంది పరీక్షకు హాజరవుతున్నామని, రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. రూ.లక్ష చొప్పున కట్టాల్సిందే కాగా.. న్యాయస్థానంలో కొలతలకు హాజరైన అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై తాము చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే రూ.లక్ష జరిమానా చెల్లిస్తామని రాసిచ్చిన నేపథ్యంలో ఆ మొత్తం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. తమకు అంత స్థోమత లేదని కొందరు అభ్యర్థులు చెప్పడంతో.. కోర్టు అంటే తమాషాగా ఉందా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. రూ.లక్ష చొప్పున చెల్లించాల్సిందేనని.. లేదంటే జైలుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌పై ఆగ్రహం మంగళవారం న్యాయస్థానంలోనే అభ్యర్థుల ఎత్తును ధర్మాసనం కొలిపించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కొలతలు సరిగానే ఉన్నాయని స్పష్టం చేసింది. అభ్యర్థుల తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ.. పిటిషనర్లు నిబంధనల ప్రకారం ఉండాల్సినంత ఎత్తు ఉన్నారని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నవ్వుతూ కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టునే శంకిస్తారా? అంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు అంటే నవ్వులాటగా ఉందా అంటూ శ్రవణ్‌కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తేలిగ్గా తీసుకుంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంది. -
బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం
సాక్షి, అమరావతి : పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం ద్వారా స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందని శ్రావణ్‌కుమార్ అనే న్యాయవాది తమ దృష్టికి తెచ్చిన అంశాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను ధర్మకర్తలా పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర వహించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సహజ వనరులపై ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయనే అంశాన్ని గుర్తుచేసింది. ప్రజలకు సమాన హక్కులు ఉన్న సహజ వనరులను కొందరు పెద్దల ముఠాకే దోచిపెట్టడం సమానత్వం సిద్ధాంతాన్ని అవహేళన చేయడమేనని స్పష్టంచేసింది. ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తవ్వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని అప్పట్లో ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతిన్నదని.. దానివల్ల ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రజల హక్కులను ఇసుక స్మగ్లర్లు కాలరాస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమిటని నాటి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని 2019, ఏప్రిల్ 4న అల్టిమేటం జారీచేసింది. మహిళా సంఘాల ముసుగులో దోపిడీ.. నిజానికి.. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇసుక రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అప్పగిస్తూ తొలుత ప్రకటించింది. మహిళా సంఘాల ముసుగులో ముఖ్యనేత దన్నుతో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్‌లను హస్తగతం చేసుకుని.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2016, మార్చి 4న ఆ విధానాన్ని రద్దుచేసి.. ఉచిత ఇసుక ముసుగులో తమ ముఠా దోపిడీకి అప్పటి సీఎం చంద్రబాబు రాచబాట వేశారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ప్రకాశం బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో భారీ పొక్లెయిన్లు, మర పడవలు ఏర్పాటుచేశారు. తద్వారా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయించిన ముఠా పెద్దఎత్తున అక్రమార్జన సాగించింది. దీనిపై 2016లోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2017, ఫిబ్రవరి 23న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. అయినా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 2019 జనవరి 17–18న చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టంచేసింది. ‘‘సహజ వనరులు ప్రజల ఆస్తులు. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాలి. నియంత్రణ లేకుండా ఇసుకను తవ్వి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య. ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేయడంవల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగింది. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించిన వారి నుంచి పరిహారాన్ని వసూలుచేసి.. దానితో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వం బాధ్యత’’. – 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేసిన వ్యాఖ్య. -
25 ఏళ్లయినా..గడువు కోరుతూనే ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి 18 ఏళ్లయినా నివేదక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సమయం కావాలని కోరుతూనే ఉంటారని అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాలు సమయం ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపై అమికస్ క్యూరీ చేసిన సూచనలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్‌లో నీటికొరతపై సుభాష్‌చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం నీటికొరత అంతగా లేకపోయినా, భవిష్యత్ అవసరాల నిమిత్తం సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇంకుడుగుంత ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. వాల్టా చట్టం కింద బోర్ల తవ్వకంపై నియంత్రణ అవసరమని చెప్పారు. దీనిపై నివేదిక అందజేయడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఏళ్లు గడిచినా ఇంకా గడువు కోరడం సాధారణంగా మారిందని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. 3 వారాలు గడువిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
‘ధిక్కరణ’ వేయండి.. చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్న ఆధారాలుంటే...ధిక్కరణ పిటిషన్ వేయాలని న్యాయవాది వేణుమాధవ్‌ను హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కొలనుల్లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. పీఓపీతో తయారు చేసే విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ ధూళ్‌పేటకు చెందిన తెలంగాణ గణేశ్‌మూర్తి కళాకా రుల సంక్షేమ సంఘంతో పాటు మరికొందరు హైకోర్టు లో 2022లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయలేదని, తాత్కాలిక కొలనుల్లో చేశామని తెలిపారు. ఈ క్రమంలో న్యాయవాది వేణుమాధవ్ వాదిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, విచారణను వాయిదా వేసింది. -
‘రైతుబంధు పక్కదారి’ నిజమే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం సొమ్మును పక్కదారి పట్టించిన విషయంపై వ్యవసాయ శాఖ స్పందించింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో జరిగిన అక్రమాలు, మరణించిన లబ్దిదారుల పేరుతో ఇతరులు రైతుబంధు సొమ్ము తీసుకుంటున్న వైనంపై ‘రైతుబంధు పక్కదారి’శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. నల్లగొండ ఏడీఏ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో దేవరకొండ ఏడీఏ వీరప్పన్, ఇతర అధికారులు ముడుదండ్లలో శుక్రవారం విచారణ నిర్వ హించారు. పెరికేటి రాఘవాచారి కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నా రు. రైతుబంధు డబ్బులు రెండేళ్లుగా ఇతరుల అకౌంట్లలో జమ అవుతున్న తీరును అడిగారు. లబ్దిదారులు వాస్తవాలను అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఏడీఏ విచారణ నివేదిక ఇవ్వగానే అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత తెలిపారు. -
దళిత గళం గొంతు నొక్కి!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ రిజర్వుడు నియోజక వర్గాలకు సంబంధించి టీడీపీ దళిత నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలైనా, నియోజకవర్గాలైనా, దళిత నేతలైనా చంద్రబాబు, లోకేశ్‌కు ఎప్పుడూ చిన్నచూపేనని స్పష్టం చేస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో లోకేశ్ పర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు జరిగిన దారుణ అవమానాన్ని గుర్తు చేస్తున్నారు. కనీస ప్రాధాన్యం లేకుండా.. యువగళం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. దాదాపు పన్నెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరిగింది. సత్యవేడులో హెలెన్, కొండేపిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని గెలిపించాలని కోరడం మినహా మిగిలిన నియోజవర్గాల్లో తమ నాయకులకు లోకేశ్ కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని టీడీపీలో దళిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గంగాధర నెల్లూరు, సూళ్లూరుపేట, గూడూరు, సింగనమల, కోడుమూరు, నందికొట్కూరు, బద్వేలు, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగినప్పటికీ లోకేశ్ దళిత నాయకుల ఊసెత్తలేదు. కనీసం ఇన్చార్జీలని చెప్పేందుకూ నిరాకరించారు. పూతలపట్టు ఇన్చార్జిగా మురళీమోహన్ పేరును యువగళం పాదయాత్ర తరువాత చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. తమ వారిని హీరోలుగా కీర్తిస్తూ.. యువగళం పాదయాత్ర ఇతర నియోజక వర్గాలలో సాగినప్పుడు లోకేశ్ తీరులో తేడా స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. అద్దంకిలో గొట్టిపాటి, వినుకొండలో ఆంజనేయులు, గురజాలలో యరపతినేనిని ఆ ప్రాంత హీరోలని ప్రశంసిస్తూ తమను విస్మరించడాన్ని ఏ కోణంలో చూడాలని టీడీపీలోని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వుడు స్థానాల్లో నాయకులను చులకనగా చూడటం, ఇతర వర్గాల విషయంలో మాత్రం లోకేశ్ వైఖరి కొట్టొచ్చినట్లు కనపడుతోందంటున్నారు. ఉన్నత వర్గాలదే పెత్తనం.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని రిజర్వుడు స్థానాల్లోనూ ఆయన వర్గానిదే పెత్తనం. జీడీ నెల్లూరు నియోజకవర్గం వ్యవహారాలన్నీ చిట్టిబాబునాయుడు కనుసన్నల్లోనే జరగాల్సిందే. గూడూరులో పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేటలో నెలవల సుబ్రమణ్యం, సింగనమలలో బండారు శ్రావణి, సంతనూతలపాడులో విజయకుమార్, బద్వేలులో రాజశేఖర్ పేరుకు మాత్రమే నాయకులు. సింగనమలలో అగ్రవర్ణాలకు చెందిన వారితో కూడిన త్రిసభ్య కమిటీదే పెత్తనం. కోడుమూరులో ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, నందికొట్కూరులో గౌరు వెంకటరెడ్డి, బద్వేలులో కె.విజయమ్మ చెప్పినట్లే నడుచుకోవాలి. అక్కడ దళిత నేతలది మౌనవ్రతమే. -
రాజధాని ప్రాంతలో శ్రావణ్ కుమార్ హల్చల్
గుంటూరు: రాజధాని ప్రాంతంలో మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ హల్చల్ చేశారు. రాజధానిలో 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి తుళ్లూరు మండలంలో చొరబడి టీడీపీ నాయకుల ఇళ్లలో బస చేశారు. ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ 24, 25, 26 తేదీలలో పలు రకాల నిరసనలు తెలియజేస్తామంటూ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. బుధవారం తుళ్లూరు దీక్షా శిబిరం వద్దకు వచ్చి హడావుడి చేసేందుకు యత్నించిన శ్రావణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విజయవాడకు తరలించారు. -
పరిమళించిన మానవత్వం: అప్పుడు తమిళ తంబి, ఇప్పుడు రామకృష్ణారెడ్డి
వైఎస్సార్: మండల కేంద్రమైన కలసపాడులోని ఆర్టీసీ బస్టాండులో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అనాథ వృద్ధుడిని వివేకానంద ఆశ్రమం చేరదీసింది. వివరాలు.. అనాథ అయిన ఇతను గాలికి తిరుగుతూ.. దొరికింది తింటూ నెల్లూరు నగరం చేరాడు అరవై ఏళ్ల క్రితం. అప్పటికి తనకు పదహారేళ్లు. అక్కడ హోటల్ నడుపుతున్న తమిళ తంబి రమ్మని పిలిచాడు. అన్నం పెట్టాడు. ఆశ్రయం ఇచ్చాడు. అమ్మానాన్న, గురువు అన్నీ తానే అయ్యాడు. హోటల్ యజమాని తొలిసారి తనను కుమార్ అని పిలిచాడు. అదే పేరుగా మారిపోయింది. కుమార్‌కు హోటల్ యజమానే వివాహం చేశాడు. కాలక్రమంలో హోటల్ యజమాని చైన్నెకి వెళ్లడంతో హోటల్ మూతపడింది. కుమార్ భార్య కూడా కాన్యర్‌తో మృతిచెందింది. దీంతో అనాథ అయిన కుమార్ నెల్లూరు నగరాన్ని వదిలి పాదచారిగా ప్రయాణం ప్రారంభించాడు. ఓపిక ఉన్నంత కాలం తిరిగాడు. అలసిపోయి మూడు రోజుల కిందట కలసపాడుకు చేరుకున్నాడు. ఆర్టీసీ బస్టాండులో ఉన్న అనాథ పరిస్థితిని గమనించిన స్థానిక వలంటీర్ శ్రావణ్‌కుమార్ వివేకానంద సేవాశ్రమం వ్యవస్థాపకులు పాపిజెన్నిరామకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చారు. బుధవారం ఆయన, ఆయన సతీమణి రామతులసితో వచ్చి అనాథకు స్నానం చేయించారు. ఫలహారం అందించారు. అనంతరం వివేకానంద సేవాశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. మానవత్వంతో కూడిన వీరి సేవలను స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
రహస్య ఫైళ్లను లీక్ చేశారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ క్లాస్–2 సభ్యుల నియామకాలను గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ నియామకాలకు సంబంధించి విశ్వవిద్యాలయాల చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేకున్నా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పారదర్శకంగా చేపట్టామని తెలిపింది. గత మూడు దశాబ్దాల్లో వీటిపై ఎలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకాల ఫైలు చాలా రహస్యంగా ఉంటుందని, పిటిషనర్ నిమ్మీ గ్రేస్ మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించిన ఈ సమాచారాన్ని ఆమె తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ మీడియాకు లీక్ చేశారని ప్రభుత్వం తెలిపింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు శ్రవణ్‌కుమార్‌పై ఈ ఏడాది మేలో కేసు కూడా నమోదు చేశారని వివరించింది. పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించింది. విశాఖకు చెందిన ముందడుగు ప్రజాపార్టీ నాయకురాలు నక్కా నిమ్మీగ్రేస్ తరఫున న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ (ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షుడు) దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీ‹Ùచంద్ర కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు శ్రవణ్‌కుమార్ గడువు కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ముఖ్యాంశాలు ఇవీ.... రాజకీయ సిఫారసులు అవాస్తవం.. విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక, విద్యా సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకడమిక్ సెనెట్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో క్లాస్–1, క్లాస్–2 సభ్యులుంటారు. ఈ సభ్యులను నియమించే అధికారం ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీదే. క్లాస్–2 సభ్యులను నిర్దిష్ట విధానంలోనే నియమించాలన్న నిబంధనలు లేవు. క్లాస్–2 నియామకాలు ‘నామినేట్’ కిందకే వస్తాయి కానీ ‘అపాయింట్మెంట్’ కిందకు రావు. వీటిని రాజకీయ సిఫారసుల ఆధారంగా చేపట్టారన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. దరఖాస్తులను పరిశీలించి పలు రకాలుగా వడపోత అనంతరం తుది జాబితా రూపొందించాం. క్లాస్–2 సభ్యుల నియామకానికి 541 దరఖాస్తులు రాగా 389 పేర్లను ఖరారు చేశాం. సిఫారసుల ప్రకారం వచ్చిన 201 బయోడేటాల్లో 57 మంది పేర్లనే నామినేట్ చేశాం. వీరిలో 36 మంది పూర్తిగా ప్రతిభ, సమర్థత ఆధారంగా నామినేట్ అయ్యారు. నియామకాల్లో మహిళలకు 50 శాతం.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిఫారసులను ప్రభుత్వం సవరించి క్లాస్–2 సభ్యుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం, మహిళలకు 50 శాతం స్థానం కల్పించింది. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకోలేదు. 2016లో క్లాస్–2 సభ్యులను ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ ఆధారంగా నామినేట్ చేశారు. 14 విశ్వవిద్యాలయాల్లో 116 మంది క్లాస్–2 సభ్యుల నియామకాన్ని 2019లో చేపట్టి ఆర్నెల్ల సుదీర్ఘ ప్రక్రియ తరువాత పూర్తి పారదర్శకంగా, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ పూర్తి చేశాం. రహస్యంగా ఉండే నియామకాల ఫైళ్లను పిటిషనర్ తప్పుడు, మోసపూరిత మార్గంలో సేకరించి దురుద్దేశంతో మీడియాకు లీక్ చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యరి్థస్తున్నాం. -
దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం పూర్తి
-
మృతదేహాలను వాళ్ల ఊరికి తరలిస్తాం
-
‘మృతదేహాలకు ఎంబామింగ్ జరగలేదు’
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం కొనసాగుతోందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్ తెలిపారు. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన బృందం రీ పోస్ట్‌మార్టం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోస్ట్ మార్టం మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. సీడీ, పెన్ డ్రైవ్ ద్వారా వైద్యులు హైకోర్టుకు నివేదిక అందిస్తారని ఆయన తెలిపారు. సాయంత్రం 5 గంటల లోపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు. రెండు అంబులెన్స్ వాహనాల్లో వారి గ్రామాలకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. పోస్ట్ మార్టంలో గాంధీ వైద్యులు ఎవ్వరూ పాల్గొనలేదని డాక్టర్ శ్రవణ్ కుమార్ చెప్పారు. గతంలో ఫోరెన్సిక్ వైద్యులు చేసింది ఏంటో తమకు తెలియదని.. నింబంధనల ప్రకారం జరిపారని ఆయన పేర్కొన్నారు. కాగా నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని చెప్పారు. 2-4 రోజులు రీ ఫ్రిజిరేటర్‌లో పెట్టామని.. మృతదేహాలు 50శాతానికి పైగా డి కంపోజ్ అయ్యాయని ఆయన తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం అడిగిన యంత్ర పరికరాలను తాము సమకూర్చామని డా. శ్రవణ్ తెలిపారు. శీతాకాలం వల్ల మృతదేహాలు ఇంకా అలాగే ఉన్నాయని.. అదే వేసవికాలంలో అయితే మూడు రోజుల్లో డీ కంపోజ్ అవుతాయని అన్నారు. ఒక్కో మృతదేహం రీ పోస్ట్ మార్టం చేసేందుకు 1 గంట సమయం పట్టే అవకాశం ఉందని డా. శ్రవణ్ తెలిపారు. రీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత వైద్యులు సాయంత్రం 7:30కి ఢిల్లీకి వెళ్లతారని ఆయన చెప్పారు. -
గిన్నిస్ బుక్‌లో ‘గాంధీ ఆస్పత్రి’
హైదరాబాద్: తెలంగాణ వైద్య ప్రదాయిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి చరిత్రలో మరో మైలురాయి అధిగమించింది. గంట వ్యవధిలో అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఆస్పత్రి సెమినార్ హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ రాజారావు, వైద్యులు వినయ్‌శేఖర్, ఆర్ఎంవోలు జయకృష్ణ, శేషాద్రి, సత్యరత్న ఈ వివరాలను వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన గాంధీ ఆస్పత్రిలో గంట వ్యవధిలో 11,416 మందికి బ్లడ్‌ప్రెషర్ (బీపీ) రీడింగ్‌లు నమోదు చేశారు. దేశంలోని 37 కేంద్రాల్లో ఏకకాలంలో ఈ ప్రక్రియ కొనసాగగా, అత్యధికంగా బీపీ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆస్పత్రి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుందని వారు వివరించారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి శుక్రవారం అధికారికంగా సర్టిఫికెట్ అందిందని తెలిపారు. -
డొల్ల కంపెనీలపై హైకోర్టులో నేడు విచారణ
సాక్షి, విజయవాడ: డొల్ల కంపెనీలకు భూ కేటాయింపులపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. అర్హతలేని వివిధ డొల్ల కంపెనీలకు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) వేల ఎకరాల భూములను కేటాయించిందని పేర్కొంటూ వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. మాజీ న్యాయాధికారి శ్రావణ్ కుమార్ హైకోర్టులో తన వాదనలు వినిపించనున్నారు. -
మంత్రులుగా ఫరూక్, శ్రావణ్ ప్రమాణం
సాక్షి, అమరావతి: మరో కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం, గిరిజన వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్‌కుమార్ ఆదివారం ప్రమాణం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో ఉదయం 11.45 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఫరూక్ తెలుగులో, ఆ తర్వాత శ్రావణ్‌కుమార్ ఇంగ్లిష్‌లో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామంటూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రులు ఇద్దరినీ గవర్నర్ అభినందించారు. కిడారి శ్రావణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రావణ్‌కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండుసార్లు పాదాభివందనం చేశారు. ప్రమాణం సందర్భంగా తెలుగు పదాలను ఉచ్చరించడానికి ఫరూక్ కొద్దిగా తడబడ్డారు. ఏడు నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం మంత్రివర్గ సభ్యులతో గవర్నర్, ముఖ్యమంత్రి గ్రూప్ ఫొటో దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. -
నా హత్యకు కీలకమంత్రి కుట్ర
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి నా హత్యకు కుట్ర పన్నారు..రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విజయవాడకు చెందిన రౌడీషీటర్‌తో హత్యచేయించేందుకు పథకం రచించారు.. ఇందుకోసం రూ.5 కోట్లతో మంత్రి ఒప్పందం కుదుర్చుకున్నారంటూ ముందడుగు ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది జె.శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శ్రవణ్‌కుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఐటీ కంపెనీల్లో రూ.25 వేల కోట్ల అవినీతి జరిగిందని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వ్యక్తిగత ఆస్తుల మీద సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తాను హైకోర్టులో గత నెలలో పిల్ వేశామని చెప్పారు. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న తనను హతమార్చేందుకు అసాంఘిక శక్తులతో కలిసి ప్రభుత్వం కుట్రపన్నినట్లు సమాచారముందన్నారు. ఈ విషయమై బుధవారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశానని చెప్పారు. విచారణ జరిపించి, తనకు రక్షణ కల్పించాలని ఇంటెలిజెన్స్ అదనపు డెప్యూటీ జనరల్‌ను కోరానన్నారు. తనకు ఏదైనా హాని జరిగితే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కాగా, న్యాయపోరాటంలో భాగంగా భవిష్యత్‌లో చంద్రబాబు, లోకేష్ అవినీతిపై పూర్తి ఆధారాలు సేకరించి, హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. -
గీతాపురిలో ఏం జరిగింది?
నరేన్, శ్రవణ్ కుమార్, పార్థు, దుష్యంత్ కుమార్ ముఖ్య తారలుగా జి.రామకృష్ణ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘గీతాపురి కాలనీ’. గరలకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘స్టోరీ నచ్చడంతో రాజీపడకుండా నిర్మించాం. ఐదుగురి పిల్లల నేపథ్యంలో జరిగే స్టోరీ. విద్య విలువ చెప్పే చిత్రమిది’’ అన్నారు. ‘‘నటులు తప్ప పాత్రలు కనిపించవు ఈ సినిమాలో. గీతాపురిలో ఏం జరిగిందన్నది ఆసక్తిని కలిగిస్తుంది. పిల్లల సినిమాలు తక్కువ అవుతున్న సమయంలో బాలల సినిమా తీశాం’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్. ‘‘కో–ప్రొడ్యూస్ చేస్తూ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను’’ అన్నారు దుష్యంత్ కుమార్. ఈ సినిమాకు సంగీతం: రామ్ చరణ్, కెమెరా: మహేష్ మట్టి. -
కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం
తుళ్ళూరు: రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, అసైన్డ్, సీలింగ్ భూమి సాగుదారుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలతో ప్రభుత్వం ఏంచేయాలా అన్న ఆలోచనలో పడింది. ఇందులో భాగంగా రైతు నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. శనివారం తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్, జాయింట్‌కలెక్టర్ శ్రీధర్, సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు రాజధాని ప్రాంత రైతునాయకులతో సమావేశమై సమస్యలపై సుదీర్ఘంగా చర్చిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు పనులు లేవని, కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. రైతు దగ్గర భూమి ఉందనీ, ప్రభుత్వం వద్ద పాలసీ ఉందనీ, దీంతో ఇంతవరకు విజయవంతం చేయగలిగామన్నారు. కానీ కూలీల పరిస్థితే అర్థం కావటంలేదన్నారు. 9.3 ద్వారా భూములు తీసుకోవడం, 9.14 ద్వారా భూస్వాధీన ఒప్పందపత్రాలు సిద్ధం చేసి కౌలు పరిహారం ఇవ్వడంతో మా పని అయిపోతుందని భావించవద్దని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లనుద్దేశించి అన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు 10%మాత్రమే పనులు జరిగాయని, ఇంకా 90% చేయాల్సిందన్నారు.అధికారులు సమస్యలను అధ్యాయనం చేసి పరిష్కారం కనుగొనాలన్నారు. పనుల నిర్వహణలో పురోగతిపై సమీక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతు నాయకులు రాజధాని ప్రాంతంలోని ప్రజలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం శ్రావణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు ఎన్.ఆర్.ఇ.జీ.యస్ ద్వారా పనులు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ఉండే ముఠామేస్తీలను కలిసి ఉపాధి పనులపై చర్చిస్తామన్నారు. కూలీలకు పనులు కల్పించడంతో పాటు జాబ్‌కార్డుల మంజూరుకు చర్యలుతీసుకోవాలని అధికారులను కోరారు. బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి రుణం పొందిన అసైన్డ్ సాగుదారులు రుణమాఫీ కోసం సీఆర్డీఏ కార్యాలయంలో స్పెషల్‌గ్రేడ్ ఆఫీసర్ రహంతుల్లాను సంప్రదించాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటి వరకు గుర్తించిన భూమిలేని రైతులకు నెలవారీ పింఛన్ రూ.2500 అందచేయాలన్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులు, ఆర్డీవో తూమాటి భాస్కరనాయుడు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత పాల్గొన్నారు. -
సమీకరణపై మల్లగుల్లాలు
తాడికొండ/తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. కేవలం శుక్ర, శనివారాలే గడువు ఉండడంతో అటు మంత్రులు, ఇటు అధికారులు ఇక సమీకరణ అసాధ్యమేనన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో తొలి విడతలో భాగంగా, 31,205 ఎకరాల భూములు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జనవరి 1 తేదీన సమీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 18,700 ఎకరాలకు మాత్రమే రైతులు తమ అంగీకార పత్రాలు అందజేశారు. ఈ నెల 14వ తేదీతో సమీకరణ గడువు ముగియనుండడంతో దీనిపై నియమితులైన ప్రత్యేక అధికారులు, దగ్గరుండి సమీకరణ పనులు చూస్తున్న రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఆందోళనకు గురవుతున్నారు. కేవలం ఈ రెండు రోజుల్లో 12,505 ఎకరాల భూములు ఎలా సమీకరించాలన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది. దీంతో తొలివిడత సమీకరణ లక్ష్యం పూర్తి చేయడం అసాధ్యమని భావించిన అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సమీకరణ గడువు పెంచుతారా, లేక భూ సేకరణకు వెళతారా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు భూములు ఇవ్వబోమని అభ్యంతరం తెలుపుతూ 9.2 ఫారాలు అందజేస్తున్న రైతుల సంఖ్య గ్రామాల్లో పెరిగిపోతోంది. ఈ దశలో సేకరణకు దిగితే రైతుల నుంచే కాక అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాందోళనలు ప్రభుత్వాధినేతల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం. పూర్తిస్థాయి వ్యతిరేకత తాడేపల్లి రూరల్ : భూ సమీకరణ ప్రక్రియకు తాడేపల్లి మండలంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. గత నెల 12వ తేదీన ఇక్కడ సమీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 126 మంది రైతులు కేవలం 159.53 ఎకరాలు ఇచ్చేందుకు తమ అంగీకార పత్రాలు అందజేశారు. గ్రామాల వారీగా చూస్తే ఉండవల్లిలో 22 మంది రైతుల 19.73 ఎకరాలు ఇవ్వగా, దీనిలో 5.70 ఎకరాలు వివాదంలో ఉంది. పెనుమాకలో 88 మంది రైతులు 133.97 ఎకరాలు, తాడేపల్లిలో 16 మంది రైతులు 5.83 ఎకరాలు ఇచ్చారు. ఈ మండలంలోని అధిక శాతం మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములు ఇవ్వడం లేదంటూ 9.2 దరఖాస్తులను అధికారులకు అందజేశారు. -
ముక్కోణపు ప్రేమలో క్రైమ్
మోడల్ ఉపేన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ముక్కోణపు ప్రేమకథతో ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ స్టేట్స్’. శ్రవణ్‌కుమార్ నల్లా దర్శకుడు. అంబికా సోనీ, తాన్యా శర్మ కథానాయికలు. ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘బూచమ్మ బూచోడు’ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో ‘లవ్ స్టేట్స్’ చేస్తున్నాం. ఇదో క్రైమ్ లవ్‌స్టోరీ. నూతన సంగీతదర్శకుడు పవన్ పాటలు ప్రత్యేక ఆకర్షణ. వచ్చే నెల 20న రిలీజ్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అనిల్. -
పంటకు రక్షణ...సోలార్ దీపపు ఎర
వర్గల్: పంటచేనులో పైరును నష్ట పరిచే పురుగుల ఉధృతిని అంచనా వేసేందుకు రైతులు పొలాల్లో విద్యుత్ బల్బులతో కూడిన దీపపు ఎరలు ఏర్పాటు చేస్తారు. ఎరలో చిక్కిన పురుగుల సంఖ్య ఆధారంగా తగు సస్యరక్షణ చేపడుతుంటారు. లేదా వ్యవసాయాధికారుల సలహా తీసుకుంటారు. కోతల కాలం..కరెంటు ఎపుడుంటుందో, ఎపుడుపోతుందో, ఎన్ని సార్లు పోతుందో, అసలు ఆ రోజు వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి గడ్డు కాలంలో కరెంటు ఆధారంగా ఏర్పాటు చేసిన దీపపు ఎరలు చతికిలపడతాయనడంలో సందేహం లేదు. కరెంటు అవసరం లేకుండా కేవలం సూర్య కాంతి ఆధారంగా స్వయం ఇంధనం సమకూర్చుకుని పనిచేసే ‘సోలార్ దీపపు ఎర’లు అందుబాటులోకి వచ్చాయి. చక్కని పనితీరుతో రైతుకు ఉపయుక్తంగా నిలిచిన ఈ సోలార్ ఎరలకు ప్రభుత్వం సబ్సిడీలను సైతం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వర్గల్ మండలం అంబర్‌పేటలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శన కోసం వ్యవసాయ శాఖ (ఆత్మ) ఈ సోలార్ దీపపు ఎరను ఏర్పాటు చేయించింది. మంగళవారం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన కార్యక్రమంలో విద్యుత్ అవసరం లేని ఈ ఎర ప్రయోజనాన్ని, ధర తదితర వివరాలను గజ్వేల్ ఏడీఏ శ్రవణ్ కుమార్, ఆత్మ బీటీఎం శ్రీధర్ రావులు వివరించారు. విద్యుత్ కోతలకు ప్రత్యామ్నాయం పగటివేళ సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకునే సోలార్ ప్లేట్, దీపపు స్టాండ్ పైన బిగించి ఉంటుంది. దిగువన సోలార్ దీపం అమరి ఉంటుంది. దాని కింద ఇనుప తొట్టె (దాదాపు 8 లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం) ఉంటుంది. దీంట్లో నీటిని నింపి నాలుగు చుక్కలు కిరోసిన్ వేయాలి. పగలు సోలార్ శక్తిని స్వీకరించిన ఈ దీపం చీకటి పడగానే ప్రకాశవంతంగా వెలుగుతుంది. పొలంలో ఉన్న రెక్కల పురుగులు ఈ దీపం వెలుతురుకు ఆకర్షితమై ఎరతో కూడిన ఇనుప తొట్టె ద్రావణంలో పడి చనిపోతాయి. ఎరలో పడిన పురుగుల సంఖ్య ఆధారంగా వాటి ఉధృతి అంచనా వేయవచ్చు. పురుగుల దాడి తీవ్రత ఆధారంగా తగు సస్యరక్షణ చేపట్టి భారీ నష్టం వాటిల్లకముందే తగు సస్యరక్షణతో పంటను కాపాడుకునే అవకాశముంటుంది. విద్యుత్‌కు ప్రత్యమ్నాయంగా నిలిచే ఈ ఎరలను రైతులకు సబ్సిడీపై ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది కార్యరూపం దాల్చితే 50 శాతం సబ్సిడీ (సగం ధర)కే వీటిని రైతులు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని ధర రూ.2,800. ఒక ఎకరం చేలో రెండు సోలార్ ట్రాప్‌లు ఏర్పాటు చేసుకోవాలని, వీటిని సులువుగా ఎక్కడికైనా తీసుకెల్లవచ్చని అధికారులు వివరించారు. వీటికి సంబంధించిన సమాచారం కోసం రైతులు ఏడీఏగజ్వేల్-సెల్ నంబర్ 8886614286లో సంప్రదించవచ్చు. -
డి.గొటివాడలో డెంగ్యూ
వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో నలుగురు ఇంటింటా జ్వరపీడితులు గ్రామంలో కొరవడిన పారిశుద్ధ్యం వైద్య సేవలందిస్తున్నా తగ్గని జ్వరాలు భయాందోళనలో గ్రామస్తులు మాడుగుల: మండలంలోని డి.గొటివాడ వాసులు మంచం పట్టారు. పది రోజులుగా జ్వరాలతో విలవిల్లాడుతున్నారు. ప్రతి ఇంటా ఒకరిద్దరు బాధితులు కనిపిస్తారు. గ్రామానికి చెందిన చినబ్బాయి, తణుకు నాని, షేక్‌సల్మాన్, దండి స్వరూప్‌లు డెంగ్యూ లక్షణాలతో ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో సుమారు 1200 మంది ఉన్నారు. గ్రామమంతటా పారిశుద్ధ్యం కొరవడింది. ఎక్కడికక్కడ మురుగునీరు రోడ్లపై కనిపిస్తుంది. దీనికి వర్షాలు తోడవ్వడంతో పరిస్థితి దయనీయంగా ఉంది. గ్రామంలో ప్రస్తుతం వంతాలముసమ్మ, దండిరాజు, దండి ఉపేంద్ర, రోబ్బా గోసమ్మ, వంజుల బాపనమ్మ, సీకూరు శ్రీను, రొబ్బా మహేష్‌లతో పాటు పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. కేజేపురం పీెహ చ్‌సీ వైద్యులు గ్రామానికి వచ్చి సేవలు అందిస్తున్నప్పటికీ వ్యాధులు అదుపులోకి రావడం లేదు. ఇదే విషయాన్ని ఎస్పీహెచ్ఓ శ్రావణ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా, గ్రామంలో జ్వరాల తీవ్రత వాస్తవమే అన్నారు. ఒకటి రెండు డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చాయని, నాలుగు రోజులుగా ఇంటింటికి తిరిగి వైద్యం అందిస్తున్నామన్నారు. సోమవారం నుంచి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. గొందిమెలకలో జ్వరాలు జి.మాడుగుల: మండలంలోని వంజరి పంచాయతీ గొందిమెలకలో రెండు రోజులుగా 10 మంది జ్వరాలతో బాధపడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఊర్మిళ తెలిపారు. గ్రామస్తులు రక్షిత తాగునీటి సదుపాయానికి నోచుకోలేదన్నారు. ఈ కారణంగానే వ్యాధులకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. జ్వరంతో మహిళ మృతి అనంతగిరి : మండలంలోని పెదకోటలో కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ ఆదివారం చనిపోయిందని సీపీఎం నాయకులు డి.గంగారాజు.జంగం పెంటన్నదొర, ఎన్.సింహచలం తెలిపారు. గ్రామానికి చెందిన తావు సన్యాసమ్మ (45) వారం రోజులుగా జ్వరం లక్షణాలతో మంచం పట్టింది. సమీపంలోని పినకోట పీహెచ్‌సీకి వెళితే వైద్యాధికారి అందుబాటులో లేకుండాపోయారని వారు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో దేవరాపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆదివారం చనిపోయిందన్నారు. సన్యాసమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్,ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళుతున్నట్టు వారు తెలిపారు. -
కొరత కథలొద్దు
గజ్వేల్: జిల్లాలో యూరియా పంపిణీకి సంబంధించి వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతూ ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలో బుధవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ గజ్వేల్‌కు చేరుకున్నారు. గజ్వేల్ డెవలప్మెంట్ అథారి టీ ఓఎస్డీ హన్మంతరావుతో కలిసి మండల పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏడీఏ శ్రావణ్‌కుమార్‌ను అడిగి యూరియా పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. ‘ఎమ్మార్పీ’ నిబంధనతో ‘నో స్టాకు’ ఎమ్మార్పీ కంటే ఒక్క పైసాకు ఎక్కువగా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం..అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో కొందరు డీలర్లు యూరియా నిల్వలను తెప్పించడంలో విముఖత చూపుతున్నట్లు సమీక్ష సందర్భంగా ఏడీఏ శ్రావణ్‌కుమార్ ఇన్చార్జి కలెక్టర్ శరత్‌కు తెలిపారు. ప్రస్తుతం ఓ మోస్తరు వర్షం కురిసినా రైతులంతా సాగుకు సిద్ధమవుతారని, ఈ సమయంలో యూరియా పంపిణీ కష్టసాధ్యమవుతుందని కూడా ఏఓ శ్రావణ్‌కుమార్ వివరించారు. ఐకేపీ కేంద్రాలను పునరుద్ధరించండి వ్యాపారులు కావాలనే యూరియా కొరత సృష్టిస్తున్నట్లు తెలుసుకున్న ఇన్చార్జి కలెక్టర్ శరత్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతికారు. ఈ క్రమంలోనే ఐకేపీ కేంద్రాల ద్వారా యూరియాను పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, వర్గల్, జగదేవ్‌పూర్, ములుగు,కొండపాక మండలాల్లో ఎరువుల పంపిణీపై ఆసక్తి, సమర్థత ఉన్న గ్రామైక్య సంఘాలను సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసుకొని వారంరోజుల్లో ఎంపిక చేయాలని ఏడీఏ శ్రావణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఎంపిక చేసి సంఘాలకు వెంటనే లెసైన్స్‌లు ఇచ్చి ఎరువుల కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా సహకార సంఘాల ద్వారా కూడా ఎరువులను సమర్థవంతంగా పంపిణీ చేయాలన్నారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్యలోపం, అతిసార వ్యాప్తి, బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, ఇంటి నిర్మాణ పథకం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ తదితర అంశాలపై కూడా ఇన్చార్జి కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎరువులు, విత్తనాల అమ్మకాలపై నిఘా
గజ్వేల్ : పట్టణంలో ఎరువులు, విత్తనాల అమ్మకాలపై అధికారులు నిఘా కొనసాగుతోంది. ఈనెల 13న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ పట్టణంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి బ్లాక్‌మార్కెట్ జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం స్థానిక ఏడీఏ శ్రావణ్ కుమార్ పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ట్రేడర్స్, శ్రీనివాస ట్రేడర్స్‌లలో ఎరువులను బల్క్‌గా విక్రయాలు జరుపుతున్నారని, స్టాక్ రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించడం లేదని, బిల్ బుక్కుల్లో రైతుల సంతకాలు తీసుకోవడం లేదని గుర్తించి ఆ రెండు దుకాణాల్లో క్రయ విక్రయాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల అమ్మకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. తనిఖీల్లో తప్పిదాలు బయటపడితే క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి వెనకాడబోమన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ తనిఖీల్లో ఏడీఏ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సురేష్ ఉన్నారు.